Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • ,

    ఐపీఎల్‌-2024లో దాదాపుగా ముంబై ఇండియ‌న్స్ క‌థ ముగిసింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా వాంఖ‌డే వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 24 ప‌రుగుల తేడాతో ముంబై ఓట‌మి పాలైంది. దీంతో త‌మ ప్లే ఆఫ్ అవ‌కాశాల‌ను ముంబై మ‌రింత సంక్లిష్టం చేసుకుంది. 

    170 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్‌.. 18.5 ఓవ‌ర్లలో 145 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ముంబై బ్యాట‌ర్ల‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌(56) ఒక్క‌డే ప‌ర్వాలేద‌న్పించాడు.  మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. 

    కేకేఆర్ బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ 4 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సునీల్ న‌రైన్‌, ర‌స్సెల్‌, చ‌క్ర‌వ‌ర్తి త‌లా రెండు వికెట్లు సాధించారు. అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్‌..  169 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్ కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతుల్లో అయ్య‌ర్‌ 70 ప‌రుగులు చేశాడు. 

    అయ్య‌ర్‌తో పాటు ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చిన మ‌నీష్ పాండే కూడా త‌న వంతు పాత్ర పోషించాడు. 31 బంతులు ఎదుర్కొన్న పాండే 2 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 42 ప‌రుగులు చేశాడు. ఇక ముంబై బౌల‌ర్ల‌లోతుషారా, బుమ్రా త‌లా 3 వికెట్లతో చెల‌రేగ‌గా.. హార్దిక్ పాండ్యా రెండు, చావ్లా ఒక్క వికెట్ సాధించారు.

     ఇక ఈ ఏడాది సీజ‌న్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన కేవ‌లం 3 మ్యాచ్‌ల్లోనే విజ‌యం సాధించిన ముంబై.. పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదో స్ధానంలో నిలిచింది.

  • ,

    టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024కు 15 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును యూఎస్ఏ క్రికెట్ బోర్డు శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టుకు మోనాంక్ పటేల్ నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఈ జ‌ట్టులో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ కోరీ అండర్సన్‌కు చోటు ద‌క్కింది. 

    2014, 2016 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో కివీస్‌కు ప్రాతినిథ్యం వ‌హించిన అండ‌ర్స‌న్.. గ‌తేడాది న్యూజిలాండ్ క్రికెట్ నుంచి ఎన్‌వోసీ తీసుకుని అమెరికాకు మ‌కాం మార్చాడు. ఇప్పుడు అత‌డికి ఏకంగా సెల‌క్ట‌ర్లు వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టులో ఛాన్స్ ఇచ్చారు. 

    అదేవిధంగా ఈ జ‌ట్టులో భార‌త సంత‌తికి చెందిన ఐదుగురు ఆట‌గాళ్ల‌కు చోటు ద‌క్కింది. కెప్టెన్ మోనాంక్ పటేల్, సౌరభ్ నేత్రవల్కర్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, నితీష్ కుమార్ భార‌త మూలాలు క‌లిగి ఉన్నారు.

    ఈ జ‌ట్టులో భార‌త మాజీ అండ‌ర్‌-19 కెప్టెన్ ఉన్ముక్త్ చంద్‌కు చోటు ద‌క్క‌లేదు. ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తం ఆతిథ్యం ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. అమెరికా త‌మ తొలి మ్యాచ్‌లో జూన్ 1న డ‌ల్లాస్ వేదిక‌గా కెన‌డాతో త‌ల‌ప‌డ‌నుంది.

    అమెరికా వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టు..
    మోనాంక్ పటేల్ (కెప్టెన్‌), ఆరోన్ జోన్స్ (వైస్ కెప్టెన్‌), ఆండ్రీస్ గౌస్, కోరీ ఆండర్సన్, అలీ ఖాన్, హర్మీత్ సింగ్, జెస్సీ సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, నితీష్ కుమార్, నోష్టుష్ కెంజిగే, సౌరభ్ నేత్రవల్కర్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, స్టీవెన్ టేలర్, షయాన్ జహంగీర్.
     

  • ,

    టీమిండియా మాజీ క్రికెట‌ర్‌, ముంబై ఇండియ‌న్స్ వెట‌ర‌న్ స్పిన్న‌ర్ పీయూష్ చావ్లా అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఐపీఎల్‌లో అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన రెండో బౌల‌ర్‌గా పీయూష్ చావ్లా రికార్డుల‌కెక్కాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా వాంఖ‌డే వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో మ్యాచ్‌లో రింకూ సింగ్‌ను ఔట్ చేసిన చావ్లా.. ఈ అరుదైన ఘ‌న‌త‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

    ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 189 మ్యాచ్‌లు ఆడిన చావ్లా.. 184 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు విండీస్ దిగ్గజం డ్వెన్ బ్రావో(183) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బ్రావో రికార్డును పీయూష్ బ్రేక్ చేశాడు. ఈ అరుదైన  ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ ఉన్నాడు.  

    చాహ‌ల్ ఇప్ప‌టివ‌ర‌కు 155 మ్యాచ్‌ల్లో 200 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక   ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 169 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్‌(70) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌గా.. మ‌నీష్ పాండే(42) ప‌రుగుల‌తో రాణించాడు.  ఇక ముంబై బౌల‌ర్ల‌లో తుషారా, బుమ్రా త‌లా 3 వికెట్లతో చెల‌రేగ‌గా.. హార్దిక్ పాండ్యా రెండు, చావ్లా ఒక్క వికెట్ సాధించారు.

  • ఐపీఎల్‌-2024లో భాగంగా వాంఖ‌డే వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ నామ‌మాత్ర‌పు స్కోరుకే ప‌రిమిత‌మైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 169 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్ కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు.

    52 బంతుల్లో 70 ప‌రుగులు చేసిన అయ్య‌ర్‌.. కేకేఆర్ ఫైటింగ్ స్కోర్ సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. 60 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డిన కేకేఆర్‌ను అయ్య‌ర్ త‌న ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. అయ్య‌ర్‌తో పాటు ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చిన మ‌నీష్ పాండే కూడా త‌న వంతు పాత్ర పోషించాడు.

    31 బంతులు ఎదుర్కొన్న పాండే 2 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 42 ప‌రుగులు చేశాడు. ఇక ముంబై బౌల‌ర్ల‌లో తుషారా, బుమ్రా త‌లా 3 వికెట్లతో చెల‌రేగ‌గా.. హార్దిక్ పాండ్యా రెండు, చావ్లా ఒక్క వికెట్ సాధించారు.
     

  • ,

    టీ20 వరల్డ్‌కప్‌-2024 కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు రోవ్‌మన్ పావెల్ సారథ్యం వహించనున్నాడు. అదేవిధంగా ఈ వరల్డ్‌కప్‌ జట్టులో పవర్‌ హిట్టర్‌ షిమ్రాన్ హెట్‌మైర్‌కు చోటు దక్కింది. 

    హెట్‌మైర్‌ చివరగా గతేడాది డిసెంబర్‌లో విండీస్‌ తరపున ఆడాడు. అదేవిధంగా విండీస్‌ యవ పేస్‌ సంచలనం షమర్ జోసెఫ్‌కు కూడా ఈ మెగా టోర్నీ జట్టులో సెలక్టర్లు ఛాన్స్‌ ఇచ్చారు. అదే విధంగా ఈ జట్టులో నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్,షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రోమారియో షెఫర్డ్ వంటి విధ్వంస ఆటగాళ్లు ఉన్నారు. 

    పేపర్‌పై బలంగా కన్పిస్తున్న కరేబియన్లు తమ సొంత గడ్డపై ఎలా రాణిస్తారో వేచి చూడాలి. ఇక ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే భారత్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ వంటి క్రికెట్‌ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. జూన్‌ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా ఈవెంట్‌ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డల్లాస్‌ వేదికగా అమెరికా, కెనడా జట్లు తలపడనున్నాయి.

    టీ20 వరల్డ్‌కప్‌కు విండీస్‌ జట్టు
    రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్‌), అల్జారీ జోసెఫ్ (వైస్‌ కెప్టెన్‌), జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రోమారియో షెఫర్డ్.
     

  • ,

    టీ20 వరల్డ్‌కప్‌-2024కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టులో కేఎల్‌ రాహుల్‌, శుబ్‌మన్‌ గిల్‌, రింకూ సింగ్‌లు వంటి స్టార్‌ ఆటగాళ్లకి భారత సెలక్షన్‌ కమిటీ చోటుఇవ్వలేదు. 

    ముఖ్యంగా టీ20ల్లో టీమిండియా నయా ఫినిషర్‌గా మారిన రింకూ సింగ్‌ను సెలక్టర్లు ఎంపిక చేయకపోవడం అందరిని షాక్‌కు గురిచేసింది. మరోవైపు జస్ప్రీత్‌ బుమ్రా, సిరాజ్‌లతో బంతిని పంచుకునే మూడో పేసర్‌గా అర్ష్‌దీప్‌ సింగ్‌ను సెలక్టర్లు అనూహ్యంగా ఎంపిక చేశారు. 

    ఐపీఎల్‌-2024లో నామమాత్రపు ప్రదర్శన చేస్తున్న అర్ష్‌దీప్‌ను ఎంపిక చేయడం పట్ల భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆసీస్‌ క్రికెట్‌ దిగ్గజం  షేన్ వాట్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత వరల్డ్‌కప్‌ జట్టులో మూడో పేసర్‌గా ఎస్‌ఆర్‌హెచ్‌ ఫాస్ట్‌ బౌలర్‌  టి నటరాజన్ చోటుదక్కుతుందని తను భావించినట్లు వాట్సన్‌ తెలిపాడు. 

    "నటరాజన్‌కు భారత టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. నటరాజన్‌ యార్కర్లను అద్బుతంగా బౌలింగ్‌ చేయగలడు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో అతడు నిలికడగా రాణిస్తున్నాడు. అతడి బౌలింగ్‌లో వేరియషన్స్‌ కూడా ఉంటాయి. క్లిష్టపరిస్థితుల్లో తన బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పే సత్తా నట్టూకు ఉందని" ఓ స్పోర్ట్స్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాట్సన్‌ పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన నటరాజన్‌.. 15 వికెట్లు పడగొట్టి పర్పుల్‌ క్యాప్‌ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు.
     

  • ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ కీలక పోరుకు సిద్దమైంది. వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

    ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ తమ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. ముంబై మాత్రం ఒకే ఒక మార్పు చేసింది. ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీ స్ధానంలో నమాన్‌ ధీర్‌ వచ్చాడు. 

    కాగా ముంబై ఇండియన్స్‌కు ఈ మ్యాచ్‌ చాలా కీలకం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో ఉన్న ముంబై.. ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే కచ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందే.

    తుది జట్లు
    ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), నమన్ ధీర్, టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార

    కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్‌ కీపర్‌), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి
     

  • ,

    ఐపీఎల్‌-2024లో డూఆర్‌డై మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్‌ సిద్దమైంది. శుక్రవారం (మే 3) వాంఖడే స్టేడియం వేదికగా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడనుంది. ముంబై ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే కచ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందే. 

    అయితే ఈ మ్యాచ్‌కు ముందు ముంబై స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ మరో 54 పరుగులు సాధిస్తే.. కేకేఆర్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఓపెనర్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌ డేవిడ్‌ వార్నర్‌ను రోహిత్‌ అధిగమిస్తాడు.

     కాగా ఇప్పటివరకు కేకేఆర్‌పై 32 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌.. 1040 పరుగులు చేశాడు. ఈ జాబితాలో వార్నర్‌  అగ్రస్ధానంలో ఉన్నాడు. ఇప్పటివరకు కేకేఆర్‌పై 32 మ్యాచ్‌లు ఆడిన వార్నర్‌.. 1093 పరుగులు చేశాడు. అదే విధంగా హిట్‌మ్యాన్‌ ఈ మ్యాచ్‌లో మరో 39 పరుగులు చేస్తే.. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలుస్తాడు.

    ఈ జాబితాలో రోహిత్‌ ప్రస్తుతం  6526 పరుగులతో నాలుగో స్ధానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు డేవిడ్‌ వార్నర్‌ పేరిట ఉంది. వార్నర్‌ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 6564 పరుగులు చేశాడు. 
     

  • ఐసీసీ మెన్స్‌ టీమ్‌ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలోకి దూసుకువచ్చింది. టీమిండియాను వెనక్కి నెట్టి నంబర్‌ వన్‌ ర్యాంకు సొంతం చేసుకుంది.

    ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23 టైటిల్‌ గెలిచిన కంగారూ జట్టు 124 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా.. రన్నరప్‌ టీమిండియా 120 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

    ఇక ఈ రెండు జట్లతో పాటు ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ టాప్‌-5లో చోటు దక్కించుకున్నాయి. ఇదిలా ఉంటే.. టెస్టుల్లో టీమిండియా అగ్రస్థానం కోల్పోయినా వన్డే, టీ20లలో మాత్రం టాప్‌ ర్యాంకు పదిలంగా ఉంది.

    పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్‌ సేన ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.

    మెన్స్‌ టీమ్‌ టెస్టు ర్యాంకింగ్స్‌ టాప్‌-5
    1. ఆస్ట్రేలియా- 124 రేటింగ్‌ పాయింట్లు
    2. ఇండియా- 120 రేటింగ్‌ పాయింట్లు
    3. ఇంగ్లండ్‌- 105 రేటింగ్‌ పాయింట్లు
    4. సౌతాఫ్రికా- 103 రేటింగ్‌ పాయింట్లు
    5. న్యూజిలాండ్‌- 96 రేటింగ్‌ పాయింట్లు.

    మెన్స్‌ టీమ్‌ వన్డే ర్యాంకింగ్స్‌ టాప్‌-5
    1. ఇండియా -122 రేటింగ్‌ పాయింట్లు
    2. ఆస్ట్రేలియా- 116 రేటింగ్‌ పాయింట్లు
    3. సౌతాఫ్రికా- 112 రేటింగ్‌ పాయింట్లు
    4. పాకిస్తాన్‌- 106 రేటింగ్‌ పాయింట్లు
    5. న్యూజిలాండ్‌- 101 రేటింగ్‌ పాయింట్లు

    మెన్స్‌ టీమ్‌ టీ20 ర్యాంకింగ్స్‌ టాప్‌-5
    1. ఇండియా- 264 రేటింగ్‌ పాయింట్లు
    2. ఆస్ట్రేలియా- 257 రేటింగ్‌ పాయింట్లు
    3. ఇంగ్లండ్‌- 252 రేటింగ్‌ పాయింట్లు
    4. సౌతాఫ్రికా- 250 రేటింగ్‌ పాయింట్లు
    5. న్యూజిలాండ్‌- 250 రేటింగ్‌ పాయింట్లు

    చదవండి: 

  • ,

    టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024కు అమెరికా-వెస్టిండీస్‌ల‌కు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. జూన్ 2 న చెన్నై వేదికగా అమెరికా-కెనడా మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఈ క్ర‌మంలో ఈ మెగా టోర్నీకోసం 20 మందితో కూడిన అంపైర్స్ జాబితాను అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌(ఐసీసీ) విడుదల చేసింది.

    ఈ జాబితాలో ఐసీసీ ఎమిరేట్స్ ఎలైట్ ప్యానెల్‌లో సభ్యత్వం పొందిన అంపైర్‌లు 16 మంది, ఎమర్జింగ్ ప్యానెల్‌లోని నలుగురు అంపైర్‌లు ఉన్నారు.  ఈ లిస్టులో భారత్‌ నుంచి నితిన్‌ మీనన్‌, జయరామన్ మదనగోపాల్‌కు చోటు ద‌క్కింది. 

    కాగా మదనగోపాల్‌కు ఐసీసీ ఈవెంట్‌లో అంపైరింగ్ చేసే అవ‌కాశం రావ‌డం ఇదే మొద‌టిసారి. అత‌డితో పాటు సామ్ నోగాజ్‌స్కీ, అల్లావుడియన్ పాలేకర్, రషీద్ రియాజ్,  ఆసిఫ్ యాకూబ్‌లు సైతం తొలిసారి ఐసీసీ ఈవెంట్‌లో అంపైర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు. 

    అదే విధంగా 2022 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో అంపైర్‌లుగా వ్యవహరించిన కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, పాల్ రీఫిల్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. 

    మ‌రోవైపు ఈ ప్రధాన టోర్నీ కోసం మ్యాచ్‌ రిఫరీల జాబితాను కూడా ఐసీసీ ప్రకటించింది. డేవిడ్ బూన్, జెఫ్ క్రోవ్,  రంజన్ మడుగల్లె, ఆండీ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్‌సన్, జవగల్ శ్రీనాథ్‌లను మ్యాచ్‌ రిఫరీలగా ఐసీసీ నియమించింది. 

    వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు అంపైర్‌లు వీరే..

    క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, మైఖేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్‌స్టాక్,  రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్,  అల్లాహుడియన్ పాలేకర్,  రిచర్డ్ కెటిల్‌బరో,  జయరామన్ మదనగోపాల్,  నితిన్ మీనన్, సామ్ నోగాజ్‌స్కీ, అహ్సన్ రజా, రషీద్ రియాజ్, పాల్ రూసికా రీఫెల్, లాంగ్టన్ రుసెరే,  రోడ్నీ టక్కర్, అలెక్స్ వార్ఫ్, జోయెల్ విల్సన్, ఆసిఫ్ యాకూబ్.

    మ్యాచ్ రిఫరీలు: డేవిడ్ బూన్, జెఫ్ క్రోవ్, రంజన్ మడుగల్లె, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్‌సన్‌, జ‌వగల్ శ్రీనాథ్.
     

  • టీ20 ప్రపంచకప్‌-2024 నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్‌ పాండ్యా నైపుణ్యాలపై సందేహాలు అక్కర్లేదని.. కెప్టెన్‌గానూ జట్టును ముందుకు నడిపించగల సత్తా అతడికి ఉందని పేర్కొన్నాడు.

    ఒకవేళ రోహిత్‌ శర్మ ఏదేని కారణాల చేత ఐసీసీ టోర్నీ మ్యాచ్‌లకు దూరమైతే.. సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని పాండ్యాకు సూచించాడు. ఐపీఎల్‌ వైఫల్యాలు మరిచి వరల్డ్‌కప్‌నకు రెడీగా ఉండాలని ఓజా చెప్పుకొచ్చాడు.

    కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా గాయపడ్డ పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా.. అప్పటి నుంచి భారత జట్టుకు దూరమయ్యాడు. చీలమండ గాయం నుంచి కోలుకుని ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా ఐపీఎల్‌-2024 బరిలో దిగాడు.

    అయితే, ఆశించిన స్థాయిలో రాణించకపోలేతున్న పాండ్యా కెప్టెన్‌గా, ఆటగాడిగా విఫలమవుతున్నాడు. అతడి సారథ్యంలో ముంబై ఇప్పటి వరకు పది మ్యాచ్‌లు ఆడి కేవలం మూడే గెలిచిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

    ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌ జట్టులో అతడికి స్థానమే ఇవ్వకూడదనే డిమాండ్లు వినిపించాయి. అయితే, బీసీసీఐ మాత్రం మెగా ఈవెంట్లో ఏకంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు డిప్యూటీగా హార్దిక్‌ పాండ్యాను ఎంపిక చేసింది.

    ఈ క్రమంలో భారత మాజీ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా హార్దిక్‌ పాండ్యాను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘అతడు నిజమైన నాయకుడిగా బరిలోకి దిగాలని నేను కోరుకుంటున్నా. ఒకవేళ రోహిత్‌కు ఏమైనా జరిగితే.. అలా జరగాలని మనం కోరుకోము.

    కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అతడు జట్టు దూరమైతే హార్దిక్‌ పాండ్యానే జట్టును ముందుకు నడిపించాలి కదా. కాబట్టి హార్దిక్‌ అందుకు అన్ని వేళలా సన్నద్ధంగా ఉండాలి.

    బ్యాటర్‌గానూ మరింత బాధ్యతాయుతంగా ఆడాలి. నిజానికి అతడు ఉంటేనే జట్టు సమతూకంగా ఉంటుంది. టీమిండియా సెలక్షన్‌ గురించి ఎవరు మాట్లాడినా తొలుత హార్దిక్‌ పేరే గుర్తుకువస్తుంది.

    అవసరమైన వేళ అదనపు బ్యాటర్‌గా.. బౌలర్‌గా తను సేవలు అందించగలడు. ఐపీఎల్‌లో ఏం జరుగుతుందన్న విషయం గురించి పక్కనపెట్టి వరల్డ్‌కప్‌ పైన శ్రద్ధ పెట్టాలి. అవసరమైతే కెప్టెన్‌గానూ జట్టును ముందుకు నడిపించడానికి హార్దిక్‌ పాండ్యా సన్నద్ధంగా ఉండాలి’’ అని సూచించాడు.

    కాగా అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్‌ టోర్నీ జూన్‌ 1న మొదలుకానుంది. టీమిండియా జూన్‌ ఐదున తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడుతుంది. 

  • టీమిండియా తరఫున రెండు ప్రపంచకప్‌లు గెలిచిన జట్లలో భాగమైన గౌతం గంభీర్‌.. ఐపీఎల్‌లోనూ తనదైన ముద్ర వేశాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు చాలా కాలం పాటు ప్రాతినిథ్యం వహించిన ఈ మాజీ ఓపెనర్‌ ఎన్నో రికార్డులు సాధించాడు.

    అంతేకాదు కెప్టెన్‌గా కేకేఆర్‌ను రెండుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. 2012, 2014 సీజన్లలో ట్రోఫీ గెలిచి సత్తా చాటాడు గంభీర్‌. ఆ తర్వాత ఢిల్లీ ఫ్రాంఛైజీకి మారినా కెరీర్‌ సాఫీగా సాగకపోవడంతో ఆటకు వీడ్కోలు పలికాడు గౌతీ.

    ఈ క్రమంలో గతేడాది లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌గా వ్యవహరించిన ఈ బీజేపీ ఎంపీ.. తాజా ఎడిషన్‌లో మళ్లీ కేకేఆర్‌ గూటికి చేరాడు. శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని జట్టుకు మెంటార్‌గా ఉన్నాడు.

    ఈ నేపథ్యంలో స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడిన గౌతం గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో తనకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన ఆటగాడి పేరు ఈ సందర్భంగా వెల్లడించాడు.

    ‘‘క్రిస్‌ గేల్‌, ఏబీ డివిలియర్స్‌ కాదు... ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఉన్నపుడు నన్ను భయపెట్టిన ఒకే ఒక్క బ్యాటర్‌ రోహిత్‌ శర్మ. అతడు బరిలో ఉన్నాడంటే ప్లాన్‌ ఏ, ప్లాన్‌ బీ, ప్లాన్‌ సీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి.

    ఎందుకంటే రోహిత్‌ శర్మను ఆపడం ఎవరితరం కాదు. అందుకే అతడి కోసం తప్ప మరే ఇతర బ్యాటర్‌ కోసం కూడా నేను ఇన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోలేదు. ఒక్కోసారి రాత్రుళ్లు నిద్రపోకుండా మరీ వ్యూహాలు రచించిన సందర్భాలు ఉన్నాయి’’ అని గంభీర్‌ చెప్పుకొచ్చాడు.

    కాగా ఐపీఎల్‌-2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో కేకేఆర్‌ శుక్రవారం తలపడనున్న తరుణంలో ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ప్రస్తుత సీజన్‌లో కేకేఆర్‌ ఆడిన తొమ్మిదింట గెలిచి రెండో స్థానంలో ఉండగా.. ముంబై పదింట కేవలం మూడు గెలిచి తొమ్మిదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది.

Politics

  • కాంగ్రెస్‌ కీలక నేత రాహుల్‌ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీకి సిద్ధం అయ్యారు. శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ రాయ్‌బరేలీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాహుల్‌ గాంధీ పేరును అధికారికంగా ప్రకటించింది. అమేథీ నుంచి కిషోరీలాల్‌ శర్మను బరిలో దించింది.

    రాహుల్ గాంధీ రాయ్‌బరేలి ఎంపీ సీటుకు పోటీ చేస్తున్నట్లు నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఈ సమయంలో ఆయన వెంట తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంకగాంధీ వాద్రా, రాబర్ట్ వాద్రా ఉన్నారు. రాయ్‌బరేలి జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు.

    నామినేషన్ వేయడానికి ముందు రాహుల్‌గాంధీ ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ, రాబర్ట్‌ వాద్రా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపటి(శనివారం) ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘరామ్‌ శుక్రవారం విడుదల చేశారు.

    సీఎం జగన్‌ 4వ తేదీన ఎన్నికల ప్రచారాన్ని మూడు నియోజకవర్గాల్లో నిర్వహిస్తారు. శనివారం ఉదయం 10 గంటలకు  హిందూపురం పార్లమెంట్ పరిధి హిందూపురం పట్టణంలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు పార్లమెంట్ పరిధి పలమనేరు నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్ సెంటర్‌లో  జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధి నెల్లూరు సిటీ గాంధీ విగ్రహం సెంటర్‌లో  జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.
     

  • ముంబై: ఇప్పటికే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే ఇంకా ఓటింగ్ జరగాల్సిన ప్రాంతాల్లో పార్టీలలో చేరేవారు చేరుతూనే ఉన్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ మాజీ నాయకుడు సంజయ్ నిరుపమ్ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు.

    బీహార్‌కు చెందిన నిరుపమ్ 1990లలో జర్నలిజం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తరువాత 'దోఫర్ కా సామ్నా'కి సంపాదకుడు అయ్యారు. నిరుపమ్ పనికి ముగ్దుడైన శివసేన చీఫ్ బాల్ థాకరే 1996లో రాజ్యసభకు నియమించారు. ఆ తరువాత 2005లో తలెత్తిన కొన్ని వివాదాల కారణంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి 2005లో సేనను వీడి కాంగ్రెస్‌లో చేరారు.

    మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నిరుపమ్‌ను కాంగ్రెస్ నియమించింది. 2009 ఎన్నికలలో ముంబయి నార్త్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ సీనియర్‌ నేత రామ్‌నాయక్‌పై స్వల్ప తేడాతో విజయం సాధించారు. 

    2014లో ఇదే నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గోపాల్ శెట్టి చేతిలో ఓడిపోయారు. 2017లో ముంబయి సివిక్ బాడీకి జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైన తర్వాత నిరుపమ్ ముంబై కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. శివసేనను వీడిన చాలా సంవత్సరాల తరువాత నిరుపమ్ మళ్ళీ సొంతగూటికి చేరారు.

  • సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై కోడ్‌ ఉల్లంఘన కేసు నమోదైంది. ఈసీ ఆదేశాలతో మొఘల్‌పురా పీఎస్‌లో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదుతో ఈసీ చర్యలు తీసుకుంది. 

    విచారణ చేసి చర్యలతో పాటు రిపోర్టు ఇవ్వాలని హైదరాబాద్ సీపీకి ఈసీ ఆదేశించింది. ఏ3గా అమిత్‌షా పేరును హైదరాబాద్‌ పోలీసులు చేర్చారు. అమిత్ షా రోడ్ షోలో చిన్న పిల్లలను ప్రచారంలో ఉంచడంపై కాంగ్రెస్ ఫిర్యాదు చేయగా, సీఈవో వికాస్ రాజ్ స్పందించారు.

     


     

  • సినిమా ఎప్పుడైతే చప్పగా ఉన్నట్లు అనిపిస్తుందో... సరిగ్గా అప్పుడే రెండు కామెడీ జోక్స్...లేదా మంచి మసాలా ఐటం సాంగ్ వేస్తారు... దీంతో మళ్ళీ థియేటర్లో ప్రేక్షకులు ఎటెన్షన్లోకి వచ్చి...సినిమాలో లీనమవుతారు... అచ్చం చంద్రబాబు కూడా ఇదే విధానము ఫాలో అవుతున్నారు.

    టీడీపీ గ్రాఫ్... చంద్రబాబు ప్రతిష్ట ఎప్పుడైతే డౌన్ అవుతోందని గ్రహిస్తారో.... అప్పుడు  తన మీడియాను... పచ్చ జనాన్ని... అలవోకగా బొంకగలిగేవాళ్లను జనంలోకి దించుతారు... వీళ్ళే మౌత్ టాక్ మల్లిగాళ్ళు  వీళ్ళు జనం ఎక్కువగా ఉండే హోటళ్లు... టీ స్టాళ్లు..బస్సులు...రైల్వే కౌంటర్ల వద్ద అకస్మాత్తుగా ప్రత్యక్షమై ఉన్నఫళంగా ప్రభుత్వాన్ని తిడుతూ అరుస్తూ కేకలు వేస్తారు.. అక్కడ ఉన్నవాళ్ళంతా ఆటే చూసేలా చేస్తారు.

    ఐదారు నిముషాలు స్క్రిప్ట్ ప్రకారం తమిళ యాక్టర్లు మనోరమ.. శివాజీ గణేష్‌లను  మించిపోయేలా యాక్టింగ్ చేసేసి   వెళ్ళిపోతారు... చూసేవాళ్ళు మాత్రం...వామ్మో ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉందా అని జనం అనుకోవాలనేది వాళ్ళ ప్లాన్. దీనికోసం టీడీపీ ఎన్నారై విభాగం సైతం గ్రామాల్లోకి దిగింది.

    తమ చుట్టుపక్కల ఉన్నవాళ్లను ప్రభావితం చేసి తెలుగుదేశానికి ఓటేయించడం వారి విధి.. దీనికోసం కోట్లలో నిధులు సైతం సమీకరించి దేశవిదేశాల్లోని ఎన్నారై యువత సెలవులు పెట్టుకుని మరీ పల్లెల్లో, పట్టణాల్లోని కాలనీల్లో పాగా వేసింది..

    వాస్తవానికి టీడీపీ మ్యానిఫెస్టో జనంలోకి వెళ్ళకపోవడం, ప్రజలు పెద్దగా నమ్మకపోవడం.. సీఎం వైయస్ జగన్ అందిస్తున్న పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలు అర్థం చేసుకుని రాష్ట్రం మరింతగా ప్రగతి సాధించాలంటే మళ్ళీ జగన్ రావాలి..పోర్టులు... మెడికల్ కాలేజీలు... స్కూళ్ళు.. ఇంగ్లిష్ మీడియం చదువులు... ఇప్పుడిప్పుడే ఊపందుకున్న పరిశ్రమలు... ఇవన్నీ పూర్తి కావాలన్నా... ఉద్యోగావకాశాలు పెరగాలన్నా మళ్ళీ జగన్ గెలవాలి...అలాగైతే ఇప్పుడు పురోగతిలో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి అని జనం అనుకుంటున్నారు...

    దీంతోబాటు   గ్రామస్థాయిలో ప్రజల అభిప్రాయం మాత్రం వేరేలా ఉంది. ఇల్లు కదలకుండా తమ గుమ్మం వద్దకే వస్తున్నా సంక్షేమ పథకాలు... ఊరు దాటకుండానే సచివాలయంలో అందుతున్న ప్రభుత్వ సేవలను అందుకుంటున్న తీరు ప్రజల స్మృతిపథంలో కదులుతూనే ఉన్నాయి. . దీనికితోడు మహిళలు... వికలాంగులు... రైతులు ఈ ఐదేళ్లలో సీఎం వైఎస్‌ జగన్‌ తమకు ఎంత మేలు  ఎంత మేలు  చేశారన్నది లెక్కలు వేసుకుని మరీ ప్రజలు ఓటు చేతబట్టుకుని ఎన్నికల తేదీ కోసం సిద్ధంగా ఉన్నారు.

    మళ్ళీ తమ సోదరుడిని గెలిపించుకోవాలని వాళ్లంతా ఎదురుచూస్తున్నారు... ప్రజల్లో అలా అభిప్రాయం ఉన్నపుడు ఈ మౌత్ టాక్ మల్లిగాళ్ళు ప్రజల మనోభిప్రాయాలను మార్చలేరని అంటున్నారు. ఎన్నిసారు అరిచినా ఇత్తడిని పుత్తడి చేయలేరని.. చంద్రబాబును మళ్ళీ గెలిపించలేరని అంటున్నారు. గట్టిగా అరిచినంతమాత్రాన అబద్ధాలు నిజాలు కాలేవని... గ్రామసింహం సింహం కాలేదని ప్రజలు అంటున్నారు.
    -- సిమ్మాదిరప్పన్న
     

  • భువనేశ్వర్‌: ఎన్నికల వేళ ఒడిషాలో ఎన్నికల కమిషన్‌(ఈసీ)కొరడా ఝుళిపించింది. ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా ఉన్న సుజాత ఆర్‌.కార్తికేయన్‌ను ఈసీ బదిలీ చేసింది. ప్రభుత్వ బాధ్యతలను దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ చేసిన ఫిర్యాదుతో గంట్లోపే ఈసీ చర్య తీసుకుంది. 

    ఎన్నికల వ్యవహారాలకు సంబంధం లేని విభాగానికి సుజాతను బదిలీ చేసింది. ఒడిశా సీఎం, బీజేడీ చీఫ్‌ నవీన్‌ పట్నాయక్‌ సన్నిహితుడికి వీకే పాండియన్‌ సతీమణి సుజాత. దీంతో సుజాత బదిలీ రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. సుజాత మిషన్‌ శక్తి విభాగంలో సెక్రటరీగా నిధులు నిర్వర్తించారు.

    ఈమె భర్త వీకేపాండియన్‌  ఐఏఎస్‌ అధికారిగా గత ఏడాది వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. పాండియన్‌ ప్రభుత్వంలో పనిచేసినపుడు సీఎం నవీన్‌ పట్నాయక్‌కు నమ్మకమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. తెరవెనుక పాలనను మొత్తం నడిపేవారని పాండియన్‌కు పేరుంది. పదవీవిరమణ తర్వాత బీజేడీలో చేరారు. ప్రతిపక్షాలు పాండియన్‌ను సూపర్‌సీఎంగా పిలుస్తాయి. 

  • సాక్షి, విజయవాడ: పేదల పథకాలపై చంద్రబాబు కూటమి మరో కుట్రకు తెరలేపింది. పేదలకు పథకాలు అందకుండా పరోక్ష ఫిర్యాదులు చేస్తోంది. ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, వైఎస్సార్‌ చేయూత, ఈబీసీ నేస్తం చెల్లింపులను కూటమి అడ్డుకుంటోంది.  డీబీటీ చివరి దశ చెల్లింపులకు మోకాలడ్డుతోంది.

    డీబీటీ చివరి దశ చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధంగా ఉండగా, ఈసీ అనుమతి కోసం ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనుమతి కోసం ఇప్పటికే ఈసీకి ప్రభుత్వం లేఖ రాసింది. అనుమతి ఇవ్వకుండా ఈసీపై కూటమి నేతలు ఒత్తిడి చేస్తున్నారు.

    పెన్షన్లు అడ్డుకున్న తరహాలోనే పథకాల అమలును టీడీపీ కూటమి అడ్డుకుంటోంది. బీజేపీతో టీడీపీ పొత్తు తర్వాత పరిస్థితులు మారాయి. లబ్ధిదారులు, మహిళలు, విద్యార్థులు, రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. అమల్లో ఉన్న పథకాలకు కోడ్‌ అడ్డంకి కాదని ఎన్నికల నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. లబ్ధిదారుల ఇబ్బందులను ప్రభుత్వం ఈసీ దృష్టికి ప్రభుత్వం తీసుకెళ్లింది. వెంటనే అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది.

  • సాక్షి, జగిత్యాల జిల్లా: మోదీ వాట్సాప్ వర్సిటీలో అన్నీ అబద్ధాలే ప్రచారం చేస్తారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. పదేళ్లు పీఎంగా ఉన్న మోదీ తెలంగాణకు ఏం చేశారంటూ ప్రశ్నించారు. ధర్మపురి జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణా విభజన హామీలు ఒక్కటీ అమలు చేయలేదు.. కానీ గుజరాత్ అభివృద్ధి  మాత్రం ఎక్కడా ఆగలేదన్నారు.

    బీజేపీ నాలుగు వందల సీట్లు అడుగుతోంది రిజర్వేషన్ల రద్దు కోసమే.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తీసేయాలన్న ఆలోచనలో బీజేపీ ఉంది. 50 శాతం రాష్ట్రాల మద్దతు కూడా కావాలి కాబట్టే రాష్ట్రాల్లో ప్రభుత్వాలని కూల్చి బీజేపీ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేస్తోంది.. రాజకీయ అవకాశాలు ఎస్సీ, ఎస్టీలకి మరింత ఇవ్వాలని కాంగ్రెస్ యోచిస్తోంది.. అందుకే కులగణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దుకు మద్దతు తెలిపినట్టే’’ అని సీఎం రేవంత్‌ చెప్పారు.
     

  • ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ప్రజాస్వామ్యంపై నిరంతరం దాడి చేస్తున్నారని, దేశ రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ శుక్రవారం ఆరోపించారు.

    రాహుల్‌ గాంధీ రాయ్‌బరేలి లోక్‌సభ స్థానానికి నామినేషన్ పత్రాల దాఖలు కోసం చివరి క్షణంలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించేందుకు ఒడిశాలోని రాయగడ జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నారు. పర్యటనను రద్దు చేసుకున్నందుకు ఒడిశా ప్రజలకు రాహుల్‌ క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై నిరంతర దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.  

    కాంగ్రెస్, ఇండియా కూటములు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే మోదీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దానిని నాశనం చేయాలని చూస్తున్నాయి అని మండిపడ్డారు. 

  • సాక్షి, కృష్ణా జిల్లా: జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీని అభిమానులు చిత్తుచిత్తుగా ఓడించాలంటూ మాజీ మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు. గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  పెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలు అంటే తనకు, సీఎం జగన్‌కు అమితమైన ప్రేమ. అందుకే విజయవాడకు ఎన్టీఆర్‌ జిల్లా అని పేరు పెట్టామని తెలిపారు.

    ‘‘పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్‌కు నమ్మక ద్రోహం చేసి.. పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. ‘‘అన్న ఎన్టీఆర్ వారసులు.. అభిమానులెవరు టీడీపీలో ఉండరు.. చంద్రబాబు వెంట నడవరు. పది మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జండా పట్టుకొని టీడీపీ కార్యక్రమాలకు వెళితే... ఆ పార్టీ కార్యకర్తలు తన్ని తరిమేసే పరిస్థితి అనేక చోట్ల చూశాం. మన కుటుంబ సభ్యుడైన ఎన్టీఆర్ అభిమానులపై దాడులు చేయవద్దని చంద్రబాబుగాని.. లోకేష్ గాని తమ కార్యకర్తలకు ఎప్పుడు చెప్పలేదు. అభిమానులందరూ కష్టపడి టీడీపీని గెలిపిస్తే.. జూనియర్‌ ఎన్టీఆర్‌ను తుంగలో తొక్కుతారు.. లోకేష్‌ను అందలం ఎక్కిస్తారు’’ అని కొడాలి పేర్కొన్నారు.

    ‘‘పెద్ద ఎన్టీఆర్‌ను దొంగలాంటి చంద్రబాబు మోసం చేస్తే.. జూనియర్ ఎన్టీఆర్‌ను ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో తిట్టిస్తున్నారు. నేను తిరిగే కారుకు ఎన్టీఆర్.. వైఎస్సార్ రెండు ఫోటోలు పెట్టుకుని దమ్ముగా ధైర్యంగా తిరుగుతాను. ఎన్టీఆర్.. వైఎస్సార్ నాకు రెండు కళ్లు. తెలుగుదేశం పార్టీ గౌడ.. యాదవ.. మత్స్యకార.. ఇతర బీసీ సామాజిక వర్గాలను విస్మరించింది. కనీసం వారికి సీట్లు కూడా కేటాయించని పరిస్థితి.  సీఎం జగన్ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి.. అనేక రాజ్యాంగ పదవులు ఇవ్వడమే కాక.. రాజ్యసభ స్థానాలు ఇస్తూ.. ఎమ్మెల్యే ఎంపీ సీట్లను సగం వారికే కేటాయించింది’’ అని కొడాలి నాని చెప్పారు.

    ‘‘ప్రజలను నమ్ముకొని ధైర్యంగా ముందుకు వెళుతున్న సీఎం జగన్‌కు.. నాకు అభిమానులు మద్దతుగా నిలవాలి. జూ.ఎన్టీఆర్‌ను ఒక విఐపిగా గౌరవిస్తాం’’ అని కొడాలి పేర్కొన్నారు.

     

  • ఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశ, రెండో దశ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక మే 7న మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు పోలింగ్ 12 రాష్ట్రాల్లోని 94 నియోజకవర్గాలకు జరగనుంది. ఎలక్షన్ కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకారం లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో (ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు) జరగనున్నాయి. జూన్ 4న వెలువడే ఫలితాలు దేశ ప్రధానిని నిర్ణయిస్తాయి.

    మే 7న ఓటింగ్ జరిగే నియోజకవర్గాలు
    అస్సాం: ధుబ్రి, కోక్రాఝర్, బార్పేట, గౌహతి
    బీహార్: ఝంఝర్‌పూర్, సుపాల్, అరారియా, మాధేపురా, ఖగారియా
    ఛత్తీస్‌గఢ్: సుర్గుజా, రాయ్‌ఘర్, జంజ్‌గిర్-చంపా, కోర్బా, బిలాస్‌పూర్, దుర్గ్, రాయ్‌పూర్
    గోవా: నార్త్ గోవా, సౌత్ గోవా
    గుజరాత్: కచ్ఛ్, బనస్కాంత, పటాన్, మహేసనా, సబర్కాంత, గాంధీనగర్, అహ్మదాబాద్ ఈస్ట్, అహ్మదాబాద్ వెస్ట్, సురేంద్రనగర్, రాజ్‌కోట్, పోర్ బందర్, జామ్‌నగర్, జునాగఢ్, అమ్రేలి, భావ్‌నగర్, ఆనంద్, ఖేడా, పంచమహల్, దాహోద్, వడోదర, ఛోటా ఉదయపూర్, భరూచ్ , బార్డోలీ, సూరత్, నవ్సారి, వల్సాద్
    కర్ణాటక: చిక్కోడి, బెల్గాం, బాగల్‌కోట్, బీజాపూర్, గుల్బర్గా, రాయచూర్, బీదర్, కొప్పల్, బళ్లారి, హవేరి, ధార్వాడ్, నార్త్ కన్నడ, దావణగెరె, షిమోగా
    మధ్యప్రదేశ్: భింద్, భోపాల్, గుణ, గ్వాలియర్, మోరెనా, రాజ్‌గఢ్, సాగర్, విదిషా, బేతుల్
    మహారాష్ట్ర: బారామతి, రాయగడ, ఉస్మానాబాద్, లాతూర్, షోలాపూర్, మాధా, సాంగ్లీ, సతారా, రత్నగిరి-సింధుదుర్గ్, కొల్హాపూర్, హత్కనాంగ్లే
    ఉత్తరప్రదేశ్: సంభాల్, హత్రాస్, ఆగ్రా, ఫతేపూర్ సిక్రి, ఫిరోజాబాద్, మెయిన్‌పురి, ఎటా, బుదౌన్, అయోన్లా, బరేలీ
    పశ్చిమ బెంగాల్: మల్దహా ఉత్తర్, మల్దహా దక్షిణ్, జంగీపూర్, ముర్షిదాబాద్
    దాద్రా నగర్ హవేలీ/డామన్ అండ్ డయ్యు: దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యు
    జమ్మూ కాశ్మీర్: అనంతనాగ్-రాజౌరి

  • గువహటి: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ పాకిస్తాన్‌లో పోటీచేస్తే ఖచ్చితంగా గెలుస్తారని ఎద్దేవా చేశారు.

    ‘పాకిస్తాన్‌లో రాహుల్‌గాంధీ చాలా పాపులర్‌. ఒకవేళ పాకిస్తాన్‌లో ఎన్నికలు జరిగితే అక్కడ రాహుల్‌గాంధీ భారీ మెజారిటీతో గెలుస్తారు. రాహుల్‌ను పాకిస్థాన్‌లో మేం ఓడించలేం. అయితే పాకిస్తాన్‌లో ఏం జరుగుతుందో దానికి వ్యతిరేకంగా భారత్‌లో జరుగుతుంది’అని హిమంత సెటైర్లు వేశారు. 

    రాహుల్‌గాంధీ శుక్రవారం(మే3) తన పాత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి కాకుండా రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి నామినేషన్‌ వేసిన వేళ హిమంత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

  • కోల్‌కతా: రాజ్‌భవన్‌లోని మహిళా ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తించారని గవర్నర్ సీవీ ఆనంద బోస్‌పై కొన్ని ఆరోపణలు వచ్చాయి. దీనిపైన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం 'మమతా బెనర్జీ' మండిపడ్డారు.

    పుర్బా బర్ధమాన్ జిల్లాలో జరిగిన బహిరంగ ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. రాజ్‌భవన్‌లో మహిళ వేధింపుకు గురికావడం సిగ్గు చేటు అని అన్నారు. రాజ్‌భవన్‌లో పనిచేసిన ఓ యువతి బయటకు వచ్చి గవర్నర్ వేధింపులకు వ్యతిరేకంగా మాట్లాడింది. ఆ మహిళ కన్నీళ్లకు నా గుండె పగిలింది. సందేశ్‌ఖలీ గురించి మాట్లాడే ముందు బీజేపీ దీనికి సమాధానం చెప్పాలని అన్నారు.

    ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై ఎందుకు మాట్లాడలేదు? అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. స్కూల్ సర్వీస్ కమిషన్ కేసులో చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడానికి కూడా బీజేపీయే కారణమని టీఎంసీ అధినేత్రి ఆరోపించారు. రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న ఒక మహిళ తనపై వేధింపుల ఆరోపణలు చేసిన తరువాత టీఎంసీ నేతలు మండిపడ్డారు. ఇలాంటి కథనాలకు భయపడబోమని.. సత్యం గెలుస్తుందని గవర్నర్ ఆనంద బోస్ అన్నారు.

  • కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తర్‌ ప్రదేశ్‌ రాయబరేలీ నుంచి పోటీ చేయడంపై బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. దక్షిణాదిలో   ఓటమి భయంతో రాహుల్ గాంధీ వాయనాడ్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.

    బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ మాట్లాడుతూ.. భాగ్ రాహుల్ భాగ్, రాహుల్ భాగ్ ఇదే ట్రెండ్‌ అవుతోంది. రాహుల్‌ గాంధీ మీరు ప్రధాని మోదీని చూసి బయపడొద్దని చమత్కరించారు. రాహుల్‌ గాంధీ చిన్న పిల్లాడు అతడిని ప్రోత్సహించాలి. కానీ ప్రజలు అతనిని తిరస్కరించారని అన్నారు.  

    ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి కూడా పోటీ చేయాలనే రాహుల్‌ నిర్ణయం వయనాడ్ ప్రజలకు రాహుల్‌ గాంధీ ద్రోహం చేశారని బీజేపీ నేత ఆరోపించారు. వాయనాడ్‌ ఓటమి భయంతో అమేథీకి బదులు రాయ్‌బరేలీ (ఎన్నికల్లో పోటీ చేసేందుకు) వచ్చారని దుష్యంత్ కుమార్ గౌతమ్ పేర్కొన్నారు.

    కాగా, గత రెండు దశాబ్దాలుగా తన తల్లి సోనియా గాంధీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ శుక్రవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
     

  • సాక్షి, ప్రకాశం జిల్లా:  ఒక్క నెల ఓపిక పట్టండి.. మీ బిడ్డ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం పెడతా.. వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికే వచ్చి పెన్షన్‌ ఇస్తారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.  శుక్రవారం ఆయన ప్రకాశం జిల్లా కనిగిరి బహిరంగ సభలో మాట్లాడుతూ, ఈ ఎన్నికలు.. ఐదేళ్ల భవిష్యత్‌.. జగన్‌కు ఓటేస్తే.. పథకాలు కొనసాగింపు పొరపాటున బాబుకు ఓటేస్తే.. పథకాలకు ముగింపేనన్నారు.

    ‘‘రూ.వెయ్యి పెన్షన్‌ను రూ.3వేలు చేసింది మీ బిడ్డ జగన్‌. 39 లక్షల మందికి మాత్రమే బాబు పెన్షన్‌ ఇచ్చాడు.. మీ బిడ్డ జగన్‌.. 66 లక్షల మందికి పెన్షన్‌ ఇస్తున్నాడు. లంచాలు, వివక్ష లేకుండా ఇంటి వద్దకే పెన్షన్‌ ఇస్తున్నాం. చంద్రబాబు పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి. నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి పెన్షన్‌ అడ్డుకున్నాడు. బాబు హయాంలో పెన్షన్ల కోసం జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సివచ్చేది. చంద్రబాబు చేసిన పనివల్లే అవ్వాతాతలు ఎండలో బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు.. ఎవరి చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా పెన్షన్లు ఇచ్చాం. అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్‌ పంపించాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

    ‘‘పెన్షన్ల విషయంలో అవ్వాతాతలకు అన్యాయం జరిగింది. ఆ నెపాన్ని కూడా దుర్మార్గ చంద్రబాబు మనపై నెడుతున్నాడు. పెన్షన్ల విషయంలో రాజకీయం జరుగుతోంది. మీ జగన్‌ అధికారంలో ఉంటేనే.. పెంచిన అమ్మ ఒడి. మీ  జగన్‌ అధికారంలో ఉంటేనే.. కాపునేస్తం, ఈబీసీ నేస్తం. మీ జగన్‌ అధికారంలో ఉంటేనే.. ఆసరా, చేయూత, సున్నా వడ్డీ. మీ జగన్‌ అధికారంలో ఉంటేనే.. రైతు భరోసా, సున్నావడ్డీ. చంద్రబాబు చేసేవన్నీ మాయలు, కుట్రలు. అప్పుడే సూపర్‌ సిక్స్‌లో పెన్షన్‌ హామీని ఎత్తేశాడు. చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్ర లేపడమే.. లకలకా లకలకా అంటూ పసుపుపతి రక్తం తాగుతాడు’’ అంటూ సీఎం జగన్‌ దుయ్యబట్టారు.

    సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే

    కనిగిరి సిద్ధమా.. ఎండాకాలమైనా, తీక్షణమైన ఎండలున్నా ఇవేవీ కూడా ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ్య, ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు, ఆత్మీయతలు చూపిస్తూ ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ, తాతకూ, నా ప్రతిసోదరుడికీ, స్నేహితుడికీ.. మీ అందరి ప్రేమానారాగాలకి మీ బిడ్డ చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు.

    ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు
    మరో 10 రోజుల్లో కురుక్షేత్ర  మహాసంగ్రామం జరగనుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఈ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటే వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి. అదే చంద్రబాబుకు పొ    రపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడమే. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతున్నాను. మనం వేసే మన ఓటుతో మన ఇంటింటి అభివృద్ధిని, భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలివి

    నేను ప్రతిఒక్కరినీ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నాను. పొరపాటున చంద్రబాబునాయుడు గారికి ఓటు వేస్తే... సాధ్యం కాని హామీలను ఆయన ఇస్తూ.. ఓ వల మాదిరిగా ప్రజల మీద వేస్తాడు. అదే జరిగితే, మళ్లీ చంద్రముఖిని మనమే నిద్రలేపుతాం అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. మళ్లీ వదల బొమ్మాలీ వదల అంటూ పశుపతి మళ్లీ నిద్రలేచి వస్తాడు. వచ్చి రాబోయే 5 సంవత్సరాలు మీ ప్రతి ఇంటి తలుపు తట్టి రక్తం తాగుతాడని గుర్తుపెట్టుకోవాలి.

    అవ్వా, తాతల మీద బాణం గురిపెట్టిన బాబు
    ఈ రోజు ఎన్నికల కురుక్షేత్రంలో చంద్రబాబు నాయుడు తన బాణాన్ని నేరుగా పేద సామాజిక వర్గాల మీద, నా అవ్వా తాతల మీద, వారి పెన్షన్ల మీద గురిపెట్టాడు. ఆ చంద్రబాబు వారి బృందాన్ని నేరుగా అడుగుతున్నాను... ఇవాళ పెన్షన్ల విషయంలో జరుగుతున్న రాజకీయాలు, పెన్షన్ల విషయంలో చేస్తున్న అన్యాయాన్ని మీరు చూస్తున్నారు. ఇదే చంద్రబాబు బృందాన్ని నేరుగా అడుగుతున్నాను. 
    అయ్యా చంద్రబాబు... 2019 ఎన్నికల వరకూ, ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ నీ హయాంలో అవ్వాతాతలకు నువ్వు ఇచ్చిన పెన్షన్ ఎంత? అని ఈ సభలో నేరుగా అడుగుతున్నాను. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ బాబు హయాంలో ఇచ్చిన పెన్షన్ కేవలం రూ.వెయ్యి రూపాయిలు కాదా? ఆ పెన్షన్ ఇప్పుడు రూ.3వేలు చేసింది చేసింది ఎవరు? ఆ అవ్వాతాతల పెన్షన్ ఇంటికే పంపుతున్నది ఎవరు అని అడుగుతున్నాను?

    చంద్రబాబు హయాంలో పెన్షన్లు కేవలం 39 లక్షలు మాత్రమే
    ఓ అవ్వా, ఓ తాత, ఓ అన్నా.. చంద్రబాబు ఇచ్చిన సామాజిక పెన్షన్లు ఎన్నో తెలుసా?..ఎన్నికలకు ఆరునెలల ముందు వరకూ ఇచ్చింది కేవలం 39 లక్షలు. అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకుంటూ, వారు వివక్షకు లోనవుతూ కేవలం అరకొరగా 39 లక్షల మందికి మాత్రమే ఇస్తే...మీ బిడ్డ హయాంలో, మీ జగన్ హయాంలో ఈ 58 నెలలుగా ఎంత మందికి పెన్షన్లు ఇస్తున్నాడో తెలుసా?..అక్షరాలా 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాడు.

    ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా, ఎవ్వరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఆ పెన్షన్ నేరుగా మీ ఇంటికే వచ్చేట్టుగా అందిస్తున్నాడు. ఈ 57 నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతోంది. రూ. 3వేల పెన్షన్ అవ్వాతాతలకు  మీ బిడ్డే నేరుగా ఇంటికే పంపుతున్నాడు. చంద్రబాబు నాయుడుగారి పాపిష్టి కళ్లు ఆ అవ్వాతాతల మీద పడనంత వరకూ ఇంటికే పెన్షన్ అందేది. ఎప్పుడైతే చంద్రబాబు పాపిష్టి కళ్లు ఆ అవ్వాతాతల మీద పడ్డాయో అప్పటి నుంచీ అవ్వాతాతలకు అప్పటిదాకా ఇంటివద్దకే అందుతున్న పింఛన్, సూర్యోదయానికి ముందే, ఒకటో తారికు వచ్చే సరికే, అవ్వాతాతల ఇంటికే, మనవలూ మనవరాళ్ల రూపంలో వాలంటీర్లు వచ్చి, చిక్కటి చిరునవ్వులతో గుడ్మార్నింగ్ చెబుతూ వారికి మంచి చేసే కాలం... ఈ చంద్రబాబు పాపిష్టి కళ్లు పడేంత వరకూ బాగా కొనసాగింది.

    ఎప్పుడైతే చంద్రబాబు పాపిష్టి కళ్లు పడ్డాయో, అప్పుడు తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత, వాలంటీర్లు ఇంటికి పోకూడదట, వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదట అని కేంద్ర ఎన్నికల కమీషన్కు తానే దగ్గర ఉండి సిఫార్సు చేయించి నా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకూడదు అని... వాళ్లతో ఉత్తర్వులు ఇప్పించాడు.

    ఈ చంద్రబాబు పాపిష్టి చేష్టలు అంతటితో ఆగిపోలేదు. ఇంకా కడుపుమంట చల్లారక ఈ పెద్దమనిషి ఏం చేసాడో తెలుసా..అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా, వాళ్లకు బ్యాంకుల్లో జమ చేయమని చెప్పాడు. ఎన్నికల కమిషన్ అక్కడ నుండి ఆదేశాలు ఇచ్చింది. ఇచ్చిన మేరకు ఇవాళ అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అవ్వాతాతలు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, ఇంతటి ఎండలో క్యూలో నిలబడి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ ఉంటే..ఈ పెద్దమనిషి చంద్రబాబు ...ఆయన దౌర్భాగ్యపు పని చేసి, ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తున్నాడు. చంద్రబాబు, ఆయన దుష్ట చతుష్టయం, ఎల్లోమీడియా వీళ్లందరూ కలిసి ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తున్నారు. ఆ ఈనాడు కథలు చూస్తే, ఆంధ్రజ్యోతి, టీవీ5లలో చూస్తే..వీళ్లంతా మనుషులేనా అనిపించేంత దారుణమైన రాజకీయాలు చేస్తున్నారు.

    చంద్రబాబు చేసేవన్నీ మాయలు, కుట్రలు: సీఎం జగన్‌

    14 ఏళ్లలో అవ్వాతాతల మీద ప్రేమ చూపించని బాబు
    నేను ఇవాళ మీ అందరికి ఒకటే అడుగుతున్నాను....ఒకటే చెబుతున్నాను. చంద్రబాబు పరిపాలన 14 ఏళ్లు మీరు చూసారు. మీ బిడ్డ 58 నెలల పాలన కూడా చూసారు. ఈ 58 నెలల కాలంలో పెన్షన్లు నేరుగా మీ ఇంటికే వస్తున్న పరిస్థితులు చూసారు.  మీ అందరి సమక్షంలో పెద్దమనిషి చంద్రబాబును నిలదీసి అడుగుతున్నాను. 14 ఏళ్లు పరిపాలన చేసాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసానని తానే చెప్పుకుంటాడు. ఈ 14 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజైనా కూడా ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడు అవ్వాతాతల మీద ప్రేమ చూపించడం కానీ, వారి కష్టాలు చూడటం కానీ, వారికి తోడుగా నిలబడాలని కానీ ఇంటికే పెన్షన్ పంపించాడా అని అడుగుతున్నాను.

    ఏ ఒక్కరోజు కూడా ఆ అవ్వాతాతల మీద ప్రేమ చూపించలేదు. అవ్వాతాతలకు పెన్షన్ ఇంటికి పంపించిన పరిస్థితులు లేవు. చేసింది మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 57 నెలలుగా చంద్రబాబు కళ్లు పడేంత వరకూ అవ్వాతాతలకు పెన్షన్ ఇంటికే అందుతూ ఉంది.

    మళ్లీ ప్రమాణం చేసిన వెంటనే అవ్వాతాతల కోసమే సంతకం
    నేను ఇవాళ ప్రతి అవ్వకూ తాతకూ చెబుతున్నాను. అవ్వాతాతా..ఒక్కనెల ఓపికపట్టండి. జూన్ 4వ తారీకు దాకా ఓపికపట్టండి. మీ బిడ్డ మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తాడు. ప్రమాణ స్వీకారం చేసిన మొట్ట మొదటి రోజే నా మొట్ట మొదటి సంతకం మీకోసం పెడతాను అని అవ్వాతాతలకు చెబుతున్నాను. మళ్లీ జూన్ 4వ తారీకునే వాళ్ల మనవలు, మనవరాళ్లుగా  వాలంటీర్లు సూర్యోదయానికి ముందే ఇంటికే వచ్చి అవ్వాతాతలకు చిక్కటి చిరునవ్వుతో పెన్షన్లు ఇచ్చే పరిస్థితులు మీబిడ్డ తెస్తాడు.

    ఇది నామాట..జగన్ మాట.. మీ బిడ్డ మాట
    మీ జగన్ అధికారంలో ఉంటేనే ప్రతి పేద కుటుంబం కూడా మళ్లీ వాళ్ల ఇంటికి పెన్షన్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఆ పెన్షన్లో పెరుగుదల కూడా కనిపిస్తుంది. మళ్లీ మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ పెంచిన ఆ అమ్మ ఒడి నా అక్కచెల్లెమ్మలకు అందుతుంది. మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ నా అక్కచెల్లెమ్మలకు ఒక చేయూత, ఒక సున్నా వడ్డీ, నా అక్కచెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టించుకునే కార్యక్రమం, మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ ఓ కాపునేస్తం, ఈబీసీ నేస్తం వస్తుంది.

    మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ ఓ వాహన మిత్ర, మళ్లీ ఓ నేతన్న నేస్తం, ఓ మత్స్యకార భరోసా, తోడు, చేదోడు, లానేస్తం. మీ జగన్ అధికారంలో ఉంటేనే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, మళ్లీ పిల్లల చేతుల్లో ట్యాబులు, మళ్లీ గవర్నమెంట్ బడుల్లో బైజూస్ కంటెంట్, డిజిటల్ బోర్డులతో, క్లాస్ రూములలో ఐఎఫ్ పీ బోర్డులు, డిజిటల్ బోధన. మళ్లీ జగన్ అధికారంలో ఉంటేనే అక్కచెల్లెమ్మలకు అండగా పూర్తి ఫీజులతో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన.

    మీ జగనన్న అధికారంలో ఉంటేనే నా అక్కచెల్లెమ్మలకు అండగా కళ్యాణమస్తు, షాదీ తోఫా. మీ జగన్ అధికారంలో ఉంటే రైతన్నలకు ఓ భరోసా, పెట్టుబడికి సాయంగా పెంచిన రైతుభరోసా. మీ జగనన్న అధికారంలో ఉంటేనే రైతన్నలకు సున్నావడ్డీ, 9 గంటలపాటు పగటి పూటనే ఉచిత విద్యుత్, ఏ సీజన్లో జరిగిన నష్టానికి ఆ సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ. మీ జగన్ అధికారంలో ఉంటే ఓ ఆర్బీకే వ్యవస్థ, ఆ వ్యవస్థలో మెరుగైన సేవలు. ఆలోచన చేయండి...మీ జగన్ అధికారంలో ఉంటేనే నాడునేడుతో బాగుపడే హాస్పటళ్లు, 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఇంటికే జగనన్న ఆరోగ్య సురక్ష, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, గ్రామంలోనే విలేజ్ క్లినిక్...ఇవన్నీ మీ జగనన్న అధికారంలో ఉంటేనే అనేది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నాను.

    మీ జగనన్న అధికారంలో ఉంటేనే ఓ వాలంటీర్ వ్యవస్థ. మళ్లీ ఇంటికే పౌరసేవలు, మళ్లీ ఇంటికే పథకాలు, ఇంటికే పెన్షన్లు. మళ్లీ బటన్లు నొక్కడం కూడా మీ జగనన్న అధికారంలో ఉంటేనే..నా అక్కచెల్లెమ్మలకు నేరుగా మీ బిడ్డ బటన్లు నొక్కడం, వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు, ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా వారి చేతుల్లోకి ఆ డబ్బులు వెళ్లిపోవడం జరుగుతుంది.

    చంద్రబాబు పేరుచెబితే పేదవాడు గుర్తుచేసుకునే ఒక్క స్కీమ్ అయినా ఉందా?
    మరో విషయాన్ని కూడా గమనించండి. 14 ఏళ్లు చంద్రబాబు నాయుడుగారు సీఎంగా చేసారు. 3 సార్లు ముఖ్యమంత్రి అంటాడు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ వ్యక్తి పేరు చెబితే ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు. ఆ చంద్రబాబు పేరు చెబితే కనీసం గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్కటైనా మంచి ఉందా? అని అడుగుతున్నాను. చంద్రబాబు పేరుచెబితే పేదవాడు గుర్తుచేసుకునే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతున్నాను.

    బాబు రాకముందే అవ్వాతాతలకు అవస్ధలు
    14 ఏళ్లు ఏ పేదవాడికీ ఏమీ చేయని చంద్రబాబు...ఇప్పుడు ఈనాడులో ఆయన ఇచ్చిన ప్రకటన చూసారా?. సూపర్ సిక్స్లో అవ్వాతాతల పెన్షన్ అప్పుడే ఎత్తేసారు. సూపర్ సిక్స్లో అవ్వాతాతల పెన్షన్ ఎక్కడైనా కనిపించిందా?. చంద్రబాబు రాకమునుపే అప్పుడే అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ ఎండనకా, వాననకా తిరగాల్సిన పరిస్థితులు అప్పుడే వచ్చేసాయి. ఇక చంద్రబాబు పాలన పొరపాటున నిజంగా వస్తే, చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది. అవ్వాతాతలు ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నాను.

    చంద్రబాబు విఫల హామీలు
    చంద్రబాబు మోసాలు, మాయలు, మేనిఫెస్టోలు ఎలా ఉంటాయో...ఒక్కసారి మీ అందిరికీ చూపిస్తాను. ఇది మీ అందరికీ గుర్తుందా (టీడీపీ 2014 మేనిఫెస్టో చూపిస్తూ) చంద్రబాబు సంతకం పెట్టి, ముగ్గురు ఫొటోలతో, ముఖ్యమైన హామీలు అంటూ మీ ఇంటికి పంపిన ఈ పాంప్లెట్ గుర్తుందా?. 2014లో ఈ పాంప్లెట్ మీ ఇంటికి పంపించి,  ఆ ఎన్నికల్లో మీ అందరితో ఓట్లు వేయించుకుని, గెలిచి 2014 నుంచి 2019లో ఆయన పరిపాలన చేసి, పరిపాలన చేసిన తర్వాత, నేను ఇవాళ అడుగుతున్నాను. ఈ పాంప్లెట్లో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని మీరే సమాధానం చెప్పండి.  ఈయన చెప్పిన మొదటి హామీ, ముఖ్యమైన హామీ రైతన్నల రుణాలు...మొదటి సంతకంతోటే మాఫీ అన్నాడు. రూ.87,612 కోట్ల రుణాల మాఫీ అన్నాడు రైతన్నలకు.. జరిగిందా? 

    ముఖ్యమైన హామీ...ఆయన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికీ పంపించిన హామీ..పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తా అని చెప్పాడు. రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేసాడా అని అడుగుతున్నాను..మాఫీ ఎవ్వరికైనా జరిగిందా?. ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడు చేసిన మరో ముఖ్యమైన మూడో హామీ ఆడబిడ్డ పుడితే మహలక్ష్మి పథకం కింద రూ. 25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తానన్నాడు. మీకు లేదా మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఆడపిల్లలు పుట్టారు కదా...మీ వాళ్లలో ఎవరికైనా కూడా చంద్రబాబు ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేసాడా అని అడుగుతున్నాను.

    మరో ముఖ్యమైన హామీ ఇంటింటికీ ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ.2 వేలు నిరుద్యోగభృతి ప్రతి నెలా అన్నాడు. ఐదు సంవత్సరాలు అంటే 60 నెలలు, నెలకు రూ.2 వేలు అంటే ప్రతి ఇంటికీ రూ.1,20,000. కనీసం ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతున్నాను. అర్హులైన వాళ్లందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా..మీలో ఏ ఒక్కరికైనా చంద్రబాబు హయాంలో ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని అడుగుతున్నాను. రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్లూమ్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా..? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తానన్నాడు జరిగిందా? సింగపూర్ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు జరిగిందా? ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తా అన్నాడు జరిగిందా...మన కనిగిరిలో కనిపిస్తోందా?

    అందరూ ఆలోచన చేయండి.. చంద్రబాబు పంపిన పాంప్లెట్ లో ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా?

    ప్రత్యేక హోదా అమ్మేసిన వ్యక్తి – బాబు
    పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? అదికూడా అమ్మేసాడు. ఇలాంటి వ్యక్తిని నమ్ముతామా?. వాళ్లంతా కలిసి ఇప్పుడు ఏమంటున్నారు. ఇదే ముగ్గురు మళ్లీ కలిసి వస్తున్నారు. సూపర్ సిక్స్ అంట నమ్ముతారా? సూపర్ సెవెన్ అంట నమ్ముతారా?  ఇంటింటికీ బెంజ్ కార్ అంట నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం అంట...నమ్ముతారా?

    అబద్దాలకు రెక్కలు కడుతున్న చంద్రబాబు
    ఆలోచన చేయండి...కొత్తకొత్త మోసాలతో, కొత్త కొత్త మేనిఫెస్టోతో అబద్ధాలకు రెక్కలు కట్టి, ప్రజల మనోభావాలతో ఎలా ఆడుకుంటున్నారో చూస్తున్నారు. ఇలాంటి వాళ్లను, ఇలాంటి మోసాలను, ఇలాంటి అబద్ధాలను, ఇలాంటి రాజకీయాలను విలువలు విశ్వసనీయత లేని మనుషులకు తగిన గుణపాఠం చెప్పమని కోరుతున్నాను.

    వివక్ష లేని పాలనకు ఫ్యాను గుర్తుకే ఓటేయండి
    వాలంటీర్లు మీ ఇంటికి రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ మారాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన బడులు, వారి చదువులు, మన పిల్లలు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన హాస్పిటళ్లు, మన వ్యవసాయం మెరుగుపడాలన్నా... ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? రెండు బటన్లు.. రెండు బటన్లు అన్నా.. రెండు బటన్లు తమ్ముడు, రెండు బటన్లు చెల్లీ ఫ్యాన్‌ మీద నొక్కాలి. 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.

    మన గుర్తు.. అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు తెలియని పరిస్థితి ఉన్నా, మన గుర్తు మరిచిపోయినా.. మన గుర్తు ఫ్యాను. అక్కడ మేడ మీద ఉన్న అక్కలు, అవ్వలు, పెద్దమ్మలు, చెల్లెమ్మలు మన గుర్తు ఫ్యాను. అక్కా మన గుర్తు ఫ్యాను, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను, అన్నా మన గుర్తు ఫ్యాను, తమ్ముడూ మన గుర్తు ఫ్యాను, అన్నా మన గుర్తు ఫ్యాను, తాత మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింకులోనే ఉండాలి. 

    ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తూ.. మన పార్టీ అభ్యర్ధులపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచాల్సిందిగా మీ బిడ్డ సవినయంగా రెండు చేతులు జోడించి పేరుపేరునా ప్రార్థిస్తున్నాడు అని తెలియజేస్తూ సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్ధి డి నారాయణ, ఒంగోలు లోక్ సభ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు పాల్గొన్నారు.

     

     

     

     

     

     

     

  • భువనేశ్వర్: ఒడిశాను అన్ని రంగాల్లో అగ్రగామికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి 'నవీన్ పట్నాయక్' పక్కా ప్రణాళికతో ఉన్నారని, రాష్ట్రం నుంచి వలసలు పూర్తిగా ఆగిపోవాల్సిన అవసరం ఉందని ఆయన సన్నిహితుడు వీకే పాండియన్ అన్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో బిజూ జనతాదళ్ రాష్ట్రాన్ని క్లీన్ స్వీప్ చేస్తుందని అన్నారు.

    ప్రజలు నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని గతంలో ముఖ్యమంత్రి ప్రైవేట్ కార్యదర్శిగా పనిచేసిన పాండియన్ అన్నారు. పట్నాయక్ కేవలం అధికారం కోసం మాత్రమే కాకుండా.. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలు చేస్తారు. దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని ఆయన అన్నారు.

    ఐదు పర్యాయాలు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించి నవీన్ పట్నాయక్.. ఆరో సారి ఏమైనా విశ్రాంతి తీసుకుంటారా? వారిలో ఏమైనా అలసట కనిపించిందా? అనే ప్రశ్నకు పాండియన్ సమాధానమిస్తూ.. మంచిపని చేస్తే అలసట ఎలా వస్తుంది, ప్రతి ఎన్నికల్లోనూ అయన గొప్ప విజయం సాధిస్తారని అన్నారు.

    ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ స్థానాలకు, 147 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీకి కలిసి ఎన్నికలు జరగనున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీ 12 సీట్లు గెలుచుకోగా, బీజేపీకి ఎనిమిది, కాంగ్రెస్‌కు ఒక్క సీటు మాత్రమే లభించింది. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ సంఖ్య 117 నుంచి 112కి పడిపోయింది. ఆ సమయంలో బీజేపీ 19 నుంచి 23 స్థానాలకు ఎగబాకింది. కాంగ్రెస్‌కు తొమ్మిది స్థానాలు మాత్రమే రాగా, ఇతరులు రెండు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించారు.

    పంచాయితీ, మునిసిపాలిటీ, అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల ఏవీ నవీన్ పట్నాయక్ విజయాన్ని అడ్డుకోలేవు. ఆయనకు ప్రజల్లో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ కారణంగానే ఆయన ఎన్నికల గురించి పెద్దగా పట్టించుకోరని పాండియన్ అన్నారు. ఇప్పటికే క్రీడలు, విపత్తు నిర్వహణ, పేదరిక నిర్మూలన లేదా ఆహారోత్పత్తి వంటి రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నాము. అయితే ఒడిశా అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో ఉండాలని నవీన్ పట్నాయక్ కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

  • పాట్నా: కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అనుమనాలు వ్యక్తం అవుతుండటం వల్లే ప్రధాని  ఫొటోవ్యాక్సిన్‌ సర్టిఫికెట్లపై తొలగించారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాదా్‌ యాదవ్‌ కుమార్త్‌ మీసా భారతి అన్నారు. మీసా భారతి బిహార్‌లోని పాటలిపుత్ర నియోజకవర్గం నుంచి ఎంపీ పదవికి పోటీ చేస్తున్నారు. 

    ప్రచారంలో భాగంగా  మీసా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ‘వ్యాక్సిన్‌ దుష్ప్రభావాలపై వస్తున్న వార్తలతో ప్రధాని భయపడుతున్నారు. ప్రధానికి ప్రతి దానిపై క్రెడిట్‌ తీసుకోవడం అలవాటు. అయితే కరోనా వ్యాక్సిన్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నందున ప్రధాని పక్కకు తప్పుకుంటున్నారు.

    వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌లపై తన ఫొటోలను తొలగించారు. వ్యాక్సిన్‌పై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి’ అని మీసా డిమాండ్‌ చేశారు. కాగా, ఎన్నికల కోడ్‌ ఉన్నందు వల్లే కొవిడ్‌ వ్యాక్సిన్‌ సర్టిఫికెట్లపై ప్రధాని ఫొటో తొలగించారని బీజేపీ నేతలు మీసాకు కౌంటర్‌ ఇస్తున్నారు.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                       

  • బెంగళూరు: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ‌య‌నాడ్‌ నుంచి మాత్రమే కాకుండా రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థిపై భారీ తేడాతో ఓడిపోతారని కేంద్ర హోంమంత్రి 'అమిత్ షా' పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ఎన్ని సార్లు ఈ స్థానం నుంచి బరిలోకి దింపినా ఇంత‌వ‌ర‌కూ విజయం పొందలేదని అమిత్ షా ఎద్దేవా చేశారు.

    అమేథీ నుంచి పారిపోయి.. రాహుల్ గాంధీ రాయ్‌బరేలీలో నామినేషన్ దాఖలు చేశారని అమిత్ షా అన్నారు. బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌పై తాను భారీ తేడాతో ఓడిపోతారు. నా మాటలు రాసుకోండి" అని ఆయన అన్నారు. బెలగావి జిల్లాలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

    ప్రధాని మోదీ ప్రయత్నించారు. ఒకేసారి చంద్రయాన్ ప్రారంభమైంది. అయితే సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేరుతో ఈ 'యాన్'ని ఇరవై సార్లు ప్రయోగించారు, కానీ ఆమె ప్రయోగం విజయవంతం కాలేదు. ఈ రోజు ఇరవై ఒకటవసారి అంటూ అమిత్ షా అన్నారు. రాహుల్ గాంధీ గత రెండు దశాబ్దాలుగా తన తల్లి సోనియా గాంధీకి చెందిన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కానీ ఒక్కసారి కూడా గెలుపొందలేదు.

    గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కిషోరి లాల్ శర్మను అమేథీ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపారు. ఐదో దశ సార్వత్రిక ఎన్నికల్లో  అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలకు మే 20న పోలింగ్ జరగనుంది. రాయ్‌బరేలీ గతంలో రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ, ఆయన అమ్మమ్మ ఇందిరా గాంధీ, అతని తాత ఫిరోజ్ గాంధీలను ఎన్నుకున్న నియోజకవర్గం.

  • అసలు చేయితగిలితేనే ఒప్పుకోని మనిషి కాలు తగిల్తే ఊరుకుంటుందా ? అసలే ఊరుకోదు... ఇల్లుపీకి పందిరిస్తుంది.. ఊరంతా గాయి గత్తర చేస్తుంది. బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది... మ్యానిఫెస్టోలో చంద్రబాబు బాటు పక్కనే తన ఫోటో ఉంచితేనే వద్దన్నా ప్రధాని మోడీ ఇప్పుడు చంద్రబాబు... పవన్ తో కలిసి ప్రచారం చేస్తారా? చేయనే చేయరు. వాస్తవానికి టీడీపీ జనసేన...బీజేపీల ఉమ్మడి మ్యానిఫెస్టో మొన్న విడుదల చేసారు. వాస్తవానికి మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నపుడు... సీట్లు కూడా పంచుకుని మరీ బరిలోకి దిగుతున్నపుడు మ్యానిఫెస్టోలో కూడా మూడుపార్టీల ఫోటోలు ఉండాలి.

    కానీ దీనికి బిజెపి పెద్దలు నో అన్నారని, అందుకే మోడీ పేరు, ఫోటో లేకుండానే కేవలం చంద్రబాబు, పవన్ ఫొటోలతో మ్యానిఫెస్టో విడుదల చేసారు.. ఆ మ్యానిఫెస్టోతో తమకు సంబంధం లేదని, దాని అమలు అనేది వాళ్లదే బాధ్యత అని బీజేపీ తేల్చేసింది. ఇక ఇప్పుడు ఎన్నికల ప్రచారం అనేది తుది అంకానికి చేరిన తరుణంలో మోడీ మరోమారు ఆంధ్రాలో ప్రచారానికి వస్తున్నారు. గతంలో వచ్చి  పవన్, చంద్రబాబులతో కలిసి చిలకలూరిపేటలో బహిరంగ సభలో మాట్లాడారు. అప్పుడు కూడా మా ఎన్డీయేను గెలిపించండి అన్నారు తప్ప మాటవరసకు ఐన జగన్ను విమర్శించలేదు... బాబును నెత్తికి ఎత్తుకుని గెలిపించాలని ప్రజలను కోరలేదు. వాస్తవానికి బీజేపీ ఆంధ్రాలో ఆరు లోక్‌సభ ...పది అసెంబ్లీ  స్థానాల్లో పోటీ చేస్తోంది.

    ఇప్పుడు మళ్ళీ మోదీ రెండోవిడత ప్రచారానికి వస్తున్నారు., ఇందులో భాగంగా 7, 8 తేదీల్లో ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ వస్తున్నారు.  ఏదో తేదీన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీ చేస్తున్న రాజమండ్రి నియియోజకవర్గంలో ని వేమగిరిలో బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. ఆ తరువాత అదేరోజు సాయంత్రం సీఎం రమేష్ ఎంపీగా పోటీ చేస్తున్న అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో పాల్గొంటారు. 8న సాయంత్రం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్న రాజంపేట లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని పీలేరులో పాల్గొంటారు... ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు... అదేరోజు రాత్రి రాత్రి 7 గంటలకు విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్‌ వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. ఇక్కడ విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు

    వాస్తవానికి ఈ కార్యక్రమాలకు కూటమి భాగస్వాములు అయిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ సైతం హాజరవ్వాలి... కానీ మోడీ తీరు, బిజెపి విధానం చూస్తుంటే అసలు వాళ్లతో మాట్లాడేందుకు సైతం ఇష్టపడుతున్నట్లు కనిపించడం లేదు.. ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తుపెట్టుకున్నాం తప్ప మాకు వాళ్ళిద్దరంటేనే చిరాకు.. చూస్తుంటేనే ఎలపరం వస్తోంది అన్నట్లుగా ఉన్నారు.. అందుకే ఈ ప్రచార సభల్లో టీడీపీ, జనసేన నేతలు పాల్గొనే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. మోడీ కూడా కేవలం తమ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోటనే ప్రచారం చేసేలా టూర్ షెడ్యూల్ రూపొందించారు..
    -సిమ్మాదిరప్పన్న 

  • లక్నో: దేశంలో రెండు దశల లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా ఐదు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ రాయ్‌బరేలీ, అమేథీ అభ్యర్థులుగా రాహుల్ గాంధీ, కెఎల్ శర్మలను ప్రకటించింది. అయితే కాంగ్రెస్ మీద 'యోగి ఆదిత్యనాథ్' కీలక వ్యాఖ్యలు చేశారు.

    రాహుల్ గాంధీకి మద్దతుగా.. మాజీ మంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) నాయకుడు ఫవాద్ చౌదరి చేసిన వైరల్ పోస్ట్‌ను ప్రేరేపిస్తూ, దేశ బద్ధ శత్రువులతో కాంగ్రెస్ కుమ్మక్కయ్యిందనడానికి ఈ పోస్ట్ నిదర్శనమని యోగి అన్నారు. ప్రధానమంత్రి మోదీ సృష్టించిన పురోగతి, సానుకూల వాతావరణాన్ని నాశనం చేయడానికి మన శత్రువులు ఎంతటికైనా తెగించడానికి ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు.

    దేశం మొత్తం ప్రధాని మోదీకి అండగా నిలుస్తున్న తరుణంలో.. మన బద్ద శత్రువులు రాహుల్‌గాంధీకి మద్దతుగా నిలిచేందుకు ఎంతటి కఠోరమైన ప్రయత్నాలు చేస్తున్నారో చూడవచ్చు. భారత శత్రువులతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

    స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. ప్రజలను మతాల వారీగా విభజించడానికి కూడా ప్రయత్నిస్తోందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. బుజ్జగింపు రాజకీయాలే దేశ భద్రతకు ముప్పు కలిగిస్తాయని యోగి అన్నారు.

    గత 10 ఏళ్లలో తీవ్రవాదం, నక్సలిజాన్ని అరికట్టడానికి ప్రధాని మోదీ కృషి చేశారు. ప్రజలు ప్రధాని వెంట ఉన్నారు.  జరగనున్న ఎన్నికల్లో అమేథీ, రాయ్‌బరేలీ, కన్నౌజ్‌లలో కూడా బీజేపీ గెలుస్తుందని అన్నారు. తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉందని యోగి పేర్కొన్నారు.

  • పల్నాడు జిల్లా, సాక్షి: చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపినట్టేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పల్నాడు జిల్లా పెదకూరపాడు క్రోసూరు సెంటర్‌లో బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు మూడు సార్లు సీఎంగా పనిచేశారని చెప్పుకుంటారు.. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచైనా గుర్తొస్తుందా? అంటూ ప్రశ్నించారు.

    ‘‘గతంలో ఎన్నడూ చూడని పాలనను 59 నెలల్లో చూశారు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్ని కొనసాగింపు. అదే చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికి ముగింపే. విశ్వసనీయతకు మరోసారి ఓటేసేందుకు మీరంతా సిద్ధమా?. గతంలో లేని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చా. రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్కా చెల్లెమ్మల పేరుపై రిజిస్ట్రేషన్‌ చేశాం. ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చా. మీ ఓటు ఐదేళ్ల భవిష్యత్తు’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

    ‘‘2014లో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా?. పిల్లల చేతుల్లో ట్యాబులు ఎప్పుడైనా మీరు చూశారా?. అమ్మఒడి, విద్యాదీవెన, వసతి, దీవెన, ఆసరా, చేయూత, కాపునేస్తం లాంటి పథకాలు చూశారా?. గతంలో మేనిఫెస్టో పేరుతో ఎలా మోసం చేశారో అందరూ చూశారు
    2014లో మేనిఫెస్టోను నమ్మి కూటమికి ఓటు వేశారు?. ఒక్కరికైనా రైతు రుణమాఫీ చేశారా?. అర్హులైనవారికి పక్కా ఇళ్లు అన్నారు.. ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చారా?. సింగపూర్‌ మించి అభివృద్ధి చేస్తానని అన్నారు.. జరిగిందా?. ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు డిపాజిట్‌ చేస్తానన్నాడు.. చేశాడా?. ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?’’ అంటూ చంద్రబాబును సీఎం జగన్‌ నిలదీశారు.

    ‘‘జరగబోయే ఈ ఎన్నికలు మీరు వేసే ఓటు మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయిస్తుంది. సాధ్యం కాని హామీలతో బాబు ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం ప్రజలను మోసం చేయడమే. చంద్రముఖి నిద్ర లేస్తే గతంలోలాగే మీ రక్తం తాగేందుకు ఇంటింటికీ వస్తుంది. బాబు మోసాలను ఓడించడానికి, పేదలను గెలపించడానికి, విలువలు, విశ్వసనీయతకు ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా?. మీరు జగన్‌ను నమ్మి అధికారం ఇచ్చినందువల్ల గత ఐదేళ్లలో ప్రతి ఒక్క రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తేగలిగాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 

    ‘‘2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు 59 నెలల కాలంలోనే ఇచ్చాం. అక్కచెల్లెమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు, 21 లక్షల ఇళ్ల నిర్మాణం ఈ 59 నెలల్లోనే జరుగుతోంది.  మేనిఫెస్టోకు విశ్వసనీయత తెచ్చి 99% అమలు జరిగింది ఈ పాలనలోనే. ప్రభుత్వ బడులు మారాయి, పిల్లల చదువులు మారాయి. లంచాలు లేని వివక్షలేని ఇంటివద్దకే పాలన, పెన్షన్, పౌరసేవలు, పథకాలు గతంలో ఎప్పుడూ లేవు’’ అని  సీఎం జగన్‌ వివరించారు.

     

     

  • ఇండోర్ (మధ్యప్రదేశ్‌): లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా తమ పార్టీ అభ్యర్థులకు, కూటమి అభ్యర్థులకు ఓటేయాలని అభ్యర్థిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మాత్రం నోటాకే ఓటేయాలని ఓటర్లను కోరుతూ ప్రచారం నిర్వహిస్తోంది. ఇక్కడ తాము నిలబెట్టిన అభ్యర్థి చివరి నిమిషంలో పోటీ నుంచి బీజేపీలో చేరడమే ఇందుకు కారణం.

    ఇండోర్‌ బీజేపీ సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీకి పోటీగా అక్షయ్ కాంతి బామ్‌ను కాంగ్రెస్‌ పార్టీ నిలబెట్టింది. అయితే ఆయన నామినేషన్ ఉపసంహరణకు చివరి రోజున కాంగ్రెస్‌ పార్టీకి షాక్ ఇచ్చారు. నామినేషన్‌ విత్‌డ్రా చేసుకని కాషాయ పార్టీలోకి చేరారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నియోజకవర్గానికి నాలుగో దశలో మే 13న పోలింగ్ జరగనుంది.

    “గత మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో ఇండోర్ ఓటర్లు బీజేపీకి భారీ విజయాన్ని అందించారు. అయినప్పటికీ, కాషాయ పార్టీ తమ అభ్యర్థి బామ్‌ను అన్యాయంగా ప్రలోభపెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఓటర్లు నోటాకు ఓటేసి బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలి’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత శోభా ఓజా పీటీఐతో అన్నారు.

    తమ పార్టీ ఏ అభ్యర్థికీ మద్దతివ్వదని, బీజేపీని శిక్షించేందుకు ఓటర్లకు నోటా అవకాశం ఉందని ఎంపీ కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారీ అన్నారు. అయితే నోటాకు ఓటేయాలని ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్‌ ప్రజాస్వామ్యంలో 'ప్రతికూల వ్యూహాలను' అవలంభిస్తోందని బీజేపీ అభ్యర్థి లాల్వానీ అన్నారు.

Movies

  • వరుణ్‌ సందేశ్‌- వితికా షెరు.. ఒకప్పుడు తెలుగులో హీరోహీరోయిన్లుగా పని చేశారు. పడ్డానండీ ప్రేమలో మరి(2015) సినిమా నుంచి వివాహబంధంలో అడుగుపెట్టారు. ఈ సినిమా విడుదలైన మరుసటి ఏడాదే పెళ్లిపీటలెక్కారు. ఈ బ్యూటిఫుల్‌ కపుల్‌ తెలుగు బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లోనూ పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. కానీ ఆ సమయంలో వితికాపై విపరీతమైన నెగెటివిటీ వచ్చింది. ఆ వ్యతిరేకతను చూసిన వితిక చాలాకాలంపాటు డిప్రెషన్‌లో ఉండిపోయింది. తర్వాత దాని నుంచి బయటకు వచ్చి యూట్యూబర్‌గా మారి సరికొత్త జర్నీని కొనసాగించింది.

    ఇక వితికాకు ఎప్పుడూ ఎదురయ్యే ప్రశ్న.. పిల్లల్నెప్పుడు కంటారు? ఎనిమిదేళ్లుగా ఈ క్వశ్చన్‌ వినీవినీ విసిగెత్తిపోయింది వితిక. అందుకు సంబంధించిన పలు విషయాలను ఆమె తొలిసారిగా ఒక ఇంటర్వ్యూలో ఇలా రియాక్ట్‌ అయింది. 'పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం. మా ఫ్యామిలీలోని చిన్నపిల్లలను అందరినీ నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నాకు పిల్లలను కనడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. 2016లో పెళ్లైన తర్వాత మేము అమెరికాలో సెటిల్ అయిపోవాలని అక్కడకు వెళ్లాం. అక్కడే కొంతకాలం ఉన్నాం. 

    ఈ క్రమంలో 2018లో నేను ప్రెగ్నెంట్‌ అయ్యాను. ఆ సమయంలో మా కుటుంబ సభ్యులందరికీ చెప్పేశాం. సంబరాలు చేసుకున్నాం. కానీ, కొద్దిరోజుల్లోనే గర్భస్రావం అయింది. ఆ తర్వాత నేను ఇండియాకు వచ్చేశాం. ఇక్కడకు వచ్చాకా రెండు నెలలు పీరియడ్స్ రాకపోవడంతో మరోసారి ఆస్పత్రికి వెళ్తే ప్రెగ్నెంట్‌ అని డాక్టర్స్‌ చేప్పారు. అప్పుడు నేను షాక్‌ అయ్యాను. కొద్దిరోజుల క్రితమే గర్భస్రావం అయిన విషయాన్ని చెప్పాను. అప్పుడు డాక్టర్‌ స్కానింగ్‌ చేయడంతో బేబీ చిన్న ముక్క లోపలే ఉండిపోయిందని చెప్పారు. మరోసారి అబార్షన్ చేసి గర్భ సంచి అంతా క్లీన్ చేశారు. అని వితికా ఎమోషనల్‌ అయింది. 

    ఈ సంఘటన జరిగిన తర్వాత తామిద్దరం బిగ్‌ బాస్‌కు వెళ్లడం.. ఆ తర్వాత పలు ప్రాజెక్ట్‌లతో  మళ్లీ ఫైనాన్సియల్‌గా సెటిల్‌ కావడం జరిగిందని ఆమె తెలిపింది. దేవుడు కరుణిస్తే పిల్లిలు వద్దనుకునేవాళ్లు ఎవరుంటారని ఆమె చెప్పింది. నిజంగానే తమ జీవితంలోకి ఆ క్షణం వస్తే అందరికీ తప్పకుండా చెప్తానని వితికా చెప్పుకొచ్చింది. వితికా ఇప్పుడు తమ ఫ్యామిలీలో వరుణ్‌తో పాటుగా తను కూడా ఒక ఫ్యామిలీస్టార్‌గా ఉంది. రీసెంట్‌గా తన చెల్లి పెళ్లి కూడా చేసింది. సొంతంగా ఇల్లు నిర్మించుకుంది. తన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా కూడా తట్టుకుని నిలబడిందని చెప్పవచ్చు.
     

  • ,

    కోలీవుడ్‌ స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌పై నిర్మాతలు లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్ ఫిర్యాదు చేశారు. 2015లో 'ఉత్తమ విలన్' చిత్రాన్ని  రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, తిరుపతి బ్రదర్స్ ఫిల్మ్ మీడియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రాన్ని రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు. సినిమా విడుదల తర్వాత బాక్సాఫీస్‌ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఉత్తమ విలన్‌ చిత్రానికి నిర్మాతలుగా కమల్‌ హాసన్‌, తిరుపతి బ్రదర్స్ అధినేతలు  లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్ అనే విషయం తెలిసిందే.

    'ఉత్తమ విలన్' సినిమా తమను అప్పుల్లోకి నెట్టిందని తిరుపతి బ్రదర్స్ అధినేతలు  లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్ కోలీవుడ్‌ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. భారీ అంచనాలతో నిర్మించిన ఆ సినిమా వల్ల తాము ఆర్థికంగా నష్టపోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని కొద్దిరోజుల క్రితం ఆయన అన్నారు. ఉత్తమ విలన్‌ వల్ల భారీగా నష్టపోవడంతో తమతో రూ. 30 కోట్లతో ఒక సినిమా చేస్తానని కమల్‌ హాసన్‌ అప్పట్లోనే మాట ఇచ్చారని లింగుస్వామి పేర్కొన్న విషయం తెలిసిందే. 

    ఈ సినిమా   స్క్రిప్ట్ ను కమల్‌ చాలాసార్లు మార్చాడం వల్లే భారీగా నష్టం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కమల్‌ ఇచ్చిన మాట ప్రకారం తమతో ఎలాంటి ప్రాజెక్ట్‌ చేయలేదని వారు చెప్పారు. ఉత్తమ విలన్ భారీ నష్టాన్ని పూడ్చేందుకు మరో సినిమాను నిర్మిస్తానని కమల్‌ తమ సంస్థకు లిఖితపూర్వక హామీ ఇచ్చారని ఆయన చెబుతున్నారు. ఇన్నేళ్లలో పలు కథలతో పాటు 'దృశ్యం' రీమేక్‌ చేద్దామని కమల్‌ వద్దకు వెళ్లినా కూడా సినిమా చేసేందుకు ఆయన ముందుకు రావడంలేదని లింగుస్వామి అంటున్నారు. దీంతో తప్పని పరిస్థితిలో కమల్‌ మీద ఫిర్యాదు చేయాల్సి వచ్చినట్లు పేర్కొన్నారు.
     

  • టాలీవుడ్‌లో హీరోయిన్లు గురించి చెప్పమంటే పోతే రోజులు పట్టేస్తాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త వాళ్లు వస్తూనే ఉంటారు. ఉన్నవాళ్లు వెళ్లిపోతూనే ఉంటారు. ఈ బ్యూటీది కూడా అలాంటి స్టోరీనే. తెలుగమ్మాయి కాకపోయినప్పటికీ ఇక్కడ కొన్ని సినిమాలతో అద్భుతమైన హిట్స్ అందుకుంది. కానీ ఎందుకో కెరీర్ ని సరిగా సెట్ చేసుకోలేక ఫేడౌట్ అయిపోయింది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్ని చెప్పేయమంటారా?

    (ఇదీ చదవండి: 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?)

    పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు రిచా పల్లోడ్. అరె.. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనుకుంటున్నారా? అవును మీరు ఊహించింది కరెక్టే. దాదాపు 24 ఏళ్ల క్రితం వచ్చిన 'నువ్వే కావాలి' సినిమాలో హీరోయిన్‌గా చేసింది ఈమెనే. ఈ మూవీతో అద్భుతమైన సక్సెస్ అందుకుంది. కానీ తర్వాత చేసిన హోళీ, చిరుజల్లు, ప్రేమతో రా, నా మనసిస్తా రా, పెళ్లాం పిచ్చోడు, 'ఇంకోసారి' తదితర చిత్రాల్లో నటించింది. కాకపోతే ఇవి అనుకున్నంత హిట్ అవ్వలేదు.

    చివరగా 2016లో వచ్చిన 'మలుపు' అనే డబ్బింగ్ సినిమాలో రిచా.. సహాయ పాత్రలో నటించింది. రిచా ఫ్యామిలీ విషయానికొస్తే.. బెంగళూరులో పుట్టి పెరిగిన ఈ భామ.. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పలు మూవీస్ చేసింది. అయితే సినిమాలు తగ్గడంతో 2011లో హిమాన్షు బజాబ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం భర్తతో కలిసి ఉంటున్న రిచా.. ఒకప్పటితో పోలిస్తే ఛార్మ్ తగ్గిపోయింది. దీంతో గుర్తుపట్టేలేనంతగా మారిపోయింది. 

    (ఇదీ చదవండి: ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్)

     

  • ముదుగంటి క్రియేషన్స్‌పై తెరకెక్కిన జితేందర్‌ రెడ్డి సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఈ చిత్రాన్ని ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  రాకేష్ వర్రె లీడ్ రోల్‌లో నటించిన జితేందర్ రెడ్డి విడుదలకు సిద్ధంగా ఉంది. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలో నటించారు. గతంలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లిమ్స్, టీజర్ సినిమా పైన అంచనాలను పెంచేసాయి. కాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 

    చిన్నప్పటినుండే సమాజం పట్ల అంకితభావం ఉన్న జితేందర్ రెడ్డి, సమాజానికి ఏదో ఒక మంచి చెయ్యాలి అనే భావంతో పెరుగుతాడు. ఆ లక్షణాలు జితేందర్ రెడ్డితో పాటు పెరిగి, కాలేజీ ఎలక్షన్స్ లో లీడర్ గా ఎదిగి, ఆ తరవాత పోలీసు వ్యవస్థకే దీటుగా, సమాజంలో నక్సలైట్లు చేసే దోర్జన్యాలకు ఎదురు వెళ్తాడు, ట్రైలర్ మద్యలో హిందుత్వం వంటి డైలాగ్ లు మరింత ఆశక్తి పెంచేలా ఉన్నాయి. 1980’s ఒక వ్యక్తి జీవితంలో జరిగే కాలేజీ పాలిటిక్స్, ఆ తరవాత నిజమైన రాజకీయాలు నేపధ్యంలో ఈ కథ సాగుతున్నట్టు ఉంది. మొత్తానికి ప్రేక్షకులను మెప్పించేలా కథ ఉంది. మే 10న ‘జితేందర్ రెడ్డి విడుదల కాబోతుంది అని చిత్ర యూనిట్ ట్రైలర్ ద్వారా తెలిపారు. 

  • ప్రేమ ఎప్పుడు, ఎలా చిగురిస్తుందో ఎవరికీ తెలియ‌దు. ఒక్క‌సారి మ‌న‌సులు క‌లిశాయంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని దాటి మ‌రీ ఒక్క‌ట‌య్యేందుకు రెడీ అయిపోతారు. బాలీవుడ్ సీనియ‌ర్ జంట ధ‌ర్మేంద్ర‌- హేమ‌మాలిని విష‌యంలో ఇదే జరిగింది. ధ‌ర్మేంద్ర‌తో ప్రేమ‌లో ప‌డేనాటికే అత‌డికి ప్ర‌కాశ్ కౌర్ అనే భార్య ఉంది. ఈ జంట‌కు న‌లుగురు పిల్ల‌లు సంతానం. 

    రెండో పెళ్లి
    ఈ బంధాన్ని కాపాడుకుంటూనే మోవైపు హేమ‌మాలినిని రెండో పెళ్లి చేసుకున్నాడు. తాజాగా వీరు 44వ పెళ్లి రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా హేమ‌మాలిని భర్తతో క‌లిసున్న ఫోటోలు షేర్ చేసింది. ఇందులో ధర్మేంద్ర, హేమ‌మాలిని దండ‌లు మార్చుకున్నారు. భ‌ర్త ప్రేమ‌గా ముద్దుపెడుతుంటే సిగ్గుప‌డిపోయింది హేమ‌. ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

    అప్పుడే చిగురించిన ప్రేమ‌
    హేమ‌మాలిని, ధర్మేంద్ర 1970లో వారి తుమ్ హసీన్ మెయిన్ జవాన్ చిత్రంలో తొలిసారి నటించారు. అప్పుడే ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింది. పెళ్లికి రెడీ అయ్యారు. అయితే హేమ తల్లిదండ్రులు ధర్మేంద్రను వివాహం చేసుకోవడాన్ని వ్యతిరేకించారు. అయినా విన‌కుండా 1980లో ఈ జంట‌ పెళ్లి పీట‌లెక్కింది.  వీరికి ఈషా, అహనా అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ధ‌ర్మేంద్ర త‌న మొద‌టి భార్య‌తో క‌లిసి ఒకే ఇంట్లో ఉండ‌గా హేమ‌మాలిని త‌న పిల్ల‌ల‌తో వేరుగా ఉంటోంది.

     

    చ‌ద‌వండి: ప్రియుడితో పెళ్లికి రెడీ.. ఎంగేజ్‌మెంట్ వీడియో షేర్ చేసిన బ్యూటీ

  • టాలీవుడ్‌లో తక్కువ సినిమాలే చేసినప్పటికీ  వితికా షెరు అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. భీమవరంలో జన్మించిన ఈ బ్యూటీ మొదట కన్నడ చిత్ర సీమలో ఎంట్రీ ఇచ్చింది. తన 15వ ఏట 2008లో 'అంతు ఇంతు ప్రీతి బంతు' (తెలుగు సినిమా ఆడవారి మాటలకు అర్థాలే వేరులేలో కలర్స్ స్వాతి పాత్ర) కన్నడ చిత్రంతో సినీరంగ ప్రవేశంచేసింది. ఆ తర్వాత తెలుగు చిత్ర సీమలో రాణించాలని టాలీవుడ్‌వైపు అడుగులు వేసింది. తనకు 16 ఏళ్ల వయసులో తెలుగు సినిమా ఆడిషన్స్‌ కోసం వెళ్తే తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది.

    కన్నడ సినిమా తర్వాత తెలుగులో అవకాశాల కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరిగినట్టు అప్పటి రోజులను వితికా గుర్తుచేసుకుంది. కానీ ప్రస్తుతం మాత్రం ఇన్‌స్టాలో ఫోటోలు,రీల్స్‌ పెట్టినా ఛాన్సులు వస్తున్నాయని ఆమె తెలిపింది. కొంతమంది తన కలర్‌ తక్కువని కూడా రిజక్ట్‌ చేశారని ఇలా తెలిపింది. 'నా పేరు వితికా షెరు.. వినగానే కాస్త డిఫరెంట్‌గా ఉండటంతో అందరూ నన్ను నార్త్‌ అమ్మాయి అనుకుని ఆడిషన్స్‌కు పిలిచేవారు. కానీ, అక్కడికి వెళ్లిన తర్వాత ఓహ్‌.. తెలుగు అమ్మాయివేనా అంటూ కాస్త చులకన చేసి మాట్లాడేవారు. 

    నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు మా అమ్మతో కలిసి ఆడిషన్స్‌ ఇచ్చేందుకు వెళ్లాను. ఆ ప్రాజెక్ట్‌ కోసం నన్ను ఎంపిక కూడా చేశారు. అమ్మతో మాట్లాడాలి అంటూ కొంత సమయం తర్వాత నన్ను బయటకు పంపించారు. అమ్మాయికి సినిమాలో ఛాన్సు కావాలంటే నిర్మాతల సైడ్‌ నుంచి కమిట్‌మెంట్‌ విషయంలో చాలా ఒత్తిడి ఉంటుంది అన్నారు. దాని గురించి అమ్మకు తెలియకపోవడంతో పాపను పిలవండి అని చెప్పింది. దీంతో నేను కూడా అతని ముందుకు వచ్చాను. కమిట్‌మెంట్‌ అంటున్నారు ఎంటో తెలియడం లేదు మాట్లాడు అని నాతో  అమ్మ చెప్పింది. వారి ప్రపోజల్‌కు నేను నో చెప్పాను. సార్‌, రెమ్యునరేషన్‌ ఇవ్వకపోయినా పర్వాలేదు ఛాన్స్‌ ఇవ్వండి అని కోరాను. 

    కానీ, ఇలాంటి కమిట్‌మెంట్‌ వంటి కండీషన్‌కు ఒప్పుకోను అని చెప్పాను. అలా 16 ఎళ్ల వయసులోనే నేను ఇలాంటి సంర్భాన్ని ఎదుర్కొన్నాను. వాళ్ల సినిమా ఆఫీస్‌ కూడా హైదరాబాద్‌లోని శ్రీనగర్‌లోనే ఉండేది. మాకు బాగా తెలిసిన వారే నన్ను కమిట్‌మెంట్‌ అడిగారు.' అని వారి పేర్లు చెప్పకుండా వితికా దాటవేసింది. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం కష్టమని సినిమాల నుంచి తాను దూరం అయినట్లు ఆమె పేర్కొంది. కొంత కాలం తర్వాత యంగ్‌ హీరో వరుణ్ సందేశ్‌ను ప్రేమించి 2016, ఆగస్టు 19న వితిక వివాహం చేసుకుంది. ప్రస్తుతం తను పూర్తిగా కుటుంబ బాధ్యతలతో లీడ్‌ చేస్తుంది. 

  • బుల్లితెర సెల‌బ్రిటీలు శివంగి జోషి, కుషల్ టండ‌న్ ప్రేమించుకుంటున్నార‌ని గ‌త కొంత‌కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరు ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకోబోతున్నార‌ని ఊహాగానాలు వెలువ‌డ్డాయి. తాజాగా ఈ రూమ‌ర్స్‌పై ఇరువురూ స్పందించారు. త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నామంటూ వస్తున్న వార్త‌ల్లో ఏమాత్రం నిజం లేద‌ని క్లారిటీ ఇచ్చారు.

    నాకు ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌బోతుందా?
    ఈ మేర‌కు శివంగి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చింది. 'నాకు రూమ‌ర్స్ అంటే ఎంతో ఇష్టం. నా గురించి నాకే తెలియని విష‌యాల‌ను తెలుసుకుంటుంటే భ‌లే అనిపిస్తుంది. మీడియా మిత్రులారా.. నాకు ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌బోతుందా? ఇది నాక్కూడా తెలీదే.. నేను మార్ష‌ల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కోసం థాయ్‌లాండ్‌లో ఉన్నాను. మీరేమో ఏదేదో రాసేస్తున్నారు.

    సీరియ‌ల్‌లో క‌లిసి..
    కాస్త వార్త రాసేముందు ఒక‌టికి రెండుసార్లు చెక్ చేసుకోండి' అని సూచించింది. అటు కుష‌ల్ కూడా ఏదో ట్రైనింగ్ తీసుకుంటున్న‌ట్లు పోస్ట్ చేశాడు. కాగా శివంగి, కుష‌ల్‌.. బ‌ర్సాతే మౌస‌మ్ ప్యార్ కా అనే సీరియ‌ల్‌లో క‌లిసి న‌టించారు. గ‌తేడాది ప్రారంభ‌మైన ఈ సీరియ‌ల్ ఇటీవ‌లే ముగిసింది. 

    ఇద్దరి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్
    ఆన్‌స్క్రీన్‌లో జంట‌గా క‌నిపించిన వీరు ఆఫ్‌స్క్రీన్‌లోనూ క‌లిసి క‌నిపించ‌డంతో ఇద్దరి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ ఉంద‌ని అందరూ భావించారు. గ‌తంలోనూ శివంగి.. బాలికా వ‌ధు సీరియ‌ల్ న‌టుడు ర‌ణ్‌దీప్ రాయ్‌తో డేటింగ్‌లో ఉంద‌ని రూమ‌ర్స్ వ‌చ్చాయి. అయితే అవేవీ నిజం కాద‌ని న‌టి క్లారిటీ ఇచ్చింది. అత‌డు కేవ‌లం త‌న స్నేహితుడు మాత్ర‌మేన‌ని చెప్పింది.

    చ‌ద‌వండి: ప్రియుడితో పెళ్లికి రెడీ.. ఎంగేజ్‌మెంట్ వీడియో షేర్ చేసిన బ్యూటీ

  • ఈ వారం థియేటర్లలోకి ఐదుకి పైగా సినిమాలు వచ్చాయి. వీటిలో 'ఆ ఒక్కటి అడక్కు', 'ప్రసన్నవదనం' చిత్రాలు ఉన్నంతలో కాస్త అంచనాలతో రిలీజయ్యాయి. వీటితోపాటు వచ్చిన మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ 'ది ఇండియన్ స్టోరీ'. రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్ హీరో హీరోయిన్. రాజ్ భీమ్ రెడ్డి నిర్మించారు. సమాజంలో మత సామరస్యం ఉండాలనే కాన్సెప్ట్‌తో దర్శకుడు ఆర్. రాజశేఖర్ రెడ్డి తీశారు. ఇంతకీ మూవీ ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.

    కథేంటి?

    మత విద్వేషాలు రగిలే రాష్ట్రంలో హిందూ వర్గానికి శ్రీరామ్ (రామరాజు), ముస్లిం వర్గానికి కబీర్ ఖాన్ (ముక్తార్ ఖాన్) నాయకత్వం వహిస్తుంటారు. ఒకరిపై మరొకరు ప్రతీకార దాడులు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి టైంలో వైజాగ్ నుంచి రెహమాన్ (రాజ్ భీమ్ రెడ్డి) వస్తాడు. ఇతడి దగ్గర బంగారు బిస్కెట్లు ఉంటాయి. అవి అమ్మడానికి స్నేహితుడు ఫేకు (చమ్మక్ చంద్ర) సాయం తీసుకుంటాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో కత్తిపోట్లకు ఎదురెళ్లి కబీర్ ఖాన్‌ని రెహమాన్ కాపాడతాడు. అనంతరం కబీర్ వర్గంలో ఓ నాయకుడిగా మారతాడు. కబీర్ కూతురు డాక్టర్ ఆయేషా (జరా ఖాన్)తో ప్రేమలో పడతారు. ఓ సంఘటన వల్ల రెహమాన్‌పై కబీర్ దాడి చేస్తాు. అసలు దీనికి కారణమేంటి? శ్రీరామ్, కబీర్ గతమేంటి? మతం పేరుతో ఈ ఇద్దరు.. ప్రజల మధ్య ఎలా చిచ్చు పెడుతున్నారు? చివరకి ఏమైందనేదే సినిమా.

    (ఇదీ చదవండి: ‘శబరి’ మూవీ రివ్యూ)

    ఎలా ఉందంటే?

    మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటే అని చెప్పే సినిమా ఇది. మతం పేరుతో జరుగుతున్న దాడుల గురించి ప్రజలకు కనువిప్పు కలగజేసే మూవీ ఇది.  హీరో, చమ్మక్ చంద్ర క్యారెక్టర్స్ మధ్య మంచి కామెడీతో ఈ సినిమా సరదాగా మొదలవుతుంది. ఆ తర్వాత ముస్తాఫా, రవి, రహీం హత్యలతో ఒక వర్గంపై మరో వర్గం దాడులు చేసుకుంటున్న టైమ్ లో ముస్లిం లీగ్ పార్టీ పేరుతో కబీర్ ఖాన్, శక్తి సేన పార్టీ పేరుతో శ్రీరామ్ రాజకీయ రంగంలోకి దిగుతారు.  ఇక్కడి నుంచి మతం పేరుతో జరిగే రాజకీయ క్రీడను దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి ఇంట్రెస్టింగ్‌గా తీశారు. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. ఫస్టాఫ్‌లో వచ్చిన సందేహాలకు సెకండాఫ్‌లో ఒక్కొక్కటిగా సమాధానం దొరుకుతుంది. క్లైమాక్స్ ఆసక్తికరంగా అనిపిస్తుంది.

    హీరోగా రాజ్ భీమ్ రెడ్డి ఆకట్టుకున్నాడు. హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ఎమోషన్ ఉంటుంది. ఫైట్లు బాగానే తీశారు. హీరోయిన్ జరా ఖాన్ ఉన్నంతలో పర్వాలేదనిపించింది. శ్రీరామ్‌గా రామరాజు, కబీర్ ఖాన్‌గా  ముక్తార్ ఖాన్ ఓకే. టెక్నికల్ విషయాలకొస్తే నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, సంగీతం, దర్శకత్వం ఇలా అందరూ తమ తమ పనికి పూర్తి న్యాయం చేశారు.

    (ఇదీ చదవండి: సుహాస్ 'ప్రసన్న వదనం' రివ్యూ.. మరో హిట్‌ పడినట్టేనా?)

  • టైటిల్‌: ఆ.. ఒక్కటి అడక్కు
    నటీనటులు: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, జెమీ లివర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, గౌతమి, మురళీ శర్మ, రవికృష్ణ, అజయ్ తదితరులు
    నిర్మాత: రాజీవ్‌ చిలక
    రచన-దర్శకత్వం: మల్లి అంకం
    సంగీతం: గోపీ సుందర్‌
    సినిమాటోగ్రఫీ:సూర్య
    విడుదల తేది: మే 3, 2024


    కథేంటంటే..
    గణ అలియాస్‌ గణేష్‌(అల్లరి నరేశ్‌) ప్రభుత్వ ఉద్యోగి. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో పని చేస్తుంటాడు. జీవితంలో సెటిల్‌ అయ్యాక పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే ఆయన ఫ్యామిలీ సెటిల్‌ అయ్యేలోపు 30 ఏళ్ల వయసుకు వస్తాడు. తమ్ముడికి(రవి కృష్ణ) ముందే పెళ్లి అవ్వడం.. వయసు ఎక్కువ ఉండడం చేత గణకి పెళ్లి సంబంధాలు దొరకవు. చివరకు హ్యాపీ మాట్రీమోనీలో పేరు నమోదు చేసుకుంటాడు. దాని ద్వారా సిద్ధి(ఫరియా అబ్దుల్లా) పరిచయం అవుతుంది. ఆమెను చూసిన వెంటనే పెళ్లికి ఓకే చెప్పేస్తాడు. కానీ సిద్ధి మాత్రం నో చెబుతుంది. అలా అని అతనికి దూరంగా ఉండదు. గణ తన తల్లిని సంతోష పెట్టేందుకు సిద్ధి తన ప్రియురాలు అని పరిచయం చేస్తాడు. ఆ మరుసటి రోజే సిద్ధికి సంబంధించి ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటకు వస్తుంది. పెళ్లి పేరుతో కుర్రాళ్లను మోసం చేస్తుందనే విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సిద్ధి నిజంగానే మోసం చేసిందా? పెళ్లి సాకుతో హ్యాపీ మాట్రీమోనీ సంస్థ చేస్తున్న మోసాలేంటి? వాటిని గణ ఎలా బయటకు తీశాడు. చివరకు గణ పెళ్లి జరిగిందా లేదా? అనేదే మిగతా కథ. 

    ఎలా ఉందంటే..
    హీరోకి ఓ మంచి ఉద్యోగం..కానీ పెళ్లి కాదు. వయసు పెరిగిపోవడంతో పిల్ల దొరకదు. హీరోయిన్‌తో ప్రేమ..ఆమెకో ఫ్లాష్‌బ్యాక్‌.. క్లైమాక్స్‌లో ఇద్దరికి పెళ్లి..ఇది వెంకటేశ్‌ హీరోగా నటించిన ‘మల్లేశ్వరి’మూవీ స్టోరి. కథగా చూస్తే ఇది చాలా సింపుల్‌ కానీ.. త్రివిక్రమ్‌ రాసిన పంచులు..కామెడీ సీన్లు ఫ్రెష్‌ ఫీలింగ్‌ని కలిగించాయి. ఆ ఒక్కటి అడక్కు మూవీ కథ కూడా దాదాపు ఇదే. 

    కానీ మల్లేశ్వరిలో వర్కౌట్‌ అయిన కామెడీ ఇందులో కాలేదు. పైగా సినిమాకు కామెడీ టైటిల్‌ పెట్టి..కథంతా సీరియస్‌గా నడిపించారు. కామెడీ కోసం పెట్టిన సన్నివేశాలు అంతగా పేలలేదు. కానీ మ్యాట్రిమోసీ సంస్థలు చేసే మోసాలు.. పెళ్లి కానీ యువతీయువకుల మనోభావాలతో సదరు సంస్థలు ఎలా ఆడుకుంటున్నాయి? అనే అంశాలను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. సీరియస్‌ ఇష్యూని కామెడీ వేలో చూపించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు మల్లి అంకం. అయితే ఆ ప్రయత్నంలో పూర్తిగా సఫలం కాలేదు. కథను అటు కామెడీగాను.. ఇటు సీరియస్‌గాను నడిపించలేకపోయాడు. 

    ఎలా ఉందంటే..
    హీరోకి ఓ మంచి ఉద్యోగం..కానీ పెళ్లి కాదు. వయసు పెరిగిపోవడంతో పిల్ల దొరకదు. హీరోయిన్‌తో ప్రేమ..ఆమెకో ఫ్లాష్‌బ్యాక్‌.. క్లైమాక్స్‌లో ఇద్దరికి పెళ్లి..ఇది వెంకటేశ్‌ హీరోగా నటించిన ‘మల్లేశ్వరి’మూవీ స్టోరి. కథగా చూస్తే ఇది చాలా సింపుల్‌ కానీ.. త్రివిక్రమ్‌ రాసిన పంచులు..కామెడీ సీన్లు ఫ్రెష్‌ ఫీలింగ్‌ని కలిగించాయి.  ఆ ఒక్కటి అడక్కు మూవీ కథ కూడా దాదాపు ఇదే. కానీ మల్లేశ్వరిలో వర్కౌట్‌ అయిన కామెడీ ఇందులో కాలేదు. పైగా సినిమాకు కామెడీ టైటిల్‌ పెట్టి..కథంతా సీరియస్‌గా నడిపించారు. 

    కామెడీ కోసం పెట్టిన సన్నివేశాలు అంతగా పేలలేదు. కానీ మ్యాట్రిమోసీ సంస్థలు చేసే మోసాలు.. పెళ్లి కానీ యువతీయువకుల మనోభావాలతో సదరు సంస్థలు ఎలా ఆడుకుంటున్నాయి? అనే అంశాలను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. సీరియస్‌ ఇష్యూని కామెడీ వేలో చూపించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు మల్లి అంకం. అయితే ఆ ప్రయత్నంలో పూర్తిగా సఫలం కాలేదు. కథను అటు కామెడీగాను.. ఇటు సీరియస్‌గాను నడిపించలేక

    ఓ యాక్షన్‌ సీన్‌తో హీరోని పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. మాస్‌ హీరో రేంజ్‌లో బిల్డప్‌ ఇప్పించి.. కాసేపటికే రౌడీలతో కామెడీ చేయించారు. ఆ కామెడీలో కొత్తదనం కనిపించదు. బావకు పెళ్లి చేయాలనే తపనతో మరదలు(తమ్ముడు భార్య) చేసే హంగామా నవ్వులు పూయిస్తుంది. సిద్దిగా పరియా అబ్దుల్లా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో వేగం పుంజుకుంటుంది. 

    బీచ్‌లో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ రొటీన్‌గానే అనిపిస్తాయి. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థం కథంతా ఎక్కువగా సీరియస్‌ మూడ్‌లోనే సాగుతుంది. సిద్ధి పాత్రకు సంబంధించిన ట్విస్ట్‌ రివీల్‌ అవ్వడం.. మ్యాట్రిమోనీ సంస్థ చేసే మోసాలను బయటపడడం.. ఇవన్నీ కథపై ఆసక్తిని పెంచేలా చేస్తాయి. 

    ఫేక్‌ పెళ్లి కూతురు అనే కాన్సెప్ట్‌ కొత్తగా అనిపిస్తుంది. కానీ కొన్ని కామెడీ సీన్స్‌ మాత్రం నవ్వులు తెప్పించకపోగా.. చిరాకు కలిగిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగి అయిన హీరో ఈజీగా మోసపోవడం.. పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం కన్విన్సింగ్‌గా అనిపించదు.  కొన్ని చోట్ల కామెడీ పండించడానికి స్కోప్‌ ఉన్నా.. డైరెక్టర్‌ సరిగా వాడుకోలేకపోడు. క్లైమాక్స్‌లో ఇచ్చిన సందేశం ఆలోచింపజేస్తుంది. 

    ఎవరెలా చేశారంటే..
    అల్లరి నరేశ్‌కు కామెడీ పాత్రల్లో నటించడం వెన్నతో పెట్టిన విద్య. ఆయన కామెడీ టైమింగ్‌ అదిరిపోతుంది. ఇందులో గణ పాత్రలో చక్కగా నటించాడు. కాకపోతే దర్శకుడు మల్లి నరేశ్‌ని సరిగా వాడుకోలేకపోయాడు. సిద్ధిగా ఫరియా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది.  

    బావకు పెళ్లి చేయాలని తపన పడే మరదలిగా జెమీ లివర్‌ పండించిన కామెడీ నవ్వులు పూయిస్తుంది. వెన్నెల కిశోర్‌, హర్షల కామెడీ బాగుంది. పృథ్వి, మురళీ శర్మ, గౌతమితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

    సాంకేతికంగా సినిమా బాగుంది.  గోపీసుందర్‌ పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. సూర్య సినిమాటోగ్రఫీ పర్వాలేదు.అబ్బూరి రవి సంభాషణలు కొన్ని చోట్ల ఆలోచింపజేస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.  

  • లోక్‌సభ సీట్లపరంగా దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో మొత్తం 39 స్థానాలకు (ఏప్రిల్‌ 19) తొలి దశలోనే ఎన్నికలు జరిగాయి. ఎంతో ఉత్కంఠతో కూడిన ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే,బీజేపీ ప్రధానంగా పోటీలో ఉన్నాయి. అయితే తమిళనాడు లోక్‌సభ ఎన్నికలకు ఓటు వేసేందుకు నటులు రజనీకాంత్, అజిత్ కుమార్, శివకార్తికేయన్, సూర్య,కార్తీ, ధనుష్‌ వంటి స్టార్‌ హీరోలు అందరూ  పోలింగ్ బూత్‌లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ ఆ సమయంలో సూర్య సతీమణి జ్యోతిక మాత్రం తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. అందుకు సంబంధించిన కారణాలను ఆమె తాజాగా స్పందించింది. ఇదే క్రమంలో తన పొలిటికల్‌ ఎంట్రీపై మనసు విప్పి మాట్లాడింది.

    సౌత్‌ ఇండియాలో టాప్‌ హీరోగా గుర్తింపు ఉన్న సూర్యతో జ్యోతిక పెళ్లి తర్వాత సినిమాలకు  కాస్త బ్రేక్‌ ఇచ్చారు. 2015లో మళ్లీ '36 ఏళ్ల వయసులో' అనే సినిమాతో తెరపైకి వచ్చి సూపర్‌ హిట్‌ కొట్టారు. ఈ మూవీ తర్వాత మళ్లీ ఆమె పలు ప్రాజెక్ట్‌లతో పుల్‌ బిజీ అయ్యారు. ప్రస్తుతం  జ్యోతిక 'శ్రీకాంత్' అనే హిందీ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో జ్యోతిక బిజీగా ఉన్నారు. 

    తాజాగా చెన్నైలో జరిగిన ఈ సినిమా తమిళ వెర్షన్ ప్రెస్ మీట్‌లో జ్యోతిక పాల్గొన్నారు. పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు జ్యోతిక స్పందిస్తూ.. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయకపోవడంపై వివరణ ఇచ్చారు. 'గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా నా ఓటు హక్కును వినియోగించుకుంటూనే వచ్చాను. కానీ, కొన్నిసార్లు నేను అత్యవసరమైన పనుల వల్ల చెన్నైకి అందుబాటులో లేకుండా పోవచ్చు. ఆ సమయంలో నేను ఓటు వేయలేను. ఈసారి నేను అనారోగ్యంతో ఉన్నాను. ఇది వ్యక్తిగత విషయం. అందుకే ఓటు వేయలేదు. దానిని అందరూ గౌరవించాలి.' అని అన్నారు. 

    జ్యోతిక ఎక్కువగా సోషల్‌ కంటెంట్‌ ఉన్న సినిమాలనే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీంతో రాజకీయాల్లోకి రావచ్చు కదా అని మీడియా వారు ప్రశ్నించారు. అందుకు ఆసక్తి లేదని ఆమె సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

  • మోనిత‌.. బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు బాగా గుర్తుండిపోయిన పేరు. కార్తీక‌దీపం సీరియ‌ల్‌లో విల‌న్ క్యారెక్ట‌ర్‌తో బాగా ఫేమ‌స్ అయిందీ బ్యూటీ. త‌ర్వాత తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజ‌న్‌లో అడుగుపెట్టి మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఈ రియాలిటీ షోలోనే తాను ప్రేమ‌లో ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. న‌టుడు య‌శ్వంత్‌తో డేటింగ్‌లో ఉన్న‌ట్లు తెలిపింది. వీరిద్ద‌రూ కార్తీక‌దీపం సీరియ‌ల్‌లో క‌లిసి న‌టించారు. షార్ట్ ఫిలింస్‌లోనూ న‌టించారు. ఆ స‌మ‌యంలోనే వీరి మ‌ధ్య ప్రేమ చిగురించింది.

    నిశ్చితార్థం
    బిగ్‌బాస్ అయిపోగానే పెళ్లికి రెడీ అంటూ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందీ బ్యూటీ. అందులో భాగంగానే జ‌న‌వ‌రిలో పెద్ద‌ల స‌మ‌క్షంలో పెళ్లి చూపులు నిర్వ‌హించారు. ఇరు కుటుంబాలు తాంబూలాలు మార్చుకున్నారు. ఎంగేజ్‌మెంట్‌కు ముహూర్తం పెట్టుకున్నారు. తాజాగా వీరి ఎంగేజ్‌మెంట్ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం కోసం ఇలా రెడీ అయ్యామంటూ శోభ యూట్యూబ్‌లో ఓ వీడియో షేర్‌ చేసింది.

    చిరున‌వ్వుతో ప‌ల‌క‌రింపు
    చేతుల నిండా మెహందీ వేసుకుని ఒంటి నిండా న‌గ‌ల‌తో అందంగా ముస్తాబైంది. ప‌సుపు రంగు బ్లౌజ్‌కు మ‌గ్గం వర్క్ వేయించింది. దీనికి లైట్ క‌ల‌ర్‌లో ఉన్న చీర‌ను మ్యాచ్ చేసింది. త‌న ఎంగేజ్‌మెంట్ కోసం వ‌చ్చిన అందరినీ చిరున‌వ్వుతో ప‌ల‌కరించింది. ఈ వీడియో చూసిన అభిమానులు శోభా శెట్టికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

     

        

  • డార్లింగ్ ప్రభాస్‌కి 'సలార్' స్పెషల్ మూవీ. ఎందుకంటే 'బాహుబలి' తర్వాత సరైన హిట్ కోసం చూస్తున్న ఇతడికి.. ఈ మూవీ సక్సెస్ సరికొత్త ఎనర్జీ ఇచ్చింది. గతేడాది థియేటర్లలో రిలీజైనప్పుడు అద్భుతమైన రెస్పాన్స్ రాగా.. కొన్నిరోజుల క్రితం టీవీలో వచ్చినప్పుడు మాత్రం ఊహించనంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ విషయమే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏంటి సంగతి?

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'పుష్ప' విలన్ హిట్ సినిమా.. తెలుగులో డైరెక్ట్ రిలీజ్)

    ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తీసిన సినిమా 'సలార్'. 'కేజీఎఫ్' తర్వాత సెట్స్‌పైకి వెళ్లిన ఈ మూవీ.. చాలాసార్లు వాయిదాలు పడుతూ గతేడాది డిసెంబరులో థియేటర్లలో రిలీజైంది. హిట్ టాక్ తెచ్చుకుని, రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బిగ్ స్క్రీన్‌పై సక్సెస్ అందుకున్న ఈ చిత్రం.. బుల్లితెరపై మాత్రం ఫెయిలైంది. ఏప్రిల్ 21న ప్రముఖ టీవీ ఛానెల్‌లో ప్రసారం చేయగా కేవలం 6.52 టీఆర్పీ వచ్చింది. తాజాగా ఈ విషయం బయటపడింది.

    థియేటర్లలో 'సలార్'ని బాగానే చూశారు. కానీ టీవీల్లోకి వచ్చేసరికి దీన్ని లైట్ తీసుకున్నారు. ఎందుకంటే థియేటర్లలో ఫ్లాప్ అయిన ఆదికేశ (10.47), స్కంద (8.11)తో పాటు ఓ మాదిరిగి ఆడిన నా సామి రంగ (8.08), మంగళవారం (7.21), బిచ్చగాడు 2 (7.12) చిత్రాలకు కూడా 'సలార్' కంటే ఎక్కువ టీఆర్పీ రావడం అవాక్కయ్యేలా చేస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ హవా నడుస్తోంది. దీని వల్ల టీఆర్పీ తగ్గిందని తెలుస్తోంది. లేదంటే ఎక్కువ వచ్చేదేమో?

    (ఇదీ చదవండి: ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్)

  • సెలబ్రిటీల జీవిత చరిత్రలు వెండితెరకెక్కడం సహజమే. అలా ఇప్పటికే రాజకీయ రంగంలో మహాత్మాగాంధీ, కామరాజర్, జయలలిత,వైఎస్‌ఆర్‌.. క్రీడా రంగంలో మహేంద్రసింగ్‌ ధోని వంటి పలువురు బయోపిక్స్‌ సినిమాగా రూపొందాయి. ఇందిరాగాంధీ, సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. కాగా తాజాగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ బయోపిక్‌ను చిత్రంగా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయనే ప్రచారం జోరందుకుంది.
     
    కర్ణాటకకు చెందిన శివాజీరావ్‌ గైక్వాడ్‌ అనే ఒక సాధారణ బస్సు కండెక్టర్‌ ఇవాళ దక్షిణ భారత సినీ రంగంలో సూపర్‌స్టార్‌గా రాణిస్తున్నారు. అయితే ఆయన ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నది అందరికీ తెలిసిందే. రజనీకాంత్‌ జీవిత పయనం చాలా మందికి స్ఫూర్తి అనే చెప్పాలి. కాగా ఈయన జీవిత చరిత్రను ఇప్పుడు వెండి తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా వార్త. హిందీలో పలు చిత్రాలను నిర్మించిన సుజిత్‌ నడియద్వాలా నటుడు రజనీకాంత్‌ బయోపిక్‌ను సినిమాగా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. 
     
    ఈయన ఇటీవల నటుడు రజనీకాంత్‌ను కలిసి ఈ విషయమై చర్చించినట్లు తెలిసింది. ఆయన అనుమతితో ఈ స్క్రిప్ట్‌ వర్క్‌ వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరూ? రజనీకాంత్‌గా ఎవరు నటిస్తారూ? అన్న విషయాల గురించి ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తం మీద రజనీకాంత్‌ బయోపిక్‌ తెరకెక్కనుందన్న ప్రచారం మాత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. మరి ఇది హిందీలోనే రూపొందుతుందా? లేక పాన్‌ ఇండియా చిత్రంగా రానుందా? అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

     
  • ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తోన్న తాజా చిత్రం పుష్ప-2: ది రూల్. ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ పుష్పకు సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్, గ్లింప్స్‌ రిలీజ్‌ చేసన మేకర్స్‌ మరో సాలిడ్‌ అప్‌డేట్‌తో అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ను ఇటీవలే రిలీజ్‌ చేశారు.

    ప్రస్తుతం ఈ సాంగ్‌ సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. పుష్ప.. పుష్ప.. పుష్ప.. అంటూ సాగే పాట ఆడియన్స్‌ను ఊర్రూతలూగిస్తోంది. అయితే ఈ సాంగ్‌లో బన్నీ చేసిన షూ డ్రాప్ స్టెప్‌ విపరీతమైన క్రేజ్‌ దక్కించుకుంటోంది. ఈ స్టెప్ వేస్తున్న‌ వీడియోను చూసిన పుష్ప వీరాభిమాని డేవిడ్ వార్నర్‌ రిప్లై ఇచ్చారు. ఓ డియర్.. ఎంత బాగా చేశావ్.. ఇప్పుడు నేను కూడా ఆ స్టెప్‌ ప్రాక్టీస్‌ కోసం కొంత వర్క్ చేయాలి' అంటూ కామెంట్ చేశాడు.

    అయితే డేవిడ్ వార్నర్‌ కామెంట్‌కు బన్నీ కూడా రిప్లై ఇచ్చాడు. మనిద్దరం కలిసినప్పుడు తప్పకుండా హుక్ స్టెప్ నేర్పిస్తానని అల్లు అర్జున్‌ రాసుకొచ్చారు. 'ఇది చాలా సులభం...మనం కలిసినప్పుడు ఎలా చేయాలో నీకు చూపిస్తా' అని కామెంట్స్‌లో రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. కాగా.. పుష్ప సినిమా నుంచి ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌.. అల్లు అర్జున్‌కు నటనకు ఫిదా అయ్యారు. అప్పటి నుంచి బన్నీకి వీరాభిమాని అయిపోయారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పుష్ప డైలాగ్స్‌తో అలరిస్తుంటారు. కాగా.. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. 
     

Crime

  • సాక్షి,హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి జ్యువెల్లరీని  పట్టుకున్నారు. శుక్రవారం(మే3)న పోలీసులు విమానాశ్రయం సమీపంలో తనిఖీలు చేస్తుండగా ఓ కారులో 34 కిలోల  బంగారం, 40 కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి.

    సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆభరణాలను ముంబై నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు. 

  • గత కొన్ని రోజులుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో అంశం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ‘డీప్ ఫేక్ మార్ఫింగ్ వీడియో’ కేసులో అరుణ్ రెడ్డిని ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

    అరుణ్ రెడ్డిని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్' అనే ఎక్స్ (ట్విటర్) అకౌంట్ హ్యాండిల్ చేసేవారు. ఇటీవల విడుదలైన డీప్ ఫేక్ మార్ఫింగ్ వీడియో దేశంలోని రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగా బీజేపీ నిలుస్తుందని కేంద్ర హోం మంత్రి చెప్పినట్లు వినిపిస్తోంది. ఈ వైరల్ వీడియో క్లిప్ ఫేక్ అని బీజేపీ స్పష్టం చేసింది.

    డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తరువాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ)లోని వివిధ సెక్షన్ల కింద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నలుగురు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సభ్యులకు (శివ కుమార్ అంబాల, అస్మా తస్లీమ్, సతీష్ మన్నె, నవీన్) పోలీసులు గతంలో సమన్లు ​​జారీ చేశారు.

    అయితే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మార్ఫింగ్‌ వీడియో పోస్ట్‌ చేసి అరెస్టయిన ఐదుగురు కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా ప్రతినిధులకు నాంపల్లి కోర్టు బెయిల్‌ ఈ రోజు (శుక్రవారం) కండిషనల్‌ బెయిల్‌​ మంజూరు చేసింది. అయితే ఇప్పుడు అరుణ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

  • సాక్షి,హైదరాబాద్‌: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మార్ఫింగ్‌ వీడియో పోస్ట్‌ చేసి అరెస్టయిన ఐదుగురు కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా ప్రతినిధులకు నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. టీపీసీసీ సోషల్ మీడియా టీమ్ మెంబర్స్ పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీష్, నవీన్, ఆస్మా తస్లీమ్, గీతలకు కోర్టు కండిషనల్‌ బెయిల్‌​ ఇచ్చింది.

    పది వేల పూచీకత్తుతో కూడిన రెండు ష్యూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నిందితులు ప్రతీ సోమ, శుక్ర వారాలు కేసు విచారణ అధికారుల ముందు హాజరు కావాలని కోరింది. 

    కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా ప్రతినిధులు  ఐదుగురు వాట్సాప్‌లో వచ్చిన అమిత్‌ షా మార్ఫింగ్‌ వీడియోలను కావాలనే ట్విటర్‌లో పోస్టు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలన్న ఉద్దేశంతో ఇలాంటి వీడియోలు పోస్టు చేసినట్లు ప్రాథమికంగా తేలినందున ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 

National

  • ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌ రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మే నెల రాకతో ఎండలు మరింత ముదరడంతో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

    ఈ తరుణంలో తూర్పు ప్రాంతంలో ఉరుములతో కూడిన గాలివాన కారణంగా రానున్న మూడు రోజుల ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్‌లలో వేడిగాలులు తగ్గుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం తెలిపింది.

    రానున్న మూడు రోజుల పాటు వేడిగాలులు ఈ మూడు రాష్ట్రాల్లో కొనసాగుతాయని ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్‌ నరేష్‌ కుమార్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో రాబోయే నాలుగు రోజుల పాటు ఇలాంటి వేడి వాతావరణం కొనసాగుతుందని వెల్లడించారు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కోస్తా కర్ణాటకలో వడగాలులు వీస్తాయని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
     

  • బెంగళూరు: ఒక మహిళ కిడ్నాప్‌ కేసులో మాజీ మంత్రి హెచ్‌డి రేవణ్ణ ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేశారు. బెయిల్‌ కోసం బెంగళూరు సెషన్స్‌కోర్టులో శుక్రవారం(మే3) పిటిషన్‌ వేశారు. 

    తన తల్లిని రేవణ్ణ ఎత్తుకుపోయారని రేవణ్ణ ఫామ్‌హౌజ్‌లో పనిచేసే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరులోని కేఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో రేవణ్ణపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక వేధింపుల(సెక్స్‌ స్కాండల్‌) వీడియోల కేసులో రేవణ్ణ శుక్రవారం సిట్‌ ముందుకు రావాల్సి ఉండగా ఆయన గైర్హాజరయ్యారు. 

  • న్యూఢిల్లీ:  అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కి సుప్రీంకోర్టు వరుస షాకులిస్తోంది. లిక్కర్‌ కేసులో తన అరెస్టు అక్రమమని కేజ్రీవాల్‌ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం(మే 3) విచారించింది. ఎన్నికలున్న నేపథ్యంలో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ ఇచ్చే అంశాన్ని తాము పరిశీలిస్తామని, దీనిపై వాదన వినిపించేందుకు సిద్ధమై రావాలని సుప్రీంకోర్టు ఈడీని కోరింది.

    పిటిషన్‌పై మళ్లీ మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది. ‘మేం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌  ఇవ్వొచ్చు. ఇవ్వకపోవచ్చు. అయితే మధ్యంతర బెయిల్‌ ఇచ్చే అంశాన్ని మాత్రం పరిశీలిస్తాం. మా నిర్ణయంపై ఎవరూ ఆశ్చర్యపోవద్దు.

     ఒకవేళ బెయిల్‌ ఇస్తే ఎలాంటి షరతులు విధించాలన్నది ఈడీ చెప్పాలి. కేజ్రీవాల్‌ సీఎంగా ఏవైనా ఫైల్స్‌పై సంతకం చేయాల్సి ఉందా అన్నదానిని కూడా ఈడీ పరిశీలించాలి’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 

    కాగా, లిక్కర్‌ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సందర్భంపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఈడీని ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ అంశంపైనే శుక్రవారం కోర్టు ప్రధానంగా విచారణ జరిపింది. లిక్కర్‌స్కామ్‌ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్టు చేసిన విషయం​ తెలిసిందే.  

  • మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాకు  ఊరట లభించింది. ట్రయల్ కోర్టు ఆదేశాల ప్రకారం..  సిసోడియా తన భార్యను వారానికి ఒకసారి కస్టడీలో కలుసుకోవచ్చని కోర్టు తెలిపింది.

    సిసోడియా బెయిల్‌ కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై జస్టిస్ స్వర్ణ కాంత శర్మ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ ప్రతి స్పందనలు కోరింది. విచారణను మే 8కి వాయిదా వేసింది.

    ఇప్పటికే మద్యం పాలసీ కేసులో గతేడాది ఫిబ్రవరి 26 నుంచి జైలు శిక్షను అనుభవిస్తున్న సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ బెయిల్‌ పిటిషన్‌ను ఏప్రిల్‌ 30న రౌస్‌ అవెన్యూ కోర్టు కొట్టివేసింది.

    ఈ కేసుకులో సీబీఐ, ఈడీలకు ప్రత్యేక న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న కావేరీ బవేజా.. మద్యం పాలసీ కేసు విచారణ సమయంలో బెయిల్‌ ఇవ్వడం సరైందని కాదని, సిసోడియాకు బెయిల్‌ ఇచ్చేందుకు ఒప్పుకోలేదు.  

    అయితే ఏప్రిల్ 30 నాటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ, మనీష్ సిసోడియా తరపున న్యాయవాదులు గురువారం బెయిల్ కోరుతూ అత్యవసర విచారణ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

    మనీష్ సిసోడియా మధ్యంతర దరఖాస్తులో అనారోగ్యంతో బాధపడుతున్న భార్యాను వారానికి ఒకసారి చూసుకోవచ్చంటూ ట్రయల్ కోర్టు ఆదేశాలను కొనసాగించాలని కోర్టును కోరారు.

    తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ పీఎస్‌ అరోరాలతో కూడిన ధర్మాసనం సిసోడియా పిటిషన్‌ను విచారించింది. ఈ సందర్భంగా ట్రయల్ కోర్టు ఆదేశాలను కొనసాగిస్తే దర్యాప్తు సంస్థకు అభ్యంతరం లేదని ఈడీ తరపు న్యాయవాది తెలిపారు. 

  • న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఒకే పేరుతో ఉన్న అభ్యర్థులు ఒకే స్థానం నుంచి పోటీ చేయకుండా నిషేధం విధించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాజకీయ నేతల పేర్లతో ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపలేమని స్పష్టం చేసింది.

    ఒకే నియోజకవర్గంలో ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు పోటీచేయకుండా అనుమతించాలని కోరుతూ పిటిషనర్ సాబు స్టీఫెన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కీల స్థానాల్లో ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు డూప్లికేట్‌ అభ్యర్ధులు ఇలా చేస్తున్నారని, ఎక్కువ సంఖ్యలో ఒకే పేరుతో ఉన్న స్వతంత్రులు పోటీ చేయడం వల్ల పేరున్న రాజకీయ నేతలు స్వల్ప తేడాతో ఎన్నికల్లో ఓడిపోతున్నారని పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాతమైన ఎన్నికల ప్రక్రియ కోసం ఈ ధోరణిని ఆపడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు.


    ఈ పిటిషన్‌ ను పరిశఋలించిన జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌ ధర్మాసనం.. దీనిపై విచారణకు నిరాకరించింది. ‘తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆ రకమైన పేర్లను పెట్టినప్పుడు ఎన్నికల్లో పోటీకి అదెలా అడ్డంకి అవుతుంది? ఒకవేళ రాహుల్‌గాంధీ, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వంటి పేర్లు పెట్టుకుంటే వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలా అడ్డుకుంటాం?అది వాళ్ల హక్కులను ఉల్లంఘించినట్లు కాదా?’ అని ప్రశ్నించింది. పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు  కోర్టు అనుమతించింది.
     

  • సాక్షి, ఢిల్లీ: నాలుగో విడతలో లోక్‌సభ ఎన్నికలకు మే 13న పోలింగ్‌ జరుగనుంది. ఇక, నాలుగో విడతలో పది రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగునున్నాయి. లోక్‌సభ ఎన్నికల బరిలో 1717 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పది రాష్ట్రాల్లో 96 పార్లమెంట్‌ స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది.

    ఇక, పదో విడతలోనే ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి. కాగా, లోక్‌సభ ఎన్నికల బరిలో ఏపీలో మొత్తం 25 పార్లమెంట్‌ స్థానాలకు గాను 454 మంది పోటీలో నిలిచారు. అలాగే, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు గాను 525 మంది పోటీలో ఉన్నారు. మే 13న తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ జరుగనుంది.

    ఇక, నాలుగో విడతలో మిగిలిన ఎనిమిది రాష్ట్రాల్లో ఇలా..  

    • బీహార్‌లో ఐదు పార్లమెంట్ స్థానాలకు 55 మంది పోటీ

    • జమ్మూ కాశ్మీర్‌లో ఒక్క పార్లమెంటు స్థానానికి బరిలో 24 మంది

    • జార్ఖండ్‌లో నాలుగు పార్లమెంట్ స్థానాలకు 45 మంది పోటీ

    • మధ్యప్రదేశ్‌లో ఎనిమిది పార్లమెంటు స్థానాలకు  74 మంది పోటీ

    • మహారాష్ట్రలో 11 పార్లమెంటు స్థానాలకు జరగనున్న బరిలో 209 మంది

    • ఒడిశాలో నాలుగు పార్లమెంట్ స్థానాలకు  బరిలో 37 మంది

    • ఉత్తరప్రదేశ్‌లో 13 స్థానాలకు బరిలో 130 మంది

    • వెస్ట్ బెంగాల్‌లో ఎనిమిది పార్లమెంట్ స్థానాలకు 75 మంది.

Business

  • సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే 'ఆనంద్ మహీంద్రా'.. తాజాగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

    ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో పెద్ద ఫర్నిచర్‌ను.. ఒక చిన్న స్కూటర్ మీద తీసుకెళ్లడం చూడవచ్చు. ఈ వీడియో షేర్ చేస్తూ.. ఇది ఫుడ్ కాదు, కిరాణా సామాగ్రి కాదు.. సర్వీస్ అంటే ఇలా ఉంటుందా అని నేను ఊహిస్తున్నాను అంటూ ఓ ఎమోజీ యాడ్ చేశారు.

    నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో ఇప్పటికే వేలసంఖ్యలో వ్యూవ్స్ పొందింది. రెండు వేలు కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో చూపరులను తప్పకుండా ఆశ్చర్యానికి గురి చేస్తుందని భావిస్తున్నాము.

  • మీరు ఉద్యోగం చేస్తున్నారా? చాలిచాలనీ జీతంతో ఇబ్బంది పడుతున్నారా? ఎక్కువ జీతం కావాలని కోరుకుంటున్నారా? అయితే ఈ సలహా పాటిస్తే మీ ప్రతిభకు తగ్గ వేతనం పొందొచ్చు.  

    డెహ్రడూన్‌కు చెందిన ఐటీ ఉద్యోగి అక్షయ్‌ సైనీ ఉద్యోగులకు అప్రైజల్‌ సీజన్‌పై  అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో కార్పొరేట్‌ కంపెనీల గురించి పచ్చి నిజాల్ని వెల్లడించారు. ప్రస్తుతం ఆ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ అక్షయ్‌ సైనీ ఏం చెప్పారంటే

    మీరు ఎక్కువ జీతం కావాలంటే
    మీరు ఎక్కువ జీతం కావాలంటే కంపెనీలు మారడమే సరైన నిర్ణయం. భారత్‌లో అత్యధిక కంపెనీల్లో ఇంట్రర్నల్‌ అప్రైజల్స్‌ ఓ జోక్‌గా అభివర్ణించారు. అంతేకాదు, సగటు కంటే ఎక్కువ ఉన్న ఇంజనీర్లు, డబుల్‌ డిజిట్‌ శాలరీ హైక్‌ను పొందలేదు. మీ వేతనం తక్కువగా ఉన్నట్లయితే, అతిగా ఆలోచించకండి. వెంటనే ఉద్యోగం మారండి! అంటూ తన పోస్ట్‌లో తెలిపారు.  

    తక్కువ జీతంతో మీ కెరీర్‌ను ప్రారంభిస్తే
    మరో కఠినమైన నిజం ఏమిటంటే, మీరు తక్కువ జీతంతో మీ కెరీర్‌ను ప్రారంభిస్తే, అధిక జీతం (సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా) పొందాలంటే మీరు ఉద్యోగాలు మారాల్సి ఉంటుంది. కావాలంటే మీరే చూడండి తక్కువ వేతనంతో తమ కెరియర్‌ను ప్రారంభించిన ఐటీ ఉద్యోగులు జీతాలు పెంచుకునేందుకు తరుచూ ఉద్యోగాలు మారుతుంటారు.  

    తక్కువ జీతం ఇచ్చే ఉద్యోగంలో ఇరుక్కుపోయి
    కాబట్టి, మీరు తక్కువ జీతం ఇచ్చే ఉద్యోగంలో ఇరుక్కుపోయి శాలరీ హైక్‌, డిజిగ్నేషన్‌ కోసం ప్రయత్నించి విఫలమైతే మీరు ఉద్యోగం మారడం మంచింది. మంచి పని ఎంత ముఖ్యమో జీతం కూడా అంతే ముఖ్యం చివరగా గుర్తుంచుకోండి. మీకు తక్కువ జీతం ఉంటే అది మీ తప్పు అని అక్షయ్‌ సైనీ పేర్కొన్నారు.

    అక్షయ్‌ సైనీ అభిప్రాయాలపై నెటిజన్లు సైతం మద్దతు తెలుపుతున్నారు. ఉద్యోగం చేస్తూ ఎక్కువ జీతం పొందాలంటే కంపెనీలు మారడమే సరైన నిర్ణయమని, ఎక్కువ జీతం పొందేందుకు తాము కూడా సంస్థలు మారినట్లు చెబుతున్నారు. 

  • దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 191 పాయింట్లు నష్టపోయి 22,456 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 732 పాయింట్లు దిగజారి 73,878 వద్దకు చేరింది.

    సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎం అండ్‌ ఎం, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, విప్రో కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.

    ఎల్‌ అండ్‌ టీ, మారుతీ సుజుకీ, భారతీ సుజుకీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, నెస్లే, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టైటాన్‌, ఎన్‌టీపీసీ, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఐటీసీ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

    (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

  • నేపాల్‌ ప్రైవేట్‌ ఇంటర్నెట్‌ ప్రొవైడర్లు భారతీయ కంపెనీలకు చెల్లింపులు చేయకపోవడంతో ఇంటర్నెట్‌ సేవలు నిలిచాయి. నేపాల్‌కు చెందిన అప్‌స్ట్రీమ్ భాగస్వాములు బకాయిలు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు నేపాల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ (ఇస్పాన్‌) తెలిపింది.

    నేపాల్‌లోని ప్రైవేట్ ఇంటర్నెట్ కంపెనీలు గురువారం రాత్రి తమ సేవలను నిలిపేసినట్లు ఇస్పాన్‌ పేర్కొంది. ఇంటర్నెట్ మానిటర్ సంస్థ నెట్‌బ్లాక్స్ విడుదల చేసిన డేటా ప్రకారం..18 నేపాలీ ఇంటర్నెట్ ప్రొవైడర్లు ఐదు గంటలపాటు సర్వీసులను తగ్గించినట్లు, అందులో కొన్ని బ్యాండ్‌ విడ్త్‌ను పూర్తిగా తగ్గించినట్లు తేలింది. ఇంటర్నెట్‌ అంతరాయం కొనసాగవచ్చని, ఈ అంశం తమ పరిధిలో లేదని ఇస్పాన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సువాష్ ఖడ్కా తెలిపారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌ సేవలకు అధికప్రాధాన్యం ఉందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

    ఇదీ చదవండి:  భారత కంపెనీపై ‘టెస్లా’ ఫిర్యాదు.. ఏం జరిగిందంటే..

    స్థానిక బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్లు భారతీయ కంపెనీలకు సుమారు మూడు బిలియన్ నేపాలీ రూపాయలు (రూ.187 కోట్లు) బకాయిపడ్డారు. అయితే బయటిదేశాలకు డబ్బు బదిలీ చేయడానికి అక్కడి ప్రభుత్వం అనుమతించడం లేదు. ఇంటర్నెట్ ప్రొవైడర్లు పాత బకాయిలు చెల్లిస్తేనే సర్వీసులు అందిస్తామని కంపెనీలు చెబుతున్నాయి. కొంతకాలంగా ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇటీవల ఇంటర్నెట్‌ సర్వీసులు నిలిపేసినట్లు తెలిసింది. నేపాల్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ లెక్కల ప్రకారం ప్రైవేట్ ఇంటర్నెట్ కంపెనీలకు 10 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లున్నారని సమాచారం.

  • కొనుగోలు దారులకు శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ సమ్మర్‌ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌వాచ్‌లపై 95 శాతం, బ్లూటూత్‌ ఇయర్‌బడ్స్‌పై 95శాతం, ఇయర్‌ఫోన్‌లపై 95శాతం, నెక్‌ బ్యాండ్‌ ఇయర్‌ఫోన్స్‌పై 95 శాతం డిస్కౌంట్‌ పొందవచ్చారు.

    అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ 2024తో ప్రారంభమైన ఈ సేల్‌లో అన్నీ రకాల ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్‌ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు రూ.15,000, రూ.25,000 సెగ్మెంట్‌ ధరల్లో ఉన్న ఫోన్‌లపై ప్రత్యేక ఆఫర్లను కొనుగోలు దారులు సొంతం చేసుకోవచ్చంటూ అమెజాన్‌ ప్రతినిధులు తెలిపారు.

    మే 2 అర్ధరాత్రి నుంచి ప్రారంభమై మే 7 వరకు కొనసాగుతున్న ఈ సేల్‌లో స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్స్‌ శాంసంగ్‌, షావోమీ, వన్‌ప్లస్‌తో పాటు ఇతర ఫోన్‌లపై తగ్గింపు ధరకే కొనుగోలు చేసే అవకాశాన్ని అమెజాన్‌ కొనుగోలు దారులకు కల్పిస్తుంది. ఈ ఫోన్‌లలో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌, లార్జ్‌ డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ, పవర్ఫుల్‌ ప్రాసెసర్లుతో వస్తున్నట్లు అమెజాన్‌ వెల్లడించింది.

    మీరు ఐసీసీఐ, వన్‌ కార్డ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేస్తే.. ప్రతి కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్‌లు పొందవచ్చు.దీంతో పాటు ఎక్ఛేంజ్‌ ఆఫర్లు, ఈఎంఐలు, కూపన్‌లు వినియోగించుకోవచ్చని అమెజాన్‌ వెల్లడించింది.  
     

NRI

  • తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్-యూకే (తెలుగు సంఘం) వార్షిక ఉగాది సంబరాలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఇది తెలుగు సంస్కృతి మరియు సంప్రదాయాలకు ఒక చిరస్మరణీయ వేడుక. ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలతో, ఈ కార్యక్రమం సంస్థకు ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. అంతేకాకుండా 2024-26 కాలానికి కొత్తగా ఎన్నికైన ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించారు.

    ఎడిన్‌బర్గ్‌ కాలేజ్-గ్రాంటన్ క్యాంపస్లో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది తెలుగువారు హాజరయ్యారు. స్కాట్లాండ్‌లో నివశిస్తున్న తెలుగు సమాజంలో ఉన్నటువంటి బలమైన బంధం, ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచింది.

    ముఖ్య అతిథులుగా భారత కాన్సుల్ జనరల్ బిజయ్ సెల్వరాజ్, లోథియన్ ప్రాంతానికి చెందిన ఎంఎస్పిలు సారా బోయాక్, ఫోయ్సోల్ చౌదరి, కొల్లిన్టన్ కౌన్సిలర్ స్కాట్ ఆర్థర్ సహా ప్రముఖులు గౌరవ అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారి ఉనికి ఈ కార్యక్రమం వైభవాన్ని పెంచింది.  గొప్ప సాంస్కృతిక వైవిధ్యం ఉన్న ఎడిన్బర్గ్ లాంటి నగరంలో ఉగాదిని జరుపుకోవడం గురించి, దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది.

    “టాస్-యుకె ఉగాది సంబరాలు 2024” లో తెలుగు సమాజం ప్రతిభ, సంప్రదాయాలకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అధికారులు.సిలికానాంధ్రా వారి ‘మనబడి’ ద్వారా తెలుగు నేర్చుకునే పిల్లలు “మా తెలుగు తల్లికి” ప్రార్థనాగీతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

    2022-24 కాలానికి గాను సాంస్కృతిక కార్యదర్శిగా వ్యవహరించిన విజయ్ కుమార్ పర్రి తెలుగు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అతిథులు, ముఖ్య అతిథులు మరియు ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం పలుకుతూ క్రార్యక్రమాన్ని ప్రారభించారు. సమూహ నృత్యాలు, సోలో గానం, తెలుగు కవితల పారాయణ, అనంత్ రామానంద్ గార్లపాటి చేసిన ముఖ్యమైన ఉగాది పంచాంగంతో సహా మంత్రముగ్దులను చేసే ప్రదర్శనలతో వేదిక ఆకర్షణీయంగా మారింది. 

    ఐదుగురు గాయకులు, బ్యాండ్ ప్లేయర్లతో కూడిన స్థానిక భారతీయ బ్యాండ్ "వాయిస్ ఆఫ్ ఎకో" ప్రదర్శన ఈ కార్యక్రమానికి ముఖ్య ఆకర్షణగా నిలిచింది. వారి ఆకర్షణీయమైన ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి, ఉత్సవాలకు అదనపు ఉత్సాహాన్ని జోడించాయి.

    హోస్ట్స్ సత్య శ్యామ్ జయంతి, రంజిత్ నాగుబండి, శ్రుతి పల్లెమోని, స్రవంతి పొట్లూరి, హిమజా మాచిరాజు రోజంతా జరిగే ఈ కార్యక్రమంలో ప్రేక్షకులకు నైపుణ్యంగా మార్గనిర్దేశం చేసి, శక్తిని, ఉత్సాహాన్ని నింపారు. వారి చమత్కారమైన పరిహాసం,  ఆకర్షణీయమైన సంభాషణలు హాజరైనవారిని రోజంతా వినోదభరితంగా ఉంచాయి.

    సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు, ఈ కార్యక్రమంలో సాంప్రదాయ సమకాలీన దుస్తులలో వివిధ ఋతువుల పోకడలను ప్రదర్శించే ఫ్యాషన్ షో ప్రదర్శన కూడా జరగడం విశేషం.

    ఎడిన్బర్గ్ దీపావళి, కన్నడ అసోషియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ - ఎడిన్బర్గ్, ఎడిన్బర్గ్ హిందు మందిర్ అండ్ కల్చరల్ సెంటర్, ఇండియన్ ఆర్ట్స్ కనెక్షన్, 3 గుడ్ డీడ్స్, స్కాటిష్ ఇండియన్ ఆర్ట్స్ ఫోరం, ఒడిశా సొసైటి ఆఫ్ స్కాట్లాండ్, బీహార్ కమ్యూనిటీ మరియు స్కాటిష్ ఇండియన్ ముస్లిం అసోషియేషన్ వంటి ఇతర భారతీయ సంఘాల అతిథులు చేరడం ఔత్సాహికుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.

    వేడుకను విజయవంతం చేయడంలో ఈవెంట్ స్పాన్సర్లు ప్రధాన స్పాన్సర్లు బ్రైటర్ మోర్టగేజెస్, బెల్లి ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్, సహ-స్పాన్సర్ అల్లి భవన్‌లు కీలక పాత్ర పోషించారు, .

    ఇక 2024-26 సంవత్సరానికి కొత్తగా ఎన్నికైన టాస్‌-యూకే ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌  శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గడ్డం, సంయుక్త కార్యదర్శి నిరంజన్ నూక, కోశాధికారి విజయ్ కుమార్ పర్రి, మహిళా మరియు ప్రాజెక్టుల కార్యదర్శి మాధవిలత దండూరి, కల్చరల్ సెక్రెటరీ పండరి జైన్ కుమార్ పోలిశెట్టి, క్రీడా కార్యదర్శి బాలాజీ కర్నాటి, యువజన శాఖా కార్యదర్శి రాజశేఖర్ సాంబ, ఐటి కార్యదర్శి జాకీర్ షేక్, పిఆర్ కార్యదర్శి నరేష్ దీకొండలను సభ్యులకు పరిచయం చేశారు.

    చివరిగా మాజీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి చేసిన గణనీయమైన కృషికి గుర్తింపుగా, గౌరవనీయ చైర్‌పర్సన్‌గా సత్కరించారు.

    జన గణ మన, కొత్తగా నియమితులైన జనరల్, జాయింట్ సెక్రటరీల ధన్యవాదాలతో కార్యక్రమం ముగిసింది. ఇక ఈ కార్యక్రమంలో హాజరైన తెలుగువారు సంస్కృతి, స్నేహం, వేడుకలతో నిండిన రోజుగా మధురమైన జ్ఞాపకాలతో బయలుదేరారు.

    “టాస్-UK ఉగాది సంబరాలు 2024” ఒక తెలుగు వారసత్వ వేడుక మాత్రమే కాదు. తెలుగు సమాజం ఐక్యత,  స్థితిస్థాపకతకు నిదర్శనం. టాస్-యుకె అభివృద్ధి చెందడమేగాక ఉగాది స్ఫూర్తిని తెలుగు వారిలో నింపుతూ.. రాబోయే సంవత్సరాల్లో మరింత మార్గదర్శకంగా, స్ఫూర్తిదాయకంగా  తెలుగు వారి శ్రేయస్సుకు చేదోడుగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

    (చదవండి: టంపాబే లో అనాథల కోసం నాట్స్ సరికొత్త సేవా కార్యక్రమం!)

  • అమెరికాలో తెలుగు వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తోంది. దీనిలో భాగంగా నాట్స్ తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కట్టమూరు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించింది. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీహరి మందాడి చొరవతో కాటూరు మెడికల్ కాలేజీ వారి సహకారంతో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దాదాపు 500 మందికి పైగా రోగులకు శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా అందించారు. 

    ఈ మెగా వైద్య శిబిరంలో బీపీ, షుగర్, గుండె, శ్వాస కోస, ఊపిరితిత్తులు, కళ్ళు, ముక్కు, చెవి, గొంతు, ఎముకలు, కీళ్లు ఇలా 12 విభాగాలకు చెందిన వైద్యులు.. రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. జన్మభూమి రుణం కొంత తీర్చుకోవాలనే లక్ష్యంతోనే తాము ఇలాంటి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించామని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీహరి మందాడి ఈ సందర్భంగా తెలిపారు.. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ మాజీ అధ్యక్షుడు, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ మోహన కృష్ణ మన్నవ,  స్థానిక ప్రముఖులు మాగలూరి భాను ప్రకాష్, బొల్లు సురేశ్, హరి కొల్లూరు, కిరణ్ కుంచనపల్లి, గ్రామ పెద్దలు శివప్రసాద్, మల్లికార్జున రావు, నరేష్, శ్రీనివాస రావు, బాబు తదితరులు పాల్గొన్నారు. 

    పేద ప్రజల ఆరోగ్యం కోసం మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచిత వైద్యం, మందులు అందించడం అభినందనీయమని శ్రీ హరి మందాడిని నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి ప్రశంసించారు. మెగా ఉచిత వైద్య శిబిరంలో ఉచిత వైద్య సేవలు పొందిన వారు తమ కోసం శ్రీ హరి మందాడి చూపిన చొరవ, సేవాభావాన్ని కొనియాడారు.

    (చదవండి: టంపాబే లో అనాథల కోసం నాట్స్ సరికొత్త సేవా కార్యక్రమం!)

  • సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే సందేశాన్ని భావితరానికి తెలియజేయడంతో పాటు వారిలో సామాజిక స్ఫూర్తిని రగిలించడానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ సరికొత్త కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే నాట్స్ తాజాగా ప్లోరిడాలోని టంపాబే లో అనాథ పిల్లల కోసం పీనట్ బటర్ అండ్ జెల్లీ శాండ్విచ్ మేకింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. 

    ఈ కార్యక్రమంలో దాదాపు 20 మంది మిడిల్ స్కూల్ పిల్లలు 10 మంది పెద్దలు కలిసి అనాథ పిల్లల కోసం శాండ్‌విచ్‌లను తయారు చేశారు.. ఇలా చేసిన వాటిని టంపా లోని అనాధశ్రమానికి అందించింది. నిరాశ్రయులైన అనాథ పిల్లలకు మనం కూడా సామాజిక బాధ్యతగా ఏదో ఒక్కటి చేయాలనే  సంకల్పంతోనే నాట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు, నాట్స్ కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని తమ సేవాభావాన్ని చాటారు. 

    నాట్స్ మాజీ ఛైర్మన్, నాట్స్ సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా. కొత్త శేఖరం, నాట్స్ బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ కార్య నిర్వాహక కమిటీ వైస్ ప్రెసిడెంట్(ఫైనాన్స్/మార్కెటింగ్), భాను ధూళిపాళ్ల,  ప్రోగ్రామ్ నేషనల్ కో ఆర్డినేటర్ రాజేష్ కాండ్రు,  జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, సలహా కమిటీ సభ్యులు ప్రసాద్ ఆరికట్ల, సురేష్ బొజ్జా, చాప్టర్ కోఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కో ఆర్డినేటర్ విజయ్ కట్టా, కోర్ టీమ్ అచ్చిరెడ్డి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

    భావితరంలో సేవాభావాన్ని నింపేందుకు డ్రైవ్ చేపట్టి విజయవంతం చేసిన టంపాబే నాట్స్ విభాగాన్ని నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేకంగా అభినందించారు. సేవే గమ్యం నినాదానికి తగ్గట్టుగా టంపాబే విభాగం శాండ్విచ్ మేకింగ్ కార్యక్రమం నిర్వహించిందని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి టంపాబే నాయకులను ప్రశంసించారు.

    (చదవండి: టెక్సాస్‌ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?)
     

  • ప్లోరిడాలోని టంపాలో ఓ తెలుగుకుటుంబం దాతృత్వం  చరిత్ర సృష్టించింది. టంపాలో సెయింట్ జోసఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పౌండేషన్‌కు తెలుగువారైన పగిడిపాటి కుటుంబం 50 మిలియన్ డాలర్లను(ఏకంగా రూ. 400 కోట్లు) విరాళంగా అందించింది. ఇంత పెద్ద మొత్తం విరాళంగా ప్రకటించి అమెరికాలో ఉండే యావత్ తెలుగువారంతా గర్వపడేలా చేసినందుకు నాట్స్ ప్రత్యేకంగా పగిడిపాటి కుటుంబాన్ని అభినందించింది. 

    ఏకంగా 50 మిలియన్ల విరాళం
    అమెరికాలో ప్రముఖ వైద్యులు డాక్టర్ పగిడిపాటి దేవయ్య, రుద్రమ్మల 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా పగిడిపాటి కుటుంబం 50 మిలియన్ డాలర్లను విరాళంగా ఇవ్వడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. పగిడిపాటి కుటుంబంలోని సిద్ధార్థ, అమీ, రాహుల్, నేహా, సృజని, అర్జున్, ఇషాన్, ఆరియా, అరెన్ వీరందరూ కలిసి ఇచ్చిన ఈ విరాళం ప్లోరిడాలోని టంపాలో ఆరోగ్య సంరక్షణకు ఇప్పటివరకు ఇచ్చిన అతి పెద్ద విరాళాల్లో ఇది ఒక్కటిగా నిలిచి చరిత్ర సృష్టించింది.  

    నాట్స్ ప్రశంసల వర్షం..
    ఈ విరాళం ద్వారా సెయింట్ జోసెఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో కొత్త పీడియాట్రిక్ సదుపాయం అభివృద్ధికి దోహదపడుతుంది. పిల్లల కోసం అత్యాధునిక ఆరోగ్య సంరక్షణను మరింత పెంచే వ్యూహంలో భాగంగా ఈ విరాళాన్ని ఇవ్వడం హర్షించదగ్గ విషయం. పగిడిపాటి కుటుంబ దాతృత్వానికి గుర్తింపుగా, కొత్త పిల్లల ఆసుపత్రికి పగిడిపాటి చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎట్ సెయింట్ జోసెఫ్ అని పేరు పెట్టనున్నారు. 

    డాక్టర్ రుద్రమ, దేవయ్యలు నాట్స్‌తో పాటు అనేక ఇతర సేవా సంస్థలకు తమ మద్దతు అందిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో మన అమెరికాలో తెలుగువారు అద్భుత విజయాలు సాధించి సేవా రంగంలో కూడా ముందుండాలని నాట్స్ అకాంక్షిస్తోంది. పగిడిపాటి రుద్రమ్మ, దేవయ్య మరిన్ని విజయాలు సాధించి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని నాట్స్ కోరుకుంటుంది.

    (చదవండి: అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం)

Hyderabad City

  • సికింద్రాబాద్‌ బొల్లారంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో వేసవి శిబిరాన్ని ప్రారంభించారు సంఘం అధ్యక్షుడు పూస యోగేశ్వర్‌. విద్యార్థులందరికీ వేసవికాలం సెలవులు ఉంటాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే.. వచ్చే విద్ఆయ సంవత్సరం వారికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుందన్నారు.

    వేసవి శిబిరంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటీవలే ఎన్నికైన కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. పిల్లలకు భరతనాట్యం, కర్ణాటక సంగీతం, సంస్కృత శ్లోకాలు, జానపద నృత్యకళల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఆయా రంగాల్లో అనుభవజ్ఞులను, గురువులను నియమించుకున్నారు.

    ఇవ్వాళ్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్‌ ప్రియాంకను ఆహ్వనించగా.. వేసవి శిబిరాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సమ్మర్‌ క్యాంపులో పాల్గొనే విద్యార్థులను ఉద్దేశించి గంగపుత్ర సంఘం అధ్యక్షుడు పూస యోగేశ్వరు మాట్లాడారు. క్రీడలు, వ్యాయామం, యోగను నిత్య జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు. సమ్మర్‌ క్యాంపులో నేర్చుకున్న అంశాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా శ్రద్ధ పెట్టాలన్నారు. 

     

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్‌డీ స్కాలర్ వేముల రోహిత్‌ కేసుపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. రోహిత్‌ కేసు క్లోజ్‌ చేస్తున్నట్లు కోర్టుకు పోలీసులు తెలిపారు.  

    వేముల రోహిత్‌ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని కోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించారు. ఆత్మహత్యకు కారణాలు, ఎవిడెన్స్‌ లేవన్న పోలీసులు.. వీసీ అప్పారావుకు సంబంధం లేదని తేల్చారు. పోలీసులు రోహిత్ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాదని రిపోర్టులో తేల్చారు.

     కాగా, 2016 జనవరిలో రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. రోహిత్ వేముల ఆత్మహత్యపై గతంలో 306 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ సెక్షన్లు సైతం 8 సంవత్సరాల క్రితం పోలీసులు జోడించారు. పోలీసుల తాజా రిపోర్టులో రోహిత్ వేముల ఆత్మహత్యకు వీసీ కారణమని ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు.

     

Andhra Pradesh

  • సాక్షి, విజయవాడ: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై మాట్లాడకూడదంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడుతారని షర్మిల, బీటెక్ రవి, సునీతలను ప్రశ్నించింది. అలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని పేర్కొంది. 

    కేసు విచారణలో ఉండగానే ఒక వ్యక్తిని హంతకుడు అని ఎలా చెబుతారని ప్రశ్నించింది. హంతకుడు అనే ముద్ర ఎలా వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. హతకుడ్ని ముఖ్యమంత్రి రక్షిస్తున్నారని ఎలా చెబుతారన్న హైకోర్టు అలా చెప్పటం తప్పు అని తెలిపింది.ఇలా చెప్పటం నేరపురితమైన చర్యలు కిందకు వస్తుంని పేర్కొంది. 

    అయిదు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనపై ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని షర్మిల, బీటెక్ రవి, సునీతలను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఈ మేరకు వివేకా హత్యపై మాట్లాడకూడదు అంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌లను కొట్టివేసింది.

Family

  • కోవిడ్‌ వ్యాక్సీన్‌ను తయారు చేసిన ప్రముఖ ఫార్మా కంపెనీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కోవిషీల్డ్   వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత  తమ కుమార్తె చనిపోయిందని ఆరోపిస్తూ ఒక యువతి తల్లిదండ్రులు సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)పై దావా వేశారు. బ్రిటన్‌కి చెందిన ఫార్మా దిగ్గజంపై  పిటీషన్‌ దాఖలు చేశారు.

    ఇటీవల ఫార్మా సంస్థ ఆస్ట్రాజెన్‌కా తమ వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డ కట్టడం, తక్కువ ప్లేట్ లెట్ కౌంట్‌కి సంబంధించి అరుదైన దుష్ప్రభావాల ఆరోపణలు, వీటిని  ఆస్ట్రాజెన్‌కా కూడా అంగీకరించిన  తరువాత  ఈ పరిణామం చోటుచేసుకుంది.

     కారుణ్య పుట్టిన రోజు మే 1. మా తొలి వివాహ వార్షికోత్సవ గిప్ట్‌ నా పాప. ఇపుడు అందనంతదూరంలో- వేణుగోపాల్‌ 

    తమ 20 ఏళ్ల  కుమార్తె కారుణ్య  కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ తర్వాత జూలై 2021లో మరణించిందని తండ్రి వేణుగోపాలన్‌ గోవిందన్‌ ఎక్స్‌లో  ఆరోపించారు. డేటా సైన్స్ స్టూడెంట్ కారుణ్య టీకా తీసుకున్న ఒక నెల తర్వాత  అనారోగ్యానికి గురైంది. వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత ఆమె మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమెటరీ సిండ్రోమ్ కారణంగా మరణించింది. వ్యాక్సిన్ తీసుకున్న 8 రోజుల తర్వా ఆమె తీవ్రమైన సంస్యల బారినపడిందని, నెల తర్వాత మరణించిందని తండ్రి వేణుగోపాల్ గోవిందన్‌ ఆరోపించరాఉ. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని  పేర్కొన్నారు.

    అలాగే ఇంత నష్టం జరిగిన  తరువాత ఆస్ట్రాజెన్‌కా తప్పు ఒప్పుకోవడంపై వేణుగోపాలన్‌ మండి పడ్డారు.  రక్తం గడ్డకట్టడం వల్ల సంభవించే మరణాలపై 15 యూరోపియన్ దేశాలు  వ్యాక్సీన్‌ వినియోగాన్ని పరిమితం చేసిన తర్వాత సీరం ఇన్‌స్టిట్యూట్ వ్యాక్సిన్ సరఫరాని నిలిపేయాల్సి ఉండాల్సిందని ఆయన అన్నారు. తల్లిదండ్రులు న్యాయం కోసం వివిధ న్యాయస్థానాల్లో పోరాడుతున్నప్పటికీ విచారణకు నోచుకోవడం లేదని తన పోస్టులో పేర్కొన్నారు. 8 మంది బాధిత కుటుంబాల తరుపున తమ భావాలను ప్రతిధ్వనిస్తున్నామని వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయినందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు అదార్ పూనావాలా వారి పాపాలకు సమాధానం చెప్పవలసి ఉంటుందని అన్నారు. అలాగే వ్యాక్సిన్‌ని వినియోగంలోకి తీసుకువచ్చిన ప్రభుత్వ అధికారులను కూడా ఆయన నిందించారు. ఈ మేరకు వేణుగోపాలన్‌ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు. అయితే దీనిపై సీరం  నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

     2021లో తమ కుమార్తె రితైక(18)ను కోల్పోయిన రచనా గంగూ కుమార్తె మరణంపై విచారణ జరిపేందుకు మెడికల్ బోర్డును నియమించాలని కోరుతూ గతంలో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలులు చేశారు. ఆస్ట్రాజెనెకా ఇప్పటికే యూకేలో క్లాస్ యాక్షన్ దావాను ఎదుర్కొంటోంది.

    కాగా వ్యాక్సిన్‌ వల్ల థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS)తో థ్రాంబోసిస్‌తో సహా మరణాలు మరియు తీవ్రమైన గాయాలు సంభవించాయని ఆరోపిస్తూ క్లాస్-యాక్షన్ దావా నుండి చట్టపరమైన చర్యను ఎదుర్కొంటోంది ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి అభివృద్ధి చేసిన కోవిడ్-19  ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారతదేశంలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ‘కోవిషీల్డ్’ పేరుతో తయారు చేసి, విక్రయించిన సంగతి తెలిసిందే. 
     

  • బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూడాటానికి ఆజానుబాహుడిలా యువ హీరోలకి తీసిపోని బాడీ ఫిజిక్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తాడు. చూడటానికి అమ్మాయిల కలల రాకుమారుడిలా ఉంటాడు. ఇప్పటికీ సినిమాల్లో షర్ట్‌ తీసేసి మంచి దేహదారుఢ్యంతో కనిపిస్తాడు. ఐదుపదుల వయసొచ్చిన అదే ఫిజిక్‌ని మెయింటెయిన్‌ చేస్తాడు. చాలామంది హీరోలు యంగ్‌ హీరోలా లుక్‌ మెయింటెయిన్‌ చేసినా.. యువకుడి మాదిరి కండలు తిరిగిన దేహం మెయింటెయిన్‌ చేయడం కుదరదు. 

    అందుకే చాలామంది పెద్ద హీరోలు ఓ ఏజ్‌ తర్వాత షర్ట్‌ తీసి కెమెరా ముందుకు రారు. కానీ జాన్‌ అబ్రహం అలా కాదు. దర్శకులు సైతం అతని బాడీ ఫీగర్‌ సినిమాలో కచ్చితంగా కనిపించేలా చూసుకుంటారు. అంతలా జాన్‌ అబ్రహం తన ఫిజిక్‌ని మెయింటెయిన్‌ చేస్తాడు. బ్రిటిష్‌-పాకిస్తానీ నటుడు అలీఖాన్‌ జాన్‌ అబ్రహంతో కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. అతడి ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. జాన్‌ తన శరీరాకృతి కారణంగానే హీరోగా నిలదొక్కుకున్నాడా అని ఓ ఇంటర్యూలో యాంకర్‌ ప్రశ్నించగా..అందుకు అలీ ప్రతిభ లేకుండా ఇంతకాలం సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదని తేల్చి చెప్పారు. 

    ప్రస్తుతం జాన్‌ అబ్రహం వయసు 51 అయినా..ఈ వయసులో కూడా చొక్కా లేకుండానే సినిమాల్లో కనిపిస్తుంటాడని అలీ సతీమణి చాందిని నవ్వుతూ చెప్పారు. అందుకు అతడు అనుసరించే కఠిన జీవనశైలేనని అన్నారు. జాన్‌ 25 ఏళ్లుగా అస్సలు చక్కెర రుచే చూడలేదని చెప్పారు. చక్కెరకు ప్రత్యామ్నయాలను మాత్రమే తీసుకుంటాడని చెప్పారు. అలాగే మద్యం, సిగరెట్‌ వంటి వాటిని సరదాకి కూడా ట్రై చేయలేదని, అదే అతడి బాడీ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ అని ఆమె చెప్పుకొచ్చారు. బాలీవుడ్‌ హీరోలలో మంచి శరీరాకృతికి పేరుగాంచినవాడు జాన్‌. 

    ఇక జాన్‌ శిల్పాశెట్టితో కలిసి ఒక షోలో సందడి చేశారు. ఆ షోలో తన లైఫ్‌ స్టయిల్‌కి సంబంధించిన పలు ఆసక్తికర  విషయాలను షేర్‌ చేసుకున్నారు జాన్‌. తాను రైతు మాదిరిగా జీవించేందుకు ఇష్టపడతానని అన్నారు. ముఖ్యంగా తాను తీసుకునే ఆహారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఫిటెనెస్‌ మెయిటెయిన్‌ చేయడం అనేది ప్రధానంగా మూడింటి మీద ఆధారపడి ఉంటుందని, అందులో ఒకటి ఆహారం, వ్యాయామం, చివరిగా నిద్ర అని చెప్పుకొచ్చారు జాన్‌. 

    వాటిలో ఏది సరిగా లేకపోయినా.. మంచి ఫిట్‌నెస్‌ మెయింటెయిన్‌ చేయడం అనేది సాధ్యం కాదని అన్నారు. అలాగే తాను ప్రతిరోజు ఉదయం 4.30 గంటల కల్లా నిద్ర లేస్తానని, పైగా తనకెంతో ఇష్టమైన కాజు కల్తీ డెజర్ట్‌ని మూడు దశాబ్దలకు పైగా రుచి చూడకుండా నోటిని అదుపులో ఉంచినట్లు తెలిపారు. తన వద్ద ఎలాంటి ఎరేటెడ్‌ డ్రింక్స్‌ కూడా ఉండవని, తన దృష్టిలో చక్కెర అనేది అతిపెద్ద విషం అని ప్రగాఢంగా నమ్ముతానని చెప్పుకొచ్చాడు జాన్‌. 

    అంతేగాదు సిగరెట్‌ కంటే పాయిజన్‌ చక్కెరే అని జాన్‌ చెబుతున్నాడు. ఎంతటి సెలబ్రిటీలైన ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కఠినమైన ఆహార నియమాలు పాటించాల్సిందే. అది కూడా వాళ్లు ఆరోగ్యకరమైన రీతిలో ఫాలో అయ్యి అందరికీ ఆదర్శంగా నిలవడం విశేషం. మనం కనీసం వారిలా కాకపోయినా ఆరోగ్యంగా ఉండేందుకైనా మంచి జీవనశైలిని పాటించేందుకు యత్నించడం బెటర్‌ కదూ..!

    (చదవండి: ఐస్‌క్రీమ్‌తో బరువు తగ్గొచ్చా?: దీపికా పదుకొనే ఫిట్‌నెస్‌ ట్రైనర్‌)
     


  • తమలపాకు లేకుండా శుభాకార్యాలను అసలు ఊహించలేం కదా. అలాగే విందుభోజనం తరువాత తాంబూలం సేవించడం కూడా చాలామందికి అలవాటు.  విటమిన్ ఎ, సి, బి1, బి2, పొటాషియం, థయామిన్, నియాసిన్ , రైబోఫ్లావిన్ వంటి పోషకాలు తమలపాకులలో లభిస్తాయి. అలాగే  జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది.  కానీ తమలపాకుతో  జుట్టు సమస్యలకు చెక్‌ చెప్పవచ్చని మీకు తెలుసా? 

    సహజంగా దొరికే తమలపాకుద్వారా జుట్టు రాలడాన్ని నివారించుకోవచ్చు. తలలో దురద,  తెల్లజుట్టు సమస్య కూడా నయమ వుతుంది. తమలపాకుల్లో ఉండే విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు, ఖనిజాలు జుట్టు చిట్లడం మరియు రాలడాన్ని నివారిస్తాయి. కాబట్టి జుట్టు రాలకుండా ఉండేందుకు తమలపాకులను ఉపయోగించే మార్గాన్ని తెలుసుకుందాం.

    తమలపాకు నీటితో జుట్టును కడగాలి
    తల కడుక్కోవడానికి 15-20 తమలపాకులను ఒక పాత్రలో వేసి మరిగించాలి.  చల్లారిన తరువాత దీంతో జుట్టులో వాచ్‌ చేయాలి.  తమలపాకులో యాంటీమైక్రోబయల్ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలు  స్కాల్ప్ ఇన్ఫెక్షన్ సమస్యను దూరం చేస్తుంది. 

    తమలపాకు,నెయ్యి హెయిర్‌ మాస్క్‌
    తమలపాకులని తీసుకుని శుభ్రంగా కడిగి పేస్టు చేయాలి. ఇందులో టీస్పూను నెయ్యి వేసి కలిపి, మాడు నుంచి వెంట్రుకల చివర్ల వరకు పట్టించాలి. గంట తరువాత నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి ఈ మాస్క్‌ వేసుకోవడం వల్ల తమలపాకులోని పోషకాలు అంది జుట్టు మరింత బలంగా దట్టంగా పెరుగుతుంది. జుట్టురాలే సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.  

    మసాజ్‌
    తమలపాకు పేస్ట్‌లో కొద్దిగా కొబ్బరి నూనె, ఆముదం కలిపి జుట్టు కుదుళ్లకు మసాజ్‌ చేసితే జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుతుంది. ఇలా వారంలో  ఒకసారి లేదా నెలకు రెండు మూడు సార్లు చొప్పున చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

    తమలపాకులతో చేసిన నూనె
    జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే తమలపాకుతో చేసిన నూనె కంటే గొప్పది ఏదీ ఉండదు. కొబ్బరి లేదా ఆవనూనెలో 10 నుండి 15 తమలపాకులను వేసి  సన్నని మంటపై మరిగించాలి.  తమలపాకులు నల్లగా మారాగా, ఈ నూనెను వడపోసి, స్కాల్ప్‌ నుంచి  జుట్టంతా  బాగా పట్టించాలి. ఇది రాత్రంతా ఉంచుకోవచ్చు. తలస్నానానికి ఒక గంట ముందు రాసు కోవచ్చు. 

    తమలపాకులను తినండి
    ఉదయం ఖాళీ కడుపుతో 5-6 తమలపాకులను నమలవచ్చు లేదా 10-5 తమలపాకులను నీటిలో ఉడకబెట్టి  ఆ నీటిని తీసుకోవచ్చు. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రించడమే కాకుండా, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
     

International

  • ప్రతి సంవత్సరం మే-3 న ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరుపుకుంటారు. మానవ హక్కుల ప్రాముఖ్యత, వాటిని పరిరక్షించడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, ప్రభుత్వాలు మంచి పాలనను అందించడంలో పత్రికారంగం కీలక పాత్ర పోషిస్తోంది.


    1993లో ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ మే-3 వ తేదీని ప్రపంచ స్వాతంత్య్ర పత్రికా దినోత్సవంగా ప్రకటించింది. 1991లో యునెస్కో 26వ సర్వసభ్య సమావేశంలో చేసిన సిఫారసుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. 1991 విండ్ హోక్ డిక్లరేషన్ ఫలితంగా కూడా ఈ ప్రకటన వచ్చింది. ఇది పత్రికా స్వేచ్ఛ గురించి ఆఫ్రికన్ పాత్రికేయులు తయారు చేసిన ప్రకటన. యునెస్కో నిర్వహించిన ఒక సెమినార్‌లో సమర్పించబడి మే-3న ముగిసింది. దీంతో ఆ రోజును పత్రికా స్వేచ్ఛ దినోత్సవంగా జరుపుకుంటారు.

    2023వ‌ సంవత్సరానికి సంబంధించి పత్రికా స్వేచ్ఛ సూచికలో భారత్ 161  స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 400కి పైగా టీవీ న్యూస్‌‌ చానళ్లు ఉన్నాయి. ప‌త్రిక‌లైతే వేల‌ల్లో ఉన్నాయి.  ప్రాంతీయ ప్రతికా స్వేచ్ఛ సూచీలో నార్వే,  ఐర్లాండ్‌, డెన్మార్క్‌మొదటి మూడు స్థానాల్లో ఉండగా చివరి స్థానంలో నార్త్‌‌ కొరియా ఉంది.