ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే | Sakshi
Sakshi News home page

ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే

Published Fri, May 3 2024 3:56 PM

Akshay Saini Share Hard Truth About Corporate Company

మీరు ఉద్యోగం చేస్తున్నారా? చాలిచాలనీ జీతంతో ఇబ్బంది పడుతున్నారా? ఎక్కువ జీతం కావాలని కోరుకుంటున్నారా? అయితే ఈ సలహా పాటిస్తే మీ ప్రతిభకు తగ్గ వేతనం పొందొచ్చు.  

డెహ్రడూన్‌కు చెందిన ఐటీ ఉద్యోగి అక్షయ్‌ సైనీ ఉద్యోగులకు అప్రైజల్‌ సీజన్‌పై  అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో కార్పొరేట్‌ కంపెనీల గురించి పచ్చి నిజాల్ని వెల్లడించారు. ప్రస్తుతం ఆ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ అక్షయ్‌ సైనీ ఏం చెప్పారంటే

మీరు ఎక్కువ జీతం కావాలంటే
మీరు ఎక్కువ జీతం కావాలంటే కంపెనీలు మారడమే సరైన నిర్ణయం. భారత్‌లో అత్యధిక కంపెనీల్లో ఇంట్రర్నల్‌ అప్రైజల్స్‌ ఓ జోక్‌గా అభివర్ణించారు. అంతేకాదు, సగటు కంటే ఎక్కువ ఉన్న ఇంజనీర్లు, డబుల్‌ డిజిట్‌ శాలరీ హైక్‌ను పొందలేదు. మీ వేతనం తక్కువగా ఉన్నట్లయితే, అతిగా ఆలోచించకండి. వెంటనే ఉద్యోగం మారండి! అంటూ తన పోస్ట్‌లో తెలిపారు.  

తక్కువ జీతంతో మీ కెరీర్‌ను ప్రారంభిస్తే
మరో కఠినమైన నిజం ఏమిటంటే, మీరు తక్కువ జీతంతో మీ కెరీర్‌ను ప్రారంభిస్తే, అధిక జీతం (సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా) పొందాలంటే మీరు ఉద్యోగాలు మారాల్సి ఉంటుంది. కావాలంటే మీరే చూడండి తక్కువ వేతనంతో తమ కెరియర్‌ను ప్రారంభించిన ఐటీ ఉద్యోగులు జీతాలు పెంచుకునేందుకు తరుచూ ఉద్యోగాలు మారుతుంటారు.  

తక్కువ జీతం ఇచ్చే ఉద్యోగంలో ఇరుక్కుపోయి
కాబట్టి, మీరు తక్కువ జీతం ఇచ్చే ఉద్యోగంలో ఇరుక్కుపోయి శాలరీ హైక్‌, డిజిగ్నేషన్‌ కోసం ప్రయత్నించి విఫలమైతే మీరు ఉద్యోగం మారడం మంచింది. మంచి పని ఎంత ముఖ్యమో జీతం కూడా అంతే ముఖ్యం చివరగా గుర్తుంచుకోండి. మీకు తక్కువ జీతం ఉంటే అది మీ తప్పు అని అక్షయ్‌ సైనీ పేర్కొన్నారు.

అక్షయ్‌ సైనీ అభిప్రాయాలపై నెటిజన్లు సైతం మద్దతు తెలుపుతున్నారు. ఉద్యోగం చేస్తూ ఎక్కువ జీతం పొందాలంటే కంపెనీలు మారడమే సరైన నిర్ణయమని, ఎక్కువ జీతం పొందేందుకు తాము కూడా సంస్థలు మారినట్లు చెబుతున్నారు. 

Advertisement
Advertisement