Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement

A to Z మూవీ న్యూస్‌

Advertisement

గాసిప్స్

View all

రివ్యూలు

View all
Advertisement

సినీ ప్రపంచం

Heeramandi: Sanjay Leela Bhansali Mistake This Scene
హీరామండి సిరీస్‌లో పెద్ద త‌ప్పులు.. ఇవి కూడా చూసుకోరా?

హీరామండి.. భారీ బ‌డ్జెట్‌తో నిర్మిత‌మైన వెబ్ సిరీస్‌. పాపుల‌ర్ డైరెక్ట‌ర్‌ సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన ఈ క‌ళాఖండం మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్ర‌స్తుతం ట్రెండింగ్‌లో ఉన్న‌ ఈ సిరీస్‌లో కొన్ని పొర‌పాట్ల‌ను నెటిజ‌న్లు గుర్తిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.జ‌ర్న‌లిస్టు ట్వీట్ఐదో ఎపిసోడ్‌లో సోనాక్షి సిన్హా వార్తా ప‌త్రిక చ‌దువుతున్న స‌మ‌యంలోని పొర‌పాట‌ను ఎత్తిచూపుతున్నారు. ఈ మేర‌కు ప‌ర్వేజ్ ఆల‌మ్ అనే జ‌ర్న‌లిస్టు ఓ ట్వీట్ చేశాడు. హీరామండి సిరీస్ 1920-40 బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. స్వ‌తంత్రానికి ముందు బ్రిటీష్ పాల‌న‌లో ఉన్న లాహోర్‌లో క‌థ సాగుతుంది. ఉర్దూ పేప‌ర్ఐదో ఎపిసోడ్‌లో ఫ‌రీద‌న్ (సోనాక్షి సిన్హ‌) ఉర్దూ పేప‌ర్ చ‌దువుతుంది. అందులోని హెడ్‌లైన్స్‌లో వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ ఎల‌క్ష‌న్స్‌: టికెట్లు ఇచ్చిన‌ టీఆర్ఎస్ అని ఉంది. 50వేల మాస్కులను పంపిణీ చేయనున్న‌ యూత్ కాంగ్రెస్‌.., కరోనాతో పోరాడాలంటే ఆత్మ‌స్థైర్యం ఉండాలి:  క‌రోనా రోగుల‌కు పంచాయ‌త్ రాజ్ శాఖ మంత్రి ద‌యాక‌ర్ రావు స‌ల‌హా.. ఇలాంటి హెడ్‌లైన్సే ఉన్నాయి అని రాసుకొచ్చారు. అది కూడా తెలీదా?మరో నెటిజ‌న్‌.. ఉర్దూ పేప‌ర్‌ను ఎడ‌మ నుంచి కుడికి చ‌ద‌వ‌డం మాత్రం హైలెట్ అని సెటైర్ వేశాడు. ఉర్దూని కుడి నుంచి ఎడ‌మ‌కు చ‌దువుతార‌ని కూడా తెలీకుండా ఆ పాత్ర‌ను డిజైన్ చేయ‌డం, క‌నీసం ఎవ‌రైనా భాషాజ్ఞానుల‌ను సంప్ర‌దించ‌క‌పోవ‌డం విచార‌క‌రం అని కామెంట్లు చేస్తున్నారు. Sanjay Leela Bhansali’s epic web series Heera Mandi on Netflix is set against the Indian independence/British Raj in Lahore of the 1920s-1940s. Fareedan (Sonakshi Sinha) is supposedly reading an Urdu newspaper (EP5). Headlines say, “Warangal Municipal Elections: TRS Distributes… pic.twitter.com/EI44Z61rkt— Pervaiz Alam (@pervaizalam) May 3, 2024 

Deepak Tijori Says Amrita Singh stopped Saif Ali Khan from Supporting his Film
నాకు స‌పోర్ట్ చేసేందుకు ఆ హీరో భార్య ఒప్పుకోలేదు

దీప‌క్ తిరోజి.. ఆషిఖి, ఖిలాడీ, జో జీతా వోహి సిఖింద‌ర్‌, ఘులామ్‌, బాద్‌షా వంటి హిందీ చిత్రాల్లో స‌హాయ‌క పాత్ర‌ల‌తో గుర్తింపు పొందాడు. పెహ్లా న‌షా మూవీతో హీరోగానూ మారాడు. ఊప్స్ చిత్రంతో ద‌ర్శక‌నిర్మాత‌గా అవ‌తారం ఎత్తాడు. ఆయ‌న చివ‌ర‌గా 2018లో వ‌చ్చిన టామ్, డిక్ అండ్ హ్యారీ 2 అనే సినిమాకు డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు.అతిథి పాత్ర‌లోదాదాపు ఆరేళ్ల త‌ర్వాత టిప్సీ చిత్రంతో మ‌రోసారి ద‌ర్శ‌కుడిగా మారాడు. ఈ మూవీ మే 10న విడుద‌ల కానుంది. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఇంట‌ర్వ్యూ ఇచ్చిన‌ దీప‌క్ ఓ ఆస‌క్తిక‌ర‌ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాడు. '1993లో జరిగిందీ సంఘ‌ట‌న‌.. అప్పుడు నేను పెహ్లా న‌షా సినిమా చేస్తున్నాను. ఆ మూవీలో అందరు సెల‌బ్రిటీలు అతిథి పాత్ర‌లో క‌నిపించాల్సి ఉంది. షారుక్‌, సైఫ్ అలీ ఖాన్‌, ఆమిర్ ఖాన్‌.. అంద‌రూ ఒప్పుకున్నారు. చిన్న‌పాటి సీన్షూటింగ్ కోసం సైఫ్ ఇంటి ద‌గ్గ‌ర రెడీ అవుతున్న‌ప్పుడు అత‌డి భార్య అమృత (ప్ర‌స్తుతం విడాకులు తీసుకున్నారు) ఎక్క‌డికి వెళ్తున్నార‌ని అడిగింది. అందుకాయన దీప‌క్ సినిమా కోసం వెళ్తున్నాను. చిన్న‌పాటి సీన్ చేసి వ‌స్తాన‌ని చెప్పాడు. అందుకామె ఆశ్చర్య‌పోతూ నిజంగానే మీరందుకు ఒప్పుకున్నారా?  మేమైతే అలాంటి ప‌నులు ఎప్పుడూ చేయ‌లేదు. నిజానికి ఆ స‌మ‌యంలో..ఇలా ఒకరికి స‌పోర్ట్ చేసేందుకు ఎవ‌రైనా వెళ్తారా?  అని ఆగ్ర‌హించింది. నిజానికి ఆ స‌మ‌యంలో అందరూ ఒక‌రికి ఒక‌రు స‌హాయం చేసుకున్నారు. ఇప్పుడైతే అలాంటి ప‌రిస్థితులు పెద్ద‌గా క‌నిపించ‌డ‌మే లేదు' అని చెప్పుకొచ్చాడు. ఇక పెహ్లా న‌షా సినిమాలో షారుక్‌, సైఫ్‌తో పాటు ర‌వీనా టండ‌న్‌, పూజా భ‌ట్‌, ప‌రేశ్ రావ‌ల్, జూహీ చావ్లా, సుదేశ్ బెర్రీ ఇలా త‌దిత‌రులు న‌టించారు.చ‌ద‌వండి: ఓటీటీలో 100 సినిమాలు.. ఎంచ‌క్కా ఇంట్లోనే చూసేయండి

8 AM Metro Movie Ott Release Details Out
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇప్పుడు ఎలాంటి సినిమా అయినా థియేటర్లలోకి వచ్చిన నెల నెలన్నర గ్యాప్‌లో ఓటీటీలోకి వచ్చేస్తోంది. కొన్నిసార్లయితే నెలలోపే స్ట్రీమింగ్ అయిపోతుంది. అలాంటిది ఓ మూవీ దాదాపు ఏడాది తర్వాత డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. బాలీవుడ్ సినిమా అయినప్పటికీ దీన్ని తీసింది తెలుగు దర్శకుడు కావడం విశేషం.(ఇదీ చదవండి: సంజయ్‌లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్‌ సిరీస్ రివ్యూ)ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన 'మల్లేశం' సినిమాతో రాజ్ రాచకొండ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ తర్వాత టాలీవుడ్ లో మరో మూవీ చేయలేదు. మధ్యలో ఓ మలయాళ మూవీ నిర్మించాడు. కానీ '8 ఏఎమ్ మెట్రో' మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది మే 19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ అందుకుంది. కానీ ఓటీటీ రిలీజ్ ఊసే లేదు. ఇన్నాళ్లకు స్ట్రీమింగ్ ఫిక్స్ అయింది.దాదాపు ఏడాది తర్వాత అంటే మే 10 నుంచి '8 ఏఎమ్ మెట్రో' మూవీ జీ5 ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక సినిమా కథ విషయానికొస్తే.. మహారాష్ట్ర చెందిన ఐరావతి (సయామీ ఖేర్).. సోదరి ప్రసవం కోసం హైదరాబాద్ వస్తుంది. చిన్నప్పడు జరిగిన కొన్ని సంఘటనల వల్ల అప్పుడప‍్పుడు పానిక్ ఎటాక్‌కి గురవుతూ ఉంటుంది. అలాంటి ఈమెకు మెట్రోలో ప్రీతమ్ (గుల్షన్ దేవయ్య) పరిచయమవుతాడు. వీళ్లిద్దరి మధ్య ఏం జరిగిందనేదే మెయిన్ పాయింట్.(ఇదీ చదవండి: స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌.. ఈనెలలో ఓటీటీలోకి 100 సినిమాలు/ సిరీస్‌లు) 

Salaar Japan Release Trailer Out
Salaar Japan Release: జపాన్‌లో రిలీజ్‌కు రెడీ అయిన సలార్‌.. ట్రైలర్‌ అదిరింది!

జపాన్‌లో ఇండియన్‌ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. అక్కడ భారతీయ సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబడుతున్నాయి. గతంలో బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ తో పాటు కేజీయఫ్‌ పార్ట్ 1, పార్ట్‌ 2 చిత్రాలు కూడా జపాన్‌లో రిలీజై మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా మరో ఇండియన్‌ చిత్రం జపాన్‌లో రిలీజ్‌ కాబోతుంది. అదే పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటించిన ‘సలార్‌’. కేజీయఫ్‌ ఫేం ‍ప్రశాంత్‌ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్‌ 22న విడుదలైన ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది.  చాలా కాలం తర్వాత ఈ చిత్రంతో ప్రభాస్‌కి ఓ మంచి హిట్‌ లభించింది. థియేటర్స్‌లోనే కాకుండా ఓటీటీలోనూ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. ఇక ఇప్పుడు జపాన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేయడానికి రెడీ అయ్యాడు ప్రభాస్‌. జులై 5న ఈ చిత్రాన్ని జపాన్‌లో గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ.. ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్‌. ఒక్క డైలాగ్‌ కూడా లేకుండా కేవలం యాక్షన్‌ సీన్లతోనే కట్‌ చేసిన ఈ ట్రైలర్‌ గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉంది. ఈ చిత్రంలో శృతీహాసన్‌ హీరోయిన్‌గా నటించగా.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు.  

Upcoming Movies, Web Series Releases in May 2024
స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌.. ఓటీటీలో 100 సినిమాలు/ సిరీస్‌లు

ఎండ‌లు మండిపోతున్నాయి. అడుగు తీసి అడుగు వేయాలంటేనే జ‌నం వ‌ణికిపోతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా సూరీడు అంద‌రిపైనా త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తున్నాడు. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప జ‌నాలు బ‌య‌ట‌కు వెళ్ల‌డం లేదు. వారంద‌రికీ వినోదాన్ని పంచేందుకు ఓటీటీలు బోలెడంత కంటెంట్‌తో రెడీ అయ్యాయి. సినిమాలు, సిరీస్‌ల‌తో కావాల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇస్తామంటున్నాయి. మ‌రి మే నెల‌లో ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌లు ఏంటో చూసేద్దాం..నెట్‌ఫ్లిక్స్‌👉హీరామండి: ద డైమండ్ బ‌జార్ (వెబ్ సిరీస్‌)👉షైతాన్‌👉ద హాలీడే👉ఎ మాన్ ఇన్ ఫుల్ (వెబ్ సిరీస్‌)👉టి- పిబ‌న్ (వెబ్ సిరీస్‌)👉అన్‌ఫ్రాస్టెడ్‌👉ద గ్రేట్ ఇండియ‌న్ కపిల్ షో (ఎపిసోడ్ 6)(పైవ‌న్నీ మే నెల ప్రారంభంలోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి)👉సూప‌ర్ రిచ్ ఇన్ కొరియా (వెబ్ సిరీస్‌) - మే7👉ఎక్స్ఎక్స్ఎక్స్: రిట‌ర్న్ ఆఫ్ క్సాండ‌ర్ కేజ్ (వెబ్ సిరీస్‌) - మే 7👉ద ఫైనల్‌: అటాక్ ఆన్ వెంబ్లీ - మే 8👉క్రేజీ రిచ్ ఆసియ‌న్స్ - మే 8👉మ‌ద‌ర్ ఆఫ్ ద బ్రైడ్ - మే 9👉లివింగ్ విత్ లియోపార్డ్స్ - మే 10👉బ్ల‌డ్ ఆఫ్ జీయ‌స్  (సీజ‌న్ 2)- మే 10👉ద గ్రేడ్ ఇండిన‌య్ క‌పిల్ షో (ఎపిసోడ్ 7) - మే 11👉బ్రిడ్జ‌ర్ట‌న్ (మూడో సీజ‌న్- ఎపిసోడ్ 1)👉మేడ్‌మి వెబ్ - మే 14👉తెల్మా ద యునికార్న్ - మే 17👉అట్లాస్ - మే 24ల‌య‌న్స్ గేట్ ప్లే📽️ బ్లాక్ మాఫియా ఫ్యామిలీ (సీజ‌న్ 3) - మే 3📽️ ద మార్ష్ కింగ్స్ డాట‌ర్ - మే 10📽️ కాప్‌షాప్ - మే 17📽️ వాంటెడ్ మ్యాన్ - మే 24📽️ విజిల్ (సీజ‌న్ 2) - మే 31హాట్‌స్టార్‌🎞️ బ్లీచ్‌:  థౌజండ్ ఇయ‌ర్ బ్ల‌డ్ వార్🎞️షార్డ్‌లేక్🎞️వెల్‌క‌మ్ టు వ్రెక్జామ్‌🎞️ప్రామ్ డేట్స్‌🎞️స్టార్ వార్స్‌: టేల్స్ ఆఫ్ ద ఎంపైర్‌(మే ప్రారంభం నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి)🎞️మాన్‌స్ట‌ర్స్ ఎట్ వ‌ర్క్ - మే 5🎞️మంజుమ్మెల్ బాయ్స్ - మే 5🎞️ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజ‌ర్స్ - మే 8🎞️అండ‌ర్ ద బ్రిడ్జ్ - మే 8🎞️లెట్ ఇట్ బి - మే8🎞️డాక్ట‌ర్ హు - మే 11🎞️క్రాష్ - మే 13🎞️అంకుల్ సామ్‌సిక్ - మే 15🎞️క్వీన్ రాక్ మాంట్రియ‌ల్ - మే 15🎞️పాలైన్ - మే 22🎞️మార్వెల్ స్టూడియోస్ అసెంబ్ల్‌డ్‌: ద మేకింగ్ ఆఫ్ ఎక్స్ మెన్ 97 - మే 22🎞️ద క‌ర్దాషియ‌న్స్ - మే 23🎞️ద బీచ్ బాయ్స్ - మే 24🎞️కాండెన్ - మే 29🎞️జిమ్ హెన్స‌న్ ఐడియా మ్యాన్ - మే 31అమెజాన్ ప్రైమ్‌📽️ అమెరిక‌న్ ఫిక్ష‌న్ - మే 14📽️ ద బ్లూ ఏంజెల్స్ - మే 23📽️ ద బాయ్స్ ఇన్ ద బోట్ - మే 28బుక్ మై షో స్ట్రీమ్‌👉 డేర్ డెవిల్ ముస్త‌ఫా👉 ఆర్కెస్ట్రా మైసూరు👉 మిస్ట‌ర్ న‌ట్వర్‌లాల్‌👉 కాంక్రీట్ ఉటోపియా👉 మాన్‌స్ట‌ర్‌👉 గాడ్జిల్లా వ‌ర్సెస్ కాంగ్‌: ద న్యూ ఎంపైర్‌👉 ఎండేవ‌ర్ సీజ‌న్ 1👉 ఎండేవ‌ర్ సీజ‌న్2👉 ఎండేవ‌ర్ సీజ‌న్ 3👉 ఎండేవ‌ర్ సీజ‌న్ 4👉 ఎండేవ‌ర్ సీజ‌న్ 9👉 ఎండేవ‌ర్ - పైల‌ట్‌అల్ట్రాజ‌కాస్‌🎞️ రంగీత్‌🎞️ యాసిడ్‌🎞️ అభ్యూహ‌మ్‌🎞️ డోంట్ లుక్ అవే🎞️ టైగ‌ర్ రాబ‌ర్స్‌📺 ఫ్యామిలీ క‌ట్టా (షో)📺  కుక‌రీ షో📺 మ‌హారాష్ట్ర‌చీ హస్య‌జాత‌ర (షో)📺 అనైతిక్ (వెబ్ సిరీస్‌)📺 ఉద‌ర్ బైకో (వెబ్ సిరీస్‌)📺 న‌జ‌ర‌బండి (వెబ్ సిరీస్‌)📺 లైసా (వెబ్ సిరీస్‌)యాపిల్ టీవీ👉  అకాపుల్కో (సీజ‌న్ 3) - మే 1👉  డార్క్ మ్యాట‌ర్ - మే 8👉  హాలీవుడ్ కాన్ క్వీన్ - మే 8👉  ద బిగ్ సిగ‌ర్ - మే 17👉  ట్రైయింగ్ (సీజన్ 4) - మే 22అమెజాన్ మినీ టీవీ📽️ ద రిట‌ర్న్ ఆఫ్ రెబ‌ల్ - మే 2📽️ మ‌గ‌ధీర - మే 2📽️ మిడిల్ క్లాస్ అబ్బాయి - మే 2📽️ యు ఆర్ మై డెస్టినీ - మే 8📽️ 96 - మే 9📽️ దేవ్ - మే 9📽️ ప్రేమ‌మ్ - మే 9📽️ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని - మే 9📽️ డేంజ‌రస్ ఖిలాడీ 2 - మే 9📽️ ట‌ర్న్ బ్యాక్ - మే 13📽️ అండ‌ర్‌క‌వ‌ర్ కౌంట‌ర్ అటాక్ - మే 14📽️ ఐ బిలాంగ్‌డ్ టు యువ‌ర్ వ‌ర‌ల్డ్ - మే 15📽️ మ‌ర్డ‌ర్ ఇన్ ద ఫ‌స్ట్ - మే 15మ్యాక్స్‌👉  స్టాప్ మేకింగ్ సెన్స్ - మే 3👉  ద ఐర‌న్ క్లా - మే 10👉  మూవీపాస్‌, మూవీ క్రాష్ - మే 29హుళు🎞️ ప్రామ్ డేట్స్ - మే 3🎞️ ఈలెన్ - మే 10🎞️ బ‌యోస్పియ‌ర్ - మే 10🎞️ బ‌ర్త్‌/ రీబ‌ర్త్ - మే 17🎞️ ద స్వీట్ ఈస్ట్ - మే 17🎞️ ద వెంట్ ద‌ట్ వే - మే 17🎞️ ఫెరారీ - మే 24🎞️ ద ప్రామిస్‌డ్ ల్యాండ్ - మే 30🎞️ సింప‌తీ ఆఫ్ ద డెవిల్ - మే 31చ‌ద‌వండి: అంద‌రికీ న‌చ్చ‌క‌పోయినా ప‌ర్లేదు.. మ‌ధ్య‌లో చై ఎందుకో!

Hollywood Actress Meryl Streep To Receive The Honorary Palme D Or At Cannes Opening Ceremony
హలీవుడ్‌ నటి మెరిల్‌ స్ట్రీప్‌ అరుదైన పురస్కారం

హాలీవుడ్‌ ప్రముఖ నటి మెరిల్‌ స్ట్రీప్‌ ఆనందంలో ఉన్నారు. ఈ నెల 14 నుంచి 25 వరకు ఫ్రాన్స్‌లో 77వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ చలన చిత్రోత్సవాల్లో ప్రతిష్టాత్మకమైన పామ్‌ డి ఓర్‌ గౌరవ పురస్కారానికి మెరిల్‌ స్ట్రీప్‌ను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఆమె ఆనందానికి కారణం ఇదే. ఈ ఏడాది మెరిల్‌ స్ట్రీప్‌కు, జపాన్‌కు చెందిన యానిమేషన్‌ ‘స్టూడియో ఘిబ్లి’ నిర్వాహకులకు, హాలీవుడ్‌ దర్శక–నిర్మాత జార్జ్‌ వాల్టన్‌ లూకాస్‌ జూనియర్‌ (స్టార్‌ వార్స్, ఇండియానా జోన్స్‌’ ఫేమ్‌)కు పామ్‌ డి ఓర్‌ పురస్కారాన్ని అందజేస్తారు. ఈ సందర్భంగా మెరిల్‌ స్ట్రీప్‌ మాట్లాడుతూ – ‘‘ఈ  అవార్డుకు ఎంపిక కావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. అంతర్జాతీయ నటీనటులు, ఫిల్మ్‌ మేకర్స్‌ భాగాస్వామ్యులైన కాన్స్‌ వేదికగా నేను ఈ అవార్డును గెలుచుకోవడం అనేది ఫిల్మ్‌ మేకింగ్‌ రంగంలో నాకు దక్కిన ఓ అద్భుత విజయంగా భావిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. గతంలో హాలీవుడ్‌ స్టార్స్‌ టామ్‌ క్రూజ్, మైఖేల్‌ డగ్లస్, హారిసన్‌ ఫోర్డ్‌ వంటివారికి పామ్‌ డీ ఓర్‌ అవార్డు దక్కింది.

Bollywood Actress  Sonali Bendre Shocking Comments On Producers
వాళ్లే కావాలని ఎఫైర్స్ అంటగట్టేవారు: స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్

బాలీవుడ్‌ భామ సోనాలి బింద్రే తెలుగువారికి సైతం సుపరిచితమే. మహేశ్ బాబు సరసన మురారి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత మెగాస్టార్ మూవీ ఇంద్ర, నాగార్జునతో మన్మధుడు చిత్రాలతో సూపర్ హిట్స్‌ తన ఖాతాలో వేసుకుంది. అయిత 2002లోనే నిర్మాత,వ్యాపార వేత్త అయినా గోల్డీబెల్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సినిమాలు చేయడం పూర్తిగా తగ్గించేసింది. చివరిసారిగా 2022లో లవ్ యూ హమేశా చిత్రంలో కనిపించింది. 90ల్లో స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ ఇటీవల ది బ్రోకెన్‌ న్యూస్‌ సీజన్‌-2తో ప్రేక్షకుల ముందుకొచ్చారు.  ఈ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా అప్పటి నిర్మాతలపై సంచలన కామెంట్స్ చేశారు.సోనాలి బింద్రే మాట్లాడుతూ.. '1994లో నేను ఇండస్ట్రీలోకి వచ్చా. ఇప్పటికంటే అప్పటి  పరిస్థితులు చాలా డిఫరెంట్‌గా ఉండేవి. అప్పట్లో సహనటులతో నాపై ఎన్నో రూమర్స్‌ సృష్టించారు. కానీ వాటిల్లో ఒక్కటంటే ఒక్కటి నిజం లేదు. ఇప్పటికీ ఈ చెత్త ట్రెండ్‌ కొనసాగుతూనే ఉంది. 1990ల్లో సినిమా నిర్మాతలే కావాలనే హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్‌ క్రియేట్‌ చేసేవారు. వాటిని మీడియాకు చెప్పేవాళ్లు. సినిమా ప్రమోషన్స్‌ కోసం ఈ విధంగా చేసేవారని తెలిసి ఆశ్చర్యపోయా'  అని తెలిపారు.అయితే సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లలో సన్నగా ఉన్నందుకు అవహేళన చేసేవారని సోనాలి బింద్రే తెలిపారు. ఆ రోజుల్లో హీరోయిన్లు కాస్తా బొద్దుగా ఉండేవారని పేర్కొన్నారు. నేను సన్నాగా విషయాన్ని కొందరు నిర్మాతలు మొహం మీదే చెప్పేవారని వెల్లడించింది. నేను అలాంటివాటిని పట్టించుకునే దాన్ని కాదని వివరించింది. అంతేకాదు.. ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడూ అనుకోలేదని..  నటనలోనూ ఎలాంటి శిక్షణ తీసుకోలేదని.. అసలు స్టార్‌ హీరోయిన్‌గా అవుతానని ఊహించలేదని సోనాలి ఆ రోజులను మరోసారి గుర్తుకు తెచ్చుకుంది. 

Vijay Devarakonda And Dil Raju New Movie Launch
టాలెంటెడ్ డైరెక్టర్‌తో దిల్‌ రాజు- విజయ్‌ దేవరకొండ కొత్త సినిమా ప్రకటన

టాలీవుడ్‌ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా విజయ్ తన కొత్త సినిమాను తాజాగా ప్రకటించారు. 'రాజావారు రాణిగారు' సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ సినిమా ఇది. ఈరోజు  లాంఛనంగా అనౌన్స్ చేశారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో విజయ్ దేవరకొండ కొత్త సినిమా తెరకెక్కనుంది. మే 9న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు. విజయ్‌ దేవరకొండ- దిల్‌ రాజు కాంబోలో ఫ్యామిలీస్టార్‌ సినిమా కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. కొందరు కావాలని సినిమాపై నెగెటివ్‌ టాక్‌ వ్యాప్తి చేయడంతో కొంతమేరకు నిరాశపరిచిందని వార్తలు వచ్చాయి. కానీ, హిట్టు ఫ్లాప్‌తో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండతో మరొక సినిమా చేస్తానని దిల్ రాజు గతంలోనే అన్నారు. అయితే ఫ్యామిలీ స్టార్ ఫలితం తర్వాత దిల్ రాజు ఇచ్చిన మాటను పక్కనపెడుతారేమో అని అందరూ అనుకున్నారు. అందరి అంచనాలకు మించి ఆయన తాజాగా కొత్త సినిమాను ప్రకటించారు.  కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న రవికిరణ్ కోలాకి ఏకంగా ఇంతటి భారీ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చి దిల్ రాజు అందరిని ఆశ్చర్య పరిచారు.  ఇక్కడ విజయ్ దేవరకొండ కూడా తన కమిట్‌మెంట్‌తో దిల్ రాజు మనసు గెలుచుకున్నారని చెప్పవచ్చు. A Larger-than-life "Rural Action Drama" is on the cards 🧨#SVC59 will be @TheDeverakonda's Mass EndeavourX A @storytellerkola's Vision 💥 Produced by Raju - Shirish ✨More Updates on 9th May, Stay tuned to @SVC_official pic.twitter.com/FVca4INOGC— Sri Venkateswara Creations (@SVC_official) May 4, 2024

Sreeleela Refuse Special Song In The GOAT
భారీ ఆఫర్‌ను రిజెక్ట్‌ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట

టాలీవుడ్‌లో పెళ్లి సందడి చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యి తనదైన చలాకీ నటనతో సినీ పరిశ్రమ దృష్టిని తన వైపునకు తిప్పుకున్న నటి శ్రీలీల. అలాగే ఆ చిత్రం సక్సెస్‌ అయినా ఆ వెంటనే మరో అవకాశం రాకపోవడంతో ఈ అమ్మడి పరిస్థితి అంతేనా అనే కామెంట్స్‌ కూడా దొర్లాయి.అయితే రవితేజ సరసన నటించిన  ఢమాకా చిత్రం హిట్‌ అవడం, ముఖ్యంగా అందులోని పాటల్లో శ్రీలీల తన డా¯న్స్‌తో కుర్రకారును ఫిదా చేసింది. దీంతో ఆమె పేరు మారు మ్రోగింది. ఆ తరువాత మహేష్‌ బాబు సరసన నటించే అవకాశం రావడంతో మరింత క్రేజ్‌ వచ్చింది. దీంతో ఇతర భాషల దర్శక నిర్మాతల దృష్టి శ్రీలీలపై పడింది. అలా కోలీవుడ్లో భారీ అవకాశాలు తలుపు తడుతున్నాయి. ముందుగా దళపతి విజయ్‌తో స్పెషల్‌ సాంగ్‌లో నటించే అవకాశం వచ్చింది.విజయ్‌ ప్రస్తుతం గోట్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఏజీ ఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రంలో నటి మీనాక్షి శేషాద్రి, స్నేహ, లైలా, మైక్‌ మోహన్, ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్‌ జీ మొదలగు పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇందులో నటుడు విజయ్‌ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఒకటి విలన్‌ పాత్ర అనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ రష్యాలో జరుగుతోంది. కాగా ఇందులో ఒక స్పెషల్‌ సాంగ్‌ చోటు చేసుకుంటుందట. ఆ పాటలో నటి త్రిష నటించనున్నారనే ప్రచారం జరిగింది.ఆ తరువాత కాల్‌ షీట్స్‌ సమస్య కారణంగా ఆమె నటించలేని పరిస్థితి అని, దీంతో టాలీవుడ్‌ యువ స్టార్‌ కథానాయకి శ్రీలీలను ఆ అవకాశం వరించిందని సమాచారం. అయితే ఆ అవకాశాన్ని శ్రీలీల తిరస్కరించినట్లు తెలిసింది. కారణం కోలీవుడ్‌లో సింగిల్‌ సాంగ్‌తో ఎంట్రీ అయితే అది కెరీర్‌ ఎదుగుదలకు బాధింపు ఏర్పడుతుందని భావించడమేనట. ఇది ఆమె బ్రిలియంట్‌ డెసిషన్‌ అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా ఇప్పుడు శ్రీలీల త్వరలో మరో స్టార్‌ హీరో అజిత్‌ సరసన గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రంలో కథానాయికగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్‌. 

Sobhita Dhulipala Cryptic Post Amid Dating Rumours With Naga Chaitanya
శోభిత పోస్ట్‌.. స‌మంత స్టైలిష్ట్ రిప్లై

తెలుగుమ్మాయి శోభిత ధూళిపాళ టాలీవుడ్‌, బాలీవుడ్‌లోనే కాదు ఏకంగా హాలీవుడ్‌లోనూ ఆఫ‌ర్ అందుకుని అక్క‌డా సినిమాలు చేస్తూ త‌న స‌త్తా చాటుతోంది. ఈ మ‌ధ్య వెకేష‌న్‌కు వెళ్ల‌గా.. తెలుగు హీరో నాగ‌చైత‌న్య కూడా త‌న వెంటే ఉన్నాడ‌ని రూమ‌ర్స్ వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసిందీ బ్యూటీ. 'ఐయామ్ నాట్ ఎవ్రీవ‌న్ క‌ప్ ఆఫ్ చాయ్ (chai), అండ్ ద‌ట్స్ ఓకే' అని రాసుకొచ్చింది. నేనంద‌రికీ న‌చ్చ‌క‌పోయినా నాకేం ప‌ర్లేదు అని దాన‌ర్థం.క‌ప్ ఆఫ్ చాయ్/చైసాధార‌ణంగా క‌ప్ ఆఫ్ టీ అంటారు. కానీ శోభిత క‌ప్ ఆఫ్ చాయ్ అని పేర్కొంది. దీంతో కొంద‌రు నెటిజ‌న్లు చైత‌న్య‌ను ప్ర‌స్తావిస్తూనే చై అని రాసింద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. టీకి బదులుగా చాయ్‌/ చై అని రాయ‌డం దేనికో అని కామెంట్స్ చేస్తున్నారు. స‌మంత స్టైలిస్ట్ ప్రీత‌మ్ జుకల్క‌ర్ ఈ పోస్ట్‌కు స్పందిస్తూ.. నేను కూడా నా విష‌యంలో అలాగే ఫీల‌వుతుంటాను అని రాసుకొచ్చాడు.కెరీర్‌శోభిత కెరీర్‌ విష‌యానికి వ‌స్తే.. గూడ‌చారి, మేజ‌ర్ సినిమాల‌తో తెలుగు వారికి ద‌గ్గ‌రైంది. రామ‌న్ రాఘ‌వ‌న్ 2.0, పొన్నియ‌న్ సెల్వ‌న్ 1, ఘోస్ట్ స్టోరీస్ వంటి ప్రాజెక్టుల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. మేడ్ ఇన్ హెవెన్‌, ద నైట్ మేనేజ‌ర్ వెబ్ సిరీస్‌ల‌తో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. మంకీ మ్యాన్ మూవీతో హాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌స్తుతం సితార అనే హిందీ చిత్రంలో న‌టిస్తోంది.     View this post on Instagram           A post shared by Sobhita (@sobhitad) చ‌ద‌వండి: 25 ఏళ్ల కెరియర్‌లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు

Advertisement


Advertisement