ADVERTISEMENT
Funday
ఉదయం టిఫిన్‌కు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఇంట్లో మిగిలిపోయిన బ్రెడ్తోనే కేవలం 10 నిమిషాల్లో రుచికరమైన బ్రెడ్ ఉప్మా తయారు చేసుకోవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ రుచి ఇచ్చే ఈ రెసిపీని ఒకసారి...
పూర్వం భరద్వాజ వంశంలో సుతపుడు అనే విప్రుడు ఉండేవాడు. శ్రీహరి భక్తుడైన అతడు హిమాలయాలపై నివసించేవాడు. శ్రీకృష్ణుడి ప్రీతి కోసం హిమాలయాలలో అతడు సుదీర్ఘకాలం తపస్సు చేశాడు. తపస్సు కొనసాగిస్తున్న సుతపుడు బ్రహ్మతేజంతో వెలుగొందసాగాడు...
కోసల రాజ్యంలోని ముకుందపురం గ్రామంలో కేశవుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ బతికేవాడు. పగలంతా కూలి పనులు చేసుకుంటూ రాత్రి ఊరి గుడి దగ్గర అరుగు మీద...
తలకు మర్దన చేయించుకోవడానికి ఇకపై సెలూన్‌కో, బ్యూటీపార్లర్కో వెళ్లనక్కర్లేదు. ‘ఎలక్ట్రిక్ హెడ్ అండ్ స్కాల్ప్ మసాజర్’ చెంతనుంటే చాలు. ఇంట్లోనే కూర్చుని మర్దన చేసుకోవచ్చు. దీనిని తలకు ఆనించి, తల చుట్టూ తిప్పుతూ ఉంటే...
సాధారణంగా పర్ఫ్యూమ్ల తయారీలో పువ్వులు, వేర్లు; కొన్నిరకాల జంతువుల నుంచి సేకరించిన పదార్థాలను ఉపయోగిస్తారు. తిమింగలాల వమనం(వాంతి)తో కూడా పర్ఫ్యూమ్ను తయారు చేస్తారంటే నమ్మశక్యంగా ఉండదు గాని, ఇది నిజం. ఈజిప్టు నాగరికత కాలం...
నగర కమిషనర్ భార్య నిహారిక మెడలోని ఐదు తులాల బంగారు గొలుసు పట్టపగలే చోరీకి గురైంది. వీఐపీ ఏరియాలో జరిగిన ఈ సంఘటన పోలీస్ శాఖ ప్రతిçష్ఠకు సవాలుగా మారింది. కమిషనర్ ఈ కేసును...
‘‘నువ్వు ఇంటికి తిరిగి వెళ్తూండగా మరణించావు.’’ ‘‘నీకు పిచ్చా?’’ వెంటనే అడిగాను. ‘‘అదో కారు ప్రమాదంలో జరిగింది. నువ్వు నీ భార్యని, ఇద్దరు పిల్లలని వదిలి ఇక్కడికి వచ్చావు. నీది బాధలేని తక్షణ మరణం.’’...
సూర్యుడు నడినెత్తి మీదకు వస్తున్నాడు. మధుర పట్టణంలోని ద్వారకాధీశ్ ఆలయ పరిసరాల్లో రద్దీ ఓ మోస్తరుగా ఉంది. అప్పుడే అక్కడ అడుగుపెట్టిన తొమ్మిదేళ్ల శాంతిదేవి కళ్లలో ఒక విచిత్రమైన శూన్యం, అంతకంటే వింతైన వెలుగు...
మామూలుగా చెర్రీ ధర కిలోకు రెండువందల నుంచి నాలుగువందల రూపాయలు ఉంటుంది. కొన్ని అరుదైన రకాల చెర్రీ ధర కిలోకు మూడువేల రూపాయల వరకు కూడా ఉంటుంది. జపాన్‌లో పండే ఈ అత్యంత అరుదైన...
పుచ్చకాయకు దాదాపు నాలుగువేల ఏళ్లకు పైబడిన చరిత్ర ఉంది. ప్రాచీన ఈజిప్షియన్లు ఎడారి దారుల్లో ప్రయాణించేటప్పుడు మార్గమధ్యంలో దాహార్తిని తీర్చుకోవడానికి పుచ్చకాయలను తప్పనిసరిగా వెంట తీసుకుపోయేవారు. ఆఫ్రికాలో మొదలైన పుచ్చకాయ ప్రస్థానం దాదాపు ప్రపంచమంతటా...
‘ఫొటో తీస్తా... పోజ్ ఇవ్వు!’ అని ఫ్రెండ్ అన్న వెంటనే... ఏం చేయాలో తెలియక చేతులు జేబుల్లో ఎట్టుకుని, తల ఎటు తిప్పాలో అర్థం కాక కెమెరానే చూస్తూ స్టాచ్యూ అయిపోతున్నారా? అయితే ఈ...
కెజువో ఇషిగురో ప్రపంచ ప్రసిద్ధ బ్రిటిష్ రచయిత. కవనం లాంటి వచనం రాయగలిగిన ఈ నవలా రచయిత మొదట్లో కథానికలతోనే పదిమంది దృష్టిలో పడ్డారు. ఈ రెండు ప్రక్రియల్లోనూ అందెవేసిన చెయ్యి అనిపించుకోవడానికి ముందు...
ఎండ సుర్రని కొడ్తాంది. పిల్లోళ్ళు కాళ్ళకి చెప్పులేసుకోని, టోపీలు పెట్టుకోని, బ్యాటు బాల్‌లు తీసుకోని కిర్కేట్ ఆడుకున్నేకి పోతాన్నారు. ఇంటి ముందర అరుగుల మింద నీడ పోయి ఎండొచ్చింది. సందులోకి చూస్తే ఎవురూ కనపడల్యా...
ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద కరీబియన్ సాంస్కృతిక వేడుకకు కెనడాలోని టొరంటో నగరం వేదికగా నిలుస్తోంది. ‘టొరంటో కరీబియన్ కార్నివాల్’ ఈ ఏడాది 59వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ వేడుకల్లో అత్యంత కీలకమైన గ్రాండ్ పరేడ్...
“మనం ఏది ఆలోచిస్తే అదే అవుతాం" అనేది కేవలం ఒక వేదాంత సూక్తి మాత్రమే కాదు, ఇప్పుడిది నిర్ధారణ అయిన ఒక శాస్త్రీయ వాస్తవం కూడా! మన మనస్సు, ఆలోచనలు మన శరీరంపై, ముఖ్యంగా...
మా ఏడేళ్ల బాబుకు తరచు దగ్గు వస్తోంది. కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. పిల్లికూతలు కూడా వినిపిస్తున్నాయి. డాక్టర్ ఇన్ హేలర్ వాడమన్నారు. కానీ ఇంట్లో వాళ్లు ఒకసారి ఇన్ హేలర్ మొదలుపెడితే...
‘కావమ్మ మొగుడు... కావమ్మ మొగుడు అని అందరూ అంటుంటే... కామోసనుకున్నాను నాకేం తెలుసు’ అన్నాడట ఒకడు. అలా అందరూ ‘అతడు తప్పిపోయిన మీ కొడుకే, అచ్చం అలాగే ఉన్నాడ’ని చెప్పడంతో వృద్ధాప్యంలో ఉన్న ఆ...
ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద కరీబియన్ సాంస్కృతిక వేడుకకు కెనడాలోని టొరంటో నగరం వేదికగా నిలుస్తోంది. ‘టొరంటో కరీబియన్ కార్నివాల్’ ఈ ఏడాది 59వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ వేడుకల్లో అత్యంత కీలకమైన గ్రాండ్ పరేడ్...
పిగ్గీబ్యాంకులు సాధారణంగా పిల్లలు తేలికగా పట్టుకొనేలా ఉంటాయి. పిగ్గీబ్యాంకులతో ఆడుకుంటూ, వాటిలో చిల్లర డబ్బులు దాచుకుంటూ, పిల్లలు తొలి పొదుపు పాఠాలు నేర్చుకుంటారు. కొలంబియాలోని ఒక థీమ్ పార్కులో ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద పిగ్గీబ్యాంకు...
క్యాడ్బరీ యాడ్‌లో ఓ చిరునవ్వుతో మెరిసిన అమ్మాయే– నేడు కుర్రాళ్ల కొత్త క్రష్‌గా మారిన భాగ్యశ్రీ బోర్సే. కానీ ఈ అందాలభామ ప్రయాణమంతా రంగులే కాదు. నవ్వించే కథలూ ఉన్నాయి; కన్నీళ్లు పెట్టించే జ్ఞాపకాలూ...
హాట్‌స్పాట్ అడగకుండానే ఆన్ చేసేవాడు... ఓటీటీ పాస్వర్డ్ లాంగ్ టైమ్ షేర్ చేసేవాడు... బిర్యానీ ఆర్డర్ చేస్తే బిల్ కట్టేవాడు... బ్రేకప్ స్టోరీని వందోసారి చెప్పినా ఓపిగ్గా వినేవాడు... అర్ధరాత్రి ఫోన్ చే సినా...
రోజూ చేసే చిన్న చిన్న పనులే ఎక్కువ సమయాన్ని తినేస్తుంటాయి! అలాంటి పనులను చిటికెలో పూర్తి చేసి, కాస్త స్మార్ట్‌గా మార్చే గాడ్జెట్లు ఇప్పుడు మార్కెట్లో బోలెడున్నాయి. వాటిలో కొన్ని ఆసక్తికరమైనవే ఇవి! సోలార్...
జామపండ్లు మన స్థానికమైనవే అనుకుంటాం గాని, ఇవి పదహారో శతాబ్దిలో పోర్చుగీసు నావికుల ద్వారా మన దేశానికి వచ్చాయి. అప్పటి నుంచి తోటల్లోనే కాదు, ఇళ్ల పెరళ్లలోనూ జామచెట్లను విరివిగా పెంచడం మొదలైంది. జామపండ్లను...
పూర్వం కృతయుగంలో శ్వేతుడు అనే రాజు సమస్త భూమండలాన్నీ పరిపాలించేవాడు. అతడి పరిపాలనలో ప్రజలు సర్వసుభిక్షంగా జీవించేవారు. అతడి రాజ్యంలో మనుషులకు పదివేల ఏళ్ల పరమాయువు ఉండేది. అకాల మరణాలు ఉండేవి కాదు. రోజులిలా...
విశ్వకవి రబీంద్రనాథ్ టాగోర్ గీత రచనలో ప్రదర్శించిన ప్రతిభకు నోబెల్ సాహిత్య పురస్కారం ఇస్తున్నట్లు 1913 నవంబర్ 13న స్వీడిష్ ఎకాడెమీ ప్రకటించింది. ‘ప్రగాఢమైన మార్దవమూ, నవనవలాడే తాజాదనమూ, ముగ్ధమోహన సౌందర్యమూ నిండిన కవిత’గా...
పైడి పర్వతం పక్కన ఉన్న కందర్ప రాజ్యం రాజు వివేక వర్మ సుపరిపాలన సాగిస్తూ, ప్రజలకు ఎంతో మేలుచేస్తూ, మంచి పేరు తెచ్చుకున్నాడు. పైడి పర్వతంలో పుట్టిన ధారావళి నది కందర్ప రాజ్యంలోని పొలాలను...
సమయం దొరికితే చాలు పనులను రేపటికి వాయిదా వేస్తున్నారా? అయితే మీరు ఏ రకమైన ‘ప్రొక్రాస్టినేటర్’ (వాయిదా వేసే వ్యక్తి) అయి వుండవచ్చో కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కేవలం బద్ధకం...
‘‘మీ అల్లుడికి హిమాచల్‌ప్రదేశ్‌లో చంబాకి బదిలీ అయింది.’’ సుధీర చెప్పింది. ‘‘అయ్యో! అంత దూరమా?’’ ఆమె తండ్రి వెంటనే చెప్పాడు. సాయంత్రం ఆయన సుధీరకి ఫోన్ చేసి చెప్పాడు. ‘‘మీ మామయ్య దుర్గ గుడిలో...
అది 1518 జూలై– ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్ నగరం– ఆకాశం నిర్మలంగా ఉంది. నగర వీథులు ఎప్పటిలాగే జనసమ్మర్దంతో సందడిగా ఉన్నాయి. హఠాత్తుగా ఒక ఇరుకైన సందులోంచి ఓ మహిళ రోడ్డుపైకి పరుగున వచ్చింది. ఆమె...
బాలి దీవిలో ఆకాశంపైకి ఎటు చూసినా రంగు రంగుల గాలిపటాలు కనువిందు చేస్తాయి. జూలై నుంచి అక్టోబర్ వరకు ఇదే దృశ్యం బాలి దీవికి కళ తీసుకొస్తుంది. ఈ గాలిపటాల వేడుకను దేశ విదేశాల...
బిజినెస్‌మేన్ సారథి ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాడు. సరిగా అదే సమయంలో ఒక గుర్తుతెలియని నంబర్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. సారథి ఫోన్ తీశాడు. అవతలి వ్యక్తి గొంతులో కరుకుదనం... ‘నీ కొడుకు రిత్విక్‌ను...
మనిషి భయంతో ఉన్నప్పుడు తాడు కూడా పాములా కనిపిస్తుంది. ఒక్కోసారి ఎదురుగా ఉన్న మనిషిని కూడా దెయ్యంలా భ్రమింప చేస్తుంది. ఆ రాత్రీ సరిగ్గా ఇలానే జరిగింది. ఎదురుగా చీకట్లో కనిపిస్తున్న మహిళలే ఆ...
విశాలమైన మేడల్లో కాదు... ఇరుకైన ఇళ్లల్లోనే సుఖం ఉంటుందని చెప్పిందెవడో కానీ, వాడు కనిపిస్తే అడ్డంగా నరికేయాలని సూరిబాబుకి అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. కృష్ణానగర్, బీ బ్లాకులోని, పూర్ణా టిఫిన్ సెంటర్ దాటుకుంటూ వెళ్తే వచ్చే...
అరచేతిలో తేలికగా ఇమిడిపోయే ఈ పరికరం ఒక మైక్రోడ్రోన్. ఇది గాల్లోని దోమలను గాల్లోనే మటాష్ చేసి పారేస్తుంది. దోమల బెడద నివారించడానికి ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన సాధనాలన్నీ ఒక తీరు అయితే...
అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటుపై ఎలాన్ మస్క్ వంటి దిగ్గజాలు ఒకవైపు ఏర్పాట్లు చేసుకుంటుంటే, నిన్న మొన్న ప్రారంభమైన అమెరికన్ స్టార్టప్ కంపెనీ ఒకటి అంతరిక్షంలో ఏకంగా లక్ష డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు...
అమ్మ కలను తన కలగా మార్చుకున్న నటి మీనాక్షి దినేష్ (Meenakshi Dinesh). కెమెరా ముందు హీరోయిన్ గా మెరిసినా... కెమెరా వెనుక మాత్రం కొత్త రుచుల కోసం ఊరంతాచుట్టేసే ఫుడీ! గాసిప్స్‌ను నవ్వుతూ...
నిన్నటి వరకు పెద్దలు చెప్పిన మాటకు పిల్లలు ‘ఓకే’ చెప్పడమే తెలుసు. కానీ, నేడు ఏడేళ్ల పిల్లాడు సైతం ‘నాకు కాస్త స్పేస్ కావాలి’ అంటూ సరిహద్దులు గీస్తున్నాడు. చాట్ జీపీటీని చదివేస్తున్నాడు. ఏఐని...
కొత్త డ్రెస్! అనిపించాలంటే ప్రతిసారి కొత్త బట్టలు కొనాల్సిన పనిలేదు. ఒక్క జత వైట్ స్నీకర్స్ ఉంటే చాలు! ఇవి మీ వార్డ్‌రోబ్‌లో ఉన్న ప్రతి డ్రెస్‌తో ఫ్రెండ్షిప్ చేసి, ప్రతిసారి కొత్తగా చూపిస్తాయి...
‘నేను నీకన్నా పెద్దవాణ్ణి... నాతో నీకు ప్రేమ సెట్ కాదు’... అంటాడు హీరో. ‘అయినా ఓకే... నేనేమైనా తప్పు చేస్తే... చిన్నమ్మాయి అని క్షమిస్తావ్... నువ్వేమైనా అంటే.. పెద్దోడు అని సర్దుకుపోతా’ అంటుంది హీరోయిన్...
చర్మ సంరక్షణ అనేది నేడు ఒక నిరంతర ప్రక్రియగా మారింది. అయితే, ప్రతిసారీ బ్యూటీ క్లినిక్‌లకు వెళ్లే సమయం, ఓపిక లేని వారి కోసం సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అదే ‘సోలావేవ్ వ్యాండ్’...
పని మధ్యలో చిన్న బ్రేక్ కావాలన్నా, కోపాన్ని తగ్గించుకోవాలన్నా, చికాకును దూరం చేసుకోవాలన్నా, టెన్షన్‌ను కాస్త పక్కకు పంపాలన్నా, పిల్లలు సరదాగా ఆడుకోవాలన్నా... ఈ కూల్ గాడ్జెట్లు ఉండాల్సిందే! చేతులను బిజీగా, మనసును హ్యాపీగా...
షర్ట్ మడతేస్తే.. మాస్ కాదు. కరెక్ట్‌గా వేస్తే క్లాస్ కూడా! షర్ట్ వేసుకున్నాక స్లీవ్స్‌ను మడతపెట్టడం ప్రతి అబ్బాయి చేసే పని. కాని, చాలామంది ఇప్పటికీ పాత పద్ధతిలో ఫాలో అవుతూ.. షర్ట్ చేతులతో...
జపాన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సాంస్కృతిక ఉత్సవం గియాన్ మత్సూరీ వేడుకలు ప్రారంభమయ్యాయి. జూలై నెల మొత్తం అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. యాసకా ఆలయానికి సంబంధించిన ఈ చారిత్రాత్మక ఉత్సవాల్లో ముఖ్య...
సుందరవనంలో ఐరావతం అనే ఒక ఏనుగు ఉండేది. అది అన్నింటికీ సాయం చేసేది. ఇలా ఉండగా, ఒకరోజు ఒక జింక పిల్ల ఆహారం కోసం బయలుదేరింది. దానికి ఎదురుగా ఆకస్మికంగా ఒక పెద్దపులి కనబడింది...
ప్రకృతి వైపరీత్యాలు, అడవుల నరికివేత, విచ్చలవిడి కాలుష్యాలతో భూగోళం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భూతాపం నానాటికీ పెరిగి పోతుండటంతో, రాబోయే కాలంలో మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. ఈ క్రమంలో, భూమిని...
చెన్నైకి చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి ముత్తుస్వామి హైదరాబాద్ వచ్చాడు. కోట్ల విలువైన వజ్రాలు అతని వద్ద ఉన్నాయి. ఆధునిక స్టార్ హోటల్స్‌లో దిగితే నిఘా ఉంటుందని, ఎవరికీ అనుమానం రాకూడదని అతను హైదరాబాద్...
కొలీన్ హాకిన్ కిచెన్‌లో పనిచేసుకుంటోంది. హాల్లో ఆడుకుంటున్న ఆమె మూడేళ్ల చిన్న కుమారుడు బ్లేక్ హాకిన్ భయంతో గట్టిగా అరిచాడు. బయట రోడ్డుపై స్కూల్ బస్సు కోసం వేచి చూస్తున్న తన అన్నయ్యను ఉద్దేశించి...
దూరాన వినిపించెనొక తల్లి నోట, చిరుమువ్వ సడి పోలు ఓ జోలపాట అంతమెరుగని భయము, హద్దులెరుగని వగపు ఆ జోలపాటగా అల్లుకున్నాయి; రణభూమి వెలువర్చు ప్రతి ఒక్క గుండు, బలి తీసుకుంటుంది ఒక తల్లి...
ప్రపంచవ్యాప్తంగా పండే తృణధాన్యాలలో మొక్కజొన్నను రారాజుగా చెప్పుకోవచ్చు. మొక్కజొన్న నిజానికి మన దేశంలో స్థానిక పంట కాదు. పోర్చుగీసువారి ద్వారా ఐదు శతాబ్దాల కిందట మనకు మొక్కజొన్నతో పొత్తు కుదిరింది. వానాకాలంలో చిరుజల్లులు కురుస్తున్నప్పుడు...
ఓటమి అనేది ఎవరికైనా బాధాకరం. జీవితంలో ఎంతో సాధించాక, ఎన్నో మెట్లెక్కాక, ‘నువ్వు ఓడిపోయావు’ అని నీ జీవితం నీతో చెబితే అది ఎంత విషాదకరం. రఘురాం పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది...
ప్రాచీన్ కారు కొన్నప్పటి నుంచి గమ్యం దృష్టిలో ఉంచుకొని అటు వైపు డ్రైవ్ చేస్తూంటాడు. ఆ మధ్యాహ్నం మాత్రం అతను కారుని గమ్యం లేకుండా డ్రైవ్ చేస్తున్నాడు. అతను కారెక్కి అరగంట దాటుతోంది. ట్రాఫిక్...
మా ఐదేళ్ల బాబు రాత్రంతా నోరు తెరిచే నిద్రపోతాడు. గురక కూడా బాగా పెడుతున్నాడు. చిన్నపిల్లలకు ఇది సహజమే అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆందోళనగా ఉంది. – కీర్తి, నంద్యాల పిల్లల్లో తరచు గురక...
ఒకానొకప్పుడు జాబాలి అనే బ్రాహ్మణ కర్షకుడు ఉండేవాడు. వ్యవసాయంలో పొలం దున్నడానికి నాగలికి జోడెద్దులను కట్టేవాడు. అతడు ఎడ్లను సరిగా చూసుకునేవాడు కాదు సరికదా, నీరసించిన ఆ ఎడ్లు వడి వడిగా పొలం దున్నలేకపోతే...
భార్య నుంచి విడాకులు కావాలని భర్త, ఆ భర్త ద్వారా తనకు రెండో సంతానం కావాలని భార్య– ఇద్దరూ కోర్టు మెట్లెక్కారు. ఎవరి హక్కుల గురించి వారు వాదించారు. ఎలాగైనా ఒప్పించాలని భార్య; బంధమే...
‘తూ చీజ్ బడీ హై మస్త్...’ అంటూ ఒకప్పుడు రవీనా టాండన్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ‘ఉయి అమ్మ...’ అంటూ ఆమె తనయురాలు రాషా తడానీ కుర్రకారు హార్ట్ బీట్‌ను పెంచింది. తొలి...
ఇప్పటికి సరిగ్గా తొంభై ఏళ్ళ క్రితం తొలి తెలుగు సోషల్ ఫిల్మ్ – ‘ప్రేమ విజయం’ వచ్చింది (రిలీజ్ 1936 జూలై 20). ఇవాళ మనం చూస్తున్న అన్ని సోషల్ సినిమాలకూ అదే పునాది...
ప్రపంచంలోనే అతి ఖరీదైన ఉత్తరం అంటే, ఇదేదో ప్రసిద్ధుల ప్రేమలేఖ అనుకున్నారంటే తప్పులో కాలేసినట్లే! ఇది ఒక వర్తకుడు మారిషస్ నుంచి ఫ్రాన్స్‌లో ఉన్న తన వ్యాపార భాగస్వాములకు రాసిన ఉత్తరం. దీనిని సింగపూర్‌లోని...
సాధారణంగా ఒక్కో వెల్లుల్లి ముప్పై గ్రాముల నుంచి వంద గ్రాముల వరకు బరువు తూగుతాయి. బ్రిటన్‌లోని గ్లూసెస్టర్‌షైర్‌కు చెందిన గ్రాహమ్ బారాట్ తన పెరటితోటలో ఇటీవల పండించిన వాటిలో ఒక భారీ వెల్లుల్లి ఏకంగా...
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్‌ను చైనా నిర్మించింది. చైనా నైరుతి ప్రాంతంలోని చాంగ్కింగ్–ఈస్ట్ రైల్వేస్టేషన్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్‌గా రూపొందించింది. దీని విస్తీర్ణం 1.22 మిలియన్ చదరపు మీటర్లు. ఇది న్యూయార్క్‌లోని గ్రాండ్ సెంట్రల్ స్టేషన్...
ఇంటి పనులు ఎప్పుడూ తగ్గవు... కానీ వాటి కష్టం మాత్రం తగ్గించొచ్చు! చిన్నగా కనిపించే ఇవీ అవసరమైనప్పుడు పెద్ద సహాయం చేస్తుంది. ఇంట్లో ఒక్కసారి చోటు దక్కితే చాలు... ‘ఇంతకాలం ఇవి లేకుండా ఎలా...
‘అల్మరాలో పది ప్యాంట్లు ఉన్నా... చేతికి వచ్చేది మాత్రం అదే జీన్స్!’ చాలామంది అబ్బాయిల కథ ఇదే. ఆఫీస్ అయినా... డేట్ అయినా... పార్టీ అయినా... ‘జీన్స్ వేసుకుంటే సేఫ్!’ అనుకుంటారు. కానీ ఒక్కసారి...
అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది చాలా శక్తిమంతమైనది, కానీ శక్తికి మించిన గర్వం దాని సొంతం. ప్రతిరోజూ ఉదయాన్నే ఆ సింహం చేసే భయంకరమైన గర్జనలకు అడవిలోని చెట్లు సైతం...
నా వయస్సు 22 సంవత్సరాలు. నాకిప్పుడు ఏడోనెల. ఇటీవల పరీక్ష చేయించుకుంటే రక్తపోటు ఎక్కువగా ఉందని డాక్టర్ చెప్పారు. మందులు కూడా వాడమన్నారు. ఈ సమస్య వల్ల నాకు లేదా నా బిడ్డకు ఏమైనా...
ఆదిశేషుడి కొడుకు మణినాగుడు గరుత్మంతుడి భయం వల్ల కైలాసానికి వెళ్లి, పరమశివుని సన్నిధిలో ఉంటూ ఆయనను సేవించుకోసాగాడు. కొన్నాళ్లకు పరమశివుడు అతడి భక్తిప్రపత్తులకు ప్రసన్నుడయ్యాడు. ‘మణినాగా! నీ భక్తికి మెచ్చాను. వరమేమి కావాలో కోరుకో!’...
మీరు వాట్సాప్ సందేశం పంపిన ప్రతిసారీ, నెట్‌ఫ్లిక్స్ షో చూసిన ప్రతిసారీ, లేదా గూగుల్‌లో ఏదైనా వెతికిన ప్రతిసారీ.. మీరు ప్రపంచంలో ఎక్కడో ఉన్న ఒక డేటా సెంటర్‌కు కనెక్ట్ అవుతున్నారని అర్థం. ఆధునికమైన...
మంగోలియా అస్తిత్వానికి, అక్కడి ప్రజల జీవన విధానానికి అద్దం పట్టే జాతీయ ఉత్సవం ‘నాదమ్’. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ఈ వేడుకను ప్రతి సంవత్సరం జూలై 11 నుంచి 13 వరకు దేశవ్యాప్తంగా అత్యంత...
స్నానం చేస్తూ పాటలు పాడుతున్నారా? అయితే మీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తున్నట్టే! పాటలు పాడేటప్పుడు ఊపిరిని లోతుగా తీసి వదలాల్సి ఉంటుంది. దీంతో ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. అంటే... మీ బాత్రూమ్ కచేరీ...
చీకట్లోనే కాదు, వెలుతురులో కూడా చీకటి నేరాలు జరిగే సమయం.. మధ్యాహ్నం రెండు గంటలు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని ఒక నిర్జన ప్రదేశం. మహాలక్ష్మి బ్యాంక్‌కు చెందిన చెస్ట్ వ్యాన్ భారీ...
కర్పూరవల్లి ఏర్ ఇండియా విమానం దిగి న్యూయార్క్ ఏర్పోర్ట్కి చేరుకున్నాక, ఇమిగ్రేషన్ ముగించుకుని లగేజ్ కేరసోల్ దగ్గరకి వెళ్ళింది. ఓ కుక్క కిందకి దింపిన సూట్‌కేస్‌లను వాసన చూడటం గమనించింది. ఆ కుక్క ఆవిడ...
మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మొదట ఓసారి చెప్పి చూస్తాం; వినకపోతే గొడవపడతాం; మరీ సీరియస్ అయితే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తాం; కోర్టుకెళతాం. అయితే మన సమస్యలకు ఓ దెయ్యం కారణమైతే, మనల్ని...
‘రచయితలు తమకు తెలిసింది మాత్రమే రాయగలరు; అది కూడా, తమకు సహజమైన పద్ధతిలో మాత్రమే రాయగలర’న్నారు ప్రపంచ ప్రసిద్ధ చైనీస్ రచయిత మో యాన్. అది ఆయన అసలు పేరు కాదు– పెట్టుకున్న కలంపేరు...
‘‘వినీతా! ఓ నాలుగుసార్లు ఇంటికి రాగానే మనిషి ఎలాంటోడో తెల్సిపోడు...’’ అంటూ కూతురుకు ఇంకేదో చెప్పబోయాడు. తండ్రి మాటలకు అడ్డు పడుతూ వినీత, ‘‘డాడీ! ప్రాక్టికల్‌గా ఆలోచించు. అటు ఏడు తరాలు ఇటు ఏడు...
అమెరికాలోని కనెక్టికట్‌కు చెందిన రాన్ ప్రెస్నెల్ అనే వ్యక్తి తన రెండేళ్ల కుమారుడు సామ్ ప్రెస్నెల్తో ఇంట్లో ఆడుకుంటున్నాడు. అప్పుడు హఠాత్తుగా సామ్ తన తండ్రి వైపు చూసి, ‘‘డాడ్! నువ్వు నా అంత...
వేసవి సెలవులు ముగిసి బడులు తెరిచారంటే, పిల్లలకు స్కూల్ బ్యాగులతో పని మొదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా స్కూల్ బ్యాగుల మార్కెట్ శరవేగంగా పరుగులు తీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా స్కూల్ బ్యాగుల మార్కెట్లో సగటున 6 శాతానికి పైగా...
యుద్ధాల్లో పాల్గొనే వీరులు సింహనాదాలు చేసేవారని పురాణాల్లో చదువుకున్నాం. అడవిలోని సింహం గర్జిస్తే, ఆ గర్జన ఏకంగా ఐదు కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. అడవి అడవంతా ప్రతిధ్వనిస్తుంది. సింహగర్జన శబ్దం 114 డెసిబల్స్...
‘ఓవర్ థింకింగ్ మానేయాలి’ అని రోజూ అనుకుంటుంది... కానీ అదే ఓవర్ థింకింగ్‌తో కొత్త కొత్త కథలు పుట్టిస్తుంది! చుట్టూ ఎవరైనా రెండు నిమిషాలు మాట్లాడితే చాలు, వాళ్లు ఆమె తదుపరి కథలో క్యారెక్టర్...
‘మొలకెత్తిన గింజలు తినండి... జబ్బులన్నీ పరార్’ ‘చిరుధాన్యాలు తినండి... చిటికెలో ఆరోగ్యం పొందండి’ ‘రోజూ పాతిక గుడ్లు తినండి... తేలికగా బరువు తగ్గించుకోండి’ ‘ఆకుకూరలు తినండి.... ఆయురారోగ్యాలు పొందండి’ ఇవన్నీ సోషల్ మీడియాలో మార్మోగిపోయే...
వయసు పెరిగే కొద్దీ చర్మంలో మార్పులు రావడం సహజం. మార్కెట్లో దొరికే చాలా రకాల ఎల్ఈడీ ఫేస్ మాస్క్‌లు కేవలం ముఖంపై వచ్చే ముడతలు, చారలు, మచ్చలను మాత్రమే తగ్గిస్తాయి. కానీ, సోలావేవ్ నెక్...
ప్రతిరోజూ వంటకాల్లో ఎన్నోరుచులను ఆస్వాదిస్తుంటాం. సమయానికి ఆ రుచైన వంటకం అందుబాటులో లేకపోతే ఇబ్బంది పడుతుంటాం. అందులో లడ్డూ, మిఠాయిలు, రకరకాల కర్రీస్, సూప్‌లు ఇలా ఎన్నో ఉంటాయి. అయితే వాటిని కొన్నిక్షణాల్లోనే ఎలా...
బీమా ఉంది కదా అని ఆ యజమాని ధీమాగా ఉన్నాడు. ఇన్సూరెన్స్ క్లైమ్ చేసి నష్టపరిహారం పొందచ్చనుకున్నాడు. కానీ, నిబంధనలను సరిగా అర్థం చేసుకోలేదు. పరిహారం రాదని కంపెనీ చెప్పింది. ఒకే ఒక్క పదం...
ఆనందవనానికి సింహసేనుడు అనే సింహం రాజు. ఒకరోజు నక్క అడవి సరిహద్దుల్లో ఒక వింతవస్తువును చూసి ఆశ్చర్యపోయింది. ఆ వింత వస్తువును చూడగానే, ‘ఇది నోటికి చిక్కదు, కాలికి అందదు’ అనుకుంది. ‘ఈ వస్తువును...
దేవశిల్పి విశ్వకర్మ మనవడైన ప్రథముడికి భౌవనుడు అనే కొడుకు కలిగాడు. అతడు దినదినాభివృద్ధి చెంది సకల శాస్త్రాలను అభ్యసించి, సార్వభౌముడిగా ఎదిగాడు. భౌవనుడికి ఒకేసారి దశాశ్వమేధ యాగాలు చేయాలనే సంకల్పం కలిగింది. అతడు తన...
‘నా దృష్టిలో శిశిరం ఎప్పుడూ విషాదాన్ని మిగిల్చే రుతువు కాదు. రాలిన ఆకులూ, బక్కచిక్కిన పగళ్ళూ అంతిమ ఘడియలకు ప్రతీకలుగా కనిపించవు నాకు. అవి నా కళ్ళకు భవిష్యత్తు గురించిన ఆశల్లా కనిపిస్తాయి. అక్టోబరు...
ఒకప్పటి కాలం ఉత్తరాల కాలం. అప్పట్లో చాలా ఉత్తరాలు వచ్చేవి. కాని జాగృత్ ఆ కాలానికి సంబంధించినవాడు కాదు. ఉత్తరాల అవసరం ఆగిపోయిన, ఎలక్ట్రానిక్ కాలానికి చెందినవాడు. అతను నివసించే అపార్ట్మెంట్లో అతని మెయిల్...
‘‘తాతా! ఆగ్రాలో ఉన్న నా భార్యాపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. నన్ను అక్కడకు తీసుకెళ్లు’’ అన్న మాటలు వినేసరికి ఆయన ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే ఆ మాటలు అన్నది యూపీలోని బాద్ గ్రామానికి చెందిన నాలుగేళ్ల...
‘‘నందినిగారూ మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు’’ సడన్‌గా ప్యూన్ వచ్చి చెప్పగానే, ఏదో ఆలోచిస్తున్న నందిని ఉలిక్కిపడి లేచింది. మేడం అంటే ఆ ఆఫీస్‌లో బాస్. పేరు మాలతి– చండశాసనురాలు. నందిని ఉలిక్కిపడిలేచి మాలతి రూములోకి...
సెంట్రల్ పోలీస్ స్టేషన్ ఆ రాత్రి చాలా నిశ్శబ్దంగా ఉంది. మరికొద్ది రోజుల్లో రిటైర్ కాబోతున్న హెడ్ కానిస్టేబుల్ పరమశివం స్టేషన్ ముఖద్వారం వద్ద సెంట్రీ డ్యూటీలో ఉన్నాడు. లాకప్‌లో చైన్ స్నాచర్ తంగవేలు...
డాక్టర్ గారు, నా రెండున్నరేళ్ల బిడ్డ ప్రతి చిన్న విషయానికీ ఏడుస్తోంది. తనకు కావాల్సింది వెంటనే ఇవ్వకపోయినా, నేను కాసేపు కనిపించకపోయినా నేలపై పడుకుని మారాం చేస్తోంది. ఇది సాధారణమేనా? లేక ఏదైనా సమస్యకు...
1982 నాటి స్టీవెన్ స్పీల్బర్గ్ సూపర్ హిట్ సినిమా ‘ఇ.టి. – ది ఎక్స్ట్రా టెర్రెస్ట్రియల్’లో.. భూమి మీదకు వచ్చి దారి తప్పిన ఒక ఏలియన్ని మచ్చిక చేసుకోవటానికి ఎలియట్ అనే ఒక చిన్న...
ప్రపంచంలోనే అతిపెద్ద పండుగగా పేరొందిన ‘శాన్ ఫెర్మిన్ ఫెస్టివల్’ వేడుకలకు స్పెయిన్‌లోని పాంప్లోనా నగరం సిద్ధమైంది. జూలై 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రాకెట్ లాంచింగ్‌తో ప్రారంభమయ్యే ఈ సంబరాలు, జూలై 14వ...
నేరేడు పండును జంబూఫలం అంటారు. నేరేడు వల్లనే మన భారతదేశానికి జంబూద్వీపం అనే పేరు వచ్చింది. ఇప్పటికీ శుభకార్యాలు, పూజాదికాలలో సంకల్పం చెప్పేటప్పుడు ‘జంబూద్వీపే భరతవర్షే భరతఖండే’ అని చెబుతుంటారు. నేరేడు పండు భారత...
నవ్వుకు నాంది కావాలన్నా... ప్రేమకు కానుక కావాలన్నా... చిన్నారి ఏడుపు ఆపాలన్నా... పెద్దల ఒత్తిడి కరిగించాలన్నా.. అందరికీ గుర్తొచ్చే తీపి నేస్తం చాక్లెట్! చేతిలో ఇమిడిపోయేంత చిన్నదైనా... మనసంతా తీపితో నింపే శక్తి దీనిది...
‘చలి చీమల చేత జిక్కి చావదే పాము’ అన్నట్లు, స్పెయిన్ లోని అందమైన విహారదీవి మెనోర్కాలో చీమల దండయాత్ర మొదలైంది. వేలాది ‘చీమలు’ రోడ్లపైకి వచ్చి పర్యాటకులపై నిరసన వ్యక్తం చేశాయి! అయితే అవి...
ఒక్కో సినిమా, ఒక్కో భాష, ఒక్కో క్యారెక్టర్ , ఒక్కో స్టయిల్ కాని ఆమె మాత్రం ఒక్కరే. ఇలా ఆన్ ఇన్ వన్ ఫుల్ ఫన్ ఫ్యాకేజ్‌తో క్రేజీ స్టార్‌గా మారిన నటి కయాదు...
ప్రతిరోజూ ఒకే రకమైన వంట తిని ఇబ్బంది పడుతున్నారా! అయితే కొత్త వంటకాలు ఏం చేయాలి? ఎలా చేయాలనుకునే వారు వీటిని ప్రయత్నించండి.. మష్రూమ్ పెప్పర్ ఫ్రై కావలసినవి: మిరియాలు: టేబుల్ స్పూన్ సోంపు...
మీ మాటలు వినే, మీతో సరదాగా కబుర్లు చెప్పే ఓ చిన్న స్నేహితుడు ఉంటే బాగుండేదనిపిస్తోందా? అయితే ‘ఏఐపీఐ–లైట్ ఏఐ రోబో’ మీకోసమే! ఇది సాధారణ బొమ్మ కాదు. కృత్రిమ మేధస్సుతో పనిచేసే స్మార్ట్...
అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక గజరాజు ఉండేది. దానికి తన బలమన్నా, భారీ శరీరమన్నా చాలా గర్వం. ‘ఈ అడవిలో నాకంటే బలవంతులు ఎవరూ లేరు’ అని ఎప్పుడూ విర్రవీగుతూ...
భవిష్యత్తులో వచ్చే సరికొత్త వైరస్‌లకు... అవి అసలు పుట్టకముందే మన శాస్త్రవేత్తలు కర్మకాండలు జరిపించే పనిలో ఉన్నారు! వాటి అంత్యక్రియలు జరిపించేది మరెవరో కాదు, ‘ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్’! శత్రువు యుద్ధానికి రాకముందే ఆ శత్రువును...
‘ఒకరు ముద్దు... ఇద్దరు హద్దు... ముగ్గురు అసలే వద్దు...’ కుటుంబ నియంత్రణ కోసం గతంలో ప్రభుత్వాలు ఈ నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేశాయి. ఇప్పుడు జనాభా విషయంలో ప్రభుత్వాల వైఖరి మారినా, ‘అతి సర్వత్ర...
బ్రహ్మమానస పుత్రుడైన ప్రచేతనుడికి అసితుడు అనే కొడుకు ఉన్నాడు. అసితుడు బ్రహ్మచర్యాశ్రమంలో సకల విద్యలను అభ్యసించి, తపోవృత్తి కొనసాగించాడు. కొంతకాలానికి అసితుడు వివాహం చేసుకున్నాడు. ఎన్నేళ్లయినా సంతానం కలగకపోవడంతో పరమశివుడి గురించి తపస్సు చేశాడు...