Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Jasprit Bumrah Needs To be Rested For T20 World Cup?
టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ వ‌స్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్‌

ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియ‌న్స్ వ‌రుస ఓటుముల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోంది. శుక్ర‌వారం వాంఖ‌డే వేదిక‌గా కోల్‌క‌తా  నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 24 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైన ముంబై..  త‌మ ప్లే ఆఫ్ అవ‌కాశాల‌ను మ‌రింత సంక్లిష్టం చేసుకుంది.ఇప్ప‌టివ‌ర‌కు 11 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియ‌న్స్ కేవ‌లం మూడింట మాత్ర‌మే విజ‌యం సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదో స్ధానంలో కొన‌సాగుతోంది. ఇక ఈ ఏడాది సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ నిరాశ‌ప‌రుస్తున్న‌ప్ప‌టికి.. ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా మాత్రం త‌న వంతు న్యాయం చేస్తున్నాడు.కేకేఆర్‌తో మ్యాచ్‌లోనూ బుమ్రా నాలుగు వికెట్ల‌తో స‌త్తా చాటాడు. ఓవ‌రాల్‌గా ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 17 వికెట్లు ప‌డ‌గొట్టిన బుమ్రా.. లీడింగ్ వికెట్ టేక‌ర్‌గా కొనసాగుతున్నాడు. వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024కు ముందు బుమ్రా సూప‌ర్ ఫామ్‌లో ఉండటం భార‌త జ‌ట్టు క‌లిసిచ్చే ఆంశం.ఈ క్ర‌మంలో టీమిండియా మాజీ ఓపెన‌ర్ వసీం జాఫ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ముంబై ఇండియ‌న్స్ ప్లే ఆఫ్స్‌కు చేరే అవ‌కాశాలు దాదాపు లేక‌పోవ‌డంతో మిగిలిన మ్యాచ్‌ల‌కు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాల‌ని జాఫ‌ర్ అభిప్రాయ‌ప‌డ్డాడు.ఈ ఏడాది ఐపీఎల్‌లో మ‌రో మ్యాచ్ త‌ర్వాత ముంబై భావిత‌వ్యం తేలిపోనుంది. ఆ మ్యాచ్‌లో ముంబై ఓట‌మి పాలైతే ప్లే ఆఫ్స్ రేసు అధికారికంగా నిష్క్ర‌మిస్తోంది. ఒకవేళ అది జరిగితే మిగిలిన మ్యాచ్‌ల‌కు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడం  బెట‌ర్‌. అది టీమిండియాకు బాగా క‌లిసిస్తోందని ఈఎస్పీఈన్ క్రిక్ ఈన్‌ఫోలో జాఫ‌ర్ పేర్కొన్నాడు. 

Royal Challengers Bengaluru opt to bowl vs Gujarat Titans
ఆర్సీబీతో మ్యాచ్‌.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్‌! తుది జ‌ట్లు ఇవే

ఐపీఎల్‌-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ఆర్సీబీ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత  బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. గుజరాత్ టైటాన్స్ మాత్రం రెండు మార్పులు చేసింది. గుజరాత్ జట్టులోకి మానవ్ సుత్తార్‌, జౌషువా లిటిల్ వచ్చారు. కాగా కాగా మాన‌వ్ స‌త్తార్‌కు ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్ ఆర్సీబీ చాలా ముఖ్యం. ఐపీఎల్ ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే ఆర్సీబీకి ఈ మ్యాచ్ చాలా కీలకం. 10 మ్యాచ్‌ల్లో కేవలం మూడింట మాత్రమే విజయం సాధించిన ఆర్సీబీ.. పాయింట్ల పట్టికలో పదో స్ధానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధిస్తే తమ ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకుంటుంది.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), విల్ జాక్స్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్‌), కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, విజయ్‌కుమార్ వైషాక్గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్‌), శుభమాన్ గిల్(కెప్టెన్‌), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, జాషువా లిటిల్ 

Mumbai Indiansstory is finished in IPL 2024, says Irfan Pathan
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్‌

ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ దారుణ ప్రదర్శన కొనసాగుతోంది.  శుక్రవారం వాంఖడే వేదికగా  కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.దీంతో తమ ప్లే ఆఫ్‌ ఆశలను ముంబై సంక్లిష్టం చేసుకుంది. వాంఖడేలో కేకేఆర్‌ చేతిలో ముంబై జట్టు ఓడిపోవడం 12 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ క్రమంలో ముంబై జట్టును విజయం పథంలో నడిపించలేక విఫలమవుతున్న కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.తాజాగా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం హార్దిక్‌ పాండ్యా కెప్టెన్స్‌పై మండిపడ్డాడు. "ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. పేపర్‌పై ముంబై జట్టు చాలా బలంగా ఉంది. కానీ మైదానంలో మాత్రం పూర్తిగా తేలిపోతున్నారు.ముఖ్యంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురుస్తోంది. బౌలింగ్‌లో ముంబైకి మంచి ఆరంభం లభించింది. 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కేకేఆర్‌ కష్టాల్లో పడింది.అటువంటి సమయంలో 6వ బౌలర్‌గా నమన్ ధీర్ ఉపయోగించాల్సిన అవసరం ఏముంది? చావ్లాతో ఫుల్‌ ఓవర్ల కోటాను పూర్తి చేయలేదు. మనీష్ పాండే, వెంకటేష్ అయ్యర్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి కేకేఆర్‌కు మంచి స్కోర్‌ అందించారు. క్రికెట్‌లో ఏ జట్టుకైనా కెప్టెన్సీ చాలా ముఖ్యం. కాబట్టి కెప్టెన్సీ విషయంలో మేనేజ్‌మెంట్ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం ముంబై జట్టు ఒక యూనిటీగా ఆడడం లేదు. హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించడం ముంబై ఆటగాళ్లకు సైతం ఇష్టం లేనట్లుందని" స్టార్‌స్పోర్ట్స్‌ షోలో పఠాన్‌ పేర్కొన్నాడు. 

Rohit Sharma Registers EMBARRASING Record
రోహిత్‌ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలోనే

ఐపీఎల్‌-2024లో టీమిండియా కెప్టెన్‌, ముంబై ఇండియ‌న్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శ‌ర్మ త‌న మార్క్‌ను చూపించ‌లేక‌పోతుకున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా శుక్ర‌వారం వాఖండే వేదిక‌గా కోల్‌కతా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రోహిత్ నిరాశ‌ప‌రిచాడు. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చిన హిట్‌మ్య‌న్‌.. కేకేఆర్ బౌల‌ర్ల‌ను ఎదుర్కోవ‌డానికి తీవ్రంగా క‌ష్ట‌ప‌డ్డాడు.ఈ క్ర‌మంలో కేవ‌లం 11 ప‌రుగులు మాత్ర‌మే చేసి కేకేఆర్ స్పిన్న‌ర్ సునీల్ న‌రైన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. కాగా ఐపీఎల్‌లో నరైన్ బౌలింగ్‌లో  రోహిత్  ఔట్ కావ‌డం ఇది ఎనిమిదో సారి.దీంతో రోహిత్ శ‌ర్మ ఓ చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో ఒకే బౌలర్‌ చేతిలో అత్యధిక సార్లు ఔట్ అయిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. అంతకుముందు రోహిత్‌ శర్మ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా చేతిలో కూడా 7 సార్లు ఔటయ్యాడు. రోహిత్‌ పాటు ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లి, అంబటి రాయుడు, రాబిన్‌ ఉతప్ప, రిషబ్‌ పంత్‌, రహానే కూడా 7 సార్లు ఒకే బౌలర్‌ చేతిలో ఔటయ్యాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ముంబై ఇండియన్స్‌పై కేకేఆర్‌ 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

IPL 2024 CSK Pathirana: Dhoni is playing My Father Role in my Cricket Life
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్‌ వైరల్‌

చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ పేసర్‌, శ్రీలంక బౌలర్‌ మతీశ పతిరణ టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్‌ ధోని పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ధోని తనకు తండ్రిలాంటి వాడని పేర్కొన్నాడు. తన కన్న తండ్రి మాదిరే ధోని కూడా తనను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడని తెలిపాడు.కాగా ఐపీఎల్‌-2022కు సిసంద మగల దూరం కాగా అతడి స్థానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌లో అడుగుపెట్టాడు పతిరణ. ఆ మరుసటి ఏడాది అంటే 2023లో 12 మ్యాచ్‌లలో కలిపి 19 వికెట్లు పడగొట్టాడు.ధోని నాయకత్వంలో సీఎస్‌కే ఐదోసారి చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. బేబీ మలింగగా ప్రశంసలు అందుకుంటూ ప్రస్తుతం సీఎస్‌కే ప్రధాన పేసర్లలో ఒకడిగా వెలుగొందుతున్నాడు.అయితే, దీనకంతటికి కారణం ధోనినే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ యువ పేసర్‌ ఆరంభంలో తడబడ్డా తలా అతడికి అండగా నిలిచాడు. ధారాళంగా పరుగులు సమర్పించుకున్న సమయంలోనూ నైతికంగా మద్దతునిచ్చాడు.ఈ నేపథ్యంలో తాజాగా సీఎస్‌కే ‘లయన్స్‌ అప్‌క్లోజ్’ చాట్‌లో మతీశ పతిరణ మాట్లాడుతూ ధోనితో తన అనుబంధం గురించి వివరించాడు. ‘‘మా నాన్న తర్వాత నా క్రికెట్‌ లైఫ్‌లో తండ్రి పాత్ర పోషించింది ధోనినే.నన్నొక చిన్నపిల్లాడిలా చూసుకుంటారు. నా పట్ల శ్రద్ధ వహిస్తారు. అవసరమైన సమయంలో సలహాలు, సూచనలు ఇస్తుంటారు. నేను ఎప్పుడు ఏం చేయాలో చెబుతూ ఉంటారు.ఇంట్లో మా నాన్న నాతో ఇలా ఉంటారో ఇక్కడ ధోని కూడా నాతో అలాగే ఉంటారు. చిన్న చిన్న విషయాలను కూడా వదిలిపెట్టకుండా జాగ్రత్తలు చెబుతారు. నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగేలా మోటివేట్‌ చేస్తారు.మైదానం వెలుపల మేము ఎక్కువగా మాట్లాడుకోము. అయితే, నన్ను కలిసిన ప్రతిసారీ.. ‘‘ఆటను ఆస్వాదించు. ఫిట్‌నెస్‌ కాపాడుకో’’ అని చెబుతారు.మహీ భాయ్‌.. మీరు వచ్చే సీజన్‌లోనూ ఆడాలి. ప్లీజ్‌ మాతో కలిసి ఆడండి.. అప్పటికీ నేనిక్కడ ఉంటే(నవ్వుతూ)’’ అంటూ పతిరణ ధోని పట్ల అభిమానం చాటుకున్నాడు.కాగా ఈ సీజన్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టగా.. ధోని ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక పతిరణ ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు కూల్చాడు. సీఎస్‌కే ఆడిన 10 మ్యాచ్‌లలో ఐదు గెలిచి పట్టికలో ఐదో స్థానంలో ఉంది.The bond beyond the field 💛🫂#LionsupClose Full video 🔗 - https://t.co/xt5t6K9SjR #WhistlePodu #Yellove🦁💛 pic.twitter.com/odZdVvlrF6— Chennai Super Kings (@ChennaiIPL) May 4, 2024

David Warner Is 70 Percent Indian 30 Australian: DC Star Interesting Revelation
‘అతడు 70 శాతం ఇండియన్‌.. 30 శాతం మాత్రమే ఆస్ట్రేలియన్‌’

‘‘నేను కలిసిన అత్యంత నిస్వార్థమైన వ్యక్తుల్లో అతడూ ఒకడు. తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికీ అతడు సమయం కేటాయించగలడు. సాయం చేయడానికి 24/7 అందుబాటులోనే ఉంటాడు.ఎక్కడి హోటల్‌కు వెళ్లినా నా గదికి రెండు గదుల అవతల అతడు ఉంటాడు. నాకు ఇష్టం వచ్చినప్పుడు అక్కడికి వెళ్లవచ్చు. ప్రతి రోజూ ఉదయం అక్కడే నేను కాఫీ తాగుతాను కూడా!ఇండియన్‌ అనడం బెటర్‌నిజం చెప్పాలంటే అతడు ఆస్ట్రేలియన్‌ అనడం కంటే ఇండియన్‌ అనడం బెటర్‌. అతడికి కూడా ఇదే మాట చెబుతూ ఉంటా. నా దృష్టిలో అతడు 70 శాతం ఇండియన్‌.కేవలం 30 శాతం మాత్రమే ఆస్ట్రేలియన్‌గా ఉంటాడు’’ అంటూ ఢిల్లీ క్యాపిటల్స్‌ యువ సంచలనం, ఆసీస్‌ స్టార్‌ జేక్‌ ఫ్రేజర్‌-మెగర్క్‌ సహచర ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌పై ప్రశంసలు కురిపించాడు.తనకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా వెంటనే వార్నర్‌ దగ్గరికి వెళ్లి అడిగేంత చొరవ ఉందని తెలిపాడు. సీనియర్‌ అన్న పొగరు ఏమాత్రం చూపించడని.. అందరితోనూ సరదాగా ఉంటాడని మెగర్క్‌ చెప్పుకొచ్చాడు.హైదరాబాదీలతో బంధంకాగా ఆసీస్‌ వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఐపీఎల్‌ ద్వారా భారతీయులకు చేరువైన విషయం తెలిసిందే. ముఖ్యంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడిన సమయంలో హైదరాబాదీలతో బంధం పెనవేసుకున్నాడు.టాలీవుడ్‌ స్టార్‌ హీరోల తెలుగు పాటలకు రీల్స్‌ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే వార్నర్‌ భాయ్‌.. ఇటీవలే దర్శకధీరుడు రాజమౌళితో కలిసి ఓ యాడ్‌లోనూ నటించి మెప్పించాడు.ఈ నేపథ్యంలో మెగర్క్‌ వార్నర్‌ గురించి డీసీ(ఢిల్లీ క్యాపిటల్స్‌) పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీకి ఆడుతున్న సౌతాఫ్రికా స్టార్‌ ట్రిస్టన్‌ స్టబ్స్‌ సైతం వార్నర్‌తో తనకు మంచి అనుబంధం ఉందని.. అతడితో కలిసి గోల్ఫ్‌ ఆడటం తనకు ఇష్టమని పేర్కొన్నాడు.ఐపీఎల్‌-2024లో ఇలాకాగా ఐపీఎల్‌-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌లలో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది. మరోవైపు.. ఈ సీజన్‌తో క్యాష్‌ రిచ్‌ లీగ్లో అరంగేట్రం చేసిన 22 ఏళ్ల జేక్‌ ఫ్రేజర్‌-మెగర్క్‌ 6 ఇన్నింగ్స్‌లో కలిపి 259 పరుగులు చేశాడు.ఇక ట్రిస్టన్‌ స్టబ్స్‌ 10 ఇన్నింగ్స్‌ ఆడి 277 రన్స్‌ చేయగా.. డేవిడ్‌ వార్నర్‌ కేవలం 7 మ్యాచ్‌లలో భాగమై 167 పరుగులు చేయగలిగాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు వార్నర్‌ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. 

Fans Worries Why Rohit Played As Impact Sub For MI Piyush Chawla explains
రోహిత్‌ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్‌!

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌, టీమిండియా కెప్టెన్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగడం సందేహాలకు తావిచ్చింది. ఐపీఎల్‌-2024 ఆరంభం నుంచి ముంబై తరఫున అన్ని మ్యాచ్‌లలోనూ మైదానంలోకి దిగాడు హిట్‌మ్యాన్‌.అయితే, కేకేఆర్‌తో మ్యాచ్‌లో మాత్రం అతడు ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ సాగుతున్న సమయంలో విశ్రాంతి తీసుకున్న రోహిత్‌.. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు వచ్చాడు.కానీ ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 12 బంతులు ఎదుర్కొని ఒక సిక్స్‌ సాయంతో 11 పరుగులు మాత్రమే చేసి.. సునిల్‌ నరైన్‌ బౌలింగ్‌లో మనీశ్‌ పాండేకు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.ఆందోళనలో అభిమానులుఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌పై సందేహాలు తలెత్తాయి. అసలే టీ20 ప్రపంచకప్‌-2024 ఆరంభానికి సమయం దగ్గరపడుతున్న తరుణంలో కెప్టెన్‌ సాబ్‌కు ఏమైందంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. క్లారిటీ ఇచ్చిన చావ్లాఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌ స్పిన్నర్‌ పీయూశ్‌ చావ్లా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ‘‘రోహిత్‌ తేలికపాటి వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే మేనేజ్‌మెంట్‌ ఈ నిర్ణయం తీసుకుంది’’ అని రోహిత్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా పంపడానికి గల కారణం వెల్లడించాడు.అదే విధంగా.. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ వరుస వైఫల్యాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పేరు, ప్రఖ్యాతుల కోసం బరిలోకి దిగినపుడు.. పోరాటం కొనసాగిస్తూనే ఉండాలి. ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధిస్తామా లేదా అన్నది పక్కనపెడితే.. జట్టు ప్రయోజనాల కోసం ఆడటమే ఆటగాళ్ల ప్రథమ కర్తవ్యం’’ అని పీయూశ్‌ చావ్లా చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్‌-2024లో ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌లలో ముంబై ఎనిమిది ఓడిపోయింది.ఇదిలా ఉంటే.. జూన్‌ 1 నుంచి మొదలుకానున్న టీ20 వరల్డ్‌కప్‌-2024లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు.. ముంబై ఇండియన్స్‌ సారథి హార్దిక్‌ పాండ్యా డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఇటు కెప్టెన్‌గా.. అటు ఆల్‌రౌండర్‌ పాండ్యా విఫలమవుతున్నా బీసీసీఐ అతడిపై నమ్మకం ఉంచింది. గతేడాది అక్టోబరు తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకపోయినా.. ఐసీసీ టోర్నీలో ఏకంగా వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది.

Are These Players That Bad: Sehwag slams MI Usage of Hardik Tim David vs KKR
మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్‌ చురకలు

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ అనుసరించిన వ్యూహాలను భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తప్పుబట్టాడు. హార్దిక్‌ పాండ్యా, టిమ్‌ డేవిడ్‌ మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా అంటూ మేనేజ్‌మెంట్‌కు చురకలు అంటించాడు.ఐపీఎల్‌-2024లో భాగంగా వాంఖడే వేదికగా కేకేఆర్‌తో తలపడిన ముంబై ఓడిపోయిన విషయం తెలిసిందే. సొంత మైదానంలో 24 పరుగుల తేడాతో ఓటమి ఈ సీజన్‌లో ఎనిమిదో పరాజయాన్ని నమోదు చేసింది.ఛేదనలో తడ‘బ్యా’టు టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన ముంబై.. కేకేఆర్‌ను 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్‌ చేసి ఫర్వాలేదనిపించింది. కానీ లక్ష్య ఛేదనలో మాత్రం తడ‘బ్యాటు’కు గురైంది. 18.5 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది.టాపార్డర్‌ మొత్తం చేతులెత్తేయగా.. మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌(35 బంతుల్లో 56) ఒక్కడే రాణించాడు. మిగిలిన వాళ్లు సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.ఇలాంటి తరుణంలో ​కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(1) ఏడు, టిమ్‌ డేవిడ్(24)‌ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. తర్వాత టెయిలెండర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో ముంబై కథ ముగిసింది.మరీ అంత చెత్తగా ఆడతారా?ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్‌ క్రిక్‌బజ్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘ముంబై ఇండియన్స్‌ హార్దిక్‌ పాండ్యా, టిమ్‌ డేవిడ్‌ను ఎందుకు దాచిపెట్టిందో తెలియదు. అలా చేయడం వల్ల మీకు ఏం ప్రయోజనం చేకూరింది?ఇంకా బంతులు మిగిలే ఉన్నాయి. జట్టు మొత్తం ఆలౌట్‌ అయింది. నిజానికి హార్దిక్‌ పాండ్యా, టిమ్‌ డేవిడ్‌లను ఇంకాస్త ముందుగా బ్యాటింగ్‌కు పంపాల్సింది.కానీ ఛేజ్‌ చేస్తున్న సమయంలో వరుసగా వికెట్లు పడుతున్నా హార్దిక్‌ పాండ్యా, టిమ్‌ డేవిడ్‌లను ఏడు, ఎనిమిదో స్థానాల్లో ఎందుకు ఆడించారో అర్థం కాలేదు.లోయర్‌ ఆర్డర్‌లో వీళ్లు ఇంకాస్త ముందుగా వస్తే మరీ అంత చెత్తగా ఆడతారని అనుకున్నారా?’’ అని ముంబై మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నించాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో ఉన్నపుడు పాండ్యా నాలుగో స్థానంలో నిలకడగా రాణించిన విషయాన్ని సెహ్వాగ్‌ ఈ సందర్భంగా ప్రస్తావించాడు.చదవండి: T20 WC: హార్దిక్‌ బదులు అతడిని సెలక్ట్‌ చేయాల్సింది: పాక్‌ దిగ్గజం

Hardik Pandya Shouldve Missed Out: Ex Pakistan Star On Rinku T20 WC Snub
హార్దిక్‌ బదులు అతడిని ఎంపిక చేయాల్సింది: పాక్‌ మాజీ స్టార్‌

టీ20 వరల్డ్‌కప్‌-2024 నేపథ్యంలో బీసీసీఐ ప్రకటించిన జట్టుపై పాకిస్తాన్‌ మాజీ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. యశస్వి జైస్వాల్‌ వంటి యంగ్‌ స్టార్లకు చోటివ్వడం సరైన నిర్ణయమని.. అయితే, రింకూ సింగ్‌కు మాత్రం అనాయ్యం జరిగిందని పేర్కొన్నాడు.లోయర్‌ ఆర్డర్‌లో హిట్టింగ్‌ ఆడగల రింకూను పక్కన పెట్టడం సరికాదని టీమిండియా సెలక్టర్ల తీరును కనేరియా విమర్శించాడు. హార్దిక్‌ పాండ్యా బదులు రింకూను జట్టుకు ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.రింకూ సింగ్‌కు అనాయ్యంకాగా జూన్‌ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా మొదలయ్యే ప్రపంచకప్‌నకు బీసీసీఐ మంగళవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. రోహిత్‌ శర్మ సారథ్యంలోని ఈ టీమ్‌లో రింకూ సింగ్‌కు స్థానం దక్కలేదు. రిజర్వ్‌ ప్లేయర్‌గా మాత్రమే అతడు ఎంపికయ్యాడు.వీళ్లంతా భేష్‌ఈ నేపథ్యంలో డానిష్‌ కనేరియా మాట్లాడుతూ.. ‘‘నాణ్యమైన క్రికెటర్లను ఉత్పత్తి చేస్తుందనే పేరు భారత్‌కు ఉంది. ఇటీవలి కాలంలో దుమ్ములేపుతున్న యశస్వి జైస్వాల్‌, అంగ్‌క్రిష్‌ రఘువంశీ ఇందుకు చక్కని ఉదాహరణలు.మయాంక్‌ యాదవ్‌ సైతం తన పేస్‌ నైపుణ్యాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇక అభిషేక్‌ శర్మ పవర్‌ హిట్టింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పాండ్యాకు ఎందుకు చోటిచ్చారు?రింకూ విషయానికొస్తే.. అతడు కచ్చితంగా టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో ఉండాల్సింది. నా అభిప్రాయం ప్రకారం.. ఐపీఎల్‌ ప్రదర్శనను గనుక పరిగణనలోకి తీసుకుంటే హార్దిక్‌ పాండ్యాను ప్రపంచకప్‌నకు ఎంపిక చేయకుండా ఉండాల్సింది.ఇప్పటికే జట్టులో శివం దూబే ఉన్నాడు. అందుకే పాండ్యా బదులు రింకూను ఎంపిక చేస్తే డౌన్‌ ఆర్డర్‌లో శక్తిమంతమైన కూర్పు కుదిరి ఉండేది’’ అని స్పోర్ట్స్‌ నౌ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.కాగా ప్రపంచకప్‌ ఈవెంట్లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు డిప్యూటీగా హార్దిక్‌ పాండ్యాను ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే, డానిష్‌ కనేరియా మాత్రం వైస్‌ కెప్టెన్‌నే పక్కనపెట్టాల్సిందని చెప్పడం గమనార్హం.టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్‌ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.రిజర్వ్ ప్లేయర్లు: శుబ్‌మన్‌ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.చదవండి: అమెరికా వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టులో ఐదుగురు భార‌త సంత‌తి ఆట‌గాళ్లు..

PC: Jio Cinema/BCCI
స్టార్క్‌ దెబ్బకు ఇషాన్‌ బౌల్డ్‌.. రితిక రియాక్షన్‌ వైరల్‌

ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌‌ బ్యాటర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. హార్డ్‌ హిట్టర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తప్ప మిగిలిన వాళ్లలో ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.ముఖ్యంగా టాపార్డర్‌ దారుణంగా విఫలమైంది. ఓపెనర్లు‌ ఇషాన్‌ కిషన్‌(13)- రోహిత్‌ శర్మ(11) పూర్తిగా నిరాశపరచగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ నమన్‌ ధిర్‌(11) కూడా చేతులెత్తేశాడు.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాలుగో నంబర్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(35 బంతుల్లో 56) ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన బ్యాటర్లు తిలక్‌ వర్మ(4), నేహాల్‌ వధేరా(6), హార్దిక్‌ పాండ్యా(1) పెవిలియన్‌కు క్యూ కట్టారు.సూర్య ఒంటరి పోరాటం వృథాసూర్య ఈ క్రమంలో ఒంటరి పోరాటం చేస్తున్న సూర్యకు తోడైన టిమ్‌ డేవిడ్‌(20 బంతుల్లో 24) నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇక టెయిలెండర్లు గెరాల్డ్‌ కోయెట్జీ(8), పీయూశ్‌ చావ్లా(0), జస్‌ప్రీత్‌ బుమ్రా(1 నాటౌట్‌) కూడా చేతులెత్తేయడంతో 145 పరుగులకే ముంబై కథ ముగిసిపోయింది.ఫలితంగా కేకేఆర్‌ విధించిన 170 పరుగుల లక్ష్య ఛేదనలో విఫలమైన ముంబై వాంఖడేలో పన్నెండేళ్ల తర్వాత తొలిసారి కోల్‌కతా చేతిలో 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.ఈ పరాజయం ముంబై ఫ్యాన్స్‌ హృదయాలను ముక్కలు చేస్తే.. పందొమ్మిదో ఓవర్లో మూడు వికెట్లు తీసి పాండ్యా సేన పతనాన్ని శాసించిన మిచెల్‌ స్టార్క్‌ను చూసి కేకేఆర్‌ అభిమానులు మురిసిపోయారు.అద్భుత రీతిలో బౌల్డ్‌ చేసిముంబైతో మ్యాచ్‌లో 3.5 ఓవర్లు బౌల్‌ చేసిన స్టార్క్‌ 33 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ను అద్భుత రీతిలో బౌల్డ్‌ చేయడం హైలైట్‌గా నిలిచింది. గంటకు 142.3 కిలో మీటర్ల వేగంతో స్టార్క్‌ విసిరిన బంతి లెగ్‌ స్టంప్‌ను ఎగురగొట్టింది.అయినప్పటికీ స్టార్క్‌ పెద్దగా సెలబ్రేట్‌ చేసుకోలేదు. అయితే.. ఇషాన్‌ అవుట్‌ కాగానే ముంబై ఇండియన్స్‌ కోచ్‌ మార్క్‌ బౌచర్‌తో పాటు చీర్‌ గర్ల్స్‌.. ముఖ్యంగా రోహిత్‌ శర్మ భార్య రితికా సజ్దే ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ వైరల్‌గా మారాయి. ఇక ఇషాన్‌తో పాటు టిమ్ డేవిడ్‌, కోయెట్జీ, పీయూశ్‌ చావ్లా వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు స్టార్క్‌.‌  చదవండి: అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్‌ పాండ్యాStumps dismantled, in vintage Starc style 🔥🫡 #TATAIPL #MIvKKR #IPLonJioCinema #IPLinBhojpuri pic.twitter.com/RcERxhgJps— JioCinema (@JioCinema) May 3, 2024

Advertisement
Advertisement

Sports

1
India
7020 / 58
odi
2
Australia
5309 / 45
odi
3
South Africa
4062 / 37
odi
4
Pakistan
3922 / 36
odi
5
New Zealand
4708 / 46
odi
6
England
3934 / 41
odi
7
Sri Lanka
4947 / 55
odi
8
Bangladesh
4417 / 50
odi
9
Afghanistan
2845 / 35
odi
10
West Indies
3109 / 44
odi
View Team Ranking
Advertisement
Advertisement