Archive Page | Sakshi
Sakshi News home page

Dr. B R Ambedkar Konaseema

  • అడ్మి

    రాయవరం: వేసవి సెలవుల్లోనూ పని చేయాలా అంటూ పెదవి విరుస్తున్న వారికి జిల్లాలోని పలువురు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. మనబడి మన బాధ్యతను గుర్తు చేసుకుంటూ 2024–25 విద్యా సంవత్సరం అడ్మిషన్లపై ఇప్పటి నుంచే ఫోకస్‌ పెట్టారు. ఉన్నత పాఠశాలల సమీప గ్రామాలకు వెళ్లి మన బడిలోనే మీ పిల్లలను చేర్పించండి..అంటూ తల్లిదండ్రులను కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న మౌలిక సౌకర్యాలు, అందిస్తున్న విద్యాప్రమాణాలను తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ఈ ఏడాది పదవ తరగతి ఫలితాల్లో సాధించిన ఉత్తీర్ణతను..విద్యార్థులు సాధించిన మార్కులను..కరపత్రాల రూపంలో ముద్రించి గ్రామాల్లోని ఇంటింటికి తిరిగి పంచుతున్నారు. జిల్లాలో పలువురు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ బడుల పరిరక్షణ కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారు.

    ప్రైవేటుకు దీటుగా..

    జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2024–25 విద్యాసంవత్సరం అడ్మిషన్లపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు. పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేలా మండల విద్యాశాఖాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు వెబెక్స్‌, గూగుల్‌ మీట్‌ సమావేశాల ద్వారా మార్గదర్శకత్వం చేశారు. దీంతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అడ్మిషన్ల ప్రక్రియను బాధ్యతగా తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు వలవేస్తూ ముందస్తు అడ్మిషన్లు ప్రారంభించాయి. దీనికి అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు.

    వారిపైనే ఫోకస్‌..

    జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్న ప్రీ స్కూల్స్‌లో 3–6 సంవత్సరాల వయసు ఉన్న వారు 40వేల మంది ఉన్నారు. వీరిలో ఐదేళ్లు పైబడిన వారు దాదాపుగా 12వేల మంది వరకు ఉన్నారు. ఐదు సంవత్సరాల వయసు పైబడిన పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా ఫోకస్‌ పెట్టారు. ప్రైవేట్‌ కాన్వెంట్స్‌లో యూకేజీ చదువుతున్న విద్యార్థులు కూడా దాదాపుగా ఆరువేల మంది వరకు ఉన్నారు. గత విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో 18,302 అడ్మిషన్లు జరిగాయి. ఈ ఏడాది కూడా ఇంచుమించుగా అదే సంఖ్యలో అడ్మిషన్లు జరిగే అవకాశముంది. ఐదవ తరగతి నుంచి 22,757 మంది విద్యార్థులు ఆరవ తరగతిలోకి ప్రమోట్‌ అవుతున్నారు. 7వ తరగతి నుంచి 8వ తరగతిలోకి 21,552 మంది ప్రమోట్‌ అవుతుండగా, 219 ప్రాథమిక పాఠశాలల్లో రెండవ తరగతి చదువుతున్న 1,511 మంది ఉపాధ్యాయులు మూడవ తరగతిలో చేరనున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇప్పటికే ఐదో తరగతి చదువుతున్న వారితో పాటుగా, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను కూడా చేర్చుకునేందుకు వారి తల్లిదండ్రులను మోటివేట్‌ చేస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల నుంచి వచ్చేవారు ఎవరైనా ఉంటే వారికి ముందస్తుగా అడ్మిషన్‌ ఇచ్చేలా చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వ ఉపాధ్యాయులు అంగన్‌వాడీ కార్యకర్తల సహకారం తీసుకుంటూ అడ్మిషన్లు పెంచుతున్నారు.

    నేరుగా విద్యార్థుల

    ఇళ్లకే ఉపాధ్యాయులు

    ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలపై

    ప్రధానోపాధ్యాయుల ఫోకస్‌

    వేసవి సెలవుల్లోనూ

    విధుల పట్ల అంకితభావం

    స్ఫూర్తిగా నిలుస్తున్న

    పలువురు హెచ్‌ఎంలు, టీచర్లు

    వచ్చే నెల 12న పాఠశాలల

    పునఃప్రారంభం

    కరపత్రాలు, ఫ్లెక్సీలతో ప్రచారం

    పలు ప్రభుత్వ పాఠశాలలు వినూత్నంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇటీవల పదవ తరగతి ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు సాధించిన అద్భుత ఫలితాలను ప్రచారాస్త్రాలుగా వినియోగించుకుంటున్నారు. ‘పది’ ఫలితాల్లో మెరిట్‌ విద్యార్థుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను ఆయా పాఠశాలల వద్ద ఏర్పాటు చేసి విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకుంటున్నారు. ఎన్‌ఎంఎంఎస్‌, చెకుముకి వంటి టాలెంట్‌ టెస్టులు, జవహర్‌ నవోదయ, ట్రిపుల్‌ ఐటీల్లో విద్యార్థులు సాధించిన సీట్ల వివరాలను ఫ్లెక్సీల్లో పొందుపర్చారు. పాఠశాలల్లో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలనే విద్యార్థుల అడ్మిషన్లకు ప్రచారాస్త్రాలుగా వాడుకుంటున్నారు. కొందరు ప్రధానోపాధ్యాయులు ఫ్లెక్సీలను ఆటోలకు కట్టి, మైకు ద్వారా ప్రచారం చేయించారు. పది ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌ స్కూళ్లకు ఏ మాత్రం తీసిపోవు అంటూ సగర్వంగా ప్రచారం చేసిన వైనం ఎక్కడికక్కడ కన్పించింది.

    నాణ్యమైన విద్య

    ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోంది. పాఠశాల నుంచి గతంలో ట్రిపుల్‌ ఐటీకి ఎంపికయ్యారు. గత విద్యా సంవత్సరంలో ప్రైవేట్‌ పాఠఽశాలల నుంచి వచ్చి మా పాఠశాలల్లో అడ్మిషన్స్‌ పొందారు. ఈ విద్యా సంవత్సరంలో 11 మంది విద్యార్థులు నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌ షిప్‌కు ఎంపికయ్యారు. విద్యార్థులు సాధించిన విజయాలను తల్లిదండ్రులకు వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుతున్నాం.

    – కె.వెంకటలక్ష్మి, జీహెచ్‌ఎం,

    జెడ్పీహెచ్‌ఎస్‌, మురముళ్ల, ఐ.పోలవరం మండలం

    తల్లిదండ్రుల స్పందన బాగుంది

    ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే పొందే ప్రయోజనాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తున్నాం.

    వేసవి సెలవులను ఆలోచించకుండా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాం. ఉపాధ్యాయులు కూడా బాధ్యతగా విద్యార్థులను చేర్పించేందుకు స్వచ్ఛందంగా వచ్చారు. తల్లిదండ్రుల నుంచి స్పందన కూడా బాగుంది.

    – జి.కనకదుర్గ, జీహెచ్‌ఎం,

    జెడ్పీహెచ్‌ఎస్‌, ముంగండ,

    పి.గన్నవరం మండలం

    సంతోషించదగ్గ విషయం

    ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచేలా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవడం సంతోషించదగ్గ విషయం. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు అంగన్‌వాడీల నుంచి బయటకు వచ్చే విద్యార్థులను చేర్చుకుంటున్నారు. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలను వదిలిపెట్టే విద్యార్థులను ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు చేర్చుకుంటున్నారు. విద్యార్థుల చేరికతోనే పాఠశాలలు బలోపేతం అవుతాయి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి.

    – ఎం.కమలకుమారి, డీఈవో, అమలాపురం

  • తొలవర

    ఖరీఫ్‌ సాగుకు ప్రణాళిక సిద్ధం

    ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతున్న వేళ రైతులకు అన్ని విధాలా సాయపడేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి గతేడాది మాదిరిగానే విత్తనాలు, ఎరువులు అందించనున్నాం. ఆ మేరకు ప్రణాళికాబద్ధంగా అన్నీ సిద్ధం చేశాం. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. ఆర్‌బీకేల్లో విత్తనాలతో పాటు దశల వారీగా అవసరమైన ఎరువుల సరఫరా చేయనున్నాం. నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో తుపాన్లు, భారీ వర్షాల బారినపడి పంట నష్టాలు సంభవించకుండా ముందుగానే సార్వా సాగు చేపట్టేలా రైతులు సిద్ధం కావాలి. ఆర్‌బీకే సేవలను సద్వినియోగం చేసుకోవాలి. వ్యవసాయ శాస్త్రవేత్తలు, గ్రామాల్లో వ్యవసాయ సహాయకుల సూచనలు పాటిస్తూ నాణ్యమైన విత్తనాలు, అవసరం మేరకు ఎరువులు వినియోగించుకుని అధిక దిగుబడులు సాధించాలి.

    – వి.బోసుబాబు, జిల్లా వ్యవసాయ అధికారి,

    డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

    కొత్తపేట: ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వ్యవసాయ శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. అన్నదాతల కష్టం తెలిసిన రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇబ్బంది లేకుండా వ్యవసాయ ప్రోత్సాహక పథకాలు అమలు చేసి తోడ్పాటునందిస్తోంది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేలా వ్యవసాయ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. పంట దిగుబడిలో కీలకమైన నాణ్యత గల విత్తనాలు, ఎరువులు అందించేందుకు చర్యలు చేపట్టింది. ముందుగానే రైతులకు విత్తనాలు, ఎరువులను రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించేలా చర్యలు తీసుకుంది. రైతులకు విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయడం వల్ల ముందుగా నారుమడులు పోసుకోవడానికి, వెదజల్లు పద్ధతిలో సాగు చేయడానికి వీలవుతుంది. ఆ మేరకు గత ఏడాది మాదిరిగానే ఖరీఫ్‌ (తొలకరి) సీజన్‌కు సంబంధించి ప్రధాన పంట కాలువలకు గోదావరి నీరు విడుదల చేయనుంది. ఖరీఫ్‌ ప్రణాళికకు సంబంధించి వివరాలను జిల్లా వ్యవసాయ అధికారి వి.బోసుబాబు తెలిపారు.

    జిల్లాలో ఖరీఫ్‌ ప్రణాళిక ఇలా..

    డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి చీఫ్‌ ప్లానింగ్‌ విభాగం, జిల్లా వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 1,68,780 ఎకరాల్లో వరి సాగు చేయనున్నారు. ఎంటీయూ 7029 రకం సుమారు 73 శాతం వినియోగిస్తుండగా మిగిలిన 27 శాతం ఎంటీయూ 1318, ఎంటీయూ 1064 తదితర రకాలు వినియోగిస్తున్నారు. ఆ మేరకు 33,750 క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా ఇప్పటికి సుమారు 23 వేల క్వింటాళ్ల విత్తనాలు రైతుల వద్ద, 7,250 క్వింటాళ్లు ప్రైవేట్‌ డీలర్ల వద్ద, 900 క్వింటాళ్ల విత్తనాలు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. 3,500 క్వింటాళ్ల విత్తనాలకు ఏపీ సీడ్స్‌కు ఇండెంట్‌ పెట్టారు.

    ఈ ఖరీఫ్‌కు 43,493 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం కాగా దిగుమతి చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్రైవేట్‌ డీలర్ల వద్ద, మార్క్‌ఫెడ్‌ వద్ద 37,950 మెట్రిక్‌ టన్నులు ఎరువులు ఉన్నాయి. ఆ మొత్తంలో యూరియా 13,250 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 2,900 మెట్రిక్‌ టన్నులు, ఎంఓపీ 2,100 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 10,600 మెట్రిక్‌ టన్నులు, సూపర్‌ 1,020 మెట్రిక్‌ టన్నుల ఎరువులు ఉన్నాయి. గ్రామాల్లో రైతులకు సరఫరా చేసేందుకు ప్రతి ఆర్‌బీకేకు 20 మెట్రిక్‌ టన్నుల ఎరువులు దిగుమతి చేయడానికి వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ చర్యలు తీసుకుంటోంది.

    రైతు మోములో

    చిరునవ్వులు పూయించిన ప్రభుత్వం

    గత ఏడాది కౌలు రైతులకు సంబంధించి 63,900 సీసీఆర్‌సీ కార్డులు పంపిణీ చేశారు. వాటి ఆధారంగా 24,082 మంది రైతులకు రూ.78.78 కోట్లు వివిధ రూపాల్లో రుణాలుగా ఇచ్చారు. వ్యవసాయం దండగ అన్న టీడీపీ పాలకుల అభిప్రాయానికి పూర్తి భిన్నంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వ్యవహరించింది. సాగు ప్రోత్సాహక, రైతు సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటి దిశగా నడిపించింది. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించింది. కొన్ని సీజన్లలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పంట నష్టాలు చవి చూసినా ఏ సీజన్‌కు ఆ సీజన్‌లోనే ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఉచిత పంటల బీమా అమలు చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంది. ఈ విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా రైతు మోములో చిరునవ్వులు పూయించింది.

    జిల్లాలో సార్వా సాగుకు ప్రణాళిక

    1,68,780 ఎకరాల్లో

    వరి సాగుకు సమాయత్తం

    33,750 క్వింటాళ్ల

    విత్తనాలు అవసరం

    ఏపీ సీడ్స్‌కు 3,500 క్వింటాళ్ల

    విత్తనాలకు ఇండెంట్‌

    ఆర్‌బీకేల్లో 900 క్వింటాళ్లు రెడీ

    42,493 మెట్రిక్‌ టన్నుల

    ఎరువుల వినియోగం లక్ష్యం

    ప్రైవేట్‌ డీలర్లు, మార్క్‌ఫెడ్‌ వద్ద

    37,950 మెట్రిక్‌ టన్నులు

    ప్రతీ ఆర్‌బీకేకు

    20 టన్నుల సరఫరాకు చర్యలు

  • ఉప్పలగుప్తం: మండలంలోని మునిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మునిపల్లి కోటిగట్టు ప్రాంతానికి చెందిన నాగారాపు లలిత (29) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఎస్‌ఐ కె.మనోహర జోషి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మునిపల్లి గ్రామానికి చెందిన నాగారపు భీమేంద్ర.. గొల్లవిల్లి పంచాయతీ పరిధి ఇందిరానగర్‌కు చెందిన లలితను ఐదు సంవత్సరాల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు. అయితే భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరిగేవి. భర్త వేధింపులు తాళ లేక సోమవారం సాయంత్రం లలిత ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని మరణించినట్టు భీమేంద్ర కుటుంబీకులు పోలీసులకు, లలిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి తహసీల్దార్‌ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో శవ పరీక్షలు నిర్వహించారు. తన అల్లుడు భీమేంద్ర తన కూతురు లలితను హతమార్చి ఉరి వేసుకున్నట్టు చిత్రీకరించాడని మృతురాలి తల్లి పరమట పుష్పలత ఆరోపిస్తున్నారు. మృతురాలి సోదరుడు పరమట ప్రసాద్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ వివరించారు. కొత్తపేట డీఎస్పీ కె.వి.రమణ, అమలాపురం రూరల్‌ సీఐ పి.వీరబాబు సమక్షంలో కేసు విచారణ జరుపుతున్నామని, భీమేంద్రను అదుపులోకి తీసుకున్నామని ఎస్‌ఐ జోషి తెలిపారు.

  • ఉప్పుటేరులో దూకి వివాహిత మృతి

    కొత్తపల్లి: వివాహేతర సంబంధం కారణంగా ఒక వివాహిత ఉప్పుటేరులో దూకి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అమరవల్లి గ్రామానికి చెందిన బోరా కనకదుర్గ(38)అదే గ్రామానికి చెందిన బోరా చిన రమణారెడ్డి కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కనకదుర్గను కొంతకాలంగా చిన రమణారెడ్డి వేధింపులకు గురి చేస్తున్నాడు. వేధింపులు తట్టుకోలేక ఉప్పుటేరులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త బోరా రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై స్వామినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

  • No He

    టీ పొడి దుకాణాలపై విజిలెన్స్‌ దాడులు

    మూడు షాపులపై కేసుల నమోదు

    కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రీజనల్‌ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆధ్వర్యంలో కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తున్న దుకాణాలపై అధికారులు మంగళవారం దాడులు చేశారు. దీనిలో భాగంగా రాజమహేంద్రవరం టౌన్‌ హాలు రోడ్డులో ఉన్న తేజ అస్సాం టీ పొడి, కీర్తి అస్సాం టీ పొడి దుకాణాలపె దాడి చేయగా అక్కడ నిషేధించిన సింథటిక్‌ ఫుడ్‌ కలర్‌ టార్టాజైన్‌, సన్‌ సెట్‌ పసుపులను టీ పొడిలో కలపడం గుర్తించారు. వెంటనే ఆ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ల్యాబ్‌కు పంపారు. టీ పొడిని కల్తీ చేయడానికి ఉపయోగిస్తున్న టార్టాజైన్‌ (పసుపు) సన్‌ సెట్‌ పసుపులను స్వాధీనం చేసుకున్నారు. ప్యాకింగ్‌ లైసెన్సు లేకపోవడం, టీ పౌడర్‌ ప్యాకెట్లపై కన్జ్యూమర్‌ కేర్‌ వివరాలు లేకపోవడం గుర్తించారు. డోమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌, స్టాంప్‌ లేని వెయింగ్‌ మెషీన్‌ను వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడం గుర్తించారు. అస్సాం టీ కంపెనీను తనిఖీ చేయగా టీ పౌడర్‌ ప్యాకెట్లపై కన్జ్యూమర్‌ కేర్‌ వివరాలు, ప్యాకింగ్‌ లైసెన్సు లేకపోకపోవడం గుర్తించారు. ఈ దుకాణాలపై విజిలెన్స్‌, రెవెన్యూ, ఫుడ్‌ సేఫ్టీ, లీగల్‌ మెట్రాలజీ అధికారులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్స్‌ అధికారులు ముత్యాలు నాయుడు, నాగ వెంకటరాజు, జగన్నాథరెడ్డి, భార్గవ మహేష్‌, లక్ష్మీనారాయణ, రెవెన్యూ, ఫుడ్‌ సేఫ్టీ, లీగల్‌ మెట్రాలజీ అధికారులు పాల్గొన్నారు.

    రాష్ట్ర స్థాయి కిక్‌ బాక్సింగ్‌ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

    ఆలమూరు: మండలంలోని కలవచర్లకు చెందిన మదర్‌ థెరిసా స్పోర్ట్స్‌ అండ్‌ సెల్ఫ్‌ డిఫెన్స్‌ అకాడమీ విద్యార్థులు ఇటీవల విశాఖపట్నం రైల్వే గ్రౌండ్‌ ఆవరణలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కిక్‌ బాక్సింగ్‌ పోటీల్లో చక్కని ప్రతిభను కనబర్చారు. 38 కేజీల విభాగంలో బుంగ అశ్విన్‌( గోల్డ్‌), 35 కేజీల విభాగంలో ఖండవిల్లి మహిమాకర్‌ (సిల్వర్‌), 40 కేజీల విభాగంలో గెద్దాడ జ్యాయ్‌ కిరణ్‌ (సిల్వర్‌), బాలికల 30 కేజీల విభాగంలో కట్టా అనుశ్రీ కార్తికేయ (గోల్డ్‌), టెక్వాండో పోటీల్లో వడ్డి గిరిజ (గోల్డ్‌), వడ్డి కార్తికేయ (సిల్వర్‌) సాధించినట్టు గ్రాండ్‌ మాస్టర్‌ టి.అబ్బులు తెలిపారు. అవార్డులు సాధించిన విద్యార్థులను మాస్టర్స్‌ సంఘ గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ చల్లా ప్రభాకరరావు, సీనియర్‌ మాస్టర్స్‌ లంకె వెంకటరెడ్డి, నార్గాని సెంథిల్‌ కుమార్‌, టి.లక్ష్మి, టి.కిరణ్‌, బుంగ అర్జున్‌ అభినందించారు.

    టీ పొడి దుకాణాలపై

    విజిలెన్స్‌ దాడులు

    కంబాలచెరువు (రాజమహేంద్రవరం): టౌన్‌ హాలు రోడ్డులో ఉన్న తేజ అస్సాం టీ పొడి, కీర్తి అస్సాం టీ పొడి దుకాణాలపె విజిలెన్స్‌ దాడి చేయగా అక్కడ నిషేధించిన సింథటిక్‌ ఫుడ్‌ కలర్‌ టార్టాజైన్‌, సన్‌ సెట్‌ పసుపులను టీ పొడిలో కలపడం గుర్తించారు. వెంటనే ఆ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ల్యాబ్‌కు పంపారు. ఈ దుకాణాలపై అధికారులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు.

  • చికిత్స పొందుతూ క్షతగాత్రుడి మృతి

    పి.గన్నవరం: మండలంలోని ఊడిమూడి గ్రామం వద్ద ఇటీవల ధాన్యం లోడు ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాకినాడ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిలకలపూడి సురేష్‌ (35) మంగళవారం మృతి చెందాడు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది. ఈ నెల 14వ తేదీ సాయంత్రం పి.గన్నవరం మండలం ఊడిమూడి వద్ద రోడ్డు పక్కన 10 మంది వ్యవసాయ కార్మికులు ట్రాక్టర్‌లో ధాన్యం బస్తాలు లోడ్‌ చేసి, పగ్గాలు కడుతుండగా రావులపాలెం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ట్రాక్టర్‌ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టిన విషయం విదితమే. ప్రమాదంలో జి.పెదపూడికి చెందిన నూకపెయ్యి శివ, వాసంశెట్టి సూర్యనారాయణ, ఈరి కట్లయ్య, ఆదిమూలంవారిపాలేనికి చెందిన చిలకలపూడి మణిబాబు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో మణిబాబు అన్న చిలకలపూడి సురేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని అమలాపురం కిమ్స్‌ ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో అతడిని గత శుక్రవారం రాత్రి కాకినాడలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. సురేష్‌ మృతదేహానికి కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణ కేసు నమోదు చేయగా, సీఐ ప్రశాంతకుమార్‌ దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు మృతి చెందడంతో ఆదిమూలం వారిపాలెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సురేష్‌ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు భోరున విలపించారు. మృతుని తండ్రి చిలకలపూడి వెంకటేశ్వరరావు, తల్లి సత్యనారాయణయమ్మ, అన్న గోపాలకృష్ణ, వారి కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు.

    ఐదుకు చేరిన రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య

    అన్నదమ్ముల మృతితో ఏవీపాలెంలో విషాద ఛాయలు

  • శాంతికి ఉన్న శక్తి అనంతం

    ప్రవచన బ్రహ్మ చాగంటి కోటేశ్వరరావు

    బోట్‌క్లబ్‌: మన దేశంలో శాంతి అనే పదానికి ఎంతో శక్తి ఉందని ప్రవచన బ్రహ్మ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. స్థానిక సూర్యకళామందిరంలో మంగళవారం రాత్రి ప్రముఖ సంగీత వాగ్గేయకారుడు కొచ్చర్లకోట రామరాజు కీర్తనల ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతదేశంలో సంగీతానికి ఎంతో విశిష్టత ఉందన్నారు. ఎందరో మహానుభావులు సంగీత కళ ద్వారా వర్షాలు కురిపించి తమ ఘనతను చాటుకున్నారన్నారు. మన హిందూ దేవుళ్ల చేతుల్లో సైతం ఏదో ఒక సంగీత పరికరాన్ని అలంకరించి ఉంటారని పేర్కొన్నారు. మానసిక ప్రశాంతత కోసం మాత్రమే సంగీతం కాదన్నారు. ఎంతో మంది సంగీత కళాకారులు తమ సంగీత సాధనాలతో భగవంతుని సైతం మెప్పించారన్నారు. సంగీత కళాకారుడు కొచ్చర్లకోట రామరాజు కీర్తనలను ఆవిష్కరించే బాగ్యం తనకు దక్కడం గొప్ప విషయమన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత కార్యకారిణి సభ్యులు వారణాసి రామ్‌మాధవ్‌ మాట్లాడుతూ రామరాజు వంటి మహానీయులు అప్పటిలోనే ఉచితంగా సంగీతం నేర్పడంతో పాటు నేర్చుకొనేవారికి ఉచితంగా వసతి కల్పించారన్నారు. కళలకు కుల మతాలు లేవన్నారు. కళలు డబ్బులు సంపాదించుకొనేందుకు కాదన్నారు. బ్రహ్మ వ్యవస్థలో కుల విభజన ఎక్కడా లేదన్నారు. 6వ శతాబ్దంలో కులాంతర వివాహాలు సైతం జరిగేవన్నారు. కొచ్చర్లకోట రామరాజు చారిటబుల్‌ ట్రస్ట్‌ న్యూఢిల్లీ ప్రతినిధి కొచ్చర్లకోట ప్రభాకర సుందరరావు మాట్లాడుతూ ఎప్పటి నుంచో కలగా మిగిలిన తన తాతగారి కీర్తనలు ఇన్ని రోజులకు సీడీ రూపంలో తయారు చేసి వినే భాగ్యం తమకు కలగడం గొప్ప విషయమన్నారు. అనంతరం రామరాజు రచించిన కీర్తనలను ప్రముఖ సంగీత విద్వాంసురాలు పెద్దాడ సూర్యకుమారి ఆలపించారు. తొలుత ముఖ్య అతిథులు జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు. నార్త్‌ ఈస్ట్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పీవీఎస్‌ఎల్‌ఎన్‌ మూర్తి, సుందర స్వామి పాల్గొన్నారు.

  • లెక్చ

    బహుముఖ ప్రజ్ఞాశాలిగా

    అమెరికా జీహెచ్‌పీయూ గుర్తింపు

    ఈ నెల 25న చైన్నె భారతీయ

    విద్యాభవన్‌ ఆడిటోరియంలో ప్రదానం

    కొత్తపేట: స్థానిక ఒక ప్రైవేట్‌ కళాశాల అధ్యాపకుడు, కవి, రచయిత వులుసు వీరవెంకట సత్య సుబ్బారావు అమెరికాకు చెందిన గ్లోబల్‌ హ్యూమన్‌ పీస్‌ యూనివర్సిటీ (జీహెచ్‌పీయూ) గౌరవ డాక్టరేట్‌, భారత్‌ కళారత్న అవార్డుకు ఎంపికయ్యారు. ఆ మేరకు జీహెచ్‌పీయూ ఫౌండర్‌ అండ్‌ చైర్మన్‌ డాక్టర్‌ పీ మాన్యూల్‌ ధ్రువీకరణ పత్రాలు పంపినట్టు సుబ్బారావు మంగళవారం కొత్తపేటలో విలేకరులకు తెలిపారు. రావులపాలెం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన వులుసు సుబ్బారావు సత్యహరిశ్చంద్ర, బాలనాగమ్మ తదితర పౌరాణిక నాటకాలు, అన్నా – చెల్లెలు, పూలకంగడు, కనకపు సింహాసనమున హుష్‌కాకి, అన్నదాత తదితర సాంఘిక నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించిన కళాకారుడు. 2008లో కొత్తపేట వచ్చి స్థిరపడి ఒక ప్రైవేట్‌ కళాశాలలో లెక్చరర్‌గా తన వృత్తిని కొనసాగిస్తూ, ప్రవృత్తిగా కవి, రచయితగా తన ప్రతిభను చాటుకుంటున్నారు. సుబ్బారావు బహుముఖ ప్రజ్ఞను గుర్తించిన జీహెచ్‌పీయూ గౌరవ డాక్టరేట్‌తో పాటు భారత్‌ కళారత్న అవార్డుకు ఎంపిక చేసింది. ఈ నెల 25 న చైన్నె భారతీయ విద్యాభవన్‌ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా సుబ్బారావుకు డాక్టరేట్‌ను, అవార్డును ప్రదానం చేయనున్నారు.

    పురోహితుడు రామంకు సేవారత్న అవార్డు

    స్థానిక పురోహితుడు పెద్దింటి రామచంద్ర శ్రీహరి (రామం) జీహెచ్‌పీయూ సేవారత్న అవార్డుకు ఎంపికయ్యారు. ఆ మేరకు జీహెచ్‌పీయూ ఫౌండర్‌ అండ్‌ చైర్మన్‌ డాక్టర్‌ పీ మాన్యూల్‌ ధ్రువీకరణ పత్రాలు పంపినట్టు రామం విలేకరులకు తెలిపారు. ఆయన పలు ఆలయాల్లో అర్చకునిగా, గ్రామ పురోహితునిగా పనిచేస్తూ దేశ, విదేశాల కరెన్సీ నోట్లు, నాణేలు, డాలర్స్‌, రకరకాల వస్తువులు, 124 సంవత్సరాల పంచాంగాలు సేకరించారు. వివిధ సంస్థల అవార్డులు, రికార్డులు సాధించారు. ఈ నెల 25 న చైన్నెలో అవార్డును స్వీకరించనున్నారు.

  • రత్నగిరిపై వేదఘోష

    150 మంది పండితులకు సత్కారం

    అన్నవరం : రత్నగిరి సత్యదేవుని సన్నిధి మంగళవారం వేదఘోషతో ప్రతిఽధ్వనించింది. సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలలో భాగంగా వైశాఖ శుద్ధ త్రయోదశి, మంగళ వారం సాయంత్రం నవదంపతులు శ్రీసత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్ల సమక్షంలో వేదపండిత సదస్యం జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన వేద,స్మార్త పండితులు స్వామివారి ముందు తమ వేదవిద్వత్తును ప్రదర్శించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 150 మంది పండితులు వచ్చారు. మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీసత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను పెళ్లిపెద్దలు సీతారాములు వెంట రాగా అనివేటి మంటపం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి అక్కడి వేదికపై ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఆలయ వేద పండితుడు ఉపాధ్యాయుల వేంకట సుబ్రహ్మణ్య ఘనపాఠి అధ్యక్షతన పండిత సదస్సు నిర్వహించారు. పండితులు స్వామివారి ముందు నాలుగు వేదాలు పఠించారు. తరువాత దేవస్థానం వేదపండితులు సత్యదేవుడు, అమ్మవార్లకు ఆశీస్సులందచేశారు.

    పండిత సత్కారం

    అనంతరం వేదపండితులను దేవస్థానం చైర్మన్‌ రోహిత్‌, ఈఓ కె.రామచంద్రమోహన్‌ సత్కరించారు. సత్కారం పొందిన వారిలో తిరుపతి వైదిక యూనివర్సిటీ వేదార్ద విభాగ అధిపతి ప్రవా రామకృష్ణ సోమయాజీ, రాజమహేంద్రవరానికి చెందిన మహా మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాఠి, విజయవాడ దేవస్థానం వేద పండితులు ఉపాధ్యాయుల సుబ్రహ్మణ్య ఘనపాఠి, తంగిరాల వేంకటేశ్వర ఘనపాఠి, అన్నవరం దేవస్థానం విశ్రాంత వేద పండితులు ముష్టి కామశాస్త్రి తదితరులున్నారు.

    అన్నవరంలో నేడు

    తెల్లవారుజామున 3.00: సుప్రభాత సేవ

    ఉదయం 8.00: చతుర్వేద పారాయణ

    సాయంత్రం 4.00: కొండ దిగువన దేవస్థానం ఉద్యానవనంలో స్వామివారి వనవిహారం

    సాయంత్రం 5.00: కొండ దిగువన నూతన టేకు రథంపై సత్యదేవుడు, అమ్మవారి ఊరేగింపు

    ఉదయం 7.00 – 10.00, సాయంత్రం 5.00 – రాత్రి 11.00: రత్నగిరి కళావేదిక మీద, కొండ దిగువన సాంస్కృతిక కార్యక్రమాలు

  • వస్తు

    నేడు భారీ టేకు రథంపై ఊరేగనున్న స్వామి, అమ్మవార్లు

    ఆలయ చరిత్రలో తొలిసారిగా

    36 అడుగుల ఎత్తు రథం వినియోగం

    సాయంత్రం ఐదు గంటల నుంచి

    రాత్రి వరకు..

    అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలలో ఐదో రోజు బుధవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆలయ చరిత్రలో తొలిసారిగా 36 అడుగుల ఎత్తు కలిగిన నూతన టేకు రథంపై స్వామి, అమ్మవార్లను ఊరేగించనున్నారు. ఈ ఊరేగింపు కొండ దిగువన మెయిన్‌రోడ్డులో సాయంత్రం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సాగనుంది. స్వామి, అమ్మవార్ల రథోత్సవం కన్నుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కల్యాణ మహోత్సవాలలో సత్యదేవుని ఊరేగింపు రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభమవడం ఎప్పటి నుంచో ఆనవాయితీ. అయితే భద్రతా ఏర్పాట్లతో బాటు, ముందు జాగ్రత్తగా బుధవారం జరిగే రథోత్సవాన్ని సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభిస్తున్నారు. రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ రథోత్సవం కొనసాగనుంది. ఈ రథోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్టు దేవస్థానం ఈఓ కె.రామచంద్రమోహన్‌ తెలిపారు.

    పెద్ద రథంలేని లోటు తీరిందిలా...

    135 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం వార్షిక ఆదాయం రూ.157 కోట్లు. అయినప్పటికీ సుమారు 50 సంవత్సరాల క్రితం తయారు చేయించిన ఊరేగింపు వాహనాలు మినహా భారీ రథం లేదు. వెండి రేకు తాపడం చేసిన చిన్న రథం ఉన్నా దాని ఎత్తు పది అడుగులకు మించదు. ఆ రథం కూడా శిధిలావస్థకు చేరడంతో కొత్తగా స్వామివారి ఊరేగింపునకు రథం చేయించాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ గత ఏడాది కార్యరూపం దాల్చింది. దేవస్థానం ఈఓగా 2022–23 సంవత్సరంలో సేవలందించిన ఎస్‌ఎస్‌ చంద్రశేఖర్‌ అజాద్‌ స్వామివారిని రత్నగిరి ఆలయ ప్రాంగణంలో ఊరేగించేందుకు సుమారు 16 అడుగుల ఎత్తు కలిగిన చిన్నరథం, కల్యాణ మహోత్సవంలో కొండ దిగువన స్వామి, అమ్మవార్లను ఊరేగించేందుకు 36 అడుగుల ఎత్తు కలిగిన పెద్ద రఽథన్ని రూ.1.42 కోట్ల వ్యయంతో తయారు చేసేందుకు టెండర్లు ఖరారు చేశారు. వీటిని మురమండకు చెందిన మాణిక్యాంబ శిల్పకలా ఉడ్‌ వర్క్స్‌ అధినేతలు కొల్లాటి కామేశ్వరరావు, శ్రీనివాస్‌, మరో 20 మంది శిల్పులు తయారు చేశారు. రథసప్తమి నాడు చిన్న రథాన్ని ప్రారంభించారు. దీనిపై ప్రతి ఆదివారం స్వామి,అమ్మవార్లను ఆలయ ప్రాంగణంలో ఊరేగిస్తున్నారు.

    కల్యాణ మహోత్సవాలలో స్వామి, అమ్మవార్లను ఊరేగించేందుకురూ.1,04 కోట్లతో 36 అడుగుల ఎత్తు, 14.6 అడుగుల వెడల్పు, 21 అడుగుల పొడవుతో చేయించిన టేకు రఽథాన్ని గత నెల 26వ తేదీన లాంఛనంగా ప్రారంభించారు. గత గురువారం మెయిన్‌ రోడ్డులో ఈ రథానికి ట్రయిల్‌ రన్‌ నిర్వహించారు. అయితే రథాన్ని ఎత్తే మోటార్‌ కెపాసిటీ తక్కువ ఉండడంతో కొంత ఇబ్బంది ఏర్పడింది.

    రథం ఎత్తేందుకు జాకీకి 2హెచ్‌పీ మోటార్‌ ఏర్పాటు

    రథం జాకీకి ఎక్కువ లోడు ఎత్తే మోటార్‌ బిగించాలని ఈఓ కె.రామచంద్రమోహన్‌ ఆదేశించారు. దాంతో మంగళవారం ఆ మోటార్‌ స్థానంలో 2హెచ్‌పీ మోటార్‌ ఏర్పాటు చేశారు. దేవస్థానం ఈఈ మురళి, ఎలక్ట్రికల్‌ డీఈ సత్యనారాయణ, చౌదరి తదితరుల సమక్షంలో ఆ మోటార్‌ను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ మోటార్‌కు జనరేటర్‌ కూడా అమర్చుతున్నారు.

    కమిటీలు ఏర్పాటు చేశాం

    తొలిపావంచా వద్ద నుంచి ఆంధ్రాబ్యాంక్‌ సెంటర్‌కు అక్కడ నుంచి దేవస్థానం హైస్కూల్‌ వద్ద గల టోల్‌గేట్‌ వరకు మళ్లీ అక్కడ నుంచి తొలిపావంచా వరకు రథోత్సవం జరుగుతుంది. రథోత్సవం నిర్వహణకు దేవస్థానం సిబ్బందితో పలు కమిటీలు ఏర్పాటు చేశాం. బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను కోరాం. భక్తులు, గ్రామస్తులు సహకరించాలి.

    – కె.రామచంద్రమోహన్‌,

    ఈఓ, అన్నవరం దేవస్థానం

    రథోత్సవం ఇలా..

    ఉదయం తొమ్మిది గంటలకు రథాన్ని పంపా సత్రం నుంచి తొలిపాంచా వద్దకు తీసుకువస్తారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి రథాన్ని పుష్పాలతో, విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు సత్యదేవుడు, అమ్మవారిని రథంపై ఉంచి పూజలు చేస్తారు. అనంతరం దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ కె.రామచంద్రమోహన్‌ కొబ్బరికాయలు కొట్టి రథం ముందు పోసిన కుంభం మీదుగా రథాన్ని లాగుతారు. రథోత్సవంలో భాగంగా సుమారు 200 మంది వివిథ కళారూపాలను ప్రదర్శిస్తారని అధికారులు తెలిపారు. రథోత్సవం సందర్భంగా బుధవారం సాయంత్రం నుంచి మెయిన్‌రోడ్డులో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.

Sports

  • హైద‌రాబాద్ 8 వికెట్ల తేడాతో ఘోర ఓట‌మిని చ‌విచూసింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఎస్ఆర్‌హెచ్ విఫ‌ల‌మైంది. తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ 19. 3 ఓవర్లలో 159 పరుగులకు ఎస్‌ఆర్‌హెచ్‌ ఆలౌటైంది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో రాహుల్‌ త్రిపాఠి(55) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హెన్రిచ్‌ క్లాసెన్‌(32), కమ్మిన్స్‌(30) పరుగులతో రాణించారు. 

    కేకేఆర్‌ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్‌ చక్రవర్తి రెండు , రస్సెల్‌,నరైన్‌,  హర్షిత్‌ రనా, ఆరోరా తలా వికెట్‌ సాధించారు. అనంత‌రం 160 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కేకేఆర్ ఊదిప‌డేసింది.  కేకేఆర్ 13.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. 

    కేఆర్‌ బ్యాటర్లలో శ్రేయస్‌ అయ్యర్‌(24 బంతుల్లో 58 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. వెంకటేశ్‌ అయ్యర్‌(51 నాటౌట్‌), గుర్భాజ్‌(23) పరుగులతో రాణించారు. ఇక క్వాలిఫ‌య‌ర్1లో ఓట‌మి పాలైన  ఎస్ఆర్‌హెచ్ ఫైన‌ల్ చేరేందుకు మ‌రో అవ‌కాశం మిగిలి ఉంది.

     మే 24న జ‌ర‌గనున్న క్వాలిఫ‌య‌ర్‌-2లో ఆర్సీబీ లేదా రాజ‌స్తాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఇక ఈ ఓట‌మిపై మ్యాచ్ అనంత‌రం స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ స్పందించాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో విఫలమయ్యాని కమ్మిన్స్ తెలిపాడు.

    మా ఓటమికి కారణమిదే: కమ్మిన్స్‌
    "ఈ ఓటమిని వీలైనంత త్వరగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తాము. ఎందుకంటే మా​కు ఇంకా ఫైనల్స్‌కు చేరేందుకు ఛాన్స్‌ ఉంది. సెకెండ్‌ క్వాలిఫయర్‌లో మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాము.

    ప్రస్తుత టీ20 క్రికెట్‌లో ఏ రోజు ఏమి జరుగుతుందో అంచనా వేయలేం. మేము ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాట్‌తో, అనంతరం బౌలింగ్‌లో కూడా రాణించలేకపోయాము. ఈ పిచ్‌పై బ్యాటింగ్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఉపయోగించాలని నిర్ణయించాం. అందుకే సన్వీర్‌కు ఛాన్ప్‌ ఇచ్చాం. 

    కానీ మా ప్లాన్‌ బెడిసి కొట్టింది. కానీ కేకేఆర్‌ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్‌ చేశారు. ప్రారంభంలో పిచ్‌ బౌలర్లకు కాస్త అనుకూలించింది. కానీ తర్వాత మాత్రం పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించింది. 

    ఇక క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ చెన్నైలో ఆడనున్నాం. చెన్నె వికెట్‌ మాకు సరిగ్గా సరిపోతుందని నేను భావిస్తున్నారు. కాబట్టి ఆ మ్యాచ్‌లో విజయం సాధిస్తామన్న నమ్మకం మాకు ఉందంటూ" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు.

     

  • ఐపీఎల్‌-2024లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్‌-1లో సనరైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు రాహుల్ త్రిపాఠి ఇన్నింగ్స్‌ ఆడాడు. విధ్వంసకర ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శరక్మ విఫలమైన చోట.. త్రిపాఠి తన బ్యాట్‌కు పనిచెప్పాడు. 

    ఐదో వికెట్‌కు క్లాసెన్‌తో కలిసి 62 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓవరాల్‌గా 35 బంతులు ఎదుర్కొన్న త్రిపాఠి 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 55 పరుగులు చేశాడు.

    అయ్యో రాహుల్‌..
    అయితే ఈ మ్యాచ్‌లో మంచి టచ్‌లో కన్పించిన త్రిపాఠిని దురదృష్టం వెంటాడింది. అనూహ్య రీతిలో త్రిపాఠి రనౌటయ్యాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ 14 ఓవర్‌ వేసిన సునీల్‌ నరైన్‌ బౌలింగ్‌లో తొలి బంతిని సమద్‌ భారీ సిక్స్‌ మలిచాడు. అదే ఓవర్‌లో రెండో బంతిని సమద్‌ పాయింట్‌ దిశగా షాట్‌ ఆడాడు. 

    పాయింట్‌లో ఉన్న రస్సెల్‌ అద్బుతంగా డైవ్‌ చేస్తూ బంతిని ఆపాడు. అయితే షాట్‌ ఆడిన వెంటనే సమద్‌ నాన్‌స్ట్రైక్‌లో ఉన్న రాహుల్‌ త్రిపాఠితో ఎటువంటి సమన్వయం లేకుండా సింగిల్‌ కోసం ప్రయత్నించాడు. త్రిపాఠి మాత్రం బంతిని చూస్తూ మిడిల్‌ పిచ్‌లోనే ఉండిపోయాడు. 

    ఈ క్రమంలో రస్సెల్‌ బంతిని వికెట్‌ కీపర్‌ గుర్బాజ్‌ అందజేయగా.. అతడు స్టంప్స్‌ను గిరాటేశాడు. కాగా ఔటైన అనంతరం త్రిపాఠి భావోద్వేగానికి లోనయ్యాడు. పెవిలియన్‌కు వెళ్లే క్రమంలో మెట్లపై కూర్చోని కన్నీరు పెట్టుకున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ ఓనర్‌ కావ్యా మారన్‌ సైతం షాక్‌కు గురైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

     

  • ఐపీఎల్‌-2024 సీజన్‌ మొత్తం అదరగొట్టిన సన్‌రైజర్స్‌ హైద‌రాబాద్‌ స్టార్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌.. కీలక మ్యాచ్‌లో మాత్రం నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్‌-1లో హెడ్‌ డకౌటయ్యాడు.

    కేకేఆర్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ అద్భుతమైన బంతితో హెడ్‌ను బోల్తా కొట్టించాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ వేసిన స్టార్క్ రెండో బంతిని‌ మిడిల్‌ స్టంప్‌ను టార్గెట్‌ చేస్తూ గుడ్‌లెంగ్త్‌ డెలివరీ సంధించాడు. ఆ బంతిని హెడ్‌ ఆఫ్‌సైడ్‌ దిశగా షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. 

    కానీ బంతి ప్యాడ్‌, బ్యాట్‌ గ్యాప్‌ మధ్యలో నుంచి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది. ఇది చూసిన హెడ్‌కు మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. అంతేకాకుండా హెడ్‌ ఔట్‌కాగానే కేకేఆర్‌ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

  • IPL 2024: KKR vs SRH ipl qualifier 1 live updates:

    సన్‌రైజర్స్‌ చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన కేకేఆర్‌
    ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్‌-1లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్‌ ఘన విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్‌.. 13.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. 

    కేకేఆర్‌ బ్యాటర్లలో శ్రేయస్‌ అయ్యర్‌(24 బంతుల్లో 58 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. వెంకటేశ్‌ అయ్యర్‌(51 నాటౌట్‌), గుర్భాజ్‌(23) పరుగులతో రాణించారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో ప్యాట్‌ కమ్మిన్స్‌, నటరాజన్‌ తలా వికెట్‌ సాధించారు. 

    అ‍ంతకుముందు బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. 19. 3 ఓవర్లలో 159 పరుగులకు ఎస్‌ఆర్‌హెచ్‌ ఆలౌటైంది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో రాహుల్‌ త్రిపాఠి(55) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హెన్రిచ్‌ క్లాసెన్‌(32), కమ్మిన్స్‌(30) పరుగులతో రాణించారు.

     కేకేఆర్‌ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్‌ చక్రవర్తి రెండు , రస్సెల్‌,నరైన్‌,  హర్షిత్‌ రనా, ఆరోరా తలా వికెట్‌ సాధించారు.

    రెండో వికెట్‌ డౌన్‌.. నరైన్‌ ఔట్‌
    67 పరుగుల వద్ద కేకేఆర్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 21 పరుగులు చేసిన సునీల్‌ నరైన్‌.. కమ్మిన్స్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 

    తొలి వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
    160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 23 పరుగులు చేసిన రెహ్మతుల్లా గుర్భాజ్.. నటరాజన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

     5 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్‌ వికెట్‌ నష్టానికి 57 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేశ్‌ అయ్యర్‌(12), నరైన్‌(12) పరుగులతో రాణించారు.

    దూకుడుగా ఆడుతున్న కేకేఆర్‌..
    160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో గుర్భాజ్‌(12), సునీల్‌ నరైన్‌(9) పరుగులతో ఉన్నారు.
    నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన ఎస్‌ఆర్‌హెచ్‌..
    టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. 19. 3 ఓవర్లలో 159 పరుగులకు ఎస్‌ఆర్‌హెచ్‌ ఆలౌటైంది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో రాహుల్‌ త్రిపాఠి(55) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హెన్రిచ్‌ క్లాసెన్‌(32), కమ్మిన్స్‌(30) పరుగులతో రాణించారు.

     కేకేఆర్‌ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్‌ చక్రవర్తి రెండు , రస్సెల్‌,నరైన్‌,  హర్షిత్‌ రనా, ఆరోరా తలా వికెట్‌ సాధించారు.

    14 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌: 123/7
    స‌న్‌రైజ‌ర్స్ వ‌రుస క్ర‌మంలో రెండు వికెట్లు కోల్పోయింది. 14వ ఓవ‌ర్ వేసిన సునీల్ న‌రైన్ బౌలింగ్‌లో తొలుత రాహ‌ల్ త్రిపాఠి(55) ర‌నౌట్ కాగా..  ఆ త‌ర్వాతి బంతికే స‌న్వీర్ సింగ్ ఔట‌య్యాడు. 14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఎస్ఆర్‌హెచ్ 7 వికెట్ల న‌ష్టానికి 123 ప‌రుగులు చేసింది.

    ఐదో వికెట్‌ డౌన్‌
    హెన్రిచ్‌ క్లాసెన్‌ రూపంలో సన్‌రైజర్స్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 32 పరుగులు చేసిన క్లాసెన్‌.. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌: 115/5
    నిలకడగా ఆడుతున్న క్లాసెన్‌, త్రిపాఠి
    10 ఓవ‌ర్లు ముగిసేస‌రికి స‌న్‌రైజ‌ర్స్ 4 వికెట్ల న‌ష్టానికి 92 ప‌రుగులు చేసింది. క్రీజులో క్లాసెన్‌(30), రాహుల్ త్రిపాఠి(45) ప‌రుగుల‌తో ఉన్నారు.

    నిప్పులు చెరుగుతున్న స్టార్క్‌.. కష్టాల్లో ఎస్‌ఆర్‌హెచ్‌
    టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కష్టాల్లో పడింది. కేకేఆర్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ దాటికి కేవలం 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. స్టార్క్‌ 3 వికెట్లు పడగొట్టాడు. 6 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్‌ త్రిపాఠి(24), హెన్రిచ్‌ క్లాసెన్‌(5) ఉన్నారు.

    రెండో వికెట్ డౌన్‌.. అభిషేక్ ఔట్‌

    అభిషేక్‌ శర్మ రూపంలో ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 3 పరుగులు చేసిన అబిషేక్‌.. ఆరోరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి నితీష్‌ కుమార్‌ రెడ్డి వచ్చాడు.

     4 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్‌ రెండు వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్‌ త్రిపాఠి(220, నితీష్‌ కుమార్‌(4) పరుగులతో ఉన్నారు.

    ఎస్ఆర్‌హెచ్ తొలి వికెట్ డౌన్‌.. హెడ్ ఔట్‌
    టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్‌కు ఆదిలోనే బిగ్ షాక్ త‌గిలింది. ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్‌.. తొలి ఓవ‌ర్ వేసిన స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. క్రీజులోకి రాహుల్ త్రిపాఠి వ‌చ్చాడు. తొలి ఓవ‌ర్ ముగిసే స‌రికి స‌న్‌రైజ‌ర్స్ వికెట్ న‌ష్టానికి 8 ప‌రుగులు చేసింది.

    ఐపీఎల్‌-2024లో తొలి క్వాలిఫయర్‌కు రంగం సిద్ద‌మైంది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా క్వాలిఫయర్-1లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు త‌ల‌పడ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.

    కేకేఆర్ ఒక మార్పుతో బ‌రిలోకి దిగగా.. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మాత్రం ఎటువంటి మార్పులు చేయ‌లేదు. కేకేఆర్ జ‌ట్టులోకి ఫిల్ సాల్ట్ స్ధానంలో గుర్భాజ్ వ‌చ్చాడు. ఈ మ్యాచ్‌లో విజ‌యంలో సాధించిన జ‌ట్టు నేరుగా ఫైన‌ల్‌కు అర్హ‌త సాధిస్తోంది. 

    తుది జ‌ట్లు
    కోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీప‌ర్‌), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి

    సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీప‌ర్‌), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియాస్కాంత్, టి నటరాజన్

  • టీ20 ప్రపంచకప్-2024 ముగిసిన తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెడ్‌కోచ్‌ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను సైతం ఆహ్వానించింది.

    మే 27 సాయంత్రం ఆరు గంటలలోపు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. టీమిండియా హెడ్‌కోచ్‌ రేసులో మాజీ క్రికెటర్లు జస్టిన్‌ లాంగర్‌, గౌతం గంభీర్‌, స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌,  పాంటింగ్‌ వంటి పేర్లు వినిపిస్తున్నాయి.

    ఈ నేపథ్యంలో భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు అవకాశం లభిస్తే టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు భజ్జీ తెలిపాడు.

    భారత హెడ్‌కోచ్‌ పదవికి నేను దరఖాస్తు చేస్తానో లేదో నాకు తెలియదు. కానీ, టీమిండియాకు కోచింగ్ అనేది మ్యాన్ మేనేజ్‌మెంట్. భార‌త ఆట‌గాళ్ల‌కు క్రికెట్ గురించి ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ ఇవ్వాల్సిన‌ అవ‌స‌రం లేదు. 

    క్రికెట్‌ ఎలా ఆడాలో వారికి బాగా తెలుసు. వారికి మార్గదర్శకత్వంగా ఉంటే చాలు. నాకు క్రికెట్ ఎంతో ఇచ్చింది. కోచ్ రూపంలో ఎంతోకొంత తిరిగి ఇచ్చే అవ‌కాశం వ‌స్తే సంతోషిస్తా" అని ఓ స్పోర్ట్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  హర్భజన్ పేర్కొన్నాడు.
     

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఐపీఎల్‌-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. మరో ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌తో కలిసి విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడుతూ దుమ్ములేపుతున్నాడు.

    ఇప్పటి వరకు ఈ సీజన్‌లో అభిషేక్‌ శర్మ ఆడిన 13 మ్యాచ్‌లలో కలిపి 467 పరుగులు సాధించాడు. పలు మ్యాచ్‌లలో తన అద్భుత ఇన్నింగ్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌తో పాటు ఎలక్ట్రిక్‌ స్ట్రైకర్‌ అవార్డులు కూడా అందుకున్నాడు.

    ఇక 23 ఏళ్ల ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ సాధిస్తున్న విజయాల పట్ల అతడి తల్లిదండ్రులు రాజ్‌కుమార్‌ శర్మ, మంజు శర్మ ఎంతగానో మురిసిపోతున్నారు. కాగా ఐపీఎల్‌-2024 నేపథ్యంలో అభిషేక్‌ తల్లి మంజు, సోదరి కోమల్‌ అతడి వెంటే ప్రయాణాలు చేస్తున్నారు.

    ఈ క్రమంలో కోమల్‌ తన సోదరుడు అభిషేక్‌తో కలిసి స్టేడియంలో సందడి చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. సన్‌రైజర్స్‌ యజమాని కావ్యా మారన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ లెజెండ్‌ మహేంద్ర సింగ్‌ ధోని, రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌తో కలిసి ఆమె దిగిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి.

    చెల్లెలు కాదు.. అక్క! 
    ఈ నేపథ్యంలో కోమల్‌ శర్మ గురించిన వివరాల కోసం అభిమానులు వెదుకుతున్నారు. కోమల్ శర్మ అభిషేక్‌ శర్మ చెల్లెలు అని పొరబడుతున్నారు. నిజానికి ఆమె అభిషేక్‌ కంటే ఏడేళ్లు పెద్దవారట.

     

    మార్చి 20, 1994లో కోమల్‌ శర్మ జన్మించారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గల గురునానక్‌ దేవ్‌ యూనివర్సిటీ నుంచి  ఫిజియోథెరపీలో ఆమె బ్యాచిలర్‌ డిగ్రీ చేశారు. జైపూర్‌లోని నిమ్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు.

    ఆమె ఒక డాక్టర్‌!
    ప్రస్తుతం అమృత్‌సర్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా కొనసాగుతున్న డాక్టర్‌ కోమల్‌ సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటారు. తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటొలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో రెండున్నర లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. కాగా అభిషేక్‌కు కోమల్‌తో పాటు మరో సోదరి సానియా శర్మ కూడా ఉన్నారు.

    ఇక సన్‌రైజర్స్‌ క్వాలిఫయర్‌-1కు అర్హత సాధించిన నేపథ్యంలో తన తమ్ముడు అభిషేక్‌ శర్మతో కలిసి కోమల్‌ అహ్మదాబాద్‌కు వెళ్లారు. కాగా నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌- సన్‌రైజర్స్‌ మధ్య మ్యాచ్‌తో తొలి ఫైనలిస్టు ఎవరో తేలనుంది.

  • టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024కు ముందు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ (ACB) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ కోసం త‌మ జ‌ట్టు బౌలింగ్ కన్సల్టెంట్‌గా వెస్టిండీస్ క్రికెట్ దిగ్గ‌జం డ్వేన్ బ్రావోను ఏసీబీ నియ‌మించింది. 

    క‌రేబియ‌న్ దీవుల‌లో ఈ మెగా ఈవెంట్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో బ్రావో సేవ‌ల‌ను ఉప‌యెగించుకోవాల‌ని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ నిర్ణ‌యించుకుంది. కాగా అఫ్గానిస్తాన్ క్రికెట్ జ‌ట్టు ఇప్ప‌టికే విండీస్‌కు చేరుకుంది. 

    సెయింట్ కిట్స్‌లో ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరంలో ప్రాక్టీస్ చేయ‌నున్నారు. బ్రావో కూడా అతి త్వ‌ర‌లోనే అఫ్గాన్ జ‌ట్టుతో క‌ల‌వ‌నున్నాడు. ఇక బ్రావో ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ ప‌నిచేస్తున్నాడు. 

    40 ఏళ్ల బ్రావోకు అంత‌ర్జాతీయ క్రికెట్‌తో పాటు ప్రాంచైజీ క్రికెట్‌లో కూడా అపార‌మైన అనుభవం ఉంది. వెస్టిండీస్ తరపున ఓవ‌రాల్‌గా 295 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన బ్రావో..  6423 పరుగులతో పాటు 363 వికెట్లు తీశాడు. 

    టీ20 క్రికెట్‌(అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు+ లీగ్‌లు)లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బ్రావోనే కొనసాగుతున్నాడు. బ్రావో ఇప్ప‌టివ‌ర‌కు టీ20ల్లో 625 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ రెండు సార్లు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను సొంతం చేసుకోవ‌డంలోనూ బ్రావోది కీల‌క పాత్ర‌. 

    అంతేకాకుండా ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌, సీపీఎల్‌లో సెయింట్ లూసియా వంటి జ‌ట్లు టైటిల్స్‌ను సాధించ‌డంలోనూ బ్రావో త‌న వంతు పాత్ర పోషించాడు. ఇటువంటి వ‌ర‌ల్డ్‌క్లాస్ క్రికెటర్‌తో అఫ్గానిస్తాన్ క్రికెట్ ఒప్పందం కుదుర్చుకోవ‌డం ఆ జ‌ట్టుకు ఎంతో లాభం చేకూరుతోంది.

  • ‘‘ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆటగాళ్లతో కూడిన జట్టు. నేను పదేళ్ల పాటు ఆ జట్టుకు ఆడాను. ముంబై మేనేజ్‌మెంట్‌ టీమ్‌ను చాలా బాగా చూసుకుంటుంది. అయితే, ఈసారి వాళ్లు తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే వారు కెప్టెన్‌ను మార్చారు. కానీ.. వాళ్లు అనుకున్నట్లుగా ఏదీ జరుగలేదు.

    జట్టు ఏకతాటిపై ఉన్నట్లు కనిపించలేదు. ఎవరికి వారే అన్నట్లు విడివిడిగా ఉన్నట్లు అనిపించింది. ముంబై లాంటి జట్టు ఇలా పేలవంగా ఆడటం నన్ను బాధించింది.

    కెప్టెన్‌ను మార్చాలనే నిర్ణయం సరైందే అయినా.. అందుకు మరో ఏడాది వేచి చూడాల్సింది. ఇందులో హార్దిక్‌ పాండ్యా తప్పేం లేదు. గుజరాత్‌ టైటాన్స్‌లో ఉన్నపుడు అతడి కెప్టెన్సీ అద్భుతంగా ఉంది.

    నిజానికి.. కెప్టెన్‌ ఎవరైనా.. సీనియర్లంతా కలిసి జట్టును ఒక్కటిగా ఉంచాల్సింది. కెప్టెన్లు వస్తారూ.. పోతారు. జట్టు మాత్రం ఒక్కతాటిపై ఉండాలి కదా!

    ఈసారి వాళ్లు జట్టులా ఆడినట్లు ఏ కోశానా కనిపించలేదు’’ అని టీమిండియా స్పిన్‌ దిగ్గజం హర్భజన్‌ సింగ్‌ అన్నాడు. ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ దారుణ వైఫల్యం పట్ల విచారం వ్యక్తం చేశాడు.

    కాగా ఈ సీజన్‌ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్‌ రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి.. గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ట్రేడ్‌ చేసుకున్న హార్దిక్‌ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. దీంతో సొంత జట్టు అభిమానుల నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.

    అదే విధంగా హార్దిక్‌ పాండ్యాకు సైతం స్టేడియంలో, సోషల్‌ మీడియాలో  అభిమానుల ఆగ్రహ జ్వాలల సెగ తగిలింది. అందుకు తగ్గట్లుగానే ముంబై వరుస మ్యాచ్‌లలో ఓడిపోవడం.. ఆఖరికి ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలవడంతో ఫ్యాన్స్‌ మరోసారి రెచ్చిపోయారు.

    ఇక ఓవరాల్‌గా ఈ ఎడిషన్‌లో ముంబై ఆడిన పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ మాజీ కెప్టెన్‌ హర్భజన్‌ సింగ్‌ వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు.

    జట్టు రెండు వర్గాలుగా విడిపోవడానికి సీనియర్లే కారణమంటూ పరోక్షంగా రోహిత్‌ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌లను టార్గెట్‌ చేశాడు. హార్దిక్‌ పాండ్యాకు మద్దతు తెలిపే క్రమంలో భజ్జీ జట్టు వైఫల్యాలకు సీనియర్లను బాధ్యులుగా చూపే ప్రయత్నం చేశాడు.

    చదవండి: KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్‌ చేరే తొలి జట్టు ఇదే: పాక్‌ లెజెండ్‌

  • టీమిండియా హెడ్ కోచ్ ప‌ద‌వికి కోసం బీసీసీఐ దరఖాస్తులను అహ్హ‌నించిన సంగ‌తి తెలిసిందే. హెడ్ కోచ్ పదవిపై ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను ఈ నెల 27. సాయంత్రం 6 గంటల్లోగా బీసీసీఐకి తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. 

    ఈ క్ర‌మంలో రాహుల్ ద్ర‌విడ్ వారుసుడిగా ప‌లు దిగ్గ‌జాలు పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ప్ర‌ధానంగా వినిపిస్తున్న పేరు చెన్నై సూప‌ర్ కింగ్స్ హెడ్‌కోచ్‌, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్. భార‌త జ‌ట్టు హెడ్‌కోచ్ బాధ్య‌త‌ల‌ను ఎలాగైనా ఫ్లెమింగ్‌కు అప్ప‌గించాల‌ని బీసీసీఐ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

    కానీ ఫ్లెమింగ్ మాత్రం టీమిండియా హెడ్‌కోచ్ బాధ్య‌త‌లు చెప‌ట్టేందుకు సిద్దంగా లేనిట్లు సమాచారం. 2027 వరకు  ప్రపంచవ్యాప్తంగా ప‌లు టీ20 ఫ్రాంచైజీల‌తో కోచ్‌గా అత‌డు ఒప్పందం కుదుర్చుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. 

    అయితే  జస్టిన్ లాంగర్, గౌతమ్ గంభీర్, మహేల జయవర్ధనే వంటి ఇతర అభ్యర్థులతో బీసీసీఐ చర్చలు జరుపుతున్నప్పటికీ.. ఈ మాజీ న్యూజిలాండ్ క్రికెటర్‌ను ఒప్పించడంపై బోర్డు ఆసక్తిగా ఉంది. 

    ఈ క్ర‌మంలో  టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేలా ఫ్లెమింగ్‌ను ఒప్పించే బాధ్యతను బీసీసీఐ.. సీఎస్‌కే మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అప్ప‌గించిన‌ట్లు బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

    "భారత హెడ్‌కోచ్ ప‌దవి కోసం  స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను  బీసీసీఐ సంప్ర‌దించింది. అందుకు ఫ్లెమింగ్ నో చెప్పలేదు. కానీ అత‌డు ఫ్రాంచైజీల‌తో త‌న కాంట్రాక్ట్ పదవీకాలం గురించి ఆలోచిస్తున్నాడు. అయితే రాహుల్ ద్ర‌విడ్ కూడా తొలుత భార‌త హెడ్‌కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. 

    కానీ అత‌డిని ఒప్పించారు. ఇప్పుడు ఫ్లెమింగ్ విషయంలో కూడా అదే జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ బాధ్య‌తను ఎంఎస్ ధోనికి అప్ప‌గించారు. ఎందుకంటే స్టీఫెన్‌తో ధోనికి మంచి సంబంధాలు ఉన్నాయ‌ని" ఓ బీసీసీఐ అధికారి ఒక‌రు హిందుస్థాన్ టైమ్స్‌తో పేర్కొన్నారు.
     

  • సానుకూల దృక్పథం ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా విజయవంతంగా ముందుకు సాగవచ్చంటున్నాడు టీమిండియా నయా ఫినిషర్‌ రింకూ సింగ్. టైమ్‌ బాగాలేదంటూ కాలం వృథా చేసే మనిషిని కాదని.. దేవుడు తనకు అన్నీ ఇచ్చాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం తనకు రోజులు బాగానే గడుస్తున్నాయని తెలిపాడు.

    క్రికెటర్‌గా జూనియర్‌ లెవల్‌లో ఎన్నో ట్రోఫీలు గెలిచానన్న రింకూ సింగ్‌.. ఈసారి ప్రపంచకప్‌ను ముద్దాడే అవకాశం తనకు తప్పక వస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. కాగా జూన్‌ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా మొదలయ్యే టీ20 ప్రపంచకప్‌-2024 కోసం బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.

    పదిహేను మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టులో రింకూ సింగ్‌కు చోటు దక్కలేదు. ట్రావెలింగ్‌ రిజర్వ్‌ ప్లేయర్‌గా మాత్రమే అతడిని ఎంపిక చేశారు సెలక్టర్లు. ఈ నేపథ్యంలో రింకూకు అన్యాయం జరిగిందంటూ పలువురు మాజీ క్రికెటర్లు సెలక్షన్‌ కమిటీ తీరును తప్పుబట్టారు.

    అయితే, తాను మాత్రం ప్రతికూల పరిస్థితుల్లోనూ పాజిటివీతోనే ఉంటానని రింకూ సింగ్‌ అంటున్నాడు. ‘‘సాకులు వెదుక్కునే వాళ్లే టైమ్‌ బాగాలేదని చెప్తూ ఉంటారు. నాకు అన్ని అవయవాలు సక్రమంగానే ఉన్నాయి కాబట్టి మన టైమ్‌ బాగున్నట్లే కదా.

    టీమిండియా వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఓడిపోయినపుడు చాలా మంది ఏడ్చారు. ఏదేమైనా గతాన్ని మరిచి ముందుకు సాగాల్సి ఉంటుంది! నిజానికి నేను జూనియర్‌ లెవల్‌లో ట్రోఫీలు గెలిచాను. కానీ సీనియర్‌ లెవల్లో ఒక్కసారి కూడా టైటిల్‌ సాధించలేదు.

    అయితే, ఈసారి టీ20 ప్రపంచకప్‌ రూపంలో మెగా టోర్నీలో భాగం కాబోతున్నాను. ఈసారి వరల్డ్‌కప్‌ను నా చేతుల్లోకి తీసుకుంటాననే అనుకుంటున్నా. మేజర్‌ ఈవెంట్లో ట్రోఫీ గెలవాలన్నది ప్రతి ఒక్క క్రికెటర్‌ కల’’ అని రింకూ సింగ్‌ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కేకేఆర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

    కాగా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రింకూ ఈ ఏడాది 11 ఇన్నింగ్స్‌ ఆడి కేవలం 168 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం అతడు క్వాలిఫయర్‌-1 ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడు. అహ్మదాబాద్‌లో మంగళవారం జరుగనున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది.

    చదవండి: KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్‌ చేరే తొలి జట్టు ఇదే: పాక్‌ లెజెండ్‌

  • ఐపీఎల్‌-2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సంచలన ఆట తీరుతో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో అత్యధిక స్కోరు(287) నమోదు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. గత మూడేళ్లుగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీ పడ్డ దుస్థితి నుంచి.. ఈసారి ఏకంగా ఫైనల్‌ రేసులో నిలిచే స్థాయికి చేరుకుంది.  

    కనీసం ప్లే ఆఫ్స్‌ చేరినా చాలంటూ ఆరెంజ్‌ ఆర్మీ అభిమానులు ఎదురుచూస్తున్న వేళ.. విధ్వంసకర ఆట తీరుతో ఏకంగా క్వాలిఫయర్‌-1కు అర్హత సాధించింది. ఇంకొక్క ఆటంకం దాటితే చాలు.. ఐపీఎల్‌ పదిహేడో ఎడిషన్‌లో ఫైనల్‌ చేరిన తొలి జట్టుగా అర్హత సాధించే అవకాశం ముంగిట నిలిచింది.

     ప్రధాన కారణాలు ఇవే
    ఇక ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ అద్భుత విజయాలకు ప్రధాన కారణం విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ వ్యూహాలు, కోచ్‌ డానియల్‌ వెటోరీ ప్రణాళికలు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సారథిగా కమిన్స్‌ జట్టును గెలుపు బాట పట్టించడంలో పూర్తిగా విజయవంతమయ్యాడు.

    ప్రత్యర్థి జట్ల వ్యూహాలను చిత్తు చేస్తూ మైదానంలో ఎప్పటికప్పుడు సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగి సన్‌రైజర్స్‌ విన్‌రైజర్స్‌గా మార్చడంలో సఫలమయ్యాడు ఈ పేస్‌ బౌలర్‌. ఒత్తిడి నెలకొన్న సమయాల్లోనూ ఏమాత్రం సహనం కోల్పోకుండా ఆటగాళ్లకు అండగా నిలుస్తూ ఫలితాలు రాబడుతున్నాడు. ఫ్రాంఛైజీ తన కోసం ఖర్చు పెట్టిన రూ. 20.50 కోట్లకు పూర్తి న్యాయం చేస్తూ పైసా వసూల్‌ ప్రదర్శన ఇస్తున్నాడు.

    మరో అవకాశం కూడా ఉంది
    ఇక కమిన్స్‌ సారథ్యంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న సన్‌రైజర్స్‌ క్వాలిఫయర్‌-1లోనూ ఇదే జోష్‌ కనబరిస్తే.. టైటిల్‌కు కేవలం ఒక్క అడుగు దూరంలో నిలుస్తుంది.

    ఒకవేళ కేకేఆర్‌తో ఈ మ్యాచ్‌లో ఓడినా క్వాలిఫయర్‌-2 రూపంలో కమిన్స్‌ బృందానికి మరో అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎలా చూసినా ఈసారి సన్‌రైజర్స్‌కు ఫైనల్‌ చేరేందుకు సానుకూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ ఆరెంజ్‌ ఆర్మీ ఫ్యాన్స్‌ నెట్టింట సందడి చేస్తున్నారు.

    ఫైనల్స్‌లో అడుగుపెట్టడమే తరువాయి
    ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌గా మారింది. కాగా సొంతమైదానం ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌ ఆదివారం.. ఈ సీజన్‌ లీగ్‌ దశలో తమ ఆఖరి మ్యాచ్‌ ఆడింది. పంజాబ్‌ కింగ్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.

    అనంతరం కేకేఆర్‌- రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ రద్దు కావడంతో రెండో స్థానాన్ని మరింత పదిలం చేసుకుని క్వాలిఫయర్‌-1కు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో కమిన్స్‌ స్పందిస్తూ.. ‘‘ఉప్పల్‌లో మరో అద్భుతమైన రోజు. మాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు. ఇక మనం ఫైనల్స్‌లో అడుగుపెట్టడమే తరువాయి’’ అని అభిమానులను ఉత్సాహపరిచాడు.

    ఈసారి కచ్చితంగా తుదిపోరుకు అర్హత సాధిస్తామని ఈ సందర్భంగా కమిన్స్‌ ధీమా వ్యక్తం చేశాడు. కాగా కేకేఆర్‌- సన్‌రైజర్స్‌ మధ్య క్వాలిఫయర్‌-1కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. ఇదే గడ్డపై వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో ప్యాట్‌ కమిన్స్‌ సారథ్యంలోని ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

    చదవండి: KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్‌ చేరే తొలి జట్టు ఇదే: పాక్‌ లెజెండ్‌
     

Movies

  • అల్లు అర్జున్‌- సుకుమార్‌ కాంబోలో వస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. ఈ మూవీ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌, ఫస్ట్‌ సింగిల్‌కు ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పుష్ప పుష్ప అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ యూట్యూబ్‌ను షేక్‌ చేసింది. ముఖ్యంగా పుష్ప షూ స్టెప్‌కు ఫ్యాన్స్‌ ఫుల్ ఫిదా ‍అయ్యారు.

    తాజాగా పుష్ప టీమ్‌ నుంచి మరో అప్‌డేట్‌ వచ్చేసింది. బుధవారం ఉదయం 11:07 గంటలకు అప్‌డేట్ ఇవ్వనున్నట్లు చిత్రబృందం ట్వీట్ చేసింది. దీంతో పుష్ప-2 రెండో సింగిల్‌ రిలీజ్‌ ఉంటుందని తెలుస్తోంది.    కాగా.. ఈ చిత్రంలో రష్మిక మందన్నా  హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు సుకుమార్ ఇప్పటికే ప్రకటించారు.

  • బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్‌ తారలకు సమస్యలు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే ఈ పార్టీకి తాము హాజరు కాలేదని హేమ, శ్రీకాంత్‌ వీడియోలు రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ‍అయితే ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో ఊహగానాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ యాంకర్‌ శ్యామలపై కొందరు అసత్య కథనాలు ప్రచారం చేశారు. ఆమె రేవ్‌ పార్టీలో పాల్గొన్నారంటూ కథనాలు సృష్టించారు.

    దీంతో తనపై వస్తున్న అసత్య వార్తలపై యాంకర్‌ శ్యామల గట్టిగానే స్పందించింది. తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపింది. ఇప్పటికే వారిపై పరువునష్టం దావా వేసినట్లు శ్యామల వెల్లడించింది. కావాలనే తనపై ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆమె మండిపడింది.

    అయితే యాంకర్ శ్యామల ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అందువల్లే రాజకీయ కక్షతోనే ఇలాంటి అసత్య కథనాలు రాస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై న్యాయపోరాటం చేస్తానని శ్యామల స్పష్టం చేసింది. 

  • బాలీవుడ్ భామ కిరణ్ రాథోడ్ తెలుగు వారికి  సైతం పరిచయం అక్కర్లేదు. హిందీ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. నువ్వు లేక నేను లేను చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఆ తర్వాత తెలుగుతో పాటు  తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ చిత్రాలు చేసింది. ‍అయితే 2016 నుంచి సినిమాలు చేయడం ఆపేసిన ముద్దుగుమ్మ.. గతేడాది జరిగిన తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-7 మెరిసింది. అయితే మొదటివారంలోనే ఎలిమినేట్ అయి ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది.

    ఇదిలా ఉండగా.. బిగ్‌ బాస్‌ బ్యూటీ తాజాగా చేసిన పోస్ట్‌ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వీసా విషయంలో తలెత్తిన సమస్యతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనట్లు పోస్ట్ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. అసలేం జరిగిందో ఓ సారి తెలుసుకుందాం.

    ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ప్రతిష్టాత్మక కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు కిరణ్ రాథోడ్‌ కూడా హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం ఆమె ఇప్పటికే గతనెలలోనే వీసాకు అప్లై చేసింది. కానీ ఇప్పటికీ ఆమెకు వీసా జారీ కాలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది.

    కిరణ్‌ రాథోడ్‌ ఇన్‌స్టాలో రాస్తూ..'కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు మే 13వ తేదీనే వెళ్లాల్సి ఉంది. ఇప్పటికే మా టీమ్‌ అంతా అక్కడికి చేరుకున్నారు. నేను మాత్రం నెల రోజులైనా వీసా కోసం ఎదురు చూస్తూనే ఉన్నా. ఇప్పటికే ముందస్తుగా హోటల్‌ బుకింగ్‌, ట్రావెల్‌ బుకింగ్‌ ఖర్చుల కోసం రూ.15 లక్షలు వెచ్చించా. దీంతో తాను మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యా. దీనిపై సదరు వీసా సంస్థ సమాధానం చెప్పాలి.' అని రాసుకొచ్చింది. పాపం.. ఇప్పటికైనా కిరణ్ రాథోడ్‌కు వీసా వస్తుందేమో చూడాల్సిందే.

  • సినిమా హీరోయిన్లకు అప్పుడప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అభిమానం పేరు చెప్పి ఎలా పడితే అలా ప్రవర్తించి ఇబ్బంది పెడుతుంటారు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇలాంటి అనుభవాల్ని చాలాసార్లు ఎదుర్కొంది. కొన్ని నెలల క్రితం జ్యూవెల్లరీ షాప్ ప్రారంభోత్సవానికి వస్తే ఏకంగా మీదమీదకొచ్చేశాడు. అయితే గతంలో షూటింగ్ సందర్భంగా ఓ వ్యక్తి వల్ల చాలా భయపడ్డానని కాజల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది.

    (ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లో 'కల్కి'.. ఏకంగా అన్ని కోట్లకు అమ్మేశారా?)

    'కొన్నిరోజుల క్రితం ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నాను. మొదటి రోజు పూర్తయ్యాక ఆ మూవీ అసిస్టెంట్ దర్శకుడు.. పర్మిషన్ లేకుండా నా క్యార్‌వ్యాన్‌లోకి వచ్చేశాడు. సడన్‌గా తన షర్ట్ తీసేసి ఛాతీపై నా పేరుతో ఉన్న పచ్చబొట్టుని చూపించాడు. ఎవరు లేని టైంలో అతడు అలా చేసేసరికి నేను చాలా భయపడ్డాను. నాపై అభిమానాన్ని టాటూ రూపంలో చూపించినందుకు సంతోషమే. కానీ ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదని స్మూత్‌గా వార్నింగ్ ఇచ్చాను' అని కాజల్ తనకెదురైన భయానక అనుభవాన్ని బయటపెట్టింది.

    'సత్యభామ' అనే మూవీతో త్వరలో థియేటర్లలోకి రాబోతున్న కాజల్.. మరోవైపు ఫ్యామిలీ లైఫ్ కూడా ఎంజాయ్ చేస్తోంది. పెళ్లి వల్ల సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుంది. కానీ ఇప్పుడు రెండింటిని బ్యాలెన్స్ చేస్తోంది. అయితే ఈమె చేతిలో ప్రస్తుతానికి స్టార్ హీరోల సినిమాలైతే ఏం లేవు.

    (ఇదీ చదవండి: Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్)

  • కమల్ హాసన్, శంకర్ డైరెక్షన్‌లో వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్ 2. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై భారీస్థాయిలో  రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి పారా అనే ఫస్ట్ సింగిల్‌ ప్రోమోను రిలీజ్‌ చేశారు మేకర్స్.

    కాగా.. గతంలో శంకర్‌ డైరెక్షన్‌లో  1996లో వచ్చిన ఇండియన్ (భారతీయుడు) సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫుల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌, సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ప్రియా భవానీ శంకర్‌, బాబీ సింహా, సముద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం జూలై 12న థియేటర్లలో సందడి చేయనుంది.  కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతమందిస్తున్నారు.

  • బికినీలో కూల్‌గా కనిపిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్

    గోల్డెన్ డ్రస్సులో మెరిసిపోతున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్

    క్యూట్ స్మైల్‌తో మాయలో పడేస్తున్న దీపికా పిల్లి

    వెనక అందాలు చూపిస్తూ కిక్ ఇచ్చేస్తున్న అమైరా దస్తూర్

    నడుము వయ్యారాలు.. జబర్దస్త్ వర్ష కిర్రాక్ పోజులు

    చిన్న పిల్లలా ఆడుకుంటున్న యాంకర్ అనసూయ

  • సమాజానికి ఆదర్శవంతమైన  విలువలను చాటి చెప్పిన శ్రీ మహా విష్ణువు  అవతార గాథే " శ్రీ మధ్ రామాయణం".  తండ్రి మాట జవదాటని కొడుకుగా.. అన్నగా.. ఏకపత్నీవ్రతుడిగా.. స్నేహితుడిగా..  ప్రజల క్షేమం కోసం ధర్మం తప్పని  రాజుగా.. అందరికి ఆదర్శంగా నిలిచిన శ్రీరామగాథను ఎన్ని సార్లు చూసినా తనివి తీరదని చెబుతుంటారు. రామాయణ ప్రియుల కోసం టీవీ సీరియల్‌ వచ్చేస్తోంది.  

    ఈ శ్రీమద్ రామాయణం సీరియల్లో.. శ్రీ రాముని అవతార విశిష్టత , జన్మ వృత్తాంతం,  లంకాధిపతి అయిన రావణాసురుడి జన్మ వృత్తాంతం నుంచి రామాయణంలోని అన్ని ఘట్టాలను కనులకు కట్టినట్లుగా చూపించనున్నారు. అద్భుతమైన  సాంకేతిక  విలువలతో చిత్రీకరించి శ్రీ రామ గాథను బుల్లితెర అభిమాన ప్రేక్షకులందరినీ అలరించేందుకు వచ్చేస్తోంది.

    శ్రీ మహర్షి వాల్మీకి రచించిన రామాయణాన్ని 'శ్రీమద్ రామాయణంగా'  సూపర్ గ్రాఫిక్ టెక్నాలజీతో,  అనుభవజ్ఞులైన నటీనటులతో, ఆకట్టుకునే డైలాగ్స్‌తో రూపొందించారు. ఈనెల 27 నుంచి బుల్లితెర ప్రియులను ఈ సీరియల్ అలరించనుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రసారం కానుంది.

    ఈ  సీరియల్ ప్రారంభ సందర్భంగా "జెమినిలో కాసుల వర్షం” అనే కాంటెస్ట్ నిర్వహిస్తోంది. మే 27 నుండి జూన్ 1 వరకు ఆరు రోజులపాటు అడిగే  ప్రశ్నలకు ప్రేక్షకులు మిస్డ్ కాల్  ద్వారా సమాధానాలను తెలియజేసి బహుమతులను పొందే అవకాశం కల్పించింది. ప్రతి రోజు 500 మంది లక్కీ విజేతలని ఎంపిక చేయనున్నారు.

     

  • బెంగళూరు రేవ్ పార్టీ టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ పార్టీకి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారంటూ వార్తలు రావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో తాము పార్టీకి వెళ్లలేదంటూ నటి హేమ, హీరో శ్రీకాంత్‌ వీడియోలను రిలీజ్ చేశారు. తాము హైదరాబాద్‌లోనే ఉన్నామంటూ క్లారిటీ ఇచ్చారు. కన్నడ మీడియాలో, సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. అనవసరంగా తన పేరును లాగొద్దని విజ్ఞప్తి చేశారు.

    అయితే ఇదిలా ఉండగా.. హేమ తాజాగా మరో వీడియోను రిలీజ్‌ చేశారు. తన ఇంట్లోనే బిర్యానీ వండుతున్న వీడియోను పంచుకున్నారు. దీంతో హేమ చేసిన వీడియో మరోసారి సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని చెప్పేందుకు బిర్యానీ రెసీపీ చేస్తున్న వీడియోను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. 

    అసలేం జరిగిందంటే..

    బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ‌ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి రేవ్‌ పార్టీ జరిగింది. ‌బర్త్‌డే పార్టీ పేరుతో జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ రేవ్‌ పార్టీపై పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌, కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. ఈ రేవ్‌ పార్టీలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సెలబ్రిటీలు సైతం ఉన్నట్లు పెద్దఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. 

  • ఇండియన్ నేవీలో పనిచేసిన సోల్జర్ శాంతి చంద్ర హీరోగా చేసిన సినిమా 'డర్టీ ఫెలో'. దీపిక సింగ్, సిమ్రితీ బతీజా, నిక్కిషా రంగ్ వాలా హీరోయిన్లుగా నటించారు. శాంతి బాబు నిర్మించారు. ఆడారి మూర్తి సాయి దర్శకుడు. ఈ నెల 24న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

    (ఇదీ చదవండి: Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్)

    మా సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. ఇది ధమాకా, బ్లాస్ట్ లాంటి సక్సెస్ అందుకుంటుందని హీరో శాంతి చంద్ర చెప్పుకొచ్చారు. సినిమాను థియేటర్ లోనే చూడండి. చిన్న సినిమాలను బతికించండి. లేకుంటే ఒకప్పుడు తోలు బొమ్మలాటలు ఆడేవారంట అని చెప్పుకున్నట్లే. థియేటర్ లో సినిమాలు ప్రదర్శించేవారంట అని రేపటి తరాలు చెప్పుకుంటాయని డైరెక్టర్ ఆడారి మూర్తి సాయి ఆవేదన వ్యక్తం చేశారు.

    (ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లో 'కల్కి'.. ఏకంగా అన్ని కోట్లకు అమ్మేశారా?)

  • టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుధీర్‌బాబు, మాళవిక శర్మ జంటగా నటించిన తాజా చిత్రం హరోం హర. ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ మూవీని మే 31న రిలీజ్‌ చేస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్‌మెంట్‌ చేశారు. సూపర్ స్టార్‌ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని భావించారు.

    కానీ ఊహించని విధంగా సినిమాను వాయిదా వేస్తున్నట్లు సుధీర్ బాబు ట్వీట్‌(ఎక్స్)లో పోస్ట్‌ చేశారు. కొన్ని కారణాల వల్ల హరోం హర మూవీని వాయిదా వేస్తున్నట్లు రాసుకొచ్చారు. సినిమా వాయిదా వేస్తున్నందుకు బాధగా ఉందన్నారు. స్పెషల్ డేట్‌ మిస్ అవుతున్నానని సుధీర్‌ బాబు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

    సుధీర్‌బాబు తన ట్విటర్‌లో రాస్తూ..' వివిధ కారణాల వల్ల హరోం హర సినిమాను వాయిదా వేస్తున్నాం. వచ్చేనెల జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తాం. మొదట అనుకున్న ప్రకారం కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నా. కానీ మిస్ అయినందుకు బాధగా ఉంది. అయినప్పటికీ జూన్ ఇప్పటికీ నా లక్కీ నెల. ఈ సమయంలోనే ప్రేమకథా చిత్రం, సమ్మోహనం చిత్రాలు విడుదలయ్యాయి.  అలాగే హరోం హర కూడా మీ అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది.' అని పోస్ట్ చేశారు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. 

  • కోలీవుడ్ స్టార్ హీరో విశాల్,  ప్రియా భవానీ శంకర్‌ జంటగా నటించిన చిత్రం 'రత్నం'. గతనెల ఏప్రిల్‌ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ విషయాన్ని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.

    ఈనెల 23 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తమిళ, తెలుగు భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో సముద్రఖని, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ కీలకపాత్రలు పోషించారు. ఏప్రిల్ 26 విడుదలైన ఈ చిత్రం నెల రోజుల్లోపే ఓటీటీ స్ట్రీమింగ్‌ వచ్చేస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందించారు.

  • ప్రభాస్ 'కల్కి' కోసం తెలుగు ప్రేక్షకులు వెయిటింగ్. ఎందుకంటే సంక్రాంతి తర్వాత సరైన మూవీ థియేటర్లలోకి రాలేదు. అలా వేసవి అంతా వృథా అయిపోయింది. దీంతో ఆడియెన్స్‌ని 'కల్కి'.. మళ్లీ థియేటర్లలోకి రప్పిస్తుందని అందరూ అనుకుంటున్నారు. విడుదలకు దాదాపు మరో నెలరోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ ఆ‍ల్రెడీ మొదలుపెట్టేశారు. తాజాగా ఓటీటీ డీల్ కూడా పూర్తయిపోయినట్లు తెలుస్తోంది.

    'బాహుబలి' తర్వాత ప్రభాస్ ఒప్పుకొన్న పాన్ ఇండియా సినిమాల్లో 'కల్కి' ఒకటి. 'మహానటి'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్.. దాదాపు ఐదారేళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్ మీదే ఉన్నాడు. అలా విడుదలకు సిద్ధం చేశారు. జూన్ 27న గ్రాండ్‌గా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. అయితే మూవీని రెండు ఓటీటీలకు అమ్మేశారట.

    (ఇదీ చదవండి: Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్)

    హిందీ వెర్షన్‌ హక్కుల్ని దాదాపు రూ.200 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందని, అలానే దక్షిణాది భాషలకు కలిపి రూ.175 కోట్లకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం రికార్డ్ ఓటీటీ డీల్ 'కల్కి'దే అని చెప్పొచ్చు.

    ఇకపోతే 'కల్కి'లో ప్రభాస్‌తో పాటు దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ లాంటి భారీ తారాగణం ఉంది. అలానే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ కూడా ఉన్నారని టాక్ నడుస్తోంది. వైజయంతీ మూవీస్ దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ పెట్టి నిర్మించినట్లు తెలుస్తోంది.

    (ఇదీ చదవండి: 'ఫ్యామిలీస్టార్‌'ను వాళ్లు కావాలనే టార్గెట్‌ చేశారు: ఆనంద్‌ దేవరకొండ)

National

  • బెంగళూరు: సంచలనం రేపిన రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో మంగళవారం(మే21) ఎన్‌ఐఏ పలు రాష్ట్రాల్లో ఏక కాలంలో  దాడులు నిర్వహించింది. కేసులో కొందరు అనుమానితులకు సంబంధించి అందిన సమాచారం ఆధారంగా దాడులు నిర్వహించినట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.

    రాత్రి వరకు దాడులు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ కేసులో విచారణను ఎన్‌ఐఏ మార్చి3వ తేదీన ప్రారంభించింది. ఏప్రిల్‌ 12న పేలుడు ప్రధాన సూత్రధారి అబ్దుల్‌ మతీన్‌ అహ్మద్‌, బాంబు పెట్టిన వ్యక్తిగా భావిస్తున్న ముస్సావిర్‌ హుస్సేన్‌ షాజిబ్‌ను కోల్‌కతాలో అరెస్టు చేశారు.   

  • న్యూఢిల్లీ: లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి అన్ని కేసుల్లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం(మే21) బెయిల్‌ నిరాకరించింది. కేసు విచారణలో ట్రయల్‌ కోర్టు ఎలాంటి ఆలస్యం చేయడం  లేదని, దీంతో ఈ కారణంపై బెయిల్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది.

    సిసోడియా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్‌ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. అయితే సిసోడియా అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను ప్రతి వారం చూసేందుకు కోర్టు అనుమతించింది. కాగా, లిక్కర్‌ కేసులో సోమవారమే(మే20) సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీని ఢిల్లీ రౌస్‌ ఎవెన్యూకోర్టు మే 31 దాకా పొడిగించడం గమనార్హం. 

  • మహారాష్ట్రలోని పుణెలో నిర్లక్ష్యంగా పోర్షే కారు నడిపి.. ఇద్దరి మరణానికి కారణమైన మైనర్‌ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలో మైనర్‌కు 15 గంటల్లోనే బెయిల్‌ లభించగా.. బాలుడి తండ్రి విశాల్‌ అగర్వాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా పుణెలో ఆదివారం తెల్లవారు జామున 17 ఏళ్ల బాలుడు తాగిన మైకంలో పోర్స్చే కారుతో ఓ బైక్‌ను ఢీకొట్టిన సంగతి తెలిపిందే. 

    ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు అనీశ్‌, అశ్విని అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఘటన సమయంలో మైనర్‌ 200 కిలోమీటర్ల వేగంతో కారును నడిపి బైక్‌ను ఢీకొట్టినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.  కాగా మైనర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ రెండు కుంటుంబాల్లో విషాదాన్ని నింపింది. ప్రమాదంలో మరణించిన ఇద్దరి మృతదేహాలు మంగళవారం వారి స్వస్థలాలకు చేరుకున్నాయి. 

    అనీశ్‌ అవదీయా మృతదేహాన్ని మధ్యప్రదేశ్‌ ఉమారియా జిల్లాలోని బిర్సింగ్‌పూర్‌కు తరలించారు. యువకుడి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. బంధువులు ఒకరినొకరు కౌగిలించుకుని ఏడుస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. మైనర్‌ డ్రైవర్‌కు బెయిల్‌ ఇవ్వకూడదని అనీశ్‌ కుటుంబ సభ్యులు, బంధువులు అన్నారు.

     ‘ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. ఇది ప్రమాదం కాదని హత్య  మైనర్ తాగి గంటకు 240 కి.మీ వేగంతో డ్రైవింగ్ చేస్తున్నాడు, అతడి వద్ద డ్రైవింగ్ లైసెన్స్ లేదు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం.ఈ దుర్ఘటన జరిగిన 15 గంటల్లోనే నిందితుడికి బెయిల్ ఎలా ఇస్తారు? అతడికి మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.

    గత రాత్రి అశ్విని కోష్ట మృతదేహం జబల్‌పూర్‌లోని ఆమె ఇంటికి చేరుకుంది. నిందితులకు బెయిల్ మంజూరు చేయడంపై వారి కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. న్యాయ కోసం చివరి వరకు పోరాడతామని తెలిపింది. ‘మేము షాక్‌లో ఉన్నాము. నిందితుడికి 15 గంటల్లో బెయిల్ ఎలా ఇస్తారు. మైనర్‌తోపాటు అతడి తల్లిదండ్రులను విచారించాలి. అశ్విని తన కెరీర్‌పై ఎన్నో కలలు కంది. తల్లిదండ్రులను గర్వపడేలా చేయాలని కోరుకుంది. మా బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాం. అశ్విని అంత్యక్రియలు ముగిసిన తర్వాత మేము ఈ విషయాన్ని చర్చిస్తాం’ అని పేర్కొంది.

    కాాగా, ఇద్దరి మరణానికి కారణమైన మైనర్‌ బాలుడికి కోర్టు 14 గంటల్లోనే జువైనల్‌ కోర్టు బెయిలు మంజూరు చేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ 17 ఏళ్ల మైనర్‌కు జువెనైల్‌ కోర్టు బెయిలు మంజూరు చేస్తూ కొన్ని షరతులను విధించింది. రోడ్డు ప్రమాదాల ప్రభావాలు, వాటికి పరిష్కారాలను తెలియజేస్తూ 300 పదాలతో ఓ వ్యాసాన్ని రాయడం, 15 రోజులపాటు ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి పని చేయడం, మానసిక పరిస్థితిపై పరీక్ష చేయించుకుని, చికిత్స పొందడం వంటి షరతులను విధించింది. ప్రమాద తీవ్రతను ఆధారంగా నిందితులను మేజర్‌గా పరిగణించి  విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పుణె పోలీసులు కోరగా కోర్టు తిరస్కరించింది.  తాజాగా పోలీసులు సెషన్స్ కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు.

  • ముంబై: విమానం ఢీకొని 40 ఫ్లెమింగో పక్షులు చనిపోయిన ఘటన ముంబైలో జరిగింది. సోమవారం(మే20) దుబాయ్‌ నుంచి వస్తున్న ఎమిరేట్స్‌ విమానం తాకి వలస పక్షులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనపై పర్యావరణ వేత్తలు మండిపడుతున్నారు. నవీ ముంబైలోని చెరువుల్లో నిర్మాణాలు చేపట్టడం వల్లే ఫ్లెమింగో పక్షులు తమ దారి మార్చుకుని థానే వైపు వెళ్లాయనేది వారి వాదన. 

    దారి మార్చుకోవాల్సి రావడం వల్లే పక్షులు విమానం ఢీకొని చనిపోయాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ముంబై ఫారెస్ట్‌ అధికారులు తెలిపారు. పక్షులు ఢీకొనడంతో దుబాయ్‌ తిరిగి వెళ్లాల్సిన విమానం ముంబైలోనే ఉండిపోయింది. విమానం ఫిట్‌నెస్‌పై పూర్తి పరీక్షలు నిర్వహిస్తున్నారు. విమానం మే 21 (మంగళవారం) రాత్రి 9 గంటలకు దుబాయ్‌ వెళ్లనుంది.

     

  • వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. జూన్‌ 1 నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌ మంజూరులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రోడ్డు రవాణా సంస్థ డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ ప్రక్రియను మరింత సులభ తరం చేస్తూ.. వాహనదారులు ఆర్టీఓ కార్యాలయాల్లోనే కాకుండా ప్రైవేట్ డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందే వెసులు బాటు కల్పించింది.  

    కాలేజీ విద్యార్ధి నుంచి ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరూ వాహనాల్ని విరివిరిగా వినియోగిస్తున్నారు. అయితే అందుకు కావాల్సిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలంటే స్లాట్ బుకింగ్, డ్రైవింగ్ టెస్ట్, బయో మెట్రిక్ ఇలా వ్యయప్రయాసలు పడాల్సి వచ్చేది. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా కొత్త డ్రైవింగ్‌ లైసెన్స్‌ నిబంధనల్ని కేంద్రం అమల్లోకి తేనుంది.

    ఇక కేంద్రం విధించిన నిబంధనలకు లోబడి ఉంటే ప్రైవేట్ డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్‌లే డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేసేందుకు అనుమతి ఉంది. ఇందుకోసం కేంద్రం విధించిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఆ నిబంధనలు ఎలా ఉన్నాయంటే 

    ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కొత్త నిబంధనలు 

    • ఈ సదుపాయానికి కనీసం ఒక ఎకరం భూమి ఉండాలి. 

    • 4 వీలర్ వాహనాల కోసం డ్రైవింగ్ కేంద్రాలకు అదనంగా 2 ఎకరాల స్థలం ఉండాలి. 

    • డ్రైవింగ్ శిక్షణా కేంద్రం తప్పనిసరిగా తగిన పరీక్షా సౌకర్యాన్ని కలిగి ఉండాలి. 

    • ట్రైనర్లు కనీసం ఉన్నత పాఠశాల డిప్లొమా లేదా తత్సమాన విద్యను కలిగి ఉండాలి. 

    • కనీసం 5 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. ట్రైనర్లు బయోమెట్రిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి.

    • లైట్ వెహికల్ ట్రైనింగ్ తప్పనిసరిగా 4 వారాలలోపు పూర్తి చేయాలి. కనీసం 29 గంటల శిక్షణ ఉంటుంది. 

    • భారీ మోటారు వాహనాలకు 38 గంటల శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణను 6 వారాల్లోగా పూర్తి చేయాలి.

    ఫీజు వివరాలు ఇలా..

    • లెర్నర్ లైసెన్స్: రూ 200

    • లెర్నర్ లైసెన్స్ పునరుద్ధరణ: రూ. 200

    • అంతర్జాతీయ లైసెన్స్: రూ 1000

    • శాశ్వత లైసెన్స్: రూ. 200

     

    ఆటోమేటేడ్ డ్రైవింగ్‌ టెస్టింగ్‌ ట్రాక్‌
    మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం ఆటోమేటేడ్ డ్రైవింగ్‌ టెస్టింగ్‌ ట్రాక్‌లపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. సాధారణంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం డ్రైవింగ్‌ టెస్ట్‌లో అర్హులు కావాలి. ఈ టెస్ట్‌ను ట్రాక్‌ల మీద ఆర్టీఓ అధికారులు నిర్వహిస్తారు. కానీ ఢిల్లీలో అలా కాదు వాహనదారుల సౌకర్యార్ధం ఆటోమేటేడ్‌ టెస్టింగ్‌ ట్రాక్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ట్రాకుల వల్ల వాహనదారులు ఎలాంటి దళారులతో పనిలేకుండా సులభంగా డ్రైవింగ్‌ టెస్ట్‌లో పాల్గొనవచ్చు. 

    మారుతీ సుజుకి సంస్థ 
    ఇక.. మారుతీ సుజుకి సంస్థ తన ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌న్‌ లాడో సరాయ్‌లో గతేడాది ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సరికొత్త సదుపాయాన్ని ప్రారంభించిన అనంతరం కంపెనీ.. ఢిల్లీ టెస్టింగ్ ట్రాక్‌లలో 100 శాతం ఆటోమేటిక్‌ సౌకర్యాన్ని సాధించిందని తెలిపింది. ఇక.. రాజధానిలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందడం పూర్తిగా కంప్యూటరైజ్డ్ ప్రక్రియ అవుతుందని మారూతీ సుజుకి పేర్కొంది. టెస్ట్ ట్రాక్‌లు సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ (CMVR)కి అనుగుణంగా రూపొందించబడినట్లు తెలిపింది.

  • సాక్షి, బెంగళూరు: బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీ దర్యాప్తుపై సీపీ దయానంద కీలక విషయాలు వెల్లడించారు. ఈ రేవ్‌ పార్టీలో ఇద్దరు నటులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అలాగే, అనుమానితుల బ్లడ్‌ శాంపిల్స్‌ తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఎఫ్ఎస్‌ఎల్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని వెల్లడించారు.

    కాగా, సీపీ దయానంద మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బెంగళూరు రేవ్‌ పార్టీ కేసును ఎప్పుగూడ పీఎస్‌కు బదిలీ చేయడం జరిగింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. రేవ్‌ పార్టీలో 150 మంది పాల్గొన్నారు. ఈ రేవ్‌ పార్టీలో పాల్గొన్న వారి బ్లడ్‌ శాంపుల్స్‌ స్వీకరించాము. ఎఫ్ఎస్‌ఎల్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి. రేవ్ పార్టీకి డ్రగ్స్ తీసుకొచ్చిన ఐదుగురిని అరెస్ట్ చేశాము.  డ్రగ్స్ కొనుగోలుపై ప్రత్యేక చట్టల ద్వారా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటాము.  

    బెంగళూరు రేవ్‌ పార్టీలో ఇద్దరు నటులు దొరికారు. ఇద్దరు నటుల రక్త నమునాలు తీసుకున్నాము. ఈ ఈవెంట్‌లో రాజకీయ ప్రముఖులెవరూ పాల్గొనలేదు. పోలీసులు వాసు, అరుణ్, సిద్ధిఖీ, రణధీర్, రాజును అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతుగా దర్యాప్తు జరుగుతోంది. డ్రగ్స్ తెచ్చిన పెడ్లర్లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అసలు వారు ఎక్కడి నుంచి డ్రగ్స్ తెస్తున్నారు. ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది’ అని అన్నారు.

Business

  • కేంద్ర మంత్రి 'హర్దీప్ సింగ్ పూరి' నిర్వహించిన విశేష్ సంపర్క్ కార్యక్రమానికి జొమాటో సీఈఓ 'దీపిందర్ గోయల్' హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన తన 20 సంవత్సరాల క్రితం నాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు.

    దీపిందర్ గోయల్ 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు.. ఫుడ్ డెలివరీ స్టార్టప్‌ను ప్రారంభించాలనే ఆలోచనను నా తండ్రితో చెప్పాను. అప్పుడు నా తండ్రి నాతో.. నీ తండ్రి ఏ స్థాయిలో ఉన్నారనే అర్థంతో.. 'జంతా హై తేరా బాప్ కౌన్ హై? అని అన్నట్లు వెల్లడించారు.

    చిన్న గ్రామంలో ఉన్న మనం స్టార్టప్‌ వంటివి సాధ్యం కాదని తన తండ్రి భావించినట్లు తెలిపారు. అయితే పంజాబ్‌లోని ఒక చిన్న పట్టణం నుంచి ప్రభుత్వ సహకారంతో జొమాటో వంటి సంస్థను స్థాపించగలిగాను. 2008లో కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాను. ఇది నాకు చాలా ఆనందంగా ఉందని గోయల్ అన్నారు.

    దీపిందర్ గోయల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. పేదరికం నుంచి వచ్చి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన గోయల్ వీడియోను ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

  • ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన గ్రోసరీ వ్యాపారంలో 1.6 రెట్లు వార్షిక వృద్ధిని నమోదు చేసింది. కస్టమర్ల నిత్యావరస వస్తువులను సరసమైన ధరలతో అందించడం మాత్రమే కాకుండా.. అత్యుత్తమ ఆన్‌లైన్ షాపింగ్ అనుభవాన్ని అందించడంతో కంపెనీ అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది.

    సంస్థ డెలివరీ చేసే అన్ని ఉత్పత్తుల మీద తయారీ తేదీ మాత్రమే కాకుండా ఎక్స్‌పైరీ తేదీ కూడా పేర్కొంటుంది. ఇది వినియోగదారుల నమ్మకాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.

    ఫ్లిప్‌కార్ట్ తన గ్రోసరీ వ్యాపారాన్ని బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ వంటి మెట్రోలతో పాటు దేశంలోని టైర్ 2 పట్టణాల్లో కూడా విస్తరిస్తుంది. ఇందులో భాగంగానే ఔరంగాబాద్, బంకురా, బొకారో వంటి నగరాల్లో వినియోగదారులకు చేరువవుతోంది. ఛతర్‌పూర్, గౌహతి, జంషెడ్‌పూర్, కృష్ణానగర్, విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ అధిక ప్రజాదరణ పొందుతోంది.

    ఫ్లిప్‌కార్ట్ క్విక్ సర్వీస్ కింద.. బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై, న్యూ ఢిల్లీ, అనంతపురం, బెర్హంపూర్, గోరఖ్‌పూర్ వంటి పట్టణాలతో సహా సుమారు 200కు పైగా నగరాల్లో ఈ రోజు బుక్ చేస్తే.. మరుసటి రోజే డెలివరీ అందిస్తోంది.

    ఎక్కువ మంది ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీలో ఆయిల్, నెయ్యి, గోధుమ పిండి (ఆటా), టీ, కాఫీ, డిటర్జెంట్లు, లిక్విడ్ డిటర్జెంట్లు, డ్రై ఫ్రూట్స్, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిని ఎక్కువగా బుక్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో ఇతర ముఖ్యమైన వస్తువులకు కూడా మంచి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.

    పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఫ్లిప్‌కార్ట్.. అహ్మదాబాద్, భువనేశ్వర్, చెన్నై, హుబ్లీ, హైదరాబాద్, కోల్‌కతా వంటి కీలక ప్రదేశాల్లో కేంద్రాలను ప్రారంభించింది. నెట్‌వర్క్‌ పెరగడంతో ఎక్కువ మంది కస్టమర్‌లకు సకాలంలో డెలివరీ చేయడానికి సాధ్యమవుతుంది.

  • టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మైక్రోసాఫ్ట్ సరికొత్త కంప్యూటర్లను ఆవిష్కరించింది. ఈ శక్తివంతమైన ఏఐ టూల్ గురించి సత్య నాదెళ్ల వివరిస్తున్న వీడియో బిలియనీర్ ఇలాన్ మస్క్ దృష్టిని ఆకర్శించింది.

    వీడియోలో సత్య నాదెళ్ల.. రీకాల్ ఫీచర్ అనే కొత్త ఫీచర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇది మీరు చూసే, మీ కంప్యూటర్‌లో ప్రదర్శించే ప్రతి వివరాలను రికార్డ్ చేస్తుంది. డివైస్ నుంచి మీ మొత్తం హిస్టరీని సర్చ్ చేయడానికి, మళ్ళీ తిరిగి పొందటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

    ఇది ఫోటోగ్రాఫిక్ మెమరీగా పనిచేస్తుంది. మీ కంప్యూటర్‌లో మీరు చేసే ప్రతిదాన్ని గుర్తుంచుకోవడానికి, అర్థం చేసుకోవడానికి స్క్రీన్‌షాట్‌లను నిరంతరం రికార్డ్ చేస్తుంది. ఇది కేవలం కీవర్డ్ సర్చ్ కాదు, డాక్యుమెంట్ కాదు. గతంలోని క్షణాలను రీక్రియేట్ చేస్తుందని అన్నారు.

    ఈ వీడియో ఎక్స్ (ట్విటర్)లో  భారీగా వైరల్ అయ్యింది. 24.3 మిలియన్లకంటే ఎక్కువ వ్యూవ్స్ పొందిన ఈ వీడియోపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ చేస్తున్నారు. ఇందులో టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ కూడా ఉన్నారు.

    ఈ వీడియోపైన మస్క్ స్పందిస్తూ.. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'బ్లాక్ మిర్రర్'ని ప్రస్తావిస్తూ, ఇది వ్యక్తుల జీవితాలపై దృష్టి పెడుతుందని అన్నారు. అంతే కాకుండా ఈ ఫీచర్‌ను ఆఫ్ చేస్తున్నాను అని కూడా తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. మస్క్ మాత్రమే కాకుండా కొందరు నెటిజన్లు కూడా కొత్త ఫీచర్‌ను విమర్శించారు.

    బ్లాక్ మిర్రర్ సిరీస్
    బ్లాక్ మిర్రర్ అనేది చార్లీ బ్రూకర్ రూపొందించిన బ్రిటిష్ ఆంథాలజీ టెలివిజన్ సిరీస్. సమకాలీన సామాజిక సమస్యలపై వ్యాఖ్యానించడానికి సాంకేతికత మరియు మీడియా థీమ్‌లను ఉపయోగిస్తుంది. ఇది ఒక రకమైన ఊహాజనిత కల్పన. ఇది 2011 నుంచి 2013 వరకు ఆరు సిరీస్‌లలో 27 ఎపిసోడ్‌లుగా ప్రసారమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో 2016, 17, 19, 23లలో నాలుగు సిరీస్‌లుగా ప్రసారం చేశారు. 2025లో ఏడో సిరీస్ విడుదలవుతుంది.

  • డీలర్‌లకు ఫైనాన్సింగ్ ఎంపికలను మెరుగుపరచడానికి, అలాగే సులభతరం చేసే ప్రయత్నంలో భాగంగా టాటా మోటార్స్ అనుబంధ సంస్థలైన టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (TMPV), టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (TPEM).. బజాజ్ ఫిన్‌సర్వ్ లిమిటెడ్‌లో భాగమైన బజాజ్ ఫైనాన్స్‌తో చేతులు కలిపాయి. 

    ఈ భాగస్వామ్యానికి సంబంధించిన MoUపై  టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ & డైరెక్టర్ ధీమన్ గుప్తా.. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సిద్ధార్థ భట్ సంతకం చేశారు.

    ఈ భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ.. మా డీలర్ భాగస్వాములు మా వ్యాపారంలో అంతర్భాగంగా ఉన్నారు. వారి కార్యకలాపాలను సులభతరం చేయడంలో వారికి సహాయపడే పరిష్కారాల కోసం చురుకుగా పని చేయడం మాకు సంతోషంగా ఉంది. ఈ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ కోసం బజాజ్ ఫైనాన్స్‌తో భాగస్వామిగా ఉండటం చాలా సంతోషంగా ఉందని ధీమాన్ గుప్తా అన్నారు.

    బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అనూప్ సాహా మాట్లాడుతూ.. బజాజ్ ఫైనాన్స్‌లో వ్యక్తులు, వ్యాపారాలు రెండింటినీ శక్తివంతం చేసే ఫైనాన్సింగ్ సొల్యూషన్లు ఉన్నాయని అన్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా.. మేము TMPV & TPEM అధీకృత ప్రయాణీకులకు, ఎలక్ట్రిక్ వాహనాల డీలర్‌లకు ఆర్థిక మూలధనాన్ని అందిస్తాము. ఈ సహకారం డీలర్‌లకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా భారతదేశంలో ఆటోమోటివ్ పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తుందని మేము విశ్వసిస్తున్నామని అన్నారు.

  • సరైన రోడ్డు మార్గాలు లేకపోవడం వల్ల బస్సులు కుదుపులకు గురవుతాయి. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటనలో విమానం తీవ్ర కుదుపులకు గురైంది. వినటానికి వింతగా ఉన్నా ఇది నిజం. దీనిని సింగపూర్ ఎయిర్‌లైన్స్ కూడా ధ్రువీకరించింది.

    సోమవారం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు బయలుదేరిన SQ321 విమానం మార్గమధ్యంలో తీవ్రమైన అల్లకల్లోలాన్ని ఎదుర్కొందని.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో విమానం బ్యాంకాక్‌లోని సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం మధ్యాహ్నం 3.45 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ల్యాండ్ అయింది.

    బోయింగ్ 777-300 ER విమానంలో మొత్తం 211 మంది ప్రయాణికులతో పాటు 18 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో 30 మంది గాయపడగా, ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని సింగపూర్ ఎయిర్‌లైన్స్ ధ్రువీకరిస్తూ.. మరణించిన వ్యక్తి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేసింది.

    విమానం ల్యాండ్ అయిన తరువాత అవసరమైన వైద్య సహాయం అందించడానికి థాయ్‌లాండ్‌లోని స్థానిక అధికారులతో కలిసి పని పనిచేస్తున్నట్లు.. ఇంకా అదనపు సహాయాన్ని అందించడానికి బ్యాంకాక్‌కు ఒక బృందాన్ని పంపినట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది.

    ప్రయాణికులు సీటు బెల్ట్ ధరించనప్పుడు ఇటువంటి గాయాలు సాధారణంగా జరుగుతాయని నిపుణులు తెలిపారు. వాతావరణ రాడార్ నుంచి ముందస్తు సమాచారం అందకపోవడంతో పైలెట్ కూడా ముందుగా ప్రయాణికులను హెచ్చరికను ఇవ్వలేకపోయారని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు సీటు బెల్టు ధరించకపోవడం వల్ల.. వారు కాక్‌పిట్‌లోకి పడే అవకాశం ఉంటుంది. అలంటి సమయంలో ఊహకందని ప్రమాదం జరుగుతుంది.

  • న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ మంగళవారం కంపెనీ చీఫ్ రిస్క్ ఆఫీసర్ (CRO)గా 'మహేష్ రాజారామన్‌'ను నియమించినట్లు ప్రకటించింది. మల్లికా మిట్టల్ తన పదవికి రాజీనామాను చేయడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

    సీఆర్ఓగా 5 సంవత్సరాల కాలానికి నియమితులైన రాజారామన్, బ్యాంకింగ్ రంగంలో 29 సంవత్సరాల అనుభవాన్ని కలిగి ఉన్నారు. టీమ్‌ను ముందుకు నడిపించడంలో అనుభవం ఉందని.. సంస్థ ఈయన సారథ్యంలో మరింత అభివృద్ధి చెందుతుందని మహీంద్రా ఫైనాన్స్ తెలిపింది.

    రాజారామన్ యెస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్, ఏఎన్‌జెడ్ గ్రైండ్‌లేస్ బ్యాంక్ వంటి వివిధ బ్యాంకులతో అనుబంధం కలిగి ఉన్నారు. ఈయన 2024 ఆగష్టు 1నుంచి చీఫ్ రిస్క్ ఆఫీసర్ (CRO)గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

  • దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 22,529 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 52 పాయింట్లు నష్టపోయి 73,953 వద్ద ముగిసింది.

    సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ, టైటాన్‌, సన్‌ ఫార్మా, ఎం అండ్‌ ఎం, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కంపెనీ షేర్లు లాభాల్లో ముగిశాయి.

    నెస్లే, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎల్‌, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌యూఎల్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇన్ఫోసిస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

    (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

  • పెళ్లిరోజున భర్త ఇచ్చిన డబ్బుతో భార్య ఏకంగా రూ.8.2 కోట్లు సంపాదించిన ఆసక్తికర సంఘటన దుబాయ్‌లో చోటుచేసుకుంది. పంజాబ్‌కు చెందిన పాయల్ అనే మహిళ తన భర్త హర్నెక్‌ సింగ్‌తో కలిసి దుబాయ్‌లో నివసిస్తున్నారు. ఇటీవల వారి 16వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భర్త పాయల్‌కు బహుమతిగా 1000 ధిరమ్‌లు(రూ.22వేలు) ఇచ్చారు.

    ఆ డబ్బుతో పాయల్‌ 3337 అనే రాఫిల్ టికెట్‌ను కొనుగోలు చేశారు. తాజాగా ఆ లాటరీ టికెట్‌పై జాక్‌పాట్‌ తగిలింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ (డీడీఎఫ్‌) మిలీనియం మిలియనీర్ సిరీస్ 461లో పాయల్‌ 1 మిలియన్ డాలర్ల(రూ.8.2 కోట్లు)ను గెలుచుకున్నారు.

    ఈ సందర్భంగా పాయల్ మాట్లాడుతూ..‘నేను ఈ సిరీస్‌లో విజేతగా మారడానికి నా భర్త ఇచ్చిన డబ్బే కారణం. ఏప్రిల్ 20న మా 16వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా నాకు 1,000 ధిరమ్‌లు గిఫ్ట్‌ ఇచ్చారు. ఆ డబ్బుతో ఆన్‌లైన్‌లో డీడీఎఫ్‌ టిక్కెట్ కొనాలని అనుకున్నాను. 3 అనే అంకె ఎక్కువసార్లు వచ్చే లాటరీ నంబర్‌ను ఎంచుకున్నాను. దాంతో 3337ను సెలక్ట్‌ చేసుకున్నాను. ఈ లాటరీ పొందడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఈ వార్తను నాభర్తతో ఫోన్‌లో చెప్పినపుడు తనకు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. నాకు 14 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కవల పిల్లలు. ఇంకా వారికి వార్త తెలియదు. ఇంటికి వెళ్లాక చెప్తాను. నా పిల్లల భవిష్యత్తు నాకుముఖ్యం. ఈ డబ్బుతో వారికి మంది విద్యను అందిస్తాను’ అని ఓ మీడియా సంస్థతో చెప్పారు.

    గత పన్నెండేళ్లుగా పాయల్‌ డీడీఎఫ్‌ టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నారని మీడియా సంస్థ తెలిపింది. ప్రతిసారి ప్రయాణాల నిమిత్తం ఎయిర్‌పోర్ట్‌ వెళ్తున్నపుడు డీడీఎఫ్‌ టికెట్లు కొనుగోలు చేయడం అలవాటని పాయల్‌ చెప్పారు. కానీ ఈసారి మొదటగా ఆన్‌లైన్‌లో ఖరీదు చేశానన్నారు.

  • అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఉపాధి అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. 2030 నాటికి దేశంలో 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని కోసం సర్వీస్, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లను పెంచాలని చెబుతున్నారు. ఇది జరిగితే ఇండియా ఎకానమీ కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.

    ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలంటే.. సంవత్సరానికి 1.65 కోట్ల ఉద్యోగాలను సృష్టించవలసి ఉంటుంది. గత దశాబ్దంలో ప్రతి ఏటా 1.24 కోట్ల ఉద్యోగాలు పెరిగాయని నాటిక్సిస్ ఎస్ఏ సీనియర్ ఎకనమిస్ట్ 'ట్రిన్ న్గుయెన్' సోమవారం ఒక నివేదికలో పేర్కొన్నారు.

    భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం 7 శాతానికి పైగా వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. అయితే దేశం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఉద్యోగావకాశాలు మందకొడిగానే సాగుతున్నాయి. మూడో సారి మోదీ అధికారంలోకి వస్తే.. నిరుద్యోగం పెద్ద సవాలుగా మారుతుందని పలువురు చెబుతున్నారు.

    గత దశాబ్దంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 11.2 కోట్ల ఉద్యోగాలను సృష్టించినప్పటికీ, కేవలం 10 శాతం ఉద్యోగాలు మాత్రమే అధికారికంగా ఉన్నాయని న్గుయెన్ రాశారు. ప్రపంచ బ్యాంకు ప్రకారం, దేశం మొత్తం శ్రామిక శక్తి రేటు 58 శాతంగా ఉంది. ఇది ఆసియాలోని ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. చాలా తక్కువ. ఉద్యోగావకాశాలు ఎప్పుడైతే పెరుగుతాయో.. అప్పుడే ఇతర దేశాలతో భారత్ పోటీ పడగలదని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు.

  • దేశంలో బంగారం కొనుగోలు దారులకు ఊరట లభించింది. గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.600, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.650 తగ్గింది.

    దీంతో తగ్గిన బంగారం ధరలు దేశంలో పలు ప్రధాన నగరాల్లో

    హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.

    విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.

    వైజాగ్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.

    బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.

    చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.68,600 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,840 గా ఉంది.

    ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.

    ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,450 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,660గా ఉంది. 

  • భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి.. ఎట్టకేలకు 'క్యూ7 బోల్డ్ ఎడిషన్' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ప్రారంభ ధర రూ.97.84 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త ఎడిషన్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

    కొత్త ఆడి క్యూ7 బోల్డ్ ఎడిషన్ గ్లేసియర్ వైట్, మైథోస్ బ్లాక్, నవర్రా బ్లూ, సమురాయ్ గ్రే. అనే నాలుగు కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కొత్త వెర్షన్ లేటెస్ట్ డిజైన్, ఫీచర్స్ పొందినప్పటికీ.. యాంత్రికంగా ఎటువంటి మార్పులు పొందలేదు. కాబట్టి అదే ఇంజిన్ ఉంటుంది. పనితీరు పరంగా ఎటువంటి మార్పులు ఉండదు.

    ఆడి క్యూ7 బోల్డ్ ఎడిషన్ 3.0 లీటర్ వి6 పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. 335 హార్స్ పవర్, 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసింది. ఇది కేవలం 5.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. క్యూ 7 మోడల్ ఆడి ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో పాటు ఆటో, కంఫర్ట్, డైనమిక్, ఎఫిషియెన్సీ, ఆఫ్-రోడ్, ఆల్ రోడ్, ఇండివిజువల్ అనే 7 డ్రైవ్ మోడ్‌లను పొందుతుంది.

  • ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు అలెర్ట్‌. రీడమ్‌ పాయింట్ల పేరుతో ఖాతాదారుల్ని మోసం చేసేందుకు సైబర్‌ నేరస్తులు ప్రయత్నిస్తున్నారని, వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సదరు బ్యాంకులు ఖాతాదారుల్ని హెచ్చరిస్తున్నాయి. 

    డిజిటల్‌ బ్యాంకింగ్‌ వినియోగం పెరిగే కొద్ది సైబర్‌ నేరుస్తులు తమ పంథాను మారుస్తున్నారు. వివిధ మార్గాల ద్వారా బ్యాంక్‌ ఖాతాదారుల బ్యాంక్‌ అకౌంట్లలో ఉన్న సొమ్మును కాజేస్తున్నారు.  

    ఈ తరుణంలో ఎస్‌బీఐతో పాటు పలు ప్రైవేట్‌ బ్యాంక్‌లు కస్టమర్లను అలెర్ట్‌ చేస్తున్నాయి. పెరిగిపోతున్న స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ తరుణంలో ఎస్‌బీఐ ఖాతాదారుల్ని సైబర్‌ నేరస్తులు మోసం చేసేందుకు రివార్డ్‌ పాయింట్లను అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారని ట్వీట్‌ చేసింది. 

     

    ఎస్‌బీఐ రివార్డ్ పాయింట్‌లను రీడీమ్ చేసే నెపంతో వినియోగదారులకు ఆండ్రాయిడ్‌ అప్లికేషన్ ఫైల్‌ను( APK ) పంపిస్తున్నారు. అలాంటి వాటి పట్ల ఖాతాదారులు అప్రత్తంగా ఉండాలని కోరింది.

    రీడీమ్ చేసుకోవాలంటూ మోసగాళ్లు ఎస్‌ఎంఎస్‌, వాట్సప్‌ ద్వారా ఏపీఏకే ఫైల్స్‌, మెసేజెస్‌ పంపిస్తారు. వాటిని క్లిక్‌ చేయొద్దని కోరింది. ఇలాంటి ఏపీకే ఫైల్స్‌ పట్ల  ఎస్‌బీఐతో పాటు ఏఐ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఖాతాదారులు మోసపోతున్నారని, వాటి జోలికి పోవద్దని తెలిపాయి.  


     

  • టెస్లా అధినేత ఎలొన్‌మస్క్‌ శ్రీలంకలో స్టార్‌లింక్‌ సేవలు విస్తరించాలని చూస్తున్నారు. అందులో భాగంగా ఇండోనేషియా-బాలిలో జరిగిన 10వ వరల్డ్ వాటర్ ఫోరమ్‌లో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో మస్క్‌ సమావేశమయ్యారు.

    ఎలొన్‌మస్క్‌ ఇటీవల చైనాతోపాటు ఇండోనేషియాను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఇండోనేషియాలోని మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ యాక్సెస్‌ను మెరుగుపరచాలనే లక్ష్యంతో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్‌ను ప్రారంభించారు. తాజాగా శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో సమావేశమయ్యారు. శ్రీలంకలోనూ స్టార్‌లింక్ సేవలు అందించాలనే చర్చ జరిగినట్లు తెలిసింది.

    ప్రెసిడెంట్‌ మీడియా విభాగం తన ఎక్స్‌ ఖాతాలో ఈ మేరకు సమాచారాన్ని పంచుకుంది. ‘వరల్డ్ వాటర్ ఫోరమ్‌లో దేశాధ్యక్షుడు స్టార్‌లింక్‌ అమలుపై మస్క్‌తో చర్చించారు’ అని తెలిపింది. శ్రీలంక నీటి సరఫరా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ మినిస్టర్‌ జీవన్ తొండమాన్ తన ఎక్స్‌ ఖాతాలో స్పందిస్తూ..‘బాలిలో జరుగుతున్న ఈవెంట్‌లో దేశ అధ్యక్షుడు, ఎలొన్‌మస్క్‌తో కలిసి సమావేశం అయ్యారు. దేశ ఆర్థిక పునరుద్ధరణ, పెట్టుబడికి కొత్త అవకాశాలు వంటి అంశాలపై చర్చించాం’ అని తెలిపారు. ఈ సందర్భంగా మస్క్‌ స్పందిస్తూ..‘రిమోట్ కమ్యూనిటీలకు ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీను అందుబాటులోకి తీసుకొస్తే విద్య, ఆర్థిక అవకాశాలు మెరుగుపడుతాయి’ అని పేర్కొన్నారు.

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌ : ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలపై సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇళ్లలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. 12 గంటలుగా ఎనిమిది చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అశోక్‌నగర్‌లో ఉన్న ఆయన నివాసం, అదే అపార్ట్‌మెంట్లో ఉన్న మరో రెండు ఇళ్లు, సీసీఎస్‌ కార్యాలయం, నగరంలోని మరో ఇద్దరు స్నేహితుల ఇళ్లు, విశాఖపట్నంలోని బంధువులకు సంబంధించిన రెండు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.

    సోదాల్లో భాగంగా ఉమామహేశ్వర ఇంట్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. బంగారు ఆభరణాలు, సిల్వర్ ఐటమ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు ల్యాండ్‌ డాక్యుమెంట్లు సైతం పట్టుబడుతున్నాయి. ఉమామహేశ్వర్ రావు.. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఓ పోలీస్‌ అధికారితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు. తన మామ ఇంట్లో భారీగా ల్యాండ్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. కోట్ల రూపాయల విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

    ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసిన సమయంలో అక్రమార్జనతో భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మరో వైపు ప్రస్తుతం పనిచేస్తున్న సీసీఎస్‌లో పలు కేసుల్లో లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులకు న్యాయం చేయకుండా నిందితులకు మద్దతు పలుకుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

    కాగా అశోక్ నగర్‌లో సోదాలు జరిగే ప్రాంతానికి ఏసీపీ జాయింట్‌ డైరెక్టర్‌ సుధీంద్ర చేరుకున్నారు. ఏసీపీ ఉమామహేశ్వర్ రావు ఇంటితో పాటు 7చోట్ల సోదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని, తనిఖీలు పూర్తయిన తర్వాత మీడియాకు పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
     

  • సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతోంది. జూన్‌ నెల 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తైన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌)లో ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ‘ఇది తెలంగాణ దశాబ్ది’ అంటూ పేర్కొన్నారు.

    ‘ఇది తెలంగాణ దశాబ్ది!

    ఆరున్నర దశాబ్దాల పోరాటం..
    మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు..
    వేల బలిదానాలు, త్యాగాలు..
    బిగిసిన సబ్బండ వర్గాల పిడికిళ్లు..
    ఉద్యమ సేనాని అకుంఠిత, ఆమరణ దీక్ష..
    ఉద్యమం విజయతీరాలకు చేరి స్వరాష్ట్రం సాక్షాత్కారం అయ్యింది!

    ఉద్యమ నాయకుడే ప్రజాపాలకుడిగా
    స్వతంత్ర భారతదేశం ముందెన్నడూ చూడని
    సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి నమూనా ఆవిష్కారం అయ్యింది!

    పల్లె, పట్నం తేడా లేకుండా 
    ప్రగతి రథం పరుగులు తీసింది.
    ఆహార ధాన్యాల ఉత్పత్తి నుండి
    ఐటి ఎగుమతుల దాకా
    రికార్డులు బద్దలయ్యినయి.

    మీ అందరి మద్దతుతో
    నీళ్ళిచ్చి కన్నీళ్లు తుడిచినం.
    నిరంతర కరెంటిచ్చి వెలుగులు నింపినం.
    రైతన్నల, నేతన్నల, కష్టజీవుల 
    కలత తీర్చినం.. కడుపు నింపినం.

    వృద్ధులకు ఆసరా అయినం..
    ఆడబిడ్డలకు అండగా నిలిచినం.
    సకల జనుల సంక్షేమానికి తెలంగాణను చిరునామా చేసినం.

    గుండెల నిండా జై తెలంగాణ
    నినాదం నింపుకున్నం.
    మన భాషకు పట్టం గట్టినం.
    మన బతుకమ్మ, మన బోనం
    సగర్వంగా తలకెత్తుకున్నం.
    గంగా జమునా తెహజీబ్ కు
    సాక్షీభూతంగా నిలిచినం.

    అవమానాలు
    అవహేళనలు
    ఎదుర్కొన్న గడ్డ మీదనే
    తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని
    అంబరమంత ఎత్తున ఎగరేసినం.

    కేసీఆర్ పాలన సాక్షిగా
    ఇది తెలంగాణ దశాబ్ది!
    వెయ్యేళ్ళయినా చెక్కుచెదరని పునాది!.. 

    జై తెలంగాణ ’ అని ట్వీట్‌ చేశారు.
     

  • సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే  అంశంపై ప్రత్యేక కోర్టు విచారణ ముగిసింది. చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనే అంశంపై తీర్పును కోర్టు రిజర్వ్‌ చేసింది. మే 29న తీర్పు వెలువరించనుంది. 

    ఈ కేసులో మొత్తం 8వేల పేజీలతో  ఈడీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. కేసులో కవిత ప్రమేయంపై ఛార్జ్‌షీట్‌లో పలు ఆధారాలను ఈడీ కోర్టు ముందుంచింది. కేసులో కవితతో పాటు ఆరుగురు నిందితులపై విడివిడిగా అభియోగాలను కోర్టు పరిశీలిస్తోంది. ఇండియా ఎహేడ్‌ ఉద్యోగి అరవింద్ సింగ్ ఈ కేసులో ప్రధాన పాత్రధారి అని ఈడీ వాదనలు వినిపించింది. 

    అభిషేక్ బోయినపల్లి ఇంటరాగేషన్‌లో కూడా వీరి పాత్ర ఉందని తేలింది. ముత్తా గౌతమ్ స్టేట్‌మెంట్‌ కూడా వీరి పాత్రను బయటపెట్టింది. హవాలా సొమ్ము రవాణాలో చారియట్‌ మీడియా ఉద్యోగి దామోదరశర్మ పాత్ర కూడా ఉంది. వాట్సాప్ చాట్ మెసేజ్ ద్వారా వీరి పాత్రపై సాక్ష్యాలు లభించాయి

     

     

     

     

     

     

     

  • సాక్షి, హైదరాబాద్‌:  ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, ప్రజా గేయ రచయిత అందెశ్రీతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం(మే21) భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర గీతం  ‘జయ జయహే తెలంగాణ’పాటను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే విషయమై సీఎం వీరితో చర్చించారు. కీరవాణి సంగీత దర్శకత్వంలో త్వరలో జయజయహే పాట సరికొత్త బాణీతో అలరించనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

    ప్రజాకవి, ప్రకృతి కవిగా డాక్టర్ అందెశ్రీకి పేరుంది. ‘జయజయహే తెలంగాణ.. జననీ జయకేతనం’ను అందెశ్రీ రచించారు. ఈ పాట తెలంగాణ ఉద్యమంలో చాలా పాపులర్ అయింది. తెలంగాణ ప్రజలు ఇప్పటికీ విద్యాసంస్థల్లో, ఇతర ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యక్రమాలలో  ప్రార్థనా గీతంగా ఈ పాటను పాడుకుంటారు. ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరాక జయజయహే గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

     

     

     

     

  • సాక్షి, హైదరాబాద్‌: చోరికి గురైన లేదా పొరపాటున పోగొట్టున్న సెల్‌ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీసులు అరుదైన ఘనత సాధించారు. సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌(సీఈఐఆర్‌) పోర్టల్‌, లోకల్‌ ట్రాకింగ్‌ ద్వారా ఫోన్లను ట్రేస్‌ చేసి, వాటిని యజమానులకు అప్పగించడంలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. గతేడాది ఏప్రిల్‌ 19 నుంచి ఇప్పటి వరకు పోలీసులు రోజుల్లో 30,049 ఫోన్లు రికవరీ చేసినట్లు సీఐడీ అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు.

    హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 4,869, సైబరాబాద్‌ పరిధిలో 3,078, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 3,042 ఫోన్లు రికవరీ చేసినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 780 ఠాణాల్లో సీఈఐఆర్‌ యూనిట్లు ఉన్నాయన్నారు. గడిచిన 9 రోజుల్లో వెయ్యి ఫోన్లు రికవరీ చేశామన్నారు.35,945 సెల్‌ఫోన్స్‌ రివకరీలతో కర్నాటక రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా..  7387 సెల్‌ఫోన్స్‌ రికవరీల్లో ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ఫోన్ దొంగతనం లేదా కనిపించకుండా పోయిన వెంటనే సీఈఐఆర్‌ పోర్టల్‌లో  నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ పోర్టల్‌లో ఒకసారి నమోదు చేసుకుంటే ఫోన్లో ట్రాకింగ్ ఈజీ అవుతుందని పేర్కొన్నారు.

Politics

  • సాక్షి, విజయవాడ: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఎన్నికల కన్సల్టెన్సీ లపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మనా? ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడానికి అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ప్రశాంత్ కిషోర్ ఓ క్యాష్ పార్టీ. గిమ్మిక్కులు చేస్తారని విమర్శలు గుప్పించారు. ప్రశాంత్‌ కిషోర్‌ కమర్షియల్‌ అని తెలుసుకునేే వద్దనుకున్నట్లు చెప్పారు.

    వైఎస్సార్‌సీపీ కోసం ఐప్యాక్ నిర్మాణాత్మకంగానే పనిచేస్తోందని అన్నారు మంత్రి బొత్స. ప్రశాంత్ కిషోర్ అయినా,ఐప్యాక్ అయినా తాత్కాలికమేనని, వైఎస్సార్‌సీపీ శాశ్వతమని తెలిపారు. కో ఆర్డినేషన్ కోసం ఐప్యాక్ సంస్థ సేవలు తీసుకున్నామని చెప్పారు. కన్సల్టెన్సీ సంస్థలు ఎన్నైనా చెబుతాయని, నిర్ణయం తీసుకోవాల్సింది తామేనని అన్నారు. ఐప్యాక్ చెప్పిన వారికి టిక్కెట్లు ఇచ్చారనేది అవాస్తవని అన్నారు. ఐప్యాక్ ఓ జాబితా ఇస్తుందని,అందులో నుంచి అభ్యర్థులను పార్టీ సెలెక్ట్ చేసుకుందని స్పష్టం చేశారు.

    ‘ఎన్నికలు పూర్తయ్యాయి... భవితవ్యం బ్యాలట్ బాక్సులలో ఉన్నాయి. మేం గెలుస్తామని.. జూన్ 9 న ప్రమాణ స్వీకారం అని చెప్పాం. ఏపీలో విద్యావిదానంపై మా విధానాన్ని మ్యానిఫెస్టోలో పెట్టాం. ప్రతిపక్ష పార్టీలు మా విద్యావిధానం నచ్చకపోతే ఎందుకు వారి విధానాన్ని మేనిఫెస్టోలో పెట్టలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 38,61,198 మంది చదువుతుంటే వాస్తవ విరుద్దంగా 35 లక్షలే ఉన్నారని ఇచ్చారు. రాష్ట్ర విద్యార్ధులు అంతర్జాతీస్ధాయిలో రాణించేలా ఎన్నో‌కీలక మార్పులు తెచ్చాం. ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య, టోఫెల్, జగనన్న గోరుముద్ద, విద్యాదీవెన, విద్యాకానుక, విదేశీ విద్యాదీవెన‌ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం.

    మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం
    విద్యావ్యవస్ధపై ఎందుకు తప్పుడు కధనాలు ప్రచురిస్తున్నారు. మాపై బురద జల్లుతున్నారు. విద్యావ్యవస్ధలో ఇంకా మంచి మార్పులు తీసుకురావాలని మా ఆలోచన. మా విధానాలు నచ్షే పెద్ద ఎత్తున‌మాకు అనుకూలంగా ఓటేశారని భావిస్తున్నాం. మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. నేను ఎన్నో ఎన్నికలు చూశాను కానీ ఇలాంటి పరిస్ధితులు ఎపుడూ చూడలేదు.

    ప్రదాన పార్టీ నాయకులంతా ప్రస్తుతం విదేశాలలో ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లారు. వాతావరణం అనుకూలించక మద్యలో ఆగితే తప్పుడు ప్రచారాలు ఎందుకు?. చంద్రబాబు చెప్పాపెట్టకుండా విదేశాలకి వెళ్లారు. చంద్రబాబు ఏ దేశం వెళ్లారో కూడా తెలియదు. చంద్రబాబు ఏ దేశం వెళ్లారో చెప్పాలి. చంద్రబాబు కంటే ముందే ఆయన కుమారుడు లోకేష్‌ విదేశాలికు వెళ్లారు. రాష్ట్ర ప్రజలని సంయమనం పాటించాలని కోరుతున్నా. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు ఆపండి

    భయంతో చంద్రబాబు విదేశాలకు పారిపోయారా?
    రాష్డ్ర అభివృద్దిలో అందరూ భాగస్వామ్యులమే. ఎందుకు హర్రీ అండ్ వర్రీ. చంద్రబాబు ప్రజలకి చెప్పి విదేశాలకు వెళ్తే తప్పేంటి?. ఎందుకు చెప్పకుండా చంద్రబాబు విదేశాలకి వెళ్లారు. భయంతో చంద్రబాబు విదేశాలకు పారిపోయారా?. సీఎం జగన్ విదేశీ పర్యటనలపై ఎందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అమెరికాలో నివాసం ఉన్న డాక్టర్ గన్నవరంలో హల్ చల్ చేయడం ఏంటి? వైఎస్ జగన్‌ అడ్డుకోవాలని మెసేజ్‌లు పెట్టడం.. డిబేట్లు ఏంటి? ఈ తరహా కల్చర్ ఎపుడూ లేదు.

    తన పాలన చూసి ఓటేయాలని ప్రదాని మోదీనే అడగలేదు
    మాకు 175 సీట్లు వస్తాయని అనుకుంటున్నా. మేనిఫెస్టోని చూసి ఓటేయమని ఏ సీఎం అయినాా చెప్పారా?. తన పాలన చూసి ఓటేయాలని ప్రదాని మోదీనే అడగలేకపోయారు. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయమని సీఎం జగన్ మాత్రమే అడిగారు సీఎం రాజకీయాలలో ట్రెండ్ సెట్ చేశారు. నా తప్పులని దిద్దుకుంటానని అదికారంలోకి వచ్చి మళ్లీ చంద్రబాబు మోసం చేశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని మోసం చేయలేదా?

    చంద్రబాబుకి క్రెడిబిలిటీ లేదు

    దేశంలోనే ఎక్కడా లేని విధంగా వైద్యం, విద్యా రంగాల్లో సంస్కరణలు అమలు చేశాం. మా సంస్కరణలతో ఏపీ జీడీపీ పెరిగింది. గ్రామాలలో వృద్దులకి, మహిళలకి ఎంతో గౌరవం పెరగడానికి మా సంక్షేమ పథకాలే కారణం, వాలంటీర్, సచివాలయ వ్యవస్ధలతో క్షేత్రస్ధాయిలోకి వెళ్లే వ్యవస్ధ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు.  కరోనా సమయంలో అలాంటి వ్యవస్ధతో సమర్దవంతంగా ఎదుర్కొన్నాం. ప్రజలికు కావాల్సిన విధానాలని, సంస్కరణలనే సీఎం వైఎస్ జగన్ అమలు చేశారు. అందుకే సీఎం వైఎస్ జగన్‌కు మళ్లీ పట్టం కట్టారని మేం భావిస్తున్నాం.’ అని బొ త్స పేర్కొన్నారు.

  • న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భవితవ్యంపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త  ప్రశాంత్‌ కిశోర్‌(పీకే) కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక జాతీయ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే మాట్లాడారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒకవేళ పరాజయం పాలైతే రాహుల్‌గాంధీ రాజకీయాల నుంచి కొంత కాలం విరామం తీసుకోవాలని సూచించారు. 

    ‘మీ సొంత వ్యూహాల మీద మీరు ఎన్నికలకు వెళ్లారు. ఇలాంటప్పుడు మీ పార్టీ ఓడిపోతే మీరు విరామం తీసుకోవడం వ్యూహాత్మకంగా, నైతికంగా సరైనది’అని రాహుల్‌ను ఉద్దేశించి పీకే  అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 300 సీట్ల దాకా గెలుచుకునే అవకాశాలున్నాయని పీకే చెప్పుకొచ్చారు. 

  • నెల్లూరు:  బెంగళూరు రేవ్‌ పార్టీ అంశానికి సంబంధించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న ‘పచ్చమంద’కు మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి వాతలు పెట్టారు. తనకు సంబంధాలు ఉన్నా, తనకు సంబంధించిన వారు ఎవరున్నా చర్యలు తీసుకోవచ్చన్నారు కాకాణి. ఎవరో అనామకుడు తన కారు స్టిక్కర్‌ను జిరాక్స్‌ తీసి వాడుకుంటే అందులో తాను ఉన్నానంటూ పచ్చ మంద రాద్దాంతం చేస్తుందని కాకాణి ధ్వజమెత్తారు.

    ‘నేను రెడీ.. సోమిరెడ్డి సిద్ధంగా ఉన్నారా?’

    ‘బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను రెడీ.. సోమిరెడ్డి సిద్ధంగా ఉన్నారా ?, నెల్లూరులో ఎక్కడికి రావాలో చెప్తే అక్కడికి వస్తా. ఎవరికి రేవ్ పార్టీకి వెళ్లే అలవాటు ఉందో తెలుస్తుంది. ఆధారాలు ఉంటే సోమిరెడ్డి పోలీసులకు ఇవ్వాలి. బెంగళూరు రేవ్ పార్టీపైసీబీఐ దర్యాప్తుకు నేను సిద్ధంగా ఉన్నా. బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి వస్తావా.. ? పాస్ పోర్ట్ చూపించడానికి వస్తావా ? , రేవ్ పార్టీలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఉన్నారని సోషల్ మీడియాలో వస్తుంది.

    బెంగళూరు పోలీసులు ఎటువంటి కాల్ చేయలేదు.రేవ్ పార్టీ జరిగిన ఫార్మ్ హౌస్ గోపాల్ రెడ్డి ఎవరో నాకు తెలియదు  పాసు పోర్ట్ నా దగ్గరే ఉంది.కుట్ర కోణం పై విచారణ చేయాలని  పోలీసులను కోరాను.రోస్ ల్యాండ్ లాడ్జిలో చంద్రమోహన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు.సో మిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  లోఫర్’ అంటూ  మండిపడ్డారు.

    ‘రేవ్ పార్టీలు, రేప్ పార్టీలు చేసే చరిత్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిది. సోమిరెడ్డి లేడీ డాక్టర్ ను ఇబ్బంది పెట్టిన కథనాలు గతంలో పత్రికల్లో వచ్చాయి. నాపై మూడోసారి కూడా సోమిరెడ్డి ఓడిపోతున్నారు.. ఆ ప్రెస్టేషన్ లో ఏదో మాట్లాడుతున్నారు. యూత్ మినిస్టర్‌గా ఉండి క్రికెట్ కిట్స్ అమ్ముకున్న చరిత్ర సోమిరెడ్డిది. నా పాస్ పోర్ట్ నెల్లూరులో ఉంది.  కారు స్టిక్కర్ జిరాక్స్ చేసి నాపై కుట్ర చేసినట్లు అనుమానాలు ఉన్నాయి..  కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశా’ అని కాకాణి తెలిపారు.

    బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి

     

  • కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీపై చేసిన వ్యాఖ్యలకుగాను కలకత్తాక హైకోర్టు మాజీ జడ్జి  గంగోపాధ్యాయను ఎన్నికల కమిషన్‌ మందలించింది. 24 గంటల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ గడువు మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది.

    ప్రచార సభల్లో మాట్లాడేటపుడు జాగ్రత్తగా మాట్లాడాలని గంగోపాధ్యాకు ఎన్నికల సంఘం సూచించింది. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను దృష్టిలో ఉంచుకోవాలని హెచ్చరించింది. నీ రేటెంత అని మమతా బెనర్జీని ఉద్దేశించి గంగోపాధ్యాయ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

    గంగోపాధ్యాయ ప్రస్తుతం వెస్ట్‌బెంగాల్‌లోని టమ్లుక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎన్నికల బరిలో ఉన్నారు. కలకత్తా హైకోర్టు జడ్జి పదవికి రాజీనామా చేసి మరీ గంగోపాధ్యాయ బీజేపీలో చేరి  ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 

  • సాక్షి,  విజయవాడ: ఎల్లో మీడియాకు చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికి వెళ్లారని మంత్రి జోగి రమేష్‌ ప్రశ్నించారు. చంద్రబాబు కనిపించకుండా పోతే టీడీపీ అడ్రస్‌ గల్లంతవుతుందని అన్నారు. దోచిన డబ్బంతా దుబాయ్‌లో దాచడానికి వెళ్లరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  చంద్రబాబు పరార్‌తో టీడీపీ నాయకుల నోటికి తాళాలు పడ్డాయని విమర్శించారు. 

    కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారన్నారు జోగి రమేష్‌. ఎస్పీలను, కలెక్టర్లను మార్చిన చోటే గొడవలు జరిగాయని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా.. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

    చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు జోగి రమేష్‌. పల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే కారణమని దుయ్యబట్టారు. టీడీపీ అడ్రస్‌ గల్లంతు కాబోతుంది కాబట్టే చంద్రబాబు విధ్వంసానికి పాల్పడ్డాడని విమర్శించారు. పురందేశ్వరి ఈసీకి తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లే అధికారులను మార్చారనిన్నారు.

    కాగా అడుగు తీసి అడుగేస్తే మీడియాలో ప్రచారం కోరుకునే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గప్‌చుప్‌గా విదేశాలకు ఉడాయించారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి దుబాయ్‌ వెళ్లిన చంద్ర­బాబు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే విషయంపై గోప్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ తొలుత మీడియాకు లీకులిచ్చింది.

    అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్నారై విభాగం నేత కోమటి జయరాం మాత్రం ఆయన అసలు అమెరికా రాలేదని ప్రకటించడం గమనార్హం. విదేశాల నుంచి అక్రమ నిధులను భారత్‌లోని షెల్‌ కంపెనీలకు మళ్లించిన చరిత్ర ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారు? ఏం చేస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు ఏమిటన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే తాజా విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు ఇటలీలో ల్యాండ్‌ అయినట్లు తెలుస్తోంది.

    ఈ ఫోటోలో వ్యక్తి కనబడుట లేదు: జోగి రమేష్
    చదవండి: ఇట్లు ఇటలీకి

  • సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని స్వేచ్ఛగా అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందని అన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ రెడ్డి. తేమ పేరుతో క్వింటాల్‌కు పది నుంచి 12 కిలోల తరుగు తీస్తున్నారని ఆయన ఆరోపించారు. సివిల్ సప్లై డైరెక్టర్ చౌహాన్‌కు వ్యవసాయ శాఖ గురించి తెలియదని, ధాన్యం కొనుగోళ్ళలో 10 నుంచి 12 కిలోల తరుగు ఎ వరి జేబులోకి వెళ్తోందని ప్రశ్నించారు. ఒక కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుంటే.. అందులో పది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తరుగు పేరుతో తీస్తున్నారని మండిపడ్డారు. 

    బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా యూ (U) ట్యాక్స్ వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రూ.500 కోట్లు చేతులు మారాయని ఆరోపణలు చేశారు. సివిల్ సప్లై  శాఖలో వంద కోట్ల రూపాయలు వసూలు చేసి డిల్లి పంపింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సీఎం రేసులో ఉన్నానని చెప్పడానికి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి డిల్లీకి డబ్బులు పంపిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేసులో ఎక్కడ వెనుకబడి పోతానేమో అనే భయంతో ఇలా చేశారని అన్నారు.

    రైస్ మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన CMR రైస్ ఎంత మేరకు ఇచ్చారని ప్రశ్నించారు. డిఫాల్టర్లుగా ఉన్న రైస్ మిల్లర్లకు మళ్ళీ ఎందుకు ధాన్యం ఇస్తున్నారని నిలదీశారు. రైతుల దగ్గర ధాన్యం దోచుకుంటున్నారని, రైస్ మిల్లర్ల దగ్గర ధాన్యం ఉంటే.. ప్రభుత్వం ఎందుకు వడ్డీ కడుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం వడ్డీ కడుతున్నది నిజం కాదా? అని అడిగారు. తన ప్రశ్నలకు  మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

  • ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాపై మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులను పాకిస్థానీయులుగా అభివర్ణించడాన్ని తప్పుపట్టారు.  

    నిన్న.. అమిత్ షా ఆప్ మద్దతుదారులు పాకిస్థానీలని అన్నారు. నేను ఆయన్ను ఒకటే అడగాలని అనుకుంటున్నాను. ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, గోవా ప్రజలే మనకు ఓట్లు ఇచ్చారు? మున్సిపాలిటీ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్‌తో పాటు దేశంలోని అనేక ప్రాంతాల ప్రజలు తమ ప్రేమను, నమ్మకాన్ని మనకు (ఆప్‌) అందించారు. వాళ్లందరూ పాకిస్థానీయులేనా? అని ప్రశ్నించారు.  

    అనంతరం.. ప్రధాని నరేంద్ర మోదీ 2025 డిసెంబర్‌లో పదవీ విరమణ చేయనుండగా, అమిత్‌ షా తదుపరి ప్రధాని అవుతారని అంటూనే.. జూన్ 4 ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఓడి పోతుంది కాబట్టి మీరు ప్రధాని కాలేరు అని అమిత్‌ షాను ఉద్దేశించి కేజ్రీవాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.  సర్వే ఫలితాల ప్రకారం, ఇండియా కూటమికి 300 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. 
     

  • సాక్షి, హైదరాబాద్‌: రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సన్న బియ్యానికే 500 బోనస్ అనలేదని.. 500 బోనస్ సన్నబియ్యంతో మొదలు పెడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న రైతు అనుకూల నిర్ణయాలు ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదని.. రైతుల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరగడంతో అక్కసు వెళ్లగక్కుతున్నారంటూ మండిపడ్డారు.

    ‘‘మూడు రోజుల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నాం.. రైతుల దగ్గర తడిచిన ధాన్యం కూడా కొంటున్నాం.. తరుగు లేకుండానే ధాన్యం కొంటున్నాం.. కొనుగోలు కేంద్రాలను కూడా పెంచాం.. తడిచినా, మొలకెత్తినా చివరి గింజ వరకు కొంటాం.. పదేళ్లలో ఏం చేయలేని వారికి మమ్మల్ని విమర్శించే హక్కు లేదు’‘ అంటూ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రైతులను ఇబ్బంది పెట్టేందుకు రాజకీయాలను వాడొద్దని ప్రతిపక్షాలకు డిప్యూటీ సీఎం హితవు పలికారు.

    రాష్ట్రంలో అసలు ధాన్యమే కొనుగోలు చేయడం లేదు, కళ్ళల్లో ధాన్యం తడిసి ముద్దౌతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు గాలి మాటలు మాట్లాడడం సరైనది కాదు, గత ఏడాది ఇదే సమయంలో నేను పాదయాత్ర చేస్తుండగా రోడ్ల వెంట ధాన్యం కుప్పలుగా పోసి రైతులు ఇబ్బంది పడేవారు, గత ప్రభుత్వం తడిసిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేయలేదు ఈ విషయాన్ని వేలాది మంది రైతులు నా పాదయాత్ర సమయంలో గోడు వెళ్లబోసుకున్నారు అని వివరించారు.

    మొలకెత్తిన ధాన్యం సైతం మద్దతు ధరకే తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు ఇది ప్రజల ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత తమదే అన్నారు. ఇక ధాన్యానికి బోనస్‌ విషయానికి వస్తే సన్నాలకు 500 రూపాయల బోనస్‌తో ఈ ప్రక్రియను మొదలు పెట్టామని చెప్పారు. నాటి సీఎం కేసీఆర్ వరి వేస్తే ఊరే అని ప్రకటించిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు.

    భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీపడేలా ప్రయత్నం చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దుష్టశక్తుల చేతిలో బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో టెక్నాలజీ కమ్యూనికేషన్ రంగాన్ని ముందు చూపుతో ప్రధానిగా రాజీవ్ గాంధీ ఆచరణలో పెట్టారని, యువతను రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రోత్సహించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతున్నాయి ఎంత ధాన్యం కొనుగోలు చేశాం ఇలాంటి సమాచారం క్షణాల్లో తెలుసుకుంటున్నాం దీనికి కారణం రాజీవ్ గాంధీ చూపిన మార్గము.. ప్రజా అవసరాలను తీర్చడంలో రాజీవ్ గాంధీ మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు.

     

  • 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఐదు దశల ఓటింగ్ పూర్తయ్యింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిరంతరం విమర్శల దాడులను  చేస్తుంటాయి. అయితే ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీని పక్కనపెట్టి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

    తాజాగా మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సీఎం యోగిని టార్గెట్ చేశారు. జూన్ 4 తర్వాత బీజేపీ సీనియర్ నేతలందరి పాస్‌పోర్ట్‌లను జప్తు చేయాలని  ఆయన వ్యాఖ్యానించారు.. ‘వాళ్లంతా పారిపోతారు. రాహుల్ గాంధీ గానీ, భారత కూటమిలోని సభ్యులు గానీ ఎన్నడూ పారిపోరు. దేశానికి అండగా నిలుస్తారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం బలిదానం చేశారు. దేశం కోసం ఏ బీజేపీ నేత అయినా బలిదానం చేశారా? వీళ్లంతా వ్యాపారస్తులు, భయపడతారు. ఆ వ్యాపార వలయంలో చిక్కుకుపోయానని యోగి గ్రహించాలి’ అని నానా పటోలే అన్నారు.

    అరవింద్ కేజ్రీవాల్ కూడా మీడియా సమావేశంలో సీఎం యోగిపై పలు వ్యాఖ్యానాలు చేశారు. యోగి ఢిల్లీకి వచ్చి తనపై దుర్భాషలాడారని ఆరోపించారు. అయితే ఆయనకు అసలు శత్రువులు బీజేపీలోనే ఉన్నారని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ సీఎం యోగిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తుందని  కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు.

    శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను టార్గెట్ చేశారు. యూపీలో పరిస్థితి గందరగోళంగా ఉన్నందున సీఎం యోగి అక్కడే ఉండాలని అన్నారు. యూపీలో పరిస్థితి కనిపించిన దానికి భిన్నంగా ఉందన్నారు.

    ఉత్తరప్రదేశ్‌లో పదేళ్లుగా అధికారంలో ఉంటూ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆ రాష్ట్రంలో పలు మార్పులు తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి పదవిలో  ఉంటూనే మరోమారు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. దీంతో రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాపంగానూ ఆయన స్థాయి పెరిగింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సీఎం యోగి పేరు ఉంది. ఆయన ఎన్నికల ప్రచారానికి అన్ని రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరిగింది. ఆయన ఎక్కడికి వెళ్లినా ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

NRI

  • మా మనమడు మొదటిసారి కాలేజీలో చేరుతున్న సందర్భంగా కుటుంబంతో కలిసి నేనూ జనవరి మొదటి వారంలో లబ్బాక్ ( Lubbock )లోని టెక్సస్ టెక్ ( Texas Tech ) యూనివర్సిటీకి కారులో షికారులాగా బయలుదేరాం. లబ్బాక్ ఏమిటీ అందం చందం లేని పేరు అన్నాను మా మనవరాలితో. ఆమె వెంటనే పొంగిపోతూ చెప్పిన సమాధానం ‘ తాతా ఇట్‌ ఈస్ బర్త్ ప్లేస్ అఫ్ ఫేమస్ రాక్ ఎన్ రోల్ లెజెండ్ బడ్డీ హోలీ ( Buddy Holly )’ అని. ఏమిటో ఏది అడిగినా మ్యూజిక్ భాషలోనే జవాబు చెబుతుంది అనుకున్నాను మనసులోనే. 

    ఎటు చూసినా అంతా హిస్పానిక్
    భూమి కొరత లేని దేశం యూఎస్. టెక్సస్ టెక్ నేషనల్ యూనివర్సిటీ ప్రాంగణమే దాదాపు రెండువేల ఎకరాల్లో ఉంది. అయినా ఓపిక చేసుకొని కొన్ని ముఖ్యమైన భవనాలు తిరిగి చూసాము. ఎటు చూసినా అంతా హిస్పానిక్ వాతావరణం, ఇందులో చదువుకునే అండర్ గ్రాడ్యుయేట్స్ విద్యార్థుల్లో దాదాపు 25 శాతం మంది హిస్పానిక్స్‌నేట. అందుకే దీన్ని హిస్పానిక్ సర్వీసింగ్ ఇన్‌స్టిట్యూషన్‌ అన్నారు. మా వాడు చేరింది ఓ బిజినెస్ మేనేజ్‌మెంట్‌ కోర్స్ కానీ రోజంతా ప్రాక్టీస్ చేసేది మాత్రం చెస్. 

    క్రియేటివ్ సిటీగా..
    మరునాడు మా కారు న్యూ మెక్సికో రాజధాని ‘సాంత ఫె ( Santa fe )’ వెళ్ళింది. అక్కడి మారియేట్ హోటల్‌లో మా బస. సాంత ఫె ఒకప్పటి ( 1610 ) స్పానిష్ వాళ్ళ కాలనీ , సాంగ్రెడ్ క్రిస్టో పర్వతాల దగ్గరున్న 400 సంవత్సరాల నాటి పట్టణం. అన్నీ పూబ్లో స్టైల్ నిర్మాణాలు. అవి కళాసంస్కృతులకు ప్రసిద్ధి గాంచినవి. అందుకేనేమో యునెస్కో దీన్ని ఒక ‘ ప్రపంచ స్థాయి క్రియేటివ్ సిటీ ’ గా గుర్తించింది. ఇక్కడికి సందర్శకులు ఎక్కువగా మార్చ్ నెలలో వస్తారట.

    మేము కొంచెం ముందే వెళ్ళాం. ఎంతైనా మంచు ప్రాంతం కదా చలి ఎక్కువగానే ఉంది. నాలాంటి వాళ్ళు తట్టుకోవడం కష్టమే. అయినా ఆ చలిని లెక్కచేయకుండా 5 వ తేదీ నాడు అందరితోకలిసి సాంత ఫె సమీపంలో నేనూ స్కీయింగ్ చేశాను. మావాళ్లు హెచ్చరిస్తున్నా పర్వాలేదు అని ప్రత్యేక పొడుగు చెక్క పాదుకలు ( Long flat runners అవే skis ) షూతో కలిపి వేసుకొని రెండుసార్లు జారిపడ్డా ఏమీ కానట్టు నవ్వుతూ, పడిలేచిన కెరటంలా లేచి, ఆ ఐస్ మీద చిన్నప్పుడు బడిలో జారుడు బండ ఆడినట్టు సరదాగా జారుతూ పిల్లలతో ఔరా! అనిపించుకున్నా. 

    చిత్ర విచిత్రమైన ఎగ్జిబిషన్
    మా విహారయాత్ర చివరి రోజు మేము సాంత ఫెలో చూసింది ఓ చిత్ర విచిత్రమైన ఎగ్జిబిషన్ ‘మియో వోల్ఫ్ ’ ( Meo wolf ). ఇక్కడ అడుగు పెట్టగానే మాకు స్వాగతం చెప్పింది ఓ రాక్షసాకార రోబోట్. ఈ మ్యూజియంలోకి ప్రవేశించిన వారు ఈ భూలోకాన్ని మరిచి ‘మరో ప్రపంచం’లోకి ( శ్రీ శ్రీ చెప్పింది కాదు సుమా ! ) వెళ్ళిపోతారన్నారు. దాదాపు వంద మంది కళాకారులు సృష్టించిన విద్యుత్ వెలుగుల వింత ప్రపంచం ఇది. 

    ఆర్ట్ & టెక్నాలజీ రెండూ కలిస్తే ఎలా ఉంటుందో ఈ ప్రదర్శనశాలను చూస్తే అర్థమౌతుంది. మన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఇలాంటిది పెడితే సంవత్సరం పొడుగునా జనం వచ్చి చూసి ఆనందిస్తారు కదా! అనిపించింది. House of Eternal Returnగా వర్ణించిన ఈ రంగుల ప్రపంచంలో ఒక పూట గడిపి ఎట్లాగయితేనేం బయటపడ్డాం. నాలుగు రోజులకే లాడ్జింగ్, హోటల్ లతో విసుగెత్తి , ఇంటిమీద బెంగ పెట్టుకొని డాలస్‌ బాట పట్టాం ! 

    వేముల ప్రభాకర్‌

    (చదవండి: మేడం టుస్సాడ్‌.. మన శిల్పసంపద కంటే ఎక్కువా?)

Andhra Pradesh

  • సాక్షి, హైదరాబాద్‌: నైరుతి బంగాళాఖాతంలో రేపు(బుధవారం) అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి 24 గంటల్లో (మే24) మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల చివర వరకు తుఫాన్‌గా మారే ఛాన్స్ ఉందని  వెల్లడించింది.

    ఈశాన్య దిశగా కదులుతూ బలపడనున్న అల్పపీడనం.. నైరుతి బంగాళాఖాతానికి అనుకుని తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగనుంది. దీంతో అయిదు రోజుల పాటు ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. కొన్నిచోట్ల క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కూడా ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ ఎత్తు వరకూ ఆవరించింది. ఈ కారణంగా తెలంగాణలో పలు జిల్లాల్లో  భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీతెలిపింది.

  • సాక్షి, తూర్పుగోదావది:  తూర్పు గోదావ‌రి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత పెండ్యాల వెంక‌ట కృష్ణ ‌బాబు మృతిచెందారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న హైద‌రాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. నేడు తెల్లవారుజామున కృష్ణ‌బాబు చనిపోయినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.

    కృష్ణబాబు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామం దొమ్మేరుకు తరలించారు. బుధవారం  అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా 1953లో పాలకొల్లులో జన్మించిన కృష్ణబాబు.. కొవ్వూరు నియోజకవర్గంలో అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983 నుంచి 1994 వరకు(1983,1985, 1989, 1994) నాలుగుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.  1999లో ఓటమి చెందిన ఆయన తిరిగి 2004లో అయిదవసారి కొవ్వూరు ఎమ్మెల్యేగా గెలిచారు.

    ఇక 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో కొవ్వూరు ఎస్సీ రిజర్వ్‌ కావడంతో ప్రత్యక్ష రాజకీయాలకు కృష్ణబాబు దూరంగా ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుదీర్ఘకాలం రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా కృష్ణబాబు పేరొందారు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు ప్రస్తుతం స్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు నేతలు సంతాపం తెలియజేస్తున్నారు.

     

     

Family

  • సాధారణంగా ఏ సీజన్‌లో దొరికే పండ్లను ఆ సీజన్‌లో తీసుకోవాలని పెద్దలు, ఆరోగ్య నిపుణులు చెబుతారు. అలాంటి వాటిలో ఒకటివేసవిలో ఎక్కువగా లభించే  పుచ్చకాయ. సాధారణంగా పుచ్చకాయ కోసి తినే సమయంలో వాటి గింజలను పారేస్తుంటారు. నిజానికి పుచ్చకాయ గింజల్లోని గుణాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే  ఈసారి గింజల్ని అపురూపంగా చూసుకుంటారు. పుచ్చకాయ గింజల వలన  ప్రయోజనాల గురించి తెలుసుకుందాం రండి!

    పుచ్చకాయ అద్భుతమైన హైడ్రేటింగ్ ఫ్రూట్‌. ఇందులో 92శాతం  నీరే ఉంటుంది. ఇంకా ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి అలాగేదీని గింజలు వివిధ రకాల పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. తక్కువ క్యాలరీలు, జింక్, మెగ్నీషియం, పొటాషియం మొదలైన సూక్ష్మపోషకాలను కలిగి ఉంటాయి. పుచ్చకాయ గింజలు రోగనిరోధక శక్తిని,గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. పుచ్చకాయ గింజల్లోని మిథనాలిక్ సారం అల్సర్లకు వ్యతిరేకంగా అద్భుతంగా పని చేస్తుందని ఎలుకలపై చేసిన అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.

    తక్కువ కేలరీలు
    పుచ్చకాయ గింజల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. 4 గ్రాముల బరువున్న కొన్ని విత్తనాలలో 23 కేలరీలు మాత్రమే ఉంటాయి.

    మెగ్నీషియం
    జీవక్రియ కార్యకలాపాలకు అవసరమైన పోషకం మెగ్నీషియం పుష్కలంగా  లభిస్తుంది.  ఆరోగ్యకరమైన జీవక్రియను ప్రోత్సహిస్తాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం, మన శరీరానికి ప్రతిరోజూ 420 గ్రాముల మెగ్నీషియం అవసరం.
    జింక్
    ఇందులోని  జింక్‌  రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది, జీర్ణక్రియ, కణాల పెరుగుదలలో సహాయపడుతుంది. నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

    ఇనుము
    ఇనుము ఎక్కువగా లభిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం,  ఒక  వ్యక్తికి రోజువారీ 18 mg ఇనుము అవసరం. 

    మంచి కొవ్వులు
    గుడ్‌ కొలెస్ట్రాల్‌(మంచి కొవ్వు) మోనోఅన్‌శాచురేటెడ్ , పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు లభిస్తాయి. ఇవి గుండెపోటు, స్ట్రోక్‌ను నివారించడానికి ఉపయోగపడుతుంది . కొలెస్ట్రాల్‌ను  తగ్గిస్తుంది. నాలుగు గ్రాముల పుచ్చకాయ గింజలు 0.3 గ్రాముల మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలను , 1.1 గ్రాముల పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలను అందిస్తాయి.

     

  • బాలీవుడ్‌ నటి, మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. పలు ఫ్యాషన్‌ వేడుకలకు తన డిజైనర్‌వేర్‌ డ్రెస్‌లతో మిస్మరైజ్‌ చేస్తుంది. అలానే రోమ్‌లో జరిగిన బల్గారీ ఈవెంట్‌కు హాజరైన ప్రియాంక తన న్యూ లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. సరికొత్త హెయిర్‌ స్టైల్‌తో ప్రియాంక ప్రేక్షకులను అలరించింది. 

    పైగా ఆ హెయిర్‌ స్టైల్‌కి తగ్గట్టు నలుపు, తెలపు కాంబినేషన్‌ గౌను, అందుకు తగ్గట్టు డైమండ్‌ నెక్లస్‌ని ధరించి అత్యద్భుతంగా కనిపించింది. నెక్‌కు కోట్లు ఖరీదు చేసే 200 క్యారెట​ డెమండ్‌ నెక్లెస్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. బల్గేరి అటెర్నె బ్రాండ్‌కి చెందిన ఈ నెక్లెస్‌ అత్యంత లగ్జరియస్‌ జ్యువెలరీ. ఈ మేరకు ఈ విషయాన్ని బల్గారీ అధికారిక వెబ్‌సైట్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. అలాగే ఫ్యాషన్, పాప్ సంస్కృతిని ఫాలో అయ్యే ఇన్‌స్టాగ్రామర్‌ డైట్‌ సబ్యా కూడా ఈ నెక్లెస్ మాన్యుఫాక్చరింగ్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

    ఈ నెక్లెస్‌ రూపొందిచడానికి దాదాపు 2,800 గంటలు శ్రమతో కూడిన నైపుణ్యం అవసమరమని, ఇది చాలా కఠినమైన వజ్రమని తెలిపారు. దీన్ని 140 క్యారెట్ల ఏడు పియర్‌ ఆకారపు చుక్కలుగా రూపొందించడానికే ఇంత సమయం తీసుకుంటుందని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ బ్రాండ్‌ చరిత్రలో ఇది అత్యద్భుతమైన నెక్లెస్‌ అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ వేడుకలో ప్రియాంక ధరించిన కళ్లమిరుమిట్లు గొలిపే డైమండ్‌ నెక్లెస్‌ తోపాటు ఆమె కొత్త హెయిర్‌ స్టైల్‌ హైలెట్‌గా నిలిచింది. ఇక ముఖానికి కనుబొమ్మలకు మెరిసే గోల్డెన్ ఐ షాడో, కనురెప్పలపై మాస్కరా, బెర్రీ-టోన్డ్ లిప్ షేడ్, చెంపలపై గులాబీ రంగు బ్లష్ వంటివి హైలెట్‌గా నిలిచాయి.

     

    (చదవండి: కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై సంప్రదాయ చీరకట్టులో తళుక్కుమన్న నటి!)

     

  • అండమాన్ దీవుల్లో నేను, నా భర్త రోమ్ ఒక రోజు తెల్లవారుజామున రెండు పిల్లులు అరుస్తూ కొట్టుకుంటున్నట్టు వినిపించిన శబ్దాలకు నిద్ర లేచాము. నిద్ర కళ్ళతో బాల్కనీకి వెళ్లి అడవిలో ఆ శబ్దాలు వస్తున్న వైపు చూసాము. ఆశ్చర్యంగా ఆ రెండు శబ్దాలు చేస్తున్నది పొడుగు తోకల ఏట్రింత (రాకెట్ టైల్డ్ డ్రోంగో) అనే పక్షి అని తెలుసుకుని ఆశ్చర్యపోయాము.  ఒకసారి సముద్రపు గ్రద్ద వలె, మరోసారి దర్జీ పిట్టలా, మధ్యలో లారీ హార్న్ శబ్దాలను  నమ్మశక్యం కానీ రీతిలో అనుకరిస్తున్న ఆ పక్షి  అనుకరణలు గమనించాము. ఒక పక్షికి ఇంత అద్భుతమైన అనుకరణ (మిమిక్రీ)  చేయవలసిన అవసరం ఏముంది?

    ఏట్రింతలు ఇతర జాతుల పక్షులతో కలిసి వేటాడుతూ ఉంటాయి. ఇతర పక్షుల జాతులతో కలిసి ఒక జట్టుగా ఏర్పడుట కోసమే ఇవి వాటి అరుపులను అనుకరిస్తాయని శ్రీలంక పక్షి శాస్త్రవేత్తలు భావిస్తారు.  ఈ అనుకరణ యాదృచ్చికమో లేక కావాలని చేసే అనుకరణో కచ్చితంగా చెప్పడం కష్టం.

    ఇతర పక్షులు తమ ఆహారాన్ని తినే సమయంలో ఏట్రింతలు ఘాతుక పక్షుల ముప్పు లేకుండా కాపలా కాస్తుంటాయి . ఏదైనా ఘాతుక పక్షి దగ్గరగా వచ్చినట్లైతే ఆ ఘాతుక  పక్షిపై మూకుమ్ముడిగా దాడి చేయడానికి ఇతర పక్షుల హెచ్చరిక అరుపులను అనుకరిస్తూ వాటిని ప్రోత్సాహిస్తాయిని భావిస్తారు.

    కొద్దిసేపటి క్రితం మేము ఒక జాలె డేగ, వంగ పండు పక్షిపిల్లని పట్టుకుని తింటూండటం చూసాము. దాని సమీపంలోనే నల్ల ఏట్రింత, జాలె డేగ అరుపులను అనుకరించినా, ఆ డేగ పట్టించుకోలేదు. దీనినినిబట్టి ఏట్రింతలు ప్రతీసారి మూకుమ్మడి దాడి కోసమే అనుకరిస్తాయని భావించలేము. కొన్ని సందర్భాలలో పక్షులు తమ చుట్టుపక్కల విన్న శబ్దాలను అనుకరించవచ్చు, ముఖ్యంగా అవి ఒత్తిడికి గురైనప్పుడు లేక మొదటి సారి ఆ శబ్దం విన్నప్పుడు ఆ విధంగా అనుకరించవచ్చు.

    చిలుకలు మరియు మైనా జాతి పక్షులు మనుషులను అనుకరించగలవు. ఇలా అనుకరించడం కోసం వాటికి చిన్నప్పటినుంచే తర్ఫీదు ఇస్తారు. అవి మనుషుల మాటలను సరిగ్గా అనుకరించగానే వాటికి ఆహారాన్ని బహుమానంగా ఇస్తూ ఈ విధంగా నేర్పిస్తుంటారు. చిలుకలు వాక్క్యూమ్ క్లీనర్ చేసే శబ్దాన్ని, టెలిఫోన్ రింగు, కుక్క అరుపులను కూడా అనుకరించగలవు.  ఐన్‌స్టీన్అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఆఫ్రికా దేశపు చిలుక, అమెరికాలోని నాక్స్విల్లె జూలోని తోడేళ్లు , చింపాంజీలు, కోళ్లు, పులులు మరియు ఇతర జంతువుల అరుపులను అనుకరించేది. ఈ అనుకరణ విద్య అవి సహజసిద్ధంగా బ్రతికే అడవుల్లో జీవించేందుకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచించవలసిన విషయము. 

    అడవిలో సమూహంగా జీవించే చిలుకలు సామూహిక బంధాన్ని బలపర్చుకోవడానికి  ఒకటినొకటి అనుకరించుకుంటూ ఉంటాయని ఆస్ట్రేలియాలోని డీకిన్ విశ్వవిద్యాలయలోని లారా కెల్లీ అన్నారు. అవే చిలుకలు పంజరంలో బంధించినట్లైతే వాటి సమీపంలోని మనుషులను అనుకరిస్తాయి. 

    ప్రపంచంలో ఈ అనుకరణ విద్యలో ఆస్ట్రేలియాకి చెందిన  "లైర్ బర్డ్"  చాలా ప్రముఖమైన పక్షి .  యూట్యూబ్లో ఒక వీడియోలో  ఈ పక్షి, కార్ రివర్స్ చేసే శబ్దాన్ని, కెమెరా క్లిక్ శబ్దాన్ని, చైన్ సా , చెట్లు పడిపోయే శబ్దాన్ని, తుపాకి, వాద్య పరికరాలు, ఫైర్ అలారం, పసి పాపాల ఏడుపు, రైళ్లు, మనుషులు, ఈ  విధంగా అనేక రకాలైన శబ్దాలను అనుకరించడం చూడవచ్చు. మగ పక్షులు ఆడ పక్షులను ఆకర్షించడానికి ఎంతో కష్టపడి అనేక రకాల శబ్దాలను అనుకరిస్తూంటాయి కనుక ఆడ పక్షులు ఏ మగ పక్షైతే ఎక్కువ శబ్దాలను అనుకరిస్తుందో దాన్ని భాగస్వామిగా ఎంచుకోవచ్చు అని కొందరు భావిస్తూంటారు. కానీ ఐరోపా జీవశాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని నిరూపించానికి ఎటువంటి ఆధారం దొరకలేదు అంటున్నారు. మరొక శూన్యవాద సిద్ధాంతం ప్రకారం ఈ అనుకరణ వలన ఎటువంటి ఉపయోగం ఉండదు, అది కేవలం సాధన మాత్రమే అని భావిస్తుంటారు.  

    ఆఫ్రికాలోని కలహారి ఎడారిలో కనిపించే ఏట్రింతలు ఈ అనుకరణ విద్యని ఉపయోగించి తెలివిగా ఆహారాన్ని సంపాదించుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పక్షులు తమ పరిసరాల్లోని ఇతర పక్షులు లేక జంతువులు ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు,  ఘాతుక పక్షులు లేక వాటిపై దాడి చేసే ఇతర జంతువులు అరుపులను అనుకరిస్తాయి. ఆ శబ్దాలను విన్న ఆ జంతువులు లేక పక్షులు భయంతో ఆహారాన్ని వదిలి వెళ్ళగానే  ఏట్రింతలు ఆ ఆహారాన్ని దొంగిలిస్తాయి. ఇప్పటి వరకు “పక్షుల అనుకరణ” వలన అవి పొందే ప్రయోజనాలలో ఇది ఒక్కటే నిరూపితమైనది.

    ఈ అండమాన్ దీవుల్లో మేము చూసిన ఏట్రింత కూడా ఇదే విధంగా ఆహారంగా కోసం అనుకరిస్తుందా? ఇది తెలియాలంటే కొంత సమయం మరియు పరిశీలన అవసరం. ఈ అనుకరణ విద్యను ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లోని పక్షులు ప్రదర్శిస్తాయి కనుక ఈ చర్యని వివరించడానికి ఓకే వివరణ అన్నింటికీ వర్తింపచేయలేమని కెల్లీ అభిప్రాయపడతారు.

    ఈ ఆలోచనల మధ్యలో, డిష్ వాషర్లు, అంబులెన్సు శబ్దాలను కూడా అనుకరించే వాటి సామర్ధ్యానికి, ప్రకృతినే ఒక సంగీత వర్ణమాలగా ఉపయోగించే అద్భుతమైన నైపూణ్యానికి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. 

    రచయిత - జానకి లెనిన్‌ 
    ఫోటో క్రెడిట్: సుభద్రాదేవి

    తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters

    పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com

  • ఈ మధ్యంకాలంలో పెళ్లిళ్లు, పార్టీలలో ఎక్కడ చూసినా స్మోక్‌  పాన్‌, స్మోక్‌ చాకెట్ల సందడి కనిపిస్తోంది.  ముఖ్యంగా 'స్మోక్‌ పాన్' తిన్న తర్వాత నోట్లోంచి పొగలు రావడంపై  జనాలకు  బాగా క్రేజ్‌ పెరిగింది. వాస్తవానికి  ఈ స్మోక్‌ పాన్ ఒక రకమైన హానికరమైన రసాయన నైట్రోజన్ సహాయంతో తయారు చేస్తారు. అందుకే నైట్రోజన్‌ పాన్‌అని కూడా అంటారు. తాజాగా ఇలాంటి   స్మోకీ పాన్ తిని ప్రాణాలకు మీదకి తెచ్చుకున్న ఉదంతం కలకలం రూపింది.

    టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశంలోని బెంగళూరు నగరానికి చెందిన 12 ఏళ్ల బాలిక లిక్విడ్ నైట్రోజన్‌తో కూడిన 'స్మోకీ పాన్'ని  తిని తీవ్ర అనారోగ్యానికి గురై  ఆసుపత్రిలో చేరింది. పెర్ఫోరేటెడ్ పెరిటోనిటిస్  (కడుపులో రంధ్రం) వ్యాధి బారిన బాలిక పడినట్లు  పరీక్షల్లో తేలింది. దీంతో వైద్యులు శస్త్రచికిత్స  చేయాల్సి వచ్చింది. ఆరు రోజుల తర్వాత చికిత్స తరువాత ఇంటికి చేరింది.

    స్మోక్‌ పాన్‌ ప్రమాదమా?
    నైట్రోజన్ అనే వాయువును లిక్విడ్‌ రూపం  20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయబడుతుంది. ఈ ద్రవ నత్రజని వేగంగా ఆవిరై, పొగలు వస్తాయి.  ఇది చూడ్డానికి ఆకర్షణీయంగా కనిపించినా ఆరోగ్యానికి హానికరమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆవిరిని పీల్చడం వల్ల శ్వాస తీసు కోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు. ప్యాక్ చేసిన ఆహారం నాణ్యత, షెల్ఫ్ జీవితాన్ని పెంచడానికి  ద్రవ నైట్రోజన్‌ను వాడతారు. 
     

  • ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌ అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకకు వివిధ సెలబ్రెటీలు, ప్రముఖులు విచ్చేసి రెడ్‌ కార్పెట్‌పై వివిధ రకాల  గౌనులు, డిజైనర్‌వేర్‌లతో మెరిశారు. అయితే అస్సాంకి చెందిన ప్రఖ్యాత నటి ఐమీ బారుహ్‌ మాత్రం ఈ ప్రపంచ వేదికపై దేశాన్ని గర్వించేలా చేసింది. దేశీ సంప్రదాయ చీర కట్టులో తళ్లుక్కుమని భారతీయలు ఆత్మగౌరవమే ఈ చీరకట్టు అని చాటి చెప్పింది. 

    ఐమీ బారుహ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సాంప్రదాయ అస్సామీ దుస్తులు ధరించి రెడ్‌కార్పెట్‌పై వయ్యారంగా నడిచి వచ్చింది. ఆమె అస్సామీ సంప్రదాయ చీట్టు స్టైల్‌ చూపురులను చూపుతిప్పుకోనివ్వలేదు. అక్కడున్నవారంతా సంప్రదాయ అస్సామీ సంస్కృతికి కనెక్ట్‌ అయ్యేలా ఐమీ బారుహ్‌ ఆహార్యం ఉంది. ఆ చీర అహోం రాజవంశ కాలం నాటి ముగాట్టు. దానిపై పురాతన గోజ్ బోటా డిజైన్  నాటి సంస్కృతిని అద్దం పట్టేలా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు.

    అలాగే ఐమీ చేతికి ధరించిన గమ్‌ఖరు అనేది అస్సాం శ్రేయస్సు, రక్షణకు సాంప్రదాయ చిహ్నం. ఐమీ ఈ వేడుకలో అస్సాం చేనేత పరిశ్రమ కళాత్మక నైపుణ్యాన్ని ​‍ప్రదర్శించింది. ఈ చీర పత్తి, గుణ నూలు మిశ్రమంతో తయారైన ఐదు వేర్వేరు రంగుల దారాలతో రూపొందించారు. ఈ మేరకు ఐమీ సోషల్‌ మీడియా పోస్ట్‌లో.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐకానిక్ రెడ్ కార్పెట్‌పై మూడవసారి అడుగుపెడుతున్నందుకు గర్వంగా భావిస్తున్నాను.

    ఒక అస్సామిగా గుర్తింపు, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా మా వారసత్వాన్ని సూచించే రెండు వందల ఏళ్లనాటి సంప్రదాయ డిజైన్‌తో కూడిన చేనేత చీర, మణికట్టుపై గమ్‌ఖారు ధరించి ర్యాంప్‌పై నడవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మీ అందరి ఆదరాభిమానాలకు ధన్యావాదాలు అని రాసుకొచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

    (చదవండి: అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?)

     

     

  • టాలీవుడ్‌ హీరో  అక్కినేని నాగ చైతన్య    సరికొత్త లగ్జరీ  కారును కొనుగోలు చేశాడు.   ఆటోమొబైల్స్ అంటే తనకున్న ప్రేమకు నిదర్శనంగా చే గ్యారేజీలో సరికొత్త పోర్స్చే 911 GT3 RS వచ్చి చేరింది .దీని విలువ దాదాపు 3.5 కోట్ల రూపాయలు. ఇదే ఇపుడు  సోషల్‌ మీడియాలోహాట్‌ టాపిక్‌గా నిలిచింది.

     పోర్స్చే సెంటర్ చెన్నై తన ఇన్‌స్టాగ్రామ్‌లో సూపర్‌కార్‌తో ఉన్న నాగ  చైతన్య ఫోటోలను షేర్‌ చేసింది. ఈ కారును చైతన్యకు విజయవంతంగా డెలివరీ చేసినట్లు ప్రకటించింది. అలా తన కొత్త స్టార్ కస్టమర్‌కు స్వాగతం పలికేందుకు సోషల్ మీడియా ద్వారా  స్వాగతం పలికింది. దీంతో ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

     

    నేచురల్‌ ఆస్పిరేటెడ్ నాలుగు లీటర్ల ఆరు-సిలిండర్ ఇంజన్‌తోవస్తున్న ఈ కారు 7-స్పీడ్ DCT సహాయంతో 518బీహెచ్‌పీ పవర్‌ను, 468 గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.  గంటకు 296 కిమీ వేగంతో దూసుకుపోతుంది.

    నాగ చైతన్య ఇప్పటికే ఒక ఫెరారీ 488 GTB, రెండు సూపర్ బైక్‌లు, ఒక MV అగస్టా F4 , BMW R నైన్ టితో సహా ఇతర  కార్లు ఉన్నాయి.  

    వర్క్ ఫ్రంట్‌లో, నాగ చైతన్య తరాబోయే యాక్షన్ డ్రామా 'తండేల్‌'లో నటిస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో  వస్తున్న ఈ మూవీలో సాయి పల్లవిహీరోయిన్‌గా నటిస్తోంది.

  • పొద్దునో టీ.. సాయంత్రమో టీ.. దోస్తులతో టీ.. చుట్టాలతో టీ.. పని ఆపి ఒక టీ.. పనయ్యాకో టీ.. తాగాల్సిందే టీ అంటూ టీ ప్రియులు చెబుతున్నారు. చెమటలు కక్కే వేడిలోనూ పొగలుకక్కే చాయ్‌ తాగుతున్నారు. చాయ్‌ కలిగించే కిక్కులను పేద, ధనిక వ్యత్యాసం లేకుండా ఆస్వాదిస్తుంటారు. ఎంత పేదలైనా ఇంటికి వెళ్లామంటే.. ఓ గ్లాసు మంచినీళ్లు, ఓ కప్పు టీ ఇవ్వాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రజలకు టీ అత్యంత ఇష్టమైన పానీయం. అలాంటి టీకి ఒక రోజు ఉంది. 2005 నుంచి ఏటా మే 21న అంతర్జాతీయ ‘టీ’ దినోత్సవం నిర్వహిస్తున్నారు.

    1793 నుంచే..
    అలిసిన మనసుకు, దేహానికి ఉత్తేజాన్ని ఇచ్చే పానీయం టీ. అరె భాయ్‌ చటుక్కున తాగరా చాయ్‌.. అంటూ ఓ సినీగేయ రచయిత టీ గొప్పతనాన్ని వర్ణిస్తూ పాట రాశాడు. ఎంతో చరిత్ర కలిగిన టీని తేనీరు, చాయ్‌ అని పిలుస్తారు. 15వ శతాబ్దంలో నాగరిక ప్రపంచానికి టీ పరిచయమైంది. మొట్టమొదటగా మన దేశంలో 1793లో కలకత్తాలోని బొటానికల్‌ గార్డెన్‌లో లార్డ్‌ మెకార్డి టీ మొక్కలు పెంచడం ప్రారంభించాడు. ఇప్పుడు ఇంటింటికీ టీ చేరింది. ప్రపంచ టీ ఉత్పత్తిలో చైనా తర్వాతి స్థానం భారత్‌దే. అంతర్జాతీయంగా 30శాతం టీ పొడిని ఒక్క భారతీయులే వినియోగిస్తున్నారు.

    సహజమైన పానీయం..
    టీ సహజమైన పానీయం. ఇంటికి ఎవరు వచ్చినా అతిథి మర్యాదలో మొదట చేరిపోయేది ‘టీ’. స్నేహితులు కాలక్షేపానికి టీ పాయింట్‌కు చేరాల్సిందే. సమావేశాల్లోనూ తేనీటిది ప్రత్యేక స్థానం. ప్రస్తుతం బయట రకరకాల కేఫ్‌లు వెలుస్తున్నాయి. టీలలో కూడా చాలా రకాలు తయారు చేస్తున్నారు. అల్లం టీ, లెమన్‌ టీ, బ్లాక్‌ టీ, గ్రీన్‌ టీ, మసాలా టీ, కరోనా టీ రకరకాల టీలను టీ ప్రియులు ఆస్వాదిస్తున్నారు. మండల కేంద్రాల్లో సైతం ప్రస్తుతం వివిధ కంపెనీలు వివిధ పేర్లతో టీ పాయింట్‌లు ఏర్పాటు చేసి ఒక కప్పు చాయ్‌కు రూ.10లకు తగ్గకుండా విక్రయిస్తున్నారు. కానీ పలువురు టీ వ్యాపారులు ఇప్పటికీ రూ.5లకే టీ విక్రయిస్తున్నారు.

    ఇవి చదవండి: నాలుగు మాటల్లో.. ఈ చిత్రకారుడి కథ!

  • ప్రతి ఏడాది మే 21వ తేదీ అంతర్జాతీయ టీ దినోత్సవం( International Tea Day! జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21, 2019న తీర్మానించింది. దీంతో ఏటా ఆహార, వ్యవసాయ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా మే 21వ తేదీని ఘనంగా నిర్వహిస్తున్నాయి. టీని ఉత్పత్తి చేయడం, వినియోగానికి అనుకూలమైన కార్యకలాపాలను అమలు చేసేందుకు సమిష్టి చర్యలు తీసుకోవడం, ప్రోత్సహించడం ఈ రోజు ప్రధాన లక్ష్యం.

    చరిత్ర
    ఈశాన్య భారతదేశం, ఉత్తర మయన్మార్, నైరుతి చైనాలో ఈ టీ (Tea) ఉద్భవించిందని చాలా మంది నమ్ముతారు. కచ్చితమైన ప్రదేశం తెలియనప్పటికీ 5వేల ఏళ్ల క్రితం చైనాలో మొదటిసారిగా టీ తాగినట్టు కొన్ని ఆధారాలున్నాయి. భారతదేశంతో పాటు శ్రీలంక, నేపాల్, వియత్నాం, ఇండోనేషియా, బంగ్లాదేశ్, కెన్యాస మలావి, మలేషియా, ఉగాండా, టాంజానియా వంటి టీ ఉత్పత్తి దేశాల్లో 2005నుంచి అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆ రోజున టీ ఉత్పత్తి చేసే దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన పెంచడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీ వర్కర్స్ సంస్థలు సెమినార్లు, పబ్లిక్ ఈవెంట్‌లను నిర్వహిస్తూ సమావేశమవుతాయి.

    పొద్దుపొద్దునే వేడి వేడి చాయ్‌ కడుపులో పడితేగానీ హాయిగా ఉండదు చాలామందికి. ప్రపంచంలో ఎక్కువ మంది వినియోగించేది టీ. చుట్టాలు వచ్చినా ముందుగా గుర్తొచ్చొది టీ. అలాంటి టీలో ప్రపంచం నలుమూలల ఉన్న వెరైటీలు ఏంటో చూద్దామా..

    మాచా, జపాన్: గ్రీన్‌ టీ ఆకులతో ప్రాసెస్‌ చేసిన టీ పొడి. ఆకుపచ్చరంగులో ఉండే టీ. జపాన్‌లో ఈ టీ బాగా ఫేమస్‌. ఇది మట్టి రుచిని కలిగి ఉంటుంది. ముందు సిప్‌ చేస్తే చేదుగా ఉండి రానురాను మాధుర్యంగా ఉంటుంది. దీన్ని ఐస్‌డ్‌ టీ, ఐస్‌క్రీమ్‌లు, ఇతర డెజర్ట్‌లలో కూడా ఉపయోగించింది.

    టెహ్ తారిక్, మలేషియా: టెహ్ తారిక్ అనేది మలేషియా నుంచి వచ్చిన ఒక ప్రసిద్ధ వేడి పాల టీ పానీయం. సాధారణంగా నురుగుతో ఉంటుంది. 'తే తారిక్' అనే పేరుకు "తీసి తీసిన టీ" అని అర్ధం. ఈ తీపి టీలో ఉడికించిన, స్ట్రాంగ్‌ బ్లాక్ టీ, ఆవిరైన క్రీమర్, పాలు ఉంటాయి. మరింత రుచిగా ఉండేలా ఏలకులను కూడా జోడించవచ్చు. 

    చా యెన్, థాయిలాండ్: చా యెన్ ఒక ప్రసిద్ధ థాయ్ ఐస్‌డ్ టీ. ఇది మంచి రిఫ్రెష్ నిచ్చే పానీయం. ఇది బ్లాక్ టీ, రూయిబోస్ టీ, స్టార్ సోంపు, లవంగాలు, దాల్చినచెక్క, ఏలకులు, పాలు, పంచదారతో తయారు చేసే పానీయం. ఇది తీపి, క్రీము, సుగంధ రుచిని కలిగి ఉంటుంది. దీన్ని కొబ్బరి పాలను ఉపయోగించి కూడా తయారు చేసుకోవచ్చు. చా యెన్‌ని ఐస్‌ముక్కలతో సర్వ్‌ చేస్తారు.

    మసాలా చాయ్: భారతదేశం ఇది చాలా ఫేమస్‌.  చాలా మంది భారతీయులు తమ రోజును ప్రారంభించేందుకు లేదా సాయంత్రం విశ్రాంతి తీసుకోనే టైంలో ఈ మసాలా చాయ్‌ని ఆస్వాదిస్తారు. ఇది బిస్కెట్లు, రొట్టెలు లేదా పకోరస్ వంటి భారతీయ స్నాక్స్‌తో కూడా బాగా జత చేస్తుంది. మసాలా చాయ్‌ని మొదటగా వేడినీటిలో  ఆకుపచ్చ ఏలకులు, లవంగాలు, దాల్చినచెక్క, నల్ల మిరియాలు, అల్లం, సోపు గింజలు వంటి మొత్తం మసాలా దినుసులను  టీ ఆకులు వేసి బాగా మరిగిస్తారు. ఆ తర్వాత  పాలు జోడించి, కావాల్సిన రంగు వచ్చేలా టీని తయారు చేసుకోవాలి. చాలా మంది ప్రజలు తమ కప్పు మసాలా చాయ్‌ను ప్రిపేర్‌ చేసేందుకు చక్కెర లేదా బెల్లం కూడా కలుపుతారు.

    సిలోన్ బ్లాక్ టీ, శ్రీలంక: సిలోన్ అనేది శ్రీలంకకు పూర్వపు పేరు, దీనిని ఇప్పటికీ టీ వ్యాపారంలో ఉపయోగిస్తున్నారు. శ్రీలంకకు చెందిన ఈ బ్లాక్ టీ స్ట్రాంగ్‌ రుచిని కలిగి ఉంటుంది. ఇది పూల వాసనలా ఉండి గొప్ప రంగును కలిగి ఉంటుంది. దీన్ని కూల్‌గా లేదా వెచ్చగా ఆస్వాదించవచ్చు.  
    మీరు దీన్ని ఐస్‌డ్ టీ లేదా వెచ్చని బ్లాక్ టీగా ఆస్వాదించవచ్చు. 
     

  • బీచ్‌లు అనగానే మనకు సాధారణంగా  గోవా, వైజాగ్‌ లాంటి ప్రదేశాలు ప్రధానంగా గుర్తుకు వస్తాయి. కానీ   భారతదేశానికి తూర్పున ఉన్న రాష్ట్రం, 480 కి.మీ పొడవైన అందమైన తీర ప్రాంతం ఉన్న ఒడిషా  కూడా అందమైన బీచ్‌లకు ప్రకృతి రమణీయ దృశ్యాలకు నిలయం. అందమైన తీరప్రాంతం, పురాతన దేవాలయాలు, గిరిజన సంస్కృతి ,వన్యప్రాణుల అభయా రణ్యాలున్నాయి ఇక్కడ. ఓడిషాలోని 7 అందమైన బీచ్‌ల  గురించి తెలుసుకుందాం.<

     1. పూరి బీచ్

    ఒడిశాలోని అత్యంత ప్రసిద్ధ బీచ్‌లలో ఒకటి పూరీ బీచ్. బీచ్ ప్రేమికులు ,ఆధ్యాత్మిక అన్వేషకులు ఒడిషాలో దీన్ని టాప్ బీచ్‌గా భావిస్తారు.  సముద్ర తీరం, గోల్డెన్‌ ఇసుక ఇక్కడి ప్రత్యేకం.   అంతేకాదు  అద్భుతమైన సూర్యోదయాలు ,సూర్యాస్తమయ దృశ్యాలను అస్సలు మిస్‌ కాకూడదు. సమీపంలోని జగన్నాథ ఆలయం మరో పెద్ద ఆకర్షణ.

    2. అస్తరంగ బీచ్‌

    పూరీ నగరానికి దగ్గరగా ఉన్న మరో బీచ్, అస్తరంగ బీచ్. ప్రశాంత వాతావరణం, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. చుట్టూ పెద్దగా ఫిషింగ్ కమ్యూనిటీలు ఉన్నాయి. ఈ బీచ్ పక్షులను వీక్షించడానికి బాగా ఇష్టపడే ప్రదేశం.పర్యాటకులు అక్కడ వివిధ రకాల వలస పక్షుల జాతులను చూడ్డానికి వస్తారు.

    3 ఉన్నట్టుండి మాయమయ్యే  చాందీపూర్  బీచ్‌

    ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఉన్న చాందీపూర్ బీచ్ దేశంలోనే అరుదైన బీచ్‌గా ప్రత్యేక గుర్తింపు సాధించింది. బాలాసోర్ రైల్వే స్టేషన్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ బీచ్ చూడటానికి ఇతర బీచ్‌ల మాదిరే. కానీ నమ్మడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా  ఈ బీచ్‌ అకస్మాత్తుగా మాయమైపోతుందిట. ఈ బీచ్‌లో భారీ అలలు ఆటుపోట్లకు గురైనప్పుడు సముద్రపు నీరు సుమారు  5 కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్లిపోతుంది. దీంతో అది అక్కడికి వచ్చేవారిని సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తుతుంది. మనం చూస్తున్నంత సేపు కనిపించిన సముద్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా కనపడకుండా పోతుండటం విశేషం. మోనాజైట్ , టైటానియం అధికంగా ఉండే నల్ల ఇసుక, సరుగుడు చెట్లతో నిండి ఉంటుంది.  ముఖ్యంగా పిక్నిక్‌లు  పక్షులను చూడటం ఇష్టపడేవారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌.

    4. గోపాల్‌పూర్ బీచ్

    ఒడిశాలోని దక్షిణ భాగంలో ఉన్న గోపాల్‌పూర్ బీచ్.  ప్రశాంతత, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది.   తెల్లటి ఇసుక,  కొబ్బరి చెట్లతో గోపాల్‌పూర్ బీచ్ ఒడిషాలో సందర్శించడానికి ఉత్తమమైన బీచ్‌లలో ఒకటి. ఇక్కడ ఈత కొట్టవచ్చు, చేపలు పట్టవచ్చు.అందుకే  ఇది చాలా పాపులర్‌ అయింది.  ఇక్కడ నౌకాశ్రయం కూడా ఉంది.

    5. రాంచండీ బీచ్, కోణార్క్
    కోణార్క్ పట్టణానికి దగ్గరగా ఉన్న రాంచండి బీచ్ .  UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశం గుర్తింపు పొందిన కోణార్క్ సూర్య దేవాలయానికి ఆనుకొని ఉన్నందున బీచ్‌ అందాలతోపాటు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈబీచ్‌ వద్ద ఈత, సన్‌బాత్‌, బోటింగ్‌ ఫిషింగ్‌ లాంటివి ఇక్కడ ఎంజాయ్‌ చేయవచ్చు.

    6. బలిఘై బీచ్, పూరి

    పూరీ నగరానికి దగ్గరగా ఉన్న బలిఘై బీచ్  స్పష్టమైన నీలి జలాలకు ప్రసిద్ధి. చుట్టూ పచ్చని అడవులు, బంగాళాఖాతం యొక్క ఉత్కంఠభరితమైన దృశ్యాలను అందిస్తుంది. ఒంటె , గుర్రపు స్వారీలతోపాటు, బీచ్‌లో తాజా సీఫుడ్ , ప్రాంతీయ వంటకాలను విక్రయించే అనేక చిన్న ఫుడ్‌ సెంటర్లలో ఆస్వాదించవచ్చు.

    7. తలసరి  బీచ్‌

    తలసరి పేరు రెండు ఒడియా పదాలైన తల ( పామ్ లేదా తాటి)సరి(వరుస) నుండి వచ్చింది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న తాటి చెట్లు ఎక్కువ ఉండటం వల్లే ఈ  పేరు వచ్చిందని చెబుతారు.  తాలా అనే పదానికి లయ అని కూడా అర్థం, ఇది తీరానికి వ్యతిరేకంగా వచ్చే సముద్రపు అలలలో ప్రతిబింబిస్తుందని భావిస్తారు.

    సువర్ణరేఖ నది  తలసరి బీచ్ ఆకర్షణను  రెట్టింపుచేస్తుంది. దీనితోటు ఇసుక దిబ్బలు, ఎర్ర పీతలు ఆరో ఆకర్షణ. ఈ బీచ్‌కు సమీపంలో ఉన్న బిచిత్రపూర్‌లోని ఫిషింగ్ పల్లెలు, మడ చెట్లు  టూరిస్టులను ఆకర్షిస్తాయి.

     

International

  • వాషింగ్టన్‌: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడం వెనుక మరొకరి పాత్ర లేదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాధ్యూ మిల్లర్‌ స్పష్టం చేశారు. 45 ఏళ్ల నాటి హెలికాప్టర్‌ను ఉపయోగించాలనుకోవడం.. అది కూడా వాతావరణం సరిగా లేని సమయంలో ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. 

    అంతకుముందు ఇరాన్‌ విదేశాంగ శాఖ మాజీ మంత్రి జావెద్‌ మాట్లాడుతూ హెలికాప్టర్‌ విడిభాగాల సరఫరాపై అమెరికా విధించిన ఆంక్షల వల్లే తమ అధ్యక్షుడు మరణించారన్నారు. కాగా, రైసీ మృతికి కారణమైన బెల్‌ 212 హెలికాప్టర్‌లో సిగ్నల్‌ వ్యవస్థ ప్రధాన లోపంగా కనిపిస్తున్నట్లు టర్కీ రవాణశాఖ మంత్రి అబ్దుల్‌ ఖదీర్‌ తెలిపారు. 

    హెలికాప్టర్‌లో సిగ్నల్‌ వ్యవస్థ పని చేయడం లేదని, అసలు సిగ్నల్‌ వ్యవస్థ ఉందో లేదో కూడా తెలియదన్నారు. హెలికాప్టర్‌ సిగ్నల్‌ కోసం తాము తొలుత  ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. వీవీఐపీలు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లలో సిగ్నల్‌ వ్యవస్థ ఉండి తీరాలని ఖదీర్‌ అన్నారు. 

     

  • న్యూయార్క్‌: అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ICC)నుంచి  ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు, హమాస్‌ అగ్రనేతలపై అరెస్టు వారెంట్లు ఇవ్వాలని కోరిన చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ కరీం ఖాన్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మండిపడ్డారు. గాజాలో ఇజ్రాయెల్‌ సైన్యం దాడులతో మారణ హోమం సృష్టిస్తుందన్న కరీం ఖాన్‌ ఆరోపణలను బెడెన్‌ తీవ్రంగా ఖండించారు.  వైట్‌హౌజ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జో బైడెన్‌ మాట్లాడారు.

    ‘‘గాజాలో జరగుతున్నది.. మారణహోమం కాదు. అటువంటి ఆరోపణలను మేము తిరస్కరిస్తున్నాం. అక్టోబర్‌ 7న హమాస్‌ మిలిటెంట్లు చేసిన మెరుపు దాడుల్లో  ఇజ్రాయెల్‌ బాధిత పక్షంగా మిగిలింది. హమాస్‌ దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్‌ అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, కొందరు హమాస్‌ చెరలో ఇంకా బంధీలుగా ఉన్నారు. 

    .. మేము(అమెరికా) ఇజ్రాయల్‌ రక్షణ, భద్రత కోసం కట్టుబడి ఉంటాం. హమాస్‌ మిలిటేంట్లను అంతం చేసేవరకు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తాం. హమాస్‌ ఓడిపోవటమే మా లక్ష్యం. హమాస్‌ను ఒడించేందుకు ఇజ్రాయెల్‌ కోసం పనిచేస్తాం. హమాస్‌ నుంచి ఇజ్రాయెల్‌ బంధీల విడుదల విషయంలో వెనక్కి తగ్గము’’ అని బెడెన్‌ అన్నారు. మరోవైపు..  గాజాలో తక్షణ కాల్పుల విరమణ జరగాలని బైడెన్‌ పేర్కొనటం గమనార్హం.

    గాజా, ఇజ్రాయెల్‌లో యుద్ధ నేరాలు, మానవాళిపై అకృత్యాలకు గాను నెతన్యాహు, ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గాలంట్, హమాస్‌ నేతలు యోహియా సిన్వర్, మహ్మద్‌ దీఫ్, ఇస్మాయిల్‌ హనియేహ్‌లు బాధ్యులని చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ కరీం ఖాన్‌ అన్నారు. వారికి అరెస్టు వారెంట్లు ఇవ్వాలని ఐసీసీని కోరిన విషయం తెలిసిందే.

Technology

  • సైబర్‌ నేరస్తులు బెంగళూరులోని ఆర్‌బీఐ ఉద్యోగిని నిండా ముంచారు. అందిన కాడికి రూ.24.5లక్షలు దోచుకున్నారు.  

    నగరంలోని కన్నింగ్‌హామ్ రోడ్ ప్రాంతంలో నివసించే ఆర్‌బీఐ ఉద్యోగికి లాజిస్టిక్స్‌లో ఎగ్జిక్యూటివ్‌ పేరుతో ఓ అగంతకుడు ఆమెకు కాల్‌ చేశాడు. మేడం.. మీ పేరుతో ఓ పార్శిల్‌ వచ్చింది. ఆ పార్శిల్‌లో ముంబైలో ఐదు పాస్‌పోర్ట్‌లు, 5 కిలోల బట్టలు, మూడు క్రెడిట్ కార్డ్‌లతో పాటు ఇతర అనుమానాస్పద వస్తువులు ఉన్నాయి.  

    ముంబై పోలీసులు మీ పార్శిల్‌పై ఆరా తీశారు. ఈ కాల్‌ను ఇప్పుడే వాళ్లకు ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నాం..అంటూ ప్లాన్‌ ప్రకారం.. కాన్ఫిరెన్స్‌ కాల్‌లో మరో సైబర్‌ నేరస్తుడు లైన్‌లోకి వచ్చాడు. తనిను తాను ముంబై సీనియర్ పోలీస్‌ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఆ పార్శిల్‌ విదేశానికి సంబంధించింది. అది మీ పేరుమీద ఉంది. మీ ఆధార్ కార్డును ఐడి ప్రూఫ్‌గా ఉపయోగించారని అన్నాడు. మీ బ్యాంక్‌ అకౌంట్‌ను మనీ ల్యాండరింగ్‌కు ఉపయోగించారని మరింత బయపెట్టించాడు.

    ఈ కేసు సున్నిమైంది ఎవరికి చెప్పొద్దు. మీ బ్యాంక్‌ అకౌంట్‌ను పరిశీలిస్తున్నాం. ఆ అకౌంట్‌లో ఉన్న మొత్తాన్ని మేం చెప్పిన బ్యాంక్‌ అకౌంట్‌కు పంపించండి. విచారణ పూర‍్తయిన వెంటనే మీ డబ్బుల్ని మీకు పంపిస్తామని హామీ ఇచ్చాడు. సైబర్‌ నేరస్తుడి మాటల్ని నమ్మని బాధితురాలు తొలిసారి రూ.14.2 లక్షలు, రెండో సారి మరో అకౌంట్‌కు రూ.5.5 లక్షలు, మూడో అకౌంట్‌కు రూ.4.8 లక్షలు పంపింది. మొత్తంగా రూ.24.5లక్షల ట్రాన్స్‌ ఫర్‌ చేసింది. అయితే మరుసటి రోజు తాను మోసపోయానని గ్రహించిన ఆ మహిళ అదే రోజు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.