16 ఏళ్ల వయసులో ఛాన్సుల కోసం వెళ్తే.. అమ్మ ముందే ఇలా అడిగారు: వితికా | Sakshi
Sakshi News home page

16 ఏళ్ల వయసులో ఛాన్సుల కోసం వెళ్తే.. అమ్మ ముందే ఇలా అడిగారు: వితికా

Published Fri, May 3 2024 5:33 PM

Vithika Sheru Comments Her Movie Chances

టాలీవుడ్‌లో తక్కువ సినిమాలే చేసినప్పటికీ  వితికా షెరు అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. భీమవరంలో జన్మించిన ఈ బ్యూటీ మొదట కన్నడ చిత్ర సీమలో ఎంట్రీ ఇచ్చింది. తన 15వ ఏట 2008లో 'అంతు ఇంతు ప్రీతి బంతు' (తెలుగు సినిమా ఆడవారి మాటలకు అర్థాలే వేరులేలో కలర్స్ స్వాతి పాత్ర) కన్నడ చిత్రంతో సినీరంగ ప్రవేశంచేసింది. ఆ తర్వాత తెలుగు చిత్ర సీమలో రాణించాలని టాలీవుడ్‌వైపు అడుగులు వేసింది. తనకు 16 ఏళ్ల వయసులో తెలుగు సినిమా ఆడిషన్స్‌ కోసం వెళ్తే తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది.

కన్నడ సినిమా తర్వాత తెలుగులో అవకాశాల కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరిగినట్టు అప్పటి రోజులను వితికా గుర్తుచేసుకుంది. కానీ ప్రస్తుతం మాత్రం ఇన్‌స్టాలో ఫోటోలు,రీల్స్‌ పెట్టినా ఛాన్సులు వస్తున్నాయని ఆమె తెలిపింది. కొంతమంది తన కలర్‌ తక్కువని కూడా రిజక్ట్‌ చేశారని ఇలా తెలిపింది. 'నా పేరు వితికా షెరు.. వినగానే కాస్త డిఫరెంట్‌గా ఉండటంతో అందరూ నన్ను నార్త్‌ అమ్మాయి అనుకుని ఆడిషన్స్‌కు పిలిచేవారు. కానీ, అక్కడికి వెళ్లిన తర్వాత ఓహ్‌.. తెలుగు అమ్మాయివేనా అంటూ కాస్త చులకన చేసి మాట్లాడేవారు. 

నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు మా అమ్మతో కలిసి ఆడిషన్స్‌ ఇచ్చేందుకు వెళ్లాను. ఆ ప్రాజెక్ట్‌ కోసం నన్ను ఎంపిక కూడా చేశారు. అమ్మతో మాట్లాడాలి అంటూ కొంత సమయం తర్వాత నన్ను బయటకు పంపించారు. అమ్మాయికి సినిమాలో ఛాన్సు కావాలంటే నిర్మాతల సైడ్‌ నుంచి కమిట్‌మెంట్‌ విషయంలో చాలా ఒత్తిడి ఉంటుంది అన్నారు. దాని గురించి అమ్మకు తెలియకపోవడంతో పాపను పిలవండి అని చెప్పింది. దీంతో నేను కూడా అతని ముందుకు వచ్చాను. కమిట్‌మెంట్‌ అంటున్నారు ఎంటో తెలియడం లేదు మాట్లాడు అని నాతో  అమ్మ చెప్పింది. వారి ప్రపోజల్‌కు నేను నో చెప్పాను. సార్‌, రెమ్యునరేషన్‌ ఇవ్వకపోయినా పర్వాలేదు ఛాన్స్‌ ఇవ్వండి అని కోరాను. 

కానీ, ఇలాంటి కమిట్‌మెంట్‌ వంటి కండీషన్‌కు ఒప్పుకోను అని చెప్పాను. అలా 16 ఎళ్ల వయసులోనే నేను ఇలాంటి సంర్భాన్ని ఎదుర్కొన్నాను. వాళ్ల సినిమా ఆఫీస్‌ కూడా హైదరాబాద్‌లోని శ్రీనగర్‌లోనే ఉండేది. మాకు బాగా తెలిసిన వారే నన్ను కమిట్‌మెంట్‌ అడిగారు.' అని వారి పేర్లు చెప్పకుండా వితికా దాటవేసింది. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం కష్టమని సినిమాల నుంచి తాను దూరం అయినట్లు ఆమె పేర్కొంది. కొంత కాలం తర్వాత యంగ్‌ హీరో వరుణ్ సందేశ్‌ను ప్రేమించి 2016, ఆగస్టు 19న వితిక వివాహం చేసుకుంది. ప్రస్తుతం తను పూర్తిగా కుటుంబ బాధ్యతలతో లీడ్‌ చేస్తుంది. 

Advertisement
Advertisement