ఆస్ట్రాజెనెకాకు మరో షాక్‌, ఈ వాక్సీన్‌తోనే బిడ్డను కోల్పోయా ఓ తండ్రి కోర్టుకు | Sakshi
Sakshi News home page

ఆస్ట్రాజెనెకాకు మరో షాక్‌, ఈ వాక్సీన్‌తోనే బిడ్డను కోల్పోయా ఓ తండ్రి కోర్టుకు

Published Fri, May 3 2024 4:56 PM

Parents To Sue AstraZeneca Over Daughter's Alleged Death After Taking Covishield

కోవిడ్‌ వ్యాక్సీన్‌ను తయారు చేసిన ప్రముఖ ఫార్మా కంపెనీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కోవిషీల్డ్   వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత  తమ కుమార్తె చనిపోయిందని ఆరోపిస్తూ ఒక యువతి తల్లిదండ్రులు సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)పై దావా వేశారు. బ్రిటన్‌కి చెందిన ఫార్మా దిగ్గజంపై  పిటీషన్‌ దాఖలు చేశారు.

ఇటీవల ఫార్మా సంస్థ ఆస్ట్రాజెన్‌కా తమ వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డ కట్టడం, తక్కువ ప్లేట్ లెట్ కౌంట్‌కి సంబంధించి అరుదైన దుష్ప్రభావాల ఆరోపణలు, వీటిని  ఆస్ట్రాజెన్‌కా కూడా అంగీకరించిన  తరువాత  ఈ పరిణామం చోటుచేసుకుంది.

 కారుణ్య పుట్టిన రోజు మే 1. మా తొలి వివాహ వార్షికోత్సవ గిప్ట్‌ నా పాప. ఇపుడు అందనంతదూరంలో- వేణుగోపాల్‌ 

తమ 20 ఏళ్ల  కుమార్తె కారుణ్య  కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ తర్వాత జూలై 2021లో మరణించిందని తండ్రి వేణుగోపాలన్‌ గోవిందన్‌ ఎక్స్‌లో  ఆరోపించారు. డేటా సైన్స్ స్టూడెంట్ కారుణ్య టీకా తీసుకున్న ఒక నెల తర్వాత  అనారోగ్యానికి గురైంది. వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత ఆమె మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమెటరీ సిండ్రోమ్ కారణంగా మరణించింది. వ్యాక్సిన్ తీసుకున్న 8 రోజుల తర్వా ఆమె తీవ్రమైన సంస్యల బారినపడిందని, నెల తర్వాత మరణించిందని తండ్రి వేణుగోపాల్ గోవిందన్‌ ఆరోపించరాఉ. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని  పేర్కొన్నారు.

అలాగే ఇంత నష్టం జరిగిన  తరువాత ఆస్ట్రాజెన్‌కా తప్పు ఒప్పుకోవడంపై వేణుగోపాలన్‌ మండి పడ్డారు.  రక్తం గడ్డకట్టడం వల్ల సంభవించే మరణాలపై 15 యూరోపియన్ దేశాలు  వ్యాక్సీన్‌ వినియోగాన్ని పరిమితం చేసిన తర్వాత సీరం ఇన్‌స్టిట్యూట్ వ్యాక్సిన్ సరఫరాని నిలిపేయాల్సి ఉండాల్సిందని ఆయన అన్నారు. తల్లిదండ్రులు న్యాయం కోసం వివిధ న్యాయస్థానాల్లో పోరాడుతున్నప్పటికీ విచారణకు నోచుకోవడం లేదని తన పోస్టులో పేర్కొన్నారు. 8 మంది బాధిత కుటుంబాల తరుపున తమ భావాలను ప్రతిధ్వనిస్తున్నామని వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయినందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు అదార్ పూనావాలా వారి పాపాలకు సమాధానం చెప్పవలసి ఉంటుందని అన్నారు. అలాగే వ్యాక్సిన్‌ని వినియోగంలోకి తీసుకువచ్చిన ప్రభుత్వ అధికారులను కూడా ఆయన నిందించారు. ఈ మేరకు వేణుగోపాలన్‌ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు. అయితే దీనిపై సీరం  నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

 2021లో తమ కుమార్తె రితైక(18)ను కోల్పోయిన రచనా గంగూ కుమార్తె మరణంపై విచారణ జరిపేందుకు మెడికల్ బోర్డును నియమించాలని కోరుతూ గతంలో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలులు చేశారు. ఆస్ట్రాజెనెకా ఇప్పటికే యూకేలో క్లాస్ యాక్షన్ దావాను ఎదుర్కొంటోంది.

కాగా వ్యాక్సిన్‌ వల్ల థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS)తో థ్రాంబోసిస్‌తో సహా మరణాలు మరియు తీవ్రమైన గాయాలు సంభవించాయని ఆరోపిస్తూ క్లాస్-యాక్షన్ దావా నుండి చట్టపరమైన చర్యను ఎదుర్కొంటోంది ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి అభివృద్ధి చేసిన కోవిడ్-19  ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారతదేశంలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ‘కోవిషీల్డ్’ పేరుతో తయారు చేసి, విక్రయించిన సంగతి తెలిసిందే. 
 

Advertisement
 
Advertisement