త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం | Acharya Pramod Krishnam Says Split In Congress Very Soon, More Details Inside | Sakshi
Sakshi News home page

Acharya Pramod Krishnam: త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది

Published Sat, May 4 2024 6:34 PM

Split in Congress Very Soon Says Acharya Pramod Krishnam

ఢిల్లీ: మార్చిలో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆచార్య ప్రమోద్ కృష్ణం తాజాగా.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయడంపై విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ త్వరలో రాహుల్ గాంధీ వర్గంగా, ప్రియాంక గాంధీ వర్గంగా చీలిపోవచ్చని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న కుట్రలో ప్రియాంక గాంధీ బలి అయ్యారని కృష్ణం ఆరోపించారు. రాహుల్‌ గాంధీ అమేథీని వీడిన తీరు కాంగ్రెస్‌ కార్యకర్తల మనోధైర్యం తగ్గిపోయింది. ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఆమె మద్దతుదారుల కొంత నిరాశను మిగిల్చింది.

రాహుల్ గాంధీకి పాకిస్తాన్‌లో ప్రజాదరణ, డిమాండ్ పెరుగుతోంది. కాబట్టి రాయ్‌బరేలీకి బదులుగా రావల్పిండి నుంచి పోటీ చేయాలని నేను భావిస్తున్నాను అని ఆచార్య ప్రమోద్ కృష్ణం అన్నారు.

రాహుల్ గాంధీ.. ప్రియాంక గాంధీని ఎన్నికల్లో పోటీ చేయనివ్వరని నేను ముందే చెప్పాను. ప్రియాంక గాంధీపై కుటుంబంలో, పార్టీలో భారీ కుట్ర ఉంది. దీనికి ప్రియాంక గాంధీ బలైపోతోందని మాజీ కాంగ్రెస్ నేత ప్రమోద్ కృష్ణం అన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement