విజయ్‌ సేతుపతి కొత్త సినిమా.. టీజర్‌ చూశారా? | Sakshi
Sakshi News home page

విజయ్‌ సేతుపతి 51వ సినిమా.. టైటిల్‌ టీజర్‌ రిలీజ్‌

Published Sat, May 18 2024 1:14 PM

Vijay Sethupathi's Ace Movie First Look, Motion Poster Out

అభిమానుల గుండెల్లో మక్కల్‌ సెల్వన్‌గా నిలిచిపోయిన విజయ్‌ సేతుపతి పాన్‌ ఇండియా నటుడిగానూ సత్తా చాటుతున్నారు. ఆ మధ్య హిందీలో షారుక్‌ ఖాన్‌ హీరోగా నటించిన జవాన్‌ చిత్రంలో విలన్‌గా అదరగొట్టారు. ప్రస్తుతం ఆయన నటించిన తమిళ చిత్రం మహారాజ త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇది ఆయన నటించిన 50వ చిత్రం కావడం గమనార్హం.

హీరోయిన్‌ ఎవరంటే?
తన 51వ చిత్రానికి ఏస్‌ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా యోగిబాబు, పీఎస్‌. అవినాష్‌, దివ్యా పిళ్లై, బబ్లు, రాజ్‌కుమార్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆర్ముగకుమార్‌ దర్శకత్వంలో 7సీఎస్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతాన్ని, కరణ్‌ బహదూర్‌ చాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. 

కలర్‌ఫుల్‌ పోస్టర్‌
ఇందులో విజయ్‌ చేతిలో సిగార్‌, వెనుక భాగంలో స్మిమ్మింగ్‌ టబ్‌, చుట్టూ చదరంగం డైస్‌తో పోస్టర్‌ కలర్‌ఫుల్‌గా ఉంది. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో యోగిబాబు చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

 

 

చదవండి: ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement