ఓటీటీలో దూసుకెళ్తున్న వెన్నెల కిశోర్‌ సినిమా | Sakshi
Sakshi News home page

Chaari 111: ఓటీటీలో దూసుకెళ్తున్న ‘చారి 111’

Published Fri, Apr 26 2024 3:41 PM

Chaari 111 Got Huge Response On OTT Amazon Prime Video - Sakshi

కొన్ని సినిమాలు థియేటర్స్‌లో సరిగా ఆడకపోయినా.. ఓటీటీల్లో మాత్రం సూపర్‌ హిట్‌ అవుతున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాల విషయంలో ఇది బాగా జరుగుతోంది. బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. ఓటీటీల్లో మాత్రం ఊహించని రెస్పాన్స్‌ వస్తోంది. తాజాగా చారి 111 సినిమా విషయంలోనూ అదే జరిగింది. కమెడియన్‌ వెన్నెల కిశోర్‌ హీరోగా నటించిన ఈ చిత్రం మార్చి 1న థియేటర్స్‌లో విడుదలై పర్వాలేదనిపించుకుంది. సంయుక్త విశ్వనాథన్‌ గ్లామర్‌తో పాటు మురళీ శర్మ, సత్య, తాగుబోతు రమేశ్‌ల కామెడీకి మంచి మార్కులే పడినా.. బాక్సాఫీస్‌ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టలేపోయింది. దీంతో విడుదలైన నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. 

ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఓటీటీలోకి వచ్చి నెల రోజులైనా ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉండడం విశేషం. కామెడీ జోనర్‌లో ఈ చిత్రం టాప్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. పెద్ద హీరోల సినిమాలను మించి ‘చారి 111’ సుమారు 70 మిలియన్స్ కి పైగా వ్యూస్‌ మినిట్స్ సాధించడం గమనార్హం. ఓటీటీలో వస్తున్న ఆదరణ పట్ల నిర్మాత అదితి సోని ఆనందం వ్యక్తం చేశారు. 

‘చారి 111’ కథేంటి?
హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో హ్యూమన్ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి దగ్గర ఎలాంటి పేలుడు పదార్థాలు లభించవు. కానీ అతనే బ్లాస్ట్‌ అవుతాడు. ఇది ఉగ్రవాదుల పని.. వారి ప్లాన్‌ ఏంటో కనుక్కోవాలని సీక్రెట్‌ ఏజెన్సీ రుద్రనేత్రని ఆదేశిస్తాడు ముఖ్యమంత్రి(రాహుల్‌ రవీంద్రన్‌). రుద్రనేత్ర అనే సీక్రెట్‌ ఏజెన్సీ మేజర్ ప్రసాద్ రావు (మురళీ శర్మ) నడిపిస్తుంటాడు. అతని టీమ్‌లో పనిచేసే చారి(వెన్నెల కిశోర్‌)కి బాంబ్‌ బ్లాస్ట్‌ కేసుని అప్పగిస్తాడు. ఈ మిషన్‌ని చారి ఎలా పరిష్కరించాడు?  ఈ మిషన్‌లో ఏజెంట్‌ ఈషా(సంయుక్త విశ్వనాథన్‌) పాత్రేంటి? అసలు ఆత్మాహుతి దాడుల వెనుకున్నదెవరు? వారి లక్ష్యమేంటి? మహి, రావణ్‌లా ప్లాష్‌ బ్యాక్‌ స్టోరీ ఏంటి? ఏజెంట్ ప్రియా (పావని రెడ్డి), రాహుల్ (సత్య), శ్రీనివాస్ (బ్రహ్మజీ) పాత్రలు ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Advertisement
Advertisement