స్టార్క్‌ దెబ్బకు ఇషాన్‌ బౌల్డ్‌.. రితిక రియాక్షన్‌ వైరల్‌ | Sakshi
Sakshi News home page

స్టార్క్‌ దెబ్బకు ఇషాన్‌ బౌల్డ్‌.. రితిక రియాక్షన్‌ వైరల్‌

Published Sat, May 4 2024 9:35 AM

PC: Jio Cinema/BCCI

ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌‌ బ్యాటర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. హార్డ్‌ హిట్టర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తప్ప మిగిలిన వాళ్లలో ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.

ముఖ్యంగా టాపార్డర్‌ దారుణంగా విఫలమైంది. ఓపెనర్లు‌ ఇషాన్‌ కిషన్‌(13)- రోహిత్‌ శర్మ(11) పూర్తిగా నిరాశపరచగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ నమన్‌ ధిర్‌(11) కూడా చేతులెత్తేశాడు.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాలుగో నంబర్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(35 బంతుల్లో 56) ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన బ్యాటర్లు తిలక్‌ వర్మ(4), నేహాల్‌ వధేరా(6), హార్దిక్‌ పాండ్యా(1) పెవిలియన్‌కు క్యూ కట్టారు.

సూర్య ఒంటరి పోరాటం వృథా
సూర్య ఈ క్రమంలో ఒంటరి పోరాటం చేస్తున్న సూర్యకు తోడైన టిమ్‌ డేవిడ్‌(20 బంతుల్లో 24) నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇక టెయిలెండర్లు గెరాల్డ్‌ కోయెట్జీ(8), పీయూశ్‌ చావ్లా(0), జస్‌ప్రీత్‌ బుమ్రా(1 నాటౌట్‌) కూడా చేతులెత్తేయడంతో 145 పరుగులకే ముంబై కథ ముగిసిపోయింది.

ఫలితంగా కేకేఆర్‌ విధించిన 170 పరుగుల లక్ష్య ఛేదనలో విఫలమైన ముంబై వాంఖడేలో పన్నెండేళ్ల తర్వాత తొలిసారి కోల్‌కతా చేతిలో 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

ఈ పరాజయం ముంబై ఫ్యాన్స్‌ హృదయాలను ముక్కలు చేస్తే.. పందొమ్మిదో ఓవర్లో మూడు వికెట్లు తీసి పాండ్యా సేన పతనాన్ని శాసించిన మిచెల్‌ స్టార్క్‌ను చూసి కేకేఆర్‌ అభిమానులు మురిసిపోయారు.

అద్భుత రీతిలో బౌల్డ్‌ చేసి
ముంబైతో మ్యాచ్‌లో 3.5 ఓవర్లు బౌల్‌ చేసిన స్టార్క్‌ 33 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ను అద్భుత రీతిలో బౌల్డ్‌ చేయడం హైలైట్‌గా నిలిచింది. గంటకు 142.3 కిలో మీటర్ల వేగంతో స్టార్క్‌ విసిరిన బంతి లెగ్‌ స్టంప్‌ను ఎగురగొట్టింది.

అయినప్పటికీ స్టార్క్‌ పెద్దగా సెలబ్రేట్‌ చేసుకోలేదు. అయితే.. ఇషాన్‌ అవుట్‌ కాగానే ముంబై ఇండియన్స్‌ కోచ్‌ మార్క్‌ బౌచర్‌తో పాటు చీర్‌ గర్ల్స్‌.. ముఖ్యంగా రోహిత్‌ శర్మ భార్య రితికా సజ్దే ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ వైరల్‌గా మారాయి. ఇక ఇషాన్‌తో పాటు టిమ్ డేవిడ్‌, కోయెట్జీ, పీయూశ్‌ చావ్లా వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు స్టార్క్‌.‌  

చదవండి: అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్‌ పాండ్యా

Advertisement
 

తప్పక చదవండి

Advertisement