నమ్మక ద్రోహులు.. | Sakshi
Sakshi News home page

రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్‌సీపీకి వెన్నుపోటు 

Published Fri, Apr 26 2024 5:49 PM

Former YSRCP MLA Giddi Ishwari, former MP Kothapally Geetha resigned - Sakshi

పార్టీని ఫిరాయించిన మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ ఎంపీ కొత్తపల్లి గీత 

స్వప్రయోజనాలకు ప్రాధాన్యం 

2019 ఎన్నికల్లో ‘గిడ్డి’ ఘోర పరాజయం 

ఓటుతో బుద్ధి చెప్పిన గిరిజనులు 

నకిలీ ఎస్టీ కేసులో తప్పించుకునేందుకు టీడీపీకి చేరువైన గీత 

ఈ ఎన్నికల్లోనూ మళ్లీ వారికి ఎదురుకానున్న చేదు అనుభం

నమ్మక ద్రోహం పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ ఎంపీ కొత్తపల్లి గీత. వీరికి రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్‌సీపీకి ద్రోహం చేసి పార్టీ ఫిరాయించారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు వారికి బుద్ధిచెప్పారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన గిడ్డి ఈశ్వరి ఘోర పరాజయం పాలయ్యారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా గిరిజనులంతా వైఎస్సార్‌సీపీ వైపే నిలిచారు. మాజీ ఎంపీ కొత్తపల్లి గీతదీ అదే పరిస్థితి.  ఎన్నికైన నాటి నుంచి ఆమె వైఎస్సార్‌సీపీ ఆశయాలకు తిలోదకాలిచ్చి.. ఆర్థికంగా ఎదిగేందుకు.. కేసుల్లోంచి బయటపడేందుకు ప్రాధాన్యమిచ్చారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల బరిలో ఉన్న వీరికి గిరిజనులు మళ్లీ ఓటుతో బుద్ధి చెప్పనున్నారు.

సాక్షి, పాడేరు: మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.. మాజీ ఎంపీ కొత్తపల్లి గీత.. వీరు రాజకీయాలకు కొత్త అయినప్పటికీ ప్రజలకు సేవ చేసేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అవకాశం కలి ్పంచారు.  2014 ఎన్నికల్లో పాడేరు ఎమ్మెల్యేగా గెలుపొందిన గిడ్డి ఈశ్వరి, అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చి గిరిజనుల సమస్యలను పట్టించుకోలేదు. వ్యక్తిగత ఎదుగుదలను ఆశించిన వీరు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్‌సీపీకి నమ్మక ద్రోహం చేసి పార్టీ ఫిరాయించారు. ఆ తరువాత 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున పాడేరు అసెంబ్లీకి పోటీ చేసిన గిడ్డి ఈశ్వరి ఘోర పరాజయం పాలయ్యారు. ఈఎన్నికల్లో గిరిజను లు ఓటుతో తగిన గుణపాఠం చెప్పి తాము జగనన్న వెంటే ఉన్నామని మళ్లీ నిరూపించారు. 

‘గిడ్డి’ చేరికతో గ్రూపుల మయం 
మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరికతో పాడేరు అసెంబ్లీలో ఆ పార్టీ గ్రూపులుగా విడిపోయింది. ఆది నుంచి పారీ్టలో ఉన్నవారిని పక్కనబెట్టి స్వార్థ రాజకీయాలకు ఆమె తెరలేపారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీంతో సీనియర్లంతా ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆమెకు మద్దతు ఇచ్చేది లేదని ఇప్పటికే వారంతా బహిరంగంగా ప్రకటించడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ప్యాకేజీ..ప్రలోభాలకు లోనై వైఎస్సార్‌సీపీని వీడారని అప్పట్లో ఆమెపై జోరుగా ప్రచారం సాగింది. రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్‌సీపీకి నమ్మక ద్రోహం చేయడం.. టీడీపీలో సీనియర్లకు ఝలక్‌ ఇవ్వడం వంటి అంశాలు ఈ ఎన్నికల్లో ఆమెకు నష్టం చేయవచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
  
చంద్రబాబు తల నరుకుతానని హెచ్చరిక 
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోతో 2014లో పాడేరు ఎమ్మెల్యేగా గెలిచిన గిడ్డి ఈశ్వరి వైఎస్సార్‌సీపీకి ద్రోహం చేశారు. 2015లో బాక్సైట్‌ వ్యతిరేక పోరాటంలో భాగంగా ఆమె చింతపల్లి వద్ద అప్పటి సీఎం చంద్రబాబు తల నరుకుతానని  హెచ్చరించడం అప్పటిలో సంచలనమైంది. తరువాత ఆమె అదే పార్టీలో చేరడంతో విమర్శలు వెల్లువెత్తాయి.  

► ఆర్థిక, రాజకీయ అవసరాలకు తలొగ్గిన ఈశ్వరి 2017 నవంబర్‌లో టీడీపీలో చేరారు. టీడీపీ ప్రభుత్వంలో రాజకీయంగా లబ్ధి పొందినప్పటికీ గిరిజనుల ఆదరణ కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన ఆమె వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొట్టగుళ్లి భాగ్యలక్షి్మకి పోటీ ఇవ్వలేకపోయారు.   

కేసు నుంచి తప్పించుకునేందుకు.. 
అరకు మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత 2014 ఎన్నికల తరువాత నకిలీ ఎస్టీ కేసును ఎదుర్కొన్నారు. ఎస్టీలోని వాలీ్మకి కులస్తురాలని వైఎస్సార్‌సీపీని నమ్మించి 2014లో అరకు పార్లమెంట్‌ సీటు పొందారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో గిరిజనులు ఆమెను 91,398 ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించారు. ఆ ఎన్నికల్లో ఓటమి చెందిన టీడీపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి అరకు ఎంపీ గీత ఎస్టీ కాదని ఆమెపై కోర్టులో కేసు వేశారు. ఆమె ఎస్టీ కాదని, నకిలీ ధ్రువపత్రంతో చదువులు, ఉద్యోగం, పదవులను అక్రమంగా అనుభవించారని ఆధారాలు చూపిస్తూ సంధ్యారాణి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె 2015లో టీడీపీకి చేరువైంది. ఈమెపై కోర్టులో కేసు పెట్టిన సంధ్యారాణి ఉపసంహరించుకున్నారు. కేసునుంచి బయట పడేందుకే టీడీపీతో చేతులు కలిపారన్న విమర్శలను ఆమె ఎదుర్కొన్నారు.  

బ్యాంక్‌నుమోసగించారని.. 
► పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను మోసగించిన కేసులో భర్తతోపాటు ఆమెకు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధించింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించి బెయిల్‌ పొందారు. బ్యాంకును మోసగించి రూ.42 కోట్ల మేర రుణం పొందారన్నది వారిపై అభియోగం.   

► తెలంగాణలోని రాయదుర్గం సమీపంలో వందెకరాల భూవివాదంలో ఆమె పాత్రపై కేసు నడుస్తోంది.  

గిరిజన సంక్షేమానికి దూరం
కొత్తపల్లి గీత ఎంపీగా ఉన్న సమయంలో అరకు పార్లమెంట్‌ పరిధిలోని గిరిజనుల సంక్షేమాన్ని విస్మరించారు. ఓట్లు వేసి గెలిపించిన గిరిజనులకు కూడా ద్రోహం చేశారు. టీడీపీతో అవసరం తీరాక సొంతంగా జన జాగృతి పేరుతో పార్టీని పెట్టారు.  2019లో విశాఖ ఎంపీ స్థానానికి పోటీచేసిన ఆమె ఘోర పరాజయం పాలయ్యారు. కేవలం 1500 లోపు మాత్రమే ఓట్లు వచ్చాయి.  ఆ తరువాత ఈ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకున్న ఆమె వారి సహకారంతో బీజేపీ నేతగా మారారు. 

ఇప్పుడు అరకు ఎంపీ అభ్యర్థిగా ఆ పారీ తరఫున బరిలో ఉన్నారు. టీడీపీ వ్యవహారాల్లో కూడా ఆమె తలదూర్చుతున్నారని ప్రచారం జరుగుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు రగిలిపోతున్నాయి. పాడేరు, అరకు నియోజకవర్గాల్లో టీడీపీ ముఖ్య నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్‌సీపీకి ద్రోహం చేసిన వీరి పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. మళ్లీ గతంలో మాదిరిగా అదే ఫలితం ఎదురుకానుంది.

Advertisement
Advertisement