-
టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని చెప్పినా పోలీసులు స్పందించలేదు: అనిల్ కుమార్
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల కమిషన్ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎంల ధ్వంసం వీడియోలను ఎవరు బయటపెట్టారో చెప్పాలన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్.కాగా, అనిల్ కుమార్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన కుమారుడిపై కూడా దాడులు చేశారు. పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. చింతపల్లిలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. తుమ్మురుకోట, వబుచెర్లలో ఈవీఎంలు ధ్వంసం చేశారు. టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని పోలీసులకు చెప్పినా స్పందించలేదు. పాల్వాయి గేటు ప్రాంతంలో టీడీపీ నేతలు విధ్వంసం చేశారు. టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రాలేదు?. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు.ఎనిమిది చోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే ఒక్కటే ఎందుకు బయటకు వచ్చింది. ఈవీఎం ధ్వంసం వీడియోలను ఎవరు బయటపెట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను కొడుతున్న వీడియోలు ఈసీని కనపడలేదా?. పోలింగ్ రోజు పోలీసుల వైఖరి ఈసీకి కనపడలేదా?. ఈసీ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈసీ తీరుపై న్యాయ పోరాటం చేస్తాం. టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడిన చోట్ల రీపోలింగ్ పెట్టాలి’ అని డిమాండ్ చేశారు. -
మాచర్లలో మరో టెన్షన్.. భారీ కుట్రకు ప్లాన్!
ఎన్నికల పోలింగ్ హింసాత్మక ఘటనల నుంచి తేరుకోవడానికి.. ప్రశాంతత నెలకొనేందుకు పల్నాట నాలుగురోజుల సమయం పట్టింది. అలాంటి చోట మళ్లీ అల్లర్లకు తెలుగు దేశం పార్టీ కుట్రలు చేస్తోందా?. వద్దని పోలీసులు వారిస్తున్నా చలో మాచర్ల చేపట్టం వెనుక ఆంతర్యం ఏమిటి?. 👉టీడీపీ కీలక నేతల గృహనిర్బంధంమాచర్లలో టీడీపీ ‘చలో మాచర్ల’కు అనుమతి లేదని పోలీసుల స్పష్టీకరణఉద్రిక్తతలు తలెత్తకుండా సహకరించాలని జిల్లా ఎస్పీ మలికా గార్గ్ విజ్ఞప్తిమాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతల గృహ నిర్బంధం గొల్లపూడిలో దేవినేని ఉమ, విజయవాడలో వర్ల రామయ్య, గుంటూరులో నక్కా ఆనంద్, కనపర్తిలో శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసులుఅయినా మాచర్ల వెళ్లితీరతామంటూ టీడీపీ నేతల మొండిపట్టు.. ఉద్రిక్తత 👉మాచర్లలో భారీ పోలీసు బందోబస్తుపల్నాడు జిల్లాలో మరొక భారీ కుట్రకు ప్లాన్ చేసిన తెలుగుదేశం పార్టీ?పల్నాడు జిల్లాలో శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు చలో పల్నాడు.. మాచర్ల పేరుతో తెలుగుదేశం నేతలు మరొక డ్రామాఉమ్మడి గుంటూరు ,కృష్ణా జిల్లాల నేతలతో చలో మాచర్ల కార్యక్రమానికి పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీజిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంది అని చెబుతున్న పోలీసులునిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్న పోలీసులుపోలీసుల హెచ్చరికలను పట్టించుకోని తెలుగుదేశం పార్టీచలో మాచర్ల పేరుతో పల్నాడులో మరోసారి విధ్వంసం సృష్టించడానికి తెలుగుదేశం రెడీ అవుతున్న తెలుగుదేశం నేతలు 👉 పల్నాడులో టీడీపీ చలో మాచర్ల పిలుపుతో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు👉 మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేత దేవినేని ఉమా గృహ దిగ్భంధం.. మరికొందరు నేతల్ని సైతం అడ్డుకున్న పోలీసులు👉 మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనలకు అనుమతి లేదు: పోలీసులు👉 మాచర్లలో ఎలాగైనా పర్యటన చేపడతాం: టీడీపీ నేతలు తెలుగు దేశం పార్టీ ఇవాళ చలో మాచర్లకు పిలుపు ఇచ్చింది. ఈ ఉదయం మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా నేతలు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ నేతలు దేవినేని ఉమా, వర్ల రామయ్య, నక్క , ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, జీవీ ప్రకాష్ లాంటి కీలక నేతలు పాల్గొనేందుకు ప్రణాళిక రూపొందించారు. పోలింగ్ సందర్భంగా ఇక్కడ జరిగిన అల్లర్లపై ఈసీ సీరియస్ అయ్యింది. దీంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాచర్లలోఎలాంటి పర్యటనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు. అయినా కూడా టీడీపీ సానుభూతిపరులకు పరామర్శ పేరిట చలో మాచర్ల నిర్వహించి తీరతామని టీడీపీ అంటోంది. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండగా.. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం నెలకొందక్కడ. -
ఎస్పీ కి వైఎస్ఆర్సీపీ నేతల విజ్ఞప్తి
-
May 23rd: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 23rd AP Elections 2024 News Political Updates..12:45 PM, May 23rd, 2024ఈసీకి సూటిగా ప్రశ్నలు సంధించిన సజ్జలమాచర్ల ఘటనపై స్పందించిన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిఎన్నికల సంఘానికి సజ్జల రామకృష్ణారెడ్డి సూటి ప్రశ్నలుపాల్వాయి గేట్ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా?వీడియో సరైందేనా కాదా అన్నది నిర్దారించకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుంది?ఒక వేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వస్తుంది?మాచర్ల నియోజకవర్గంలో ఏడు ఘటనలు (ఈవీఎంలపై) జరిగాయని ఈసీనే చెబుతుంది కదా.!అలాంటప్పుడు కేవలం ఒక వీడియో మాత్రమే ఎలా లీక్ చేస్తుంది?ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను, ఏడు చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్ వీడియోలను ఎందుకు బయటపెట్టదు?అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడే అసలేం జరిగిందన్నది బయటకు వస్తుందిఅంతే కానీ.. ఒక చిన్న క్లిప్పింగ్‌ను మాత్రమే బయటకు ఎలా వస్తుంది?తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు?సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే..అమాయక ఓటర్లపై టీడీపీ గూండాలు దాడి చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.వారి మీద ఎన్నికల సంఘం చర్యలెందుకు తీసుకోవడం లేదు?దాని వెనక ఉన్నవారిని ఎందుకు పట్టుకోవడం లేదు?. 3. More importantly, in the videos attached below, there is clear evidence of TDP goons attacking innocent voters. Why has no action been initiated in these instances? pic.twitter.com/iYVvwO5nXj— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024 12:10 PM, May 23rd, 2024మచిలీపట్నంలో మాక్ డ్రిల్..కృష్ణాజిల్లా..మచిలీపట్నం కోనేరు సెంటర్ జిల్లా ఎస్పీ అద్నాన నయీం అస్మి ఆధ్వర్యంలో మాక్ డ్రిల్కౌంటింగ్ ప్రక్రియలో అల్లర్లకు పాల్పడితే జరిగే పరిణామాలను మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు చూపించిన పోలీస్ సిబ్బంది.ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కామెంట్స్..ప్రజలు ఎన్నికల ప్రక్రియలో సహకరించారుకౌంటింగ్‌లో కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాంకౌంటింగ్ సమయంలో డీజేలకు, టపాసులకు, సభలు, సమావేశాలకు అనుమతులు లేవుఅల్లర్లకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు 10:22 AM, May 23rd, 2024సిట్ దర్యాప్తు.. కంటిన్యూఏపీలో కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో ముమ్మరంగా తనిఖీలుపోలింగ్ టైంలో, తర్వాత అల్లర్లలో పాల్గొనవారిపై నిఘారాష్ట్రవ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపుఏపీలో ఘర్షణలపై కొనసాగుతున్న సిట్ దర్యాప్తుతిరుపతి, తాడిపత్రి, పల్నాడులో సిట్ మకాంజిల్లాల పోలీసులు కేసులు విచారిస్తున్న తీరును పర్యవేక్షిస్తున్న సిట్ బృందాలుఅవసరమైతే మరోసారి అల్లర్లు జరిగిన ప్రాంతానికి వెళ్లే యోచన9:17 AM, May 23rd, 2024తిరుపతి చంద్రగిరిలో పోలీసుల అలర్ట్‌నారావారిపల్లి,శేషాపురంలో పోలీసుల పికెటింగ్‌చంద్రగిరిలో 144తో పాటు సెక్షన్ 30 అమలుసమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాల కవాతుసభలు, సమావేశాలు, ఊరేగింపులను నో పర్మిషన్‌పోలింగ్ తర్వాత అల్లర్ల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు 8:10 AM, May 23rd, 2024పల్నాడులో మరో టెన్షన్‌నేడు చలో మాచర్లకు టీడీపీ పిలుపుటీడీపీ సానుభూతిపరులను పరామర్శించేందుకు మాచర్ల యాత్ర చేపట్టిన పచ్చ బ్యాచ్‌మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనలకు అనుమతి లేదని తేల్చి చెప్పిన పోలీసులు. 7:45 AM, May 23rd, 2024నేడు అంబటి పిటిషన్ విచారణఏపీ హైకోర్టులో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పిటిషన్‌పై నేడు విచారణసత్తెనపల్లిలో రిగ్గింగ్ జరిగిందని, రీపోలింగ్ జరపాలని అంబటి డిమాండ్ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన అంబటిప్రతివాదులుగా ఈసీ, సీఈవో సహా ఐదుగురిని చేర్చిన అంబటి 7:20 AM, May 23rd, 2024‘గేటు’లో గూండాగిరి.. ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్‌పాల్వాయి గేటులో ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్ వైఎస్సార్సీపీ ఏజెంట్లను చితకబాది బూత్‌ల నుంచి ఈడ్చివేతబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలపై పోలింగ్ బూత్‌లలో దౌర్జన్యం పార్టీ నేతల సమాచారంతో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రిగ్గింగ్‌ను ప్రతిఘటించి స్పందించాలని పలు దఫాలు ఎన్నికల అధికారులకు ఫోన్లు వెబ్ కాస్టింగ్ పరిశీలించి రిగ్గింగ్ అడ్డుకోకుండా అధికార యంత్రాంగం ఉదాశీనత.. పల్నాడులో ఏడు చోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే ఒక్క వీడియో మాత్రమే బహిర్గతం అవసరమైన మేరకు ఎడిటింగ్.. వారం తరువాత తాపీగా విదేశాల్లో ఉన్న లోకేశ్ ఎక్స్ ఖాతా నుంచి విడుదల భద్రంగా ఉండాల్సిన వెబ్ కాస్టింగ్ సమాచారం బయటకు వెళ్లడంపై సందేహాలు రిగ్గింగ్, ఏజెంట్లపై దాడులు, ఓటర్లని బెదిరించిన వారిని పట్టించుకోకుండా ప్రతిఘటించిన వారిపై కేసుల నమోదు పట్ల సర్వత్రా విస్మయం 7:00 AM, May 23rd, 2024ఓటమి బాటలో బాబుకుప్పంలో తప్పిన లెక్కలు.. వికటించిన వ్యూహాలుఇన్నాళ్లూ చంద్రబాబును గెలిపించింది 51 వేల దొంగ ఓట్లే రెండు విడతలుగా ఆ ఓట్ల తొలగింపు దీంతో ఓటమికి దగ్గరవుతూ వచ్చిన బాబుస్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలోనూ టీడీపీ ఘోర పరాజయం 35 ఏళ్లుగా కుప్పం ప్రజలను నమ్మించి మోసం చేసిన వైనం వైఎస్సార్సీపీ రాకతో ప్రతి ఇంటికీ సంక్షేమం, అభివృద్ది మారుతూ వచ్చిన ఓటర్ల తీర్పు.. గత ఎన్నికల్లో తగ్గిన మెజారిటీ ఈ దఫా ఓటమి ఖాయం అని తేలడంతో కుటుంబ సమేతంగా పరుగులు కుప్పంలో ఓటు, ఇల్లు లేని బాబు.. ఓటమి భయంతో ఇంటి నిర్మాణ పనులు ఓటుకు రూ.2 వేలు పంపిణీ చేసినా విఫల యత్నమే అంటున్న స్థానికులు 6:50 AM, May 23rd, 2024కుట్ర విఫలం వల్లే రాద్ధాంతం ఘోర ఓటమి భయంతో టీడీపీ నేతల దారుణకాండవైఎస్సార్‌సీపీకి దన్నుగా నిలిచే వర్గాల వారు ఓట్లు వేయకుండా అడ్డుకునే కుట్ర పల్నాడు, తాడిపత్రి, జమ్మలమడుగు, చంద్రగిరి సహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ రోజున అల్లర్లు పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకు నెట్టి రిగ్గింగ్ చేసిన టీడీపీ రౌడీలు వెబ్ కాస్టింగ్‌లో అరాచకపర్వం స్పష్టంగా కన్పిస్తున్నా పట్టించుకోని ఎన్నికల అధికారులు టీడీపీ మూక రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు యత్నించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపోలింగ్ రోజున తమ కుట్ర విఫలమవడంతో టీడీపీ అండ్ గ్యాంగ్ యాగీ 6:40 AM, May 23rd, 2024టీడీపీ రిగ్గింగ్.. పూర్తి వీడియో బయటపెట్టాలి: కాసు మహేష్‌రెడ్డిమాచర్లలో చాలా చోట్ల టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారుపిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరని.. దీనిపై ఎంతవరకైనా పోరాటం చేస్తాంపిన్నెల్లి తప్పు చేశారని టీడీపీ ప్రచారం చేస్తోందిమొత్తం వీడియో బయటపెడితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి.ఒక్కటే వీడియో ఎందుకు రిలీజ్ చేశారు?రిగ్గింగ్ జరిగిందని చెప్తుంటే... ఎందుకు వీడియో రిలీజ్ చేయడం లేదు?మాచర్లలో ఎవరు దాడి చేశారో ప్రజలందరికి తెలియాలిమాచర్లలో అల్లర్లకు కారణం ఎవరు? టీడీపీ కాదా?బీసీలు, ఎస్టీలు వైఎస్సార్సీపీకి ఓటేశారనే కారణంతో దాడులు చేశారుఅందరికీ చట్టపరమైన శిక్ష పడేవరకు పోరాడతాంరిగ్గింగ్ జరిగిందని మేము చెబుతున్నాం.. మీరు ఎందుకు వీడియో బయటపెట్టడం లేదు?ఎన్నికల అధికారులు ఆరోజు ఏమైందనేది మొత్తం వీడియో బయటపెట్టాలిఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు 2, 3 గంటల వీడియో బయటపెట్టాలిమమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారుదాడులకు సంబంధించి ఈసీ పూర్తి వీడియోలు బయటపెట్టాలిఏడు చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగిందని ఈసీనే చెబుతోందిమాచర్ల వీడియోను మాత్రమే బయటపెట్టారుమిగిలిన వీడియోలను ఎందుకు బయటపెట్టడం లేదుఈసీ విశ్వసనీయత కోల్పోతుంది. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం 6:30 AM, May 23rd, 2024మాచర్ల నియోజకవర్గంలో అరాచకాలు చేసింది టీడీపీ నేతలేమాచర్లలో టీడీపీ నేతల రిగ్గింగ్‌ఒక్కొక్కటిగా బయటపడుతున్న వీడియోలువైఎస్సార్‌సీపీ మద్దతుదారులను ఓటు వేయనివ్వకుండా అడ్డుకున్న టీడీపీ మూకలురెంటచింతల మండలం పాల్వాయి గేటులోని 201, 202 పోలింగ్ బూత్‌లో టీడీపీ రిగ్గింగ్‌టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నా పట్టించుకోని ఎన్నికల అధికారులుఓటర్లను ఓటు వేయనివ్వని టీడీపీ నేతలుఓటర్లు బూత్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో దాడులకు తెగబడ్డ టీడీపీ నేతలుటీడీపీ నేతల రిగ్గింగ్‌పై పోలీసులు, ఎన్నికల అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదులుఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు -
ఆ వీడియో ఫేకా? ఒరిజినలా?: మంత్రి అంబటి
సత్తెనపల్లి: ‘పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలో దారుణాలు జరిగాయి. అధికారులు, పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ మూకలు పేట్రేగిపోయాయి. బూత్ క్యాప్చరింగ్ చేశారు. దొంగ ఓట్లు వేసుకున్నారు. ఈవీఎంలను పగులగొట్టేందుకు యత్నించారు. వైఎస్సార్సీపీకి ఓటు వేస్తారనుకున్న ఓటర్లను అడ్డుకున్నారు. కొట్టి బయటకు పంపించారు. వీటన్నింటిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అటు అధికారులకు, ఇటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి స్పందనా లేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉన్నట్లుండి చిత్రంగా ఒక వీడియో రిలీజ్ అయ్యింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ బూత్‌లో ఈవీఎం పగలకొడుతున్నట్లు అందులో ఉంది. దీన్ని ఎవరు లీక్ చేశారు? ఇది ఫేకా, ఒరిజినలా తేల్చాలి’ అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి బుధవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వీడియో ఎక్కడి నుంచి రిలీజ్ అయిందో అర్థం కావడం లేదన్నారు. వాస్తవంగా ఇలాంటిదేదైనా ఉంటే ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయాలని చెప్పారు. ‘దీన్ని లోకేశ్ ఎక్స్ (ట్విటర్)లో పెట్టారంట! ఎలా చేరింది లోకేశ్ ట్విటర్‌లోకి? ఈ వీడియో ఫేకా? ఒరిజినలా? కన్‌క్లూజన్ ఎవిడెన్సా.. కాదా.. ఆలోచించాలి కదా.. కలెక్టర్ అన్న రిలీజ్ చేయాలి, ఎలక్షన్ కమిషన్‌కు సంబంధించిన వారన్నా రిలీజ్ చేయాలి. వీరెవరూ కాకుండా ఇది డైరెక్ట్‌గా తెలుగుదేశ«ం అధినేత కొడుకైన లోకేశ్ ట్విట్టర్లోకి ఎట్లా వెళ్లింది?’ అని ప్రశ్నించారు. అంటే ఇక్కడ ఏదో కుమ్మక్కు జరిగిందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. అధికారులు, ఎన్నికల కమిషన్‌లో ఉన్న అధికారులు, తెలుగుదేశం పార్టీ వారు కలిసి కుట్ర చేస్తున్నారనే అనుమానం కలగటం సహజం అని స్పష్టం చేశారు. ఒక వేళ అది నిజంగా జరిగి ఉంటే, సంబంధిత అధికారులు విడుదల చేసి ఉంటే చట్టం తన పని తాను చేసుకునేదన్నారు. ఇప్పుడు జరిగింది చూస్తుంటే ఇది ఫేక్ అనిపిస్తోందని చెప్పారు. అంబటి ఇంకా ఏమన్నారంటే..ఆ వీడియోలన్నీ రిలీజ్ చేయాలి‘పాల్వాయిగేట్ బూత్‌లో టీడీపీ మూకలు ఎంత దారుణంగా వ్యవహరించారో పిన్నెలి రామకృష్ణారెడ్డి చాలా క్లియర్‌గా ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ. అది నేను కూడా మీకు చూపిస్తా (వీడియో ప్రదర్శించారు). వైఎస్సార్సీపీకి చెందిన వారని భావిస్తున్న ఓటర్లు ఆ బూత్‌లోకి వెళ్లి స్వేచ్ఛగా ఓటు వేస్తే ఒప్పుకోనటువంటి పరిస్థితి. బూత్ బయట హింసించి తరిమేస్తున్నటువంటి సందర్భం. దీని మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిపోర్టు చేశారు. అయితే ఎవరూ పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీకీ అనుకూలమైనటువంటి బూత్‌ల దగ్గర గొడవ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకుండా ఉండే పరిస్థితి. ఇది వాస్తవం. చాలా నియోజకవర్గాల్లో బూత్ క్యాప్చరింగ్ జరిగాయి. నా నియోజకవర్గంలో కూడా బూత్ క్యాప్చరింగ్ జరిగి టీడీపీ వాళ్లు ఓట్లు వేసుకున్నారు. వెట్ క్యామ్ ఓపెన్ చేయండి అంటే పట్టించుకోలేదు. ఎలాంటి చర్యలూ లేవు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగలగొట్టారని ప్రచారంలో ఉన్న వీడియో ఫేక్ వీడియోనా? కరెక్ట్ వీడియోనా? కరెక్ట్ వీడియో అయితే లోకేశ్ దగ్గర ఎలా రిలీజ్ అయ్యింది. దీనిపై ఎన్నికల కమిషన్ ఏం యాక్షన్ తీసుకుంది? నేరం చేసినట్టుగా భావించేలా అలా ఫేక్‌గా చేయడం తప్పు. నిజంగా నేరం చేసిన వారిని శిక్ష నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మేం ఆందోళన చెందుతున్నాం. ఎక్కడైతే బూత్ క్యాప్చరింగ్ జరిగిందో ఆ వీడియోస్‌ను ఎలక్షన్ కమిషన్ బయట పెట్టాలి. ఒక చోట కాదు.. అనేక చోట్ల మేం ఫిర్యాదు కూడా చేశాం. ఆ వీడియోలన్నీ రిలీజ్ చేయాలి’ అని మంత్రి అంబటి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అక్రమాలపై తాము ఈసీకి అనేక రకాలుగా ముందస్తుగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. తుదకు ఆ అక్రమాలను అందరూ కళ్లారా చూడటంతో కొందరు అధికారులను సస్పెండ్ చేశారని, మరికొందరిని మార్చారని చెప్పారు. తద్వారా తప్పు జరిగిందనే భావన సర్వత్రా వ్యాపించిందన్నారు.రీ పోలింగ్ పిటిషన్‌పై నేడు విచారణపల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం నార్నెపాడులో 236, 237 పోలింగ్ కేంద్రాలు, దమ్మాలపాడులోని 253, 254 పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. వెబ్ కెమెరాలను పరిశీలించి రీ పోలింగ్ జరపాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. వారు పట్టించుకోక పోవడంతో రీ పోలింగ్ జరపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈసీ, సీఈఓ సహా ఐదుగురిని ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై హైకోర్టులో గురువారం విచారణ జరగనుంది. -
ఓటమి బాటలో బాబు
చంద్రబాబు 35 ఏళ్ల కుప్పం ప్రస్థానంలో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, సీట్లను బట్టి చూస్తే గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ గట్టి పట్టు సాధించిందని స్పష్టమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను, ఇటీవల తొలగించిన 33 వేల టీడీపీ దొంగఓట్లను పరిగణనలోకి తీసుకుంటే, మే 13న జరిగిన ఎన్నికలో కుప్పం అసెంబ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థి భరత్ గెలుపు వాకిట నించున్నారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు, మద్దతుదారులకు వచ్చిన ఓట్ల కంటే కేవలం 3–4 వేల ఓట్లు (0.02%) మాత్రమే అదనంగా అవసరం. అయితే భారీగా టీడీపీ దొంగ ఓట్లకు చెక్ పడటంతో కుప్పంలో చంద్రబాబు ఓడి పోబోతున్నారని స్పష్టమవుతోంది. ఇటు ఓటర్లు, అటు రాజకీయ విశ్లేషకులు, పలు సర్వే నివేదికలు చెబుతున్న వాస్తవం ఇది. సాక్షి, తిరుపతి: ఐదేళ్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో జరిగినంత మేలు చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ జరగలేదని, అందుకే కుప్పం ప్రజలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓటెత్తారని స్పష్టమవుతోంది. 35 ఏళ్ల పాటు మాయ మాటలతో ప్రజలను నమ్మించి.. సీఎంగా, ఎమ్మెల్యేగా కొనసాగిన చంద్రబాబును కుప్పం ఓటర్లు ఈసారి శంకరగిరి మాన్యాలకు పంపుతున్నట్లు ఈవీఎంలలో ఫ్యాన్ గుర్తుపై గట్టిగా నొక్కి చెప్పినట్లు తెలుస్తోంది. 2019 సాధారణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం వాసులు ఇచ్చిన తీర్పే.. ఇప్పుడూ పునరావృతం కాబోతోందని సమాచారం. నాటి చంద్రబాబు.. నేటి వైఎస్ జగన్ పాలనను బేరీజు వేసుకునే ఓటర్లు ఓటెత్తారని స్పష్టమవుతోంది. సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో డీబీటీ ద్వారా 4,32,067 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.1,400 కోట్లకుపైగా జమ చేశారు. నాన్ డీబీటీ ద్వారా మరో 3,03,080 మంది లబ్ధిదారులకు రూ.1,175.21 కోట్లు అందించారు. కుప్పం వాసులకు కలగా మారిన కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు కృష్ణా జలాలు తీసుకొచ్చారు. చంద్రబాబు ఉన్నన్ని రోజులు అదిగో ఇదిగో అంటూ కాలం గడిపేశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక హంద్రీ–నీవా సృజల స్రవంతిలో భాగంగా రూ.560.29 కోట్లతో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను పూర్తి చేసి కృష్ణా జలాలను తీసుకొచ్చి కలను నిజం చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ వివరాలు » పలమనేరు నియోజకవర్గం అప్పిన పల్లి వద్ద 0 పాయింట్ నుంచి కుప్పం మండలం పరమసముద్రం వరకు సుమారు 124 కి.మీ వరకు హంద్రీ–నీవా కాలువ తవ్వారు.» 5 కిలోమీటర్లలో పశు పత్తురు వద్ద, 39వ కిలోమీటర్ కృష్ణాపురం వద్ద లిఫ్ట్ ఏర్పాటు» వి.కోట మండలం ఆదిరే పల్లి 54.కి.మీ వద్ద లిఫ్ట్‌ల ద్వారా హంద్రీ–నీవా కృష్ణా జలాలు అందించారు.» కుప్పం నియోజకవర్గంలో 110 చెరువులకు నీళ్లివ్వడం ద్వారా 6,500 ఎకరాల ఆయకట్టుకు అండగా నిలిచారు. » అనంతపురం జిల్లా చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి 300 క్యూసెక్కుల నీరు హంద్రీ–నీవా కాలువలు ద్వారా విడుదలవుతుంది. ఆవిరి, లీకేజీ పోగా 220 క్యూసెక్కుల నీరు కుప్పం చేరుతుంది. 4 లక్షల జనాభాకు తాగు నీరు అందుతుంది. కుడి ఎడమల సంక్షేమం, అభివృద్ధి» వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కుప్పం నియోజకవర్గంలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు పలు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి.» కుప్పం మేజర్ పంచాయితీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసి, పట్టణ అభివృద్ధి కోసం రూ.66 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించారు.» నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేయటంతో పాటు.. కుప్పం పోలీస్ డివిజన్ ఏర్పాటు చేశారు. ఆర్డీఓ, డీఎస్పీలను నియమించారు.» రూ.15 కోట్ల వ్యయంతో కుప్పం పట్టణ నడిబొడ్డు, డికే పల్లి వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిలు నిర్మించారు.» నియోజకవర్గంలో ఏడు పురాతన దేవాలయాలు జీర్ణోద్ధరణకు సుమారు రూ.12 కోట్లు వెచ్చించారు.» రూ.5 కోట్ల వ్యయంతో మున్సిపాలిటి పాలన వ్యవస్థ కోసం ప్రత్యేకంగా రెండు అంతస్తుల నూతన భవనాలు నిర్మించారు.» శాంతిపురం మండలంలోని కేటీ పల్లి, పోడిచేన్లు, ప్రతిచామనూరులకు రూ 7.25 కోట్లతో తారు రోడ్లు, సిమెంట్ రోడ్డు వేయించారు. » నియోజకవర్గంలో 78 సచివాలయాలకు రూ.87.55 కోట్లు ఖర్చు చేశారు. రూ.15.77 కోట్లతో 77 రైతు భరోసా కేంద్రాలు, రూ.7.9 కోట్లతో 58 వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. » కుప్పం మున్సిపాలిటీ పరిధిలో మరో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. »కుప్పంలో మెజారిటీ ఓటర్లుగా ఉన్న వన్నె కులస్తుల కోసం క్షత్రియ భవనం ప్రారంభించారు.బాబును గెలిపిస్తూ వచ్చింది దొంగ ఓట్లేచంద్రబాబు 1989 నుంచి కుప్పంలో గెలుపొందుతూ వచ్చారు. కుప్పం వాసుల అమాయకత్వంతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడుకు చెందిన 52 వేల మంది పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చి.. దొంగ ఓట్లు వేయించుకోవడమే ఇందుకు కారణం. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఐఏఎస్ అధికారి చంద్రమౌళి.. బాబు దొంగ ఓట్ల బాగోతాన్ని బయటపెట్టారు. ఎన్నికల సమయంలో కర్ణాటక, తమిళనాడు నుంచి జనం భారీగా తరలివచ్చి, ఓట్లు వేసి వెళ్లటం గమనించిన చంద్రమౌళి దొంగ ఓట్లపై విచారణ జరిపించారు. అధికారుల విచారణలో దొంగ ఓట్లు ఉన్నట్టు తేలడంతో ఇదివరకు 18 వేల ఓట్లు, ఈ ఎన్నికలకు ముందు 33 వేల ఓట్లు తొలగించారు. దొంగ ఓట్లను తొలగించటంతో పాటు కుప్పం వాసులు చైతన్య వంతులు కావటంతో చంద్రబాబుకు భయం పట్టుకుంది. కుటుంబ సమేతంగా కుప్పానికి పరుగు» కుప్పంలో 2014 ముందు ఒక లెక్క. ఆ తర్వాత ఒక లెక్క అన్న చందంగా మారింది. వైఎస్సార్సీపీ రానంత వరకు అన్ని గ్రామాల్లో చంద్రబాబు చెప్పిందే శాసనంలా సాగింది. భయపెడుతూ.. బెదిరిస్తూ ప్రత్యర్థి లేకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. 2014లో వైఎస్సార్సీపీ అడుగు పెట్టడంతో షాక్‌ల మీద షాక్‌లు తగలటం మొదలయ్యాయి. » బాబు అండ్ కో బ్యాచ్ అరాచకాలను జీర్ణించుకోలేని స్థానికులు ప్రతి గ్రామంలో టీడీపీకి పోటీగా వైఎస్సార్సీపీ జెండాను ఎగుర వేయటం ప్రారంభించారు. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మొదటి రెండు రౌండ్లలో టీడీపీ అభ్యర్థి కంటే వైఎస్సార్సీపీ అభ్యర్థికే మెజారిటీ ఓట్లు నమోదవ్వటంతో చంద్రబాబు షాక్‌కు గురయ్యారు. 2019 తర్వాత జరిగిన స్థానిక సంస్థలకు జరిగిన అన్ని ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, మున్సిపల్ చైర్మెన్ అంతా వైఎస్సార్సీపీ మద్దతు దారులే గెలుపొందటంతో చంద్రబాబు మైండ్ బ్లాక్ అయ్యింది. » 35 ఏళ్లుగా కుప్పంలో ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనే చేయని చంద్రబాబుకు వైఎస్సార్సీపీ నేతల మాటలతో జ్ఞానోదయం అయింది. ఎట్టకేలకు ఇంటి నిర్మాణం చేపట్టారు. కుప్పానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లే చంద్రబాబు.. 2019 ఎన్నికల తర్వాత కుటుంబ సమేతంగా పరుగులు పెట్టారు. 2014–19 మధ్య కాలంలో సీఎం హోదాలో చంద్రబాబు 8 పర్యాయాలు మాత్రమే కుప్పానికి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. 2019–2024 మధ్య 14 సార్లు కుప్పం రావడంతో పాటు కనీసం రెండు, మూడు రోజులు ఉండి వెళ్తున్నారు.» కుమారుడు లోకేశ్, సతీమణి భువనేశ్వరి సైతం కుప్పం దారిపట్టారు. ఓటమి భయంతోనే లోకేశ్ తన పాదయాత్రను కుప్పం నుంచి ప్రారంభించి అభాసుపాలయ్యారు. నారా భువనేశ్వరి ఇటీవలి కాలంలో రెండు పర్యాయాలు కుప్పానికి వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో చంద్రబాబు నామినేషన్ వేయటానిక్కూడా కుప్పానికి వచ్చిన దాఖలాలు లేవు. స్థానిక నాయకులే చందాలు వేసుకుని ఆయన తరుఫున నామినేషన్ వేసేవారు. అటువంటిది ఈసారి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నేరుగా కుప్పానికి చేరుకుని, సొంత డబ్బులతో నామినేషన్ వేశారు. అనంతరం గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఓటుకు రూ.2 వేలు పంపిణీచంద్రబాబు గతంలో కుప్పంలో ఓటర్లకు పెద్దగా డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. స్థానిక నాయకులే అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించిన సొమ్ములో నుంచి ఓటుకు రూ.200 లేదా రూ.300 పంపిణీ చేసేవారు. ఈ నగదు కూడా ఓటర్లందరికీ ఇచ్చేవారు కాదు. సగం ఓటర్లకు ఇచ్చి మిగిలిన సగం నగదు నొక్కేసి అందరికీ పంపిణీ చేశామని లెక్క చూపేవారని ఆరోపణలు ఉన్నాయి. అటువంటి చంద్రబాబు ఈ ఎన్నికల్లో మే 10, 11, 12 తేదీల్లో ఒక్కో ఓటుకు రూ.2 వేలు చొప్పున డబ్బులు పంపిణీ చేశారు. ఈ నగదును చంద్రబాబే స్వయంగా పంపించారని స్థానిక టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు మరోసారి ఎమ్మెల్యేగా గెలిచేందుకే డబ్బులు పంపిణీ చేసి మాయ చేయాలని చూస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. సీఎం వైఎస్ జగన్ 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చారని, ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాల ద్వారా కుటుంబ ఆర్థిక పురోభివృది్ధకి దోహద పడ్డారని, కుప్పాన్ని అభివృద్ధి చేసినందుకే తాము ఫ్యాన్ గుర్తుకు ఓటేశామని అత్యధికులు స్పష్టం చేస్తున్నారు.బాబు కుప్పం ప్రస్థానం 1989లో పోలైన ఓట్లు: 95,157చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 50,098 (52.65%)మెజారిటీ: 6,9181994లో పోలైన ఓట్లు: 1,07,582చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 81,210 (75.49%)మెజారిటీ: 56,5881999లో పోలైన ఓట్లు: 1,25,357 చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 93,288 (74.42%)మెజారిటీ: 65,687 2004లో పోలైన ఓట్లు: 1,40,153 చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 98,123–(70%– 4.42% తగ్గాయి.. 6,195 ఓట్లు కోల్పోయారు)మెజారిటీ: 59,5882009లో పోలైన ఓట్లు: 1,45,287చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 89,954 (61.9% – 8.1% తగ్గాయి.. 11,770 ఓట్లు కోల్పోయారు)మెజారిటీ: 46,0662014లో పోలైన ఓట్లు: 1,64,071చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 1,02,953 (62.5% –0.6% పెరిగాయి. 985 ఓట్లు అదనంగా వచ్చాయి)మెజారిటీ: 47,1212019లో పోలైన ఓట్లు: 1,79,329చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 1,00,146 (55.18% – 7.32% తగ్గాయి. 13,127 ఓట్లుకోల్పోయారు)మెజారిటీ: 30,722 మే 13న జరిగిన ఎన్నికలో కుప్పంలోమొత్తం ఓటర్లు: 2,13,145 పోల్ అయిన ఓట్లు: 1,83,027 (85.87%)గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు2014 – 55,839 ఓట్లు (33.9%)2019 – 69,424 ఓట్లు (38.25% – 4.35% పెరుగుదల -
కుట్ర విఫలం వల్లే రాద్ధాంతం
సాక్షి, అమరావతి: ఏ విధంగా అయినా సరే పోలింగ్ రోజు పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి టీడీపీ తొక్కని అడ్డదారులంటూ లేవు. గూండాయిజం, దౌర్జన్యం, బెదిరింపులు, రిగ్గింగ్.. ఇలా అన్ని విధాలా అక్రమాలకు పాల్పడింది. ఎక్కడైనా వైఎస్సార్సీపీ అభ్యర్థులు గట్టిగా ప్రతిఘటిస్తే ఈసీ అండతో పోలీసులను అడ్డుపెట్టుకుని ఎదురు దాడులు చేస్తూ.. ‘పచ్చ’ మూక ఎదురు కేసులు పెడుతోంది. నానా యాగీ చేస్తూ రాద్ధాంతం చేస్తోంది. మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే ‘ఫ్యాన్’ గుర్తుపై రెండు బటన్లు నొక్కి.. ఓటు వేసి ఆశీర్వదించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన విజ్ఞప్తికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు భారీ ఎత్తున స్పందిస్తుండటంతో సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఘోర పరాజయం ఖాయమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆందోళనకు గురై ధ్వంస రచనకు తెరలేపారు. పోలింగ్ రోజున విధ్వంసం సృష్టించడం ద్వారా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు ఓట్లు వేసేందుకు బయటకు రాకుండా చేయాలని కుట్ర పన్నారు. ఆ కుట్రలో భాగంగానే పోలింగ్ రోజు (ఈనెల 13న) ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులను గొడవలకు ఉసిగొల్పారు. దీంతో వైఎస్సార్సీపీకి ఏకపక్షంగా ఓట్లు పడుతున్న పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ గూండాలు రౌడీయిజానికి దిగారు. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, అగ్రవర్ణ పేదలను ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు. టీడీపీ గూండాల దారుణకాండ వెబ్ కాస్టింగ్‌లో లైవ్‌లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఎన్నికల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసు ఉన్నతాధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ టీడీపీ గూండాల పైశాచికత్వానికి వత్తాసు పలికారు. టీడీపీ రౌడీల అరాచకాలను అడ్డుకుని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్, ఎస్పీలకు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేయడానికి ఫోన్లు చేసినా, వారు స్పందించలేదు. మాచర్ల నుంచి తాడిపత్రి వరకు అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. టీడీపీ రౌడీల దారుణకాండ మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు 201, 202 పోలింగ్ బూత్‌లలో ఓట్లు వేసేందుకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలపై టీడీపీ గూండాలు దాడులకు దిగారు. ఓటు హక్కును వినియోగించుకోనివ్వకుండా వారిని అడ్డుకున్నారు. ఈ అరాచక పర్వం గురించి ఓటర్లు మాచర్ల నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్‌ను అడ్డుకుంటున్న టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని ఆ నియోజకవర్గ రిటరి్నంగ్ అధికారితోపాటు పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు పిన్నెల్లి ఫిర్యాదు చేసేందుకు పదే పదే ఫోన్లు చేసినా వారు స్పందించలేదు. దీంతో ఆయా వర్గాల వారికి అండగా నిలిచి.. వారు ఓటు హక్కు వినియోగించుకునేలా చేసేందుకు పిన్నెల్లి పాల్వాయిగేటుకు చేరుకున్నారు. టీడీపీ రౌడీల దారుణకాండను అడ్డుకునే యత్నం చేశారు. తమ కుట్ర విఫలమవడంతో పిన్నెల్లిపై పచ్చమూక దు్రష్ఫచారం చేస్తోంది.బడుగులపై దాడులు.. ఈవీఎంల ధ్వంసం మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం ఒప్పిచర్లలో పోలింగ్ బూత్ 251లో ఓటు వేసేందుకు వచ్చిన ఎస్టీ వర్గానికి చెందిన పాలకీర్తి శ్రీనివాసరావుపై టీడీపీ రౌడీలు దాడి చేసి, చితకబాదారు. భయోత్పాతం సృష్టించడం ద్వారా ఆ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను బెదరగొట్టాలని కుట్ర చేశారు. మాచర్ల మండలం తుమ్మురుకోటలోని 203, 204, 205, 206 పోలింగ్ బూత్‌లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, అగ్రవర్ణ పేదలు ఏకపక్షంగా ఓట్లు వేస్తుండటంతో టీడీపీ గూండాలు జీరి్ణంచుకోలేకపోయారు. ఎలాగైనా సరే ఆ ఓట్లను చెల్లకుండా చేయాలనే లక్ష్యంతో పోలింగ్ కేంద్రంలోకి చొరబడి ఆ నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. తాడిపత్రిలో పోలింగ్ సజావుగా జరగకుండా విఘాతం కల్పించడానికి జేసీ ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలో టీడీపీ గూండాలు కవ్వింపు చర్యలకు దిగుతూ వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, కార్యకర్తలపై రాళ్ల దాడికి దిగారు. పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారు. జమ్మలమడుగు నవాజ్ కట్టలోని 116, 117 పోలింగ్ బూత్‌ల వద్ద పోలింగ్‌ను అడ్డుకోవడానికి బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, కడప లోక్‌సభ టీడీపీ అభ్యర్థి భూపే‹Ùరెడ్డి కవ్వింపు చర్యలకు దిగుతూ వైఎస్సార్సీపీ అభ్యర్థి సు«దీర్‌రెడ్డిపై రాళ్ల దాడికి దిగారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని తేలప్రోలు జెడ్పీ హైస్కూల్లో ఉన్న 271, 273, 274, 275 పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ప్రక్రియకు విఘాతం కల్పించడానికి టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నేతృత్వంలోని పచ్చమంద బరితెగించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలను కవ్విస్తూ దాడికి దిగి భయోత్పాతం సృష్టించింది. -
‘గేటు’లో గూండాగిరి.. ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్
సాక్షి, నరసరావుపేట / రెంటచింతల: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేటులోని పోలింగ్ బూత్‌లో ఆ రోజు అసలు ఏం జరిగిందన్నది కీలకంగా మారింది. మే 13న రెంటచింతల మండలం పాల్వాయిగేటు 201, 202 పోలింగ్ బూత్‌లలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలను బెదిరించి టీడీపీ గూండాలు భయానక వాతావరణం సృష్టించారు. పోలింగ్ సజావుగా జరగకుండా అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారితోపాటు పల్నాడు కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసేందుకు పిన్నెల్లి పలుసార్లు ఫోన్ చేసినా వారు స్పందించలేదు. తమ పార్టీ పోలింగ్ ఏజెంట్లను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు లాక్కొచ్చి దాడులు చేయడంతోపాటు టీడీపీ నేతలు రిగ్గింగ్ చేస్తున్నారనే సమాచారం అందడంతో పిన్నెల్లి అక్కడకు చేరుకున్నట్లు చెబుతున్నారు. యథేచ్ఛగా జరుగుతున్న రిగ్గింగ్‌ను ఆయన ప్రతిఘటించారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే పచ్చ ముఠాలు పల్నాడు ప్రాంతంలో దాదాపు ఏడు చోట్ల ఈవీఎంల విధ్వంసాలకు తెగబడగా దీన్ని అడ్డుకున్న పిన్నెల్లి వీడియోను మాత్రమే బహిర్గతం చేయడం వెనుక కుట్రకోణం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈసీకి మొర పెట్టుకున్నా... పాల్వాయిగేట్, తుమృకోట, ఒప్పిచర్ల, చింతలపల్లి పోలింగ్ కేంద్రాలలో గతంలో పలుమార్లు టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఆయా కేంద్రాలలో పటిష్ట బందోబస్తు కల్పించి ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని పిన్నెల్లి పలు దఫాలు ఈసీ, కలెక్టర్, ఎస్పీలను అభ్యరి్థంచినా స్పందించలేదు. పోలింగ్ రోజు కూడా రెండుసార్లు ఈసీకి మొర పెట్టుకున్నా ఫలితం శూన్యం. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ అరాచకాలకు సహకరించేందుకు 50 ఏళ్లకు పైగా వయసున్న పోలీసు కానిస్టేబుల్‌కే విధులు కేటాయించారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లను చితకబాది.. పాల్వాయి గేట్ కేంద్రంలో వైఎస్సార్ సీపీ పోలింగ్ ఏజెంట్లుగా ఉన్న చింతా సుబ్బారావు, డేరంగుల శ్రీను, చల్లా సుబ్బయ్యలను టీడీపీ నేతలు కొట్టి బయటకు ఈడ్చేశారు. ఓటు వేయడానికి క్యూలో నిలబడ్డ మహిళలను భయకంపితుల్ని చేసి తరిమేశారు. అనంతరం అక్కడ టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. స్థానికులతో కలసి మరోసారి దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలింగ్ ఏజెంట్లపై విచక్షణారహితంగా దాడి చేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తెచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పిన్నెల్లి రిగ్గింగ్‌ను ప్రతిఘటించారు. దీన్ని అడ్డుకోవాలని పోలింగ్ అధికారులను అభ్యరి్థంచారు. టీడీపీ మూకల అరాచకాలను ఎన్నికల అధికారుల దృష్టికి తెచి్చనా స్పందించలేదు. పిన్నెల్లి కుమారుడు గౌతమ్‌రెడ్డి, డ్రైవర్ అంజిరెడ్డి, మరికొందరిపై టీడీపీ నేతలు దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. పిన్నెల్లి కాన్వాయ్‌లోని వాహనాలను ధ్వంసం చేశారు. ఓటర్లు, ఏజెంట్లను భయపెట్టి రిగ్గింగ్ చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఆ వీడియో ఒక్కటే.. వారం తరువాత మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు మొత్తం ఏడు ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. ఒక్క పాల్వాయి గేటు వీడియో మినహా మిగతావి ఏవీ బయటకు రాలేదు. అది కూడా వారం తరువాత తాపీగా విడుదల చేయడంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఈవీఎంలు ధ్వంసమైన మిగిలిన ఆరు వీడియోలను ఎన్నికల సంఘం ఇప్పటికీ బయట పెట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీడియోను తాము రిలీజ్ చేయలేదని పోలీసులు, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. పలువురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడిన తరువాత విదేశాల్లో గడుపుతున్న నారా లోకేష్ ‘ఎక్స్’ ఖాతా నుంచి వీడియో పోస్టు కావడం గమనార్హం. ఈసీ ఆదీనంలో ఉండాల్సిన వీడియో లోకేష్ చేతికి ఎలా వచి్చందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈసీ వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదంగా మారింది. పాల్వాయి గేట్ పోలింగ్ బూత్‌లో టీడీపీ మూకలు రిగ్గింగ్ చేస్తుంటే ఎందుకు స్పందించలేదు? ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నా ఏమి పట్టనట్లు వ్యవహరించడం ఏమిటి? ఫిర్యాదులు అందినా ఎందుకు పట్టించుకోలేదు? అనే ప్రశ్నలకు ఈసీ జవాబు చెపాల్సి ఉంది. మాచర్ల నియోజకవర్గంలో వంద శాతం వెబ్ కాస్టింగ్ జరుగుతోంది. 202 పోలింగ్ బూత్‌లో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలిసినా ఉదాశీనంగా ఉండటంపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. తుమృకోటలో దాడులు.. ఈవీఎంలు ధ్వంసం రెంటచింతల మండలం తుమృకోటలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన ఎస్సీ, ముస్లిం మైనార్టీలపై టీడీపీ నేతలు దాడి చేశారు. 203, 204, 205 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. రీపోలింగ్ జరపకుండా సాయంత్రం 4 గంటల సమయంలో కొత్త ఈవీంఎలతో తిరిగి పోలింగ్ కొనసాగించారు. ఆ సమయంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు లేకుండా రిగ్గింగ్ చేశారు. ఈ వీడియోలను ఎన్నికల సంఘం బయటపెట్టలేదు. కారంపూడి మండలం ఒప్పిచర్లలో వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్ పాలకిర్తి శ్రీనివాసరావుపై టీడీపీ అగ్రవర్ణ నేతలు దాడి చేసి పోలింగ్ కేంద్రం నుంచి ఈడ్చేసి అక్రమ కేసు బనాయించారు. ఈసీ డేటా భద్రమేనా?సాక్షి, నరసరావుపేట: పాల్వాయి గేట్ పోలింగ్ బూత్‌లో ఈవీఎం «ధ్వంసం వీడియోపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా అది సీసీ ఫుటేజేనా? లేక మార్ఫింగ్ చేసిన వీడియోనా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వీడియో కుడివైపు పైభాగంలో మొబైల్ 5జీ సిగ్నల్, 65 శాతం బ్యాటరీ పర్సంటేజ్, అలారం ఇండికేషన్స్ కనిపించడం గమనార్హం. వీడియోలో మొత్తం నిడివి 23.52 గంటలు ఉండగా 12.06 గంటల వద్ద తమకు అవసరమైన మేరకు రెండు నిమిషాల పాటు మొబైల్లో రికార్డు చేసినట్టు స్పష్టమవుతోంది. ఎంతో భద్రంగా ఉండాల్సిన పోలింగ్ వెబ్ కాస్టింగ్ సమాచారం బయటకు వెళ్లడంపై సందేహాలు అలుముకుంటున్నాయి. ఈ వీడియో తొలుత నారా లోకేష్ ఎక్స్ ఖాతా, టీడీపీ సోషల్ మీడియా గ్రూప్‌లలో కనిపించింది. అంటే వారి ద్వారానే బయటకు వచి్చనట్టు తేలిపోతోంది. గ్రాఫిక్స్‌కు పెట్టింది పేరైన పచ్చ ముఠాల వీడియోను నిర్థారించుకోకుండా, ఎలా బయటకు వచి్చందనే విషయాన్ని పట్టించుకోకుండా ఈసీ కేసు నమోదుకు ఆదేశించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. 53 గ్రామాల్లో దాడులుసాక్షి, ప్రత్యేక ప్రతినిధి / సాక్షి, నరసరావుపేట: పల్నాడులోని 53 గ్రామాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులపై, ఇళ్లపై టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయి. ఆస్తులను ధ్వంసం చేశాయి. పోలింగ్ నాడు టీడీపీ నాయకులు హింసాకాండకు పథకం రూపొందించినట్లు మంత్రి అంబటి, పిన్నెల్లి తదితరులు ఎన్నికల యంత్రాంగానికి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా స్పందించలేదు. వీడియోను మొబైల్లో రికార్డు చేశారని చెప్పడానికి గల ఆధారాలు.. ఆ వీడియో వెనుక అసలు నిజాలు..⇒ మే 13న పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా ఓటర్లను టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. ⇒ పాల్వాయి గేట్‌లోని అన్ని బూత్‌లను ఆక్రమించి పచ్చ ముఠాలు రిగ్గింగ్‌కు పాల్పడ్డాయి. ⇒ బ్రహా్మరెడ్డి కుట్రలను ముందే పసిగట్టి మే 11న పిన్నెల్లి ఈసీకి లేఖ రాశారు. ⇒ సమస్యాత్మక ప్రాంతమైన మాచర్లలో భారీగా పోలీసులను మోహరించాలని పిన్నెల్లి కోరారు. ⇒ టీడీపీ అరాచకాలకు పాల్పడినందున రీ పోలింగ్ నిర్వహించాలని లేఖలో పిన్నెల్లి కోరారు.⇒ ప్రజాస్వామ్యాన్ని టీడీపీ ఖూనీ చేసినందున రీ పోలింగ్ జరపాల్సిందేనని అభ్యరి్థస్తూ పిన్నెల్లి మరో లేఖ రాశారు. ⇒ టీడీపీ కుట్రలపై మే 11న ఒక లేఖ, పోలింగ్ జరిగిన మే 13న రెండు లేఖలను పిన్నెల్లి ఈసీకి రాశారు. ⇒ 11 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయినట్లు ఎన్నికల అధికారి ప్రెస్ మీట్ నిర్వహించి మరీ చెప్పారు. ⇒ టీడీపీ గూండాలు 10 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసే ఆ వీడియోలను ఎందుకు బయట పెట్టలేదు?⇒ నారా లోకేష్ ఫిర్యాదుతో 8 రోజుల తరువాత ఒక వీడియో విడుదల చేసి అరెస్టుకు ఆదేశాలిచ్చారు.దాడి చేసి.. రిగ్గింగ్202 పోలింగ్ బూత్‌లోకి టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో ప్రవేశించి నాతో పాటు డేరంగులు శ్రీను, చల్లా సుబ్బయ్యలపై దాడి చేశారు. చితకబాది పోలింగ్ బూత్ బయటకు లాక్కొచ్చారు. అనంతరం టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. అక్కడున్న పోలీసులు, పోలింగ్ అధికారులు ఏమాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో మేం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాం. అక్కడకు వచి్చన పిన్నెల్లి, ఆయన అనుచరులపై పచ్చమూకలు దాడులకు పాల్పడ్డాయి. –చింతా సుబ్బారావు, ఇన్చార్జి సర్పంచి,వైఎస్సార్సీపీ ఏజెంట్, పాల్వాయి గేట్‌పల్నాడు గ్రామాల్లో టీడీపీ దురాగతాలు..⇒ మాచర్ల రూరల్ మండలం: కొత్తూరు, కంభంపాడు, భైరవునిపాడు ⇒ రెంటచింతల: రెంటాల, జెట్టిపాలెం, పాలవాయిగేటు, గోలి, మిట్టగుడిపాడు ⇒ కారంపూడి: ఒప్పిచర్ల, కారంపూడి, పేటసన్నెగండ్ల, చింతపల్లి ⇒ దుర్గి: ముటుకూరు, అడిగొప్పల, పోలేపల్లి ⇒ వెల్దుర్తి: లోయపల్లి, వెల్దుర్తి, వజ్రాలపాడు, గొట్టిపాడు, నర్సపెంట ⇒ గురజాల: కేసానుపల్లి, మాదినపాడు, ఇరిగేపల్లి, తంగెడ, కొత్తగణేశునిపాడు, మాచవరం, బ్రాహ్మణపల్లి, పెదఅగ్రహారం, జానపాడు. ⇒ నరసరావుపేట: నరసరావుపేట పట్టణం, దొండపాడు, పమిడిపాడు. ⇒ సత్తెనపల్లి: పాకాలపాడు, మాదల, తొండపి, చాగంటివారిపాలెం, నార్నెపాడు, గణపవరం, చీమలమర్రి, రూపెనగుండ్ల, గుండ్లపల్లి, కుంకలగుంట, చేజర్ల. ⇒ వినుకొండ: నూజెండ్ల, రెడ్డికొత్తూరు, బొల్లాపల్లి, కొచ్చర్ల, గంటావారిపాలెం. ⇒ పెదకూరపాడు: ఎర్రబాలెం, లగడపాడు, చండ్రాజుపాలెం, మాదిపాడు. ⇒ చిలకలూరిపేట: అప్పాపురం -
టీడీపీ రిగ్గింగ్.. పూర్తి వీడియో బయటపెట్టాలి: కాసు మహేష్‌రెడ్డి
సాక్షి, నరసరావుపేట: మాచర్లలో చాలా చోట్ల టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరని.. దీనిపై ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు. పిన్నెల్లి తప్పు చేశారని టీడీపీ ప్రచారం చేస్తోంది. మొత్తం వీడియో బయటపెడితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి. ఒక్కటే వీడియో ఎందుకు రిలీజ్ చేశారు. రిగ్గింగ్ జరిగిందని చెప్తుంటే.. ఎందుకు వీడియో రిలీజ్ చేయడం లేదు?’’ అంటూ కాసు మహేష్‌రెడ్డి ప్రశ్నించారు.‘‘మాచర్లలో ఎవరు దాడి చేశారో ప్రజలందరికి తెలియాలి. మాచర్లలో అల్లర్లకు కారణం ఎవరు? టీడీపీ కాదా?. బీసీలు, ఎస్టీలు వైఎస్సార్సీపీకి ఓటేశారనే కారణంతో దాడులు చేశారు. అందరికీ చట్టపరమైన శిక్ష పడేవరకు పోరాడతాం. రిగ్గింగ్ జరిగిందని మేము చెబుతున్నాం.. మీరు ఎందుకు వీడియో బయటపెట్టడం లేదు?. ఎన్నికల అధికారులు ఆరోజు ఏమైందనేది మొత్తం వీడియో బయటపెట్టాలి. ఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు 2, 3 గంటల వీడియో బయటపెట్టాలి. మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు’’ అని కాసు మహేష్ చెప్పారు.‘‘దాడులకు సంబంధించి ఈసీ పూర్తి వీడియోలు బయటపెట్టాలి. ఏడు చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగిందని ఈసీనే చెబుతోంది. మాచర్ల వీడియోను మాత్రమే బయటపెట్టారు. మిగిలిన వీడియోలను ఎందుకు బయటపెట్టడం లేదు. ఈసీ విశ్వసనీయత కోల్పోతుంది. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం’’ అని కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు. -
సీసీటీవీలో బయటపడ్డ టీడీపీ రౌడీలు దాడి..
-
మరో ఐదు వైద్య ప్రభుత్వ కళాశాలల దిశగా సీఎం జగన్ అడుగులు
-
May 22nd: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 22nd AP Elections 2024 News Political Updates..7:23 PM, May 22nd, 2024టీడీపీ రిగ్గింగ్.. పూర్తి వీడియో బయటపెట్టాలి: కాసు మహేష్‌రెడ్డిమాచర్లలో చాలా చోట్ల టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారుపిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరని.. దీనిపై ఎంతవరకైనా పోరాటం చేస్తాంపిన్నెల్లి తప్పు చేశారని టీడీపీ ప్రచారం చేస్తోందిమొత్తం వీడియో బయటపెడితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి.ఒక్కటే వీడియో ఎందుకు రిలీజ్ చేశారు?రిగ్గింగ్ జరిగిందని చెప్తుంటే... ఎందుకు వీడియో రిలీజ్ చేయడం లేదు?మాచర్లలో ఎవరు దాడి చేశారో ప్రజలందరికి తెలియాలిమాచర్లలో అల్లర్లకు కారణం ఎవరు? టీడీపీ కాదా?బీసీలు, ఎస్టీలు వైఎస్సార్సీపీకి ఓటేశారనే కారణంతో దాడులు చేశారుఅందరికీ చట్టపరమైన శిక్ష పడేవరకు పోరాడతాంరిగ్గింగ్ జరిగిందని మేము చెబుతున్నాం.. మీరు ఎందుకు వీడియో బయటపెట్టడం లేదు?ఎన్నికల అధికారులు ఆరోజు ఏమైందనేది మొత్తం వీడియో బయటపెట్టాలిఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు 2, 3 గంటల వీడియో బయటపెట్టాలిమమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారుదాడులకు సంబంధించి ఈసీ పూర్తి వీడియోలు బయటపెట్టాలిఏడు చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగిందని ఈసీనే చెబుతోందిమాచర్ల వీడియోను మాత్రమే బయటపెట్టారుమిగిలిన వీడియోలను ఎందుకు బయటపెట్టడం లేదుఈసీ విశ్వసనీయత కోల్పోతుంది. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం 5:08 PM, May 22nd, 2024మాచర్ల నియోజకవర్గంలో అరాచకాలు చేసింది టీడీపీ నేతలేమాచర్లలో టీడీపీ నేతల రిగ్గింగ్‌ఒక్కొక్కటిగా బయటపడుతున్న వీడియోలువైఎస్సార్‌సీపీ మద్దతుదారులను ఓటు వేయనివ్వకుండా అడ్డుకున్న టీడీపీ మూకలురెంటచింతల మండలం పాల్వాయి గేటులోని 201, 202 పోలింగ్ బూత్‌లో టీడీపీ రిగ్గింగ్‌టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నా పట్టించుకోని ఎన్నికల అధికారులుఓటర్లను ఓటు వేయనివ్వని టీడీపీ నేతలుఓటర్లు బూత్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో దాడులకు తెగబడ్డ టీడీపీ నేతలుటీడీపీ నేతల రిగ్గింగ్‌పై పోలీసులు, ఎన్నికల అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదులుఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు4:56 PM, May 22nd, 2024ఓటర్లకు టీడీపీ డబ్బులు పంపిణీపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదుడబ్బుతో ఓట్లు కొనుగోలు చేసిన టీడీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదుఅంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక వర్గం టీడీపీ అభ్యర్థి ఓట్లను కొనుగోలు చేసేందుకు డబ్బులు పంచారుఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కి విరుద్ధంఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు2:00 PM, May 22nd, 2024ఈవీఎంల ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు రిమాండ్‌ఈవీఎం ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు కోర్టు రిమాండ్ విధించింది. నలుగురు టీడీపీ నేతలకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ బుధవారం కోర్టు ఆదేశం.ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. తుమృకోటలోని 203, 204, 205, 206 పోలింగ్ బూత్‌ల్లోని ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. టీడీపీ నేతలు వెంకట సతీష్, కోటయ్య, సైదులు, మహేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే, మరో 50 మంది టీడీపీ కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు కొంతమంది టీడీపీ నేతలు, కార్యకర్తలు అరెస్ట్ భయంతో పరారయ్యారు. 1:30 PM, May 22nd, 2024సిట్ ప్రాధమిక నివేదికపై ఈసీ తదుపరి చర్యలేంటి?తప్పుచేసిన పోలీసులపై కేసులు నమోదవుతాయాఇప్పటికే ఇద్దరు ఎస్పీలు...12 మంది పోలీసు అధికారుల సస్పెన్షన్శాఖాపరమైన విచారణకు ఆదేశంసిట్ నివేదికలో బట్టబయలైన పోలీసుల వైఫల్యంకొందరు పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సిట్ నివేదికనిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై కేసుల నమోదుకు ఈసి ఆదేశించే అవకాశంసిట్ పూర్తిస్ధాయి నివేదిక వరకు ఈసి వేచిచూస్తుందా 1:00 PM, May 22nd, 2024ఈసీ ఇచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం: ముఖేష్ కుమార్ మీనావిజయవాడసీఈఓ ముఖేష్ కుమార్ మీనా కామెంట్స్‌ఈవీఎం ధ్వంసం కేసులో కోర్టులో మెమో దాఖలు చేశాంవీడియో బయటకు రాక ముందే కేసు విచారణ సాగుతుందిఎమ్మెల్యేను అరెస్ట్ చేసి ఈరోజు సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది10 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాంఈవీఎంలో డేటా భద్రంగానే ఉందిఓటు వేసిన వారి డేటా కంట్రోల్ యూనిట్లో భద్రంగానే ఉన్నాయిసిట్ నివేదిక ను ఎన్నికల కమిషన్ కి పంపాముఈసీ ఇచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం 12:00 PM, May 22nd, 2024ఓటమి దిశగా పవన్..!జడ్పీ చైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యేగా కాకినాడ జిల్లాను అభివృద్ధి చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీత.ఎప్పుడూ ప్రజల మధ్యే వంగా గీత. అందుబాటులో ఉండని పవన్. రాజకీయాల్లో, ప్రజాదరణలో వంగా గీతకు ఏమాత్రం సరితూగని పవన్. వంగా గీతకే పట్టం కట్టిన పిఠాపురం ప్రజలు. 11:30 AM, May 22nd, 2024ఓటమి అంచున్న పురంధేశ్వరి! ఎన్నికల్లో ఓటమి అంచున నిలుచున్న ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. రాజమండ్రి గురించి ఏ మాత్రం తెలియకుండానే అక్కడి నుంచి పోటీ. ఇక, సీటు ఆశించి భంగపడిన సోము వీర్రాజుతో పురంధేశ్వరికి కుదరని సయోధ్య. 11:00 AM, May 22nd, 2024బాబు, పవన్ హైదరాబాద్‌కే పరిమితం..పవన్ కేవలం సినిమాలకే పరిమితమంటున్న సామాన్యులు. చంద్రబాబు, దత్తపుత్రుడు హైదరాబాద్‌కే పరిమితమంటున్న సామాన్య ప్రజలు. జూన్ 4న వైయస్ఆర్సీపీ జెండా సగర్వంగా ఎగురుతుంది.. చంద్రబాబు, దత్తపుత్రుడు హైదరాబాద్‌కే పరిమితం అవ్వడం ఖాయం.#YSRCPWinningBig#TDPJSPBJPCollapse#TDPLosing pic.twitter.com/RwItBFPTqb— YSR Congress Party (@YSRCParty) May 22, 2024 10:30 AM, May 22nd, 2024గన్నవరంలో పచ్చ బ్యాచ్ హల్‌చల్‌కృష్ణా జిల్లా..గన్నవరంలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌ఇద్దరు యువకులపై దాడి చేసిన టీడీపీ సానుభూతిపరులుఐదుగురు టీడీపీ వ్యక్తులున్నట్టు సమాచారంపచ్చ బ్యాచ్ దాడిలో యువకులకు తీవ్రగాయాలు బాధితుల ఫిర్యాదు విచారణ చేపట్టిన పోలీసులు. 8:30 AM, May 22nd, 2024ఎన్నికల కౌంటింగ్‌పై పోలీసుల ఫోకస్.. విజయవాడసార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై పోలీసులు ప్రత్యేక దృష్టిపోలింగ్ అనంతరం జరిగిన పరిమాల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుకౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల రక్షణ వలయం సిద్ధం చేస్తున్న పోలీసులుకలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు, మ్యాన్‌పవర్ మేనేజ్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్, నోడల్ అధికారులు, ఎన్ఐసీ, ఎన్కోర్ టీమ్ అధికారులతో సమావేశాలుకౌంటింగ్ విధులకు హాజరయ్యే ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు, కౌన్సెలింగ్ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పగడ్బందీగా బారికేడింగ్ పనులుకౌంటింగ్ రోజున ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలుఏపీ పోలీసులతో పాటు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్న సిఆర్పిఎఫ్, పారా మిలటరీ బలగాలు 7:20 AM, May 22nd, 2024గొడవలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం: ఎమ్మెల్యే పిన్నెల్లిపల్నాడులో టీడీపీ గెలిచే పరిస్థితి లేదు. అందుకే అందర్నీ తప్పుదోవ పట్టించేలా టీడీపీ నేతలు గొడవలు చేశారు. పోలింగ్ రోజు నుంచి జరిగిన గొడవలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు నేను సిద్ధంఅనవసరంగా అసత్య ప్రచారం చేస్తున్నారు. పల్నాడులో వాళ్లు గెలిచే పరిస్థితి లేకపోవడంతో అందర్నీ తప్పుదోవ పట్టించేలా టీడీపీ వాళ్లు గొడవలు చేశారు. పోలింగ్ రోజు నుంచి జరిగిన గొడవలపై సిట్టింగ్ జడ్జితో విచారణకి నేను సిద్ధం.-ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి#YSRCPWinningBig#TDPLosing pic.twitter.com/cgi2SMXSmR— YSR Congress Party (@YSRCParty) May 21, 2024 7:00 AM, May 22nd, 2024ఓట్ల లెక్కింపు రోజు విధ్వంసానికి పచ్చ ముఠాల ప్లాన్‌పోలింగ్ రోజు హింసకు మించి భయోత్పాతం సృష్టించే పన్నాగంకుట్రలపై పోలీసు శాఖను అప్రమత్తం చేసిన నిఘావర్గాలురాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలుఆ 3 జిల్లాలపై ప్రత్యేకంగా కన్నుగూండాలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు.. అంతా టీడీపీ మూకలేస్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతరెడ్‌జోన్ల ఏర్పాటు.. నిషేధాజ్ఞలు విధింపు.. డ్రోన్ కెమెరాల వినియోగం నిషిద్ధం 6:55 AM, May 22nd, 2024సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధంజూలకంటి బ్రహ్మారెడ్డిది నీచ సంస్కృతిటీడీపీ అనుకూల గ్రామాల్లో మా ఏజెంట్లపై దాడిఆ గ్రామాల్లోనే అలజడి సృష్టించారుపారిపోయి నియోజకవర్గానికి దూరంగా ఉండేది బ్రహ్మారెడ్డినేను ఎక్కడికి పారిపోలేదు... ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనే పోలీసుల సూచన మేరకు హైదరాబాద్ వచ్చా ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 6:45 AM, May 22nd, 2024పవన్ ఎక్కడ?పవన్ పర్యటనపైనా రాజకీయ వర్గాల్లో చర్చ14న ప్రధాని మోదీ నామినేషన్‌కు పవన్ హాజరుఅక్కడి నుంచి హైదరాబాద్ రాకఆ తర్వాత ఎవరికీ అందుబాటులో లేని పవన్‌రష్యా లేదా దుబాయ్ వెళ్లి ఉంటారంటున్న పార్టీ వర్గాలు 6:40 AM, May 22nd, 2024సోమిరెడ్డికి, టీడీపీ వాళ్లకు సవాల్ చేస్తున్నా: మంత్రి కాకాణిబ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను రెడీ.. సోమిరెడ్డి సిద్ధంగా ఉన్నారా ?నెల్లూరు లో ఎక్కడికి రావాలో చెప్తే అక్కడికి వస్తాఎవరికి రేవ్ పార్టీకి వెళ్లే అలవాటు ఉందో తెలుస్తుందిఆధారాలు ఉంటే సోమిరెడ్డి పోలీసులకు ఇవ్వాలిబెంగళూరు రేవ్ పార్టీపైసీబీఐ దర్యాప్తుకు నేను సిద్ధంగా ఉన్నాబ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి వస్తావా.. ? పాస్ పోర్ట్ చూపించడానికి వస్తావా ?రేవ్ పార్టీలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఉన్నారని సోషల్ మీడియాలో వస్తుంది..బెంగళూరు పోలీసులు ఎటువంటి కాల్ చేయలేదురేవ్ పార్టీ జరిగిన ఫార్మ్ హౌస్ గోపాల్ రెడ్డి ఎవరో నాకు తెలియదుపాసు పోర్ట్ నా దగ్గరే ఉందికుట్ర కోణం పై విచారణ చేయాలని పోలీసులను కోరానురోస్ ల్యాండ్ లాడ్జిలో చంద్రమోహన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికారుసోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లోఫర్బెంగళూరు రేవ్ పార్టీ విషయంలో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారునాకు సంబంధాలు ఉన్నా.. నాకు సంబధించిన వారు ఎవరు ఉన్నా చర్యలు తీసుకోవాలిఎవడో అనామకుడు నా స్టిక్కర్‌ను జిరాక్స్ తీసి వాడుకున్నారురేవ్ పార్టీలు, రేప్ పార్టీలు చేసే చరిత్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిదిసోమిరెడ్డి లేడీ డాక్టర్ ను ఇబ్బంది పెట్టిన కథనాలు గతంలో పత్రికల్లో వచ్చాయినాపై మూడోసారి కూడా సోమిరెడ్డి ఓడిపోతున్నారు.. ఆ ప్రెస్టేషన్ లో ఏదో మాట్లాడుతున్నారుయూత్ మినిస్టర్ గా ఉండి.. క్రికెట్ కిట్స్ అమ్ముకున్న చరిత్ర సోమిరెడ్డిదినా పాస్ పోర్ట్ నెల్లూరు లో ఉందికారు స్టిక్కర్ జిరాక్స్ చేసి నాపై కుట్ర చేసినట్లు అనుమానాలు ఉన్నాయి.. కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశా 6:30 AM, May 22nd, 2024ఎల్లో మీడియాకు చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికెళ్లారు?: మంత్రి జోగి రమేష్‌దోచినడబ్బంతా దుబాయ్‌లో దాచడానికి వెళ్లారా?చంద్రబాబు కనిపించకుండా పోతే టీడీపీ అడ్రస్ గల్లంతుటీడీపీ నాయకులు నోటికి తాళాలు పడ్డాయి.కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారుఎస్పీలను, కలెక్టర్లను మార్చిన చోటే గొడవలు జరిగాయిచంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా.. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయంచంద్రబాబు వ్యవస్థలను భ్రష్టు పట్టించారువైఎస్సార్‌సీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలిపల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే. -
మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కన్నుమూత
కొవ్వూరు: వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు (71) మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో ఎన్టీ రామారావుపై అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చారు. వరుసగా 1983, 1985 (మధ్యంతర ఎన్నికలు), 1989, 1994, 2004లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీలు వేరైనప్పటికీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో కృష్ణబాబుకు అత్యంత సాన్నిహిత్యం ఉండేది. దీంతో ఆయన మరణానంతరం 2012లో వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీపీలో చేరారు. జిల్లా రాజకీయాల్లోనూ, గోపాలపురం, పోలవరం నియోజకవర్గాల్లో పునర్విభజన అనంతరం కొవ్వూరులోనూ కృష్ణబాబు రాజకీయంగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన భార్య నాగమణి గతంలోనే మరణించారు. కృష్ణబాబుకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ సలహాదారు, పార్టీ కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న ఎస్.రాజీవ్‌కృష్ణ ఆయన అల్లుడు. కృష్ణబాబు మృతి పట్ల రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, కొవ్వూరు మునిసిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారితోపాటు పలువురు రాష్ట్ర, జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన స్వగ్రామమైన దొమ్మేరులో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
నేను ఎక్కడికి పారిపోలేదు.. సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం
సాక్షి, పల్నాడు: ‘టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిది నీచ సంస్కృతి. ఫ్యాక్షనిజమే అతని జీవితం..’ అని వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలో జరిగిన గొడవలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమని పిన్నెల్లి ప్రకటించారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆజ్యం పోసి.. ఆయన మాత్రం నియోజకవర్గానికి దూరంగా ఉంటూ ప్రజలను పట్టించుకోవడం లేదు. అటువంటి వ్యక్తి నేను పారిపోయానని చెప్పటం హాస్యాస్పదంగా ఉంది. ఏడు మర్డర్ కేసుల్లో ఏ–1గా ఉన్న బ్రహ్మారెడ్డి నాపై చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మడం లేదు. నాపై పోటీ చేసి ఓడిపోయిన బ్రహ్మారెడ్డి గుంటూరుకు పారిపోయాడు. ఆ తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. ఎన్నికల ముందు బ్రహ్మారెడ్డిని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, చంద్రబాబు తీసుకొచ్చి పల్నాడులో ఫ్యాక్షన్‌కు ఆజ్యం పోశారు. కారెంపూడి మండలంలోని చింతపల్లి, ఒప్పిచర్ల, రెంటచింతల మండలంలో తుమృకోట, పాలవాయిగేటు గ్రామాల్లో కమ్మ సామాజికవర్గానికి చెందినవారు మా ఏజెంట్లను తరిమికొట్టి గొడవలు సృష్టించారు. కారెంపూడి సీఐ నారాయణస్వామి ద్వారా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ గ్రామాల్లో గొడవలు జరుగుతాయని బందోబస్తు పెంచాలని హైకోర్టు నుంచి ముందుగానే ఆర్డర్ తీసుకొచ్చి ఎస్పీకి ఇచ్చినా పట్టించుకోలేదు. ఎన్నికల రోజు గొడవలు జరిగినా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పోలీసుల సూచనల మేరకు హైదరాబాద్‌కు వచ్చాను. మర్డర్లు చేసి పారిపోయిన చరిత్ర నాకు లేదు. నేను ఎన్నడూ పారిపోలేదు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కమ్మ సామాజికవర్గాన్ని ఒకటి చేయటానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు కూడా బ్రహ్మారెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు కలిసి గొడవలు చేశారు. టీడీపీని గెలిపించేందుకు సీఐ నారాయణస్వామి దాడులకు పాల్పడ్డారు. ఈ అల్లర్లపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు నేను సిద్ధంగా ఉన్నా. బ్రహ్మారెడ్డిలా నీచ రాజకీయాలు చేసి పారిపోయే చరిత్ర నాది కాదు. నేను ఎప్పుడూ ప్రజలకు వెన్నంటే ఉంటాను. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. మీ ప్రభుత్వంలో ఏం చేశారో చెప్పండి. చందాలు వసూలు చేసి ఇల్లు కట్టుకుని చందాల నాయకుడుగా మారిన బ్రహ్మారెడ్డి నన్ను విమర్శించడం సిగ్గుచేటు.’ అని పిన్నెల్లి రామకృష్ణరెడ్డి చెప్పారు. -
మరో ఐదు మెడికల్ కాలేజీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు 2024–25 విద్యా సంవత్సరంలో ప్రారంభం కానున్నాయి. ఈ దిశగా సీఎం జగన్ ప్రభుత్వం చేపట్టిన కసరత్తు తుది దశకు చేరుకుంది. పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లెలో కొత్తగా వైద్య కళాశాలలను ప్రారంభించి ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాబట్టేలా వైద్య శాఖ కసరత్తు చేస్తోంది. ఈమేరకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) త్వరలో ఐదు చోట్ల ఇన్స్పెక్షన్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. తనిఖీలు పూర్తయిన అనంతరం ఆయా కళాశాలలకు అనుమతులు మంజరు కానున్నాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడంతో పాటు అన్ని జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను పేదలకు అందుబాటులోకి తెస్తూ 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2023–24లో నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం వైద్య కళాశాలలను ఇప్పటికే ప్రారంభించారు. ఒక్కో చోట 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లను అదనంగా అందుబాటులోకి తెచ్చారు.ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగాఐదు చోట్ల ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులను అభివృద్ధి చేస్తున్నారు. వైద్య కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 3,530 పోస్టులను మంజూరు చేశారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఎస్పీఎం, జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్స్ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు నర్సింగ్, మెడికల్, నాన్ మెడికల్, అడ్మినిస్ట్రేషన్ పోస్టులను మంజూరు చేసి భర్తీ కూడా చేపట్టారు. ఈ కళాశాలలన్నీ మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉన్నందున పోస్టులన్నీ భర్తీ చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో ప్రారంభించే 7 వైద్య కళాశాలలకు ఈ తరహా ఇబ్బందులు తలెత్తకుండా ఫ్యాకల్టీకి అదనపు ప్రోత్సాహకాలు కల్పించారు. పాడేరు, మార్కాపురం, పార్వతీపురం, పిడుగురాళ్ల, పెనుకొండ కాలేజీల్లో ఫ్యాకల్టీకి బేసిక్‌పై 50 శాతం ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. మైదాన ప్రాంతాల్లోని పులివెందుల, మదనపల్లె, ఆదోని, అమలాపురం, బాపట్ల, పాలకొండ, నర్సీపట్నం కళాశాలల్లో బేసిక్‌పై 30 శాతం ప్రోత్సాహకాన్ని అందించనున్నారు. రూ.8,480 కోట్లతో మెడికల్ కాలేజీలువైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాడు–నేడు ద్వారా రూ.16 వేల కోట్లతో వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసింది. ఇందులో రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది ఐదు కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించింది. ఈ ఏడాది మరో ఐదు ప్రారంభం కానున్నాయి. మిగిలిన ఏడు వచ్చే ఏడాది ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. ఈమేరకు ఏడు చోట్ల ప్రభుత్వాస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేసేందుకు వీలుగా పడకల సంఖ్య పెంచుతూ వైద్య శాఖ నిర్ణయం తీసుకుంది. -
వంగా గీతకు చేతులెత్తి మొక్కిన యాంకర్ శ్యామల
-
ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
సాక్షి, విజయవాడ: ఎల్లో మీడియాకు చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికి వెళ్లారని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. చంద్రబాబు కనిపించకుండా పోతే టీడీపీ అడ్రస్ గల్లంతవుతుందని అన్నారు. దోచిన డబ్బంతా దుబాయ్‌లో దాచడానికి వెళ్లరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పరార్‌తో టీడీపీ నాయకుల నోటికి తాళాలు పడ్డాయని విమర్శించారు. కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారన్నారు జోగి రమేష్. ఎస్పీలను, కలెక్టర్లను మార్చిన చోటే గొడవలు జరిగాయని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా.. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు జోగి రమేష్. పల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే కారణమని దుయ్యబట్టారు. టీడీపీ అడ్రస్ గల్లంతు కాబోతుంది కాబట్టే చంద్రబాబు విధ్వంసానికి పాల్పడ్డాడని విమర్శించారు. పురందేశ్వరి ఈసీకి తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లే అధికారులను మార్చారనిన్నారు.కాగా అడుగు తీసి అడుగేస్తే మీడియాలో ప్రచారం కోరుకునే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గప్‌చుప్‌గా విదేశాలకు ఉడాయించారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే విషయంపై గోప్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ తొలుత మీడియాకు లీకులిచ్చింది.అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్నారై విభాగం నేత కోమటి జయరాం మాత్రం ఆయన అసలు అమెరికా రాలేదని ప్రకటించడం గమనార్హం. విదేశాల నుంచి అక్రమ నిధులను భారత్‌లోని షెల్ కంపెనీలకు మళ్లించిన చరిత్ర ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారు? ఏం చేస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు ఏమిటన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే తాజా విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు ఇటలీలో ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది.చదవండి: ఇట్లు ఇటలీకి -
మాచర్ల టార్గెట్‌గా ’దేశం‘ ఆపరేషన్ దమనకాండ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మాచర్లలో జెండా పాతడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ చేసిన ఆపరేషన్‌కు పోలీసు ఉన్నతాధికారులు, సర్కిల్ అధికారులు అండగా నిలిచారు. పోలింగ్ రోజు, తదనంతరం అక్కడ జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తున్నా డీఐజీ గానీ, అప్పటి ఎస్పీ గానీ, కలెక్టర్‌గానీ స్పందించకపోవడం దీన్ని బలపరుస్తోంది. తెలుగుదేశం పార్టీ తమ సామాజిక వర్గం అధికంగా ఉన్న గ్రామాల్లో మొదటి నుంచి వ్యూహాత్మకంగా రిగ్గింగ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంది. చివరి నిముషంలో అదే సామాజిక వర్గానికి చెందిన అధికారినీ తీసుకురావడంతో ఆ పార్టీ నేతలు మరింత రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత కూడా మాచర్ల రణరంగంగాన్ని తలపించింది. టీడీపీ కుట్రలు, కుయుక్తులపై వైఎస్సార్ సీపీ బృందం సోమవారం ఎన్నికల సంఘం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) అధినేత వినీత్ బ్రిజ్‌లాల్‌కు ఫిర్యాదు చేసింది. ఫ్యాక్షన్ జూలు విదిల్చిన జూలకంటి జూలకంటి బ్రహా్మనందరెడ్డిని టీడీపీ మాచర్ల ఇన్చార్జ్గా ప్రకటించినప్పటి నుంచి అక్కడ మళ్లీ ఫ్యాక్షన్ ఊపిరి పోసుకుంది. ఎప్పుడైతే ఆయనను టీడీపీ అభ్యరి్థగా ప్రకటించిందో అప్పటి నుంచి నియోజకవర్గంలో ఆయన సమస్యలు సృష్టించడం మొదలుపెట్టారు. మాచర్లను కైవసం చేసుకోవాలంటే పల్నాడు జిల్లాలో అప్పుడు ఉన్న ఐజీ, ఎస్పీ ఇతర అధికారులు ఉంటే సాధ్యం కాదని జూలకంటి, టీడీపీ అధినాయకులు గుర్తించారు. దీంతో వారు ఆ ఎస్పీని టార్గెట్‌గా చేసుకున్నారు. ఆయన ఉంటే బూత్ క్యాప్చర్, ఓటర్లను భయపెట్టడం కుదరని అభిప్రాయపడ్డారు. అప్పుడే పొత్తు పెట్టుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ద్వారా పావులు కదిపారు. జిల్లాలో రెడ్డి, ఎస్సీ అధికారులు ఉంటే తమ పన్నాగం పారదని, వారిని మార్చాలని ఒత్తిడి తీసుకువచ్చారు. ఐజీ పాల్‌రాజ్‌ను బదిలీ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించకపోయినా గత తెలుగుదేశం ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఒక అధికారికి సన్నిహితంగా ఉండే అధికారిని తీసుకువచ్చి పోస్టింగ్ ఇప్పించారు. పల్నాడు ఎస్పీగా గతంలో సెబ్ అడిషనల్ ఎస్పీగా పనిచేసిన బింధుమాదవ్ను తీసుకువచ్చారు. వారు వచ్చిన తర్వాత కిందిస్థాయి సిబ్బందికి తెలుగుదేశం నాయకులను టచ్ చేయ వద్దంటూ మౌఖిక ఆదేశాలు వెళ్లాయి.పేట్రేగిపోయిన పచ్చమూకలు 11న రెంటచింతలకు వెళ్లిన సీఐ నారాయణ స్వామి తెలుగుదేశం నేతలకు మీ ఇష్టం వచ్చినట్లు ఎన్నిక నిర్వహించుకోండని చెప్పినట్లు సమాచారం. దీంతో టీడీపీ నేతలు పేట్రేగిపోయారు. అదేరోజున కారంపూడి మండలం వైఎస్సార్ సీపీ జేసీఎస్ కన్వీనర్ వెంకటేశ్వరరెడ్డిపై దాడి చేసి బెదిరించారు. వేపకంపల్లిలో తెలుగుదేశం నేతలు మహేష్ అనే వ్యక్తిపై ఆరోపణలు చేసి అతనిపై దాడి చేస్తే తొలుత ఒక హెడ్ కానిస్టేబుల్‌ను పంపారు. ఆ తర్వాత సీఐ వెళ్లి మహేష్ ను కరెంట్ స్తంభానికి కట్టేయించి అవమానించారు. 12న రెంటచింతలలో నారాయణస్వామి ఉండగానే తెలుగుదేశం నేతలు మోర్తాల ఉమా మహేశ్వరరెడ్డిపై దాడి చేశారు. రెంటచింతల మండలం పాల్వయిగేట్ పోలింగ్ స్టేషన్ 201, 202 వద్ద టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ ఏజెంట్లనూ అనుమతించలేదు. తొమ్మిది గంటల ప్రాంతంలో ఐజీ శ్రీకాంత్ జోక్యంతో ఏజెంట్లను అనుమతించారు. జెట్టిపాలెంలో 214, 217 పోలింగ్ బూత్‌లలోకి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను అనుమతించలేదు. దీనిపై గ్రామస్తులు ప్రశ్నించినప్పుడు సీఐ నారాయణస్వామి వచ్చి వైఎస్సార్ సీపీ ఏజెంట్లను భయపెట్టి బయటకు పంపారని గ్రామస్తులు చెబుతున్నారు. తుమృకోటలో టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడినప్పుడు ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈవీఎంలూ ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత కొత్త ఈవీఎంలు పెట్టి వైఎస్సార్ సీపీ ఏజెంట్లు లేకుండానే ఎన్నిక కొనసాగించారు. వెల్దుర్తిలోని 137, 138, 139, 140, 141 పోలింగ్ స్టేషన్లలో రాత్రి ఏడు గంటల తర్వాత వైఎస్సార్ సీపీ ఏజెంట్లను బయటకు పంపి రిగ్గింగ్ చేశారు. దీనిపై ఎస్పీకి ఫిరాదు చేసినా స్పందించలేదు. ఒప్పిచర్లలో 250, 251, 252, 256 పోలింగ్ స్టేషన్లలో ఇతర సామాజిక వర్గాల వారు ఓటు వేసుకోలేని పరిస్థితి నెలకొంది.‘నారా’యణస్వామి భక్తి కారంపూడి సర్కిల్లో కారంపూడి, రెంటచింతల, దుర్గి పోలీసుస్టేషన్లు ఉన్నాయి ఇక్కడ బీసీ వర్గానికి చెందిన సీఐ చినమల్లయ్య సమర్థంగా విధులు నిర్వహించారు. ఆయనను అర్ధంతరంగా ఎన్నికల ముందు బదిలీ చేశారు. ఆయన స్థానంలో తమ సామాజిక వర్గానికి చెందిన నారాయణస్వామిని తెలుగుదేశం నాయకులు తీసుకువచ్చి పోస్టింగ్ ఇప్పించుకున్నారు. ఆయన వచ్చీ రాగానే తన సామాజిక వర్గ నాయకులకు పగ్గాలు ఇచ్చేశారు. ఎన్నికల్లో మీరు ఎలాగైనా పనిచేసుకోవచ్చని తెలుగుదేశం పార్టీలోని నాయకులకు అభయం ఇచ్చేశారు. ఆయన ఫోన్ కాల్, వాట్సప్, ఫేస్‌టైమ్ డేటాను పరిశీలిస్తే ఆయన తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా పని చేసింది అర్థమవుతుందని వైఎస్సార్ సీపీ బృందం తన ఫిర్యాదులో పేర్కొంది.వెల్దుర్తి పరిధిలో కొందరు టీడీపీ నేతలు పోలీసు కానిస్టేబుళ్ల మీద చేయి చేసుకున్నట్లు ఫిర్యాదు రిజిస్టర్ అయినా దాడి చేసిన వారిని కనీసం స్టేషన్‌కు కూడా పిలవలేదు. ఎన్నికల ముందు బైండోవర్ కూడా చేయలేదు. ఎన్నికలకు మూడు రోజుల ముందు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య శిరిగిరిపాడు గ్రామంలో ప్రచారం చేస్తుండగా ఆమెపై దాడి చేశారు. బందోబస్తుగా వచ్చిన ఎస్ఐ ఇతర పోలీసు సిబ్బందిపై కూడా తెలుగుదేశం నేతలు దాడి చేశారు. దీనిపై రెండు ఫిర్యాదులు వచ్చినా దాడి చేసిన వారిని ఎవరినీ పోలీసుస్టేషన్‌కు పిలవలేదు. పైగా బాధితుడైన ఎస్ఐతోపాటు కారంపూడి, మాచర్ల టౌన్ సీఐలను బదిలీ చేశారు. దీంతో పోలీసుల్లో అభద్రతా భావం ఏర్పడింది. దీన్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం నాయకులు గ్రామాల్లో రెచ్చిపోయారు. రెంటచింతలలో సుమారు రెండు లక్షల హోలోగ్రామ్ ఉన్న ఓటర్ స్లిప్‌లను స్వాధీనం చేసుకుంటే కలెక్టర్ చర్యలు తీసుకోకపోగా బస్‌ను కూడా సీజ్ చేయకుండా వదిలేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎస్పీ బిందుమాధవ్తోపాటు కొంతమంది అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్నా.. ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించిన మరికొందరు అధికారులను కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
May 21st: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 21st AP Elections 2024 News Political Updates5:17 PM, May 21st, 2024సోమిరెడ్డికి, టీడీపీ వాళ్లకు సవాల్ చేస్తున్నా: మంత్రి కాకాణిబ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను రెడీ.. సోమిరెడ్డి సిద్ధంగా ఉన్నారా ?నెల్లూరు లో ఎక్కడికి రావాలో చెప్తే అక్కడికి వస్తాఎవరికి రేవ్ పార్టీకి వెళ్లే అలవాటు ఉందో తెలుస్తుందిఆధారాలు ఉంటే సోమిరెడ్డి పోలీసులకు ఇవ్వాలిబెంగళూరు రేవ్ పార్టీపైసీబీఐ దర్యాప్తుకు నేను సిద్ధంగా ఉన్నాబ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి వస్తావా.. ? పాస్ పోర్ట్ చూపించడానికి వస్తావా ?రేవ్ పార్టీలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఉన్నారని సోషల్ మీడియాలో వస్తుంది..బెంగళూరు పోలీసులు ఎటువంటి కాల్ చేయలేదురేవ్ పార్టీ జరిగిన ఫార్మ్ హౌస్ గోపాల్ రెడ్డి ఎవరో నాకు తెలియదుపాసు పోర్ట్ నా దగ్గరే ఉందికుట్ర కోణం పై విచారణ చేయాలని పోలీసులను కోరానురోస్ ల్యాండ్ లాడ్జిలో చంద్రమోహన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికారుసోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లోఫర్బెంగళూరు రేవ్ పార్టీ విషయంలో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారునాకు సంబంధాలు ఉన్నా.. నాకు సంబధించిన వారు ఎవరు ఉన్నా చర్యలు తీసుకోవాలిఎవడో అనామకుడు నా స్టిక్కర్‌ను జిరాక్స్ తీసి వాడుకున్నారురేవ్ పార్టీలు, రేప్ పార్టీలు చేసే చరిత్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిదిసోమిరెడ్డి లేడీ డాక్టర్ ను ఇబ్బంది పెట్టిన కథనాలు గతంలో పత్రికల్లో వచ్చాయినాపై మూడోసారి కూడా సోమిరెడ్డి ఓడిపోతున్నారు.. ఆ ప్రెస్టేషన్ లో ఏదో మాట్లాడుతున్నారుయూత్ మినిస్టర్ గా ఉండి.. క్రికెట్ కిట్స్ అమ్ముకున్న చరిత్ర సోమిరెడ్డిదినా పాస్ పోర్ట్ నెల్లూరు లో ఉందికారు స్టిక్కర్ జిరాక్స్ చేసి నాపై కుట్ర చేసినట్లు అనుమానాలు ఉన్నాయి.. కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశా 5:08 PM, May 21st, 2024మేం గెలుస్తామని...జూన్ 9న ప్రమాణ స్వీకారం అని చెప్పాం: మంత్రి బొత్స సత్యనారాయణఎన్నికలు పూర్తయ్యాయి...భవితవ్యం బ్యాలెట్ బాక్సులలో ఉన్నాయిఏపీలో విద్యావిదానంపై మా విధానాన్ని మ్యానిఫెస్టోలో పెట్టాంప్రతిపక్ష పార్టీలు మా విద్యావిధానం నచ్చకపోతే ఎందుకు వారి విధానాన్ని మేనిఫెస్టోలో పెట్టలేదురాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 38,61,198 మంది చదువుతుంటే వాస్తవ విరుద్దంగా 35 లక్షలే ఉన్నారని ఇచ్చారుఏపీ విద్యార్ధులు అంతర్జాతీస్ధాయిలో రాణించేలా ఎన్నోకీలక మార్పులు తెచ్చాంఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య, టోఫెల్,జగనన్న గోరుముద్ద, విద్యాదీవెన, విద్యాకానుక, విదేశీ విద్యాదీవెన ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాంవిద్యావ్యవస్ధపై ఎందుకు తప్పుడు కధనాలు ప్రచురిస్తున్నారుమాపై బురద జల్లుతున్నారువిద్యావ్యవస్ధలో ఇంకా మంచి మార్పులు తీసుకురావాలని మా ఆలోచనమా విధానాలు నచ్చ పెద్ద ఎత్తునమాకు అనుకూలంగా ఓటేశారని భావిస్తున్నాంమళ్లీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారునేను ఎన్నో ఎన్నికలు చూశాను కానీ ఇలాంటి పరిస్ధితులు ఎపుడూ చూడలేదుప్రధాన పార్టీ నాయకులంతా ప్రస్తుతం విదేశాలలో ఉన్నారుసీఎం జగన్ ఫ్యామిలీతో విదేశాలకి వెళ్లారువాతావరణం అనుకూలించక మద్యలో ఆగితే తప్పుడు ప్రచారాలు ఎందుకు?చంద్రబాబు చెప్పాపెట్టకుండా విదేశాలకి వెళ్లారుచంద్రబాబు ఏ దేశం వెళ్లారో కూడా తెలియదుచంద్రబాబు ఏ దేశం వెళ్లారో చెప్పాలిచంద్రబాబు కంటే ముందే ఆయన కుమారుడు విదేశాలకి వెళ్లారురాష్ట్ర ప్రజలని కోరుతున్నా....సంయమనం పాటించాలని కోరుతున్నాసోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు ఆపండిరాష్డ్ర అభివృద్దిలో అందరూ భాగస్వామ్యులమేఎందుకు హర్రీ అండ్ వర్రీచంద్రబాబు ప్రజలకి చెప్పి విదేశాలకి వెళ్తే తప్పేంటి?ఎందుకు చెప్పకుండా చంద్రబాబు విదేశాలకి వెళ్లారుభయంతో చంద్రబాబు విదేశాలకి పారిపోయారా?సిఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనలపై ఎందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు?అమెరికాలో నివాసం ఉన్న డాక్టర్ గన్నవరంలో హల్ చల్ చేయడం ఏంటి?సిఎం వైఎస్ జగన్‌ని అడ్డుకోవాలని మెసేజ్‌లు పెట్టడం.. డిబేట్లు ఏంటి?ఈ తరహా కల్చర్ ఎపుడూ లేదుమాకు 175 సీట్లు వస్తాయని అనుకుంటున్నామేనిఫెస్టోని చూసి ఓటేయమని ఏ సీఎం అయినా చెప్పారా?తన పాలన చూసి ఓటేయాలని ప్రధాని మోదీనే అడగలేకపోయారుమీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయమని జగన్ మాత్రమే అడిగారుసీఎం జగన్ రాజకీయాలలో ట్రెండ్ సెట్ చేశారునా తప్పులని దిద్దుకుంటానని అధికారంలోకి వచ్చి మళ్లీ చంద్రబాబు మోసం చేశారురైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని మోసం చేయలేదాచంద్రబాబుకి క్రెడిబిలిటీ లేదుదేశంలోనే ఎక్కడా లేని విధంగా వైద్యం, విద్యా రంగాల్లో సంస్కరణలు అమలు చేశాంమా సంస్కరణలతో ఏపీ జీడీపీ పెరిగిందిగ్రామాలలో వృద్దులకి, మహిళలకి ఎంతో గౌరవం పెరగడానికి మా సంక్షేమ పథకాలే కారణంవాలంటీర్, సచివాలయ వ్యవస్ధలతో క్షేత్రస్ధాయిలోకి వెళ్లే వ్యవస్ధ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదుకరోనా సమయంలో అలాంటి వ్యవస్ధతో సమర్దవంతంగా ఎదుర్కొన్నాంప్రజలకి కావాల్సిన విధానాలని...సంస్కరణలనే సిఎం వైఎస్ జగన్ అమలు చేశారుఅందుకే సీఎం జగన్‌కి మళ్లీ పట్టం కట్టారని భావిస్తున్నాంప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మానా...ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడానికిఆ రోజు భ్రమలలో ఉండి ప్రశాంత్ కిషోర్‌ని తీసుకొచ్చాంసిఎం వైఎస్ జగన్ పర్మినెంట్‌గా ఉండే విధానాలనే నమ్ముతారుప్రశాంత్ కిషోర్ కమర్షియల్ అని తెలుసుకునే వద్దనుకున్నాం2:32 PM, May 21st, 2024ఎల్లో మీడియాకు చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికెళ్లారు?: మంత్రి జోగి రమేష్‌దోచినడబ్బంతా దుబాయ్‌లో దాచడానికి వెళ్లారా?చంద్రబాబు కనిపించకుండా పోతే టీడీపీ అడ్రస్ గల్లంతుటీడీపీ నాయకులు నోటికి తాళాలు పడ్డాయి.కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారుఎస్పీలను, కలెక్టర్లను మార్చిన చోటే గొడవలు జరిగాయిచంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా.. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయంచంద్రబాబు వ్యవస్థలను భ్రష్టు పట్టించారువైఎస్సార్‌సీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలిపల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే2:24 PM, May 21st, 2024ఈనాడు వార్తలను ఖండించిన సీఎస్‌డీఎస్‌ఏపీలో మేం పోస్ట్ పోల్ సర్వే నిర్వహించాంమా సర్వే రిపోర్ట్ నాలుగు రోజుల్లో వస్తుందిటీడీపీకే జనం అనుకూలంగా ఉన్నారనే వార్త అవాస్తవంసెఫాలజిస్ట్ సంజయ్‌కుమార్ మాటలు కూడా నిరాధారమే: సీఎస్డీఎస్ ఏపీ కోఆర్డినేటర్ వెంకటేష్2:01 PM, May 21st, 2024జూలకంటి బ్రహ్మారెడ్డి దుర్మార్గుడు: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిమాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మరెడ్డిపై మండి పడ్డ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిజూలకంటి బ్రహ్మరెడ్డి చరిత్ర మర్డర్లు చేసే చరిత్రఅభివృద్ది చేసే చరిత్ర మాదిసిట్టింగ్ జడ్జితో విచారణకు నేను కూడా సిద్దంఏడు మర్డర్ల కేసులో ఏ1 ముద్దాయి జూలకంటి బ్రహ్మారెడ్డిజూలకంటి బ్రహ్మారెడ్డి దుర్మార్గుడు 2009లో నాపై ఓడిపోయి మాచర్ల నుంచి పారిపోయాడువైఎస్సార్‌సీపీ పాలనలో మాచర్ల నియోజకవర్గం అభివృద్ధినీతి కబుర్లు చెబుతూ షో చేస్తూ చందాల మీద బతికే వ్యక్తి జూలకంటి బ్రహ్మారెడ్డి11:32 AM, May 21st, 2024ఎస్సీలంతా వైఎస్సార్సీపీకే ఓటు వేశారు: మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు నత్తా యోనారాజుఆ అక్కసుతోనే దళితులపై దాడులు జరిపారువదినా మరిది అయిన పురందేశ్వరి, చంద్రబాబు పోలీసులను మార్చారుపోలీసు అధికారులు మారిన చోటే ప్లాన్ ప్రకారం దాడులు జరిపారుఎలక్షన్ కమిషన్ కిందే వ్యవస్థలు పని చేస్తున్నాయిచంద్రబాబు తన మనమడికి 6 నెలల వయసున్నపుడే వందలకోట్లు జమ చేశాడుపాలన ద్వారా జగన్ పేదల పాలిట దైవంగా మారారుసీఎం జగన్‌ను ఓడించే దమ్ము, ధైర్యం టీడీపీకి లేవుపేదలకు జరిగే లబ్ధిని చూసి ఓర్వలేకే దాడులు జరిపారుపేదల పిల్లలు ఐక్య రాజ్య సమితికి వెళ్లి మాట్లాడుతున్నారుఎస్సీల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారని ప్రశ్నించిన వ్యక్తి చంద్రబాబుబీసీల తోకలు కత్తిరిస్తానంటూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబుబీజేపీతో కలిసి చంద్రబాబు రాష్ట్రాన్ని మరో మణిపూర్ చేయాలని చూస్తున్నారుఎస్సీలంతా జగన్ వైపే ఉన్నారు10:43 AM, May 21st, 2024కేంద్ర ఎన్నికల సంఘానికి చేరిన సిట్ నివేదిక150 పేజీల ప్రాథమిక నివేదికను సీఈసీకి పంపిన ఏపీ సీఎస్ఏపీలో ఎన్నికల రోజు, తర్వాత హింసపై సిట్ ప్రాథమిక నివేదికపల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో.. మొత్తం 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు గుర్తించిన సిట్1370 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు, 124 మంది అరెస్ట్ఇంకా 1152 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని సిట్ నివేదికఎఫ్‌ఐఆర్‌లో కొత్త సెక్షన్ల చేర్చే విషయంపై సిఫార్సు చేసిన సిట్8:40 AM, May 21st, 2024దుష్ప్రచారం చేయడం డాక్టర్ లోకేశ్‌కు అలవాటే: ప్రముఖ ఎన్ఆర్ఐ డాక్టర్ వాసుదేవరెడ్డి వెల్లడికోర్టుల్లో తప్పుడు కేసులు వేయడంలో నేర్పరి చీవాట్లు పెట్టి జరిమానా విధించిన అమెరికా కోర్టుపలువురు రోగుల మరణానికి కారకుడయ్యాడని ప్రాక్టీస్ పైనా నిషేధంఏపీలో ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని మేధావిగా చలామణి అవుతున్నారుఅయితే అమెరికాలో 18 ఏళ్లుగా ఆయన ప్రాక్టీస్‌పై నిషేధం కొనసాగుతోందిగుంటూరు మెడికల్ కాలేజీలో 1983లో లోకేశ్ గ్రాడ్యుయేట్ అయ్యాడుగ్యాస్ట్రో విభాగంలో ఎండీ పూర్తిచేసిన ఆయన అమెరికాలోని వర్జీనియాలో తొలుత ప్రాక్టీస్ మొదలెట్టాడుఅప్పటి నుంచే ఎదుటి వ్యక్తులపై అవాస్తవ ఆరోపణలు చేయడం, కోర్టుల్లో తప్పుడు కేసులు ఫైల్ చేయడం లోకేశ్‌కు అలవాటుప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో ఆస్పత్రి యాజమాన్యంపై, సహచర వైద్యులపై కోర్టులో కేసులు వేసి, ఆ ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమయ్యాడుఇదే తరహాలో 2022లో భారత ప్రధాని మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్, అదానీ మీద వాషింగ్టన్ డీసీ కోర్టులో కేసులు ఫైల్ చేశాడుఇండియా నుంచి కంటైనర్లలో డబ్బుతో పాటు, ఇజ్రాయిల్ నుంచి స్పైవేర్ కొనుగోలు చేసి అమెరికాకు అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆరోపణలు చేశాడు. తప్పుడు ఆరోపణలతో కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నావని లోకేశ్‌కు కోర్టు చీవాట్లు పెట్టడంతో పాటు జరిమానా విధించిందివైద్య నిబంధనలకు విరుద్ధంగా రోగులకు చికిత్సలు అందించి పలువురి మరణానికి లోకేశ్ కారకుడయ్యాడు2006లో వర్జీనియా బోర్డ్ ఆఫ్ మెడిసిన్ లోకేశ్ మెడికల్ లైసెన్స్‌ను రద్దు చేసిందిఅనంతరం న్యూయార్క్, న్యూజెర్సీ వంటి ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. ఆయా రాష్ట్రాల్లోనూ లైసెన్స్‌ను రీవోక్ చేశారుఅయితే ఈ వాస్తవాలను కప్పిపుచ్చి అమెరికాలో ప్రముఖ వైద్యుడిగా చలామణి అవుతూ ఏపీ సీఎం జగన్‌పై అవాస్తవ ఆరోపణలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు వాస్తవాలను ఓ సారి తెలుసుకోవాలిమేధావులుగా చలామణి అవుతున్న లోకేశ్ వంటి కులోన్మాదులు సీఎం జగన్‌పై దాడులకు పాల్పడుతున్నారు.7:52 AM, May 21st, 2024సిట్ నివేదికలో సంచలన విషయాలుఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై డీజీపీకి ఇచ్చిన సిట్ నివేదికలో సంచలన విషయాలు150 పేజీల ప్రాథమిక నివేదికను డీజీపీకి అందజేసిన సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్సిట్ ప్రాథమిక నివేదికలో బయటపడిన పోలీసుల వైఫల్యాలుపల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తునాలుగు బృందాలుగా మూడు జిల్లాలలో పర్యటించిన సిట్33 ఘటనలలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు, సీసీ కెమెరాలు పరిశీలనఈ అల్లర్లలో 1370 మంది నిందితులకి 124 మందినే అరెస్ట్ చేసిన పోలీసులుఇందులో 639 మంది నిందితులని ఇంకా గుర్తించాల్సి ఉందన్న సిట్1100 మందిని ఇంకా అరెస్ట్ చేయకపోవడంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన సిట్దర్యాప్తులో పోలీస్ శాఖ వైఫల్యాలు ఉన్నట్లు గుర్తించిన సిట్రాళ్ల దాడిని తీవ్రంగా పరిగణించిన సిట్రెండు గ్రూపుల మధ్య రాళ్ల దాడులు మరణాలకి కారణమయ్యాయని పేర్కొన్న సిట్ప్లీ ప్లాన్డ్‌గానే రాళ్లు, కర్రలతో దాడి జరిగినట్లు గుర్తింపుదాడులను ముందస్తుగా ఊహించడంలో అధికారులు విఫలమయ్యారని సిట్ నివేదికఎన్నికలకి ముందు పోలీస్ అధికారుల బదిలీలే ఘటనలకి కారణంగా సిట్ నివేదికపరారీలో ఉన్న వారిని త్వరితగతిన అరెస్ట్ చేయాలని సిట్ సూచనకోర్టులో మెమో దాఖలు చేసి అదనపు సెక్షన్లు జోడించాలన్న సిట్సిట్ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీలు, అనంతపురం డీఐజీ, గుంటూరు రేంజ్ ఐజీలను ఆదేశించిన డీజీపీ7:16 AM, May 21st, 2024ఇట్లు.. ఇటలీకి!వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నట్లు చంద్రబాబు లీకులుఅబ్బే.. ఇటు రాలేదన్న టీడీపీ ఎన్నారై విభాగం నేతటీడీపీ అధినేత ఇటలీలో ప్రత్యక్షమైనట్లు సమాచారంగతంలో విదేశాల నుంచే షెల్ కంపెనీలకు అక్రమ నిధుల మళ్లింపుస్కిల్ స్కామ్‌లోనూ బాబు దుబాయ్ బంధంఈసారి అదే షెల్ దందాయేనా..!గోప్యంగా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు అదే 7:07 AM, May 21st, 2024కుమ్మక్కుతో విధ్వంసకాండకాల్ డేటా విశ్లేషించి కఠిన చర్యలు తీసుకోవాలిసిట్‌ను కోరిన వైఎస్సార్సీపీ నేతలుకొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కై విధ్వంస కాండకు కొమ్ము కాశారుటీడీపీ రౌడీమూకల విధ్వంసకాండపై పారదర్శకంగా విచారణ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలిదాడులు జరిగిన ప్రాంతాల్లో ఎస్సైలు, సీఐల కాల్ డేటా సేకరించి విచారణ నిర్వహించాలి 7:05 AM, May 21st, 2024పల్నాడులో మహిళలపై ఇంతటి దాడులా?మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి ఆగ్రహంనిందితులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలకు లేఖరాజకీయాల్లో ఎన్నడూ లేనివిధంగా తమకు ఓట్లు వేయలేదనే కక్షతో ఎస్సీ, బీసీ మహిళలపై దాడులకు దిగడం దారుణంఎస్సీ, బీసీ మహిళలనే టార్గెట్‌గా చేసుకుని ఇంతలా దాడులు చేయడం దుర్మార్గం6:53 AM, May 21st, 2024బదిలీలతో బరితెగింపుఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై డీజీపీకి సిట్ నివేదికదాడులు అరికట్టడం, కేసుల దర్యాప్తులో పోలీసులు విఫలంపోలింగ్‌కు ముందు ఆకస్మిక బదిలీలతో యథేచ్చగా విధ్వంసకాండదర్యాప్తు సక్రమంగా లేదు.. అదనపు సెక్షన్లు చేర్చాలి -
ఎంఆర్‌సీరెడ్డి సస్పెండ్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ నుంచి ఎంఆర్సీ రెడ్డి సస్పెండ్ అయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో విచారణ జరిపి క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ వేటు నిర్ణయం ప్రకటించింది. పార్టీ అధినేత, సీఎం జగన్ ఆదేశాలతో తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన ఎంఆర్సీ రెడ్డి చర్యలు తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
YSRCP దే ఘన విజయం..
-
కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఈసీని కోరిన వైఎస్ఆర్ సీపీ నేతలు
-
May 20th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 20th AP Elections 2024 News Political Updates9:01 PM, May 20th, 2024తూర్పు గోదావరి జిల్లా :ఓర్వలేకే టీడీపీ కుట్రలకు, భౌతిక దాడులకు పాల్పడుతుంది: హోంమంత్రి తానేటి వనితకుట్రలు, భౌతిక దాడులు ఈ కూటమి నేతలు చేస్తున్న తీరు చూస్తుంటే జగనన్నకు ఈ రాష్ట్ర ప్రజలు ఇస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అని స్పష్టమవుతోంది.మళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కడుపు మంటతో టీడీపీ నాయకులు దాడులకు దిగుతున్నారు.ఇటీవల నల్లజర్లలో సైతం స్వయంగా నామీదకు దాడికి పాల్పడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా వారికి తగిన బుద్ధి చెబుతారు.టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించేందుకు తీవ్ర స్థాయిలో కృషి చేశారుప్రజలకు తెలుసు జగనన్న పేదలకు భూములు ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదని.పోలీసులు వైఎస్సార్సీపీకి కొమ్ముకాశారు అనడం అవాస్తవం.అలాగైతే ఇటీవల స్వయంగా నామీద జరిగిన దాడికి పోలీసులు ఏం చేశారో చెప్పాలి.టీడీపీ, జనసేన నేతలు కలసి అధికార దాహంతో వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. 4:41 PM, May 20th, 2024మంగళగిరి:సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్‌ని కలిసిన వైఎస్సార్సీపీ నేతలుఅనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్సార్సీపీ నేతలుపోలింగ్ తర్వాత జరిగిన హింసాకాండపై సిట్ చీఫ్‌ని కలిశాం: అంబటి రాంబాబుటీడీపీతో కొందరు పోలీస్ అధికారులు కుమ్మక్కై అయ్యారనే దానిపై ఇసి ఆదేశాలతో బయటపడిందిఈసి ఆదేశాలతో ఏర్పాటైన సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ ని కలిసి ఫిర్యాదు చేశాంహింసాత్మక ఘటనలలో కొందరు ఐపిఎస్ అధికారుల పాత్ర కూడా ఉందిఎన్నికల సమయంలో అధికారులని మార్చడం సహజంకానీ ఎపిలో జరిగిన బదిలీలలో పురందేశ్వరి లేఖ ఆధారంగానే జరిగిందిఅధికారులని మార్చిన చోటే హింసాత్మక ఘటనలు జరిగి అధికారులు సస్పెండ్లు జరిగాయిఅనంతపురం, తిరుపతి, పల్నాడు జిల్లాలలో ఎస్పీలని పురందేశ్వరి ఫిర్యాదు ఆధారంగా మార్చిన చోటే హింస జరిగింది... అక్కడే సస్పెన్షన్లు జరిగాయిఇద్దరు ఐపిఎస్లని సస్పెండ్ చేశారంటే పోలీసుల పాత్ర అర్ధమవుతుందిపోలీసు శాఖ టీడీపీతో పూర్తిగా కుమ్మక్కైందిఇది చాలా దురదృష్టకరమైన పరిస్ధితిపోలీస్ యంత్రాంగం బాద్యత వహించాలివైఎస్సార్ సిపి ఇచ్చిన ఫిర్యాదులని కనీసం ఎన్నికల సమయంలో తీసుకోలేదువైఎస్సార్ పై తప్పుడు సెక్షన్లు, కేసులని నమోదు చేయాలని చూస్తున్నారుతప్పుడు కేసులని నివారించాలని కోరాంపోలీస్ అధికారుల కాల్ డేటాని పరిశీలించాలని కోరాంప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సిట్ ఛీఫ్ ని కోరాందేశంలోనే పోలీస్ అధికారులు టిడిఇతో కుమ్మక్కు కావడం చాలా సీరియస్ అయిన విషయంవినీత్ బ్రిజ్ లాల్ మంచి సమర్ధవంతమైన అధికారి అని నమ్ముతున్నాం.నాగరిక సమాజంలో ఈ తరహా సంఘటనలు జరగకూడదుపెద్దారెడ్డి ఇంటికి వెళ్లి సిసి కెమారాలు ద్వంసం చేసి టీడీపీ జెండాలు ఎగురవేయడం ఏమిటిఅధికారుల మార్పు వల్ల టీడీపీకి మేలు జరుగుతుందనే ఇలా చేశారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా కూటమి కుట్రలు చేసింది: జోగి రమేష్హింసాత్మక సంఘటనలు ప్రేరేపించడానికి కూటమే కారణంకలెక్టర్లు, ఎస్పీలు మార్చిన చోటే పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు జరిగాయిప్రజాస్వామ్యంలో హింసని ప్రేరేపించింది చంద్రబాబేమళ్లీ సిఎంగా వైఎస్ జగన్ వస్తారుప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికలు ఒక మచ్చలా మిగిలాయిపూర్తి స్ధాయిలో విచారణ జరిపి బాద్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి ఎస్సీ, ఎస్టీ, బిసిలు వైఎస్ జగన్‌కి అండగా ఉన్నారనే కక్షతో హింసకి పాల్పడ్డారు: రావెల కిషోర్బాబుచాలా గ్రామాలలో ఎస్సీ, బిసీలు ఊళ్లకి ఊళ్లే ఖాళీ అవుతున్నాయి.టీడీపీ పై చర్యలు తీసుకోవాలిగ్రామాలలో సాధారణ పరిస్ధితులు వచ్చేలా చర్యలు తీసుకోవాలిఘటనలకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలిప్రజాస్చామ్యాన్ని పునరుద్దించాలి 3:41 PM, May 20th, 2024విజయవాడఢీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి ప్రాధమిక నివేదిక అందజేసిన సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలపై ఈసి ఆదేశాల మేరకు సిట్ విచారణరెండు రోజుల పాటు నాలుగు బృందాలగా క్షేత్ర స్ధాయిలో పర్యటనపల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలలో పర్యటించిన సిట్ బృందాలుహింసాత్మక ఘటనలకి కారణాలు విశ్లేషిస్తూ ప్రాధమిక నివేదిక150 పేజీల ప్రాధమిక నివేదిక డిజిపికి అందజేసిన సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ 2:20 PM, May 0th, 2024ఏపీలో కొత్త పోలీస్ అధికారుల నియామకంఈసీ సస్పెండ్ చేసిన అధికారుల అధికారుల స్థానంలో కొత్తవాళ్ల నియామకం నరసరావుపేట డీఎస్పీ గా - ఎం.సుధాకర్ రావు గురజాల డీఎస్పీగా - సీహెచ్ శ్రీనివాసరావు తిరుపతి డీఎస్పీగా - రవి మనోహరచారి తిరుపతి ఎస్ బీ డీఎస్పీగా - ఎం.వెంకటాద్రి తాడిపత్రి డీఎస్పీగా - జనార్దన్ నాయుడు నియామకంపల్నాడు DSB - I సీఐగా- సురేష్ బాబు పల్నాడు DSB - II సీఐగా - U. శోభన్ బాబు కారంపూడి ఎస్సై గా - కె.అమీర్ నాగార్జున సాగర్ ఎస్సై గా - ఎం.పట్టాభి 2:06 PM, May 20th, 2024కాసేపట్లో డీజీపీకి సిట్ నివేదికఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ ప్రాధమిక నివేదిక సిద్దంఉదయం నుంచి డిజిపి ప్రధాన కార్యాలయంలోనే కూర్చుని ప్రాధమిక నివేదిక సిద్దం చేస్తున్న ఐజీ వినీత్ బ్రిజ్ లాల్మరికాసేపట్లో డిజిపి హరీష్ కుమార్ గుప్తాకి సిట్ ప్రాధమిక నివెదికసిట్ ప్రాధమిక నివేదికపై తీవ్ర ఉత్కంఠగత రెండు రోజులగా పల్నాడు, అనంతపురం,తిరుపతి జిల్లాలలో సిట్ బృందాలు క్షేత్రస్ధాయి పర్యటన33 ఎఫ్ఐఆర్ లు, సీసీ కెమెరా ఫుటేజ్ లు పరిశీలనఘటనలు జరిగిన గ్రామాలు సందర్శన1:32 PM, May 20th, 2024చింతమనేని ఎక్కడ?పరారీలో దెందులూరు కూటమి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పోలింగ్ టైంలో అల్లర్లకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్ పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పీఎస్‌పై చింతమనేని దాడిసినీ ఫక్కీలో దాడి చేసి అరెస్టైన వ్యక్తిని విడిపించిన చింతమనేనిచింతమనేనితో పాటు మరో 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు16 రాత్రి నుంచే అజ్ఞాతంలోకి.. బెంగళూరు వెళ్లినట్టు ప్రాథమిక సమాచారంఆయనతో పాటు మరో 14 మంది ఉన్నట్టు పోలీసుల గుర్తింపునూజివీడు డీఎస్పీ పర్యవేక్షణలో 6 ప్రత్యేక బృందాల ఏర్పాటు12:51 PM, May 20th, 2024మంగళగిరిపల్నాడు హింసలో బాధితులుగా పలువురు మహిళలుమహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన చినగణేషునిపాడు మహిళలుటీడీపీ నేతలు ఎస్సీ, బీసీ మహిళల ఇళ్లపై దాడులు జరపడంతో భయాందోళనకు గురై ఓ గుడిలో రెండ్రోజుల పాటు తలదాచుకున్న మహిళలుపోలీసుల సాయంతో బంధువుల ఇళ్లకు వెళ్లినట్టు మహిళా కమిషన్ కు ఫిర్యాదుతమకు న్యాయం చేయాలని, నిందితులను శిక్షించాలని కమిషన్ ను కోరిన మహిళలుసాక్షితో మాట్లాడిన మహిళా కమిషన్ చైర్మన్ గజ్జల వెంకటలక్ష్మిపల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడుకు చెందిన ఎస్సీ, బీసీ మహిళల్ని దాదాపు 24 గంటలపాటు బంధించి వారిని చిత్రహింసలకు గురిచేశారు: గజ్జల వెంకటలక్ష్మిబాధితులకు రక్షణ కల్పించాలని, నిందితులకు కఠినశిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి లేఖ రాFeg: గజ్జల వెంకటలక్ష్మిఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలనే టార్గెట్ చేసుకుని వారిపై దాడులు చేయడం దుర్మార్గం: గజ్జల వెంకటలక్ష్మిప్రజాస్వామ్య విలువలకు ఇలాంటి వాతావరణం పూర్తి విరుద్ధం: గజ్జల వెంకటలక్ష్మిమహిళలకు స్వేచ్ఛగా నచ్చిన వారికి ఓటు వేసే హక్కు లేదా..?: గజ్జల వెంకటలక్ష్మివారికి నచ్చని వారికి ఓట్లేసినంత మాత్రాన చంపేస్తారా..? : గజ్జల వెంకటలక్ష్మిచంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడూ మహిళలపై చాలా చిన్నచూపుతో వ్యవహరించారు: గజ్జల వెంకటలక్ష్మిఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలనే టార్గెట్ చేసుకుని వారిపై దాడులకు ఉసిగొల్పుతోన్న చంద్రబాబు తీరుపై మహిళలు ఆగ్రహంతో ఉన్నారు: గజ్జల వెంకటలక్ష్మిఎలక్షన్ కమిషన్ నిబంధనల వల్ల బాధితులను పరామర్శించలేదు: గజ్జల వెంకటలక్ష్మిత్వరలోనే బాధితులను కలిసి వారికి ధైర్యం చెప్తాం: గజ్జల వెంకటలక్ష్మి 12:11 PM, May 20th, 2024విజయనగరండిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి కీలక వ్యాఖ్యలుఎంపీ పోస్టల్ బ్యాలెట్ ను తహసీల్దార్ కార్యాలయం స్ట్రాంగ్ రూమ్ నుండి లెక్కింపు కేంద్రానికి తరలించడం లో అధికార్ల సమాచార లోపం వుంది.వైస్సార్సీపీ అభ్యర్థి ఏజెంట్ ను ఈ ప్రక్రియ కోసం పంపించాము.టీడీపీ అభ్యర్థి ఏజెంట్ హాజరు కాక పోవడం వారి ఇష్టం. అయినా రాజకీయం చేసే ప్రకటనలు చేస్తున్నారు.కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతం గా జరగాలని వైస్సార్సీపీ మనస్పూర్తి గా కోరుకుంటుంది.గతం లో గెలిచినా, ఓడినా లేకితనం రాజకీయాలు చేయలేదు.12:00 PM, May 20th, 2024పోలీసుల అదుపులో బళ్ల బాబీఎన్నికల ఫలితాలు వెలవడక ముందే నరసాపురంలో జనసేన నాయకుల దౌర్జన్యంపశ్చిమగోదావరి మొగల్తూరు మండలం కేపీ పాలెం బీచ్ సమీపంలో జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ అనుచరుడు బళ్ల బాబీ.. ఆటోలో వెళ్తున్న కుటుంబం పై దాడికారుకు ఆటో సైడ్ ఇవ్వలేదని ఆటోను వెంబడించి.. అందులోని ఇద్దరు మహిళలు,పిల్లలు, మరో ఇద్దరిపై దాడి చేసిన బాబీ అతని స్నేహితులుమీరు ఎవరు వైఎస్ఆర్ సీపీకి ఓటు వేశారా? జనసేనకు ఓటు వేశారా...? అంటూ నిలదీసిన బాబి అండ్ కోమీరు బీసిల్లా ఉన్నారు వైఎస్ఆర్ సీపీకే ఓటు వేసి ఉంటారని బాబి అతడి స్నేహితులను దాడి.. ఆపై అక్కడి నుంచి జారుకున్న బ్యాచ్‌నరసాపురం ఆసుపత్రికి బాదితులను తరలించిన స్థానికులుఆసుపత్రిలో బాధితులను పరామర్శించి.. వారి నుండి వివరాలు అడిగి తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాస్..కేసు నమోదు చేసి బళ్ల బాబీని అదుపులకు తీసుకున్న పోలీసులు11:32 AM, May 20th, 2024విజయవాడఎన్నికల సంఘానికి నేడు సిట్ ప్రాధమిక నివేదికపోలింగ్ అనంతర అల్లర్లపై నివేదిక సిద్ధం చేస్తున్న సిట్ ఇన్‌ఛార్జి వినీత్ బ్రిజ్‌లాల్‌నేడు ప్రాథమిక నివేదిక డీజీపీకి సమర్పణఇప్పటికే అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించిన నాలుగు బృందాలుతాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, గురజాల, నరసారావుపేట ఘటనలపై కీలక ఆధారాలు సేకరణకేసుల విచారణపై సమీక్ష పూర్తి చేసిన సిట్కేసుల విచారణపై ఇకపై కూడా పరివేక్షణ కొనసాగించనున్న సిట్రానున్న రోజుల్లో మరింత లోతుగా విచారణ చేయనున్న సిట్డీజీపీకి నివేదిక సమర్పించిన తర్వాత ప్రెస్ నోట్ విడుదల చేయనున్న సిట్11:01 AM, May 20th, 2024గుంటూరుసాయంత్రం సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ ను కలవనున్న వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందంపోలింగ్ నాడు తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలపై ఫిర్యాదుపల్నాడు, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాలలో వైఎస్సార్సీపీ శ్రేణులపై జరిగిన దాడుల ఆశారాలను అందించే అవకాశంఓటర్లను భయబ్రాంతులకు గురిచేసిన అంశాలపై కూడా సిట్ కి వివరించనున్న పార్టీ బృందం10:38 AM, May 20th, 2024ప్రకాశంఎల్లో మీడియా పై మాజీమంత్రి బాలినేని ఆగ్రహంతప్పుడు కథనాలు ప్రచురిస్తే ఖబడ్దార్నాపై తప్పుడు కథనాలు ప్రసారం చేసిన మహాటీవి పై పరువునష్టం దావా వేస్తాఎవరెన్ని కుట్రలు చేసినా...అబద్ధాలు ప్రచారం చేసుకున్నా..కూటమి చిత్తుగా ఓడిపోవడం ఖాయంరాబోయేది వైస్సార్సీపీ ప్రభుత్వమే130 సీట్లకు పైగా వైస్సార్సీపీ కైవసం చేసుకోబోతోందిజూన్ 9 న ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేస్తారు10:14 AM, May 20th, 2024కాకినాడ సిటీ, పిఠాపురంలో అల్లర్లకు ఛాన్స్!కాకినాడ సిటీ, పిఠాపురంపై కేంద్ర నిఘా విభాగం(ఇంటెలిజెన్స్ బ్యూరో) అలర్ట్‌కౌంటింగ్‌కు ముందు, తర్వాత హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం!కాకినాడ, పిఠాపురంపై ఎన్నికల సంఘానికి ఐబీ నివేదికకాకినాడలోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేటపై ప్రత్యేక దృష్టిఎన్నికల్లో గొడవలు చేసిన, ప్రేరేపించిన వ్యక్తులపై ఇప్పటికే పోలీసుల నిఘా10:00 AM, May 20th, 2024ఈసీకి సిట్ రిపోర్ట్ఏపీలో అల్లర్లపై నేడు ఎన్నికల సంఘానికి సిట్ నివేదికఏపీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలపై చివరి అంకానికి చేరుకున్న సిట్ దర్యాప్తుతాడిపత్రిలో ముగిసిన సిట్ విచారణపల్నాడు, తిరుపతిలో ఇవాళ మూడో రోజు కొనసాగనున్న విచారణక్రొసూరు, అచ్చంపేట మండలాల్లో నేడు పర్యటించనున్న సిట్ బృందాలుఏపీలో అల్లర్లపై నేడు డీజీపీకి సిట్ నివేదికసెక్యూరిటీ వైఫల్యం వల్లే అల్లర్లు జరిగినట్లు సిట్ ప్రాథమిక అంచనాఆ వెంటనే ఈసీకి నివేదిక పంపనున్న డీజీపీసమగ్ర దర్యాప్తు కోసం సిట్‌కు గడువు పొడిగించాలని కోరే అవకాశంసమగ్ర కథనం: సిట్ నివేదికలో కీలకాంశాలు9:27 AM, May 20th, 2024ఆగని పచ్చ చిలుక పలుకులుమరోసారి వైఎస్సార్సీపీపై విషం చిమ్మిన ప్రశాంత్ కిషోర్‌చంద్రబాబు డైరెక్షన్లోనే పని చేస్తున్న మాజీ ఎన్నికల వ్యూహకర్తఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓడిపోతుందంటూ బర్కాదత్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలుబీజేపీకి మాత్రం సానుకూలంగానే పీకే స్వరంఐ-ప్యాక్ టీంతో భేటీ సమయంలో సీఎం జగన్ గెలుపు వ్యాఖ్యలుపీకే చెప్పిన దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ వ్యాఖ్యానించిన సీఎం జగన్‌పీకే చేసేది ఏం లేదని.. అంతా ఐప్యాక్ టీం కష్టం ఉందన్న సీఎం జగన్జగన్ వ్యాఖ్యలపై పీకేకు నూరిపోసిన చంద్రబాబువైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని ఢీలా పరిచేందుకు ఎల్లో మీడియా ప్రయత్నాలు9:05 AM, May 20th, 2024పల్నాడుమాచర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహంకాళి పిచ్చయ్య బైక్ తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులురాత్రి ఇంటిముందు పార్క్ చేసిన బైక్ ను తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులుతెలుగుదేశం పార్టీకి చెందిన వారే తగలబెట్టి ఉంటారని అనుమానం8:00 AM, May 20th, 2024అనంతపురం: సిట్ అధికారులకు వినతి పత్రం అందజేసిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి రమాదేవితమ ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడిన టీడీపీ నేతలపై, తమ ఇంట్లో సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని సిట్ అధికారులను కోరారు 7:30 AM, May 20th, 2024విజయవాడఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ముమ్మరంనేటి సాయంత్రానికి డీజీపీకి ప్రాధమిక నివేదిక ఇవ్వనున్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్నాలుగు బృందాలగా సిట్ దర్యాప్తుపల్నాడు జిల్లాలో క్షేత్రస్ధాయిలో పర్యటించిన రెండు బృందాలుపల్నాడు జిల్లాలోని రెండు బృందాలని పర్యవేక్షించిన అదనపు ఎస్పీ సౌమ్యలతతిరుపతి జిల్లా చంద్రగిరిలో పర్యటించిన మరొక బృందంఅనంతపురం జిల్లాలోని తాడిపర్తిలో మరొక బృందం పర్యటనడీఎస్పీ ఆద్వర్యంలో ఇద్దరు సీఐలతో ప్రతీ బృందం క్షేత్రస్ధాయిలో సమాచార సేకరణఎప్పటికపుడు నాలుగు బృందాల నుంవి సమాచారాన్ని తీసుకుని నివేదిక సిద్దం చేసే పనిలో హెడ్ క్వార్టర్స్ నుండి పర్యవేక్షిస్తున్న మరో అదనపు ఎస్పీమొత్తంగా 33 ఎఫ్ఐఆర్లను పరిశీలించిన సిట్ బృందాలుదాదాపు 300 మందికి నిందితులు ఈ హింసాత్మక ఘటనలలో పాల్గొన్నట్లు ఎఫ్ఐఆర్లలో నమోదుఇప్పటికే వంద మందికి పైగా నిందితులు అరెస్ట్సీసీ కెమెరా ఫుటేజ్‌లు పరిశీలనక్షేత్రస్ధాయి పర్యటనలో కీలక సమాచారాన్ని రాబట్టిన సిట్ బృందాలుపోలీస్ ఉన్నతాధికారుల వైఫల్యంపైనా పరిశీలనసస్పెండ్ అయిన పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్, అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్‌ల పనితీరుపైనా సిట్ అనుమానాలుటీడీపీ రౌడీలు ఘర్షణలకి దిగడానికి ఈ ఇద్దరి ఎస్పీల వైఫల్యమే కారణమంటూ ఇప్పటికే ఈసీకి సిట్ బృందాలకి కూడా ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీనాలుగు బృందాల క్షేత్రస్ధాయి సమాచార సేకరణ ఆధారంగా నేటి సాయంత్రం 4 గంటల లోపు డీజీపీకి ప్రాధమిక నివేదిక ఇవ్వనున్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్సిట్ ఇచ్చే ప్రాధమిక నివేదికని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తాపూర్తిస్ధాయి దర్యాప్తుకి మరికొన్ని రోజుల సమయం పొడిగించాలని కోరే అవకాశంసిట్ ప్రాధమిక నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల కమీషన్ తదుపరి చర్యలకి అవకాశం7:00 AM, May 20th, 2024మార్చినచోటే మారణకాండ ‘సిట్’కు ఆధారాలు అందించిన మంత్రి అంబటిచంద్రబాబు, పురందేశ్వరి కుట్రతో చెలరేగిన హింస ఓటమి భయంతో బాబు రాక్షసత్వంతలలు పగులుతున్నా పోలీసులు స్పందించలేదుడబ్బులకు లొంగిపోయిన వారిపై చర్యలు తీసుకోవాలితొండపిలో ప్రాణ భయంతో గ్రామాన్ని వీడిన ముస్లిం మైనార్టీలు 6:30 AM, May 20th, 2024ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబుఫైబర్‌నెట్ కేసులో సుప్రీంలో కొనసాగుతున్న విచారణశంషాబాద్ విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులుసుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టకేలకు అనుమతిపర్యటన గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలునాలుగు రోజుల క్రితమే గుట్టుగా వెళ్లిపోయిన లోకేశ్ -
టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా కోట»ొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీ చిన్నవెంకటాపురంలో టీడీపీ మూకలు అన్యాయంగా ఓ ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఈ పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్వస్థలం కావడం గమనార్హం. చిన్నవెంకటాపురం పోలింగ్ బూత్‌లో వైఎస్సార్సీపీ తరఫున తోట మాధవరావు ఏజెంట్‌గా ఉండడంతో టీడీపీ కార్యకర్తలు కక్ష పెంచుకుని అతని తండ్రి మల్లేష్ పై ఇటీవల దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆయన మృత్యువుతో పోరాడుతూ ఆదివారం ప్రాణాలు విడిచారు. అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడు హరివరప్రసాద్ డైరెక్షన్లో ఈ నెల 16న గ్రామ దేవత పండగను ఆసరాగా చేసుకుని మల్లేష్‌పై దాడి చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు పూతి లక్ష్మణరావు, పూతి భానుచందర్, పూతి కర్రెన్న, పూతి రమణ తదితరులు ఈ దాడికి పాల్పడ్డారు. ఇది అచ్చెన్నాయుడు చేసిన హత్యేనని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. సుమారు 40 ఏళ్లుగా నిమ్మాడ పంచాయతీలో శాంతియుతంగా ఎన్నికలు జరగలేదని, ఈ సారీ ఎన్నికల్లో రిగ్గింగ్‌కు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో అచ్చెన్నాయుడుకు ఓటమి భయం పట్టుకుందని పేర్కొన్నారు. నిమ్మాడ పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ తరఫున బూత్ ఏజెంట్‌గా వ్యవహరించిన కింజరాపు అప్పన్నను చంపేస్తామని బెదిరించారని దువ్వాడ ఆరోపించారు. మల్లేష్ మృతికి బాధ్యులైన అచ్చెన్నాయుడు, హరివరప్రసాద్తో పాటు టీడీపీ వర్గీయులను అరెస్టు చేయాలని దువ్వాడ డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ హామీ ఇచ్చారు. -
కౌంటింగ్ సమయంలో అల్లర్లకు కుట్ర!
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్సీపీ బృందం కోరింది. ఈ మేరకు ఆదివారం వెలగపూడి సచివాలయం అడిషనల్ సీఈవో కోటేశ్వరరావును కలిసి ఫిర్యాదు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ తమకు ఓటు వేయలేదనే ఉక్రోషంతో టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా హింసను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీ అభ్యర్థులే రోడ్లపైకొచ్చి దాడులకు తెగబడుతూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని చెప్పారు. కౌంటింగ్ సమయంలోనూ టీడీపీ అల్లర్లను సృష్టించే అవకాశముందని, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సమయంలో పాటించాల్సిన నిబంధనలను 175 నియోజకవర్గాల్లోనూ తూచా తప్పకుండా పాటించేలా చొరవ తీసుకోవాలని కోరామన్నారు. పోలింగ్ రోజు దెందులూరు నియోజకవర్గం కొప్పులవారిపాలెంలో జరిగిన ఓ దాడి ఘటనలో టీడీపీకి చెందిన రాజశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పోలీసులపైన దౌర్జన్యం చేశారని, తక్షణమే ఆయనను అరెస్ట్ చేసి పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్న టెక్కలి నియోజకవర్గంలోనూ ఆ పార్టీ అరాచకాలకు ఓ నిండు ప్రాణం బలైందన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన తోట మల్లేష్ ఇంటిపై దాడికి తెగబడి.. అతని చావుకు కారణమయ్యారని చెప్పారు. దాడులను ప్రోత్సహించిన అచ్చెన్నాయుడిపైనా కేసు నమోదు చేయాలని కోరినట్టు తెలిపారు. గురజాల, మాచర్ల, నరసరావుపేట, సత్తెనపల్లి, తాడిపత్రి సహా రాష్ట్రంలో జరిగిన అరాచకాలన్నింటికీ మూలకారణం టీడీపీ నాయకులని మల్లాది విష్ణు ఆరోపించారు. కానీ సిట్‌ను తప్పుదోవ పట్టించేలా స్థానిక వైఎస్సార్సీపీ అభ్యర్థులపైనే ఫిర్యాదులు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని, ఈ నేపథ్యంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సిట్ అధికారులను కోరినట్టు వివరించారు.ఉయ్యూరు లోకేశ్ వంటి ఉన్మాదులనుచంద్రబాబు రెచ్చగొడుతున్నారు..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విదేశీ పర్యటనను ఉన్మాది ఆలోచనలతో అడ్డుకునే కుట్ర చేసినందుకే ఉయ్యూరు లోకేశ్‌ను గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు నీచ మనస్తత్వంతో లోకేశ్ వంటి వారిని రెచ్చగొడుతున్నారని ఆదివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. అత్యంత భద్రత మధ్య ఉండే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకోవాలనే లోకేశ్ కుట్ర వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చాలని డిమాండ్ చేశారు. టీడీపీ సానుభూతిపరుడైన లోకేశ్ డాక్టర్ అయినప్పటికీ ఉన్మాద మనస్తత్వంతో టీవీ డిబేట్లలో వైఎస్సార్సీపీపై విషం చిమ్ముతుంటారని గుర్తు చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటాయపాలేనికి చెందిన ఉయ్యూరు లోకేశ్ 38 ఏళ్లుగా అమెరికాలో వైద్యుడిగా పని చేస్తున్నారని, ఆయనకు అమెరికా పౌరసత్వం కూడా ఉందని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చారని, ఆ తర్వాత నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని సీఎం జగన్ విదేశీ పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ సానుభూతిç³రులకు మెసేజ్‌లు పెట్టినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయని వెల్లడించారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
అలాంటి వార్తలతో నాతో పాటు కుటుంబం మొత్తం బాధ పడింది: లయ
పిచ్చుకను కాపాడిన బుడతలు..! ఇంతకీ ఏం జరిగిందంటే?
ఢిల్లీ మెట్రోలో రాహుల్.. ఫొటో వైరల్
వడదెబ్బకు గురైన నటుడు షారూఖ్! దీని బారిన పడకూడదంటే..!
టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని చెప్పినా పోలీసులు స్పందించలేదు: అనిల్ కుమార్
విరాట్ కోహ్లి ఆర్సీబీని వీడాలి.. ఆ జట్టులో చేరాలి: ఇంగ్లండ్ స్టార్
పవిత్ర-చందు మరణం.. అదే అసలు కారణమన్న నరేశ్
మనం అరెస్టు చేయడమే కానీ మనల్ని అరెస్టు చేయడం ఉంటుందనుకోలే!!
చిన్నమ్మ స్వార్ధానికి మునిగిపోతున్న బీజేపీ..
ఏఐతో మరింత అందంగా: రిలయన్స్
తప్పక చదవండి
- పవిత్ర-చందు మరణం.. అదే అసలు కారణమన్న నరేశ్
- ‘నాగి..నిన్ను కొట్టాలి.. ‘బుజ్జి’ గ్లింప్స్‌పై ప్రభాస్ రియాక్షన్
- న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ మూసివేత? రైళ్ల మళ్లింపునకు సన్నాహాలు?
- YS Raja Reddy: ప్రజల గుండెలలో పెద్దాయన
- ‘ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టు రద్దు చేయండి’
- నిందితుని కోసం ఆసుపత్రిలోకి దూసుకొచ్చిన పోలీస్ వ్యాన్
- జీహెచ్ఎంసీలో కామ పిశాచి.. కమిషనర్ రియాక్షన్
- ఈ భారత సంతతి సీఈవో వేతనం రూ.1,260 కోట్లు!
- కాంగ్రెస్ హత్యారాజకీయాలకు భయపడేది లేదు: హరీష్ రావు ఫైర్
- అంబానీల అతిథులకు కరీంనగర్ కానుకలు
Advertisement