‘ముందు రాయ్‌బరేలీ నుంచి గెలవండి’ | Sakshi
Sakshi News home page

‘ముందు రాయ్‌బరేలీ నుంచి గెలవండి’.. రాహుల్‌ గాంధీపై చెస్ దిగ్గ‌జం సెటైర్లు

Published Sat, May 4 2024 9:12 AM

Chess legend Garry Kasparov satire on Rahul Gandhi to win from Raebareli first

లోక్‌సభ ఎన్నికల్లో ఎట్టకేలకు కాంగ్రెస్‌ కంచుకోట స్థానాలైన రాయ్‌బరేలీ, అమేథీ పార్లమెంట్‌ సెగ్మెంట్లలో ఆ పార్టీ తమ అభ్యర్థులు ప్రకటించింది. రాయ్‌బరేలీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, అమేథీలో కిషోర్‌ లాల్‌ శర్మను బరిలోకి దించింది. రాహుల్‌ గాంధీ తాను మూడు సార్లు గెలిచిన అమెథీని వదిలి రాయ్‌బరేలీ బరిలో దిగటంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. బీజేపీ నేతలే కాకుండా చెస్ దిగ్గ‌జం గ్యారీ కాస్ప‌రోవ్‌ సైతం రాహుల్‌గాంధీపై విమర్శలు చేశాడు. 

‘గ్యారీ కాస్పరోవ్‌,  విశ్వనాథ్‌ ఆనంద్‌ వంటి చెస్‌ ఆటగాళ్లు.. త్వరగా రిటైర్‌ అవటం మంచిదైంది. వారు.. ఒక చెస్‌ మెథావిని ఎదుర్కొవల్సిన అవసరం లేదు’ అని ఓ నెటిజన్‌ పెట్టిన పోస్ట్‌కు..  ‘అగ్రస్థానం కోసం సవాల్‌ చేసే ముందు ముందు రాయ్‌బరేలీ నుంచి గెలివాలి’ అని రాహుల్‌ గాంధీని ఉద్దేశించి గ్యారీ కాస్పరోవ్‌ సెటైర్‌ వేశారు.

మరోవైపు.. నటుడు రన్‌వీర్‌  షోరే స్పందిస్తూ..  ఈ పరిణామాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారని రాహుల్‌ గాంధీకి సంబంధించిన ఓ వీడియోతో గ్యారీ కాస్పరోవ్‌ను ట్యాగ్‌ చేశారు. ‘భారత రాజకీయాల్లో నా చిన్న జోక్‌ ప్రభావితం చేయదని ఆశిస్తున్నా. అయితే నాకు నచ్చిన చెస్‌ ఆటలో మాత్రం రాజకీయ నాయకుడు (రాహల్‌ గాంధీ) ఆడటం చూడకుండా ఉండలేను!’ అని గ్యారీ కాస్పరోవ్‌ అన్నారు.

రాహుల్‌ గాంధీ రాయ్‌బరేలీలో పోటీ చేయటంపై  కాంగ్రెస్‌ పార్టీ నేత జైరాం రమేష్‌ వివరణ  ఇచ్చారు. ‘రాహుల్‌ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయటంపై చాలా మందికి పలు అభిప్రాయాలు ఉంటాయి. అయితే అందరూ.. రాహుల్‌ గాంధీకి రాజకియాలతో పాటు చెస్‌ ఆట మీద చాలా పట్టుందని మర్చిపోవద్దు’ అని ఆయన ఎక్స్‌ వేదికగా తెలిపారు. దీంతో ఆయన ట్వీట్‌పై బీజేపీ నేతలు, నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో చెస్ దిగ్గ‌జం గ్యారీ కాస్ప‌రోవ్‌ రాహుల్‌ గాంధీ విమర్శలు చేశారు.

చెస్ దిగ్గ‌జం గ్యారీ కాస్ప‌రోవ్‌ను ర‌ష్యా ఉగ్ర‌వాదుల జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. పుతిన్ ప్ర‌భుత్వంపై ఆయ‌న బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు గుప్పించ‌డ‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణం. ప్ర‌భుత్వ విధానాలను కాస్ప‌రోవ్ వ్య‌తిరేకించ‌డం వ‌ల్లే అధికారులు ఆయ‌న్ను ఉగ్ర‌వాదులు, తీవ్రవాదులు జాబితాలోకి చేర్చారు.  చెస్‌లో ప‌లుమార్లు వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌గా నిలిచిన 60 ఏళ్ల గ్యారీ కాస్ప‌రోవ్ చాలా కాలంగా పుతిన్ ప్ర‌భుత్వంపై బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేస్తూ వస్తున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement