Tamannaah Bhatia Denies Rumours About Special Song In NBK108 Movie - Sakshi
Sakshi News home page

Tamannaah Bhatia : 'ముందు నిజాలు తెలుసుకోండి'.. ఆ రూమర్స్‌పై ఘాటుగా స్పందించిన తమన్నా

Published Sun, May 21 2023 11:15 AM

Tamannaah Bhatia Denies Rumours About Special Song In Balayya Movie - Sakshi

మిల్క్‌ బ్యూటీ తమన్నా కొంతకాలంగా తరచుగా వార్తల్లో నిలుస్తుంది. ఇటీవలె ఆమె బాలకృష్ణ సినిమాలో ఐటెంసాంగ్‌ చేస్తుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో 'ఎన్‌బీకే 108' ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ కోసం తమన్నాను సంప్రదించగా, కోటిన్నర డిమాండ్‌ చేసిందని, దీంతో తమన్నాను తప్పించినట్లు వార్తలు షికార్లు చేశాయి.

తాజాగా ఈ రూమర్స్‌పై ఘాటుగానే స్పందించింది తమన్నా. 'అనిల్‌ రావిపూడితో కలిసి వర్క్‌ చేయడాన్ని నేను ఎంతో ఇష్టపడతాను. అలాగే బాలకృష్ణ సార్‌ అంటే కూడా నాకు ఎంతో గౌరవం ఉంది. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నేను స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్నాను అంటూ నా గురించి వార్తలు రాస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నా గురించి ఇలా రాయడం నన్నెంతో బాధించింది. చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'విరూపాక్ష' మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే 

ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసేముందు దయచేసి రీసెర్చ్‌ చేసి తెలుసుకోండి' అంటూ తమన్నా ట్వీట్‌ చేసింది. దీంతో ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. గతంలో అనిల్ రావిపూడితో కలిసి ఎఫ్2, ఎఫ్3, సరిలేరు నీకెవ్వరూ లాంటి సినిమాల్లో నటించింది తమన్నా. ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవితో భోళా శంకర్‌ సినిమాలో నటిస్తుంది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement