దరఖాస్తుల ఆహ్వానం | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Published Sat, May 4 2024 9:15 AM

దరఖాస్తుల ఆహ్వానం

కడప ఎడ్యుకేషన్‌: కడప నగరం చిన్నచౌక్‌లోని ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు 2024–25 విద్యా సంవత్సరానికి ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ పి.విజయలక్ష్మి తెలిపారు. ఈ నెల 20వ తేదీ వరకు అర్హలైన బాలికలు తమ దరఖాస్తులను చిన్నచౌక్‌లోని గురుకుల పాఠశాలలో అందచేయాలని ఆమె తెలిపారు. వివరాలకు 9440687844, 8555074045 నెంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ తెలిపారు.

ముందే ప్రవేశాలు సరికాదు

కడప ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియట్‌ బోర్డు అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ ఇవ్వకముందే ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలు తీసుకుంటున్నా, డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందినా సదరు జూనియర్‌ కళాశాల గుర్తింపు రద్దుకు సిఫారసు చేస్తామని ఇంటర్‌ ఆర్‌ఐవో బండి వెంకటసుబ్బయ్య హెచ్చరించారు. ఇంటర్‌ విద్యామండలి 2024–25 విద్యా సంవత్సరానికి అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం జూనియర్‌ కళాశాలల అడ్మిషన్లు జూన్‌ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసిక వేదనకు గురిచేస్తున్న ప్రైవేటు జూనియర్‌ కళాశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సౌరబ్‌గౌర్‌ హెచ్చరించినట్లు ఆర్‌ఐవో బండి వెంకటసుబ్బయ్య తెలిపారు.

ఆలయానికి

రూ.7.20లక్షలు కానుక

ప్రొద్దుటూరు కల్చరల్‌: స్థానిక మేదరవీధిలోని శ్రీ రామలింగ చౌడేశ్వరిదేవి అమ్మవారి ఆలయ నిర్వహణకు శుక్రవారం భక్తులు రూ.7.20లక్షలు కానుకగా అందించారు. పేరి గురుమూర్తి, అంపావతిన వీరప్రసాద్‌ రూ.6.20లక్షలు, కౌన్సిలర్‌ గరిశపాటి లక్ష్మిదేవి, వేణుగోపాల్‌ దంపతులు రూ.ఒక లక్ష ఆలయ నిర్వహణకు గాను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి బాండ్‌ను ఆలయ కమిటీ చైర్మన్‌ వుట్టి నాగశయనంకు అందించారు. ఆలయ కార్యదర్శి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు పోసా వెంకట లక్షుమయ్య, గిద్దలూరు ఈశ్వరయ్య, పోసా శివప్రసాద్‌, అర్చకుడు రాఘవేంద్ర, భక్తులు పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement