ఎన్నికల్లో ఏ సమస్యలూ రావద్దు | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో ఏ సమస్యలూ రావద్దు

Published Sat, May 4 2024 5:55 AM

ఎన్ని

సాక్షి, యాదాద్రి : ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో, సజావుగా జరగాలని, ఏ చిన్న సమస్య తలెత్తకుండా చూడాలని, అందుకు మైక్రో అబ్జర్వర్లు కీలకంగా వ్యవహరించాలని లోక్‌సభ ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాబర్ట్‌సింగ్‌ క్షేత్రిమయుమ్‌ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన మైక్రో అబ్జర్వర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు, సలహాలు చేశారు. మైక్రో అబ్జర్వర్లు క్షేత్రస్థాయిలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుండాలని, అనెగ్జర్‌ –28 ప్రకారం 18 అంశాలపై జనరల్‌ అబ్జర్వర్‌కు ఎప్పటికప్పుడు నేరుగా నివేదికలు అందజేయాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలపై దృష్టి సారించాలని, పోలింగ్‌ రోజు ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన విధివిధానాలు అమలు జరుగుతున్నాయా లేదా పరిశీలించాలన్నారు. మాక్‌ పోలింగ్‌ మొదలుకొని పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఏ చిన్న సమస్య వచ్చినా, అవకతవకలు జరిగినా తక్షణమే సమాచారం ఇవ్వాలని కోరారు. మైక్రో అబ్జర్వర్లకు ట్రైనర్లు కడారి నర్సిరెడ్డి, హరినాథ్‌రెడ్డి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.

ఫ ఎన్నికల సాధారణ పరిశీలకుడురాబర్ట్‌సింగ్‌ క్షేత్రిమయుమ్‌

ఎన్నికల్లో ఏ సమస్యలూ రావద్దు
1/1

ఎన్నికల్లో ఏ సమస్యలూ రావద్దు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement