కనీవినీ ఎరుగని అభివృద్ధి | Sakshi
Sakshi News home page

కనీవినీ ఎరుగని అభివృద్ధి

Published Sat, May 4 2024 4:35 AM

కనీవి

నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు

రాష్ట్రంలో వినూత్న పాలనను సీఎం జగన్‌ మన ముందుకు తెచ్చారు. గతంలో దళారులు, అవినీతి, పక్షపాతం వల్ల పథకాలన్నీ కొందరు జేబుల్లోకే వెళ్లిన పరిస్థితి. కానీ ఈ ఐదేళ్లలో వలంటీర్‌, సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రతి ఇంటికీ నేరుగా సంక్షేమ ఫలాలను పారదర్శకంగా అందించాం. నరసాపురం నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని అభివృద్ధి చేశాం. ఆర్టీసీ బస్టాండ్‌, వంద పడకల ఏరియా ఆస్పత్రి, కాటన్‌ పార్క్‌, ఆక్వావర్సిటీ తదితర ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌, వశిష్ట గోదావరిపై వంతెన పనులకు మోక్షం కలిగించాం. రానున్న ఐదేళ్లలో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తాం.

ప్రజల జీవితాల్లో ఎంతో మార్పు

ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల

జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక రాజకీయాలతో పాటు ప్రజల జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. గతంలో ఎవరూ సీఎం జగన్‌లా ప్రజలకు సంక్షేమాన్ని అందించలేక పోయారు. గతంలో రాజకీయాలు అంటే ధనబలం ఉన్న వ్యక్తులకు మాత్రమే పరిమితం అయ్యేవి. తొలిసారి సీఎం జగన్‌ పాలనలో బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు వచ్చా యి. ఓసీలు మాత్రమే పోటీ చేసే నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ స్థానాన్ని మొదటిసారిగా బీసీలకు అవకాశం ఇచ్చిన జగనన్నకు కృతజ్ఞతలు.

సామాన్యులకూ సీట్లు

పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి)

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం మేర అమలుచేశారు. నవరత్నాలతో పాటు నవరత్నాల ప్లస్‌ను మనమంతా అందుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎన్నడూ లేనివిధంగా అతి సామాన్యులకూ సీట్లు కేటాయించిన గొప్ప వ్యక్తి సీఎం జగన్‌. మనమంతా కష్టపడి పార్టీ కోసం పనిచేసి సీఎం జగన్‌ని మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓట్లు వేసి జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను, ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకుని సీఎం జగన్‌కు బహుమతిగా ఇవ్వాలి.

కూటమి మేనిఫెస్టో బూటకం

ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్‌

ప్రతిపక్ష పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో అంతా అబద్దాల పుట్ట. బడ్జెట్‌కు సరిపోల్చని, ఆచరణ సాధ్యం కాని హామీలను ఇస్తున్నారు. కానీ సీఎం జగన్‌ మాట ఇచ్చారంటే అమలుచేసి చూపిస్తారన్న విషయం అందరికీ తెలుసు. నరసాపురంలో బస్టాండ్‌ను అభివృద్ధి చేశారు, 100 పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చారు. కాపునేస్తం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించారు. ఇలా అన్నివర్గాలను అభివృద్ధిలోకి తీసుకువచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది.

కనీవినీ ఎరుగని అభివృద్ధి
1/3

కనీవినీ ఎరుగని అభివృద్ధి

కనీవినీ ఎరుగని అభివృద్ధి
2/3

కనీవినీ ఎరుగని అభివృద్ధి

కనీవినీ ఎరుగని అభివృద్ధి
3/3

కనీవినీ ఎరుగని అభివృద్ధి

Advertisement
Advertisement