తొలిరోజు 213 మంది ఓటేశారు | Sakshi
Sakshi News home page

తొలిరోజు 213 మంది ఓటేశారు

Published Sat, May 4 2024 4:35 AM

తొలిర

భీమవరం(పకాశం చౌక్‌): దేశంలోనే తొలిసారిగా ఇంటి వద్దే ఓటు వేసే అవకాశాన్ని కల్పించిన క్రమంలో జిల్లాలో తొలిరోజు శుక్రవారం 213 మంది హోం ఓటింగ్‌ ప్రక్రియలో భాగంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 85 సంవత్సరాలు పైబడిన వారు, 40 శాతం కన్నా ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ఎన్నికల కమిషన్‌ హోమ్‌ ఓటింగ్‌ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో జిల్లాలో 85 ఏళ్లు దాటిన వారు, దివ్యాంగులు కొందరు ఇంటి వద్దే ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 8 తేదీ వరకు ఇంటి వద్దే ఓటింగ్‌ వేసే అవకాశం దక్కింది. హోమ్‌ ఓటింగ్‌కు సంబంధించి పోలింగ్‌ అధికారి, సహాయ పోలింగ్‌ అధికారి, సూక్ష్మ పరిశీలకుడు, వీడియోగ్రాఫర్‌, ఆర్మీ కానిస్టేబుల్‌ సమక్షంలో పగడ్బందీగా ఓటింగ్‌ పక్రియ నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పోలింగ్‌ కంపార్ట్‌మెంట్‌ల్లో ఓటును వేయించి సీల్డు కవర్లో అధికారుల సమక్షంలోనే సీల్డ్‌ డ్రమ్ములో భద్రపరుస్తున్నారు. జిల్లాలో 85 ఏళ్లు దాటిన వారు 7,050 మంది ఉండగా వారిలో 562 మంది హోమ్‌ ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకోగా, వీరిలో తొలిరోజు 98 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే జిల్లాలో దివ్యాంగులు 18,807 మంది ఉండగా, వీరిలో 591 మంది హోమ్‌ ఓటింగ్‌కు ధరఖాస్తు చేసుకున్నారు. వారిలో మొదటి రోజు 115 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

వృద్ధులు, దివ్యాంగుల్లో హర్షం

ఎన్నికల కమిషన్‌ మొటమొదటిగా ఇంటి వద్దే ఓటింగ్‌ వేసుకునే సౌకర్యాన్ని కల్పించడంపై 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కదల్లేని స్థితిలో ఉన్న వృద్ధులకు, పోలింగ్‌ బూత్‌లకు వెళ్లడానికి ఇబ్బందులు పడే దివ్యాంగులకు హోమ్‌ ఓటింగ్‌ సౌకర్యం బాగుందని అంటున్నారు. పోలింగ్‌ విధానంలో ఇలాంటి మార్పులు రావడం మంచి పరిణామం అంటున్నారు. దీని వల్ల ఓటు వేయడానికి పడే ఇబ్బందులు తొలగాయని చెబుతున్నారు.

గందరగోళంగా కూటమి న్యాయవాదుల ఆత్మీయ సమావేశం

భీమవరం: ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో శుక్రవారం నిర్వహించిన

కూటమి న్యాయవాదుల ఆత్మీయ సమావేశం గందరగోళంగా మారింది. సమావేశానికి బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ గైర్హాజరు కాగా, జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావును వేదికపైకి పిలవకపోవడం గమనార్హం. అతిథిగా హాజరైన టీడీపీ ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు న్యాయవాదులను అగ్రహానికి గురిచేశాయి. చాలా మంది న్యాయవాదులు ప్రాక్టీసు చేయరని రెగ్యులర్‌గా కోర్టులకు హాజరుకారని, తాను మాత్రం కోర్టు పక్షినని, వివిధ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతూ పెద్దమొత్తంలో ఖర్చుచేశానని చెప్పడం గమనార్హం. ఓట్లు కోసం వచ్చి తమకు ఓట్లు వేయాలని అడగడం గాకుండా న్యాయవాదులను కించపర్చే విధంగా మాట్లాడడం ఏమిటని, ఇటువంటివారికి ఓట్లు ఎలా వేయాలంటూ గుసగుసలు విన్పించాయి.

8వ తేదీ వరకు కొనసాగనున్న హోం ఓటింగ్‌

తొలిరోజు 213 మంది ఓటేశారు
1/1

తొలిరోజు 213 మంది ఓటేశారు

Advertisement
Advertisement