జిల్లాల రద్దు లీకులపై సీఎం స్పందించాలి | Sakshi
Sakshi News home page

జిల్లాల రద్దు లీకులపై సీఎం స్పందించాలి

Published Sat, May 4 2024 12:20 AM

జిల్లాల రద్దు లీకులపై సీఎం స్పందించాలి

వనపర్తి: జిల్లాల రద్దు విషయమై కాంగ్రెస్‌ ఇస్తున్న లీకులతో మీడియాలో రోజుకో వార్త కథనం వస్తోందని.. ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విషయంపై జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. పరిపాలన సౌలభ్యం, ప్రాంతాల అభివృద్ధి కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని, ఆ తర్వాత ప్రజల జీవన విధానం మెరుగుపడిందని గుర్తించాలన్నారు. జిల్లాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తే మరో ఉద్యమం తెలంగాణలో మొదలవుతుందన్నారు. ఆచరణ సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ చిత్తశుద్ధి ఉంటే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. పోడు రైతులకు రైతుబంధు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్‌, నాయకులు లక్ష్మారెడ్డి, రఘుపతిరెడ్డి, మన్నెపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

Advertisement
 

తప్పక చదవండి

Advertisement