వేసవిలో జాగ్రత్తలు తప్పనిసరి | Sakshi
Sakshi News home page

వేసవిలో జాగ్రత్తలు తప్పనిసరి

Published Sat, May 4 2024 12:05 AM

వేసవిలో జాగ్రత్తలు తప్పనిసరి

కొత్తకోట రూరల్‌: రోజురోజుకు ఎండ తీవ్రత అధికమవుతుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్‌ సూచించారు. శుక్రవారం మండలంలోని అమడబాకుల ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, ఓఆర్‌ఎస్‌ పాకెట్లు అందుబాటులో ఉంచాలని, ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని కోరారు. ఉపకేంద్రంలో రోగులకు అందుతున్న వైద్యసేవలపై గ్రామస్తులతో ఆరా తీశారు. ప్రజలు అవసరమైతే తప్పా బయటకు రావద్దని.. బయటకు వెళ్తే వాటర్‌ బాటిల్‌, ఓఆర్‌ఎస్‌ పాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అనంతరం కొత్తకోటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడారు.

Advertisement
Advertisement