బ్యాలెట్‌ పత్రాల ముద్రణ పూర్తి | Sakshi
Sakshi News home page

బ్యాలెట్‌ పత్రాల ముద్రణ పూర్తి

Published Sat, May 4 2024 7:20 AM

-

మహారాణిపేట: అసెంబ్లీ, పార్లమెంట్‌ బ్యాలెట్‌ పత్రాల ముద్రణ పూర్తయింది. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల బ్యాలెట్‌ పత్రాలు ఇప్పటికే విశాఖకు చేరుకున్నాయి. పార్లమెంట్‌ నియోజకవర్గ బ్యాలెట్‌ పత్రాలు కర్నూలు జిల్లా ప్రభుత్వ ప్రింటింగ్‌ కార్యాలయం నుంచి శనివారం విశాఖకు చేరే అవకాశం ఉంది. విశాఖ పార్లమెంట్‌ పరిధిలో మొత్తం 45,350 బ్యాలెట్‌ పత్రాలు ముద్రణ పూర్తి చేశారు. పది శాతం రిజర్వ్‌, ఒక్కో పోలింగ్‌స్టేషన్‌లో టెండర్‌ ఓటింగ్‌ కోసం అదనంగా 20 బ్యాలెట్‌ పత్రాలు కలిపి ఆర్డర్‌ ఇచ్చారు. విశాఖపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో 1,962 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. ఎస్‌.కోట అసెంబ్లీలో 270 పోలింగ్‌ స్టేషన్లు, విశాఖ తూర్పు 293, విశాఖ దక్షిణం 237, విశాఖ ఉత్తరం 295, విశాఖ పశ్చిమం 222, గాజువాకలో 306 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. విశాఖ పార్లమెంట్‌ స్థానానికి మొత్తం 33 మంది పోటీ చేస్తున్నారు. ఒక ఈవీఎంలో 16 మంది, రెండో ఈవీఎంలో మరో 16 మంది, మరో ఈవీఎంలో మరొకరు, నోటా ఉంటుంది.

Advertisement
 
Advertisement