Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. | Sakshi
Sakshi News home page

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌..

Published Sat, May 4 2024 11:29 AM

Police Says Prabhakar Rao Is Prime Accused In Phone Tapping Case

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ​కేసులో ఎస్‌ఐటీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావునే ప్రధాన నిందితుడిగా చేర్చుతూ కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు.

కాగా, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్‌ రావుతో పాటుగా మరో ప్రైవేటు వ్యక్తిని కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఇక, ప్రభాకర్‌ రావుతో పాటుగా సదరు ప్రైవేటు వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారమంతా ప్రభాకర్‌ రావు కనుసన్నల్లోనే జరిగిందని పోలీసులు తేల్చారు.

మరోవైపు.. ఎస్‌ఐబీలో హార్డ్‌ డిస్క్‌లను ధ్వంసం చేయడంలో ‍కూడా ప్రభాకర్‌ రావే ప్రధాని సూత్రధారి అని పోలీసులు వెల్లడించారు. ప్రభాకర్‌ రావు ఆదేశాల మేరకే ప్రణీత్‌ రావు హార్డ్‌ డిస్క్‌లను ధ్వంసం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. అలాగే, ప్రభాకర్‌ రావు చెప్పిన నంబర్లను ప్రణీత్‌ రావు ట్యాపింగ్‌ చేసినట్టు చెప్పారు. ఇక, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్‌ రావు అమెరికాకు వెళ్లిపోయారని  అన్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్‌ రావుకు పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.  
 

Advertisement
Advertisement