సైన్స్‌ ఉపాధ్యాయుల ఇస్రో పర్యటన | Sakshi
Sakshi News home page

సైన్స్‌ ఉపాధ్యాయుల ఇస్రో పర్యటన

Published Sat, May 4 2024 5:40 AM

సైన్స్‌ ఉపాధ్యాయుల ఇస్రో పర్యటన

తిరువళ్లూరు: ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ సైన్స్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులకు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఉపగ్రహాల తయారీ విధానంపై అవగాహన పెంపొందించడానికి 200 మందితో కూడి న సైన్సు టీచర్ల బృందం డార్విన్‌ సంస్థ ఆధ్వర్యంలో ఇస్రోను సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విధానంపై బోధన, ఉపగ్రహాలు, టెలిస్కోప్‌ తయారీ విధానంపై అవగాహన కల్పించాలని డార్వీన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం ఏటా 200 నుంచి 300 మంది ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలకు చెందిన సైన్స్‌ టీచర్లను ఇస్రోకు తీ సుకెళ్లి అక్కడ శాస్త్రవేత్తలతో ముఖాముఖి, ఉపగ్రహాలు, టెలీస్కోప్‌ తయారీ విధానం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది సైన్స్‌ టీచర్లు సుమారు 200 మంది ఇస్రోను సందర్శించారు. మొదట శాస్త్రవేత్తలు శ్రీనివాసరావు, అన్నాదురైతో సహా నలుగురు శాస్త్రవేత్తలతో ఉపాధ్యాయులు ముఖాముఖీ నిర్వహించారు. సైన్స్‌ బోధన సమయంలో ఉపయోగించాల్సిన టెక్నిక్స్‌తోపాటు ఉపగ్రహాలు, టెలీస్కోప్‌ తయారీ విధానంపై తమకున్న సందేహాలను శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏరోనాటికల్‌ విభాగంలో ప్రస్తుతం సాగుతున్న పరిశోధనలను పరిశీలించారు. పర్యటనలో పాల్గొన్న తిరువళ్లూరుకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్‌ డెలోరస్‌పాండ్యన్‌ మాట్లాడుతూ డార్వీన్‌ సంస్థ సైన్స్‌ ఉపాధ్యాయులను ఇస్రో తీసుకెళ్లడం, వేర్వేరు పరిశోధనలపై శాస్త్రవేత్తలతో ముఖాముఖీ నిర్వహించడం అబినందించదగ్గ విషయమన్నారు. మే 24 నుంచి 26 వరకు కోయంబత్తూరు జిల్లా అన్ననూర్‌లోని నవభారత్‌ మెట్రిక్‌ పాఠశాలలో ఉపగ్రహాల తయారీ, మైక్రోస్కోప్‌, టెలీస్కోప్‌ తయారు చేసే విధానంపై శిక్షణ తీసుకోనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దినేష్‌, జిల్లాల కోర్డినేటర్లు నెల్సన్‌, కన్నన్‌, కర్పగం, జయంతి, రాజ్‌కుమార్‌, రూపావతి, పాండ్యన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement