వీఏఓ, గ్రామ సహాయకుడిపై కేసు నమోదు | Sakshi
Sakshi News home page

వీఏఓ, గ్రామ సహాయకుడిపై కేసు నమోదు

Published Sat, May 4 2024 5:40 AM

-

తిరువొత్తియూరు: లంచం డిమాండ్‌ చేసిన వీఏఓ, గ్రామ సహాయకుడిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. నైల్లె టౌన్‌ కోటయ్యడివీధికి చెందిన చిన్నదురై (50) నైల్లె కార్పొరేషన్‌ తచ్చై మండలంలో ఇంజినీరింగ్‌ విభాగంలో పనిచేస్తున్నాడు. ఇతను తన పొలానికి సంబంధించి అడంగల్‌ కోసం నైల్లె టౌన్‌ వీఏఓ కార్యాలయంలో నెల రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ దరఖాస్తుపై వీఏఓ దురై కుట్టి, గ్రామ సహాయకుడు నటరాజన్‌ విచారణ చేశారు. చిన్నదురై అడంగల్‌ కోసం సుమారు నాలుగు సార్లు వీఏఓ కార్యాలయానికి వెళ్లారు. కానీ వారు నిర్లక్ష్యం చేస్తూ అడంగల్‌ ఇవ్వలేదు. ఈ క్రమంలో గతవారం వీఏఓ దురైకుట్టి, గ్రామ సహాయకుడు నటరాజన్‌ ఇద్దరూ వేర్వేరుగా సెల్‌ఫోన్‌లో చిన్నదురైని వీఏఓ కార్యాలయానికి రావాలని పిలిచారు. అక్కడికి వెళ్లిన చిన్నదురైతో వీఏఓ, గ్రామ సహాయకుడు అడంగల్‌ ఇవ్వడానికి రూ.20 వేలు ఇవ్వమని కోరారు. అందుకు అతను తిరస్కరించడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో చిన్నదురైని అసభ్యకరంగా మాట్లాడినట్టు తెలిసింది. ఈ విషయమై చిన్నదురై నైల్లె టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనకు అడంగల్‌ ఇవ్వకపోగా వీఏఓ, గ్రామ సహాయకుడు తనని కార్యాలయం చుట్టూ తిప్పిస్తున్నారని రూ.2 వేలు కోరుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు విచారణ జరిపి అసభ్యకరంగా మాట్లాడడం, అంటరానితనం తదితర నాలుగు విభాగాల కింద వీఏఓ దురైకుట్టి, గ్రామ సహాయకుడు నటరాజన్‌పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Advertisement
Advertisement