కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు

Published Sat, May 4 2024 7:20 AM

కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు

పెన్‌పహాడ్‌: అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు ఓటుతోనే బుద్ధి చెబుతారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని దూపహాడ్‌ గ్రామంలో బీఆర్‌ఎస్‌ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా గ్రామంలో పార్టీ నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని మాటిచ్చి, ఇంత వరకు అమలు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామంటూ ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల నియోజకవర్గ సమన్వయకర్త ఇస్లావత్‌ రామచంద్రనాయక్‌, ఎంపీపీ నెమ్మాది భిక్షం, పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి యుగేందర్‌, మండల ప్రధాన కార్యదర్శి వెన్న సీతారాంరెడ్డి, మాజీ సర్పంచ్‌ బిట్టు నాగేశ్వరరావు, గుగ్గిళ్ల సోమయ్య, తూముల ఇంద్రసేనారావు, వీరయ్య, భద్రయ్య, యగ్గడి మురళి, దాసరి శ్రీనివాస్‌, దాచేపల్లి సుధాకర్‌, నల్లపు శ్రీను, అరవింద్‌, హుస్సేన్‌ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌, బీజేపీ రెండూ ఒక్కటే

తుంగతుర్తి: కాంగ్రెస్‌, బీజేపీలు రెండూ ఒక్కటేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, ప్రధాని మోదీలు ప్రజా సమస్యలను పక్క దారి పట్టిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్లు గుజ్జ దీపికాయుగేందర్‌రావు, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్‌ యాదవ్‌, మండల అధ్యక్షుడు సీతయ్య, వైస్‌ఎంపీపీ శ్రీశైలం, రాములుగౌడ్‌, సాయిలు పాల్గొన్నారు.

ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

Advertisement
Advertisement