ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి | Sakshi
Sakshi News home page

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

Published Sat, May 4 2024 7:20 AM

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

సూర్యాపేట : లోక్‌సభ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకుడు మనోజ్‌కుమార్‌ మాణిక్‌రావ్‌ సూర్యవంశీ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నోడల్‌ అధికారులు, మైక్రో అబ్జర్వర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల విధుల్లో మైక్రో అబ్జర్వర్లు, సెక్టార్‌ అధికారుల పాత్ర కీలకమన్నారు. మైక్రో అబ్జర్వర్లు తమ చెక్‌ లిస్ట్‌ ప్రకారం పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు పరిశీలించాలని తెలిపారు. కలెక్టర్‌ వెంకటరావు మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 10,00,012 మంది ఓటర్లు ఉండగా 1201 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై సీవిజిల్‌కు 54 ఫిర్యాదులు అందగా 48 కేసులు పరిష్కరించామన్నారు. సువిధాలో 291 అనుమతులకు 180 అనుమతులు ఇచ్చామని, 87 తిరస్కరించామని, 20 రద్దు అయ్యాయని మిగిలిన 4 పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. 1950 టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా 181 ఫిర్యాదులు పరిష్కరించినట్లు చెప్పారు. మొత్తం పోలింగ్‌ కేంద్రాల్లో 229 కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లుగా గుర్తించి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో అదనవు కలెక్టర్లు సీహెచ్‌ ప్రియాంక, బీఎస్‌ లత, ఏఎస్పీ నాగేశ్వర రావు పాల్గొన్నారు.

సమన్వయం అవసరం

ఎన్నికల సిబ్బందితో పోలీసు సిబ్బందికి సమన్వయం అవసరమని పోలీసు పరిశీలకుడు అమోగ్‌ జీవన్‌ గోవాకర్‌, జనరల్‌ పరిశీలకుడు మనోజ్‌ కుమార్‌ మానిక్‌ రావు అన్నారు. ఎన్నికల యాక్షన్‌ ప్లాన్‌, పోలీసు బందోబస్తుపై శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటరావు, ఎస్పీ రాహుల్‌ హెగ్డేతో కలిసి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ట్రైనీ ఐపీఎస్‌ రాజేష్‌ మీనా, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ వీర రాఘవులు పాల్గొన్నారు.

ఫ ఎన్నికల సాధారణ పరిశీలకుడు

మనోజ్‌కుమార్‌ మాణిక్‌రావు సూర్యవంశీ

Advertisement
 
Advertisement