తనిఖీలు ముమ్మరం చేయాలి | Sakshi
Sakshi News home page

తనిఖీలు ముమ్మరం చేయాలి

Published Sat, May 4 2024 7:20 AM

తనిఖీ

సూర్యాపేట: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చెక్‌పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి వెంకటరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక, అదనపు ఎస్పీ నాగేశ్వరరావుతో కలిసి నిర్వహించిన జిల్లా ఇంటెలిజెన్స్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంకర్లు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిగే డిజిటల్‌ లావాదేవీలు, బ్యాంకు లావాదేవీలపై నిఘా ఉంచాలన్నారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్న వాటికి తప్పకుండా రశీదు అందజేయాలని సూచించారు. జిల్లాలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ పకడ్బందీగా అమలు చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ అప్పారావు, ఎకై ్సజ్‌ పర్యవేక్షకులు లక్ష్మానాయక్‌, డీఎఫ్‌ఓ సతీష్‌ కుమార్‌, ఇన్‌కంటాక్స్‌ అధికారి, డీసీఓ పద్మ, ఎలక్షన్‌ విభాగం పర్యవేక్షకుడు శ్రీనివాసరాజు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

బాధ్యతలు స్వీకరించిన జూనియర్‌ సివిల్‌ జడ్జి

తుంగతుర్తి: తుంగతుర్తి జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఫర్హీన్‌ కౌసర్‌ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని సిటీ సివిల్‌ కోర్టు నుంచి ఆమె బదిలీపై తుంగతుర్తికి వచ్చారు. ఈ సందర్భంగా తుంగతుర్తి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తాళ్లపల్లి సత్యనారాయణ ఆమెను సన్మానించారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ సభ్యులు రమావత్‌ ఫుల్‌సింగ్‌ నాయక్‌, మల్లపాక రవికుమార్‌, బానోత్‌ ప్రతాప్‌, వంగాల నాగరాజు,, అనిల్‌కుమార్‌, న్యాయవాదులు జిల్లా కుమారస్వామి, కారింగుల వెంకటేశ్వర్లు, కుంభం రణధీర్‌, హరిచరణ్‌, జిలకర చంద్రమౌళి, బానోత్‌ సతీష్‌, రాజారాం, శ్రీనివాస్‌, ఓర్సు రాజు, నక్కల సురేందర్‌, శ్రీలత, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

మట్టపల్లిలో నిత్యకల్యాణం

మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని శుక్రవారం అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం, నిత్యహోమం పూర్తిగావించి శ్రీస్వామి అమ్మవార్లకు ఎదుర్కోళ్ల మహోత్సవం జరిపించారు. అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్యప్రాశన, మధుఫర్కపూజ, మాంగల్యధారణ నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈఓ నవీన్‌కుమార్‌, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

తనిఖీలు  ముమ్మరం చేయాలి
1/2

తనిఖీలు ముమ్మరం చేయాలి

తనిఖీలు  ముమ్మరం చేయాలి
2/2

తనిఖీలు ముమ్మరం చేయాలి

Advertisement
 
Advertisement