కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల దోస్తీ కీలకం | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల దోస్తీ కీలకం

Published Sat, May 4 2024 7:20 AM

కాంగ్

హుజూర్‌నగర్‌ (చింతలపాలెం) : కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీల కలయికపై ప్రజాస్వామ్యవాదులు హర్షిస్తున్నారని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చింతలపాలెం మండలం దొండపాడులో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టులతో దోస్తీ చాలా కీలకంగా మారిందని తెలిపారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంట్‌కు పంపించాలని కోరారు. ఈసందర్భంగా తమ్మారం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన, సీపీఐ జిల్లా నాయకులు ఉస్తెల నారాయణరెడ్డి, సీపీఎం నాయకులు పల్లా వెంకటరెడ్డి, సుందర మౌళీశ్వర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

రఘువీర్‌రెడ్డిని గెలిపించాలి

హుజూర్‌నగర్‌: కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డిని గెలిపించాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కోరారు. శుక్రవారం హుజూర్‌నగర్‌ పట్టణంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రోడ్డుషో నిర్వహించారు. అనంతరం అడ్డరోడ్డు సెంటర్‌లో కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించారు. అనంతరం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి బార్‌ అసోసియేషన్‌ సభ్యులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. రోడ్డు షోలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, సీపీఐ రాష్ట్ర నాయకులు రాములు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌, బీజేపీలకు డిపాజిట్‌ కూడా దక్కదు

చిలుకూరు: నల్లగొండ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డికి 5 లక్షలకు పైగా మెజారీటీ వస్తుందని, బీఆర్‌ఎస్‌, బీజేపీలకు డిపాజిట్‌ కూడా దక్కదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చిలుకూరులో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ప్రచార సభకు ముందు చిలుకూరు కాలువ ఒడ్డున గల ఆంజనేయస్వామి దేవాలయం నుంచి బస్టాండ్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి, సీపీఐ సీనియర్‌ నాయకులు దొడ్డా నారాయణరావు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు కీత వెంకటేశ్వర్లు, హనుమంతరావు, ఎంపీపీ బండ్ల ప్రశాంతి, జెడ్పీటీసీ శిరీష, సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, మండవ వెంకటేశ్వర్లు, వేనేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల దోస్తీ కీలకం
1/1

కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల దోస్తీ కీలకం

Advertisement
Advertisement