ఈవీఎంల కమిషనింగ్‌ ప్రారంభం | Sakshi
Sakshi News home page

ఈవీఎంల కమిషనింగ్‌ ప్రారంభం

Published Sat, May 4 2024 6:35 AM

-

శ్రీకాకుళం పాతబస్టాండ్‌ : ఈవీఎంల కమిషనింగ్‌ ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలాని సమూన్‌ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంల కమిషనింగ్‌ ప్రక్రియను శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈవీఎంలపై సీరియల్‌ నంబర్లు, అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన చిహ్నాల ఏర్పాటు సీసీ కెమెరాల ఎదుట పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. కమిషనింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహించి, ఈవీఎంల పనితీరు పరిశీలించి, వారికి పూర్తిస్థాయిలో నమ్మకాన్ని కలిగించాలని సూచించారు.

రెండో విడత ర్యాండమైజేషన్‌లో కేటాయించిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్ల నంబర్లను కంట్రోల్‌ యూనిట్‌, బ్యాలెట్‌ యూనిట్‌, వీవీ ప్యాట్‌లని ఆయా పోలింగ్‌ కేంద్రాలకు కేటాయించే ప్రక్రియ జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం అక్కడే నియోజకవర్గ ఎన్నికల సిబ్బంది శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి తనిఖీ చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగంపై సిబ్బందికి అవగాహన కల్పించాలని ఆదేశించారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement