నేటి నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌

Published Sat, May 4 2024 6:35 AM

నేటి నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌

శ్రీకాకుళం పాత బస్టాండ్‌: పోస్టల్‌ బ్యాలెట్లను శనివారం నుంచి స్వీకరించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ తెలిపా రు. జిల్లాలో సుమారుగా 30,606 మంది ఎన్నికల విధుల్లో వివిధ కేడర్‌లలో పాల్గొంటున్నారని, వీరంతా వారికి కేటాయించిన షెడ్యూల్‌ ప్రాప్తికి ఓట్లను పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వేసుకోవాలని ఆయన తెలిపారు. పీఓలు, ఏపీఓలు, మైక్రో అబ్జర్వర్స్‌, హోం ఓటింగ్‌ ఇతర టీంలకు 4వ తేదీన, ఓపీఓలు, సెక్టార్‌ అధికారులు, ఇతర టీంలకు 5వ తేదీన, పోలీస్‌, ప్రైవేటు డ్రైవర్స్‌, ఆర్టీసీ డ్రైవర్స్‌, వీడియోగ్రాఫర్స్‌, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు 6వ తేదీన, జిల్లా స్థాయి అధికారులకు, ఇతర జిల్లాల్లో పనిచేసిన వారికి, హోం ఓటింగ్‌ పరిశీలకులకు 6వ తేదీన, రిజర్వ్‌ డే గా 7వ తేదీని కేటాయించారు. ఈ తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ను వేసుకోవాలని తెలిపారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రాలు

ఇచ్ఛాపురం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల

పలాస ప్రభుత్వ హైస్కూల్‌, పలాస

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, టెక్కలి

పాతపట్నం ఏపీ మోడల్‌ స్కూల్‌, పాతపట్నం

శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (మెన్‌)

ఆమదాలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాల,

ఆమదాలవలస

ఎచ్చెర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల,

పోలీస్‌ క్వార్టర్స్‌

నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల,

నరసన్నపేట

Advertisement
Advertisement