ఫెసిలిటేషన్‌ కేంద్రాల ఏర్పాటు | Sakshi
Sakshi News home page

ఫెసిలిటేషన్‌ కేంద్రాల ఏర్పాటు

Published Sat, May 4 2024 8:35 AM

-

పుట్టపర్తి అర్బన్‌: ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు ఈనెల 4, 6 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ను సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అరుణ్‌బాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకోసం జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫెసిలిటేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఓటరుగా నమోదై, ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులంతా ఆయా ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ వేయాలన్నారు. ఈనెల 4, 6 తేదీల్లో పీఓలు, ఏపీఓలకు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో శిక్షణ తరగతులు నిర్వహించిన అనంతరం పోస్టల్‌ బ్యాలెట్‌ అందిస్తామన్నారు. ఓపీఓలకు ఈనెల 7వ తేదీన శిక్షణతో పాటు పోస్టల్‌ బ్యాలెట్‌ ఇస్తామన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌కు 1,211 మంది దరఖాస్తు

జిల్లాలో ట్రెజరీ, సివిల్‌ సప్లయీస్‌, హోం గార్డ్‌, పోలీస్‌, రైల్వే, ఆర్టీసీ, హెల్త్‌, సెబ్‌, ఐఅండ్‌ పీఆర్‌, ఎలక్ట్రిసిటీ, ఆర్‌టీఓ, ప్రెస్‌, ఫైర్‌ తదితర శాఖల్లోని సుమారు 1,211 మంది పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. ఇందులో హిందూపురం నియోజకవర్గంలో 170 మంది, కదిరి నియోజకవర్గంలో 258 మంది, ధర్మవరం నియోజకవర్గంలో 248 మంది, పెనుకొండలో 169 మంది, పుట్టపర్తిలో 264 మంది, మడకశిరలో 102 మంది ఉన్నారన్నారు. ఇక ఇతర జిల్లాల్లోని 12 శాఖలకు సంబంధించిన ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అందులో అనంతపురం జిల్లాకు సంబంధించి 541, చిత్తూరు 13, గుంటూరు 1, వైఎస్సార్‌ 20, కర్నూలు 27, నంద్యాల 24, నెల్లూరు 2, అన్నమయ్య 17, తిరుపతి 17, విజయనగరం 1, శ్రీకాకుళం 2, ప్రకాశం 1..ఇలా మొత్తంగా 6,66 ఉన్నాయి.

ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఇలా...

● రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి అనంతపురం పంగల్‌రోడ్‌లోని టీటీడీసీ కేంద్రం

● మడకశిర నియోజకవర్గానికి మడకశిర పాత తహసీల్దార్‌ కార్యాలయం

● హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి హిందూపురం పాత తహసీల్దార్‌ కార్యాలయం

● పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి పెనుకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

● పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి చిన్నపల్లి జెడ్పీ హైస్కూల్‌

● ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ధర్మవరంలోని సాయికృప జూనియర్‌ కళాశాల

● కదిరి అసెంబ్లీ నియోజక వర్గానికి కదిరి బాలికల జెడ్పీ హైస్కూల్‌

4, 6 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌కు

అవకాశం

సద్వినియోగం చేసుకోవాలని

కలెక్టర్‌ పిలుపు

Advertisement
 
Advertisement