బైక్‌లు ఢీకొని వ్యక్తి దుర్మరణం | Sakshi
Sakshi News home page

బైక్‌లు ఢీకొని వ్యక్తి దుర్మరణం

Published Thu, May 16 2024 1:20 PM

బైక్‌లు ఢీకొని వ్యక్తి దుర్మరణం

కలువాయి: మండలంలోని బ్రాహ్మణపల్లి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమశిలకు చెందిన వెంకటేశ్వర్లు(45) మృతిచెందాడు. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై వెంకటేశ్వర్లు కలువాయికి వచ్చి సోమశిలకు వెళ్తుండగా.. అదే సమయంలో పామర్తి నగేష్‌ ఉయ్యాలపల్లి నుంచి కలువాయికి బైక్‌పై వస్తున్నాడు. బ్రాహ్మణపల్లి సమీపంలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. గాయపడిన వారిని కలువాయి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే వెంకటేశ్వర్లు మృతిచెందాడు. నగేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయమై కలువాయి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement