ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్‌ | Sakshi
Sakshi News home page

ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్‌

Published Sat, May 4 2024 6:00 PM

Mumbai Indiansstory is finished in IPL 2024, says Irfan Pathan

ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ దారుణ ప్రదర్శన కొనసాగుతోంది.  శుక్రవారం వాంఖడే వేదికగా  కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

దీంతో తమ ప్లే ఆఫ్‌ ఆశలను ముంబై సంక్లిష్టం చేసుకుంది. వాంఖడేలో కేకేఆర్‌ చేతిలో ముంబై జట్టు ఓడిపోవడం 12 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ క్రమంలో ముంబై జట్టును విజయం పథంలో నడిపించలేక విఫలమవుతున్న కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం హార్దిక్‌ పాండ్యా కెప్టెన్స్‌పై మండిపడ్డాడు. "ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. పేపర్‌పై ముంబై జట్టు చాలా బలంగా ఉంది. కానీ మైదానంలో మాత్రం పూర్తిగా తేలిపోతున్నారు.

ముఖ్యంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురుస్తోంది. బౌలింగ్‌లో ముంబైకి మంచి ఆరంభం లభించింది. 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కేకేఆర్‌ కష్టాల్లో పడింది.

అటువంటి సమయంలో 6వ బౌలర్‌గా నమన్ ధీర్ ఉపయోగించాల్సిన అవసరం ఏముంది? చావ్లాతో ఫుల్‌ ఓవర్ల కోటాను పూర్తి చేయలేదు. మనీష్ పాండే, వెంకటేష్ అయ్యర్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి కేకేఆర్‌కు మంచి స్కోర్‌ అందించారు. 

క్రికెట్‌లో ఏ జట్టుకైనా కెప్టెన్సీ చాలా ముఖ్యం. కాబట్టి కెప్టెన్సీ విషయంలో మేనేజ్‌మెంట్ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం ముంబై జట్టు ఒక యూనిటీగా ఆడడం లేదు. హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించడం ముంబై ఆటగాళ్లకు సైతం ఇష్టం లేనట్లుందని" స్టార్‌స్పోర్ట్స్‌ షోలో పఠాన్‌ పేర్కొన్నాడు.
 

Advertisement
Advertisement