పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవాలి | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవాలి

Published Sat, May 4 2024 7:00 AM

పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవాలి

సిరిసిల్ల: జిల్లాలోని ఉద్యోగులందరూ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓట్లు వేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి కోరారు. సిరిసిల్ల గీతానగర్‌ హైస్కూల్‌లోని ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను శుక్రవారం సందర్శించారు. ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 3,628 ఓటర్లు ఉండగా, సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలో 1,066 మంది, వేములవాడ నియోజకవర్గం పరిధిలో 631 మంది, ఈడీసీ (ఎలక్షన్‌ డ్యూటీ సర్టిఫికేట్‌)లో 1,931 మంది ఉన్నారని కలెక్టర్‌ వెల్లడించారు. ఈనెల 3వ తేదీ నుంచి 8 వరకు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్‌ పి.గౌతమి, సిరిసిల్ల ఆర్డీవో ఎల్‌.రమేశ్‌, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సిరిసిల్ల తహసీల్దారు షరీఫ్‌ మొహినొద్దీన్‌, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

Advertisement
Advertisement