కారు బీభత్సం | Sakshi
Sakshi News home page

కారు బీభత్సం

Published Sat, May 4 2024 10:30 AM

కారు

వైఎస్సార్‌ సీపీలోకి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు
 

మార్కాపురం: బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కంభం వెంకట రమణారావు శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేసి తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌ సీపీలో చేరారు. స్థానిక పార్టీ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే అన్నా రాంబాబు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, టీటీడీ, జనసేన పొత్తుతో మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌ సీపీలో చేరారన్నారు. అన్నా రాంబాబుతో పాటు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గెలుపుకు కృషిచేస్తానని తెలిపారు. ఆయనతోపాటు మాజీ టీడీపీ కౌన్సిలర్లు నందిగం శ్రీనివాసులు, జలుకూరి సత్యవతీతోపాటు వేముల పెద్దరంగడు, పారుమంచాల చిన్నకృష్ణయ్య, దండూరి కోటయ్య, సయ్యద్‌ ముజీబ్‌, ఎస్‌కే కరీముల్లా, ఎస్‌కే గౌస్‌ మొహిద్దీన్‌, గంగిరెడ్డితోపాటు 9,10 వ బ్లాక్‌ టీడీపీ బ్లాక్‌ నాయకులు వైఎస్సార్‌ సీపీ లో చేరారు. కార్యక్రమంలో రఘుపతి శివ, పెంచికల కాశయ్య, నజీర్‌, ఉప్పు బాబు, మొగిలి ఇస్మాయిల్‌ బేగ్‌, బెల్లంకొండ గోపి పాల్గొన్నారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే రాంబాబు పార్టీలోనికి ఆహ్వానించారు. ఏ సమస్య వచ్చినా కార్యకర్తలు తన దృష్టికి తేవాలని, వెంటనే పరిష్కరిస్తానని ఆయన తెలిపారు.

గిద్దలూరు రూరల్‌: అతివేగంగా వస్తున్న కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మమూడు బైక్‌లు ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన నంద్యాల రోడ్డులోని స్వదేశీ రెస్టారెంట్‌ సమీపంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. నంద్యాల నుంచి గిద్దలూరు వైపుగా వస్తున్న కారు రెస్టారెంట్‌ వద్ద ఆగి ఉన్న మూడు బైక్‌లను, వ్యక్తిని, విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో కేఎస్‌పల్లెకు చెందిన గాలిరెడ్డి (63) రెస్టారెంట్‌ వద్ద తన బైక్‌ పక్కన నిలబడి ఉండగా కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కారు నడుపుతున్న రాజేష్‌ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. కారు ఢీకొట్టడంతో బైక్‌లు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయాలైన రాజేష్‌ను చికిత్స నిమిత్తం గిద్దలూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఒకరు మృతి, మూడు బైక్‌లు ధ్వంసం

Advertisement
Advertisement