నగదు జప్తు | Sakshi
Sakshi News home page

నగదు జప్తు

Published Sat, May 4 2024 7:35 AM

-

పెద్దపల్లిరూరల్‌: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో సరైన ఆధారాలు లేకుండా నగదు, ఇతర విలువైన వస్తుసామగ్రి తరలిస్తూ పట్టుబడితే జప్తు చేస్తామని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ముజమ్మిల్‌ఖాన్‌ తెలిపారు. ఇలాంటి వాటిని తగిన ఆధారాలు చూపి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఇప్పటి వరకు రూ..1,58,46,182 నగదు పట్టుబడగా ఆధారాలు చూపిన రూ.1,57,95,182 నగదు విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ఆభరణాలు పట్టివేత

జ్యోతినగర్‌(రామగుండం): శుక్రవారం రాత్రి ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మేడిపల్లి సెంటర్‌లో ఎస్సై ఉదయ్‌కిరణ్‌ తన సిబ్బందితో తనిఖీలు చేపట్టగా హైదరాబాద్‌ నుంచి మంచిర్యా వైపు వె ళ్తున్న వాహనంలో బంగారు, వెండి ఆభరణాలు క నిపించాయి. కరీనగర్‌కు చెందిన కొత్తకొండ నవీన్‌ వీటిని తరలిస్తున్నారని గుర్తించారు. ఆధారాలు చూపకపోవడంతో ఎఫ్‌ఎస్‌టీకు అప్పగించారు. ఆభరణాల విలువ సుమారు రూ. 81,02,691 వరకు ఉంటుందని ఎస్సై వివరించారు.

జగిత్యాల జిల్లాలో..

జగిత్యాలక్రైం/మెట్‌పల్లి: జిల్లా కేంద్రంలోని తహసీ ల్‌ చౌరస్తాలో శుక్రవారం ఎస్సై మన్మథరావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేశారు. ఉప్పరిపేటకు చెందిన కొక్కు రాజేందర్‌ ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.2 లక్షలు, విద్యానగర్‌కు చెందిన కంది లక్ష్మణ్‌ తీసుకెళ్తున్న రూ.లక్ష సీజ్‌ చేసి గ్రీవెన్‌సెల్‌కు పంపించారు. మెట్‌పల్లిలోనూ నగదు సీజ్‌ చేశారు.

Advertisement
 
Advertisement