అనారోగ్యంతో ఎకై ్సజ్‌ ఎస్సై మృతి | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో ఎకై ్సజ్‌ ఎస్సై మృతి

Published Sat, May 4 2024 7:25 AM

అనారో

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఎకై ్సజ్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న కాళీ ప్రసాద్‌(58) శుక్రవారం వేకువజామున అనారోగ్యంతో మృతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబీకులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కొత్తగూడెం పట్టణానికి చెందిన కాళీప్రసాద్‌ మల్టీజోన్‌ బదిలీల్లో భాగంగా గత ఫిబ్రవరి 14న ఎల్లారెడ్డిపేట సర్కిల్‌ కార్యాలయానికి బదిలీపై వచ్చారు. స్థానికంగా ఓ అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. కొంతకాలంగా మధుమేహం, బీపీ, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నాడు. ఇంట్లో నిద్రించే క్రమంలో అతడికి తలుపులు వేసుకునే అలవాటు లేదు. అయితే శుక్రవారం ఉదయం తన గదిలో విగతజీవిగా పడి ఉన్న ప్రసాద్‌ను యజమాని గమనించి ఎస్సైజ్‌ సీఐ శ్రీనివాస్‌కు సమాచారం అందించారు. అధికారులు ఘటన స్థలానికి చేరుకుని ప్రసాద్‌ మృతదేహన్ని పరిశీలించి, అతడి కుటుంబీకులకు సమాచారమిచ్చారు. అయితే ప్రసాద్‌ మృతదేహన్ని పరిశీలించిన అధికారులు అనుమానాస్పద మృతిగా భావించారు. కొత్తగూడెం నుంచి కుమారుడు సాయిరేవంత్‌ తన స్నేహితులతో వచ్చి మృతదేహన్ని పరిశీలించారు. తన తండ్రి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు. అతడి మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులకు కూడా ఫిర్యాదు చేయకుండా మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలించారు.

పక్షం రోజుల్లో భార్యాభర్తల మృతి

ఎకై ్సజ్‌ ఎస్సై ప్రసాద్‌ భార్య సావిత్రి 15 రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. అంతలోనే ప్రసాద్‌ మృతిచెందడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. భార్య మృతిచెందిన బాధలోనే ప్రసాద్‌ తీవ్రంగా కుంగిపోయినట్లు పేర్కొన్నారు. అయితే ప్రసాద్‌ రెండురోజుల క్రితం ఏటీఎం నుంచి వేతనం రూ.40వేలు తీసుకోగా, శుక్రవారం అతడి వద్ద రూ.17వేలు మాత్రమే ఉన్నాయని కుమారుడు పేర్కొన్నాడు.

పక్షం రోజుల వ్యవధిలో దంపతుల మృతితో కుటుంబంలో విషాదం

అనారోగ్యంతో ఎకై ్సజ్‌ ఎస్సై మృతి
1/1

అనారోగ్యంతో ఎకై ్సజ్‌ ఎస్సై మృతి

Advertisement
 
Advertisement