No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Sat, May 4 2024 6:55 AM

No Headline

వైఎస్సార్‌సీపీలో 60 టీడీపీ కుటుంబాల చేరిక

పార్వతీపురంటౌన్‌: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలన కు ఆకర్షితులవుతున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు కుటుంబాలతో సహా వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. ఈ మేరకు పార్వతీపురం మండలంలోని అడ్డాపుశీల పంచాయతీ పరిధి బంటువానివలస గ్రామం నుంచి స్థానిక సర్పంచ్‌ రామకృష్ణ సారథ్యంలో వైఎస్సార్‌సీపీ పార్వతీపురం ఎమ్మెల్యే అభ్యర్థి అలజంగి జోగారావు సమక్షంలో అధికాన పార్టీ లో పలువురు టీడీపీ నాయకులు శుక్రవారం చేరా రు. పార్టీలో చేరిన వారిలో టీడీపీ ముఖ్య నాయకులు సింహాచలం, సూర్యనారాయణ, సీతంనాయు డు, కిరణ్‌, మధులతో పాటు వారికి చెందిన 60 కుటుంబాల వారురన్నారు. వైఎస్సార్‌సీపీలో చేరిన వారంతా జగనన్నకు మద్దతుగా నిలుస్తామని, నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలవనివ్వబోమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి జోగారా వు వారందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి అందరం కలిసికట్టుగా పని చేసి మరో 10 రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహ న్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందు కు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రామకృష్ణ, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సాలూరులో 50 కుటుంబాల చేరిక

సాలూరు: మండలంలోని మారేయ్యపాడు, బొర్రపణుకువలస గ్రామాలకు చెందిన సుమారు 50 కుటుంబాల వారు వైఎస్సార్‌సీపీలో శుక్రవారం చేరారు. వైస్‌ ఎంపీపీ రెడ్డి సురేష్‌, స్థానిక సర్పంచ్‌ బేటుకూరి రామ్మూర్తి, ఎంపీటీసీ అనూషల ఆధ్వర్యంలో ఆయా గ్రామాలకు చెందిన బేటుకూరి విక్ర మ్‌, శంకరరావు, పెంటయ్య, నగరయ్య, మల్లయ్య తదితర సుమారు 50 కుటుంబాలు టీడీపీ, సీపీఎంలను వీడి వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నాయి. సాలూరు అసెంబ్లీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పీడిక రాజన్నదొర ఆయన స్వగృహంలో వారికి పార్టీ కండువాలు వేసి వారిని సాదరంగా ఆహ్వానించారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం అందరూ సమష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా రాజన్నదొర కోరారు. కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement