ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ

Published Sat, May 4 2024 6:50 AM

ప్రశా

కలెక్టర్‌ నిషాంత్‌ కుమార్‌

పార్వతీపురం: సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిషాంత్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవా రం కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌లో ఆయనతో పాటు ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌, అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం సాధారణ పరిశీలకుడు ప్రమోద్‌ కుమార్‌ మెహర్దా, పార్లమెంట్‌ నియోజకవర్గం పోలీసు పరిశీలకుడు నయీం ముస్తఫా మన్సూరీ, శాసనసభ నియోజక వర్గాల వ్యయ పరిశీలకుడు రమాకాంత్‌ ప్రధాన్‌, పార్లమెంట్‌ నియోజకవర్గం వ్యయ పరిశీలకుడు గురుకరణ్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన ఎన్నికల ఏర్పాట్లను, తీసుకుంటున్న చర్యలను, పర్యవేక్షణను కలెక్టర్‌ నిషాంత్‌కుమా ర్‌, ఇతర అధికారులు వివరించారు.

హత్యాయత్నం

కేసులో ముగ్గురి అరెస్ట్‌

మక్కువ: మండల కేంద్రం మక్కువలోని కూరాకుల వీధిలో ఓవ్యక్తిపై హత్యాయత్నం చేసిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్‌చేసి బొబ్బిలి సబ్‌జైలుకు తరలించినట్లు ఎస్సై పి.నరసింహమూర్తి శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈనెల1వతేదీన కూరాకుల వీధికి చెందిన కోట రామకృష్ణపై, మక్కువకు చెందిన సూర్యనారా యణ, హరి, బర్రి అనే వ్యక్తులు హత్యాయత్నానికి ప్రయత్నించడంతో రామకృష్ణ గాయాలపాలయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను స్థానిక చర్చిసెంటర్‌ వద్ద శుక్రవారం అరెస్ట్‌చేశారు. విచారణ అనంతరం నిందితులను బొబ్బిలి సబ్‌జైలుకు తరలించిన ట్లు ఎస్సై చెప్పారు.

సాలూరులో ఫ్లాగ్‌మార్చ్‌

సాలూరు: ఏఎస్పీ సునీల్‌షరోన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్‌ బలగాలతో సాలూరు పట్టణంలో శుక్రవారం పోలీస్‌ సిబ్బంది ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఎన్నికల వేళ అందరు ఎన్నికల నియమావళికి అనుగుణంగా నడుచుకోవాలని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అంద రూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ, రూరల్‌ సీఐలు వాసునాయుడు, బాలకృష్ణ, ఎస్సైలు సురేష్‌, సీతారాం, రమణ, ప్రత్యేక పోలీస్‌ బృందాలు పాల్గొన్నారు.

మేజిస్ట్రేట్‌లు బాధ్యతల స్వీకరణ

సాక్షి ప్రతినిధి, విజయనగరం:జిల్లాలో ముగ్గురు మేజిస్ట్రేట్‌లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక మొబైల్‌ మేజిస్ట్రేట్‌గా పి.బుజ్జి, ఎకై ్‌స్జ్‌ మేజిస్ట్రేట్‌గా ఎం.శ్రీనివాసరావు, చీపురుపల్లి మేజిస్ట్రేట్‌గా వై.ప్రేమలత ఆ కోర్టుల ఇన్‌చార్జిగా ఇంతవరకు వ్యవహరించిన మేజిస్ట్రేట్‌లు బి.రమ్య, రత్న కుమారిల నుంచి చార్జ్‌ తీసుకున్నారు. వీరు ముగ్గురు గుంటూరు, విశాఖపట్నం, గాజువాకలో పనిచేస్తూ బదిలీపై జిల్లాకు వచ్చారు.

ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ
1/1

ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ

Advertisement
Advertisement