మరోమారు ఎల్లో కుట్రలు | Sakshi
Sakshi News home page

మరోమారు ఎల్లో కుట్రలు

Published Sat, May 4 2024 6:50 AM

మరోమా

సాక్షి, పార్వతీపురం మన్యం:

చంద్రబాబు హయాంలో ఐదేళ్ల క్రితం వరకు పింఛన్‌ మొత్తాన్ని రూ.వెయ్యి చొప్పునే అందించేవారు. అది కూడా అర్హులందరికీ కాక, కొద్దిమందికే అందేది. 2019 జనవరి వరకు ఇదే మొత్తం కొనసాగేది. అప్పట్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా టీడీపీ ప్రభుత్వం రూ.2 వేలకు పెన్షన్‌ పెంచింది. అది కూడా ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన తర్వాత. ఈ సొమ్ము కోసం కూడా పంచాయతీ కార్యాలయాల చుట్టూ గంటలు, రోజుల తరబడి లబ్ధిదారులు పడిగాపులు కాయాల్సి వచ్చేది. వేకువజామున 6 గంటల నుంచే చెట్లు, గట్ల వద్ద పాట్లు పడేవారు. మండుటెండలో నిరీక్షిస్తున్న పండుటాకుల కష్టాలను కళ్లారా చూసిన వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి..తాను అధికారంలోకి రాగానే సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి నేరుగా ఇళ్ల వద్దకే పింఛన్‌ అందించారు. దీనివల్ల వేలాది మంది వృద్ధులు, దివ్యాంగులు, మానసిక వికలాంగులకు ప్రయోజ నం కలిగింది. అంతేకాదు.. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్‌ మొత్తాన్ని ప్రతి ఏడాదీ పెంచుకుంటూ వెళ్తూ, రూ.3 వేలు చేసి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారు. ప్రతి నెలా ఒకటో తేదీనే వలంటీర్ల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇంటికే తీసుకెళ్లి పింఛన్‌ మొత్తం అందించడం గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వమూ అమలు చేయలేదు. కరోనా వంటి కష్ట సమయమైనా, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఠంఛన్‌గా పింఛన్‌ అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిదే. ఈ విధానం నాలుగున్నరేళ్లు సాఫీగా సాగింది.

అవ్వాతాతలపై విషం..

ప్రతినెలా క్రమం తప్పకుండా ఒకటో తేదీనే అవ్వాతాతలకు, అభాగ్యులకు అందించే సామాజిక పింఛన్లపై వలంటీర్లను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ రాజకీయం మొదలుపెట్టింది. దీనివల్ల జిల్లాలో వేలాదిమందికి ఇబ్బందులు ప్రారంభమయ్యా యి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. వలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తే, ఓటర్లు ప్రభావితం అవుతారంటూ ఒక దుష్ప్రచారాన్ని బయటకు తెచ్చి, ‘పచ్చ’బృందం ఎన్నికల సంఘానికి ఫిర్యా దు చేసింది. బ్యాంకుల్లోనే పింఛన్‌ మొత్తం జమ చేయాలని కోరింది. దీనిపై ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది. గత నెలలో సచివాలయాల వద్ద పంపిణీ చేసినా ఎక్కడో తప్పు జరిగిపోతోందంటూ మళ్లీ టీడీపీ అండ్‌ కో ఫిర్యాదులు చేసింది. నిత్యం ఫిర్యాదులు రావడంతో డీబీటీతో బ్యాంకుల ద్వారా పింఛన్‌ మొ త్తం ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ఆ ప్రకారమే ఈ నెల ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిపై కూడా ‘ఎల్లో’ బ్యాచ్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది.

మళ్లీ ఆ నాటి రోజులే..

చంద్రబాబు హయాంలో పింఛనుదారులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో మళ్లీ ఆ కష్టాలను రెండు నెలలుగా చవి చూస్తున్నారు. ఎండల్లో సచివాలయాలు, బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కిలోమీటర్ల దూరం నడిచి బ్యాంకులకు వస్తూ సొమ్మసిల్లిపడిపోతున్నారు. మొన్నటి వరకూ వలంటీర్లే ఇంటికి తెచ్చి, ఒకటో తేదీనే పింఛన్‌ ఇచ్చేవారని.. చంద్రబాబు చేయించిన ఫిర్యాదుల వల్ల ఈ వయసులో అవస్థలు పడుతున్నామని వృద్ధులు వాపోతున్నారు. చంద్రబాబుకు మాపై ఎందుకింత పగో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తమపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ, రూ.4 వేలు పెన్షన్‌ అందిస్తానంటే ఎవరు నమ్ముతారని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా ఆడుతాడని విమర్శిస్తున్నారు.

రాలేని పరిస్థితిలో ఉన్నవారికి

ఇంటివద్దకే..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాలేని పరిస్థితిలో

అధికార వైఎస్సార్‌సీపీపై అక్కసు. వలంటీర్లపై విషం..పండుటాకులపై కడుపుమంట. వెరసి ‘పచ్చ’ కూటమి పన్నిన పన్నాగం. వలంటీర్ల ద్వారా పింఛన్ల

పంపిణీని నిలుపు చేయించాలని ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదు ఫలితం. రెండు నెలలుగా సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న పండుటాకులు, ఇబ్బందులు పడుతున్న అభాగ్యులు. నాటి చంద్రబాబు పరిపాలన రోజులను గుర్తు చేసుకుంటున్న అవ్వాతాతలు, దివ్యాంగులు.

మరోమారు ఎల్లో కుట్రలు
1/1

మరోమారు ఎల్లో కుట్రలు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement