గ్యారంటీల అమలులో విఫలం | Sakshi
Sakshi News home page

గ్యారంటీల అమలులో విఫలం

Published Sat, May 4 2024 4:30 AM

గ్యారంటీల అమలులో విఫలం

ఇందల్వాయి: ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. ఇందల్వాయి మండలం గన్నారం, మేఘ్య నాయక్‌ తండా, నల్లవెల్లి గ్రామాల్లో ఆయన స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లో శుక్రవారం మాట్లాడారు. గ్రామాల్లో ప్రచారాని కి వచ్చిన కాంగ్రెస్‌ నాయకులను ప్రజలు నిలదీ యాలని కోరారు. గెలవగానే పసుపు బోర్డు తెస్తా నన్న ఎంపీ అర్వింద్‌ ఐదేళ్లు కాలయాపన చేసి ఇప్పు డు గెజిట్‌ పేరిట మరోసారి మోసం చేస్తున్నారని వి మర్శించారు. రాజ్యసభ సభ్యుడు సురేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌, ఎంపీపీ రమేష్‌నాయక్‌, జెడ్పీటీసీ సుమనరెడ్డి, వైస్‌ ఎంపీపీ అంజయ్య, దాస్‌, పులి శ్రీనివాస్‌, లావణ్య, సుధీర్‌ పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం

నిజామాబాద్‌నాగారం: ప్రజల మద్దతుతో బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. వారు శుక్రవారం నగరంలో ఇంటింటి ప్రచారం చేశారు. నగరంలో అత్యధిక మెజారిటీ ఇచ్చి బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. ఒక్క ఫ్రీ బస్సు తప్ప చేసిందీ ఏమీ లేదన్నారు. ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదని, కల్యాణలక్ష్మి ఇవ్వడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనలో కరెంటు రాక, నీళ్లు లేక పొలాలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే సీఎం రేవంత్‌రెడ్డి దేవుళ్ల మీద ఓట్లు వేసి అబద్దాలు చెబుతున్నారన్నారు. అర్వింద్‌ పసుపు బోర్డు పేరు చెప్పి మరోసారి ఓట్లు దండుకునే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. మేయర్‌ దండు నీతూ కిరణ్‌, సూదం రవిచందర్‌, ప్రభాకర్‌ రెడ్డి, సుజాత్‌ సింగ్‌ఠాకూర్‌, సత్య ప్రకాశ్‌, కరిపే రాజు పాల్గొన్నారు.

గన్నారంలో మాట్లాడుతున్న బాజిరెడ్డి గోవర్ధన్‌

Advertisement
Advertisement