Top Stories
ప్రధాన వార్తలు
ఈవీఎంల ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు రిమాండ్
సాక్షి, పల్నాడు: ఏపీలో ఎన్నికల సందర్బంగా ఈవీఎం ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో నలుగురు టీడీపీ నేతలకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ బుధవారం కోర్టు ఆదేశించింది.కాగా, ఏపీలో ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. తుమృకోటలోని 203, 204, 205, 206 పోలింగ్ బూత్‌ల్లోని ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు వెంకట సతీష్, కోటయ్య, సైదులు, మహేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.దీంతో, వారిని కోర్టులో హాజరుపరచగా నలుగురు టీడీపీ నేతలకు 14 రోజులు రిమాండ్ విధించింది. అలాగే, మరో 50 మంది టీడీపీ కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కొంతమంది టీడీపీ నేతలు, కార్యకర్తలు అరెస్ట్ భయంతో పరారయ్యారు.
టీడీపీ సైలెన్స్.. దేనికి సంకేతం?
ఎన్టీఆర్, సాక్షి: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడ?. విదేశీ పర్యటన పేరుతో ఆయన ఎక్కడికి వెళ్లారసలు?. ఎన్నికల ఫలితాల వేళ ఉన్నపళంగా ఎక్కడికి వెళ్లారు?. ఏపీ రాజకీయ వర్గాల్లో.. ఆఖరికి టీడీపీ శ్రేణుల్లోనూ దీనిపైనే చర్చ నడుస్తోంది.నారా చంద్రబాబు నాయుడు.. విదేశీ యాత్రకు విశ్రాంతి కోసం వెళ్లారు!. కాదు కాదు.. 74 ఏళ్ల చంద్రబాబు వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లారు. ఎన్నికల ఫలితాల ముందర కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకే ఆయన విదేశాలకు వెళ్లారు. ఇలా.. ఎవరికి తోచిన ప్రకటనలు వాళ్లు చేస్తున్నారే తప్ప ఆయన ఎక్కడికి వెళ్లారు అనేదానిపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఆఖరికి ఆయన పార్టీ కూడా!. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత విదేశీ పర్యటన కోసం హైదరాబాద్ నుంచి తొలుత దుబాయ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు అనేదానిపై గోప్యతను ప్రదర్శిస్తోంది తెలుగు దేశం పార్టీ. ఇక.. చంద్రబాబు ఏం చేసినా బాకా ఊదే ఎల్లో పత్రికలు సైతం ఆయన ఫారిన్ టూర్‌పై వేర్వేరు కథనాలు ఇవ్వడం గమనార్హం. చంద్రబాబు పర్యటనకు వెళ్లే ముందే ఆయన తనయుడు నారా లోకేష్ విదేశాలకు వెళ్లారు. ఆయన కూడా ఎక్కడికి వెళ్లారనేదానిపై స్పష్టత కొరవడింది. ఇక చంద్రబాబు విశ్రాంతి కోసం అమెరికా వెళ్తున్నారంటూ లీకులు ఇచ్చాయి టీడీపీ శ్రేణులు. అయితే.. చంద్రబాబు అసలు అమెరికాకే రాలేదంటూ టీడీపీ ఎన్నారై నేత కోమటి జయరాం ప్రకటన చేయడంతో ఒక్కసారిగా గాలి తీసేసినట్లయ్యింది.చెప్పాల్సిన అవసరం ఉందిఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష ప్రధాన నేతలుగా బాధ్యతాయుతమైన పదవుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి,నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. వాళ్లిద్దరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పార్టీలు ప్రకటనలు చేస్తుంటాయి. అలాగే ఏ పర్యటనలకు వెళ్లినా.. అధికారికంగా వెల్లడించాల్సిన అవసరం ఆ పార్టీల బాధ్యత కూడా. అందుకే వైఎస్సార్సీపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా లండన్ పర్యటనకు వెళ్లగానే.. అక్కడ ల్యాండ్ అయిన దృశ్యాలను మీడియా, సోషల్ మీడియా మాధ్యమంగా విడుదల చేసింది. మరి ఇదే పని చంద్రబాబు విషయంలో టీడీపీ ఎందుకు చేయలేకపోతోంది. సాధారణంగానే చంద్రబాబు విదేశీ పర్యటనను ఏదో రాష్ట్రానికి ఉద్దరించే పనిగా చూపించే ఎల్లో మీడియా.. ఈసారి ఆ బిల్డప్‌లను ఎందుకు ఇవ్వలేకపోతోంది. ఈ లెక్కన.. చంద్రబాబు విదేశీ పర్యటనపై వైఎస్సార్సీపీ ఆరా తీయడంలో.. సారీ నిలదీయడంలో తప్పేముంది?.
అర్థరాత్రి యార్లగడ్డ అనుచరుల వీరంగం, యువకులపై..
ఎన్టీఆర్, సాక్షి: రాష్ట్రంలో ఎన్నికల ఓటమిని ముందుగానే పసిగట్టి అల్లర్లు, హింసాత్మక ఘటనలకు ప్రతిపక్ష టీడీపీ ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పచ్చ మూక బరి తెగిస్తోంది. వైఎస్సార్సీపీకి సానుభూతిపరుల్ని వెతుక్కుంటూ వెళ్లి మరీ దాడులకు తెగబడుతోంది. ఈ క్రమంలోనే గన్నవరంలో యువకులపై దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది యార్లగడ్డ వెంకట్రావు అనుచరులుగా తేలింది.గన్నవరం మండలం మర్లపాలెం శివారులో ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు యువకులపై దాడి కలకలం రేపింది. రాత్రిపూట అపార్ట్మెంట్ తలుపుల్ని బద్ధలు కొట్టుకుని వెళ్లి మరీ యువకులను చితకబాదారు. ఆపై బలవంతంగా తమ కారులో ఎక్కించుకెళ్లి వాళ్లను చిత్రహింసలకు గురి చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు బయటకు వచ్చాయి.ఇద్దరు యువకులపై దాడి చేసింది గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అనుచరులుగా పోలీసులు గుర్తించారు. టీడీపీ నేతలు ఫణి రెడ్డి, పౌలూరి వంశీకృష్ణ, కంభంపాటి దేవేంద్ర, కంభంపాటి బాలనరేష్, దేవినేని హర్షచౌదరి, శొంఠి సురేష్, కన్నా కార్తిక్, బాబీ, కంఠమనేని అరుణకు మార్, మరి కొంత మంది ఉన్నట్టు గుర్తించారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రేవంత్ హామీ నెరవేర్చినట్లా? యూటర్న్‌తో మోసం చేసినట్లా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం అయిన మంత్రివర్గం సన్నవడ్లు పండించే రైతులకు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనితో కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన మరో హామీని నెరవేర్చినట్లేనా! ఒక రకంగా చూస్తే వాగ్దానం అమలు చేసినట్లే అవుతుంది. ఇంకో రకంగా చూస్తే రైతులను మోసం చేసినట్లు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీల గురించి ప్రస్తావించినప్పుడు అందులో ఉన్న పాయింట్ ఏమిటంటే వరి ధాన్యం పండించే రైతులకు ఏడాదికి 500 రూపాయల బోనస్ ఇస్తామని తెలిపారు. ఇప్పుడు అలాగే చేశారు కదా అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ తన గ్యారంటీలను అమలు చేయడంలో ముందుకు వెళ్లినట్లే కదా అని భావించవచ్చు. ఇక్కడే కిటుకు ఉంది. మంత్రివర్గం ఈ హామీ అమలులో ఒక షరతుపెట్టింది. సన్నరకం వడ్లు పండించే రైతులకే ఈ బోనస్ ఇస్తామని తెలిపింది. గ్యారంటీలలో ఇలాంటి షరతు పెట్టలేదు కదా అని ఎవరైనా అడగవచ్చు. అలా అని అన్ని రకాల వడ్లకు ముఖ్యంగా దొడ్డు రకం వడ్లకు బోనస్ ఇస్తామని ప్రత్యేకంగా చెప్పలేదు కదా అని వాదించవచ్చు. కాంగ్రెస్ నేతలు తమ ప్రసంగాలలో రైతు పండించే పంట ప్రతి గింజను కొనుగోలు చేసి బోనస్ కూడా ఇస్తామని చెప్పేవారు. అందువల్ల ఈ షరతు పెడతారని ఎవరూ అనుకోరు. ఇలా కండిషన్ పెట్టడం రైతులను మోసం చేసినట్లే కదా అని ఎవరైనా విమర్శిస్తే కూడా అంగీకరించవలసిందే. దీనికి కారణం ఏమిటంటే తెలంగాణలో పండించే వడ్లలో సన్నరకం వాటా కేవలం ముప్పై శాతమేనని ఒక అంచనా. మిగిలినదంతా దొడ్డు రకం వడ్లేనని చెబుతున్నారు. అప్పుడు మిగతా రైతులకు బోనస్ దక్కదు. దీనిపై రైతు వర్గాలలో వ్యతిరేకత వస్తుంది. మార్కెట్ లో సన్నరకం ధాన్యానికి మంచి గిరాకి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కన్నా ఐదు వందల నుంచి ఏడువందల రూపాయలు అధికంగా మార్కెట్ లో లబిస్తుంది. అందువల్ల మార్కెట్ లో విక్రయించుకునే సన్నవడ్ల రైతులకు బోనస్ ఇవ్వవలసిన అవసరం ఉండదు. ఒక లెక్క ప్రకారం ఏడాదికి రెండు సీజన్ లలో కలిపి కోటిన్నర టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది.మొత్తం ధాన్యానికి బోనస్ ఇవ్వవలసి వస్తే ప్రభుత్వానికి సుమారు ఆరువేల కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతుంది. సన్నరకం వడ్లకు బోనస్ ఇస్తే ప్రభుత్వంపై రెండువేల కోట్ల భారం పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నా,వాస్తవానికి అంత కూడా ఉండదన్నది విపక్షాల అభిప్రాయం. ఇది రైతులను మోసం చేయడమేనని వారు అంటున్నారు. సన్నవడ్లలో కూడా ఏ రకానికి బోనస్ ఇచ్చేది తర్వాత అధికారులు ప్రకటిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరులకు చెప్పారు. అంటే ఇందులో కూడా లిటిగేషన్ ఉందన్న మాట. రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చేటప్పుడు బాధ్యతగా ఉండడం లేదని, ఏదో రకంగా మభ్య పెట్టి ఓట్లుపొందడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. సన్నరకం వడ్లను ప్రోత్సహించడానికి తొలుత ఆ వడ్లకు బోనస్ ఇస్తున్నామని, తదుపరి దొడ్డురకం వడ్లకు కూడా ఇస్తామమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కె చెప్పారు. ఆయన తెలివిగానే ఈ ప్రకటన చేసినా, ఆ మేరకు క్యాబినెట్ లో తీర్మానం చేయలేదు కదా అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. తెలంగాణలోకాని, కర్నాటకలోని గ్యారంటీల పేరుతో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు సతమతమవుతున్నాయి.ఒకటి,రెండు అంశాలను అమలు చేసి గ్యారంటీలను చెప్పినట్లే చేస్తున్నాం కదా అని డబాయిస్తున్నారు. రైతులకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సహజంగానే వ్యతిరేకత తెస్తుంది. నిజానికి రైతులు ఎవరూ తమ ఉత్పత్తులకు బోనస్ ఇవ్వాలని అడగలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను గద్దె దించడానికి ఇలాంటి పలు వాగ్దానాలు చేసింది. వాటిలో రైతు భరోసా కింద పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని, కౌలు రైతులకు కూడా వర్తింప చేస్తామని, రైతు కూలీలకు పన్నెండువేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. రైతు భరోసాను గత ప్రభుత్వం అమలు చేసిన పదివేలు చొప్పునే చేయగలిగారు. దానికి కొంత టైమ్ తీసుకున్నా మొత్తం మీద ఆ మేర అయినా చేశారు. ఇది ప్రామిస్ ను నెరవేర్చినట్లేనా అంటే మళ్లీ అదే రకంగా రెండు రకాల వాదనలు వస్తాయి.రైతుల రుణాలు రెండు లక్షల వరకు మాఫీ చేస్తామన్న మరో హామీ కూడా ఉంది. ఎన్నికల ప్రచారం సమయంలో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి రైతులు ఎవరైనా బ్యాంకులలో అప్పులు చేయకపోతే వెళ్లి తీసుకోవాలని కూడా సూచించారు. ఇప్పుడు అది శక్తికి మించిన పని కావడంతో కిందా మీద పడాల్సి వస్తోంది. దాంతో పలు వాయిదాలు వేస్తున్నారు. ఆగస్టు పదిహేను లోగా రుణమాఫీ చేస్తామని రేవంత్ అంటున్నారు. ఇందుకోసం సుమారు నలభై వేల కోట్ల రూపాయలు అవసరమని ఒక అంచనా కాగా,పాతికవేల కోట్లు సరిపోవచ్చని కొందరి అంచనా. ఇప్పుడు బోనస్ లో ఎలా మెలిక పెట్టారో, రుణమాఫీలో కూడా కొన్ని షరతులు పెట్టి భారం తగ్గించుకునే ప్రయత్నం జరగవచ్చు. ప్రభుత్వం అన్నాక కొన్ని నిబంధనలు పాటించక తప్పదు. వాటిని దృష్టిలో ఉంచుకునే రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేయాలి. ఎన్నికల సమయంలో నేతలు ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చేస్తున్నారు.కొండకు వెంట్రుక కట్టినట్లు వ్యవహరించి అధికారం సాధించిన తర్వాత మాత్రం గుడ్లు తేలేయవలసి వస్తోంది. గతంలో కెసిఆర్ ప్రభుత్వం చిన్న,పెద్ద,ధనిక రైతులందరికి రైతు బంధు అమలు చేసింది.ఆ రోజుల్లో పలు విమర్శలు కూడా వచ్చాయి. పంటలు పండని భూములకు కూడా రైతు బంధు ఇచ్చారని అనేవారు. కొందరు బెంజ్ కార్లలో వెళ్లి రైతు బంధు డబ్బు తీసుకున్నారు. కౌలు రైతులకు ఆ స్కీమ్ అమలు చేయలేమని అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టంగానే చెప్పారు.కాంగ్రెస్ వారు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని అన్నారు.కాని ఆ దిశగా ముందుకు వెళ్లలేదు.ఇక రుణమాఫీ అమలు ఎలా చేస్తారా అన్నది ఆసక్తికరంగా ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చేయగలుగుతామని రేవంత్ తదితరులు ఆయా సందర్భాలలో చెప్పారు. కాంగ్రెస్ కేంద్రంలో అదికారంలోకి రాలేకపోతే ఏమి చేయాలన్న ప్రశ్న వస్తుంది. రిజర్వు బ్యాంక్ ను అప్రోచ్ అయి బ్యాంకుల ద్వారా రుణాలు పొందాలని ఆలోచిస్తున్నారు. ఎక్సైజ్,రిజిస్ట్రేషన్ వంటి శాఖల ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణం తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు గతంలో కొన్ని ప్రభుత్వాలు చేయకపోలేదు. రిజర్వుబ్యాంక్ అందుకు అంత సుముఖత చూపలేదు. ఉదాహరణకు ఎపిలో 2014లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రైతులకు లక్షన్నర రూపాయల వరకు రుణమాఫీ చేయాలని తలపెట్టి ,రైతుసాధికార సంస్థను నెలకొల్పినా, ఆచరణలో హామీని నిలబెట్టుకోలేకపోయింది. 89 వేల కోట్ల రూపాయల రుణాల మాఫీ చేస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు అంతా కలిపి పదిహేను వేల కోట్లు చేసి చేతులెత్తేశారు. అందులో కూడా రైతులు నానా పాట్లు పడవలసి వచ్చింది.ఎన్నో షరతులు పెట్టేసరికి వారికి విసుగు వచ్చింది.తత్పలితంగా రైతులంతా టిడిపి ప్రభుత్వం తమను మోసం చేసిందని భావించి 2019 ఎన్నికలలో ఓడించారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తపడే యత్నం చేస్తోంది. అయినా తొలి అడుగులోనే తడబడాల్సి వస్తోంది.ప్రభుత్వం వద్ద ఆర్దిక వనరులు పుష్కలంగా ఉంటే దేనినైనా చేయవచ్చు. అలా నిధులు లేవని తెలిసినా, శక్తికి మించిన పని అని తెలిసినా, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చేసి ఇప్పుడు దిక్కులు చూడవలసి వస్తోంది. కాంగ్రెస్ మాత్రమే ఇలా చేస్తోందని కాదు.ఆయా రాష్ట్రాలలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఇలాగే చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఒడిషా లో బీజేపీ ప్రతి మహిళకు ఏభైవేల రూపాయల చొప్పున ఓచర్ ఇస్తామని వాగ్దానం చేసిందట. ఉచితాలకు వ్యతిరేకం అని చెప్పే బారతీయ జనతా పార్టీ నేతలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోతీరున ఉంటున్నారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలలో మరికొన్ని ముఖ్యమైన హామీలను అమలు చేయలేని నిస్సహాయ స్తితి ఉంది.వృద్దులకు ఇచ్చేపెన్షన్ ను నాలుగువేల రూపాయలు చేస్తామని ప్రకటించినా, ఆచరణ ఆరంభం కాలేదు. నిరుద్యోగ బృతి పరిస్థితి అంతే. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి అసలు నిరుద్యోగ భృతి ఎక్కడ ఇస్తామని అనడంపై విపక్షాలు మండిపడ్డాయి. మహాలక్ష్మి కింద ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. అది ఎప్పటికి అమలు అవుతుందో చెప్పలేరు. దానికి కూడా ఏవేవో కండిషన్లు పెట్టి అయిపోయిందని చెబుతారో ఏమో చూడాలి.500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్కీము అమలు చేశామని చెప్పారు కాని అది ఎంతమందికి వస్తుందో తెలియదు. మహిళలకు ఉచిత బస్ హామీని మాత్రం పూర్తిగానే అమలు చేస్తున్నట్లు లెక్క.ఆలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచారు. వీటివల్ల ప్రభుత్వంపై తక్షణ భారం ఉండదు.అయినా ఆర్టిసి భవిష్యత్తులో ఇబ్బంది పడవలసి ఉంటుంది. మరో వైపు ప్రభుత్వం ఇప్పటికే సుమారు పదహారువేల కోట్ల అప్పు చేసిందని బీజేపీ వ్యాఖ్యానిస్తోంది. ఫీజ్ రీయింబర్స్ మెంట్ కింద 6500 కోట్ల బకాయిలు ఉన్నాయని కాలేజీలవారు, ఆరోగ్యశ్రీ కింద 1200 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయని ఆస్పత్రులవారు చెబుతున్నారు.ఈ నేపధ్యంలో రేవంత్ ప్రభుత్వానికి ఈ గ్యారంటీలు,వాటితో నిమిత్తం లేకుండా ఆయా డిక్లరేషన్ లలో చేసిన ఇతర హామీలు పెద్ద గుది బండలే అవుతాయని చెప్పకతప్పదు.ఒకరకంగా ఇది రేవంత్ ప్రభుత్వానికి సవాలు వంటిది. కొసమెరుపుగా ఒకటి చెప్పుకోవాలి. ఏపీ లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోసే ఈనాడు,తదితర ఎల్లో మీడియా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి భజన చేసింది. సన్నవడ్లకు బోనస్ వల్ల రెండువేల కోట్ల భారం అని ఈనాడు రాసిందే తప్ప, కాంగ్రెస్ వాగ్దాన భంగం చేసిందని మాత్రం రాయకుండా జాగ్రత్తపడింది. చూశారుగా..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఈనాడు మీడియా ఎలా జాకీలు పెడుతోందో..బాకాలు ఊదుతోందో!. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయలు
May 22nd: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 22nd AP Elections 2024 News Political Updates..12:00 PM, May 22nd, 2024ఓటమి దిశగా పవన్..!జడ్పీ చైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యేగా కాకినాడ జిల్లాను అభివృద్ధి చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీత.ఎప్పుడూ ప్రజల మధ్యే వంగా గీత. అందుబాటులో ఉండని పవన్. రాజకీయాల్లో, ప్రజాదరణలో వంగా గీతకు ఏమాత్రం సరితూగని పవన్. వంగా గీతకే పట్టం కట్టిన పిఠాపురం ప్రజలు. 11:30 AM, May 22nd, 2024ఓటమి అంచున్న పురంధేశ్వరి! ఎన్నికల్లో ఓటమి అంచున నిలుచున్న ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. రాజమండ్రి గురించి ఏ మాత్రం తెలియకుండానే అక్కడి నుంచి పోటీ. ఇక, సీటు ఆశించి భంగపడిన సోము వీర్రాజుతో పురంధేశ్వరికి కుదరని సయోధ్య. 11:00 AM, May 22nd, 2024బాబు, పవన్ హైదరాబాద్‌కే పరిమితం..పవన్ కేవలం సినిమాలకే పరిమితమంటున్న సామాన్యులు. చంద్రబాబు, దత్తపుత్రుడు హైదరాబాద్‌కే పరిమితమంటున్న సామాన్య ప్రజలు. జూన్ 4న వైయస్ఆర్సీపీ జెండా సగర్వంగా ఎగురుతుంది.. చంద్రబాబు, దత్తపుత్రుడు హైదరాబాద్‌కే పరిమితం అవ్వడం ఖాయం.#YSRCPWinningBig#TDPJSPBJPCollapse#TDPLosing pic.twitter.com/RwItBFPTqb— YSR Congress Party (@YSRCParty) May 22, 2024 10:30 AM, May 22nd, 2024గన్నవరంలో పచ్చ బ్యాచ్ హల్‌చల్‌కృష్ణా జిల్లా..గన్నవరంలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌ఇద్దరు యువకులపై దాడి చేసిన టీడీపీ సానుభూతిపరులుఐదుగురు టీడీపీ వ్యక్తులున్నట్టు సమాచారంపచ్చ బ్యాచ్ దాడిలో యువకులకు తీవ్రగాయాలు బాధితుల ఫిర్యాదు విచారణ చేపట్టిన పోలీసులు. 8:30 AM, May 22nd, 2024ఎన్నికల కౌంటింగ్‌పై పోలీసుల ఫోకస్.. విజయవాడసార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై పోలీసులు ప్రత్యేక దృష్టిపోలింగ్ అనంతరం జరిగిన పరిమాల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుకౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల రక్షణ వలయం సిద్ధం చేస్తున్న పోలీసులుకలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు, మ్యాన్‌పవర్ మేనేజ్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్, నోడల్ అధికారులు, ఎన్ఐసీ, ఎన్కోర్ టీమ్ అధికారులతో సమావేశాలుకౌంటింగ్ విధులకు హాజరయ్యే ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు, కౌన్సెలింగ్ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పగడ్బందీగా బారికేడింగ్ పనులుకౌంటింగ్ రోజున ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలుఏపీ పోలీసులతో పాటు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్న సిఆర్పిఎఫ్, పారా మిలటరీ బలగాలు 7:20 AM, May 22nd, 2024గొడవలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం: ఎమ్మెల్యే పిన్నెల్లిపల్నాడులో టీడీపీ గెలిచే పరిస్థితి లేదు. అందుకే అందర్నీ తప్పుదోవ పట్టించేలా టీడీపీ నేతలు గొడవలు చేశారు. పోలింగ్ రోజు నుంచి జరిగిన గొడవలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు నేను సిద్ధంఅనవసరంగా అసత్య ప్రచారం చేస్తున్నారు. పల్నాడులో వాళ్లు గెలిచే పరిస్థితి లేకపోవడంతో అందర్నీ తప్పుదోవ పట్టించేలా టీడీపీ వాళ్లు గొడవలు చేశారు. పోలింగ్ రోజు నుంచి జరిగిన గొడవలపై సిట్టింగ్ జడ్జితో విచారణకి నేను సిద్ధం.-ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి#YSRCPWinningBig#TDPLosing pic.twitter.com/cgi2SMXSmR— YSR Congress Party (@YSRCParty) May 21, 2024 7:00 AM, May 22nd, 2024ఓట్ల లెక్కింపు రోజు విధ్వంసానికి పచ్చ ముఠాల ప్లాన్‌పోలింగ్ రోజు హింసకు మించి భయోత్పాతం సృష్టించే పన్నాగంకుట్రలపై పోలీసు శాఖను అప్రమత్తం చేసిన నిఘావర్గాలురాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలుఆ 3 జిల్లాలపై ప్రత్యేకంగా కన్నుగూండాలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు.. అంతా టీడీపీ మూకలేస్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతరెడ్‌జోన్ల ఏర్పాటు.. నిషేధాజ్ఞలు విధింపు.. డ్రోన్ కెమెరాల వినియోగం నిషిద్ధం 6:55 AM, May 22nd, 2024సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధంజూలకంటి బ్రహ్మారెడ్డిది నీచ సంస్కృతిటీడీపీ అనుకూల గ్రామాల్లో మా ఏజెంట్లపై దాడిఆ గ్రామాల్లోనే అలజడి సృష్టించారుపారిపోయి నియోజకవర్గానికి దూరంగా ఉండేది బ్రహ్మారెడ్డినేను ఎక్కడికి పారిపోలేదు... ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనే పోలీసుల సూచన మేరకు హైదరాబాద్ వచ్చా ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 6:45 AM, May 22nd, 2024పవన్ ఎక్కడ?పవన్ పర్యటనపైనా రాజకీయ వర్గాల్లో చర్చ14న ప్రధాని మోదీ నామినేషన్‌కు పవన్ హాజరుఅక్కడి నుంచి హైదరాబాద్ రాకఆ తర్వాత ఎవరికీ అందుబాటులో లేని పవన్‌రష్యా లేదా దుబాయ్ వెళ్లి ఉంటారంటున్న పార్టీ వర్గాలు 6:40 AM, May 22nd, 2024సోమిరెడ్డికి, టీడీపీ వాళ్లకు సవాల్ చేస్తున్నా: మంత్రి కాకాణిబ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను రెడీ.. సోమిరెడ్డి సిద్ధంగా ఉన్నారా ?నెల్లూరు లో ఎక్కడికి రావాలో చెప్తే అక్కడికి వస్తాఎవరికి రేవ్ పార్టీకి వెళ్లే అలవాటు ఉందో తెలుస్తుందిఆధారాలు ఉంటే సోమిరెడ్డి పోలీసులకు ఇవ్వాలిబెంగళూరు రేవ్ పార్టీపైసీబీఐ దర్యాప్తుకు నేను సిద్ధంగా ఉన్నాబ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి వస్తావా.. ? పాస్ పోర్ట్ చూపించడానికి వస్తావా ?రేవ్ పార్టీలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఉన్నారని సోషల్ మీడియాలో వస్తుంది..బెంగళూరు పోలీసులు ఎటువంటి కాల్ చేయలేదురేవ్ పార్టీ జరిగిన ఫార్మ్ హౌస్ గోపాల్ రెడ్డి ఎవరో నాకు తెలియదుపాసు పోర్ట్ నా దగ్గరే ఉందికుట్ర కోణం పై విచారణ చేయాలని పోలీసులను కోరానురోస్ ల్యాండ్ లాడ్జిలో చంద్రమోహన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికారుసోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లోఫర్బెంగళూరు రేవ్ పార్టీ విషయంలో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారునాకు సంబంధాలు ఉన్నా.. నాకు సంబధించిన వారు ఎవరు ఉన్నా చర్యలు తీసుకోవాలిఎవడో అనామకుడు నా స్టిక్కర్‌ను జిరాక్స్ తీసి వాడుకున్నారురేవ్ పార్టీలు, రేప్ పార్టీలు చేసే చరిత్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిదిసోమిరెడ్డి లేడీ డాక్టర్ ను ఇబ్బంది పెట్టిన కథనాలు గతంలో పత్రికల్లో వచ్చాయినాపై మూడోసారి కూడా సోమిరెడ్డి ఓడిపోతున్నారు.. ఆ ప్రెస్టేషన్ లో ఏదో మాట్లాడుతున్నారుయూత్ మినిస్టర్ గా ఉండి.. క్రికెట్ కిట్స్ అమ్ముకున్న చరిత్ర సోమిరెడ్డిదినా పాస్ పోర్ట్ నెల్లూరు లో ఉందికారు స్టిక్కర్ జిరాక్స్ చేసి నాపై కుట్ర చేసినట్లు అనుమానాలు ఉన్నాయి.. కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశా 6:30 AM, May 22nd, 2024ఎల్లో మీడియాకు చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికెళ్లారు?: మంత్రి జోగి రమేష్‌దోచినడబ్బంతా దుబాయ్‌లో దాచడానికి వెళ్లారా?చంద్రబాబు కనిపించకుండా పోతే టీడీపీ అడ్రస్ గల్లంతుటీడీపీ నాయకులు నోటికి తాళాలు పడ్డాయి.కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారుఎస్పీలను, కలెక్టర్లను మార్చిన చోటే గొడవలు జరిగాయిచంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా.. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయంచంద్రబాబు వ్యవస్థలను భ్రష్టు పట్టించారువైఎస్సార్‌సీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలిపల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే.
ఉమా మహేశ్వర ‘అక్రమ’రూపస్య
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో (సీసీఎస్) ఏసీపీగా పని చేస్తున్న టీఎస్ ఉమామహేశ్వరరావును ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. న్యాయం కోసం వెళ్లిన వారిని ఆయన తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్టు అధికారులు గుర్తించారు.ఇక, ఏసీపీ ఉమా మహేశ్వరరావు వ్యవహారశైలిపై కూడా గతంలోనే ఫిర్యాదులు వచ్చాయి. అతనిపై ఇప్పటికే మూడుసార్లు సస్పెన్షన్ వేటుగా పడింది. అయినా కూడా ఆయన తన తీరు మార్చుకోలేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి లక్షల రూపాయలను కాజేశారు.సీసీఎస్‌లో బాధితులకు న్యాయం చేయాల్సిన హోదాలో ఉంటూ వారితోనే బేరసారాలాడారు. కాగా, ఓ ఎన్నారై ఫిర్యాదు చేయడానికి రావడంతో అతడిని సైతం బెదిరించి డబ్బులు దండుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక, తోటి సిబ్బందిని బూతులు తిడుతూ, అవహేళన, వారిపై అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు చాలానే పోలీసులు చెబుతున్నారు. తన దగ్గరికి వచ్చిన ప్రతీ కేసులోనూ ఉమా మహేశ్వర రావు చేతివాటం చూపించినట్టు సమాచారం. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆయన, ఆయన బంధువుల నివాసాలపై మంగళవారం దాడులు చేశారు. తెలంగాణ, ఏపీలోని ఉమామహేశ్వరావు ఇళ్లు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లతో సహా మొత్తం 11 చోట్ల సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో నగదు, బంగారం, ఆస్తి పత్రాలతో పాటు రెండు బ్యాంకు లాకర్లను గుర్తించినట్లు తెలిసింది.అక్రమ ఆస్తుల కూడబెట్టుకుని నగర శివారులో విలాసవంతమైన విల్లాలు కొనుగోలు చేశారు. శామీర్‌పేటలో విల్లా, ఘట్కేసర్లో ఐడు ప్లాట్స్ కొనుగోలు చేశారు. అంతేకాకుండా తన ఇంట్లో నగదు ఉంచకుండా.. తన అత్తామామల ఇంట్లోనే డబ్బును దాచిపెట్టారు. లావాదేవీల మొత్తం సమాచారాన్ని ఆయన ట్యాబ్‌లో స్టోర్ చేసుకున్నారు. ఇక, ఉమా మహేశ్వరరావు ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 50కోట్లకు వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో 17చోట్ల ఆస్తులను గుర్తించారు. సోదాల్లో భాగంగా ఇప్పటి వరకు రూ.38లక్షల నగదు, 60 తులాల బంగారం సీజ్. కాగా, కాసేపట్లో ఉమా మహేశ్వర్‌ను అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు.
Kalki 2898: 12 సెకన్లు.. రూ.3 కోట్లు, రాజమౌళిని ఫాలో అవుతున్న ‘కల్కి’టీమ్!
సినిమాను తీయడం ఒకెత్తు అయితే.. ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. అందుకే ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రేక్షకులను రీచ్ అయ్యేందుకు అదెంచ్చె ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరు. ఇక సినిమా ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి తర్వాతే మరెవరు అయినా. ఆయన సినిమాను తెరకెక్కించేందుకు ఎలా కష్టపడతాడు.. అంతే స్థాయిలో సినిమా ప్రమోషన్స్‌కి కష్టపడతాడు. ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ఆయన చేసిన ప్రమోషన్స్ బాగా కలిసొచ్చింది. ఇద్దరు హీరోలతో దేశం మొత్తం తిరిగి సినిమాను అన్ని భాషల వారికి దగ్గరయ్యేలా చేశాడు. కేవలం ప్రమోషన్స్ కోసమే దాదాపు రూ.20 కోట్ల ఖర్చు చేసినట్లు తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి స్ట్రాటజీనే ఫాలో అవుతుంది ‘కల్కి’ టీమ్. (చదవండి: రెండు ఓటీటీల్లో 'కల్కి'.. ఏకంగా అన్ని కోట్లకు అమ్మేశారా?)సినిమా ప్రమోషన్స్‌కి భారీగా ఖర్చు చేయబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని కోసం దాదాపు రూ. 50 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. రీసెంట్గా ఐపీఎల్లో కూడా ‘కల్కి 2898 ఏడీ’ యాడ్‌ని రన్ చేశారు. ప్రభాస్ కల్కి అవతార్‌లో కనిపించి సినిమాను ప్రమోట్ చేశాడు. ఇది కేవలం 12 సెకన్ల యాడ్ మాత్రమే. దీని కోసం మేకర్స్ రూ. 3 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కల్కి సినిమా ప్రమోషన్స్‌కి ఖర్చు చేసే డబ్బుతో టాలీవుడ్లో ఓ బడా సినిమానే తీయొచ్చు. (చదవండి: స్టార్ హీరో కొడుకు సెకండ్ హ్యాండ్ బట్టలు వాడుతాడు)నేడు(మే 22)రామోజీఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నాడు మేకర్స్. ఈ ఈవెంట్లో బుజ్జిని పరిచయం చేయనున్నారు. ప్రభాస్‌తో పాటు చిత్రబృందం అంతా ఈ ఈవెంట్‌కి హాజరవుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉండడంతో..అందుకు తగ్గట్లే భారీ ఏర్పాట్లు చేశారట. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ఇతర కీలక పాత్రలు పోషించారు. జూన్ 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
RR vs RCB: వార్ వన్‌సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం
ఐపీఎల్-2024 ఆఖరి అంకానికి చేరుకుంటోంది. ఇప్పటికే ఒక ఫైనలిస్టు ఖరారు కాగా.. తుది పోరుకు అర్హత సాధించేందుకు మిగిలిన మూడు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్ క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రైజర్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకువెళ్లింది కేకేఆర్.ఇక ఫైనల్ రేసులో మిగిలినవి రెండే మ్యాచ్‌లు. ఎలిమినేటర్, క్వాలిఫయర్-2. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది.సన్‌రైజర్స్‌తో ఎలిమినేటర్ విజేత పోటీఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. క్వాలిఫయర్-1లో కేకేఆర్ చేతిలో ఓడిన సన్‌రైజర్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. ఆ మ్యాచ్‌లో గనుక గెలిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది.ఈ క్రమంలో బెంగళూరు- రాజస్తాన్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ సునిల్ గావస్కర్ ఎలిమినేటర్ విజేత ఎవరన్న అంశంపై తన అంచనా తెలియజేశాడు.‘‘ఆర్సీబీ ఈసారి ఎంతటి అద్భుతం చేసిందో చూశాం. ముఖ్యంగా వరుస పరాజయాల తర్వాత వాళ్లు తిరిగి పుంజుకున్న తీరు అమోఘం. మామూలు జట్లకు ఇలాంటివి సాధ్యం కావు.అయ్యో.. మనం ఓడిపోతూనే ఉన్నాంఆర్సీబీ ప్రధాన ఆటగాళ్లలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లితో పాటు మిగతా సీనియర్ ప్లేయర్లు తమ ఆట తీరుతో.. జట్టులో ఉత్సాహం నింపారు. ఆర్సీబీ స్థానంలో మరే ఇతర జట్టు ఏదైనా ఉంటే.. ‘అయ్యో.. మనం ఓడిపోతూనే ఉన్నాం. అంతా ముగిసిపోయింది’ అని బెంబేలెత్తిపోయేవాళ్లు.కానీ డుప్లెసిస్, కోహ్లి ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వలేదు. ఇక రాజస్తాన్.. గత నాలుగు- ఐదు మ్యాచ్‌లలో ఓడిపోతూనే ఉంది. ఆఖరిగా ఆడిన మ్యాచ్‌లోనూ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.వాళ్లను చూస్తే పూర్తిగా ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తున్నారు. పదకొండు రోజుల పాటు ఆటకు దూరంగా ఉన్న కేకేఆర్ మాదిరి ఏదైనా ప్రత్యేకంగా చేస్తే తప్ప రాజస్తాన్‌కు గెలిచే అవకాశాలు ఉండవు.లేదంటే మ్యాచ్ ఏకపక్షంగా సాగిపోయే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ రాజస్తాన్‌ను చిత్తు చేసినా చేస్తుంది. ఒకవేళ అలా జరగకపోతేనే ఆశ్చర్యం’’ అని సునిల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశాడు.గావస్కర్ వర్సెస్ కోహ్లికాగా ఇటీవల గావస్కర్- కోహ్లి మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. కోహ్లి స్ట్రైక్‌రేటు గురించి గావస్కర్ విమర్శించగా.. రన్‌మెషీన్ అందుకు కాస్త ఘాటుగానే బదులిచ్చాడు. ఎలా ఆడాలో తనకు తెలుసునని.. జట్టు ప్రయోజనాల కోసం ఏం చేయాలో కూడా తెలుసంటూ కౌంటర్ వేశాడు.
నేను ఎక్కడికి పారిపోలేదు.. సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం
సాక్షి, పల్నాడు: ‘టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిది నీచ సంస్కృతి. ఫ్యాక్షనిజమే అతని జీవితం..’ అని వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలో జరిగిన గొడవలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమని పిన్నెల్లి ప్రకటించారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆజ్యం పోసి.. ఆయన మాత్రం నియోజకవర్గానికి దూరంగా ఉంటూ ప్రజలను పట్టించుకోవడం లేదు. అటువంటి వ్యక్తి నేను పారిపోయానని చెప్పటం హాస్యాస్పదంగా ఉంది. ఏడు మర్డర్ కేసుల్లో ఏ–1గా ఉన్న బ్రహ్మారెడ్డి నాపై చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మడం లేదు. నాపై పోటీ చేసి ఓడిపోయిన బ్రహ్మారెడ్డి గుంటూరుకు పారిపోయాడు. ఆ తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. ఎన్నికల ముందు బ్రహ్మారెడ్డిని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, చంద్రబాబు తీసుకొచ్చి పల్నాడులో ఫ్యాక్షన్‌కు ఆజ్యం పోశారు. కారెంపూడి మండలంలోని చింతపల్లి, ఒప్పిచర్ల, రెంటచింతల మండలంలో తుమృకోట, పాలవాయిగేటు గ్రామాల్లో కమ్మ సామాజికవర్గానికి చెందినవారు మా ఏజెంట్లను తరిమికొట్టి గొడవలు సృష్టించారు. కారెంపూడి సీఐ నారాయణస్వామి ద్వారా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ గ్రామాల్లో గొడవలు జరుగుతాయని బందోబస్తు పెంచాలని హైకోర్టు నుంచి ముందుగానే ఆర్డర్ తీసుకొచ్చి ఎస్పీకి ఇచ్చినా పట్టించుకోలేదు. ఎన్నికల రోజు గొడవలు జరిగినా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పోలీసుల సూచనల మేరకు హైదరాబాద్‌కు వచ్చాను. మర్డర్లు చేసి పారిపోయిన చరిత్ర నాకు లేదు. నేను ఎన్నడూ పారిపోలేదు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కమ్మ సామాజికవర్గాన్ని ఒకటి చేయటానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు కూడా బ్రహ్మారెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు కలిసి గొడవలు చేశారు. టీడీపీని గెలిపించేందుకు సీఐ నారాయణస్వామి దాడులకు పాల్పడ్డారు. ఈ అల్లర్లపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు నేను సిద్ధంగా ఉన్నా. బ్రహ్మారెడ్డిలా నీచ రాజకీయాలు చేసి పారిపోయే చరిత్ర నాది కాదు. నేను ఎప్పుడూ ప్రజలకు వెన్నంటే ఉంటాను. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. మీ ప్రభుత్వంలో ఏం చేశారో చెప్పండి. చందాలు వసూలు చేసి ఇల్లు కట్టుకుని చందాల నాయకుడుగా మారిన బ్రహ్మారెడ్డి నన్ను విమర్శించడం సిగ్గుచేటు.’ అని పిన్నెల్లి రామకృష్ణరెడ్డి చెప్పారు.
‘ఇంటి పేరు’తో పనిలేదు దీపిందర్ గోయల్.. ప్రధాని మోదీ ట్వీట్ వైరల్
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ స్టార్టప్ జర్నీపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. నేటి భారతంలో ఇంటిపేరుకు ఎలాంటి ప్రాధాన్యం లేదంటూనే.. గోయల్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందించారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ‘విశేష్ సంపర్క్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ఈవెంట్లో దీపిందర్ గోయల్ స్టార్టప్‌ను ప్రారంభించే విషయంలో తనకు తన తండ్రికి మధ్య జరిగిన చర్చ గురించి గుర్తు చేశారు.నీ తండ్రి స్థాయి ఏంటో తెలుసా?‘16 ఏళ్ల క్రితం నా తండ్రికి నా స్టార్టప్ ఆలోచన గురించి వివరించా. అప్పుడాయన.. నీ తండ్రి స్థాయి ఏంటో తెలుసా? పంజాబ్‌లోని ఇంత చిన్న ఊరిలో నువ్వేం చేయలేవు అని అన్నారు. కానీ నేను సుసాధ్యం చేశాను. జొమాటో అనే సామ్రజ్యాన్ని నిర్మించి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయం ఇంటిపేర్లతో కట్టుబడి ఉండదనివిశేష్ సంపర్క్ కార్యక్రమంలో దీపిందర్ గోయల్ ప్రసంగంపై ప్రధాని మోదీ స్పందించారు. విజయం ఇంటిపేర్లతో కట్టుబడి ఉండదని, గోయల్ సాధించిన విజయాలు ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రేరణగా నిలుస్తోందన్నారు.మీ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం‘నేటి భారతంలో ఒకరి ఇంటిపేరు పట్టింపు లేదు. కష్టపడి పనిచేయడమే ముఖ్యం. మీ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం దీపిందర్ గోయల్! ఇది అసంఖ్యాక యువకులను వారి వ్యవస్థాపక కలలను కొనసాగించడానికి ప్రేరేపిస్తుంది. స్టార్టప్‌లు అభివృద్ధి చెందడానికి సరైన వాతావరణాన్ని అందించడానికి మేం కట్టుబడి ఉన్నాము’ అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.In today’s India, one’s surname doesn’t matter. What matters is hardwork. Your journey is truly inspiring, @deepigoyal! It motivates countless youngsters to pursue their entrepreneurial dreams. We are committed to providing the right environment for the startups to flourish. https://t.co/E9ccqYyVzv— Narendra Modi (@narendramodi) May 22, 2024
తప్పక చదవండి
- కేకేఆర్ గెలుపు.. గాల్లో తేలిపోయిన షారూఖ్.. చూసుకోకుండా..!
- వరంగల్‌లో అర్ధరాత్రి బాంబుల మోత, కారణం ఏంటంటే..
- స్టార్‌లైనర్ క్యాప్సుల్ ప్రయోగం మళ్లీ వాయిదా..కారణం..
- ‘కంగనా కాలు మోపిన ఆలయాలను శుద్ధి చేయాలి’
- అమెరికాలో ముగ్గురు భారతీయ విద్యార్థుల దుర్మరణం : ఎన్ని కలలు కన్నారో..!
- సింపుల్‌గా పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్.. అమ్మాయి ఎవరంటే?
- పోర్షే కారు ప్రమాదం: ‘పబ్‌లో భారీ ఖర్చు’.. వెల్లడించిన పోలీసులు
- IPL 2024 KKR Vs SRH: వాళ్ల వల్లే గెలిచాం.. ఫైనల్లోనూ మేమే: శ్రేయస్ అయ్యర్
- బయోపిక్‌లో భార్య రేప్ సీన్.. షాకైన కేన్స్ ఆడియెన్స్
- ‘కాంగ్రెస్ పాలనలో కన్నీటి దృశ్యాలివి’.. కేటీఆర్ వ్యాఖ్యలు
సినిమా
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
స్టార్ హీరో నటించిన ఈ సినిమాని ఏళ్ల పాటు తీశారు. పడుతూ లేస్తూ షూటింగ్ పూర్తి చేసిన ఈ ఏడాది థియేటర్లలోకి తీసుకొచ్చారు. బయోపిక్స్ బోర్ కొట్టడం వల్లనో ఏమో గానీ మూవీ బాగున్నా సరే వసూళ్లు అంతంత మాత్రంగానే వచ్చాయి. అలాంటిది ఇప్పుడు సడన్‌గా ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఈ సినిమా ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?(ఇదీ చదవండి: క్యార్‌వ్యాన్‌లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్)బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ చేసిన స్పోర్ట్స్ బయోపిక్ 'మైదాన్'. హైదరాబాద్‌కి ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా దీన్ని తీశారు. చాలా ఏళ్ల నుంచి సెట్స్‌పై ఉన్న ఈ మూవీని ఈ ఏడాది రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ చేశారు. హిట్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ ఓ మాదిరిగా వచ్చాయి. అలాంటిది ఇప్పుడు సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి తీసుకొచ్చేశారు. కాకపోతే రెంట్ (అద్దె) విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.'మైదాన్' కథ విషయానికొస్తే.. 1952లో జరిగిన హెల్సింకీ ఒలింపిక్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు సరైన సదుపాయలు లేకపోవడంతో ఘోర ప్రదర్శన చేస్తుంది. దీంతో జట్టుకి కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగణ్) అండగా నిలబడతాడు. ఓటమి నుంచి తప్పులు తెలుసుకుని టీమ్‌ని మళ్లీ రెడీ చేస్తాడు. ఆ తర్వాత జరిగిన టోర్నీల్లో మన జట్టు ఎలాంటి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ క్రమంలోనే సయ్యద్, ఆటగాళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటనేదే సినిమా.(ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లో ప్రభాస్ 'కల్కి'.. ఏకంగా అన్ని కోట్లకు అమ్మేశారా?)
ఆనందం.. ఉద్వేగం...
30న హైదరాబాద్‌లో ‘కన్నప్ప’ టీజర్... శివభక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. విష్ణు మంచు టైటిల్ రోల్లో ముఖేష్ కుమార్ దర్శకత్వంలో మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. కాన్స్ చిత్రోత్సవాల్లో ‘కన్నప్ప’ ప్రీమియర్ టీజర్‌ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విష్ణు మంచు, మోహన్‌బాబు, ప్రభుదేవా పాల్గొన్నారు. ‘‘కన్నప్ప’ టీజర్‌ను కాన్స్‌లో చూపించాం. అందరూ ప్రశంసించారు. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ‘కన్నప్ప’ టీజర్ చూసి ముగ్దులయ్యారు. ఈ నెల 30న హైదరాబాద్‌లో తెలుగు వెర్షన్ ‘కన్నప్ప’ టీజర్‌ను ప్రదర్శించనున్నాం. జూన్ 13న ఈ టీజర్‌ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నాం’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు విష్ణు మంచు.కాన్స్‌లో తొలిసారి... కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రతిష్టాత్మక ‘పామ్ డి ఓర్’ అవార్డు సినీ పరిశ్ర మకు సుదీర్ఘకాలంగా సేవలు అందించినవారికి ఇస్తుంటారు. ఈ ఏడాది 77వ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని ‘పామ్ డి ఓర్’ అవార్డుకు మెరిల్ స్ట్రీప్, జార్జ్ లూకాస్‌లను ఎంపిక చేశారు. కాగా కాన్స్ చరిత్రలోనే తొలిసారి ఓ స్టూడియోకు ఈ అవార్డు దక్కింది. జపాన్‌లోని యానిమేటెడ్ స్టూడియో ‘ఘిబ్లీ’కి ఫామ్ డి ఓర్ అవార్డును ప్రదానం చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ స్టూడియో యానిమేషన్ రంగంలో ఉంది. ఇక హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ ఆల్రెడీ ఈ అవార్డు స్వీకరించారు. హాలీవుడ్ దర్శక–నిర్మాత జార్జ్ లూకాస్ చిత్రోత్సవాల చివరి రోజున ఈ అవార్డు అందుకోనున్నారు.కన్నీళ్లు పెట్టుకున్న కెవిన్... కెవిన్ కాస్ట్నర్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘హరిజన్: యాన్ అమెరికన్ సాగ’. అమెరికన్ సివిల్ వార్‌కు ముందు ఉన్న పరిస్థితులు, వార్ తర్వాత ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మూడు చాప్టర్స్‌గా ఈ చిత్రం విడుదల కానుంది. తొలి చాప్టర్ ‘హరిజన్: యాన్ అమెరికన్ సాగ’ను కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రీమియర్‌గా ప్రదర్శించగా, మంచి స్పందన లభించింది. దాదాపు పది నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ దక్కడంతో కెవిన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమా నిర్మాణానికి 35 ఏళ్లుగా కెవిన్ కష్టపడుతున్నారని హాలీవుడ్ టాక్. ట్రంప్ బయోపిక్... అమెరికా మాజీ అధ్యక్షుడు, వ్యాపారవేత్త డోనాల్డ్ ట్రంప్ జీవితం ఆధారంగా ‘ది అప్రెంటిస్’ సినిమా తీశారు దర్శకుడు అలీ అబ్బాసి. ఈ సినిమాను తొలిసారిగా కాన్స్ ఫెస్టివల్లో ప్రదర్శించగా, స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. సెబాస్టియన్ స్టాన్ ఈ చిత్రంలో డోనాల్డ్ ట్రంప్ పాత్రపోషించారు. ఫిల్మ్ మేకర్స్ పొలిటికల్ మూవీస్ మరిన్ని చేయాలని కాన్స్ వేదికగా అలీ అబ్బాసి పేర్కొన్నారు. శునకం సందడి... లాటిటియా డెస్చ్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘డాగ్ ఆన్ ట్రయిల్’. ఫ్రాన్స్‌లో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఓ కుక్క కొంతమందిని కరుస్తుంది. అప్పుడు ఆ శునకాన్ని ఓ లాయర్ ఏ విధంగా కోర్టు కేసు నుంచి రక్షించారు? అన్నదే ఈ చిత్రకథ. ఈ సినిమాను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. లాటిటియాతో పాటు ఈ సినిమాలో నటించిన శునకం చిత్రోత్సవాలకు హాజరైంది.కాన్స్‌లో భారతీయం... కాన్స్‌లో ఈ ఏడాది మన దేశీ తారలు ఐశ్వర్యా రాయ్, ఊర్వశీ రౌతేలా, కియారా అద్వానీ, శోభితా ధూళిపాళ వంటి వారు సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అదితీ రావ్ హైదరి ఈ చిత్రోత్సవాల్లో సందడి చేయడానికి ఫ్రాన్స్ వెళ్లారు. ఇక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో దాదాపు 35 ఏళ్ల తర్వాత పామ్ డి ఓర్ విభాగంలో పోటికి భారతీయ చిత్రం ‘అల్ వీ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ నిలిచిన సంగతి తెలిసిందే.భారతీయ ఫిల్మ్ మేకర్ పాయల్ కపాడియా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం కపాడియా ఫ్రాన్స్‌లోనే ఉన్నారు. అలాగే ‘అన్ సర్టైన్ రిగార్డ్’ విభాగంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఫిల్మ్‌మేకర్ సంధ్యా సూరి తీసిన ‘సంతోష్’ చిత్రం ఉంది. ఈ చిత్రంలో నటించిన సహానా గోస్వామి,సంజయ్ బిష్ణోయ్‌లతో పాటు సంధ్యా సూరి ఫ్రాన్స్ చేరుకున్నారు.
పుష్ప-2 మరో అప్డేట్ వచ్చేసింది.. అదేంటంటే?
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. ఈ మూవీ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్ సింగిల్‌కు ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పుష్ప పుష్ప అంటూ సాగే లిరికల్ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేసింది. ముఖ్యంగా పుష్ప షూ స్టెప్‌కు ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయ్యారు.తాజాగా పుష్ప టీమ్ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. బుధవారం ఉదయం 11:07 గంటలకు అప్డేట్ ఇవ్వనున్నట్లు చిత్రబృందం ట్వీట్ చేసింది. దీంతో పుష్ప-2 రెండో సింగిల్ రిలీజ్ ఉంటుందని తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు సుకుమార్ ఇప్పటికే ప్రకటించారు.✌️🎵Tomorrow 11:07 AM ❤️#Pushpa2TheRule 🎶— Mythri Movie Makers (@MythriOfficial) May 21, 2024
బిగ్‌బాస్ బ్యూటీకి చేదు అనుభవం.. నెల రోజులైనా రాలేదు!
బాలీవుడ్ భామ కిరణ్ రాథోడ్ తెలుగు వారికి సైతం పరిచయం అక్కర్లేదు. హిందీ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. నువ్వు లేక నేను లేను చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ చిత్రాలు చేసింది. అయితే 2016 నుంచి సినిమాలు చేయడం ఆపేసిన ముద్దుగుమ్మ.. గతేడాది జరిగిన తెలుగు బిగ్‌బాస్ సీజన్-7 మెరిసింది. అయితే మొదటివారంలోనే ఎలిమినేట్ అయి ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది.ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ బ్యూటీ తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వీసా విషయంలో తలెత్తిన సమస్యతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనట్లు పోస్ట్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అసలేం జరిగిందో ఓ సారి తెలుసుకుందాం.ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు కిరణ్ రాథోడ్ కూడా హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం ఆమె ఇప్పటికే గతనెలలోనే వీసాకు అప్లై చేసింది. కానీ ఇప్పటికీ ఆమెకు వీసా జారీ కాలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది.కిరణ్ రాథోడ్ ఇన్‌స్టాలో రాస్తూ..'కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు మే 13వ తేదీనే వెళ్లాల్సి ఉంది. ఇప్పటికే మా టీమ్ అంతా అక్కడికి చేరుకున్నారు. నేను మాత్రం నెల రోజులైనా వీసా కోసం ఎదురు చూస్తూనే ఉన్నా. ఇప్పటికే ముందస్తుగా హోటల్ బుకింగ్, ట్రావెల్ బుకింగ్ ఖర్చుల కోసం రూ.15 లక్షలు వెచ్చించా. దీంతో తాను మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యా. దీనిపై సదరు వీసా సంస్థ సమాధానం చెప్పాలి.' అని రాసుకొచ్చింది. పాపం.. ఇప్పటికైనా కిరణ్ రాథోడ్‌కు వీసా వస్తుందేమో చూడాల్సిందే. View this post on Instagram A post shared by Keira Rathore (@kiran_rathore_official)
ఫొటోలు
Gangamma Jatara Photos: విశ్వరూపంతో ముగిసిన తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
అనగనగా ఓ సాగర కన్య (ఫోటోలు)
KKR Vs SRH Photos: ఓ వైపు టెన్షన్.. మరోవైపు ఉత్సాహం: స్టేడియంలో తళుక్కుమన్న షారుఖ్ (ఫొటోలు)
Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్ తల్లికి అర్ష్‌దీప్ రిక్వెస్ట్ (ఫొటోలు)
క్రీడలు
RR vs RCB: వార్ వన్‌సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం
ఐపీఎల్-2024 ఆఖరి అంకానికి చేరుకుంటోంది. ఇప్పటికే ఒక ఫైనలిస్టు ఖరారు కాగా.. తుది పోరుకు అర్హత సాధించేందుకు మిగిలిన మూడు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్ క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రైజర్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకువెళ్లింది కేకేఆర్.ఇక ఫైనల్ రేసులో మిగిలినవి రెండే మ్యాచ్‌లు. ఎలిమినేటర్, క్వాలిఫయర్-2. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది.సన్‌రైజర్స్‌తో ఎలిమినేటర్ విజేత పోటీఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. క్వాలిఫయర్-1లో కేకేఆర్ చేతిలో ఓడిన సన్‌రైజర్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. ఆ మ్యాచ్‌లో గనుక గెలిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది.ఈ క్రమంలో బెంగళూరు- రాజస్తాన్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ సునిల్ గావస్కర్ ఎలిమినేటర్ విజేత ఎవరన్న అంశంపై తన అంచనా తెలియజేశాడు.‘‘ఆర్సీబీ ఈసారి ఎంతటి అద్భుతం చేసిందో చూశాం. ముఖ్యంగా వరుస పరాజయాల తర్వాత వాళ్లు తిరిగి పుంజుకున్న తీరు అమోఘం. మామూలు జట్లకు ఇలాంటివి సాధ్యం కావు.అయ్యో.. మనం ఓడిపోతూనే ఉన్నాంఆర్సీబీ ప్రధాన ఆటగాళ్లలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లితో పాటు మిగతా సీనియర్ ప్లేయర్లు తమ ఆట తీరుతో.. జట్టులో ఉత్సాహం నింపారు. ఆర్సీబీ స్థానంలో మరే ఇతర జట్టు ఏదైనా ఉంటే.. ‘అయ్యో.. మనం ఓడిపోతూనే ఉన్నాం. అంతా ముగిసిపోయింది’ అని బెంబేలెత్తిపోయేవాళ్లు.కానీ డుప్లెసిస్, కోహ్లి ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వలేదు. ఇక రాజస్తాన్.. గత నాలుగు- ఐదు మ్యాచ్‌లలో ఓడిపోతూనే ఉంది. ఆఖరిగా ఆడిన మ్యాచ్‌లోనూ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.వాళ్లను చూస్తే పూర్తిగా ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తున్నారు. పదకొండు రోజుల పాటు ఆటకు దూరంగా ఉన్న కేకేఆర్ మాదిరి ఏదైనా ప్రత్యేకంగా చేస్తే తప్ప రాజస్తాన్‌కు గెలిచే అవకాశాలు ఉండవు.లేదంటే మ్యాచ్ ఏకపక్షంగా సాగిపోయే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ రాజస్తాన్‌ను చిత్తు చేసినా చేస్తుంది. ఒకవేళ అలా జరగకపోతేనే ఆశ్చర్యం’’ అని సునిల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశాడు.గావస్కర్ వర్సెస్ కోహ్లికాగా ఇటీవల గావస్కర్- కోహ్లి మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. కోహ్లి స్ట్రైక్‌రేటు గురించి గావస్కర్ విమర్శించగా.. రన్‌మెషీన్ అందుకు కాస్త ఘాటుగానే బదులిచ్చాడు. ఎలా ఆడాలో తనకు తెలుసునని.. జట్టు ప్రయోజనాల కోసం ఏం చేయాలో కూడా తెలుసంటూ కౌంటర్ వేశాడు.
MS Dhoni: ఐపీఎల్‌కు గుడ్‌బై?.. ధోని కీలక వ్యాఖ్యలు
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని.. 42 ఏళ్ల వయసులోనూ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఐపీఎల్-2024లో వికెట్ కీపర్‌గా కళ్లు చెదిరే క్యాచ్‌లతో అదరగొట్టిన తలా.. లోయర్ ఆర్డర్లో బ్యాటర్‌గానూ ధనాధన్ ఇన్నింగ్స్‌తో అభిమానులను అలరించాడు.వింటేజ్ ధోనిని గుర్తు చేస్తూ పవర్ఫుల్ సిక్సర్లతో విరుచుకుపడుతూ కావాల్సినంత వినోదం పంచాడు. అయితే, ఢిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఈసారి ప్లే ఆఫ్స్ కూడా చేరకుండా నిష్క్రమించడంతో అభిమానులు నిరాశ చెందారు.లీగ్ దశలోనే ముగిసిన ప్రయాణంచావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో చెన్నై ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో రుతురాజ్ గైక్వాడ్ సేన ప్రయాణం లీగ్ దశలోనే ముగిసిపోయింది.అయితే, ఈ మ్యాచ్‌లో ధోని మెరుపులు మెరిపించడం అభిమానులకు కాస్త ఊరటనిచ్చింది. 13 బంతుల్లో 3 ఫోర్లు, ఓ భారీ సిక్సర్ సాయంతో తలా 25 పరుగులు సాధించాడు. ఇక 42 ఏళ్ల ఈ ‘జార్ఖండ్ డైనమైట్’కు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అన్న వార్తల నేపథ్యంలో ధోని ఫిట్నెస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.క్రికెటర్‌గా కొనసాగేందుకు ఎంతో కష్టపడాలియువ ఆటగాళ్లతో పోటీ పడటం అంత తేలికేమీ కాదని.. క్రికెటర్‌గా కొనసాగేందుకు ఎంతో కష్టపడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ‘‘నేను ఏడాదంతా క్రికెట్ ఆడుతూనే ఉండను.కేవలం లీగ్ క్రికెట్ కోసమే మైదానంలో దిగుతాను. అయినా ఎల్లప్పుడూ ఫిట్‌గానే ఉండాలి. అంతర్జాతీయ క్రికెట్ ఆడుతూ ఫిట్నెస్ మెయింటెన్ చేస్తున్న యువ ఆటగాళ్లను ఎదుర్కోవాలి కాబట్టి నేనూ వారిలాగే ఫిట్‌గా ఉండాలి.వయసును సాకుగా చూపలేంఎందుకంటే ప్రొఫెషనల్ క్రికెట్లో వయసు కారణంగా ఎవరూ మనకు డిస్కౌంట్ ఇవ్వరు. ఒకవేళ మనం ఆడాలని నిర్ణయించుకుంటే కచ్చితంగా అందుకు తగ్గట్లుగా ఫిట్నెస్ మెయింటెన్ చేయాలి.వయసును సాకుగా చూపి మనం ప్రయోజనం పొందే అవకాశం ఉండదు. అందుకే ఆహారపుటలవాట్లు మొదలు వ్యాయామం, ప్రాక్టీస్ వంటి విషయాల్లో కచ్చితంగా స్ట్రిక్ట్‌గా ఉండాల్సిందే’’ అని ధోని పేర్కొన్నాడు. దుబాయ్ ఐ 103.8 చానెల్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా గతేడాది సీఎస్కేను చాంపియన్‌గా నిలిపిన ధోని.. ఈ ఏడాది కెప్టెన్సీ నుంచి వైదొలిగి పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించిన విషయం తెలిసిందే.చదవండి: IPL 2024: వాళ్ల వల్లే గెలిచాం.. ఫైనల్లోనూ మేమే: శ్రేయస్ అయ్యర్#THALAFOREVER 🦁💛@msdhoni pic.twitter.com/zOu5KABAcP— Chennai Super Kings (@ChennaiIPL) May 19, 2024
IPL 2024 KKR Vs SRH: వాళ్ల వల్లే గెలిచాం.. ఫైనల్లోనూ మేమే: శ్రేయస్ అయ్యర్
‘‘చాలా చాలా సంతోషంగా ఉంది. జట్టులోని ప్రతి ఒక్కరు తమ వంతు పాత్రను సమర్థవంతంగా పోషించారు. మా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నాను. ఈరోజు మేము ఏం చేయగలమో అదే చేసి చూపించాం. కీలకమైన ఈ మ్యాచ్‌లో మా జట్టులోని ప్రతి ఒక్క బౌలర్ తమ బాధ్యతను నెరవేర్చారు.వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ఇలాంటి వైవిధ్యమైన బౌలింగ్ లైనప్ ఉంటే కెప్టెన్ పని సులువవుతుంది. మా బౌలర్లంతా అద్భుతంగా రాణించారు. ఇక ముందు కూడా మా ప్రదర్శన ఇలాగే ఉంటుందని భావిస్తున్నా.ఈరోజు గుర్బాజ్ తన తొలి మ్యాచ్ ఆడాడు. ఓపెనర్‌గా మాకు శుభారంభమే అందించాడు. ఇదే జోరులో మరింత ముందుకు వెళ్లాలని పట్టుదలగా ఉన్నాం. ఫైనల్లోనూ మా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాం’’ అని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు.ఐపీఎల్-2024లో తుదిపోరుకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. కాగా లీగ్ దశలో పద్నాలుగింట తొమ్మిది విజయాలతో టాపర్‌గా నిలిచిన కేకేఆర్.. క్వాలిఫయర్-1లోనూ సత్తా చాటింది.అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో జయభేరి మోగించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌కు కేకేఆర్ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు.సీజన్ ఆసాంతం విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడిన సన్‌రైజర్స్‌కు షాకిస్తూ 159 పరుగులకే కుప్పకూల్చారు. మిచెల్ స్టార్క్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునిల్ నరైన్, ఆండ్రీ రసెల్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఈ క్రమంలో నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ 14 బంతుల్లో 23, సునిల్ నరైన్ 16 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేయగలిగారు.అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన వెంకటేశ్ అయ్యర్, నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ సన్‌రైజర్స్ ఫీల్డర్ల తప్పిదాల కారణంగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆకాశమే హద్దుగా చెలరేగారు. వెంకటేశ్ 28 బంతుల్లో 51, శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 58 పరుగులతో దుమ్ములేపారు.వీరిద్దరి విజృంభణతో 13.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి కేకేఆర్ 164 పరుగులు సాధించింది. సన్‌రైజర్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఫైనల్లో అడుగుపెట్టింది.ఈ విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రేయస్ అయ్యర్ జట్టు ప్రదర్శన పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. అదే విధంగా.. మైదానంలో వెంకటేశ్ అయ్యర్‌తో తన కమ్యూనికేషన్ గురించి చెబుతూ.. ‘‘నిజానికి నాకు తమిళ్ మాట్లాడటం రాదు. అయితే, ఎదుటివాళ్లు మాట్లాడింది అర్థం చేసుకోగలను. వెంకీ తమిళ్లోనే మాట్లాడతాడు. నేను అతడికి హిందీలో బదులిస్తాను’’ అని తెలిపాడు.What a memorable 𝗞𝗻𝗶𝗴𝗵𝘁 for the men in purple 💜Unbeaten half-centuries from Venkatesh Iyer 🤝 Shreyas IyerThe celebrations continue for the final-bound @KKRiders 😎Scorecard ▶️ https://t.co/U9jiBAlyXF#TATAIPL | #KKRvSRH | #Qualifier1 | #TheFinalCall pic.twitter.com/xBFp3Sskqq— IndianPremierLeague (@IPL) May 21, 2024
KKR Vs SRH: కోల్‌కతాకే ‘ఫైనల్’ సత్తా
ఈ సీజన్లో 7 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగుసార్లు 200 పైచిలుకు స్కోర్లను అవలీలగా చేసింది. ఎనిమిదోసారి మాత్రం ‘సన్’ బృందం రైజింగ్ కాలేదు. కీలకమైన ప్లే ఆఫ్స్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ పూర్తి ఓవర్లు ఆడకుండానే 159 పరుగులకే కుప్పకూలింది. రెండో క్వాలిఫయర్ ఉందన్న ధీమానో లేదంటే ఓడినా పోయేదేం లేదన్న అలసత్వమో గానీ హైదరాబాద్ బ్యాటర్లు పేలవ ప్రదర్శనతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు సులువుగా ఫైనల్ దారి చూపారు. ఆద్యంతం పక్కా ప్రణాళికతో ఆడిన కోల్‌కతా ముందుగా బంతితో సన్‌రైజర్స్‌ను కట్టడి చేసి... ఆ తర్వాత బ్యాట్‌తో మెరిపించి 160 పరుగుల లక్ష్యాన్ని 13.4 ఓవర్లలోనే ఛేదించేసి దర్జాగా నాలుగోసారి ఐపీఎల్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. అహ్మదాబాద్: ‘ప్లే ఆఫ్స్’ దశ వరకు తగిన ప్రదర్శన చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఇంకో అవకాశం కోసం ఎదురుచూడకుండా ఐపీఎల్ 17వ సీజన్లో నేరుగా ఫైనల్‌కు అర్హత సంపాదించింది. మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించింది. లీగ్ దశలో భీకరమైన ఫామ్ కనబరిచిన సన్‌రైజర్స్ మాత్రం కీలకమైన దశలో నిర్లక్ష్యంగా ఆడి ఓడింది. ఫైనల్ బెర్త్ కోసం ఆ జట్టు రెండో క్వాలిఫయర్ కోసం నిరీక్షించనుంది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. రాహుల్ త్రిపాఠి (35 బంతుల్లో 55; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, హెన్రిచ్ క్లాసెన్ (21 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీశారు. అనంతరం కోల్‌కతా 13.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (24 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), వెంకటేశ్ అయ్యర్ (28 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) సన్‌రైజర్స్ బౌలర్ల భరతం పట్టి మూడో వికెట్‌కు కేవలం 44 బంతుల్లో 97 పరుగుల భాగస్వామ్యం జోడించడం విశేషం. గతంలో కోల్‌కతా జట్టు 2012, 2014లలో టైటిల్ సాధించి, 2021లో రన్నరప్‌గా నిలిచింది. ఆది నుంచే కష్టాల్లో... అసలైన మ్యాచ్‌లో స్టార్క్ బంతితో నిప్పులు చెరిగాడు. రెండో బంతికే ట్రవిస్ హెడ్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అభిషేక్ శర్మ (3)ను కూడా సింగిల్ డిజిట్‌కే వైభవ్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ఫామ్‌లో ఉన్న నితీశ్ కుమార్ రెడ్డి (9), షహబాజ్ (0)లను స్టార్క్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. దాంతో సన్‌రైజర్స్ 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఏడో ఓవర్లో జట్టు స్కోరు 50కి చేరింది.మెల్లిగా ఈ కష్టాల నుంచి గట్టెక్కుతున్న సమయంలో 8, 9, 10 ఓవర్లు సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌కు ఊరటనిచ్చాయి. హర్షిత్ వేసిన 8వ ఓవర్లో రాహుల్ త్రిపాఠి సిక్సర్‌తో 12 పరుగులొచ్చాయి. నరైన్ తొమ్మిదో ఓవర్లో త్రిపాఠి బౌండరీ బాదితే... క్లాసెన్ 6, 4 కొట్టడంతో 18 పరుగుల్ని రాబట్టుకుంది. రసెల్ పదో ఓవర్లో ఇద్దరు చెరో ఫోర్ కొట్టడంతో మరో 12 పరుగులు రావడంతో సగం ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ 92/4 స్కోరు చేసింది. వరుణ్ దెబ్బతో.... ఇంకేం ఓవర్‌కు 9.2 రన్‌రేట్‌తో గాడిలో పడుతోందనుకుంటున్న తరుణంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దెబ్బకొట్టాడు. అతను వేసిన 11వ ఓవర్లో త్రిపాఠి బౌండరీతో జట్టు స్కోరు 100కు చేరింది. కానీ ఆఖరి బంతికి క్లాసెన్ అవుటయ్యాడు. దీంతో ఐదో వికెట్‌కు 62 పరుగుల విలువైన భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత కాసేపటికే 5 పరుగుల వ్యవధిలోనే త్రిపాఠి, సన్విర్ (0), సమద్ (16), భువనేశ్వర్ (0) ఇలా నాలుగు వికెట్లను కోల్పోయిన సన్‌రైజర్స్ 126/9 స్కోరు వద్ద ఆలౌట్‌కు సిద్ధమైపోయింది. ఈ దశలో కెపె్టన్ కమిన్స్ (24 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులతో 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది. అదరగొట్టిన ‘అయ్యర్’లు బౌలింగ్‌లోనూ హైదరాబాద్ తేలిపోవడం, ఫీల్డర్లు క్యాచ్‌లు నేలపాలు చేయడంతో నైట్‌రైడర్స్‌కు లక్ష్యఛేదన మరింత సులువైంది. ఓపెనర్లు గుర్బాజ్ (14 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సునీల్ నరైన్ (16 బంతుల్లో 21; 4 ఫోర్లు) వేగంగా ఆడే క్రమంలో అవుటయ్యారు. 67 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఒక్క వికెట్టు పడలేదు. వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ వచ్చిన లైఫ్‌లను సద్వినియోగం చేసుకొని హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో 9.4 ఓవర్లలోనే కోల్‌కతా స్కోరు వందకు చేరింది. లక్ష్యంవైపు చకచకా పరుగులు తీసింది. వెంకటేశ్ 28 బంతుల్లో, శ్రేయస్ 23 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. వెంకటేశ్, శ్రేయస్ ధాటికి కోల్‌కతా 38 బంతులు మిగిలుండగానే విజయతీరానికి చేరింది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (బి) స్టార్క్ 0; అభిõÙక్ శర్మ (సి) రసెల్ (బి) వైభవ్ 3; త్రిపాఠి (రనౌట్) 55; నితీశ్ కుమార్ రెడ్డి (సి) గుర్బాజ్ (బి) స్టార్క్ 9; షహబాజ్ (బి) స్టార్క్ 0; క్లాసెన్ (సి) రింకూ సింగ్ (బి) వరుణ్ 32; సమద్ (సి) శ్రేయస్ (బి) హర్షిత్ 16; సన్వీర్ (బి) నరైన్ 0; కమిన్స్ (సి) గుర్బాజ్ (బి) రసెల్ 30; భువనేశ్వర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ 0; విజయకాంత్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 159. వికెట్ల పతనం: 1–0, 2–13, 3–39, 4–39, 5–101, 6–121, 7–121, 8–125, 9–126, 10–159. బౌలింగ్: స్టార్క్ 4–0–34–3, వైభవ్ 2–0–17–1, హర్షిత్ 4–0–27–1, నరైన్ 4–0–40–1, రసెల్ 1.3–0–15–1, వరుణ్ చక్రవర్తి 4–0–26–2. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) విజయకాంత్ (బి) నటరాజన్ 23; నరైన్ (సి) విజయకాంత్ (బి) కమిన్స్ 21; వెంకటేశ్ అయ్యర్ (నాటౌట్) 51; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 58; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (13.4 ఓవర్లలో 2 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–44, 2–67. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–28–0, కమిన్స్ 3–0–38–1, నటరాజన్ 3–0–22–1, విజయకాంత్ 2–0–22–0, హెడ్ 1.4–0–32–0, నితీశ్ రెడ్డి 1–0–13–0.
బిజినెస్
ఒంటరులవుతున్నారు... జంతువుల సాయం తీసుకుంటున్నారు!
ప్రపంచంలో మనుషుల ఒంటరి తనంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరికలు జారీ చేసింది. ఇది ఆరోగ్య ముప్పుకారకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తుంది.అయితే ఈ ఒంటరితనం, ఆందోళన నుంచి బయట పడేందుకు భారతీయులు పెంపుడు జంతువుల్ని పెంచుతున్నారు. పెట్స్ కోసం భారతీయ కుటుంబాలు నెలవారీగా కనీసం రూ.3 వేలు ఖర్చు చేస్తున్నారు. బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో రూ.5 వేల వరకు పెట్స్ కోసం కేటాయిస్తున్నారని డ్రూల్ పెట్ ఫుడ్ సీఈఓ శశాంక్ సిన్హా తెలిపారు. రూ.10వేల కోట్లుకుఫలితంగా దేశీయ పెట్ కేర్ రంగం ప్రస్తుత విలువ రూ.5వేల కోట్లుంటే.. 2028 నాటికి ఆ మొత్తం రూ.10వేల కోట్లుకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం భారత్‌లో 31 మిలియన్ల పెట్ డాగ్స్, 2.44 పెట్ క్యాట్స్‌తో పెంపుడు జంతువుల పాపులేషన్లో భారత్ ఐదవ స్థానంలో నిలిచింది.యజమానులం కాదు.. తల్లిదండ్రులంపెంపుడు జంతువులను దత్తత తీసుకునే విషయంలో ధోరణి మారింది. జెన్‌జెడ్, మిలీనియల్స్ పెంపుడు జంతువులకు తమని తాము యజమానులం అనే భావన కాకుండా.. తల్లిదండ్రుల్లా ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పెట్స్ ఆహారం, గ్రూమింగ్‌తో పాటు పెట్ కేఫ్‌లు, పెట్ ఇన్సూరెన్స్ ఇలా వాటి సంరక్షణ కోసం ఖర్చు చేసేందుకు ఏమాత్రం వెనకాడటం లేదని నెస్లే ఇండియా ప్రతినిధి తెలిపారు.16-18 శాతం వృద్ధితోరాబోయే 5-6 సంవత్సరాల్లో పరిశ్రమ 16-18 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని మార్స్ పెట్‌కేర్ ఇండియా తెలిపింది. ఈ సందర్భంగా ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ మూర్తి మాట్లాడుతూ.. ఓ ‘20 ఏళ్లు వెనక్కి వెళ్లండి. పెంపుడు జంతువులు ఇంటి బయట ఉండేవి. పరిస్థితులు మారాయి. ఇంట్లోకి వచ్చాయి. కోవిడ్ కారణంగా బెడ్రూమ్లోకి ప్రవేశించాయి. కుటుంబంలో భాగమయ్యాయి. జంతుప్రేమికులు పెరిగారు. పెట్స్‌కు ఏం తినిపించాలి. ఎలాంటి ఆహారం అందించాలి. వాటికి అవసరమయ్యే వస్తువులు ఏమైనా ఉన్నాయని అడగడం ప్రారంభించారని తెలిపారు.
స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 25 పాయింట్లు లాభపడి 22,554కు చేరింది. సెన్సెక్స్ 71 పాయింట్లు ఎగబాకి 74,026 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.62 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 82.54 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.41 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.25 శాతం లాభపడింది. నాస్డాక్ 0.22 శాతం పుంజుకుంది.బీఎస్ఈ తొలిసారి 5 లక్షల కోట్ల డాలర్ల విలువను అందుకుంది. ఓవైపు బ్లూచిప్స్ పరుగుతీస్తుంటే.. మరోపక్క మధ్య, చిన్నతరహా కంపెనీల ఇండెక్సులు సైతం సరికొత్త గరిష్టాలకు చేరాయి. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రికార్డ్ నెలకొల్పింది. వెరసి బీఎస్ఈ విలువ తొలిసారి రూ.415 లక్షల కోట్లకు చేరింది. 2023 నవంబర్‌లో తొలిసారి బీఎస్ఈ విలువ 4 ట్రిలియన్ డాలర్లను తాకింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఎండీహెచ్, ఎవరెస్ట్‌లకు క్లీన్ చిట్
భారత్‌కు చెందిన ప్రముఖ మసాలా బ్రాండ్లు ఎండీహెచ్, ఎవరెస్ట్ సంస్థలకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (fssai) క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ రెండు సంస్థల అమ్మకాలు జరుపుతున్న మసాలల పొడుల ఉత్పత్తుల్లోక్యాన్సర్‌కు కారకమయ్యే ఎథిలీన్ ఆక్సైడ్ (eto) రసాయనాలు లేవని నిర్ధారించింది.కొద్ది రోజుల క్రితం భారతీయ బ్రాండ్లయిన ఎవరెస్ట్, ఎండీహెచ్ అమ్మకాలు జరుపుతున్న మసాలల పొడుల ఉత్పత్తుల్లో పరిమితికి మించి ఎథిలీన్ ఆక్సైడ్ అనే పురుగుల మందు ఉన్నట్లు కనుగొన్నామని హాంకాంగ్ సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ (సీఎఫ్ఎస్) ఏప్రిల్ 5న ప్రకటించింది. ఈ ఉత్పత్తులను కొనొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సీఎఫ్ఎస్ ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని, ఈ బ్రాండ్ల ఉత్పత్తులను సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ రీకాల్ చేసింది.అందులో ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా, ఎమ్‌డీహెచ్‌కు చెందిన మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా మిక్స్డ్ మసాలా పౌడర్, కర్రీ పౌడర్ మిక్స్డ్ మసాలా పౌడర్ ఉన్నాయి.ఎఫ్ఎస్ఏఐ అప్రమత్తంఆ ఆరోపణల నేపథ్యంలో అప్రమత్తమైన ఎఫ్ఎస్ఎస్ఏఐ అన్నీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఫుడ్ సేప్టీ కమిషనర్లు, రిజినల్ డైరెక్టర్లను అప్రమత్తం చేసింది. వెంటనే ఎవరెస్ట్, ఎమ్‌డీహెచ్ మసాల పొడుల శాంపిల్స్ కలెక్ట్ చేసి వాటిపై టెస్టులు చేయాలని ఆదేశించింది. దీంతో ఉన్నతాధికారులు మహరాష్ట్ర, గుజరాత్, హర్యానా, రాజస్థాన్‌లలో మసాల దినుసుల శాంపిల్స్‌ను కలెక్ట్ చేశారు.ఇథిలీన్ ఆక్సైడ్ గురించి అన్వేషణపలు నివేదికల ప్రకారం.. అధికారులు మసాల దినుసుల శాంపిల్స్‌ను పరీక్షించారు. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (NABL) గుర్తింపు పొందిన ప్రయోగశాలలలో ఇథిలీన్ ఆక్సైడ్ కోసం నమూనాలను పరీక్షించారు.28 ల్యాబ్ రిపోర్టులు అయితే ఇప్పటివరకు 28 ల్యాబ్ రిపోర్టులు అందాయి. ఫుడ్ రెగ్యులేటర్ సైంటిఫిక్ ప్యానెల్ శాంపిల్స్‌ను విశ్లేషించగా వాటిలో ఎలాంటి ప్రమాదకరమైన రసాయనం లేదని తేలింది.ఆ రెండు కంపెనీలకు క్లీన్ చిట్‌అంతేకాదు ఇతర బ్రాండ్లకు చెందిన మరో 300 మసాలా శాంపిల్స్ పరీక్ష నివేదికలను కూడా విశ్లేషించింది. అయితే భారతీయ ఉత్పత్తులు వినియోగానికి సురక్షితమైనవని చూపిస్తూ క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థం ఆనవాళ్లు లేవని ఎమ్‌డీహెచ్, ఎవరెస్ట్‌లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ క్లీన్ చిట్ ఇచ్చింది.
ట్రిలియన్ డాలర్లకు డిజిటల్ ఎకానమీ
న్యూఢిల్లీ: భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఏటా 2.8 శాతం వృద్ధి చెందుతోంది. 2027–28 నాటికి ఇది ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అధికారిక నివాసంలో సోమవారం సాయంత్రం జరిగిన విశేష సంపర్క్ అభియాన్‌లో ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమంలో దాదాపు 300 ఐటీ, స్టార్టప్‌లు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. ‘2026–27 నాటికి భారత డిజిటల్ ఎకానమీ 1 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరుకుంటుందని ప్రభుత్వం ముందుగా అంచనా వేసింది. అయితే కోవిడ్–19 మహమ్మారితో సహా వివిధ కారణాల వల్ల లక్ష్యం ఆ తర్వాతి సంవత్సరానికి మార్చారు’ అని తెలిపారు.
వీడియోలు
ఈవీఎం లు ధ్వంసం చేసిన టీడీపీ నేతలకు రిమాండ్
సీసీటీవీలో బయటపడ్డ టీడీపీ రౌడీలు దాడి..
తెలంగాణలో సన్నబియ్యం రాజకీయం..
టీడీపీ అంటేనే కుట్ర కుతంత్రం.. చంద్రబాబుపై రెచ్చిపోయిన మల్లాది విష్ణు
ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ లేటెస్ట్ అప్ డేట్
పాయల్ రాజ్‌పుత్ రక్షణ మూవీ టీమ్ నుండి వేధింపులను ఎదుర్కొంటుంది
వరంగల్ ఎంజీఎం పవర్ కట్ పై కేటీఆర్ రియాక్షన్
పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోపై యాంకర్ శ్యామల రియాక్షన్
ఏపీ ప్రభుత్వంతో కలిసి.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కృష్ణా జిల్లా
ఫ్యామిలీ
'టీ'ని అతిగా మరిగిస్తున్నారా? ఎంత వ్యవధిలో చేయాలంటే..
చాలామంది రోజుని ఓ కప్పు 'టీ'తో ప్రారంభిస్తారు. చక్కగా పాలతో చేసుకునే 'టీ' అంటేనే చాలమంది ఇష్టంగా ఆస్వాదిస్తుంటారు. అయితే ఈ 'టీ'ని తయారీలో చాలామంది మంచి చిక్కటి 'టీ' కోసం అదేపనిగా మరిగిస్తుంటారు. కాస్త మరిగిన 'టీ'నే మంచి రుచి అని చాలామంది ఫీలింగ్. అయితే ఇలా అస్సలు చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా ఇలాంటి చిక్కటి టీ తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మరీ ఎలా ప్రిపేర్ చేసుకుని తాగితే మంచిదంటే..ప్రతి ఒక్కరూ టీని పలు విధాలుగా తయారు చేసుకుని ఆస్వాదిస్తుంటారు. కొందరూ 'టీ'ని ఆకులతో చేయడానికి ఇష్టపడతారు. మరికొందరూ కొద్దిగా పాలను, చక్కెరను జోడించి తయారు చేసుకుంటారు. ఇలా తయారు చేసేటప్పుడూ బాగా మరిగిస్తుంటారు. కొందరూ చల్లారిపోవడం వల్ల మరేదైన కారణం వల్లనో తరుచుగా అదేపనిగా వేడిచేసి తాగుతుంటారు. ఇలా కూడా అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇలా బాగా మరిగిపోయిన చిక్కటి 'టీ' తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. సాధారణంగా 'టీ' తాగడం వల్ల బరువు తగ్గుతారు, రక్తంలో చక్కెర నియంత్రణ వంటి మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఎప్పుడైతే అదే పనిగా కెఫిన్ పానీయాన్ని ఇలా వేడి చేస్తుంటామో అది మన ఆరోగ్యాన్నికి హానికరంగా మారిపోతుందని చెబుతున్నారు నిపుణులు. 'టీ'లో టానిన్లు ఉంటాయి. దీనిలో పాలీఫెనోలిక్ జీవ అణువులు ఉంటాయి. అది ప్రోటీన్లు, సెల్యులోజ్, పిండి పదార్థాలు, ఖనిజాలతో బంధించే పెద్ద అణువులు. ఎప్పుడైతే టీని మరిగిస్తామో ఇవి కరగని పదార్థాలుగా మారి శరీరంలోని ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తాయి. అసలు బాగా మరిగించిన 'టీ' తాగడం వల్ల తలెత్తే దుష్ప్రభావాలేంటంటే..పోషకాల నష్టంటీని నిరంతరం ఉడకబెట్టడం వల్ల పాలలో ఉండే కాల్షియం, విటమిన్లు B12, సీవంటి పోషకాలు క్షీణిస్తాయి.రుచి మార్పుపాలను ఎక్కువగా ఉడకబెట్టడం వల్ల మాడిన వాసనలాంటి రుచిలా ఉంటుంది. అజీర్ణంఅతిగా ఉడకబెట్టడం వల్ల పాలలోని ప్రొటీన్ల డీనాటరేషన్కు దారి తీస్తుంది, వాటి నిర్మాణాన్ని మారుస్తుంది. ఫలితంగా అజీర్ణం వంటి సమస్యలు తలెత్తి కడుపునొప్పి, ఆమ్లత్వం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలకు దారితీస్తుంది.అసిడిటీ సమస్య..టీని మరిగించడం వల్ల దానిలో ఉండే పీహెచ్ మారుతుంది. మరింత ఆమ్లంగా మారుతుంది. హానికరమైన మిశ్రమాలుఅధిక ఉష్ణోగ్రత కారణంగా మెయిలార్డ్ వంటి హనికరమైన మిశ్రమాలను ఏర్పరుస్తుంది.క్యాన్సర్ కారకాలుమరిగిన టీలో యాక్రిలామైడ్ వంటి మిశ్రమాలు కూడా ఉత్పత్తి అవుతాయి. ఇవి క్యాన్సర్ కారకాలు. ఎంతలా మరిగిస్తే అంతలా ఈ క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి అవుతాయి.టీ తయారీకి సరైన వ్యవధి..కచ్చితంగా చెప్పాలంటే టీ తయారీకి జస్ట్ ఐదు నిమిషాలు చాలు. ఎక్కువసేపు కాయడం వల్ల టీలోని గుణాలు ఆక్సీకరణం చెందుతాయి. దీని వల్ల ఎలాంటి అదనపు ప్రయోజనాలు ఉండవు. ఉత్తమ పద్ధతి..టీ అనంగానే పాలు పంచదారు, టీ పొడి వేసి మరిగించడం కాదంటున్నారు నిపుణులు. సరైన మార్గం ఏంటంటే..?. ఒక గిన్నెలో కొద్దిగా నీరు పోసుకుని, అందులో ఒక టీస్పూన్ టీ పొడి లేదా ఆకులను వేసి మూడు నుంచి నాలుగు నిమిషాలు మరిగించాలి. దానిలో కొద్దిగా వేడి చేసిన పాలు, చక్కెర వేసి..కప్పు టీని చక్కగా ఆస్వాదించండి. ఇలా చేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది కూడా. (చదవండి: కేన్స్ ఫెస్టివల్లో నిదర్శన గోవాని నవరత్న హారం! ఏకంగా 200 మంది కళాకారులు,1800 గంటలు..)
కేన్స్ ఫెస్టివల్లో హైలెట్‌గా 'కృష్ణ గువా నవరత్న హారం'!
ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకకు వివిధ సెలబ్రెటీలు, ప్రముఖులు విచ్చేసి రెడ్ కార్పెట్‌పై వివిధ రకాల డిజైనర్‌వేర్‌లు, గౌన్లు, వెస్ట్రన్ డ్రెస్‌లతో మెరిశారు. వారిలో అస్సాంకి చెందిన నటి మాత్రం భారతీయ సంప్రదాయ చీరలో మెరిసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇదే కోవలోకి ప్రస్తుతం వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త నిదర్శన గోవాని గావిన్ మిగ్యుల్ చేరిపోయారు. గోవాని కూడా అస్సాం నటి మాదిరి సంప్రదాయ చీరకట్టులో కనిపించారు. ఆమె కేన్స్ రెడ్ కార్పెట్‌పై జర్జోజీ ఎంబ్రాయిడరీ చీరతో స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకుంది. ఆమె ధరించిన చీరను వందమంది చేనేత వాళ్ళు తమ కళా నైపుణ్యంతో గ్లామరస్‌గా రూపొందించారు. అయితే ఈ వేడుకలో ఆమె చీర కంటే..గోవాని ధరించిన హారమే హైలెట్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అందరూ తమదైన స్టైల్‌తో ఆకట్టుకోగా, గోవాని మాత్రం అత్యంత అరుదైన లగ్జరీయస్ జ్యువెలరీతో చూపురుల దృష్టిని తనవైపుకి తిప్పుకునేలా చేశారు. అయితే ఈ వేడుకలో ఆమె ధరించి జ్యువెలరీని కృష్ణ గువా నవరత్న హారం అని అంటారు. ఇది వందేళ్ల నాటి పురాతన నగ. దీన్ని మీనా జాదౌ జ్యువెలరీ వ్యాపారి ఘనాసింగ్ బిట్రూ రూపొందించారు. ఈ నెక్లెస్‌ని తయారు చేయడానికి సుమారు 200 మంది కళాకారులు తమ కళా నైపుణ్యంతో 1800 గంటలు శ్రమకు ఓర్చి మరీ రూపొందించారు. నిజానికి ఈ నగలో వజ్రాన్ని పాశ్చాత్య కట్టింగ్ పద్ధుతును పక్కన పెట్టి పురాతన కటింగ్ పద్ధతిలో పోల్కీ వజ్రాలతో రూపొందించారు.పోల్కీ వజ్రాల చరిత్ర..ఇవి దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం భారతదేశంలో ఉద్భవించాయి. ఈ వజ్రాలను నాటికాలంలో మహారాజులు బాకులు, ప్లేట్లు, చెస్ సెట్లు, అద్భుతమైన నెక్లస్లలో ఈ పోల్కీ వజ్రాలను ఉపయోగించేవారు. View this post on Instagram A post shared by Nidarshana Gowani (@nidarshana_gowani) (చదవండి: ప్రియాంక చోప్రా న్యూ లుక్! ఏకంగా 200 క్యారెట్ల డైమండ్ నెక్లెస్..)
ట్రైనీ నుంచి డైరెక్టర్ దాకా... రూ.2,556 కోట్ల మార్కెట్
నేడు చాలామంది యువత చేస్తున్న ఉద్యోగాలను వదిలిపెట్టి సొంతంగా వ్యాపారాలను ప్రారరంభిస్తున్నారు. అనుకున్న రంగంలో విజయం సాధించాలని కలలు కంటున్నారు. అయితే తమ కలల లక్ష్య సాధనలో అడుగులువేయడం కోసం ఏదైనా ఒక స్ఫూర్తి ఉండాలి కదా...పుణేలో ఉంటున్న 33 ఏళ్ల అక్షాలీషా సాధిస్తున్న విజయం నవతరానికి స్ఫూర్తి దాయకం. ఎంబీయే చేసి, పద్నాలుగేళ్ల క్రితం తండ్రి ప్రారంభించిన చిన్న డెయిరీ యూనిట్లో ట్రైనీగా చేరింది అక్షాలీ షా. మిల్క్ ప్రొడక్ట్స్ వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తూ నేడు కంపెనీ రూ.2,556 కోట్ల మార్కెట్‌ని సాధించేంతగా కృషి చేసింది.బిజినెస్‌లో రాణించాలనుకునేవారికి పరాగ్ మిల్క్ ఫుడ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆమె చేసిన ప్రయాణం ఓ పాఠం అవుతుంది.‘‘నేను ఎంబీయేలో చేరేనాటికి మా నాన్న దేవేంద్ర షా పుణే సమీపంలోని మంచార్లో ఒక చిన్న డెయిరీ యూనిట్‌ను ప్రారంభించాడు. ఎంబీయే పూర్తవుతూనే ఏదైనా బిజినెస్ ప్రారంభించాలనుకున్నప్పుడు మా నాన్న తన యూనిట్లోనే జాబ్‌లో చేరి, వ్యాపారాన్ని డెవలప్ చేయమన్నాడు. దానిని సవాల్‌గా తీసుకున్నాను. పరాగ్ పేరుతో రకరకాల పాల ఉత్పత్తులను తయారుచేయడం మొదలుపెట్టాను. ముందుగా దేశవ్యాప్తంగా ఉన్న మిల్క్ ప్రొడక్ట్స్‌కు సంబంధించిన అధ్యయనంతో మొదలుపెట్టాను. ఏ బిజినెస్ అయినా అంచెలంచెలుగా ఎదగాలంటే ముందు మార్కెట్‌ను అర్థం చేసుకోవాలి. నాణ్యతపైన దృష్టి పెట్టాలి. పుణే ప్రాంతంలో సహకార సంఘాల వాళ్లు మిల్క్ లీవ్ ప్రకటించినప్పుడు మా నాన్న రైతుల నుండి పాలను సేకరించి, మిల్క్ ఫుడ్స్ తయారీకి పునాది వేశారు. అక్కణ్ణుంచి కంపెనీ పాడి పరిశ్రమంలో ఇదొక విప్లవాత్మకమైన ప్రయాణానికి నాంది పలికినట్లయింది. ఆ విధంగా నాన్న ఆలోచనలనూ అందుకుంటూ నా ప్రయత్నాలు మొదలుపెట్టాను. శ్రేష్టమైన ఉత్పత్తులు..చాలారకాల ఆహారపదార్థాల నుంచి ప్రొటీన్స్ లభిస్తాయన్నది తెలిసిందే. పాలలో ప్రొటీన్ మోతాదు ఎక్కువ. అందుకే వినియోగదారుల అవసరాల మేరకు ప్రొటీన్ మిల్క్ ప్రొడక్ట్‌లను తయారుచేసి విక్రయిస్తున్నాం. ‘పరాగ్’ అని ప్రారంభించిన మా సంస్థ నుంచి నెయ్యి, చీజ్, ఫ్లేవర్డ్ మిల్క్, పెరుగు.. ఈ అన్ని ఉత్పత్తుల్లో మంచి అమ్మకాలు సాధిస్తుంది. ఇప్పుడు చీజ్ తయారీ, అమ్మకంలో దేశంలోనే మా సంస్థ రెండవదిగా నిలిచింది. ఫార్మ్ టు హోమ్ బిజినెస్, స్పోర్ట్స్ న్యూట్రిషన్ బ్రాండ్, పానీయాల వృద్ధి, ఉత్పత్తిలో నా మార్క్‌ను చూపించగలిగాను. గడపగడపకూ..ఆవుపాల శ్రేష్టత గురించి తెలిసిందే. అందుకే, మన దేశంలో వీటి వాడకమూ ఎక్కువే ఉంటుంది. ఖరీదు ఎక్కువైనా శేష్ట్రమైన ఆవుపాల గురించి చాలా మంది అన్వేషిస్తారు. మొదట్లో ఆవుపాలు పితికి, అవి అవసరం ఉన్న కొద్దిమంది ఖాతాదారులకే అందించేవాళ్లం. ఆ తర్వాత ఆవు పాల గురించి దేశీయంగా ఉన్న మార్కెటింగ్ వైపు దృష్టి పెట్టాను. శ్రేష్టమైన ఆవుపాల కోసం కోట్లమంది ఖాతాదారులు ప్రయత్నిస్తున్నారని అర్థంచేసుకున్నాను. దీంతో ‘ప్రైడ్ ఆఫ్ కౌస్’ పేరుతో దేశవ్యాప్తంగా ఆవుపాలను కోరుకున్న ఖాతాదారుల గడప దగ్గరకు చేర్చేలా ప్రణాళికలు రూపొందించాం. ఢిల్లీ, ముంబై, పుణే, సూరత్‌లలో ఆవుపాలు విశేషంగా అమ్ముడుపోతున్నాయి. వ్యాపావేత్తగా ఎన్నో అవార్డులను పొందుతూనే ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిల్క్ ప్రొడక్ట్స్ మార్కెట్ పై ఒక అంచనాతో అడుగులు వేస్తున్నాం’’ అని వివరిస్తుంది అక్షాలీ.
నయా ట్రెండ్ : అమ్మమ్మ చేతి వంట
నిన్నటి తరం పిల్లలకు అమ్మమ్మ నాన్నమ్మ వంటకాల రుచి గురించి చెబితే చాలు నగర వాసపు జీవితాల్లో ఆ రుచిని మిస్ అవుతున్న విధానాన్ని తలుచుకొని మరీ బాధ పడి పోతారు. ఆనంద్ భరద్వాజ్ అతని భార్య నళిని పార్థిబన్‌లు చెన్నైలో ఉంటున్నతమ అమ్మమ్మ జానకి పాటి వంటకాలను పండగల సమయాల్లో ఎంతగా కోల్పోతున్నామో గ్రహించారు. చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి, అమ్మమ్మ వద్దకు పరిగెత్తుకు వెళ్లారు. 82 ఏళ్ల అమ్మమ్మ చేత వ్యాపారాన్ని ప్రారంభించారు.నేడు 32 దేశాలకు ఆ రుచులను అందిస్తూ ఈ వయసులో అమ్మమ్మను వ్యాపారవేత్తగా మార్చేశారు. దేశంలో దక్షిణ భారతీయ వంటకాలకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ముఖ్యంగా పండగల సమయాల్లో బామ్మలు వండే పిండివంటల రుచి మనుమలను నగరవాసం నుంచి లాక్కుని వచ్చేలా చేస్తుంది. అచ్చం ఇదే విధంగా 2015లో దీపావళి సమయంలో కుటుంబ సభ్యులు బామ్మ జానకి పాటి స్పెషల్ వంటకాలను మిస్ అయ్యారు. బామ్మ చేతి వంట రుచి గొప్పతనాన్ని ఆమె మనవడు ఆనంద్ భరద్వాజ్ అతని భార్య నళిని పార్థిబన్ మరీ మరీ గుర్తు చేసుకున్నారు. ‘దీపావళికి మా అమ్మమ్మ జాంగ్రీలు, మురుకులు, మైసూర్ పాక్‌లను చాలా జాగ్రత్తగా తయారు చేసేది. ఆమె వంట చేస్తున్నప్పుడు మనవళ్లైన మాకు కథలు కూడా చెబుతుండేది. ఆ జ్ఞాపకం నేడు ఎస్కెసి (స్వీట్ కారం కేఫ్)ను ప్రారంభించేలా చేసింది’ అని చెబుతుంది నళిని పార్ధిబన్. రూ.2000 ల పెట్టుబడిఆనంద్, నళిని తమ అమ్మమ్మ చేతి వంట రుచిని ప్రపంచానికి పరిచయం చేయాలను కున్నారు. సంప్రదాయ దక్షిణ భారత స్నాక్న్కు ఆధునిక ట్విస్ట్ ఇవ్వడానికి వారు చాలా ప్రయత్నాలే చేశారు. అయితే, ఈ ప్రయాణం కష్టమైందని త్వరలోనే గ్రహించారు. చాలా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరించాయి. దీంతో ఇంటిలోని ఒక చిన్న గదిలో రూ.2000 పెట్టుబడితో ప్రారంభించారు. మొదట కస్టమర్లను సంపాదించడానికి వార్తాపత్రికల మధ్యలో కరపత్రాలను ఉంచి, పంపిణీ చేసింది. దీంతో ఆర్డర్లు వెల్లువెత్తడం పారంభించాయి. జనం కొద్ది రోజుల్లోనే అమ్మమ్మ స్నాక్స్‌ని బాగా ఇష్టపడ్డారు. ప్రతి దశలోనూ కొత్త ఉత్సాహం‘వంటకాలన్నీ అమ్మమ్మవే. ఆమె చెప్పినట్టే చేస్తాం. కానీ, వంటను దగ్గరగా ఉండి పర్యవేక్షిస్తుంటాం. ఎక్కడా రాజీ పడకుండా చూసుకుంటాం’ అని నళిని చెబితే, ‘నాణ్యమైన దినుసులతో పాటు ప్రేమ, శ్రద్థతో మా కుటుంబం కోసం చేసే విధంగా తయారు చేస్తాం’ అని జానకి పాటి చెబుతుంది. పాటీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా తయారుచేస్తుంది. తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా ఈ బామ్మ ఉత్సాహాన్ని ఎవరైనా పొందవచ్చు. క్రికెటర్ ఎంఎస్ ధోని పట్ల తన ప్రేమను సోషల్‌మీడియా ద్వారా పంచుకొని ఆనందిస్తుంటుంది. జీవితంలోని ఈ దశనూ ఆనందంగా గడపడం కోసం ఉత్సాహంగా పనిచేస్తుంది. ‘ఇది నాకు పునర్జన్మ లాంటిది. మీరు ప్రయత్నించేవరకు మీకూ తెలియదు మీలోని శక్తి ఎంతో’ అని అందరికీ చెబుతుంది. ‘మా బామ్మలోని శక్తి మాకూ ప్రేరణగా పనిచేస్తుంది. ఆమె తన అభిమాన క్రికెటర్నీ ఉత్సాహపరుస్తుంది. అలాగే, సరికొత్త మొబైల్ యాప్స్ గురించి నేర్చుకుంటుంది. ఆమెకు జీవితం పట్ల ఉన్న అభిరుచి అసమానమైనది’ అంటూ తమ అమ్మమ్మ గురించి ఆనందంగా వివరిస్తుంది నళిని. నేడు ఎస్కెసి (స్వీట్ కారమ్ కేఫ్) స్టార్టప్ భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 32 దేశాలకు విస్తరించి, అమ్మమ్మ చేతి వంట సూపర్ అంటోంది.
న్యూస్ పాడ్‌కాస్ట్
విపక్షాలది మతతత్వ, కులతత్వ, వారసత్వ కూటమి.. ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం
దక్షిణాదిలో బీజేపీకే అత్యధిక లోక్‌సభ సీట్లు... ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ విశ్వాసం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్న ఆలోచన మానుకోండి... కాంగ్రెస్ పార్టీకి హితవు పలికిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాకాండపై వినీత్ బ్రిజ్‌లాల్ నేత్వత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
రుణమాఫీకి ఏర్పాట్లు చేయండి, ఆగస్టు 15లోగా చేసి తీరాల్సిందే.. అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 81.3 శాతం పోలింగ్... వెల్లడించిన సీఈవో కార్యాలయం వర్గాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన ఓటర్లు. కడపటి వార్తలు అందే సమయానికి 76.50 శాతం పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో వన్స్‌మోర్... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తథ్యమని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
రెప్పపాటులోనే మృత్యు ఒడికి
హైదరాబాద్: చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన దంపతులపై అకస్మాత్తుగా చెట్టు కూలి మీద పడడంతో భర్త దుర్మరణం పాలయ్యాడు. భార్య తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోంది. ఈ విషాదకర సంఘటన బొల్లారం పీఎస్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..తూంకుంటకు చెందిన ప్రైవేటు ఉద్యోగి రవీందర్..బొల్లారం పయనీర్ బజార్ ప్రభుత్వ పాఠశాల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న భార్య సరళకుమారితో కలిసి హోండా యాక్టివాపై బొల్లారం ఆస్పత్రికి వచ్చారు. వాహనం ఆవరణలోకి ప్రవేశించగానే అకస్మాత్తుగా పక్కనే ఉన్న ఓ భారీ వృక్షం కూలి వీరిపై పడింది. ఈ ఘటనలో రవీందర్ అక్కడికక్కడే మృతి చెందగా సరళకుమారి తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మెరుగైన చికిత్స కోసం సరళాదేవిని గాంధీ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. రవీందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న సహచర ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. సరళకుమారి అనారోగ్యం బారిన పడడంతో చికిత్స కోసం బొల్లారం ఆసుపత్రికి వచ్చారని వారు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఎండిన భారీ వృక్షాన్ని తొలగించినట్లయితే ప్రమాదం జరిగేది కాదని, పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమేనని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. సీసీ ఫుటేజ్.. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన దంపతులు.. చెట్టు కూలి భర్త మృతి https://t.co/kUxuCIxNku pic.twitter.com/SGDpJqzx1l— Telugu Scribe (@TeluguScribe) May 21, 2024
Hyderabad: కట్టుకున్నోడే కడతేర్చాడు..
హైదరాబాద్: ఉప్పల్ ఎస్బీఐ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్నోడే కాలయముడయ్యాడు. భర్తపై ఉన్న అనుమానంతో ప్రశి్నంచినందుకు అర్దరాత్రి భార్య గొంతుపై కాలు పెట్టి తొక్కి అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడో కిరాతకుడు. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జనగాం లింగంపల్లి ప్రాంతానికి చెందిన భూక్యా రమేశ్, కొండాపూర్ దుబ్బ తండాకు చెందిన భూక్యా కమలకు 2016లో వివాహం జరిగింది. బతుకు దెరువుకోసం నగరానికి వచ్చి ఉప్పల్ ఎస్బీఐ కాలనీలో ఉంటున్నారు.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలు నానమ్మ ఇంటికి వెళ్లారు. కాగా గత కొంత కాలంగా భర్త రమేష్ వ్యవహారం అనుమానాస్పదంగా కనిపించడంతో.. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కమల అనుమానించింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు నిలదీసి పంచాయితీ పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం భార్యా భర్తల మధ్య గొడవ మొదలయింది. అనంతరం ఇద్దరు కలిసి ఇంటికి తాళం పెట్టి బయటకు వెళ్లి తిరిగి సాయంత్రం వచ్చారు. రాత్రి వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగి..రమేశ్ భార్య తలపై కొట్టడంతో కింద పడిపోయింది. వెంటనే ఆమె గొంతు మీద కాలు పెట్టి తొక్కి..చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కమల హత్య వార్త తెలుసుకున్న కుంటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం ఉదయం ఉప్పల్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.
వీధి కుక్కలను చంపి ‘పడేశారు’!
అడ్డాకుల: మూసాపేట మండలం జానంపేట శివారు 44వ నంబర్ జాతీయ రహదారి పక్కన కాల్వలో కుక్కల కళేబరాలు కనిపించడం కలకలం రేపింది. పదిహేను వీధి కుక్కలను గుర్తు తెలియని దుండగులు చంపి వాటిని కాల్వలో పడేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మంగళవారం స్థానికుల సమాచారంతో ఎస్ఐ సుజాత అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం కుక్కల కళేబరాలను ట్రాక్టర్లో చక్రాపూర్ శివారులోని అటవీ ప్రాంతానికి తరలించి అక్కడ పశువైద్యాధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత గుట్ట సమీపంలోని ప్రభుత్వ భూమిలో గుంతను తవి్వంచి పూడ్చి వేశారు. కుక్కల కళేబరాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో విష ప్రయోగం చేసి చంపి ఉంటారని భావిస్తున్నారు.కుక్కలకు సంబంధించిన శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు పశువైద్యాధికారి డాక్టర్ రాజేష్‌ఖన్న తెలిపారు. పొన్నకల్ ఘటన మరువక ముందే? అసలు ఈ కుక్కలను ఎవరు.. ఎక్కడ.. ఎందుకు చంపారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏదో గ్రామంలో కుక్కల సంఖ్యను తగ్గించడానికి వాటిని చంపేసి కళేబరాలను ఇక్కడ వదిలేసి ఉంటారనే అనుమానం కలుగుతోంది. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 16న అడ్డాకుల మండలం పొన్నకల్‌లో 21 వీధి కుక్కలను తుపాకీతో కాల్చి చంపిన ఘటన మరువక ముందే ఇప్పుడు 15 కుక్కల కళేబరాలు హైవే పక్కన కాల్వలో కనిపించడం కలకలం రేపుతోంది.
‘రాయదుర్గం’లో ఎన్ఐఏ సోదాలు!
రాయదుర్గం: రాయదుర్గం పట్టణంలోని ఉర్దూ (ఏఏఐ) పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ సాహెబ్ నివాసంలో మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించడం అనంతపురం జిల్లాలో కలకలం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజామున 4:30 గంటలకే రాయదుర్గంలోని నాగులబావివీధిలో ఉన్న అబ్దుల్ సాహెబ్ ఇంటికి చేరుకున్న ఎన్ఐఏ అధికారులు ఉదయం తొమ్మిది గంటల వరకూ ఇంట్లోనే విచారణ చేశారు. అనంతరం అబ్దుల్ సాహెబ్ కుమారుడు సుహేల్ను అదుపులోకి తీసుకుని పటిష్ట పోలీసు భద్రత నడుమ రాయదుర్గం అర్బన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ అతని వాట్సాప్ చాటింగ్, ల్యాప్‌ట్యాప్‌లో ఫైళ్లు, ఆన్లైన్ లావాదేవీలపై మరో మూడు గంటలపాటు క్షుణ్ణంగా విచారించారు. అనంతరం సుహేల్ను అరెస్టు చేసి బెంగళూరు ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కాగా అబ్దుల్ సాహెబ్ ఇంట్లో విచారణ సమయంలో ఆ వీధిలోకి ఎవరూ రాకుండా స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహించారు.సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ..విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ సాహెబ్‌కు సుహేల్, మాతిన్ సంతానం. పెద్ద కుమారుడు సుహేల్ బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. మాతిన్ స్థానికంగా బిస్కెట్ల వ్యాపారం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే తన మకాంను హైదరాబాద్‌కు మార్చిన సుహేల్ తరచూ బెంగళూరు వెళ్లి వచ్చేవాడు. నెలరోజుల క్రితమే బళ్లారికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్న సుహేల్ అప్పటి నుంచి రాయదుర్గంలోని తన స్వగృహంలోనే ఉంటున్నాడు. కేఫ్‌లో బాంబు పేలుడుపై అనుమానాలు..కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఇటీవల రద్దీగా ఉండే రామేశ్వరం కేఫ్‌లో బాంబు బ్లాస్ట్ కలకలం రేపింది. ఈ ఘటనతో ఆ రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. సీసీ పుటేజీ ఆధారంగా 30 ఏళ్ల వయసు కలిగిన యువకుడు కేఫ్‌లోని హ్యాండ్‌వాష్ వద్ద ఉన్న చెత్తబుట్టలో ఒక బ్యాగు పడేసి వెళ్లినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. అది పేలడంతోనే ప్రమాదం జరిగినట్టు తేల్చారు. దీనికి ఐఈడీ బాంబే కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రధాన నిందితుడితో రాయదుర్గం పట్టణానికి చెందిన సుహేల్ వాట్సాప్ చాటింగ్ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఇరువురి సంబంధాలపై మరింత లోతుగా విచారణ చేసేందుకే సుహేల్ను అరెస్టు చేసి బెంగళూరుకు తరలించినట్లు తెలిసింది. అయితే నిందితుడు ఎక్కడా మీడియా కంటపడకుండా పోలీసులు జాగ్రత్త వహించారు. ఎన్ఐఏ అదుపులో వికారాబాద్ పండ్ల వ్యాపారి?వికారాబాద్: బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో ఈ ఏడాది మార్చి 1న జరిగిన పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ అధికారులు మంగళవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. వికారాబాద్‌లో ఒక పండ్ల వ్యాపారిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఇతని స్వస్థలం పూణే అని, నాందేడ్‌లోనూ పండ్ల వ్యాపారం చేస్తున్నట్టు తెలిసింది. అతడిపై కర్నాటకలో పలు కేసులు నమోదయ్యాయని, ఒక కేసులో శిక్ష సైతం పడినట్టు ఎన్ఐఏ అధికార వర్గాల తెలిపాయి.