No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Sat, May 4 2024 7:40 AM

No He

వృద్దురాలి పేరు బోయ అంకమ్మ. దేవరాయపురం గ్రామంలో నివసిస్తున్నారు. ఏప్రిల్‌ నెలలో చింతకుంట సచివాలయానికి వెళ్లి పింఛన్‌ తీసుకున్నారు. మే నెలకు సంబంధించి సచివాలయం దగ్గరకు వెళ్లే నీ అకౌంట్లో జమ అయిందని చెప్పారు. చింతకుంట బ్యాంకుకు పోతే అకౌంట్‌ పనిచేయడం లేదు ఆళ్లగడ్డ మెయిన్‌ బ్యాంకుకు పోయి చూసుకోమన్నారు. రూ 400కు ఆటో మాట్లాడుకుని భార్యాభర్తలు ఇద్దరు ఆళ్లగడ్డ బ్యాంకుకు వచ్చారు. ఇక్కడకు వచ్చి అడిగితే అకౌంట్‌ పనిచేయడంలేదు అర్జీ రాసి ఇచ్చి మళ్లీ రమ్మన్నారు. చేసేది లేక ఎండ పొద్దున నడవలేక భర్త చేయి పట్టుకుని నడుస్తున్న ఈమెను చూసిన వారు ‘అయ్యో పాపం’ అన్నారు. మా లాంటి వారికి ఇంటి వద్దే పింఛన్‌ అందకుండా చంద్రబాబుకు కుట్రలు చేయడం అన్యాయమని వాపోయారు. – ఆళ్లగడ్డ

No Headline
1/1

No Headline

Advertisement
Advertisement