నిబంధనలు పాటించని ఆసుపత్రులపై చర్యలు | Sakshi
Sakshi News home page

నిబంధనలు పాటించని ఆసుపత్రులపై చర్యలు

Published Sat, May 4 2024 7:40 AM

నిబంధ

నంద్యాల టౌన్‌: ఫైర్‌ సేఫ్టీ, బయో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ తదితర నిబంధనలు పాటించని ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తప్పవని జిల్లా వైద్యారోగ్యాధికారి డాక్టర్‌ వెంకట రమణ హెచ్చరించారు. శుక్రవారం ఆయన నంద్యాల పట్టణంలోని పలు ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు ఎప్పటికప్పుడు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, శానిటేషన్‌ తదితర విభాగాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు రెన్యువల్‌ చేయించాలన్నారు. అగ్ని ప్రమాద సమయాల్లో రోగుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆసుపత్రి సిబ్బందికి అవగాహన ఉండాలన్నారు. ఎన్‌వోసీ లేకుండా, ఆరోగ్య శాఖ వద్ద నమోదు కాకుండా నడుపుతున్న ప్రైవేట్‌ ఆసుపత్రులను సీజ్‌ చేస్తామన్నారు. ఆయన వెంట డెమో ఆఫీసర్‌ రవీంద్ర నాయక్‌ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

దేవస్థాన వైద్యశాలకు వైద్య పరికరాల అందజేత

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న దేవస్థాన వైద్యశాలకు పలు వైద్య పరికరాలను విరాళంగా అందజేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఈఎస్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఐ.వి.ఆర్‌.కృష్ణంరాజు దేవస్థాన వైద్యశాలకు వెంటిలేటర్‌–1, డిఫిబ్లేటర్‌–1, కార్డిక్‌ మానిటర్‌–1, బైపాస్‌ మిషన్‌–2, ఇన్ఫుషన్‌ ంపులు–2 విరాళంగా అందజేశారు. ఆయా వైద్య పరికరాలను దేవస్థాన ఈఓ డి.పెద్దిరాజుకు అందజేశారు. వీటి విలువ సుమారు రూ.16 లక్షలకు పైగా ఉంటుందని దాతలు తెలిపారు. ఆయా పరికరాలను అత్యవసర చికిత్స నిమిత్తం గుండెకు సంబంధించిన పరీక్షలు చేయవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో వసతి విభాగం సహాయ కార్యనిర్వహణాధికారి ఐఎన్‌వీ మోహన్‌, పీఆర్వో టి.శ్రీనివాసరావు, పర్యవేక్షకులు అయ్యన్న, అపోలో డాక్టర్లు సాయికిషన్‌, డాక్టర్‌ శశిధర్‌, గుమస్తా నాగేంద్రం, దేవస్థాన వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణ బాహుబలులు

బేతంచెర్ల: పట్టణంలోని సయ్యద్‌ అల్లాబకాష్‌ వలీ ఉరుసును సందర్భంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించి బల ప్రదర్శన పోటీలు ఆకట్టుకున్నాయి. 120 కేజీల గుండు, 130 కేజీల ఇసుక సంచి, 75 కేజీల చంద ఎత్తే పోటీల్లో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం పుల్లగుమ్మి సుధాకర్‌ చంద పందెంలో ప్రథమ స్థానం సాధించగా.. డోన్‌ మండలం గోసానిపల్లె చంద్ర ఇసుక, గుండు పందెంలో ప్రథమ స్థానంతో పాటు చంద పందెంలో ద్వితీయ స్థానం కై వసం చేసుకున్నాడు. గోసానిపల్లె గ్రామానికి చెందిన మధు ఇసుక పందెంలో ద్వితీయ, వెల్దుర్తి మండలం మాధవవరం గ్రామానికి చెందిన రాజశేఖర్‌ గుండు పందెంలో ద్వితీయ స్థానం కై వసం చేసుకున్నాడు. విజేతలకు నిర్వాహకులు వెండి పఽతకాలు అందజేశా రు. కార్యక్రమంలో నిర్వాహకులు ఖాజ, రాజ, ఇమామ్‌ హుసేన్‌, ఫైల్‌మాన్‌ పాల్గొన్నారు.

ములాఖత్‌ వేళలు మార్పు

కర్నూలు (లీగల్‌): వేసవి తీవ్రత దృష్టిలో ఉంచుకుని జైలు శాఖ డీజీ ఆదేశాల మేరకు కర్నూలులోని జిల్లా జైలులో ఖైదీలతో వారి బంధువులు మాట్లాడుకునేందుకు నిర్వహించే ములాఖత్‌ వేళల్లో మార్పు చేసినట్లు పర్యవేక్షణాధికారి ఘనే నాయక్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ 3 నుంచి జూన్‌ 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ములాఖత్‌ సమయాన్ని మార్చినట్లు పేర్కొన్నారు. ఖైదీల కుటుంబ సభ్యులు పైన తెలిపిన వేళలు పాటించాలని ఆయన కోరారు.

డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ విశ్వవిద్యాల యం పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు నిర్వహించాల్సిన 2వ, 4వ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేసినట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ వెంకట సుందరానంద పుచ్చ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రా రంభం కావాల్సిన డిగ్రీ 2, 4వ సెమిస్టర్‌ థియరీ పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.

నిబంధనలు పాటించని ఆసుపత్రులపై చర్యలు
1/1

నిబంధనలు పాటించని ఆసుపత్రులపై చర్యలు

Advertisement
Advertisement