No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Sat, May 4 2024 7:40 AM

No He

వలంటీర్‌ సేవల నిలిపివేతలో

టీడీపీ అధినేతది కీలక పాత్ర

చంద్రబాబుపై మండి పడుతున్న

పింఛన్‌ లబ్ధిదారులు

మండే ఎండల్లో మాకెందుకు

ఇన్ని కష్టాలు అంటూ ఆవేదన

ఉమ్మడి కర్నూలు జిల్లాలో

డీబీటీ ద్వారా 3,53,405 మందికి

నగదు బదిలీ

సాంకేతిక కారణాలతో

5,917 మందికి బదిలీ కాని నగదు

మూడో రోజూ బ్యాంకులకు

పోటెత్తిన లబ్ధిదారులు

పింఛన్‌ తీసుకొని ఇంటికి వెళ్తూ

వృద్ధుడి మృతి

ముడతలు పడిన దేహం.. ఎముకల గూడు వంటి శరీరం.. సత్తువంతా కూడదీసుకున్నా నాలుగు అడుగులైనా వేయలేని దీనత్వం.. ప్రతి నెలా ఠంచన్‌గా వలంటీర్‌ ఇంటికి వచ్చి ఇచ్చే పింఛనే ఆధారం..అలాంటి ఆధారం నేడు సందిగ్ధంలో పడింది.. నెలంతా వాడాల్సిన మందులు.. ఇతర ఖర్చులు.. నెల 3వ తేదీ వచ్చినా అందని పింఛన్‌.. వృద్ధుల్లో ఒకటే ఆందోళన.. 48 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఎండల్లోనూ అడుగులో అడుగు వేసుకుంటూ..పాణాన్ని అరచేతిలో పెట్టుకుని బ్యాంకుకు వెళితే అక్కడ వందల మంది..అంతా గందరగోళం.. గంటల తరబడి ఓపిగ్గా నిలుచుని కౌంటర్‌ దగ్గరికి చేరితే ఆధార్‌ అనుసంధానం కాలేదనో.. పాత బాకీ ఉందనో.. ఇలా ఎన్నో కారణాలతో పింఛన్‌ తీసుకోవడం కష్టమవుతోంది. ఇంట్లో హాయిగా పింఛన్‌ తీసుకునే తమకు కష్టాలు తెచ్చి పెట్టిన చంద్రబాబుపై అవ్వాతాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఉసురు తప్పక తగులుతుందని శాపనార్థాలు పెడుతున్నారు. టీడీపీ అధినేత కక్షపూరిత ధోరణిపై మండిపడుతున్నారు. ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.

నందికొట్కూరు పట్టణంలోని స్టేట్‌ బ్యాంక్‌ వద్ద పింఛన్‌ కోసం వేచివున్న లబ్ధిదారులు

కర్నూలు(అగ్రికల్చర్‌)/నంద్యాల (న్యూటౌన్‌): ఉమ్మడి కర్నూలు జిల్లాలో పింఛన్ల పంపిణీ మూడో రోజుకు చేరుకుంది. కర్నూలు జిల్లాలో మొత్తం 1,88,104 మందికి గాను 1,55,254 మందికి, నంద్యాల జిల్లాలో 1,71,218 మందికి గాను 1,39,803 మందికి డీబీటీ ద్వారా గురువారం పింఛన్‌ను జమ చేశారు. రెండు జిల్లాలో మిగిలిన 64,265 మంది లబ్ధిదారుల్లో 58,348 మంది బ్యాంకు ఖాతాలకు శుక్రవారం నగదు జమ చేశారు. సాంకేతిక కారణాలతో 5,917 మందికి నగదు బదిలీ కాలేదు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 3,53,405 మందికి డీబీటీ ద్వారా పింఛన్‌ సొమ్ము బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. దీంతో పండుటాకులైన అవ్వాతాతలు, ఇతర పింఛన్‌దారులు మండటెండల్లో కష్టాలు ఎదుర్కొంటూ బ్యాంకులకు వెళ్లారు. లబ్ధిదారులకు పింఛన్‌ ఇవ్వకుండా కొన్ని బ్యాంకులు ఇబ్బందులకు గురి చేశాయి. పాత బకాయిలకు జమ చేసుకొని మొండి చేయి చూపాయి. పింఛన్‌ కోసం బ్యాంకుకు వచ్చి తిరిగి వెళుతూ ఒక వృద్ధుడు మృత్యువాత పడ్డాడు. నందవరం మండలం మాచాపురం గ్రామానికి చెందిన పులిచింత ఆనంద్‌ అనే వృద్ధుడు పింఛన్‌ తీసుకొని వెళ్తూ ఎండకు అస్వస్థతకు గుఐ ఇంటికి చేరకుండానే మృత్యువాత పడ్డారు. ఈ పాపం చంద్రబాబుదేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబు వల్లే ఈ కష్టాలు..

పింఛన్‌ లబ్ధిదారులతో బ్యాంకులు శుక్రవారం కిటకిటలాడాయి. చంద్రబాబు ముఠా కుట్రల కారణంగా ఏప్రిల్‌ నెలలో సచివాలయాలు, మే నెలలో బ్యాంకుల మెట్లు ఎక్కాల్సి వచ్చిందని అవ్వాతాతలు శాపనార్థాలు పెట్టడం చాలా చోట్ల కనిపించింది. ‘మేం కష్టాలు పడటం వల్ల మీ కడుపు మంట చల్లారిందా’ అంటూ పలువురు మండిపడ్డారు. వలంటీర్‌ సేవలను అడ్డుకున్న చంద్రబాబుకు తమ ఉసురు తగులుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. కర్నూలు జిల్లాలో 3,339 మందికి, నంద్యాల జిల్లాలో 2,578 మందికి మొత్తంగా 5,917 మందికి వివిధ కారణాలతో నగదు బదిలీ కాలేదు. వీరికి శనివారం ఇంటికి వెళ్లి పింఛన్లు అందజేయనున్నారు.

No Headline
1/1

No Headline

Advertisement
 

తప్పక చదవండి

Advertisement