ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు

Published Sat, May 4 2024 6:40 AM

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు

దేవరకొండ, నిడమనూరు: ఎన్నికల విధుల్లో పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ దాసరి హరిచందన హెచ్చరించారు. దేవరకొండ ఎంకేఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిడమనూరులో రెండు నియోజకవర్గాల పీఓలు, ఏపీఓలకు నిర్వహిస్తున్న రెండో విడత శిక్షణ కార్యక్రమాలను శుక్రవారం ఆమె వేర్వేరుగా సందర్శించారు. ఈ సందర్భంగా రెండుచోట్ల ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఏర్పాటు చేసిన ఓటర్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన ఆరు ఓటర్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలింగ్‌ విధుల నిర్వహణలో తప్పులు చేస్తే సస్పెండ్‌ చేయడమే కాకుండా ఎన్నికల నిబంధనల మేరకు కేసులు నమోదు అవుతాయన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలు తప్పని సరిగా పాటించాలని అన్నారు. ఆ తర్వాత దేవరకొండ పట్టణంలోని పాత సత్యసాయి కాలేజ్‌ రోడ్డులో 91 ఏళ్లు నిండిన సీనియర్‌ సిటిజన్‌ బీఎన్‌ శామ్యూల్‌ హోమ్‌ ఓటింగ్‌ సౌకర్యాన్ని వినియోగించుకోగా వారి ఇంటికి వెళ్లి ప్రత్యక్షంగా హోమ్‌ ఓటింగ్‌ విధానాన్ని పరిశీలించారు. రెండుచోట్ల ఆమె వెంట అనదపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, దేవరకొండ ఆర్డీఓ శ్రీరాములు, తహసీల్దార్‌ సంతోష్‌కిరణ్‌ ఉన్నారు.

ఫ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హరిచందన

Advertisement
 

తప్పక చదవండి

Advertisement