మాదక ద్రవ్యాలతో భవిష్యత్‌ నాశనం | Sakshi
Sakshi News home page

మాదక ద్రవ్యాలతో భవిష్యత్‌ నాశనం

Published Sat, May 4 2024 12:35 AM

మాదక

నాగర్‌కర్నూల్‌ క్రైం: మాదక ద్రవ్యాల వినియోగంతో భవిష్యత్‌ నాశనమవుతుందని.. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ సూచించారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో మాదక ద్రవ్యాల వాడకం నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం అనేక మంది గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నా రు. విద్యార్థులపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలన్నారు. ఎక్కడయినా గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తిస్తే, డయల్‌ 100 లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అ నంతరం మాదక ద్రవ్యాల వాడకం నిషేధానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. డీఎస్పీ శ్రీనివాస్‌, డీసీఆర్‌బీ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ కనకయ్యగౌడ్‌, డీసీఆర్‌బీ సీఐ ఉపేందర్‌, ఎస్‌ఐ గోవర్ధన్‌ పాల్గొన్నారు.

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై నిఘా

బల్మూర్‌: సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. మండలంలోని కొండనాగుల, బల్మూర్‌, పోలిశెట్టిపల్లి గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఈసందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ రవీందర్‌, ఎస్‌ఐ బాల్‌రాజులకు పలు సూచనలు చేశారు. అనంతరం బల్మూర్‌ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు.

ప్రతి కార్యకర్త

సైనికుడిలా పనిచేయాలి

తెలకపల్లి: పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం తెలకపల్లిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే ఎంపీగా మల్లు రవిని గెలిపించాలని కోరారు. అనంతరం బీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీటీసీ సభ్యురాలు విజయలక్ష్మితో పా టు పలు గ్రామాలకు చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సమావేశంలో జెడ్పీటీసీ సుమిత్ర, ఎంపీపీ కొమ్ము మధు, మాజీ ఎంపీపీ పర్వతాలు, మామిళ్లపల్లి యాదయ్య ఉన్నారు.

నేడు హజ్‌

యాత్రికులకు టీకాలు

నాగర్‌కర్నూల్‌ క్రైం: జిల్లా నుంచి హజ్‌ యాత్ర కు వెళ్తున్న భక్తులకు శనివారం జిల్లా కేంద్రంలోని రూబీ గార్డెన్‌లో టీకా శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా హజ్‌ సొసైటీ అధ్యక్షుడు షేక్‌ ఫరీద్‌ అహ్మద్‌ శుక్రవారం తెలిపారు. టీకా శిబిరం అనంతరం మహబూబ్‌నగర్‌కు చెందిన జామి యా నిజామియాకు చెందిన అలీం ముఫ్తి ము హమ్మద్‌ మౌలానా హఫీజ్‌ ఫైజుద్దీన్‌ శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.

మాదక ద్రవ్యాలతో  భవిష్యత్‌ నాశనం
1/1

మాదక ద్రవ్యాలతో భవిష్యత్‌ నాశనం

Advertisement
Advertisement