మౌలిక వసతులు కల్పించాలి | Sakshi
Sakshi News home page

మౌలిక వసతులు కల్పించాలి

Published Sat, May 4 2024 4:45 AM

మౌలిక వసతులు కల్పించాలి

మరిపెడ/మరిపెడ రూరల్‌: ప్రతి పోలింగ్‌ బూత్‌లో ఓటర్ల కోసం మౌలిక వసతులు కల్పించాలని కేంద్ర ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ రచిత్‌రాజ్‌ అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం మరిపెడ మండలం కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పర్యటించి పోలింగ్‌ బూత్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని పోలింగ్‌ బూత్‌ల్లో కనీస సదుపాయాలు కల్పించి ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తొర్రూరు ఆర్డీఓ నర్సింహారావు, మరిపెడ తహసీల్దార్‌ సైదులు, ఆర్‌ఐ నంద, సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్నికలకు సహకరించాలి

దంతాలపల్లి: లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలని జనరల్‌ అబ్జర్వర్‌ రచిత్‌రాజ్‌ అన్నారు. మండల కేంద్రంతో పాటు మండలంలోని దాట్ల, బీరిశెట్టిగూడెం, పెద్దముప్పారం గ్రామాల్లో శ్రువారం ఎన్నికల బూత్‌లను పరిశీలించారు. ఎన్నికల ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. ఎన్నికల పోలింగ్‌పై అవగాహన కలిపించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.కార్యక్రమంలో తొర్రూరు ఆర్డ్డీఓ నర్సింహారావు, డీఎస్పీ సురేష్‌, తహసీల్దార్‌ తెల్ల శ్రీనువాస్‌రావు, సీఐ సంజీవ, ఎస్సై కరుణాకర్‌, వివిధ గ్రామాల పంచాయతీ కార్యాదర్శులు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌

రచిత్‌ రాజ్‌

Advertisement
Advertisement